దంత సమస్యలు ---నివారణ చర్యలు
1. (15-12-08.)
వ్యాయామం ;--------పై పళ్ళను ,కిది పళ్ళను కొద్దిగా గట్టిగా నొక్కాలి. కొద్దిగా రాపిడి కలిగించాలి (శబ్దం రావాలి).
రెండు పలు వరుసలను బిగించి గాలిని బయటకు వదలాలి. (శబ్దం రావాలి).
బుగ్గలను బాగా పూరించాలి(ఉబ్బించాలి).
నాలుకను నిలువుగా మడిచి గట్టిగా గాలిని పీల్చి, బుగ్గలను పూరించి గాలిని వదలాలి.క్రింది దవడను పక్కలకు ఆడించాలి. గుండ్రంగా కూడా రెండు వైపులా తిప్పాలి. మూతి మొత్తము అన్ని వైపులా తిరిగెట్లు చెయ్యాలి.తరువాత దంత దండూషము (పుక్కిలింత) చెయ్యాలి.
దంతాలను కాపాడడం కొరకు పాలు,వెన్న, నెయ్యి ప్రతి రోజు ఆహారంలో ఉండాలి. పులుపుగా ఉన్న పండ్లు, బత్తాయి, నారింజ,ఉసిరి మొదలగునవి, పచ్చి పెసలు, శనగలు అవకాశం ఉన్నప్పుడల్లా తీసుకోవాలి. బంగాళ దుంపలు వాడితే చాలా మంచిది.

అతి చల్లని, అతి వేడి పదార్ధాలు మాటిమాటికి దంతాలకు తగల రాదు.
దంత ధావన చూర్ణము
తెల్ల సుద్ద (నాము) జల్లించిన పొడి ------ 50gr
చిన్న యాలకుల గింజల పొడి ------ 50gr
ఉప్పు ----- 30gr
B.P.ఉన్నవాళ్ళు ఉప్పు కి బదులుగా సైంధవ లవణం వాడాలి.
ఈ మూడింటిని కలిపితే బ్రంహాండమైన దంత ధావన చూర్ణం తయారవుతుంది. ఈ పొడిని దంత సమస్యలున్న వాళ్ళు బ్రష్ తో గాని,వేలితో గాని రుద్ది(ఉదయం+సాయంత్రం) రుద్ది, వెంటనే కడగకుండా అర గంట ఆగి గోరు వెచ్చని నీటితో కడగాలి. ఉప్పు ఎక్కువనిపిస్తే సుద్ద ఎక్కువ కలుపుకోవచ్చు.
దీని వలన గార తగ్గుతుంది. కదిలే దంతాలు గట్టి పడతాయి.
బ్రష్ తో ఎక్కువ సేపు తోమరాదు. పళ్ళ యొక్క వాలును బట్టి ఐదు ,ఐదు సార్ల లెక్కన అన్ని వైపులకు తోమాలి. (మెత్తని బ్రష్ తో మృదువుగా తోమాలి).
పిల్లలకు ఎక్కువగా చాక్లెట్లు తినిపించరాదు. వాళ్ళు తిన్న తరువాత సరిగా కడుక్కొక పోవడం వలన దంతాలు దెబ్బ తింటాయి.
ఇది చెప్పిన వారు Dr .అజిత్ మెహతా గారు., గొప్ప ఆయుర్వేద ప్రజా సేవకులు.
పుచ్చిన, చీము ,నెత్తురు కారుతున్న దంతాలకు
సైంధవ లవణం పావు టీ స్పూను పొడి అర చేతిలో వేసుకొని ఆవాలనూనే ఒకటి లేక
రెండు చుక్కలు మాత్రమే కలిపి తోమితే పగిలిన,పూచిన,నెత్తురు కారుతున్న అన్ని దంత భాగాలకు మెత్తగా పూసి ,మెత్తగా తోమాలి. అరగంట అలా వదిలెయ్యాలి. నోట్లో ఊరే నీటిని ఉమ్మేయ్యాలి.
తరువాత్ వేడి నీటితో కడుక్కోవాలి. అద్భుతమైన మార్పు వస్తుంది.
తరువాత్ వేడి నీటితో కడుక్కోవాలి. అద్భుతమైన మార్పు వస్తుంది.
దంత ధావన చూర్ణం ---అగ్నివేశ దంత చూర్ణము 20-12-08.
ఉత్తరేణి గింజల చూర్ణం ------100 gr
పటిక పొడి -----10 gr
రాళ్ళ ఉప్పు పొడి -----10 gr
ముద్ద కర్పూరం -----1 లేక 2gr
పటిక పొడిని చిన్న మంట మీద వేడి చేసి పొంగించాలి.
ఉత్తరేణి గింజల పొడిలోఉప్పుపొడి,పొంగించిన పటిక పొడి కలిపి జల్లించాలి. ఇదే అగ్నివేశ చూర్ణము. దీనిలో కొద్దిగా కర్పూరం కలుపుకొని సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఈ పొడితో రెండు పూటలా బ్రష్ తో గాని , వేలితో గాని దంత ధావనం చేసుకోవాలి. పావు గంట అలాగే ఉంచి వేడి నీటితో కడుక్కోవాలి.
ప్రయోజనాలు:--- సిగరెట్లు తాగే వాళ్లకు, గుట్కాలు, పొగాకు నమిలే వాళ్లకు దంతాలకు పట్టిన గారను పోగొడుతుంది. పళ్ళపై ఏర్పడిన గీతలను, పచ్చరంగును పోగొడుతుంది. తెల్లగా మెరిసేటట్లు చేస్తుంది. .
పిప్పి పళ్ళ సమస్యలు -----నివారణ 23-12-08.
అతి తీపి పదార్ధాలను చిన్న పిల్లలకు పెట్టరాదు. దీని వలన దంత నిర్మాణం దెబ్బ తింటుంది. అశ్రద్ధ చేస్తే పురుగులు చేరి,పుచ్చి దంత మూలాలు దెబ్బ తింటాయి.
నువ్వుల నూనెను పుక్కిలించాలి. లేదా వేపచేక్కను 24 గంటలు నానబెట్టి ఆ నీటిని కాచి సగానికి రానిచ్చి ,దించి ఆ నీటితో పుక్కిలిస్తే అన్ని దంతాలు శుభ్రపడతాయి. లేక ఉత్తరేణి పుల్లతో తోముకుంటే మంచిది.
పళ్ళ లో వున్న పురుగులను బయటకు రప్పించడానికి
పమిడి(పైడి) పత్తి గింజలు 50 లేదా 100 గ్రాములు తీసుకోవాలి. మట్టి మూకుడును
కడిగి ,ఆరబెట్టి, పొయ్యి మీద పెట్టి పత్తి గింజలను నల్లగా మాడేవరకు వేయించాలి. దంచి, జల్లించి సీసాలో భద్రపరచుకోవాలి. ఈ పొడితో పళ్ళు తోముకుంటే పళ్లలో పురుగులు వుంటే రాలి పోతాయి. ఈ పొడితో నెలకొకసారి తోముకుంటే చాలు.

పన్ను పుచ్చి కుడివైపు నొప్పిగా వుంటే ఎడమ చెవిలో 4,5 చుక్కల ఉత్తరేణి ఆకు రసం పొయ్యాలి. అదే విధంగా రెండవ వైపు.
భోజనం చేసిన ప్రతిసారి 10,12 సార్లు పుక్కిలించాలి.
దంత సౌందర్యము ---జామ ఆకులతో 14-3-09.
1 గ్లాసు నీటిలో జామ ఆకులు వేసి కాచి పుక్కిలిస్తే చిగుళ్ళలో చీము కారడం, పళ్ళు కదలడం అనే సమస్యలు నివారింప బడతాయి.
దంత రక్షణ తైలం 23-3=09.
తుమ్మ చెట్టు బెరడు -------500 gr
మర్రి చెట్టు ఊడల కొసలు ----- 50 gr
మంజిస్టే --------50 gr
లవంగాలు --------50 gr
అతిమధురం - -------50 gr
తుంగ గడ్డలు --------50 gr
బిర్యాని ఆకు ---------50 gr
లక్క ---------50 gr
జాజి కాయలు ---------50 gr
యాలకులు ---------50 gr
ఉసిరి బెరడు ---------50 gr
నీళ్ళు ---------4 లీటర్లు
నువ్వుల నూనె --------1/2 kg.
ముద్ద కర్పూరం ---------10gr
లక్క విరిగిన ఎముకలు అతుక్కోవడానికి, పళ్ళు గట్టి పడడానికి ఉపయోగ పడుతుంది.
అన్నింటిని వక్కలు ముక్కలుగా దంచాలి;
అన్నింటిని ఒక గిన్నెలో వేసి , నీళ్ళు పోసి ఒక రాత్రంతా గాని ,లేదా 24 గంటలు గాని నానబెట్టాలి. తరువాత స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద ఒక లీటరు కషాయం మిగిలే వరకు కాచాలి. స్టవ్ ఆపి వడకట్టాలి
ఆ కషాయంలో నువ్వుల నూనెను కలిపి స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలేట్లు కాచాలి. నిదానంగా వడకట్టి, వేడి తగ్గినతరువాత కొద్దిగా ముద్ద కర్పూరం కలపాలి.
ఒక స్పూను నూనెను నోట్లో పోసుకొని కొంత సేపు వుంచి ,ఒక వైపు కొంతసేపు, మరొక వైపు ఇంకొంతసేపు, పైకి, కిందికి,పోనిస్తూ పుక్కిలించాలి.
దీనిని వాడడం వలన పళ్ళు కదలడం, చిగుళ్ళు వాయడం, దంత సమస్యలు, నోటిపగుల్లు, నోటిపూత నోటి దుర్వాసన మొదలిన అనేక సమస్యలు చాలా బాగా నివారింప బడతాయి'.
దంత పరిరక్షణ ఔషధం 17-5-09.
ముద్దకర్పూరం -----20gr
పోకలు -----20gr (కాల్చిన పోక చెక్కల బూడిద)
దాల్చిన చెక్క పొడి -----20gr
లవంగాల పొడి -----20gr
దో.వే దం శొంటి పొడి ----20gr
" " " మిరియాలపొడి ---20gr
సుద్ద పొడి -----120gr
అన్ని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి. దీనితో ఉదయం, సాయంత్రం దంత ధావనం చేయడం వలన పిప్పిపళ్ళు, నోటి దుర్వాసన ,చిగుళ్ళ సమస్యలు నివారించవచ్చు,
వ్యాయామం :--
. నోరు తెరవడం, మూయడం,
పళ్ళను గట్టిగా నొక్కడం,వదలడం.
పళ్ళు గట్టిగా మూసి గాలిని వేగముగా బయటకు పంపించడం.
దీని వలన పిప్పిపళ్ళు,నోటి దుర్వాసన, చిగుళ్ళ సమస్యలు నివారింప బడతాయి.
దంత సమస్యల నివారణ 26-2-10.
నువ్వుల నూనెను నోట్లో పోస్తుకొని బాగా పుక్కిలించాలి. లేదా ఉదయాన్నే నువ్వులను బాగా పిప్పి లా అయ్యే వరకు నమిలి ఒక గ్లాసు నీళ్ళు తాగాలి.
మొదట ముందు పళ్ళను గట్టిగా నొక్కి పెట్టి తరువాత వదలాలి. తరువాత దవడ పళ్ళను నొక్కాలి.
చూపుడు వేలితో లోపలి చిగుళ్ళను నొక్కాలి. నాలుకతో పళ్ళ లోపలివైపు నొక్కుతూ వుండాలి.
1. పన్ను నొప్పి వచ్చినపుడు రెండు తులసి ఆకులను మెత్తగా నూరి పంటి మీద పెట్టాలి. నొప్పి తగ్గి నిద్ర పడుతుంది.
2. తులసి ఆకుల రసంలో దూది ముంచి పిప్పి పన్ను మీద పెట్టి పై పంటితో నొక్కాలి. నొప్పి తగ్గుతుంది.
జాజి ఆకులు ----3
అన్నింటిని కలిపి నూరి పంటి మీద పెడితే పంటి లోని చీము, నొప్పి తగ్గుతాయి.
తులసి దంతమంజన్
తులసి ఆకుల పొడి ----- 100 gr
ఉత్తరేణి గింజల పొడి ----- 25 gr
ఉత్తరేణి వేర్ల పొడి ----- 25 gr
దో. వే. మిరియాల పొడి ----- 10 gr
" " లవంగాల పొడి ----- 10 gr
చిన్న ఏలకుల పొడి ----- 10 gr
సైంధవ లవణం ----- 10 gr
పొంగించిన పటిక పొడి ----- 10 gr
అన్నింటిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.

3. తులసి ఆకులు ---- 6
ఉప్పు జాజి ఆకులు ----3
అన్నింటిని కలిపి నూరి పంటి మీద పెడితే పంటి లోని చీము, నొప్పి తగ్గుతాయి.
తులసి దంతమంజన్
తులసి ఆకుల పొడి ----- 100 gr
ఉత్తరేణి గింజల పొడి ----- 25 gr
ఉత్తరేణి వేర్ల పొడి ----- 25 gr
దో. వే. మిరియాల పొడి ----- 10 gr
" " లవంగాల పొడి ----- 10 gr
చిన్న ఏలకుల పొడి ----- 10 gr
సైంధవ లవణం ----- 10 gr
పొంగించిన పటిక పొడి ----- 10 gr
అన్నింటిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.
పిప్పి పన్ను -- నివారణ 7-7-10.
మునగ బంకను మెత్తగా నీటితో నూరి పిప్పి పన్ను పై పెడితే చాల త్వరగా నయమవుతుంది.
దంత సమస్యలకు --- దంత మంజన్ 9-7-10.
పొంగించిన పటిక పొడి --------20 gr
నల్ల ఉప్పు --------20 gr
దో.వే. దం. జ. మిరియాల పొడి --------20 gr
చిన్న కరక్కాయల పొడి --------20 gr
అన్నింటిని కలిపి, సీసాలో భద్ర పరచాలి. దీనితో పళ్ళు తోమితే పళ్ళ లోని క్రిములు నాశనమవుతాయి.
పంటి నొప్పి 7-12-10.
సీతాఫలం ఆకులను దంచి ముద్దగా నూరి పుచ్చిన పంటి మీద ఉంచాలి. దీంతో నొప్పి ,Infection తగ్గుతాయి
దంత ధావన చూర్ణం 12-12-10..
ఉసిరిక కాయ
కరక్కాయ
తాని కాయ
మాచి కాయ
లవంగాలు
పిప్పళ్ళు
మిరియాలు
యాలకులు
దాల్చిన చెక్క
జాజి కాయపొడి
శొంటి పొడి
ముద్ద కర్పూరం
వరిపొట్టు ఊక
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని, దంచి, జల్లించి సీసాలో భద్ర పరచాలి. వేలితో తోమాలి. నోటి సమస్యలు ,దంత సమస్యలు,గొంతు సమస్యలు నివారింప బడతాయి. పళ్ళ మీద ఏర్పడే మరకలు తొలగించ బడతాయి.
అన్ని పదార్ధాలను ఒక్కొక్క స్పూను లెక్కన తీసుకోవాలి వరిపొట్టు ఊకను మాత్రం 12 స్పూన్లు తీసుకోవాలి.
దంత సమస్యలు ---నివారణ 25-5-10.
సైంధవ లవణం --- పావు టీ స్పూను
ఆవాల నూనె --- 1, 2 చుక్కలు
రెండింటిని కలిపి పేస్ట్ లాగా చేసి దానితో పళ్ళు తోముకోవాలి. చిగుళ్ళు, దవడలపై రుద్దాలి. అర గంట సేపు అలాగే వుంచి తరువాత కడగాలి. చిగుళ్ళలో నొప్పి, పళ్ళు లాగుతూ వుండడం నివారింప బడుతుంది. క్రిములు నశించి పోతాయి.
దంత సమస్యలు 1-6-10.
సూర్యోదయానికి పూర్వమే దంత ధావనం చెయ్యాలి.
వేప, చండ్ర, మద్ది యొక్క (కాష్టం) పుల్లల లో ఏదో ఒక దానితో తోముకోవాలి. దీని వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పుల్లను చీల్చి నాలుక గీసుకోవాలి.
చిగుళ్ళు ఎంత గట్టిగా ఉంటె దంతాలు అంత గట్టిగా ఉంటాయి. పుల్లతో చిగుళ్ళ మీద కూడా తోమితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది., జీర్ణక్రియ పెరుగుతుంది. వేప, మద్ది, ఉత్తరేణి యొక్క రసాలు Antibiotic గా పని చేస్తాయి. రక్త శుద్ధి జరుగుతుంది.
దంత ధావన చూర్ణం 08-1210.
స్వర్ణ గైరికము ------------100gr
పొంగించిన పటిక ------------ 50gr
కరక్కాయలు ----------- 50gr
చిల్ల గింజలు ----------- 50gr
జిలకర ----------- 20gr
( చిల్ల గింజలను నీటిలో నానబెట్టి తీసి ఎండబెట్టి , ముక్కలుగా పగుల గొట్టాలి. మల్లి నానబెట్టి ,ఎండబెట్టి,ముక్కలు చెయ్యాలి '. ఈ విధంగా నాలుగు సార్లు చేసి పొడి చేయ్యాలి. )
అన్నింటిని చూర్నాలుగా చేసి, కలిపి నిల్వ చేసుకోవాలి.
ఈ పొడితో దంత ధావనం చేసుకుంటే దంత సమస్యలు నివారిమ్పబడతాయి.
పంటి నొప్పి నివారణకు చిట్కా 30-12-10.
బొటన వెలికి , చూపుడు వెలికి మధ్య గల V ఆకారం మీద Ice Cube పెట్టి ఒత్తిడి కలిగించాలి. (Press చెయ్యాలి ). వెంటనే పంటినొప్పి తగ్గుతుంది.
దంత కాంతి చూర్ణం 1-1-11.
త్రిఫల చూర్ణం ------------50gr
వేపాకు పొడి ------------50gr
పసుపు పొడి ------------50gr
కాచు పొడి ------------30gr
సైంధవ లవణం ------------20gr
అన్నింటిని జల్లించి కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా నెలకొకసారి తయారు చేసుకోవాలి. దీనిని పళ్ళు తోముకోవడానికి వాడాలి. చిటికెడు పొడి తీసుకొని దంతాలమీద చిగుళ్ళ మీద రుద్దాలి. కొంత సేపు అలాగే ఉంచాలి. రోజుకు రెండు సార్లు తోముకోవాలి.
పిప్పి పంటి నొప్పికి నివారణ --చిట్కా 4-1-11.
ప్రతి రోజు ఆపిల్ పండును కొరికి తింటూ ఉంటె పిప్పి పంటి నొప్పి, చిగుళ్ళ నుండి రక్తం కారడం తగ్గుతాయి.
దంత శూల ---నివారణ 12-1-11.
పంటిలో చీము తయారవడం వలన నొప్పి వస్తుంది. పన్ను పగుళ్ళిచ్చినపుడు బాక్టీరియా చేరుతుంది.
అతి చల్లని, అతి వేడి పదార్ధాలు తినడం వలన చిగుళ్ళు వాచీ నొప్పులు వస్తాయి. నోటిని
పరిశుభ్ర పరచుకోక పోవడం వలన దంత శూల వస్తుంది.
పరిశుభ్ర పరచుకోక పోవడం వలన దంత శూల వస్తుంది.
జాగ్రత్తలు:-- రోజుకు రెండు సార్లు దంత ధావనం చెయ్యాలి.ఆహారం తిన్న తరువాత బాగా పుక్కిలించాలి.
లవంగ నూనె దీనికి చాలా గొప్ప మందు. పుల్లకు దూదిని చుట్టి ,నూనెలో ముంచి ప్రతి 6 గంటల కొకసారి నొప్పి ఉన్న చోట పెట్టాలి.
గోరు వెచ్చని నీటికి ఉప్పు కలిపి పుక్కిలించాలి. దీని వలన వాపు, చీము తగ్గుతాయి. రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది.
1,2 వెల్లుల్లి గర్భాలను ఉప్పు కలిపి నూరిముద్దగా చేసి నొప్పి ఉన్న చోట పెట్టాలి.
ఉల్లి రసాన్ని గాని ,ముద్దను గాని పంటి మీద పెట్టాలి.
Tooth Brush ను ప్రతి 3,4 నెలలకు ఒకసారి తప్పని సరిగా మార్చాలి.
దంత వ్యాధులు ---నివారణ 26-1-11.
ఆవాల పొడి -----------50gr
రాళ్ళ ఉప్పు పొడి -------50gr
రెండు కలిపి పళ్ళు తోముకుంటే పళ్ళ మీది జిడ్డు , పాచి పోతాయి , Infection చేరదు.
పన్ను నొప్పి -----నివారణ 31-1-11.
దోరగా వేయించిన లవంగాల పొడి -------అర టీ స్పూను .
ఈ పొడిని దూదితో అద్ది పంటి మీద పెట్టాలి .దూదిని మొదట కొద్దిగా నీటితో తడిపి, పొడిని అద్ది పంటి మీద పెట్టి పై పంటి తో నొక్కాలి. దీనితో పంటి నొప్పి , చిగుళ్ల వాపు తగ్గుతాయి.
పళ్ళ మీద గార పట్టడం 10-3-11.
ప్రధానంగా అజీర్ణ సమస్య వలన పళ్ళ మీద గార ఏర్పడుతుంది. పాన్ ఎక్కువగా నమలడం .పాన్ నమిలి ఉమ్మేస్తారు, దీని వలన లాలాజలమంతా బయటకు పోయి అజీర్ణ సమస్య ఏర్పడుతుంది. .కొన్ని మేహ, ప్రమేహ వ్యాధుల వలన కూడా పళ్ళ మీద మచ్చలు ఏర్పడడం ప్రధమ లక్షణం . దవడల నొప్పి ,చిగుళ్ళ సమస్యలు, వాపు కూడా ఏర్పడతాయి.
ఏడాకుల పొన్న బెరడు ----------100 gr ( సప్తపర్ణి )
తుంగ ముస్థలు ----------100 gr
వట్టి వేర్లు ----------100 gr
అతిమధురం ----------100 gr
అన్నింటిని క్వాద చూర్నాలుగా చేసి , కలిపి భద్ర పరచుకోవాలి.
2 టీ స్పూన్ల పొడిని రెండు గ్లాసుల నీటిలో వేసి ఒక గ్లాసుకు రానిచ్చి ఆ నీటితో పుక్కిలించాలి. తరువాత
దంతధావన చూర్ణం తో దంతాలను శుభ్ర పరచుకోవాలి .
లక్క తో పళ్ళు తోమి అర గంట అలాగే ఉంచి తరువాత కడుక్కోవాలి. దీని వలన గార తగ్గి పళ్ళు శుభ్రపడతాయి.
పళ్ళ మీద మచ్చలు,గారలు-- నివారణ 16-4-11.
Chromogenic Food ( coffee ,tea , cola drinks etc.) తీసుకోవడం,పొగాకు ఉత్పత్తులు,కొన్ని మందులు (Tetracyclin) వాడడం,శరీరంలో మార్పులు ,వృద్ధాప్యం ,దంతాలకు దెబ్బ తగలడం ,కుల్లడం మొదలైనవి ముఖ్య కారణాలు.
బకుళాది దంత చూర్ణం
దానిమ్మ పండు పై బెరడు చూర్ణం
పొగడ చెట్టు బెరడు,పూల చూర్ణం
లొద్దుగ చెక్క చూర్ణం
నల్ల ఉప్పు
అన్ని చూర్ణాలను ఒక్కొక్క టీ స్పూను చొప్పున తీసుకోవాలి. .
అన్ని చూర్ణాలను ఒక్కొక్క టీ స్పూను చొప్పున తీసుకోవాలి. .
అన్నింటిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ చూర్ణం తో ప్రతి రోజు రెండు పూటలా పళ్ళు తోముకోవాలి. దీనితో సమస్యలన్నీ నివారింప బడతాయి. పళ్ళు కదలవు,జివ్వుమనవు
ఆహారం తిన్న ప్రతిసారి ఈ పొడి కలిపినా నీటితో పుక్కిట పడితే సమస్యలే రావు.
దంత ధావన చూర్ణము 19-4-11.
వేప, మామిడి, నేరేడు, ఉత్తరేణి, మారేడు, తుమ్మ, రావి, మఱ్ఱి , జువ్వి మొదలైన చెట్ల బెరడులను తెచ్చి ,ఎండబెట్టి,దంచి పొడిచేసి, 10 గ్రాముల ఉప్పు కలిపి నిల్వ చేసుకోవాలి. ఇది అన్ని రకాల పంటి సమస్యలను నివారిస్తుంది.
పళ్ళు పసుపుగా మారి వుంటే 21-4-11.
పళ్ళు పసుపుగా మారి వుంటే నిమ్మ తొక్కల పొడిలో సైంధవ లవణం కలుపుకొని పళ్ళు తోమాలి.
దంతాలు బలంగా ఉండాలంటే 29-4-11.
ప్రతి రోజు 25 గ్రాముల నల్ల నువ్వులను నమిలి తినాలి. లేదా నమిలి ఉమ్మేసినా దంతాలు బలంగా తయారవుతాయి.
దంత సౌభాగ్య కల్పం 5-7-11.
ప్రవాళ భస్మం -------------- 5 gr
ముక్తా పిష్తి -------------- 5 gr
శంఖ భస్మం -------------- 5 gr
అన్నింటిని కలిపి భద్ర పరచాలి.
దీనిని పూటకు 500mg చొప్పున పావు కప్పు నీటిలో గాని \పావు కప్పు పాలలో గాని కలుపుకొని తాగాలి.
దీనిని పూటకు 500mg చొప్పున పావు కప్పు నీటిలో గాని \పావు కప్పు పాలలో గాని కలుపుకొని తాగాలి.
పుల్లటి పదార్ధాలు తాగాలంటే ఆహారం తినేటపుడు మధ్యలో తీసుకోవాలి. పుల్లటి పదార్ధాలు తిన్న తరువాత నోరు బాగా పుక్కిలించాలి. దీని వలన ఎనామిల్
దెబ్బ తినకుండా ఉంటుంది.
దెబ్బ తినకుండా ఉంటుంది.
దంత సమస్యలు---నివారణ 13-7 -11
చండ్ర చెక్క నీళ్ళలో వేసి కషాయం కాచి ప్రతి రోజు పుక్కిలిస్తూ ఉంటె పళ్ళు గట్టి పడతాయి .
నేరేడు పుల్లతో పళ్ళు తోముకోవాలి .
నేరేడు పుల్లతో పళ్ళు తోముకోవాలి .
నేరేడు ఆకు ఎండ బెట్టి దంచిన పొడి --- 100 gr
ఉప్పు --- 10 gr.
కలిపి పళ్ళు తోముకోవాలి. వెంటనే కదగకుండా 10,15 నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో కడగాలి.
దంతాల మీద గారలు ---నివారణ 26-7-11.
కారణాలు:-- తమలపాకులను ,వక్కలను ఎక్కువగా నమలడం ,కెఫీన్ ఎక్కువగా ఉన్న పదార్ధాలను, పాన్ లను
ఎక్కువగా వాడడం ,ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న నీటిని తాగడం ,కొన్ని రకాల పేస్టు ల వాడకం మొదలైనవి.
వంట సోడా ----------- అర టీ స్పూన్
ఉప్పు ----------- అర టీ స్పూన్
నీళ్ళు ----------- తగినన్ని
ఒక గిన్నెలో సోడా ఉప్పు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు కలిపి పేస్టు లాగా చేసి దీనితో పళ్ళు తోముకోవాలి.
నిమ్మ తొక్కల చూర్ణం ----------- ఒక టీ స్పూను
కమలా పండ్ల తొక్కల చూర్ణం --------- ఒక టీ స్పూను
తాజా కమలా తొక్కలు
ఒక గిన్నెలో రెండు చూర్నాలను కలపాలి. దీనితో పళ్ళు తోముకోవాలి. తాజా తొక్క యొక్క తెలుపు భాగం తో పళ్ళు రుద్దుకోవాలి.
నిమ్మ రసం ----ఒక టీ స్పూను
ఉప్పు ----ఒక టీ స్పూను
రెండు కలిపి పళ్ళు తోముకోవాలి.
పంటి నొప్పి ---నివారణ చిట్కా 24-8-11.
జామ ఆకును తుంచి నీటిలో వేసి, కొద్దిగా వాము, పసుపు వేసి కాచి వడపోసి ,గోరు వెచ్చగా నోట్లో పోసుకొని పుక్కిట పట్టి, కాసేపు వుంచి, ఉమ్మేయ్యాలి. ఈ విధం గా చెయ్యడం వలన పంటి నొప్పి నివారింప బడుతుంది.
పిప్పి పంటి నొప్పి నివారణకు మాత్రలు
వెంపలి చెట్ల వేర్ల పొడి ----------20 gr
పిప్పళ్ల పొడి ----------20 gr
రెండింటిని కల్వం లో వేసి తగినంత నీరు కలిపి పెసర బద్దంత మాత్రలు కట్టి ఆర బెట్టి నిల్వ చేసుకోవాలి.
దీనిని పిప్పి పంటిలో పెడితే నొప్పి నివారింప బడుతుంది.
చిగుళ్ళనొప్పి ఉంటె మాత్రను పొడి చేసి దానితో రుద్దాలి.
దంత సమస్యల నివారకు --దంతమంజన్ 9-7-10.
పటిక బాణలిలో వేసి వేడి చేస్తే పొంగుతుంది . దీనిని గీకి తీయాలి.
పటికపొడి ---20 gr
నల్ల ఉప్పు --- 20 gr
చిన్న కరక్కాయల పొడి ---- 20 gr
మిరియాల పొడి ---- 20 gr
కరక్కాయలను, మిరియాలను దోరగా వేయించి దంచి పొడి చెయ్యాలి.
అన్నింటిని బాగా కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
ఈ చూర్ణంతో పళ్ళు తోముకుంటే పళ్ళలోని క్రిములు నాశనమవుతాయి.
చిట్కా
పిప్పింటాకును దంచి ఆ ముద్దను పంటి మీద పెడితే క్రిములు చనిపోయి నొప్పి నివారింప బడుతుంది.
30-11-10
పిప్పింటాకును దంచి ఆ ముద్దను పంటి మీద పెడితే క్రిములు చనిపోయి నొప్పి నివారింప బడుతుంది.
30-11-10
వక్కలను మెత్తగా పొడి చేసి దానితో పళ్ళు తోముకుంటే ఇన్ఫెక్షన్ తగ్గి నొప్పి తగ్గుతుంది.
పంటి నొప్పి -- నివారణ 7-12-10.
శీతా ఫలం ఆకులను మెత్తగా నూరి పూచిన పన్ను మీద ఉంచాలి. దీనితో ఇన్ఫెక్షన్ తగ్గి నొప్పి తగ్గుతుంది.
దంత సమస్యలు --- నివారణ 4-9-10. పంటి నొప్పి -- నివారణ 7-12-10.
శీతా ఫలం ఆకులను మెత్తగా నూరి పూచిన పన్ను మీద ఉంచాలి. దీనితో ఇన్ఫెక్షన్ తగ్గి నొప్పి తగ్గుతుంది.
ఆశ్యము = నోరు ఆశ్యకుహారము = నోటిద్వారము
జీర్ణ క్రియకు ఆశ్యము సింహద్వారము.
వేప
చండ్ర
మద్ది
ఉత్తరేణి
వీటి యొక్క పుల్లలతో దంతధావనం చేస్తే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. తెలియకుండానే రక్త శుద్ధి జరుగుతుంది.
పై వాటి యొక్క పుల్లలతో నాలుకను గీకితే (Tongue Cleaner) రుచి గ్రంధులు బాగా ఉత్తేజితమై రుచి బాగా తెలుస్తుంది.
చిగుళ్ళు బలంగా అవుతాయి.
దంత సమస్యలు-- పరిష్కార మార్గాలు 21-9-10.
వాత, పిత్త ప్రకోపాల సమస్యలు ఏర్పడినపుడు, పళ్ళ మధ్య మలిన పదార్ధాలు చేరడం వలన దంత సమస్యలు ఏర్పడతాయి.
దాల్చిన చెక్క పొడి --- 20 gr
మిరియాల పొడి --- 20 gr
పసుపు పొడి --- 20 gr
లవంగాల పొడి --- 20 gr
సైంధవ లవణం పొడి --- 20 gr
పొంగించిన పటిక పొడి --- 20 gr
పటికను పొంగించే విధానం ;-- పటికను గిన్నెలో వేసి స్టవ్ మీద పెడితే పటిక పొంగుతుంది. పైనవచ్చే నురుగును తొలగించాలి. మిగిలిన దాన్ని చల్లార్చి పొడి చేసుకోవాలి.
అన్ని పొడులను కలిపి భద్ర పరచుకోవాలి.
ఉదయం ఆహారానికి ముందు, రాత్రి ఆహారం తరువాత ఈ పొడితో తోముకుంటే పళ్ళు చాలా గట్టిగా వుంటాయి.
వేప, కానుగ వంటి పుల్లలతో తోముకుంటే కూడా పళ్ళు గట్టిగా వుంటాయి.
ఆహార నియమాలంటూ ప్రత్యేకంగా ఏమి లేవు అతి చల్లని, అతి వేడి పదార్ధాలను తినకూడదు.
పిప్పి పన్ను సమస్య --నివారణ 14-10-10.
1. సుగంధ పాల ఆకుల పొడిని పిప్పి పంటిలో పెట్టాలి.
2.అతిమధురం పొడి ---- 100 gr
శొంటి పొడి ---- 100 gr
నువ్వుల నూనె ----100 gr
అన్నింటిని కలిపి దానికి నాలుగు రెట్లు ( ఒకటిన్నర లీటర్లు) నీళ్ళు పోసి కాచాలి. తైలం మాత్రమే మిగిలేట్లు
కాచాలి.
ఈ తైలాన్ని మూడు,నాలుగు చుక్కలు ముక్కులో వేసుకోవాలినాలుగు టీ స్పూన్ల నూనెను
నోట్లో పోసుకునిఅరగంట పాటు పుక్కిలించాలి. దీని వలన సమస్య నివారింప బడుతుంది.
3. వేప, ఉత్తరేణి, దేవదారు, జాజిమల్లె మొదలైన వాటి పుల్లలతో పళ్ళు తోముకుంటే పిప్పి పన్ను సమస్య నివారింప బాదడమే కాక సమస్య రాదు.
4. శొంటి
అతిమధురం
లవంగాలు
సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసుకుని పళ్ళు తోముకోవాలి.
5. దేవదారు చెక్క పొడి
తుంగ ముస్తల పొడి
గలిజేర్లు వేర్ల పొడి
నీలి ఆకు పొడి
అన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.
ఒక టీ స్పూను పొడిని చేతిలోకి తీసుకుని వేలితో పళ్ళు తోముకోవాలి. తగినంత తీసుకుని నీరు కలిపి
పిప్పి పంటి మీద పెడితే నొప్పి తగ్గుతుంది.
దంత శూల -- నివారణ 12-1-11.
పంటిలో చీము తయారవడం వలన నొప్పి వస్తుంది. పంటిలో పగుళ్ళు వున్నపుడు బాక్టీరియా చేరుతుంది.అతి చల్లని, అతి వేడి పదార్ధాలను తీసుకోవడం వలన చిగుళ్ళలో వాపు నొప్పి వస్తాయి. నోటిని బాగా శుభ్రంగా ఉంచుకోక పోవడం వలన పంటి నొప్పి వస్తుంది.
జాగ్రత్తలు :-- రోజుకుకు రెండు సార్లు దంత ధావనం చెయ్యాలి. రాత్రి భోజనం తరువాత నోటితో బాగా పుక్కిలించాలి.
1, దీని నివారణకు " లవంగానూనే చాలా ప్రశస్తమైనది " :-- పుల్లకు దూదిని చుట్టి ఈ నూనెలో ముంచి నొప్పివున్నచోట పెట్టాలి. ఈ విధంగా ఆరు గంటలకు ఒక సారి చేయాలి.
2. గోరువెచ్చని నీటికి ఉప్పు కలిపి పుక్కిలించాలి. దీని వలన వాపు, చీము తగ్గుతాయి. రక్తప్రసరణ పెరిగి నొప్పితగ్గుతుంది.
3. ఒకటి, రెండు వెల్లుల్లి గర్భాలను నలగగొట్టి ఉప్పు కలిపి ముద్దగా నూరి నొప్పి వున్నచోట పెట్టాలి.
4. ఉల్లి రసాన్ని గాని, నూరిన ముద్దను గాని నొప్పి వున్న.చోట పెట్టాలి.
5. టూత్ బ్రష్ ను ప్రతి మూడు, నాలుగు నెలలకొకసారి తప్పనిసరిగా మార్చాలి.
పళ్ళు గార పట్టడం ---నివారణ 10-3-11.
ప్రధానంగా అజీర్ణ సమస్య వలన పళ్ళ మీద గార ఏర్పడుతుంది. పాన్ నమలడం వలన కూడా ఈ సమస్య వస్తుంది పాన్ నమిలి ఉమ్మేస్తూ వుంటారు దీని వలన నోటిలోని లాలాజలం
అంతా బయటకు వెళ్లి అజీర్ణ సమస్య ఏర్పడుతుంది.
కొన్ని మేహ ప్రమేహ వ్యాధుల వలన కూడా పళ్ళ మీద మచ్చలు ఏర్పడడం ప్రధమ లక్షణం
దవడ నొప్పి, చిగుళ్ళ సమస్య కూడా వచ్చే అవకాశం కలదు.
ఏడాకుల పొన్న బెరడు పొడి ---- 100 gr ( సప్తపర్ణి )
తుంగ ముస్తల చూర్ణం ---- 100 gr
వట్టి వేర్ల చూర్ణం ---- 100 gr
అతిమధురం చూర్ణం ---- 100 gr
అన్నింటిని బరక చూర్ణాలుగా చేసి కలిపి భద్రపరచుకోవాలి.
రెండు టీ స్పూన్ల పొడిని రెండు గ్లాసుల నీటిలో వేసి మరిగించి ఒక గ్లాసు కషాయానికి రానివ్వాలి. దీనిని నోటిలో పోసుకుని పుక్కిలించాలి. తరువాత దంతధావన చూర్ణం తో తోముకోవాలి.
లక్కతో పళ్ళు తోమి అరగంట సేపు అలాగే వుంచి తరువాత కడగాలి. దీని వలన గార తగ్గి
పళ్ళు శుభ్ర పడతాయి.
కదిలే దంతాలుగట్టి పడడానికి 11-3-11.
పచ్చి వేరు శనగలకు ఉప్పు కలిపి తింటూ వుంటే పళ్ళు గట్టిపడతాయి.ఎనామిల్ రక్షింప
బడుతుంది.
దంతధావన చూర్ణం ( చిగుళ్ళ వాపు నివారణకు ) 24-3-11.
వంటసోడా --- 40 gr ( 4 టీ స్పూన్లు)
సముద్రపు ఉప్పు --- 10 gr ( 2 టీ స్పూన్లు )
దాల్చిన చెక్క పొడి --- 5 gr
యాలకుల పొడి --- 5 gr
జాపత్రి పొడి --- 5 gr
లవంగాల పొడి --- 5 gr
మాచికాయల పొడి --- 5 gr ( ఇది కాయ కాదు. పురుగులు తయారు చేసే పదార్ధం )
పటిక పొడి --- 10 gr
వంట సోడాను, ఉప్పు పొడిని కలిపి ఒక ప్లాస్టిక్ గిన్నెలో వేయాలి. దీనికి మిగిలిన పొడులను కలపాలి. అన్నింటిని బాగా కలిపి గాలి చొరబడని సీసాలో భద్రపరచాలి.
ఈ పొడిని ఉపయోగించి బ్రష్ తో పళ్ళ మీద, నాలుక మీద రుద్దాలి. కొంతసేపు అలాగే
కడుక్కోవాలి.
ప్రతి రెండు నెలలకు ఒక సారి మార్చాలి.
ఆహారంలో పుదీనా, సోంపు ఎక్కువగా వాడుకోవాలి.
ఉపయోగాలు :-- చిగుళ్ళ వాపు, రక్తం కారడం, చల్లటి పదార్ధాలు తిన్నపుడు జివ్వున లాగడం
వంటివి నివారింపబడతాయి. దంతాలు కదలడం, నోటిడుర్వాసన, లాలాజలం అతిగా ఊరడం
దంతాలు పాచి పట్టడం, ఎనామిల్ పాడవడం మొదలైన సమస్యలు నివారింపబడతాయి.
దంతధావన చూర్ణము 23-2-11.
కారం, వగరు, చేదు కలిగిన పళ్ళ పొడితో గాని లేదా పుల్లతో గాని దంతాలను తోమితే ఆరోగ్య
కరం.
దోరగా వేయించిన త్రికటు చూర్ణం --- 50 gr
సైంధవ లవణం --- 20 gr
సుద్ద లేక నాము పొడి --- 70 gr
అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
2. సైంధవ లవణం
ఉప్పు
కలిపి తోమాలి.
దంత మంజరి 26-3-11
నల్ల తుమ్మ చెట్టు బెరడు యొక్క మెత్తటి పొడి --- 100 gr
సైంధవ లవణం
ముద్దకర్పూరం --- 3 gr
కలిపి నిల్వ చేసుకోవాలి.
ఉపయోగాలు :-- పళ్ళు గట్టిపడతాయి. నరాల్లో శక్తి వస్తుంది. పుచ్చిన పళ్ళలో నొప్పి
నివారింపబడుతుంది. దీనిని పిప్పి పన్ను మీద పెట్టి నొక్కి కాసేపు అలాగే ఉంచాలి.
దంతసమస్యలు మరియు చిగుళ్ళ సమస్యలు ---నివారణ 8-6-11.
1. ఐదారు చుక్కల నువ్వుల నూనెలో దూదిని తడిపి చిగుళ్ళ మీద రుద్దితే నాలుగైదు రోజులలో
చిగుళ్ళ నుండి రక్తం కారడం ఆగిపోతుంది .
2. ఒక టీ స్పూను నువ్వుల నూనెను నోట్లో పోసుకొని పుక్కిట పట్టి వుంచాలి.దీని వలన లాలాజలము బాగా ఊరుతుంది .
3. రెండు ఉల్లి పాయలను మెత్తగా దంచి దానిలో టూత్ బ్రష్ ను ముంచి ఆ రసం తో రోజుకు రెండు
సార్లు పళ్ళు తోముకోవాలి .
4. ప్రతి రోజు త్రిఫల కషాయం తో గాని , ఉప్పు నీటితో గాని లేదా కనీసం మంచి నీటితో గాని
నోటిలో పుక్కిట పట్టి కొంతసేపు ఉంచాలి ,
5. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ వుండకూడదు .
6. నెలకొకసారి బ్రష్ ను మార్చాలి .
7. దంతాల మధ్య ఆహార పదార్ధాలు ఇరుక్కొని వుంటే పిన్నులు, పుల్లలు పెట్టి గుచ్చకూడదు
చిగుళ్ళ వాపు నివారణకు ---దంతచూర్ణము 9-6-11.
వంట సోడా --- 30 gr
సముద్ర లవణం --- 20 gr
రెండింటిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి. దీనినుండి చాలా కొద్దిగా తీసుకొని రెండుపూటలా
పళ్ళు తోముకోవాలి . వేలితో గాని లేదా చాలా మెత్తటి బ్రష్ తో గాని తోమాలి .
రంగు కలిసిన ద్రవ పదార్ధాలను నేరుగా నోటితో తాగకూడదు. స్ట్రా తో తాగాలి .
పిప్పి పన్ను ---నివారణ 11-6-11.
పంటి లోని రంధ్రాలు పైకి కనిపిస్తూ వుంటాయి. గట్ట్టిగా కోరికినపుడు నొప్పి ఎక్కువగా
వుంటుంది. లాగుతున్నట్లు వుండే నొప్పి వుంటుంది. పై పంటి తో కింది పంటిని నొక్కినపుడు
చీము వచ్చే అవకాశం వుంది.
1. పంటి యొక్క గుంటలో ఇంగువ పొడిని లోపలి చొప్పించాలి.
2. లవంగ నూనెను దూది లో వేసి పిప్పి పంటి మీద పెట్టి పై పంటితో నొక్కాలి.
3. చారెడు పత్తి గింజలను కాల్చి బూడిద చేయాలి. ఈ బూడిద తో పళ్ళు తోముకొని నీటిని పుక్కిట
పట్టాలి. లేదా త్రిఫల కషాయం తో కూడా పుక్కిట పట్టవచ్చు.
సూచనలు ;-- ఆహారం తరువాత బ్రష్ చేసుకోవాలి. నీటితో బాగా పుక్కిలించాలి. ఉప్పు నీటితో గాని
త్రిఫల కషాయం తో గాని పుక్కిట పట్టాలి.
దంతాలను దృఢముగా ఉంచే పళ్ళ పొడి 2-7-11.
దంతాలు పసుపు పచ్చగా మారడానికి గల కారణాలు :--
వయసు పైబడడం , కొన్ని రకాల ఆహార పదార్ధాల వలన కాఫీ , టీ , కూల్ డ్రింక్స్ ఎక్కువగా సేవించడం , ఫ్లోరైడ్ ఎక్కువగా వున్న పేస్ట్ లను వాడడం వలన దంతాలు పసుపుగా మారే అవకాశం ఎక్కువగా కలదు.
పటిక పొడి ---15 gr
కరక్కాయ పెచ్చుల పొడి ---15 gr
చలవ మిరియాల పొడి --- 15 gr
వసకోమ్ముల పొడి --- 15 gr
మాచికాయ పొడి --- 15 gr
వేప బెరడు పొడి --- 15 gr
వేప నూనె --- ఒక చుక్క
లవంగ నూనె --- ఒక చుక్క
ఒక గిన్నెలో అన్ని చూర్ణాలను మరియు నూనెలను వేసి బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి .
దీనితో చిగుళ్ళ మీద , దంతాల మీద , నాలుక మీద రుద్దాలి . దీని వలన అన్ని సమస్యలు నివారింపబదథాయి. ఇది
మంచి ఔషధం లాగా ఉపయోగ పడుతుంది .
సూచన :-- ఆహారం తిన్న తరువాత నోట్లో నీళ్ళు పోసుకొని బాగా పుక్కిలించి ఉమ్మేయ్యాలి . చిగుళ్ళ నుండి రక్తం
కారుతూ వుంటే అశ్రద్ధ చెయ్యకూడదు .విటమిన్ - సి మాత్రలను చప్పరించడం వలన దంతాల మీది ఎనామిల్ దెబ్బతింటుంది .
పిప్పి పన్ను --- లవంగ లేపనం 4-7-11.
యశదభస్మము --- 5 gr
లవంగ నూనె --- 10 ml
రెండింటిని కలిపాలి . పుల్లకు దూది చుట్టి మిశ్రమంలో ముంచి దానిని పిప్పిపంటి లోపల పూరించాలి . ఈ విధంగా రాత్రి పూట చేస్తే మందు రాత్రంతా పని చేసి ఉదయానికి బాగా తగ్గుతుంది .
ఆహారం తిన్న తరువాత ఉప్పు నీటిని గాని లేదా త్రిఫల కషాయాన్ని గాని పుక్కిట పట్టడం చాలా మంచిది .
పీచు పదార్ధాలను ఎక్కువగా తీసుకుంటే దంతాలు బాగా శుభ్ర పడతాయి
దంతాల ద్రుఢత్వానికి దంత సౌందర్య కల్పము
దంతాల మీది ఎనామిల్ దెబ్బ తినడానికి గల కారణాలు :-- నోటి పరిశుభ్రత్ లేకపోవడం , అతి చల్లని, అతి వేడి , అతి
పుల్లని , అతి తియ్యని పదార్ధాలను తినడం వలన , ఎక్కువ సార్లు వాంతులు చేసుకోవడం , Asprin , Vitamin -C
ఎక్కువగా వాడడం వలన , పళ్ళ రసాలను ఎక్కువగా తాగడం , ఎక్కువ సేపు దంతాలను బ్రష్ చేయడం వలన
ఎనామిల్ ఎక్కువగా దెబ్బ తింటుంది
ప్రవాళ భస్మం --- 5 gr
ముక్తా పిష్తి --- 5 gr
రెండింటిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .
పూటకు 500 మిల్లి గ్రాముల చూర్ణాన్ని నీటిలో గాని పాలలో గాని కలుపుకొని తీసుకోవాలి .
పుల్లని పదార్ధాలను తినాలనుకుంటే ఆహారం తినేటపుడు మధ్య మధ్యలో తీసుకోవాలి . పుల్లని పదార్ధాలను సేవించిన
తరువాత నోటిని బాగా పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి . దీని వలన ఎనామిల్ దెబ్బతినకుండా వుంటుంది
దంతసమస్యలు --- నివారణ 13-7-11.
చండ్ర చెక్క నీటిలో వేసి కాచి ఆ నీటితో ప్రతిరోజు పుక్కిలిస్తూ వుంటే పళ్ళు గట్టి పడతాయి .
ప్రతిరోజు నేరేడు పుల్లతో పళ్ళు తోముకుంటే చాలా మంచిది .
ఎండిన నేరేడు ఆకు ను కాల్చిన బూడిద --- 100 gr
ఉప్పు --- 10 gr
రెండింటిని కలిపి డబ్బాలో నిల్వ చేసుకోవాలి .
దీనితో ప్రతి రోజు పళ్ళు తోముకోవాలి . వెంటనే కదగకుండ పది నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి
దంత సమస్యలు --- నివారణ 26-7-11.
పొంగించిన పటిక పొడి --- 10 gr
సైంధవ లవణం --- 10 gr
యాలకుల పొడి --- 10 gr
అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి .
దీనితో పళ్ళను తోముకుంటే పళ్ళు గట్టి పడతాయి . నొప్పులు నివారింపబడతాయి .
2. పొంగించిన పటిక పొడి
" వేలిగారం పొడి
సైంధవ లవణం పొడి
అన్నింటిని సమానభాగాలుగా తీసుకొని దానికి 5 గ్రాముల ఏలకుల పొడిని కలిపి నిల్వ చేసుకోవాలి .
దీనితో పళ్ళు తోమడం వలన పళ్ళు కదలడం , పిప్పిపళ్ళు రావడం వంటి సమస్యలు నివారింపబడతాయి
26-7-11.
కారణాలు :---తమలపాకులను , వక్కలను ఎక్కువగా నమలడం , కెఫీన్ ఎక్కువగా వున్న పదార్ధాలను ఎక్కువగా
వాడడం , ఫ్లోరిన్ ఎక్కువగా వున్న నీటిని తాగడం మొదలైనవి .
1. వంటసోడా ---- అర టీ స్పూను
రాళ్ళ ఉప్పు పొడి ---- అర టీ స్పూను
నీళ్ళు ---- తగినన్ని
ఒక చిన్న గిన్నెలో రెండు పొడులను వేసి కొద్దిగా నీళ్ళు కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి .
దీనితో పళ్ళు తోముకుంటే అన్ని సమస్యలు నివారింపబడతాయి
2. ఎండబెట్టిన నిమ్మ తొక్కల చూర్ణం ---- ఒక టీ స్పూను
" కమలాపండ్ల తొక్కల చూర్ణం ---- ఒక టీ స్పూను
రెండు చూర్ణాలను కలిపి నిల్వ చేసుకోవాలి .
తాజా కమలా పండ్ల తొక్క యొక్క లోపలి తెల్లటి పదార్ధం తో పళ్ళ పై రుద్దితే తెల్లగా మారుస్తాయి .
`
3. నిమ్మ రసం --- ఒక టీ స్పూను
ఉప్పు --- ఒక టీ స్పూను
రెండింటిని కలిపి దానితో పళ్ళు తోముకోవాలి
పంటి నొప్పి --- నివారణ 24-8-11.
జామ ఆకులు --- 2
వాము --- అర టీ స్పూను
పసుపు --- అర టీ స్పూను
నీళ్ళు --- ఒక గ్లాసు
ఒక గిన్నెలో నీళ్ళు పోసి దానిలో జామ ఆకులను తుంచి వేయాలి . మరియు పసుపు పొడిని , వాము పొడిని
వేయాలి . తరువాత స్టవ్ మీద పెట్టి కాచాలి . తరువాత వడకట్టాలి . తరువాత ఆనీటిని గోరువెచ్చగా నోట్లో పోసుకొని
పుక్కట పట్టి కాసేపు వుంచి ఉమ్మేయాలి . ఈ విధంగా చేయడం వలన పంటి నొప్పి తగ్గుతుంది .
పంటి లోని పురుగుల నివారణ 24-8-11.
వెంపలి మొక్క వేర్ల చూర్ణం ---20 gr
పిప్పళ్ళ చూర్ణం ---20 gr
రెండింటిని కలిపి కల్వం లో వేసి తగినంత నీరు కలిపి మెత్తగా నూరాలి . పెసరబద్దంత మాత్రలు కట్టాలి .
దీనిని పంటిలో పెడితే పంటి లోని పురుగు చచ్చి పోతుంది . చిగుళ్ళ నొప్పి వుంటే ఒక మాత్రను తీసుకొని పొడి చేసి
చిగుళ్ళ మీద రుద్దితే తగ్గుతుంది .
పిప్పి పంటి లోని పురుగుల నిర్మూలన 30-8-11.
పండిన వాకుడు పండ్లు ( ముళ్ళ వంకాయ ) --- 5
ఆవు పిడకలు
ఆవు పిడకలను నిప్పుతో అంటించాలి . ఆ నిప్పు మీద వాకుడు కాయలలోని గింజలను వేయాలి . అవి కాలి
పొగ వస్తుంది . ఈ పొగను ఒక గొట్టం ద్వారా చెవికి పట్టించాలి . దీనితో పంటిలో పురుగులు చెవి ద్వారా బయటకు వస్తాయి .
అలాగే నోటి ద్వారా పొగను పీలిస్తే నోటి గుండా పురుగులు పడిపోతాయి . ముక్కుతో కూడా పీల్చవచ్చు .
పిప్పి పంటి నొప్పి నివారణకు చిట్కా 14-9-11.
ఒక్క పిప్పి0టాకు ను బాగా నలిపి పంటి మీద పెడితే కొద్దీ సేపటికి నొప్పి తగ్గుతుంది . లేదా ఆకు రసం లో దూదిని
ముంచి దానిని పంటి మీద పెట్టినా తగ్గుతుంది
దంత సిరి చూర్ణం 14-9-11.
కారణాలు :-- బ్యాక్తీరియా దంతాల మధ్య చేరడం వలన ఫ్లెక్స్ తయారవుతాయి . దీని వలన దంతాలు దెబ్బ తింటాయి
స్వీట్స్ తినడం , యాసిడ్ పొంగడం , వ్యాధి నిరోధక శక్తి తగ్గడం , తీక్షణ మైన పదార్ధాలను వాడడం , కాఫీ లాంటి వేడి
పదార్ధాలను వాడి వెంటనే చల్లటి పదార్ధాలను సేవించడం , మొదలైన కారణాల వలన దంతాల మధ్య , చిగుళ్లకు మధ్య
సమస్యలు ఏర్పడతాయి .
పసుపు పొడి --- అర టీ స్పూను
సైన్ధవ లవణం --- పావు టీ స్పూను
త్రిఫల చూర్ణం --- ఒక టీ స్పూను
వేప పట్ట లేక ఆకు చూర్ణం --- ఒక టీ స్పూను
దాల్చిన చెక్క నూనె --- 5 చుక్కలు
లవంగ నూనె --- 5 చుక్కలు
కావి రాయి చూర్ణం --- ఒక టీ స్పూను
అన్నింటిని ఒకే చూర్ణంగా లాగా బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి
ఈ చూర్ణం తో రెండు పూటలా పళ్ళు తోముకోవాలి . దంతాల మీద , చిగుళ్ల మీద ఈ చూర్ణంతో రుద్దాలి . బ్రష్
వాడే అలవాటు ఉంటే చాలా మెత్తగా వుండే బ్రష్ వాడాలి . తరువాత నీళ్లను పుక్కిట పట్టి కొంతసేపు అలాగే ఉంచి
తరువాత కడగాలి

.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి