ఆర్యోక్తి








                                                               ఆర్యోక్తి                                     30-12-10

1. దానం, ధర్మం, విద్య, రూపం, శీలం, కులం, స్వాస్థ్యం, ఆయువు, కీర్తి అను తొమ్మిదింటిని ప్రయత్న పూర్వకంగా రక్షించాలి.

2. రోగ భీతులైన రోగుల ప్రాణాలను రక్షించడం ఎన్నో యాగాల ఫలితాన్నిస్తుంది. 31-12-10.

                                                3. పెద్దల మాట                                              7-1-11.

శిశిరంలో             ----అగ్ని
భోజనంలో          ----పాలు
ఆపదలో            ----ఇష్టుల సాంగత్యం
సమాజంలో       ---- రాజాదరణ

    ఇవన్నీ అమృత తుల్యంగా పనిచేస్తాయి.

4. నూతి నీరు
   మర్రి చెట్టు నీడ
   యవ్వనం
   ఇటుకలతో నిర్మించిన ఇల్లు

                   ఇవి ఆరోగ్యకరం

5. త్రిదోషాలు, సప్తధాతువులు, త్రిమలాలు, ప్రసన్నమైన ఆత్మ, మనసు, ఇంద్రియాలు అన్ని బాగుండాలి.

                ఇవన్ని సక్రమంగా పని చేస్తుంటే ఆరోగ్యంగా వున్నట్టు లెక్క.

6. అన్ని మందులు, ఆహారం అందరికి ఒకేలా పని చెయ్యవు.

7. మనో ప్రసన్నత, చెడు కలలు రాకపోవడం, శుచి, పవిత్రత, తేజస్సు, రూపవర్ధనం, కాయాగ్ని దీపనం(ఆకలి)లైంగిక అనురక్తి, శ్రమ హరమ్, స్నానం అను పది అంశాలు ప్రయోజనాలు.

                                                 27-1-11.

       కామంతో సమానమైన వ్యాధి లేదు. మోహము  నాశనం చేస్తుంది, కోపం అగ్నితో సమానం,
ఆత్మ జ్ఞానం కంటే సుఖవంతమైనది

                                                      28-1-11

ఆహారం, నిద్ర, భయం, మిధునం అనునవి పశువులలో, పక్షులలో కూడా వుంటాయి.

శువులకు లేనిది, మనషులకు వున్నది జ్ఞానం. అది మనుషులలో లేకపోతే మనుషులు

పశువులవుతారు.

                                                     ఆర్యోక్తి 8-2-11.

మేకలాగా నమిలి తినాలి.

ఏనుగు లాగా స్నానం చేయాలి.

రాజు లాగా . హుందాగా ప్రవర్తించాలి.

దొంగలాగా చప్పుడు చేయకుండా నడవాలి.

                                       అతి సర్వత్ర వర్జయేత్                               9-2-11.

అతి దేనికి పనికి రాడు. మంచిది కదా అని అతిగా చేయకూడదు.

ఎక్కువ సౌందర్యం వలన సీత అపహరింప బడినది.

ఎక్కువ గర్వం వలన రావణుడు సంహరింప బడ్డాడు.

ఎక్కువ దానం వలన బలి బంధించాబడ్డాడు.

అందువలన అతి సర్వత్రా వర్జయేత్ .



.
































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి