హెర్బల్ షాంపూ 8-11-10
కుంకుడు పెచ్చులు --- 10 gr
సీకాయ " --- 10 gr
ఉసిరిక ముక్కలు ----10 gr
మెంతులు ----10 gr
అన్నింటిని రాత్రి నీళ్ళలో నానబెట్టి ఉదయం పిసికి రసం తీస్తే షాంపూ లాగా తయారవుతుంది. దీనితో తల స్నానం చేస్తే జుట్టు ఎంతో మృదువుగా వుంటుంది.
ఆయుర్వేద షాంపూ 17-1-11.
కుంకుళ్ళ పొడి ---- 60 gr
బ్రాహ్మి పొడి ---- 10 gr
సీకాయ పొడి ---- 10 gr
గోరింటాకు పొడి ---- 10 gr
ఒక గిన్నెలో అర లీటరు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి నీళ్ళు మరిగేటపుడు ఒక్కొక్క పొడిని దానిలో వేసి బాగా కలియబెట్టాలి. 100 ml కషాయం మిగిలే వరకు కాచి వదపోసుకోవాలి.
ఉపయోగాలు :--
చుండ్రు :-- దీని నివారణకు వారానికి రెండు మూడు సార్ల చొప్పున రెండు, మూడు నెలలు వాడాలి
తెల్ల జుట్టు :-- దీనిని వాడుతూ తలకు నీలి భ్రున్గాడి తైలం వాడుకోవాలి.
దీనిని వాడడం వలన చర్మ వ్యాధులు కూడా నివారింప బడతాయి. వెంట్రుకలు చిట్లవు. వెంట్రుకలు ఎండి పోయినట్లుగా వుంటే దీనిని వాడడం వలన జుట్టుకు జీవం వచ్చి నిగనిగ లాడుతుంది.
కేశాల సమస్య నివారణకు --ఆయుర్వేద షాంపూ 23-1-11.
వెంట్రుకలు, గోళ్ళు కెరోటిన్ అనే పదార్ధంతో తయారవుతాయి. కెరోటిన్ బలహీనపడినపుడు అవి రెండు దెబ్బ తింటాయి. కృత్రిమ పదార్ధాలను ఉపయోగించడం వలన కూడా దెబ్బ తింటాయి.
గుంటగలగర సమూల చూర్ణం ---- ఒక టీ స్పూను
వేపాకుల చూర్ణం ---- ఒక టీ స్పూను
బ్రాహ్మి చూర్ణం ---- అర టీ స్పూను
ఉసిరి పొడి ---- అర టీ స్పూను
సీకాయ పొడి ---- పావు టీ స్పూను
తెల్ల వాము (అజామోదం) పొడి ---- పావు టీ స్పూను
షాంపూ బేస్ ---- తగినంత
ఒక గిన్నెలో 200 మిల్లి లీటర్ల నీళ్ళు తీసుకుని స్టవ్ మీద పెట్టి వేడి చెయ్యాలి. దీనిలో అన్ని చూర్ణాలను ఒక్కొక్కటిగా అన్నింటిని వేసి బాగా కలపాలి. తరువాత అది 100 ml నీళ్ళు
అయ్యే వరకు కాచాలి. తరువాత వదపోసుకోవాలి. తరువాత దీనికి షాంపూ ను కలపాలి. దీనితో
తల స్నానం చెయ్యాలి.
ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు తగ్గుతుంది.
తెల్ల జుట్టు, జుట్టు చిట్లడం, వెంట్రుకల జీవ రహితంగా కనిపించడం వంటివి కూడా నివారింప బడతాయి.
దీనిని ఏ రోజుకారోజు తయారు చేసుకోవాలి.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి