ముక్కు దిబ్బడ

            ఫ్లూ జ్వరం వలన వచ్చే  ముక్కు దిబ్బడ --నివారణ                                 6-12-10.

 1.            నీలగిరి తైలం తో గాని , జీవన ధార తైలం తో గాని Inhalation చేస్తే త్వరగా తగ్గుతుంది.

  2.     పసుపుకొమ్మును నిప్పుల్లో కాల్చి పీలిస్తే కూడా ముక్కు దిబ్బడ తగ్గుతుంది.

3.దాల్చిన చెక్క పొడి          --- 5 gr
మిరియాల పొడి                --- 5 gr
యాలకుల గింజల పొడి     --- 5 gr
జీలకర్ర  పొడి                   ---  5 gr

       అన్ని పొడులను కలపాలి. దీనిని  మూడు వేళ్ళతో పట్టుకొని నశ్యం లాగా పీలిస్తే ముక్కు దిబ్బడ వెంటనే  తగ్గుతుంది.

4.     జాజి కాయను మెత్తగా పొడి చేసి గంధం లాగా  చేసి పాలలో కలుపుకొని తాగాలి.

5. పసుపు పొడి        --- అర టీ స్పూను
వెల్లుల్లి ముద్ద           ----పావు టీ స్పూను

   రెండింటిని కలిపి తీసుకుంటే జలుబు ద్వారా వచ్చే గొంతు నొప్పి నివారించ బడుతుంది.

6. శొంటి
    పిప్పళ్ళు
    మిరియాలు

 మూడింటిని విడివిడిగా దోరగా వేయించి దంచి చూర్ణాలు చేసుకోవాలి. తరువాత కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.

     పావు టీ స్పూను పొడి నుండి అర టీ స్పూను పొడి వరకు తీసుకుంటే ఫ్లూ వలన వచ్చే జలుబు నివారించ  బడుతుంది.
                                                   2-10-10
దాల్చిన చెక్క పొడి
మిరియాల పొడి
యాలకుల పొడి
నల్ల జిలకర పొడి

      అన్ని  పొడులను వస్త్ర ఘాళితం చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.

      దీనిని ముక్కు పొడి లాగా పీలిస్తే ముక్కు దిబ్బడ, జలుబు కూడా తగ్గుతాయి.

                                                        జలుబు                                16-8-11.
కొబ్బరి నూనె           ---- ఒక టీ స్పూను
కర్పూరం                 ---- ఒక బిళ్ళ

        కొబ్బరి నూనెను వేడి  చేసి దానిలో కర్పూరం వేసి కరిగించి ముక్కు మీద ,గొంతు మీద   చాతీ మీద , మెడ మీద , పక్కటెముకల మీద పూసి  బాగా మర్దన చేయాలి . ఈ విధంగా చేయడం వలన  జలుబు అప్పటికప్పుడు  తగ్గుతుంది .
మీద ,







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి