చిన్న పిల్లలలో కామెర్లు ప్రాధమిక స్థాయిలో వుంటే 19-1-11.
దాల్చిన చెక్క, లవంగాలు, రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని విడివిడిగా దంచి జల్లించి
కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
రెండు చిటికెల పొడిని ప్రతి రోజు వాడాలి.
దాల్చిన చెక్క, లవంగాలు, రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని విడివిడిగా దంచి జల్లించి
కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
రెండు చిటికెల పొడిని ప్రతి రోజు వాడాలి.
తలలో పేల నివారణకు -- చిట్కా 19-1-11.
పటికను పొంగించి నీటిలో కలిపి తలకు పట్టించి మూడు గంటల తరువాత తల స్నానం చెయ్యాలి
బాల అతిసార కషాయం 16-1-11.
లక్షణాలు :-- పిల్లలు నలతగా కనిపిస్తారు . బరువు తగ్గుతారు . ముఖ్య కారణం వైరల్ ఇన్ఫెక్షన్
కరక్కాయల చూర్ణం ---- 5 gr
సోంపు గింజల చూర్ణం ---- 1 gr
నీళ్ళు ---- రెండు కప్పులు
ఒక గిన్నెలో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి . దానిలో రెండు చూర్ణాలను కలపాలి . ఒక కప్పు
కషాయం వచ్చే వరకు మరిగించి వదపొసుకొవాలి. దానిని రెండు భాగాలు చేసి ఉదయం, సాయంత్రం తాగాలి .
పెద్ద పిల్లలకైతే తేనె కలిపి ఇవ్వవచ్చు . కాని కలకండ కలపకూడదు .
మూలికల ఉపయోగాలు :--- కరక్కాయ అపసవ్యంగా వున్నమల విసర్జనను సవ్యంగా అయ్యే విధంగా చేస్తుంది
ఇది సూక్ష్మ జీవ నాశని . సోంపు గ్యాస్ ని తగ్గిస్తుంది . జీర్ణశక్తిని పెంచుతుంది . నిర్జలీయత నుండి కాపాడుతుంది .
సూచనలు :--- పిల్లలు టాయిలెట్ కి వెళ్ళిన తరువాత శుభ్రత చాలా ముఖ్యం . వంట ఇంటిలోని వస్తువులు
శుభ్రంగా వుండాలి . పిల్లలకు మజ్జిగను బాగా అలవాటు చెయ్యాలి .
పిల్లలు , పెద్దలు పక్క తడపడం 5-7-11.
సూచనలు ;-- అతి చల్లని పదార్ధాలను , చల్లని గాలిని నివారించుకోవాలి . సూర్య నమస్కారాలు చేయాలి .
ఎండు కొబ్బరి
జొన్న పేలాలు
తేలక పిండి
పాత బెల్లం
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని మెత్తగా దంచి మాత్రలుగా చేయాలి ప్రతి రోజు ఉదయం , సాయంత్రం పిల్లలకు తినిపించడం వలన పక్కలు తడపడం నివారింప బడి బలము చేకూరుతుంది .
నాగకేసరాల చూర్ణం --- పావు టీ స్పూను
మజ్జిగ --- ఒక గ్లాసు
చూర్ణాన్ని మజ్జిగ లో కలుపుకొని తాగితే ఫలితం వుంటుంది .
చిన్న పిల్లలలో పళ్ళు ( దంతాలు ) వచ్చేటపుడు ఏర్పడే సమస్యలు 6-7-11.
ఈ సమయం లో పిల్లలలో చిరాకు , అటు ఇటు మసలడం వుంటుంది .
ఉసిరిక పొడి --- 10 gr
పిప్పళ్ళ పొడి --- 10 gr వేలును కొరకడం వలన
తేనె --- తగినంత
అన్నింటిని పేస్ట్ లాగా చేసి నిల్వ చేసుకొని అప్పుడప్పుడు చిగుళ్ళ మీద నెమ్మదిగా రుద్దాలి .
దీనివలన సమస్యలు నివారింపబడతాయి .
మన వేలును శుభ్రంగా కడిగి బిడ్డ నోట్లో ( పళ్ళ మధ్యలో ) పెట్టాలి .
వేలును కొరకడం వలన దురద , నొప్పి తగ్గుతాయి
చిన్న పిల్లలలో కాళ్ళ నొప్పులు 13-7-11.
అతిబల ఆకుల రసం --- ఒక గ్లాసు
నువ్వుల నూనె --- ఒక గ్లాసు
రెండింటిని కలిపి నూనె మాత్రమె మిగిలే వరకు కాచాలి . చల్లారిన తరువాత వడకట్టి సీసాలో భద్రపరచుకోవాలి .
పిల్లలకు స్నానం చేయించ డానికి ఒక గంట ముందు ఈ తైలాన్ని నెమ్మదిగా మర్దన చేయాలి
2. అతిబల వేర్ల పొడి
కలకండ పొడి
రెండింటిని సమాన భాగాలుగా తీసుకొని బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి
ప్రతి రోజు ఒక టీ స్పూను పొడిని యిచ్చి పాలు తాగించాలి లేదా పాలలో కలిపి తాగించవచ్చును
నీరసం పోగొట్టి పిల్లలనుదార శక్తి బొద్దుగా తయారు చేయడానికి ---శక్తి ప్రదర 19-8-11. అంజీర పండ్లు
బాదం పప్పులు --- మూడు
అంజీర పండ్లు --- రెండు ( అత్తి పండ్లు )
ఖర్జూర పండ్లు --- రెండు
యాలకులు --- ఒక కాయ
పాలు --- ఒక గ్లాసు
అన్ని పదార్ధాలను వేసి ఒక గిన్నెలో వేసి మునిగేట్లు గా నీళ్ళు పోయాలి . ఉదయం బాదం పప్పులకు , యాలకులకు ,
తొక్క తీయాలి . ఖర్హూరానికి గింజలు తీయాలి . అన్నింటిని మిక్సీ లో వేసి మెత్తగా అయ్యే వరకు తిప్పి తరువాత పాలు
పోసి తిప్పాలి . తరువాత కప్పులో పోసి పిల్లల చేత తాగించాలి . ఈ విధంగా రోజుకు ఒకసారి గాని , రెండు సార్లు గాని
ఇవ్వాలి .
చిన్న పిల్లలలో అజీర్ణము , గ్యాస్ , మలబద్దకము , నులి పురుగులు , కడుపునొప్పి --- నివారణ 26-8-11.
వాయువిడంగాల చూర్ణము ---- 50 gr
శొంటి " ---- 50 gr
వాము " ---- 50 gr
సోంపు " ---- 25 gr
అన్ని చూర్ణాలను బాగా కలిపి నిల్వ చేసుకోవాలి .
ఒక టీ స్పూను పొడిని అరగ్లాసు నీళ్ళలో వేసి 2, 3 నిమిషాలు మరిగించి మూతపెట్టి 5 నిమిషాలు ఉంచాలి . తరువాత
వడపోసి తాగించాలి .
4 నెలల పసిపిల్లల నుండి 10 సంవత్సరాల పిల్లల వరకు వాడవచ్చు .
4 నెలల నుండి ఒక సంవత్సరము లోపలి పిల్లలకు అర టీ స్పూను పొడిని వాడాలి
పాల ఉబ్బసము ---- నివారణ 30-8-11.
నేల ములక లేదా వాకుడు లేదా ముళ్ళ వంకాయ మొక్క యొక్క వేర్లను కడిగి నీడలో ఆరబెట్టాలి . దంచి చూర్ణం
చేసి నిల్వ చేసుకోవాలి .
చిటికెడు పొడిని పిల్లలకు ఇస్తే పాల ఉబ్బసం నివారింపబడుతుంది .
చిన్న పిల్లలలో అతి పడిశము మరియు జలుబు 3-9-11.
ఈ సమస్య వేసవి కాలంలో , వర్షా కాలంలో కూడా బాధిస్తుంది .
ఊపిరి ఆడకుండా జలుబుతో బాధ పడుతూ వుంటే చిన్న పిల్లలకు రెండు చుక్కలు , పెద్దవాళ్ళకు నాలుగైదు
చుక్కలు గోరువెచ్చని నువ్వుల నూనెను ముక్కులో వేయాలి .
ఆవ నూనెను వేడి దానిలో కర్పూరం బిళ్ళను వేసి కరిగించి దానితో చాతీ మీద , పొట్ట మీద , పక్కటెముకల మీద ,
వీపు మీద , రుద్దాలి .
-
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి