పాము కాటు 28-1-11.
త్రాచుపాము, నాగుపాము, కట్లపాము, రక్తపింజరి విషపూరితమైనవి.
ప్రధమ చికిత్స
గాటు కు ఒక అడుగు పై భాగంలో తాడుతోగాని, గుడ్డ తోగాని గట్టిగా కట్టాలి. గాటు మీద X
ఆకారంలో గాటుపెట్టి రక్తాన్ని పిండాలి. ఆరోగ్యవంతమైన వాళ్ళ నోటితో రక్తాన్ని పీల్చాలి. గాలి
బాగా తగిలే విధంగా ఏర్పాట్లు చేయాలి. నడిపించ కూడదు. పైకి లేపి పట్టాలి. నురుగు కక్కడం
స్పృహ తప్పడం వంటివి జరుగు తుంటాయి. దీనికి రోగికి గాలి తగిలేట్లు చేయడం, నోట్లో నోరు పెట్టి
ఊదడం, నీటిని ముఖం మీద చిలకరించడం చేయాలి. ఫాన్ గాలి బాగా తగిలేట్లు ఏర్పాటు చేయాలి.
స్పృహ కోల్పోతే :--
1. ఉత్తరేణి ఆకులను దంచి నాలుగైదు చుక్కల రసాన్ని ఒక్కొక్క ముక్కు రంధ్రంలో వేయాలి.
నూరిన ఆకుల ముద్దను తినిపించాలి. గాటు మీద రసాన్ని పిండాలి. లేపనం లాగా పూయాలి.
వేప, నేల వేము, కారం తినిపించాలి. దీని వలన రోగికి చేదు, కారం తెలియక పోతే సమస్య
తీవ్రంగా వున్నదని అనుకోవాలి. దీనిని బట్టి ఎంత విషం ఎక్కినదో నిర్ణయించుకోవచ్చు.
2. అర స్పూను నీటిలో మూడు గ్రాముల వస పొడిని కలిపి మింగించాలి.
3. దూదిపాల (లేక) బండి గురివింద :- ఇది పాము శరీరం లాగా మచ్చలుకలిగి శరీరమంతా
మెలికలు తిరిగి వుంటుంది.
దూదిపాల ఆకులు --- 5
మిరియాలు ---10
రెండింటిని కలిపి రోగి చేత నమిలించాలి.
దూది పాల చెట్లు వున్నచోట పాములు ఉండవని అంటారు.
పాములు కొన్ని ఘాటైన ప్రాంతాలకు రావు. వస పొడిని ఉంచితే పాములు రావు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి