వేప ----ఔషధ ఉపయోగాలు

                                           వేప యొక్క ఉపయోగాలు              9-7-10.

       వేప చెట్టులో ఉపయోగపడని భాగామంటూ లేదు. అందువలన దీనిని శుభప్రద అంటారు.
 1.  వేపాకుల రసం,  తేనె కలిపి గాని, లేదా వేపాకుల కషాయం, అల్లం రసం కలిపి గాని కొన్ని రోజులుసుకుంటే  అన్ని రకాల అలర్జీలు తగ్గిపోతాయి.

2.   వేప పువ్వుల కలికం ఆవు పాలలో కలిపి రెండు చుక్కలు ముక్కులో వేసుకోవాలి . ఈ విధంగా మూడు  నెలలు చేస్తే  జుట్టు వూడడం,  అలర్జీలు  నివారింప బడతాయి.

3. వేప నూనెలో గంధకం ఎక్కువగా వుంటుంది.  ఇది చర్మ సంబంధ వ్యాధులను నివారిస్తుంది.

4. వేప చెట్టు బెరడు యొక్క కషాయం రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

5. వేపాకుల రసం వలన గాయాలు మానిపోతాయి.  రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

6.  వేప చెట్టు బెరడు  యొక్క కషాయం తాగితే కామెర్లు నివారింప బడతాయి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి