ఆయాసము

                         అకారణమైన ఆయాసము ---నివారణ                                     16-10-10.
 
      దూలగొండి విత్తనాలను వేడి నీటిలో నానబెట్టి తొక్కతీసి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి.  ఆ పొడిని నీటితో ముద్దగా కలిపి తింటే నడిస్తే వచ్చే ఆయాసం తగ్గుతుంది.
 
                       ఆయాసం --- నివారణ                                                     17-12-10.

         ఉబ్బసం ,  ఆయాసం  ఒకటి   కాదు.   

          గుండెకు సరిపడినంత ఆక్సిజన్  అందకపోవడం వలన,  నీరసం వలన  ఆయాసం రావచ్చు. ఉబ్బసం వలన  కూడా ఆయాసం వస్తుంది.  చింత చెట్టు  కింద పడుకున్నపుడు   ఆక్సిజన్  అందక ఆయాసం రావచ్చు.

శొంటి పొడి                --- 100 gr
అడ్డసరం ఆకుల పొడి  --- 100 gr

        రెండింటిని కలిపి సీసాలో భద్రపరచు కోవాలి.  ఒక టీ స్పూను పొడికి ఒక స్పూను తేనె కలిపి ఉదయం, సాయంత్రం ఆహారం తరువాత తీసుకుంటే ఆయాసం నివారింప బడుతుంది.

       ఆయాసాన్ని నివారించడానికి  వ్యాయామం చెయ్యాలి.  కడుపు మరీ నిండే  వరకు ఆహారం తీసుకోకూడదు.     కొంత ఖాళి వుండాలి.

                                                            ఆయాసం  ---నివారణ                               22-6-11.

    ఆయాసం వున్నపుడు  ఇతర వ్యాధులు వున్నాయేమో గమనించి  వాటికి మందులు వాడుకుంటూ ఆయాసానికి
మందులు వాడాలి . ఉదాహరణకు  రక్త హీనత ,  శ్వాస సమస్యలు  మొదలగునవి .

నేలములక సమూల చూర్ణం            --- 50 gr  ( దీనిని కంటకారి  లేదా ముళ్ళ వంకాయ అని కూడా అంటారు )
అడ్డసరం ఆకుల చూర్ణం                 --- 50 gr
             శొంటి  చూర్ణం                 --- 25 gr
             పసుపు చూర్ణం                --- 25 gr
     తాని కాయల చూర్ణం                --- 25 gr
         మిరియాల చూర్ణం               --- 25 gr

                    అన్ని చూర్ణాలను బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .
                   ప్రతి రోజు ఒక టీ స్పూను చూర్ణాన్ని రెండు గ్లాసుల నీటిలో వేసి కాచి సగానికి రానివ్వాలి . తరువాత దానిలో
                  చిటికెడు సైంధవ లవణాన్ని కలిపి తాగాలి .

                                                          ఆయాసం    ---  నివారణ                               7-7-11.

      తెల్లగడ్డ  (వెల్లుల్లి ) ని బాగా మెత్తగా నూరి కొద్దిగా వేలి మీద పెట్టుకొని రోగి యొక్క కొండ నాలుకకు అంటించాలి
దీనితో వెంటనే ఆయాసం తగ్గుతుంది .

అతి మధురం పొడి              
ఉసిరిక పొడి

     రెండింటిని సమాన భాగాలుగా తీసుకొని బాగా కలిపి నిల్వ చేసుకోవాలి .
     వయసుని బట్టి పెద్ద వాళ్లకు అర టీ స్పూను , పిల్లలకు పావు టీ స్పూను చొప్పున చూర్ణం తీసుకొని తగినంత తేనె
కలిపి వాడాలి


                                                        



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి