వాంతుల సమస్య --నివారణ 30-1-09
వాంతులు వచ్చే ముందు వోకరింపు వుంటుంది .నోరు ఉప్పగా వుంటుంది , నోట్లో నీళ్ళు ఊరుతూ వుంటాయి.త్రేన్పులు వస్తుంటాయి.విరేచనం కాకుండా వుంటుంది. ఆహారం సహించదు.
1. ఆగకుండా వాంతులు అవుతుంటే మట్టి పట్టి వేసుకోవాలి.
2. చల్లటి నీటిలో చేతులను పది నిమిషాలు ఉంచితే వాంతులు ఆగి పోతాయి.
3. ఒక గ్లాసులో నీళ్ళు పోసి నీలం రంగు కాగితం చుట్టాలి. ఒక పీట మీద ఆ గ్లాసును వుంచి ఎండలో రోజంతా వీలైనంత సేపు ఉంచాలి .దీని వలన ఆ గ్లాసులోని నీళ్ళు చార్జి అవుతాయి. ఆ నీటిని తాగితే వాంతులు తగ్గుతాయి. ఆ బీటి గ్లాసు ఎండలో ఎంత ఎక్కువ సేపు వుంటే అంత మంచిది.
శొంటి --------50 gr
మారేడు పండు గుజ్జు పొడి -------10 gr
రెండు విడివిడిగా దంచి పొడి చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
ఉదయం, సాయంత్రం ఒక్కొక్క సారికి పావు టీ స్పూను చొప్పున పొడిని అర కప్పు నీటిలో
కలుపుకొని తాగాలి. దీనితో వాంతులు నివారింప బడతాయి.
కలుపుకొని తాగాలి. దీనితో వాంతులు నివారింప బడతాయి.
పసరు వాంతులు --నివారణ 3-2-09.
పసరు వాంతులు ఆహారం జీర్ణం కాకపోవడం వలన వస్తాయి. పైత్య రసం నిల్వ వుండి, పులిసిపోయి పసరు గా మారి వాంతుల రూపం లో బయటకు వస్తుంది.
లఘుశంక ప్రక్షాళనం :--
గొంతు కూర్చొని రెండు,మూడు గ్లాసుల నీటిలో అర టీ స్పూను ఉప్పు కలిపి తాగి ఊర్ధ్వహస్తాసనం చెయ్యాలి.
నిటారుగా నిలబడి చేతులను పైకెత్తి వేళ్ళు దూర్చి అర చేతులను పైకి పెట్టి నడుమును ఎడమకు,కుడికి వంచాలి.
తిర్యక్భుజంగాసనం :__
బోర్లా పడుకొని నడుమును పైకి లేపి చేతులు ఆనించి అటు,ఇటు శరీరాన్ని తిప్పాలి.
ఉదారాకర్షనాసనం:--
గొంతు కూర్చొని ఎడమ మొకాలుపై ఎడమ చేయి వుంచి జరిగినట్లుగా కిందికి ఆనించాలి.అలాగే రెండవ వైపు కూడా చెయ్యాలి.
ఆహారం:-- లఘుశంక ప్రక్షాళనం చేసిన రోజు ఉదయం,సాయంత్రం పులగంమాత్రమ అంటే పెసర పప్ప్పు అన్నం నేతితోతినాలి.
కూరల్లో ఉప్పుకు బదులు సైంధవ లవణం వాడాలి.
కొత్త చింత పండు వాడకూడదు. పాత చింతపండు,
పాత బెల్లం వాడాలి. పచ్చిమిర్చి అసలు వాడకూడదు.
పాత బెల్లం వాడాలి. పచ్చిమిర్చి అసలు వాడకూడదు.
ఎండుమిర్చి కొద్దిగా వాడాలి. మేలైన నువ్వుల నూనెను వాడాలి.
మిరియాలు ---- 100 gr
కరివేపాకు ---- 100 gr
నిమ్మరసం ---- తగినంత
సున్నపురాళ్ళు నానబెట్టాగా వచ్చిన సున్నపు తేటలో మిరియాలను 2 1/2 గంటలసేపు నానబెట్టి, తీసి ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత దంచి జల్లించాలి. కరివేపాకును ఆరబెట్టి దంచి జల్లించాలి .రెండింటిని సమాన మోతాదులో కలిపి కల్వంలో వేసి తగినంత నిమ్మరసం కలిపి మెత్తగా నూరాలి.శనగ గింజలంత మాత్రలు చేసి తేమ లేకుండా ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి.
ఉదయం, సాయంత్రం పూటకు రెండు మాత్రల చొప్పున నీటితో తీసుకోవాలి.
అల్లం--- వమన హరం 26-5-10.
అల్లం వాంతులను తగ్గిస్తుంది.
అల్లం, బెల్లం కలిపి తీసుకుంటే వాంతి కాబోతున్నట్లు గా వుండడం ( vomting sensation )తగ్గుతుంది.
గర్భిణి స్త్రీలకు వచ్చే వాంతులు, బస్సు ప్రయాణాల్లో అయ్యే వాంతులు తగ్గుతాయి.
సాధారణ వాంతులు--నివారణ 15-6-10.
కారణాలు:--
వ్యాధుల వలన, మందుల వలన, వాతావరణం వలన వాంతులు వస్తాయి.
ఎక్కువగా మద్యం సేవించడం మసాలాలతో కూడిన ఆహారాన్ని తినడం వలన తీవ్రమైన వాంతులు వస్తాయి.
మెదడు లోపల ట్యూమర్ వున్నపుడు లేదా పీడనం వలన, పేగులు ముడుతలు పడడం వలన,మైగ్రేన్ వలన, గర్భిణి స్త్రీలలోవేవిళ్ళ వలన, అరుచి వలన వాంతులు వస్తాయి.
వ్యాధుల వలన, మందుల వలన, వాతావరణం వలన వాంతులు వస్తాయి.
ఎక్కువగా మద్యం సేవించడం మసాలాలతో కూడిన ఆహారాన్ని తినడం వలన తీవ్రమైన వాంతులు వస్తాయి.
మెదడు లోపల ట్యూమర్ వున్నపుడు లేదా పీడనం వలన, పేగులు ముడుతలు పడడం వలన,మైగ్రేన్ వలన, గర్భిణి స్త్రీలలోవేవిళ్ళ వలన, అరుచి వలన వాంతులు వస్తాయి.
వాంతులు కావడం వలన శరీరంలోని లవణాలు, నీరు బయటకు విసర్జింప బడతాయి.
వాంతులు తీవ్రంగా వున్నపుడు తప్పక వైద్యుని సంప్రదించాలి.
సాధారణ వాంతులు అయితే :--
1. మాదీ ఫల రసాయనం ప్రతి రెండు గంటల కొకసారి రెండు స్పూన్ల చొప్పున తీసుకోవాలి.
2. ఉసిరిక పొడిని తేనెతో కలిపి తీసుకుంటే తగ్గుతాయి.
3. ఆ టీ స్పూను యాలకుల పొడిని తేనెతో కలిపి తీసుకుంటే చాలా త్వరగా తగ్గుతాయి.
4. నిమ్మ రసంలో తేనె కలిపి తీసుకున్నా తగ్గుతాయి.
ఆహారాన్ని మార్చడం:--
చాలా సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. బొరుగులను అలాగే గాని, పొడి చేసిగాని, చక్కెరకలుపుకొని గాని తినాలి. ఇడ్లి లాంటివి తీసుకోవాలి.
సైంధవ లవణం, చక్కెర కలిపి తీసుకోవడం వలన లవణాలు, నీరు శరీరానికి అందించ బడతాయి.
18-11-10.
ధనియాల పొడి
వెలగ పండు గుజ్జు
త్రికటు చూర్ణం ( శొంటి, పిప్పళ్ళు, మిరియాలు)
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని నిల్వ చేసుకోవాలి.
మూడు గ్రాముల పొడిని బియ్యపు కడుగు నీటితో తీసుకోవాలి
19-11-10
పుదీనా రసం
అల్లం రసం
నిమ్మ రసం
తాటిబెల్లం
అన్నింటిని కలిపి సేవిస్తే వోకరింపు, వికారం వాంతులు తగ్గుతాయి.
ప్రయాణాలలో వాంతులు -- పరిష్కార మార్గాలు 3-1-11.
ప్రయాణాలలో వాంతులు అవుతాయనే ఫీలింగ్, చెట్లు కదిలి వేల్లిపోతున్నట్లు, కళ్ళు త్రిగినట్లు అనిపించడం
వలన వాంతులు కావచ్చు. ఆ ఫీలింగ్ వదిలేస్తే రావు. ఇది వ్యాధి కాదు. సరిగా వ్యాయామాలు చేస్తూ శరీరానికి తగిన శ్రమను కలిగిస్తే ఇలాంటి సమస్య ఏర్పడదు.
ఇవి ఒక్కొక్క సారి అజీర్ణం, కడుపులో నొప్పి వలన కూడా వస్తాయి.
శొంటి పొడి ---50 gr
జిలకర పొడి ---25 gr
వాము పొడి --- 25 gr
దాక్చిన చెక్క పొడి --- 25 gr
యాలకుల పొడి --- 10 gr
శొంటి ని, జిలకరను దోరగా వేయించి దంచి పొడి చేయాలి. వామును నిమ్మ రసంలో నానబెట్టి ఎండబెట్టి దంచి పొడి చేయాలి.
అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి. లేదా అన్ని పొడులను కల్వంలో వేసి తగినంత బెల్లం కలిపి నూరి శనగ గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి.
పూటకు రెండు మాత్రల చొప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాడాలి.
ప్రయాణానికి ముందు, ప్రయాణం లో కూడా ఈ మాత్రలు వేసుకుని బయలు దేరాలి.
.
దీనివలన అజీర్ణపు వాంతులు కూడా నివారింప బడతాయి. పొట్ట తేలికవుతుంది.
ఆహార నియమాలు :-- అజీర్ణ సంబంధమైన పదార్ధాలను వాడకూడదు. ప్రయాణానికి ముందు మజ్జిగలో జీలకర్ర కలుపుకుని తాగాలి. నీళ్ళు ఎక్కువగా తాగాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి