నిద్రలేమి ---నివారణ 16-12-08.
నిద్రలేమికి ఫలానా కారణం అంటూ చెప్పలేము.
యోగాభ్యాసం :-- రాత్రి ఆహారానికి ముందు శరీరానికి శ్రమ కలిగించాలి.శరీరం ఘర్షణ చెందాలి.
1. సులభమైన జాగింగ్ చెయ్యాలి.అలుపు వస్తే 5 నిమిషాలు ఆగి మళ్లీ చెయ్యాలి, నిదానంగా చెయ్యాలి. పెద్దవాళ్ళు నడక జాగింగ్ చెయ్యొచ్చు దీని వలన నాభి ప్రాంతం వరకు కదులుతుంది.
2. రెండు చేతులను ముందుకు పెట్టి, బార చాపి ముందుకు, వెనకకు చెయ్యాలి. వెనక్కి విరుచుకున్నట్లు చెయ్యాలి. చేతులను పైకెత్తడం,గుండ్రంగా తిప్పడం చెయ్యాలి.ఇవన్ని గాలి పీలుస్తూ, వదులుతూ ముందుకు తలను తిప్పుతూ (గుండ్రంగా)వ్యాయామం చెయ్యాలి.
పాదహస్తాసనం :-- చేతులను బాగా పైకెత్తి నెమ్మదిగా వంగి కాలి బొటన వ్రేళ్ళను తాకాలి.రెండు కాళ్ళ మధ్య ఒక అడుగు స్థలం వుండాలి. దీని తరువాత స్నానం చేసి భోజనం చేస్తే సుఖంగా నిద్ర పడుతుంది. పడుకున్న తరువాత అవయవాలను తేలికగా వదలాలి,.
అతిమధురం -------- 100 gr
ఇప్ప పూలు -------- 100 gr
వెదురుప్పు -------- 100 gr
కలకండ -------- 100 gr
అన్నింటిని విడివిడిగా పొడులు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
రాత్రి భోజనం తరువాత అర స్పూన్ పొడిని అరకప్పు గోరువెచ్చని నీటిలో కలుపుకొనిఆహారం తరువాత తాగితే బాగా నిద్ర పడుతుంది.
నిద్ర లేమి వలన దేహ కాంతి తగ్గుతుంది, కళ్ళు, బుగ్గలు పీక్కుపోవడం, కళ్ళమంటలు వుంటాయి.
నిద్రాతైలం
నువ్వుల నూనె ------100 gr
ముద్ద కర్పూరం ------20 gr
నువ్వుల నూనెను ఒక గిన్నెలో పోసి వేడిచేసి దించి ముద్దకర్పూరం వేసి మూత పెట్టాలి. కరిగిన తరువాత గాజు సీసాలో నిల్వ చెయ్యాలి.నిద్రకు అర గంట ముందు స్టూలు మీద కూర్చొని తైలాన్ని అరికాళ్ళకు మర్దన చెయ్యాలి.ఆ విధంగా రెండు పాదాలకు వ్హేయ్యాలి.
రెండు స్పూన్ల గసాలు వేయించి ఒక గుడ్డలో వేసుకొని వాసన చూస్తుంటే కమ్మని నిద్ర, గురకలు పెట్టె నిద్ర వస్తుంది.
23-12-08.
నిద్రలేమి ---- నివారణ 15-7-09.
కునికిపాట్లు -- నివారణ 17-12-10.
పసుపు
మిరియాలు
సైంధవ లవణం
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని కలిపి వుంచుకోవాలి.
ప్రతి రోజు ఒక టీ స్పూను పొడిని కమలాపండు రసంతో తీసుకుంటే సమస్య నివారింప బడుతుంది.
సుఖ నిద్ర 24-12-10.
రుణ విముక్తులు, వ్యాధి విముక్తులు, ఆహారాన్ని సావకాశంగా భుజించే వాళ్ళు,
ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేని వాళ్ళు సుఖంగా నిద్రిస్తారు.
20 గ్రాముల పటిక తీసుకొని పడుకునేటపుడు దిండు కింద పెట్టుకుని పడుకుంటే సుఖమైన నిద్ర పడుతుంది
2. ఉత్తరం వైపున ప్రాకీన తులసి వేరును తీసుకొని కడిగి ఆరబెట్టి నిద్రించే ముందు దిండుకింద పెట్టుకుంటే సుఖంగా నిద్ర పడుతుంది
ఇవి ఆచరణలో నిరూపించ బడ్డాయి.
ఇవి ఆచరణలో నిరూపించ బడ్డాయి.
నిద్రలేమి ---- నివారణ 15-7-09.
యోగనిద్ర:-- వెల్లకిలా పడుకొని కాళ్ళను, చేతులను ఫ్రీ గా వదిలెయ్యాలి.
. పాదాల వద్ద మనసు పెట్టి చాలా చల్లగా వున్నాయి, విశ్రాంతి కలగాలి అని నెమ్మదిగా పది సార్లు మనసులో అనుకోవాలి.
పిక్కలు చాలా లూజువున్నాయి,నొప్పులు లేవు అని, తొడలలో రక్తప్రసరణ బాగా జరుగుతున్నదని చల్లదనం వున్నదని, పొత్తికడుపు, నాభిభాగంలో, పొట్టలో చల్లగా ఉన్నట్లుగా అనుకోవాలి.
ఊపిరితిత్తులు, గుండె మొదలైనవి తేలికగా, చల్లగా ప్రశాంతంగావున్నట్లు రక్తప్రసరణ బాగా జరుగుతున్నట్లు ఫీల్ అవ్వాలి.
తలంతా చల్లగా, ప్రశాంతంగా వున్నట్లు అనుకోవాలి.

దీనినే యోగ నిద్ర అంటారు "యద్భావం తద్భవతి" దీనిని ప్రతిరోజు సాధన చెయ్యాలి.
గతాన్ని తలచుకొని కుమిలి పోయే వాళ్లకు భవిష్యత్తు, వర్తమానం లేవు.
" ఏ ఆలోచనలు నిన్ను మధురానుభూతులకు లోను చేస్తాయో వాటిని గురించి ఆలోచించుకోవాలి"
.
అల్లం రసం ---- ఒక టీ స్పూను
నిమ్మ రసం ---- ఒక టీ స్పూను
తేనె ---- ఒక టీ స్పూను
అన్నింటిని కలిపి తాగాలి. దీని వలన బాగా ఆకలి వేస్తుంది .బాగా ఆకలైతే బాగా నిద్ర పడుతుంది.
30 గ్రాముల నువ్వుల నూనెలో మూడు గ్రాముల హారతి కర్పూరం కలిపి గోరువెచ్చగా చేసి అరికాళ్ళకురాత్రి నిద్రించే ముందు మర్దన చెయ్యాలి.
బూడిద గుమ్మడి కాయ విత్తనాలను ఎక్కువగా సేకరించి గానుగలోఇచ్చినూనెతీసుకోవాలి.వడపోసి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఒకటి లేక రెండు స్పూన్ల నూనెను మాడు మీద వేసి మర్దన చెయ్యాలి.
ఒక స్పూనునూనెను తాగాలి. దీనితో బాగా నిద్ర వస్తుంది.

నిద్ర లేమి ---నివారణ 23-4-10.
జటామాంసి ని తెచ్చి శుభ్రపరచి దంచి పొడి చేసి ( మరీ మెత్తగా అవసరం లేదు ) నిల్వ చేసుకోవాలి.
ఉదయం టీ కి బదులుగా ఈ పొడితో డికాషన్ పెట్టుకొని తాగాలి. ఉదయం తాగితే రాత్రికి బాగా
నిద్ర పడుతుంది.
జటామాంసి తోబాటు జ్యోతిష్మతిని కూడా కలిపి డికాషన్ + పాలు + చక్కెరతో కలిపి తాగాలి. ఇది నీరసాన్నికూడా పోగొడుతుంది . మానసిక రుగ్మతల వలన వచ్చే వ్యాధులు కూడా నివారింప బడతాయి. లేదా జటామాంసి ఒక్కటి వాడినా చాలు.
దీనిని వాడితే మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి.

; నిద్ర పట్టక పోవడం-- నివారణ 17-7-10.
ప్రశాంత ముద్ర:-- సుఖాసనంలో బొటనవ్రేలు, చూపుడు వ్రేలు యొక్క కొసలను మాత్రం కలుపుతూ కూర్చోవాలి
దీని వలన మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
1. జాజికాయను సాన రాయి మీద చాది ఆ గంధాన్ని కణతలకు పట్టు వేయాలి.
2. గసాలు దోరగా వేయించి గుడ్డలో కట్టి వాసన చూడాలి.
3. క్లిష్టమైన, కొంచం కష్టంగా వున్న పుస్తకాలను ఉదాహరణకు భగవద్గీత ను చదువుతూ అర్ధం చేసుకుంటూ చదవాలి.
నిద్రా రాహిత్యం --నివారణ 2-10-10.
దాల్చిన చెక్క పొడి --- అర టీ స్పూను
నీళ్ళు --- ఒక కప్పు
తేనె ---- ఒక టీ స్పూను
నీళ్ళలో పొడిని, తేనెను కలిపి భోంచేసిన తరువాత తాగితే సుఖ నిద్ర పడుతుంది.
దాల్చిన చెక్క పొడి --- అర టీ స్పూను
నీళ్ళు --- ఒక కప్పు
తేనె ---- ఒక టీ స్పూను
నీళ్ళలో పొడిని, తేనెను కలిపి భోంచేసిన తరువాత తాగితే సుఖ నిద్ర పడుతుంది.
కునికిపాట్లు -- నివారణ 17-12-10.
పసుపు
మిరియాలు
సైంధవ లవణం
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని కలిపి వుంచుకోవాలి.
ప్రతి రోజు ఒక టీ స్పూను పొడిని కమలాపండు రసంతో తీసుకుంటే సమస్య నివారింప బడుతుంది.
సుఖ నిద్ర 24-12-10.
రుణ విముక్తులు, వ్యాధి విముక్తులు, ఆహారాన్ని సావకాశంగా భుజించే వాళ్ళు,
ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేని వాళ్ళు సుఖంగా నిద్రిస్తారు.
3-3-11
జాపత్రి చూర్ణం --- అర టీ స్పూను
వేడి పాలు --- ఒక కప్పు
చక్కెర --- ఒక టీ స్పూను
ఎర్రగా కాచిన పాలల్లో చక్కెర, జాపత్రి పొడి ని కలుపుకుని తాగాలి
నిద్రకు సంబంధించిన నియమాలు 21-2-11.
తలను దక్షిణం వైపు, పాదాలను ఉత్తరం వైపు పెట్టి పడుకుంటే రోగాలు రావు.
పడుకునే ముందు రాగి చెంబులో 5 కృష్ణ తులసి ఆకులను వేసి రాగి పళ్ళెం మూత పెట్టి
చెంబును పీట మీద పెట్టాలి.
.తెల్లవారు జామున 4 -- 6 గంటల మధ్య కాలం మహా శక్తివంతమైనది.
నిద్ర లేచిన వెంటనే కాళ్ళు కింద పెట్ట కూడదు. రాత్రి రాగి చెంబులో పెట్టిన నీళ్ళు తాగాలి.
నీటిలో తులసి దళాలను వేస్తే మూడు ఉద్డరిణ ల నీళ్ళు తాగాలి. లేదా నీళ్ళు మాత్రమే
అయితే ఒక గ్లాసు నీళ్ళు తాగాలి.
తరువాత కాళ్ళు కిందపెట్టి కాలకృత్యాలను తీర్చుకోవాలి.
మధుమేహ వ్యాధి గ్రస్తులు రాత్రి ఒక జామ ఆకును నీటిలో వేసి ఉదయం నిద్రలేచినవెంటనే
ఆ నీటిని తాగి కాళ్ళు కిందపెట్టి మిగిలిన కార్యాలను కొనసాగించాలి.
మహిళలలో నిద్రలేమి 3-4-11.
ముఖ్యమైన కారణం ఒత్తిడి. నెలరోజులకు మించి నిద్ర రాకుంటే దానిని సమస్యగా గుర్తించాలి.
శారీరక రుగ్మతలు, కీళ్ళనొప్పులు మొదలైన కారణాల వలన కూడా నిద్ర పట్టకపోవచ్చు,
సుషుప్తి చూర్ణం
జాజికాయ పొడి --- ఒక గ్రాము
కుంకుమ పువ్వు --- నాలుగు రేకులు
అతిమధురం --- ఒక గ్రాము ( చిటికెడు)
జాపత్రి చూర్ణం --- ఒక గ్రాము
గసాల చూర్ణం --- ఒక గ్రాము
పటికబెల్లం --- ఒక టీ స్పూను
పాలు --- ఒక కప్పు
ఒక కప్పు గోరువెచ్చని పాలకు పై చూర్ణాలను అన్నింటిని కలిపి, పటికబెల్లం పొడి కలిపి
తాగాలి.
దీనిని ఎప్పటికప్పుడు తయారు చేసుకుని నిద్రించడానికి ఒకటి, రెండు గంటల ముందు
తాగాలి.
దీని వలన సుఖమైన, గాఢమైన, సహజమైన నిద్ర వస్తుంది.
నిద్ర చెడిపోవడానికి ఎండలు ఒక ముఖ్య కారణం.
నేలమీద, చాప మీద పడుకుంటే ఎముకలు ఒత్తుకుని నిద్రరాదు. కాబట్టి మెత్తటి పడక,
పలుచని దిండును వాడాలి. గది చల్లగా వుండాలి.
నిద్రలేమి --- నివారణ 8-7-11.
1. జాజికాయ గంధాన్ని కణతల కు పట్టిస్తే బాగా నిద్ర పడుతుంది
2. అశ్వగంధ చూర్ణాన్ని పాలలో కలుపుకొని నిద్రించే ముందు తాగితే నిద్ర పడుతుంది

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి