గృద్రతీ వాతము (సయాటికా) 23-1-09
నిలువుగా నిలబడి కుడి చెయ్యి పూర్తిగా పైకెత్తి , ఎడమ కాలును వెనక్కి పెట్టాలి.కాలును నేల మీద ఆనించ కూడదు. అదే విధంగా రెండవ వైపు చెయ్యాలి.
వర్షా కాలం లో ఆహారం లో తీసుకోవలసిన జాగ్రత్తలు :-
సులభంగా అరిగే పాత బియ్యం,పాత గోధుమ పిండి,పాత గోధుమ అన్నం, ఉప్మా, మెంతి కూర, చిలక తోటకూర,వెల్లుల్లి, ఉల్లి,ఆవు పాలు,ఆవు నెయ్యి, లేక నాటు గేదెల పాలు,నెయ్యి, మజ్జిగ చారు వాడుకోవాలి.
నీళ్ళు కాచి చల్లార్చి మాత్రమే తాగాలి. వర్షాకాలంలో మాంసం,చేపలు, గుడ్లు తినకూడదు.
వారానికి ఒకసారి మాత్రమే దాంపత్యం జరపాలి.
శొంటి ----- 50 gr
పిప్పళ్ళు ----- 50 gr
మిరియాలు --- 50 gr
కొద్ది చుక్కలు నెయ్యి వేసి విడివిడిగా దంచి పొడులు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
3 చిటికెల పొడిని నోట్లో వేసుకొని నీళ్ళు తాగాలి. వర్షాకాలంలో తేనె కూడా ఎక్కువగా వాడుకోవాలి.
ఒక స్పూను తేనె ఉదయం, సాయంత్రం నీటిలో కలిపి తాగాలి
తుంటి నొప్పి లేదా నడుము నొప్పి 26-1-09.
వ్యాయామం :--
1. కాళ్ళు రెండు ఒక అడుగుల వెడల్పుగా పెట్టి వెనక్కి తిరిగి పిరుదులపై అరచేతులను వుంచుకొని నడుమును ఎడమకు, కుడికి 10 సార్లు నెమ్మదిగా, అలాగే ముందుకి, వెనక్కి కదిలించాలి. అలాగే గుండ్రంగా తిప్పాలి. కాని కాళ్ళు మాత్రం అదే పొజిషన్ లో ఉంచాలి.
2. రెండు కాళ్ళను ఒక అడుగు వెడల్పుగా పెట్టి ఒక కాలును మోకాలి వరకు పైకి లేపి చాచాలి , మళ్లీ కిందికి దించాలి.అదేవిధంగా రెండవ వైపు కూడా చెయ్యాలి. కుడి కాలును కుడివైపుకు, ఎడమ కాలును ఎడమవైపుకు లేపుతూ దించుతూ వుండాలి.అలాగే ఒక కాలును నిలబెట్టి రెండవ కాలును గుండ్రంగా తిప్పాలి.
తుంటి నొప్పి (సయాటికా) నివారణకు ---తైల మర్దనము 5-7-09.
పై పొట్టను, కింది పొట్టను తైలంతో నెమ్మదిగా మర్దన చెయ్యాలి. ఎనిమా చేసుకొని పొట్టను శుద్ధి చేసుకోవాలి.
పక్కకు పడుకోబెట్టి తున్టిపై తైలంతో మర్దన చెయ్యాలి. రెండు బొటన వేళ్ళను కలిపి వుంచి, రెండు చేతులతో తోడను పట్టుకొని పైనుండి కిందికి బొటన వేళ్ళతో సరదియ్యాలి. రెండు చేతులను నమస్కార భంగిమలో కలిపి నిదానంగా తుంటి నుండి మడమ వరకు కొట్టాలి. పిడికిళ్ళు బిగించి కూడా నెమ్మదిగా కొట్టాలి.
కాపడం పెట్టె విధానం:-- వేప, చింత, వావిలి, జిల్లేడు, ఉమ్మెత్త, మొదలైన ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిలో నూలు గుడ్డను ముంచి వేడి గమనించుకొని ఓర్చుకోగలిగినంత వేడిగా కాపడం పెట్టాలి.
వ్యాయామం:-- రోగిని పడుకోబెట్టి, మోకాలి దగ్గర చెయ్యి పెట్టి కాలును పైకి లేపి కాలిని ముడిచినట్లు వంచాలి.
కాలిని పక్కలకు ఊపడం , పాదము, మదం కలిపి పట్టుకొని తుంటి దగ్గర తిరిగే విధంగా తిప్పడం చెయ్యాలి.
పక్కకు పడుకోబెట్టి కాలును పైకెత్తాలి. బోర్లా పడుకోబెట్టి మోకాలు కింద చెయ్యి పెట్టి కాలును పైకెత్తాలి.
ఈ వ్యాయామం వలన తుంటి నొప్పి చాలా వరకు తగ్గుతుంది.
ఆహారము:-- పాత బియ్యపు లేదా నూక యొక్క జావ తాగాలి. తెల్ల గలిజేరు చాలా మంచిది లేత మునగాకు మూడు వారాలు తింటే మందులే అవసరం లేదు. కొయ్య తోటకూర, పొన్నగంటి కూర కూడా ఎక్కువగా వాడాలి.
ఖర్హూరం, అరటి, మామిడి పండ్లు తినదగినవి.
దోరగా వేయించిన శొంటి పొడి
కరక్కాయ పొడి
వావిలి చేటు వేర్ల పై బెరడు పొడి
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
ఉదయం, సాయంత్రం మూడు వేళ్ళకు వచ్చినంత పొడిని తేనెతో సేవించాలి.
వెల్లుల్లి, నీరుల్లి ఆహారంలో ఎక్కువగా వాడాలి.
ఈ సమస్యలో నడుము నుండి ఒక కాలు లాగుతూ వుంటుంది. సమస్య తీవ్రమైనపుడు లేవలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది వాత సంబంధ రోగం. ఈ నొప్పి ఇతర అవయవాలకు కూడా పాకడం జరుగుతుంది.
మహా యోగ రాజ గుగ్గులు అనే మాత్రలు ఈ సమస్యను త్వరగా నివారిస్తాయి.
శొంటి పొడి --- అర టీ స్పూను
పాలు ----ఒక కప్పు
వంటాముదం ----పల టీ స్పూను
అన్నింటిని కలుపుకుని తాగాలి, దీని వలన విరేచనాలు ఎక్కువైతే ఆపెయ్యవచ్చు.
దీనిని ఒక నెల వరకు వాడి ఆపెయ్యొచ్చు.
2. పారిజాతం ఆకులు, పూలు, కాయలు, కాండము లను ఎండబెట్టి దంచి చేసిన చూర్ణం
వావిలాకు సమూలంగా ఎండబెట్టి దంచిన చూర్ణం
మహానింబ --- ఇది దొరికితే వాడుకోవచ్చు లేని పక్షంలో పై రెండు మాత్రమే సరిపోతాయి.
పై మూడింటిని సమాన భాగాలుగా తీసుకుని కలిపి పెట్టుకోవాలి.
ఈ పొడిని 30 గ్రాములు తీసుకుని కషాయం కాచాలి, దీనిని ఆహారం తరువాత తాగితే మంచి ఫలితం వుంటుంది. సైంధవ లవణం,జిలకర, పసుపు కలుపుకుని తాగవచ్చు.
3. వెల్లుల్లి పేస్ట్ --- 100 gr
నువ్వుల నూనె --- 100 gr
నీళ్ళు ---- 800 gr
అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి తైలం మాత్రమే మిగిలే వరకు కాచాలి. వడ పోసి నిల్వ చేసుకోవాలి.
ఈ తైలంతో నొప్పి వున్నా చోట మర్దన చెయ్యాలి. రాత్రి పడుకునే ముందు రెండు మూడు రకాల ఔషధాలను వాడవచ్చు.
స్త్రీలలో తుంటి నొప్పి ( సయాటికా) --- నివారణ 26-5-11.
1. ఒక పూటకు ఔషధం :---
ఆముదం ----15 gr
నీళ్ళు --- ఒక గ్లాసు
రెండింటిని కలిపి తాగాలి.
2. శొంటి పొడి --- ఒక గ్రాము
పిప్పళ్ళ పొడి --- ఒక గ్రాము
గోమూత్ర అర్కము ---- 15 గ్రాములు
అన్నింటిని కలిపి ప్రతి రోజు ఉదయం తీసుకుంటూ వుంటే తుంటి నొప్పి మాయమవుతుంది.
సయాటికా ( గృధ్రతి వాతం ) --- నివారణ 25-7-11.
దుంప రాష్ట్రం వేరు --- 3 gr
తిప్ప తీగ --- 3 gr
ఆముదపు వేరు --- 3 gr
దేవదారు చెక్క --- 3 gr
గలిజేరు వేరు --- 3 gr
రేల పండ్ల గుజ్జు పొడి --- 3 gr
శొంటి పొడి --- 3 gr
ఒక కప్పు నీళ్ళు తీసుకో వాలి . అన్ని పదార్ధాలను దంచి ఆ నీటిలో వేసి సన్న మంట మీద మరిగించి ఒక కప్పుకు రానివ్వాలి
ఉదయం అరకప్పు , సాయంత్రం అరకప్పు చొప్పున గోరువెచ్చగా తాగాలి .

22-5-10
వావిలాకు యొక్క ఇగుళ్లను తెచ్చి నీటిలో వేసి కషాయం కాచి తాగుతూ వుంటే తుంటి నొప్పి(సయాటికా) నివారింప బడుతుంది.
29-10-10
రావి చెట్టు వేరు బెరడుతో కషాయం కాచి తాగితే తగ్గుతుంది.
తుంటి నొప్పి -- నివారణ 13-12-10.రావి చెట్టు వేరు బెరడుతో కషాయం కాచి తాగితే తగ్గుతుంది.
ఈ సమస్యలో నడుము నుండి ఒక కాలు లాగుతూ వుంటుంది. సమస్య తీవ్రమైనపుడు లేవలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది వాత సంబంధ రోగం. ఈ నొప్పి ఇతర అవయవాలకు కూడా పాకడం జరుగుతుంది.
మహా యోగ రాజ గుగ్గులు అనే మాత్రలు ఈ సమస్యను త్వరగా నివారిస్తాయి.
శొంటి పొడి --- అర టీ స్పూను
పాలు ----ఒక కప్పు
వంటాముదం ----పల టీ స్పూను
అన్నింటిని కలుపుకుని తాగాలి, దీని వలన విరేచనాలు ఎక్కువైతే ఆపెయ్యవచ్చు.
దీనిని ఒక నెల వరకు వాడి ఆపెయ్యొచ్చు.
2. పారిజాతం ఆకులు, పూలు, కాయలు, కాండము లను ఎండబెట్టి దంచి చేసిన చూర్ణం
వావిలాకు సమూలంగా ఎండబెట్టి దంచిన చూర్ణం
మహానింబ --- ఇది దొరికితే వాడుకోవచ్చు లేని పక్షంలో పై రెండు మాత్రమే సరిపోతాయి.
పై మూడింటిని సమాన భాగాలుగా తీసుకుని కలిపి పెట్టుకోవాలి.
ఈ పొడిని 30 గ్రాములు తీసుకుని కషాయం కాచాలి, దీనిని ఆహారం తరువాత తాగితే మంచి ఫలితం వుంటుంది. సైంధవ లవణం,జిలకర, పసుపు కలుపుకుని తాగవచ్చు.
3. వెల్లుల్లి పేస్ట్ --- 100 gr
నువ్వుల నూనె --- 100 gr
నీళ్ళు ---- 800 gr
అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి తైలం మాత్రమే మిగిలే వరకు కాచాలి. వడ పోసి నిల్వ చేసుకోవాలి.
ఈ తైలంతో నొప్పి వున్నా చోట మర్దన చెయ్యాలి. రాత్రి పడుకునే ముందు రెండు మూడు రకాల ఔషధాలను వాడవచ్చు.
స్త్రీలలో తుంటి నొప్పి ( సయాటికా) --- నివారణ 26-5-11.
1. ఒక పూటకు ఔషధం :---
ఆముదం ----15 gr
నీళ్ళు --- ఒక గ్లాసు
రెండింటిని కలిపి తాగాలి.
2. శొంటి పొడి --- ఒక గ్రాము
పిప్పళ్ళ పొడి --- ఒక గ్రాము
గోమూత్ర అర్కము ---- 15 గ్రాములు
అన్నింటిని కలిపి ప్రతి రోజు ఉదయం తీసుకుంటూ వుంటే తుంటి నొప్పి మాయమవుతుంది.
సయాటికా ( గృధ్రతి వాతం ) --- నివారణ 25-7-11.
దుంప రాష్ట్రం వేరు --- 3 gr
తిప్ప తీగ --- 3 gr
ఆముదపు వేరు --- 3 gr
దేవదారు చెక్క --- 3 gr
గలిజేరు వేరు --- 3 gr
రేల పండ్ల గుజ్జు పొడి --- 3 gr
శొంటి పొడి --- 3 gr
ఒక కప్పు నీళ్ళు తీసుకో వాలి . అన్ని పదార్ధాలను దంచి ఆ నీటిలో వేసి సన్న మంట మీద మరిగించి ఒక కప్పుకు రానివ్వాలి
ఉదయం అరకప్పు , సాయంత్రం అరకప్పు చొప్పున గోరువెచ్చగా తాగాలి .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి