ముళ్ళు గుచ్చుకుంటే
ముళ్ళు గుచ్చుకున్నపుడు జాగ్రత్తగా తీయడానికి 25-1-11.
కావలసిన వస్తువులు :--
సేలోఫిన్ టేప్
ఫోర్సేప్స్
ఫెవికాల్
వేడి నీళ్ళు
శతదౌత ఘ్రుతం
1. అర చేతులలో నిండుగా ముళ్ళు గుచ్చుకున్నపుడు సేలోఫిన్ టేప్ ను ముళ్ళ మీద అంటించి
లాగేయ్యాలి. టేప్ తో కూడా ముళ్ళు లేచి వస్తాయి.
2. పైకి తీయవచ్చు ముళ్ళు ముళ్ళు బాగా సన్నగా తీయవచ్చు.
3. బాగా సన్నగా వున్న ముళ్ళు అరచేతి నిండా, అరికాలి నిండా గుచ్చుకుని వుంటే వాటి మీద
ఫెవికాల్ ను బాగా మందంగా పరిచి బాగా ఆరిన తరువాత ఒక పొరలాగా లేపితే దానితోబాటు
ముళ్ళు కూడా లేచి వస్తాయి.
4. ముళ్ళు బాగా లోతుగా గుచ్చుకుని వుంటే రోజుకు నాలుగైదు సార్లు వేడి నీళ్ళలో పెట్టాలి. ఈ
విధంగా రెండు, మూడు రోజులు చేస్తే చెయ్యి ఉబ్బి ముళ్ళు దానంతట అదే వచ్చేస్తుంది.
5. ముళ్ళు గుచ్చుకోవడం వలన ఇన్ఫెక్షన్ చేరి చీము పట్టి వుంటే శతదౌతఘ్రుతము గాని లేదా
తేనె, నెయ్యి కలిపి గాని పూయాలి.
కాళ్ళలో ముళ్ళు గుచుకుంటే 25-3-11.
కాలిలో ముల్లు గుచ్చుకున్నపుడు దానిపై జిల్లేడు పాలు వేస్తె ముళ్ళు త్వరగా
బయటకు వస్తుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి