చెట్లు --- ఆయుర్వేద ఉపయోగాలు

                                         చెట్లు --- ఆయుర్వేద ఉపయోగాలు

                                            జమ్మి చెట్టు ( శమీ వృక్షం )                            12-9-09.

   దీని మానుపై బెరడు తెచ్చి గంధం తీసి ఆడ పిల్లలకు వచ్చే నూగు వెంట్రుకలు నశించిపోతాయి. మరియుక్రిములను నాశనం చేస్తుంది.

                                           రావి చెట్టు ( అశ్వత్థ వృక్షం )

  ఇది ఆది వృక్షం. చలువ చేస్తుంది. రక్త పిత్త, వాతపిత్త రోగాలను హరిస్తుంది. గంటకు కొన్ని వేల కిలోల  కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. దీనిని బ్రహ్మ నివాసము అంటారు. ఇది జ్ఞానవృక్షం

సంతానం లేని వాళ్ళు, గర్భం నిలబడని వాళ్ళు, బిడ్డలు చనిపోయ్యే వాళ్ళు దీనిని వాడితే సమస్యలు నివారింపబడతాయి.

రావి పండ్లు తెచ్చి కడిగి ఎండబెట్టి పొడి చేసి సమానంగా కలకండ కలిపి పెట్టుకోవాలి.

పూటకు ఒక టీ స్పూను పొడి చొప్పున ఉదయం, సాయంత్రం చప్పరించి తిని పాలు తాగాలి.

దీని వలన అండాశయంలోని నీటి బుడగలు , ఫైబ్రాయిడ్స్ హరించి పోతాయి. మరియు వాత రోగాల వలన శరీర భాగాలు  బిగుసుకుపోయినపుడు దీనిని వాడితే నొప్పులు తగ్గి సమస్య నివారింప బడుతుంది.

                                           మోదుగ చెట్టు ( బ్రహ్మ వృక్షం )

స్త్రీలు బహిష్టు స్నానం తరువాత ప్రతి రోజు ఒక తెచ్చి ఆవు పాలతో నూరి తాగాలి. విధంగా 45 రోజుల నుండి 75 రోజులు తాగాలి. 10 రోజు నుండి 15 రోజు వరకు దాంపత్యం జరిపితే మంచి సంతానం కలుగుతుంది.

                                                            నేరేడు                                   27-12-10.

1. మధుమేహం :--

నేరేడు ఆకులు
" బెరడు
" గింజలు

అన్నింటిని తెచ్చి ఎండబెట్టి చూర్ణం చేయాలి.

పూటకు ఒక టీ స్పూను చొప్పున ఉదయం, సాయంత్రం వాడాలి. ఇది చాల ప్రభావ వంతమైన చికిత్స

2. పిల్లలలో విరేచనాలు :--

ఒక టీ స్పూను నేరేడు ఆకుల రసాన్నితేనెతో కలిపి తాగిస్తూ వుంటే తగ్గుతాయి. లేదా నేరేడు పట్ట రసాన్ని తేనె కలిపి తాగించ వచ్చు.

3. రక్తస్రావం :--

ఊర్ధ్వ, అధో మార్గాల ద్వారా జరిగే  రక్త స్రావాలను ఒక స్పూను నేరేడు ఆకుల స్వరాసాన్ని తాగితే తగ్గుతుంది. అనగా నోటి ద్వారా, వాంతుల  ద్వారా, మలము ద్వారా, మూత్రము ద్వారా వెడలె రక్త స్రావం  నివారంప బడుతుంది.

4. కాలిన గాయాలు :--

నేరేడు ఆకులను ముద్దగా నూరి ఆముదము లో వేయించి పూస్తే కాలిన గాయాలు మానిపోతాయి.

5. వ్రణాలు :--

నేరేడుపట్ట కషాయం తో వ్రణములను  లను కడగాలి. నేరేడుపట్ట ను దంచి జల్లించిన పొడిని చల్లి కట్ట్టు కట్టాలి.

6. నోట్లో పుండ్లు :--

నేరేడు పట్టా కషాయం తో పుక్కిలించాలి.

7 దంతాలు :--

నేరేడు పట్టా పొడితో పళ్ళు తోముకుంటే పళ్ళు గట్టి పడతాయి,


                                                      చింత చెట్టు                                        27-2-11.


మంగు :-- ( నీలిక ) :--

చింత చెట్టు వేరు పై బెరడు --- 100 gr

      నీటితో కలిపి నూరి మంగు మచ్చల పై పూస్తుంటే తగ్గుతాయి .

వాపు :-- (ఎడిమా ) :--

చింత ఆకు --- 100 gr

చింత ఆకును ముద్దగా నూరి నీటిలో వేసి మరిగించి కషాయం తయారు చెయ్యాలి. కషాయం
తో వాపు వున్నచోట ధారగా పోయాలి.


సర్ప విషం :-- ( వైద్య మనోరమలో చెప్పబడినది) :--

చింతాకు రసం --- 160 ml
ఉప్పు             ---- 20 gr

     రెండు కలిపి తాగించాలి. దీని వలన దుష్ఫలితాలు తగ్గుతాయి .






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి