పండ్లు --- వాటి ఉపయోగాలు ( వివిధ రకాల పండ్లు)

                             పండ్లు --- వాటి ఉపయోగాలు ( వివిధ రకాల పండ్లు)

                                                         బొప్పాయి                                2-12-10

1. బొప్పాయి కాయకు గాటు పెట్టి దాని నుండి కారే పాలను పులిపిర్ల మీద పెడితే అవి రాలిపోతాయి.

2. బొప్పాయి గింజలను ఎండబెట్టి పొడి చేసి ప్రతి రోజు ఒక టీ స్పూను పొడిని సేవిస్తూ వుంటే నులి పురుగులు నశిస్తాయి. లేదా ఒక టీ స్పూను బొప్పాయి పాలు తీసుకున్నా నశిస్తాయి.

3. బొప్పాయి పండు గుజ్జును ఒక టీ స్పూను తీసుకుంటే అతిసార ను అరికట్ట వచ్చును.

4. పచ్చి బొప్పాయి తింటే తల్లి పాలు వృద్ధి చెందుతాయి.

5. బొప్పాయి పండు తింటూ వుంటే జీర్ణశక్తి పెరిగి బాగా ఆకలవుతుంది.

6. బొప్పాయి ఆకునకు నువ్వుల నూనె రాసి పెనం మీద వేడి చేసి సెగగడ్డల మీద వేస్తే అవి అణిగి పోతాయి.

                                                   ఆపిల్ పండు                                    4-1-11.

1. నర్వస్ టెన్షన్ :--

ఆపిల్ ముక్కలు
తేనె
పాలు

           కలిపి తాగితే తగ్గుతుంది.

2. రక్త హీనత :-- దీని వలన ఆయాసం, పనిమీద శ్రద్ధ లేకపోవడం, జుట్టు ఊడిపోవడం వంటి లక్షణాలు వుంటాయి.

ఆపిల్ పండు                         --- ఒకటి
తేనె                                     --- రెండు టీ స్పూన్లు
గులాబి రేకులు                     --- గుప్పెడు
పన్నీరు                             ---- ఒక టీ స్పూను
కుంకుమ పువ్వు కేసరాలు -
యాలకుల పొడి                  --- చిటికెడు

అన్నింటిని కలిపి లేహ్యంలాగా కలిపి తినాలి

3. అతిసార, జిగట విరేచనాలు :--

ఆపిల్ జూస్          --- అర గ్లాసు
అరటి పండు గుజ్జు --- ఒకటి

                   రెండింటిని కలిపి తాగితే జిగట విరేచనాలు తగ్గుతాయి.

4. పిప్పి పళ్ళు :--

        ప్రతి రోజు ఒక ఆపిల్ పండును కొరికి తింటూ వుంటే పిప్పి పన్ను సమస్య చిగుళ్ళ సమస్య తగ్గుతాయి.

5. యూరిక్ ఆసిడ్ పెరిగిపోతే :-- దీని వలన కాలి బొటన వ్రేళ్ళలో నొప్పిగా వుంటుంది.

       ప్రతి రోజు ఒక ఆపిల్ పండు తింటూ వుంటే గౌట్ వ్యాధి తగ్గుతుంది.

                                                      ఖర్జూరం                                          7-1-11.

మలబద్ధకం :--

ఖర్జూరాలు     --- ఒకటి లేక రెండు
అత్తి పండు     --- ఒకటి
కిస్మిస్ పండ్లు  --- పది
పాలు            --- ఒక గ్లాసు

   పాలల్లో అన్నింటిని వేసి మరిగించి ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు తాగితే ఎంతో మంచి ఫలితం వుంటుంది.

చిన్న పిల్లలు, గర్భిని స్త్రీలు కూడా వాడవచ్చు.

నీరసం :--

ఖర్జూరం
నెయ్యి
ఎండుద్రాక్ష
చక్కర
తేనె
పిప్పళ్ళు

            ఒక్కొక్కటి పది గ్రాముల చొప్పున తీసుకుని కలిపి తినాలి.
విధంగా కొద్ది రోజులు చేస్తే నీరసం వలన వచ్చే వ్యాధులు నివారింప బడతాయి.

అరుచి :--

ఖర్జూరం --- ఒక టీ స్పూన్
ద్రాక్ష ----ఒక టీ స్పూన్

  రెండింటిని ముద్దగా కలిపి బుగ్గలో పెట్టుకుని చప్పరిస్తూ వుంటే అరుచి సమస్య దూరమవుతుంది.

దగ్గు :--

ఖర్జూరం
పిప్పళ్ళు
ఎండుద్రాక్ష
పంచదార
వరిపెలాల పిండి

          అన్నింటి చూర్నాలను సమాన భాగాలుగా తీసుకుని కలిపి పెట్టుకోవాలి.

ఒక టీ స్పూను పొడిని తేనె, నెయ్యి సమానంగా కలిపి తీసుకోవాలి.

వాంతులు :--

నాలుగు ఖర్జూర పండ్ల గుజ్జు
కొబ్బరి
ద్రాక్ష లేక రేగు

     సమాన భాగాలుగా తీసుకుని లేహ్యం లాగా చేసుకుని తింటూ వుంటే వాంతులు నివారింప బడతాయి.


                                         బొప్పాయి పండు                              25-1-11.

    దీనిలో తీపి, కారం రుచులుంటాయి. ఇది వేడి చేసే లక్షణం కలిగి వుంటుంది. ఆకలినిపెంచుతుంది. కఫాన్ని తగ్గిస్తుంది. తేలికగా జీర్ణమవుతుంది. మలవిసర్జన సక్రమంగా జరిగేట్లు చేస్తుంది.

బొప్పాయి జ్యూస్

ఎక్కువగా పండని, మధ్య రకం సైజు కలిగిన బొప్పాయి పండు --- ఒకటి
తాటి బెల్లం          --- 30 gr
నీళ్ళు                 --- తగినన్ని

       బొప్పాయి పండును చెక్కు తీయాలి. లోపలి గుజ్జును, గింజలను తొలగించాలి. కండ భాగం
మాత్రమే తీసుకోవాలి. దీనిని మిక్సిలో వేసి తిప్పాలి. అవసరమైతే కొద్దిగా నీరు కలుపుకోవచ్చు.
తరువాత దానిలో నలగగొట్టిన తాటి బెల్లాన్ని వేసి తిప్పాలి.

     దీనిని మధుమేహ వ్యాధిగ్రస్తులు, స్థూలకాయం కలిగిన వాళ్ళు కూడా వాడుకోవచ్చు.

ఉపయోగాలు:-- కోలన్ క్యాన్సర్ ను నివారిస్తుంది బొప్పాయి క్యాన్సర్ నివారణలో ప్రముఖమైనది.
ఆటలలో కలిగే గాయాలు, గుండె జబ్బులు, దెబ్బలు, ఎలర్జీలు, కీళ్ళు అరిగిపోవడం, మహిళలలో
బహిష్టు సక్రమంగా సమస్యల నివారణలో ఉపయోగపడుతుంది.
అనాస pandu 











































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి