చుండ్రు --నివారణ

                               చుండ్రు సమస్య --నివారణ                             29-1-09.
 
1. గసగసాలను వేడి పాలల్లో నానబెట్టి,రుబ్బి, జుట్టు యొక్క కుదుళ్ళకు బాగా పట్టించాలి.ఒక గంట తరువాత కుంకుళ్ళతో తల స్నానం చెయ్యాలి.
 
                                  ముదిరిన చుండ్రుకు
 
   మందార పూలను మెత్తగా నూరి పలుచని బట్టలో వేసి ఒక చుక్క కూడా వృధా కాకుండా రసం తియ్యాలి.దానికి సమానంగా నువ్వుల నూనెను కలిపి నూనె మాత్రమే మిగిలేట్లు కాచాలి. దీనిని తలకు బాగా మర్దన చెయ్యాలి. కుదుళ్ళకు బాగా పట్టించాలి.

                                               చుండ్రు---నివారణ                         25-2-09.

          వస కొమ్ములను దంచి పొడి చేసి పెట్టుకోవాలి. కొంత పొడి తీసుకొని తగినన్ని నీళ్ళు కలిపి జుట్టు యొక్క పాయలకు పట్టించాలి. 15 నిమిషాలు ఉంచి కుంకుళ్ళతో తల స్నానం చెయ్యాలి. అప్పుడప్పుడు విధంగా చేస్తూ వుంటే చుండ్రు నివారింప బడుతుంది.

                                చుండ్రు నివారణకు ,మందార తైలం                 9-3-09.

                ఆహార పదార్ధాలలో తీపి, కారం, ఉప్పు ఎక్కువగా వాడితే చుండ్రు ఎక్కువగా వస్తుంది. కఫం,వాయువు యెక్కువైతె అవి తలకు చేరి తల మీద అట్ట లాగా పేరుకుంటుంది.

                      ఎర్ర రెక్క మందార పూలు ------ 100 gr                                         
                            నల్ల నువ్వుల నూనె ------- 100 gr                                        
                            నల్ల   ఆవు మూత్రం ------- 100 gr (దొరికితేనే)

                 అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి. నూనెను ప్రతి రోజు తలకు రాసు కుంటే చుండ్రు పోయి వెంట్రుకల కుదుళ్ళు గట్టి పడతాయి.

    ఇలా కుదరనపుడు మందార పూలను పేస్ట్ లాగా చేసి దానిలో ఆవు మూత్రం, నువ్వుల పొడి కలిపి పేస్ట్ లాగా చేసి తలకు పట్టించాలి. గంట తరువాత స్నానం చెయ్యాలి. తల స్నానం చేసిన ప్రతిసారి దిండు కవర్ ను మార్చాలి, దువ్వెనశుభ్రపరచుకోవాలి.

                                               12-6-10
                                                                                      
గడ్డి చేమంతి సమూల రసం  ----- ఒక గ్లాసు
నువ్వుల నూనె                  ----- అర గ్లాసు
 
రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలేట్లు కాచి వడపోసి చల్లార్చి నిల్వ చేసుకోవాలి.
రాత్రి పూట నూనెను తలకు పట్టించి ఉదయం కుంకుళ్ళతో స్నానం చేస్తే చుండ్రు నివారింప బడుతుంది.

                                  చుండ్రు నివారణకు చిట్కా                                    26-10-10

             కలబంద గుజ్జు మెంతి పొడి రెండింటిని పేస్ట్ లాగా చేసి జుట్టు కుదుళ్ళకు పట్టించాలి. ఒక గంటసేపు వుంచి స్నానం చెయ్యాలి. విధంగా వారానికి రెండు సార్లు చొప్పున మూడు నెలలు చేయాలి.
                                                                                                                                                  
 ఎండిన నారింజ పండ్ల తొక్కలు                                                                                            ఉసిరి కాయ పెచ్చులు
 కుంకుళ్ళు సీకాయ

అన్నింటిని సమాన భాగాలు గా తీసుకుని విడివిడిగా చూర్ణాలుగా చేసి కలిపి భద్ర పరచుకోవాలి.

 1. పొడిని నీటిలో వేసి మరిగించి తల స్నానానికి వాడాలి.

  2. కొబ్బరి నూనెకి నిమ్మ రసం కలిపి తలకి పట్టించి ఒక గంట తరువాత స్నానం చెయ్యాలి.

      కొబ్బరి నూనె                       --- 100 gr
      విత్తనాలు లేని నిమ్మ రసం       --- 20 gr

            రెండింటిని కలిపి ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద నూనె మాత్రమె మిగిలే వరకు కాచాలి .
వడపోసి ఒక టీ స్పూను ముద్ద కర్పూరం కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .

            దీనిని రాత్రి పూట గోరువెచ్చగా తలకు పట్టించాలి .  ఉదయం తల స్నానం చేయాలి .ఈ విధంగా వారానికి
రెండు , మూడు సార్లు చేయాలి .

సూచన :-- తల స్నానం చేసిన ప్రతి సారి  దువ్వెన ను శుభ్రం చెసుకొవాలి.


  3. చందన తైలం --- ఒక టీ స్పూను
        నిమ్మరసం ----మూడు టీ స్పూన్లు

       కలిపి తలకు పట్టించి ఒక గంట తరువాత తల స్నానం చెయ్యాలి. 4. గసాలు పేస్ట్ లాగా నూరి
తలకు పట్టించి గంట తరువాత స్నానం చేయాలి.

 5. మామిడి టెంకలోని జీడి యొక్క చూర్ణము కరక్కాయ చూర్ణం రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని పాలతో నూరి తలకు పట్టించి గంట తరువాత తల స్నానం చేయాలి.

 6. వేప నూనె, కానుగ నూనె, కర్పూం కలిపి తలకు పట్టించి ఒక గంట తరువాత తల స్నానం చెయ్యాలి

                                                        25-11-10
 
        తలలో పొట్టు లాగా వుండడం, గుల్లల్లాగా వుండడం, దురద, తలలో మాత్రమే సోరియాసిస్
రావడం వంటి లక్షణాలు  చుండ్రుకు సంబంధించినవి కావు.

  వ్యాధి శరీరంలో తయారయ్యే మలిన పదార్ధాల వలన వస్తుంది.

వాత, పిత్త, కఫములు ప్రకోపించినపుదు శరీరంలో మలిన పదార్ధాలు తయారయి తల ద్వారా బయటకు వెళ్ళవలసిన మలిన పదార్ధాలు వెళ్లకపోవడం వలన వస్తుంది.

 ఇది అంటువ్యాధి, సంక్రమిత వ్యాధి తలలో వాతం చేరడం వలన, రక్త ప్రసరణ సరిగా జరగక పోవడం వలన సమస్య ఏర్పడున్తుంది. వాతాన్ని తగ్గించడానికి తైలం ప్రధానమైనది

         శారిబాది వటి మంజిష్టాది కషాయం పైన చెప్పబడిన వాటిలో ఏదో ఒక ఔషధాన్ని వాడితే తగ్గుతుంది.

  1. వేపనూనె       --- 100 gr
      ముద్దకర్పూరం --- 20 gr

నూనెను వేడి చేసి కర్పూరం కలిపి నిల్వ చేసుకోవాలి. దీనిని వాడి నిమ్మ కాయ రసాన్ని పట్టించాలి.

 2. తాజా నిమ్మ కాయల రసాన్ని తలకు మర్దన చేసి స్నానం చేయాలి.

  3. ఉసిరి పెచ్చులు --- 50 gr
             మెంతులు --- 50 gr 

రాత్రి రెండింటిని నానబెట్టి ఉదయం వాటిని పిసికి లేదా నూరి దానికి పెరుగు కలిపి తలకు పట్టించాలి. విధంగా వారానికి రెండు సార్లు చెయ్యాలి. పైన మూడు అంశాలలో ఏదైనా ఒకటి చేసిన తరువాత ప్రక్రియను తలను శుభ్రపరచడానికి  వాడాలి.

                                      చుండ్రు ---నివారణ                                              11-3-11.

  1.    వేపనూనె              --- ఒక టీ స్పూను
         కర్పూరం              --- ఒక టీ స్పూను

             రెండింటిని  పేస్ట్ లాగా కలిపి  జుట్టు పాయలకు పట్టించాలి.

  2.   వెలిగారం               --- 5 gr
        నిమ్మరసం            --- ఒక టీ స్పూను

             రెండింటిని కలిపి పేస్ట్ లాగా చేసి జుట్టు కుదుళ్ళకు పట్టించాలి. ఈ విధంగా వారానికి
ఒక సారి చేయాలి.

  3.   సపోటా గింజల పొడిని తలకు పట్టించి స్నానం చేయాలి.

        ఈ విధంగా చేస్తే చుండ్రు,  పేలు కూడా నివారింప బడతాయి.

                                చుండ్రు నివారణకు కర్పూర నింబ తైలం                        31-5-11.

కర్పూరం పొడి              ---  ఒక టీ స్పూను
వేప నూనె                    --- అర కప్పు  ( 120 ml )

       రెండింటిని  ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి . దీనిని పొడిగా వున్న సీసాలో పోసి భద్రపరచు
కోవాలి .  మూడు రోజుల పాటు  అప్పుడప్పుడు గిలకోడుతూ ఉండాల్ .

       నాల్గవ రోజు రాత్రి ఈ నూనెను తలకు పట్టించి ఉదయం తల స్నానం చేయాలి . లేదా ఉదయం
తలకు నూనె పట్టించి రెండు , మూడు గంటల తరువాత స్నానం చేయవచ్చు .

      ఈస్ట్ వలన చుండ్రు ఏర్పడే అవకాశాలు వున్నాయి . ఈ తైలం  ఈస్ట్ ను నివారిస్తుంది
       కర్పూరం  మెదడును చల్లబరుస్తుంది .

           చుండ్రు లేకుండానే తలలో దురదగా వున్నపుడు --నివారణకు చిట్కా   ---  6-6-11.

       100 గ్రాముల కొబ్బెర నూనెను వేడి చేసి దించి దానిలో ఒక టీ స్పూను ముద్దకర్పూరం
కలిపి చల్లారిన తరువాత సీసాలో నిల్వ చేసుకోవాలి .

       దీనిని రాత్రి పూట తలకు పెట్టుకుంటూ వుంటే వారం రోజులలో తగ్గిపోతుంది .

                                             చుండ్రు  --- నివారణ                                          8-6-11.

  కారణాలు :--  పొడి వాతావరణం ,  చెమట , వేడి నీళ్ళ స్నానం , కాస్ట్యూమ్స్ ను ఎక్కువగా
వాడడం మొదలైనవి  . 

ఆముదం           --- ఒక టీ స్పూను
ఆవ నూనె         --- ఒక టీ స్పూను
కొబ్బరి నూనె    ---  ఒక టీ స్పూను

       అన్నింటిని బాగా కలిపి రాత్రి పూట తలకు బాగా పట్టించి ఉదయం వరకు అలాగే వుంచి ఉదయం స్నానం చేయాలి .  లేదా పగలు తలకు పట్టిస్తే మూడు గంటల సేపు అలాగే వుంచి 
తల స్నానం చేయాలి .
                                                       చుండ్రు  --- నివారణ                                   19-7-11.
ఉసిరి పెచ్చుల పొడి                 ---- 50 gr
             వస పొడి                  ----  50 gr
నాగ కేసరాల పొడి                   ----  50 gr

    అన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి .

     ఒక టీ స్పూను పొడి లో ఒక టీ స్పూను వేపాకు పేస్టు ను , ఒక టీ స్పూను గోరింటాకు పేస్టు ను కొద్దిగా ముద్దకర్పూరాన్ని
కలపాలి . అన్నింటిని బాగా కలిపి జుట్టు యొక్క కుడుల్లకు పట్టించాలి . ఒక గంట సేపు వుంచి ఆరిన తరువాత మామూలు
నీటితో కడగాలి . లేదా తల స్నానం చేయవచ్చు . షాంపూ వాడాల్సిన అవసరం లేదు .

                              చుండ్రు నివారణకు  --- మరీచి ( మిరియాల ) ద్రవం                   26-7-11.

మిరియాల పొడి                  ---- రెండు టీ స్పూన్లు
నిమ్మ రసం                        ---- ఒక టేబుల్ స్పూను
పాలు                                ---- ఒక కప్పు

         ఒక గిన్నెలో అన్ని పదార్ధాలను వేసి బాగా కలపాలి . తరువాత దీనిని వేళ్ళతో తీసుకుని జుట్టు కుదుళ్ళకు
పట్టించాలి ..  కొంచం చిమచిమ లాడుతుంది .
         ఒక గంట తరువాత కడగాలి .

         దీనిని వాడడం వలన ఎంత మోడీ చుండ్రు అయినా పూర్తిగా నివారింపబడుతుంది .

                                                     చిట్కా

        తగినంత పెరుగులో ఒక స్పూను ఉసిరిక పొడిని కలిపి తలకు పట్టించాలి . అరగంట తరువాత స్నానం చేయాలి
ఈ విధంగా అప్పుడప్పుడు చేస్తూ వుంటే చుండ్రు చాలా త్వరగా నివారింపబడుతుంది .

                                                    చుండ్రు --- నివారణ                                       3-9-11.

        వెంపలి ( శర పుంఖ ) మొక్కల యొక్క వేర్లను తెచ్చి ఎండబెట్టి , దంచి నిల్వ చేసుకోవాలి .

        తగినంత పొడిని తీసుకొని వెన్న కలిపి  తలకు పట్టించాలి .దీని వలన చుండ్రు నివారింపబడుతుంది .

                                                              6-9-11

బావంచాలు                    ---- ఒక టీ స్పూను
అడవి బాదం గింజలు        ---- ఒక టీ స్పూను
కానుగ గింజలు                ---- ఒక టీ స్పూను
వేప గింజలు                    ---- ఒక టీ స్పూను

      అన్నింటిని రోట్లో వేసి నీళ్ళు కలిపి మెత్తగా పేస్టు  లాగా  రుబ్బాలి .  దీనికి కొద్దిగా నీటిని కలిపి తలకు రాత్రి పట్టించి
ఉదయం స్నానం చేయాలి .

పెరుగు                           ---- ఒక టేబుల్ స్పూను
కోడి గుడ్డు                       ---- ఒకటి
నిమ్మ రసం                      ---- ఒక టేబుల్ స్పూను

       ఒక గిన్నెలో అన్నింటిని వేసి బాగా మిశ్రమం లాగా కలిపి జుట్టు  కుదుళ్ళకు  పట్టించాలి . అరగంట తరువాత స్నానం
చేయాలి .దీనిథొ ఎంతటి మొండి చుండ్రు అయినా తగ్గుతుంది .

మెంతి పిండి                     ---- ఒక టేబుల్ స్పూను
మిరియాల పొడి                ---- ఒక టీ స్పూను
పాలు                              ---- అర కప్పు

       అన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా పేస్ట్ లాగా కలపాలి . దీనిని తలకు పట్టించి సున్నితంగా వేళ్ళతో మర్దన చేయాలి
అరగంట తరువాత స్నానం చేయాలి .

                                             మొండి చుండ్రు నివారణకు కేశ శుద్ధ చూర్ణము                      12-9-11

సీకాయ పొడి                        --- 20 gr
కుంకుళ్ల పొడి                       --- 20 gr
నిమ్మ తొక్కల పొడి              --- 20 gr
వేప బెరడు పొడి                   --- 20 gr
గోరింటాకు పొడి                   --- 20 gr
చందనం పొడి                      --- 20 gr
మాని పసుపు పొడి               --- 20 gr
సైన్ధవః  లవణం పొడి              --- 20 gr

       ఒక పాత్రలో అన్ని పదార్ధాలను ఒక్కొక్కటిగా కలియబెడుతూ వేయాలి . అన్నింటిని బాగా కలిపి గాలి చొరబడని
గాజు సీసాలో భద్రపరచుకోవాలి .
       ఒక గిన్నె లో 5 , 6  టీ స్పూన్ల పొడిని వేసి నీళ్లు కలిపి ఉడికించాలి .దీనిని చల్లార్చాలి . తరువాత జుట్టును తడిపి
ఈ మిశ్రమాన్ని జుట్టు కు పట్టించాలి . గట్టిపడే వరకు ఉంచి గోరువెచ్చని నీటితో  తలస్నానం చేయాలి

       ముందు రోజు రాత్రి తలకు బాగా నూనె పట్టించాలి . మరుసటి రోజు ఈ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే  కడగడం సులభం
అవుతుంది .

      సమస్య తీవ్రంగా ఉంటే ప్రతి రోజు ఈ విధంగా చేస్తే మంచిది  లేదా మూడు రోజులకొకసారి వాడవచ్చు . 

      ఈ విధంగా చేయడం వలన చుండ్రు తప్పక నివారింపబడుతుంది

     






         
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి