జుట్టు

                                          వెంట్రుకలు నల్లబడడానికి
 
మర్రి చెట్టు ఊడల లేత కొనల రసం          ----200 gr
గుంటగలగర ఆకు రసం                         ----200 gr
నువ్వుల నూనె                                     ----200 gr
 
   అన్నింటిని కలిపి గిన్నెలో వేసి నిదానంగా కాచాలి. 5 నిమిషాల్లో దించుతామనగా దవనం గాని, మరువం గాని వేస్తే మంచి సువాసన వస్తుంది.చాల్లారిన తరువాత వడపోయాలి.
 
                               జుట్టు యొక్క దృఢత్వానికి, నల్లబడడానికి
 
తెల్లగడ్డల పొట్టు ---------- తగినంత
ఆలివ్ ఆయిల్  ---------- 100 ml
 
          తెల్లగడ్డల పొట్టును బాణలిలో వేసి స్టవ్ మీద పెట్టి నల్లగా అయ్యేంత వరకు వేయించాలి.
పొడిపొడిగా అవుతుంది .దాన్ని జల్లెడతో జల్లించాలి.ఒక సీసా లో 100 ml ఆలివ్ ఆయిల్ ను తీసుకొని పావు టీ స్పూను పొడిని కలపాలి. వారం రోజులు కదిలించకుండా ఉంచాలి.రాత్రి పూట జుట్టు కుదుళ్ళకు పట్టేట్లు మృదువుగా మర్దన చెయ్యాలి.ఉదయం తల స్నానం చెయ్యాలి.
జుట్టు నల్ల బడుతుంది, దృఢపడుతుంది.
  
                                      జుట్టు రాలడం ---నివారణ                                        3-12-08.
సర్వాంగాసనం :--
1. వెల్లకిలా పడుకొని కాళ్ళు పూర్తిగా పైకెత్తి నడుము మీద చేతులు ఉంచాలి.దీనివలన వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడతాయి. 1,2 నిమిషాలు మాత్రమే చెయ్యాలి.
2. వెల్లకిలా పడుకొని, పద్మాసనం వేసుకొని రెండు కాళ్ళ బొటన వ్రేళ్ళను పట్టుకొని, తలను వెనక్కు నేలతగిలేట్లు వంచాలి.
3. పద్మాసనం వేసుకొని నూనెను గోరు వెచ్చగా చేసి తల పైన రాయాలి.
 
                            జుట్టు రాలకుండా ఆమ్ల రసాయనం
 
       పచ్చి ఉసిరి కాయలను తెచ్చి గింజలు తీసి మంచి ఎండలో బాగా గలగలా లాడేట్లు వారం,పది రోజులు ఎండబెట్టాలి. వాటిని దంచి వస్త్రగాయం పట్టాలి. పొడిని బాగా వెడల్పుగా వున్న పాత్రలో వెయ్యాలి.మరలా పచ్చి కాయలను దంచి నీళ్ళు కలపకుండా నిజ రసం తీసి,పొడిలో,పూర్తిగా మునిగేట్లు పోయాలి. రాత్రి పూట పొడిని రసంతో నానబెట్టాలి, ఉదయం ఎండబెట్టాలి. మరల రాత్రికి పొడి మునిగేట్లు రసం పొయ్యాలి ,ఉదయంఎండబెట్టాలి . విధంగా ఏడు రాత్రులు నానబెట్టి ,ఏడు పగళ్ళు ఎండబెట్టాలి.ఏడు రోజుల తరువాత పూర్తిగాబాగా తేమ లేకుండా ఎండబెట్టాలి.తరువాత పొడికి తగినంత తేనె, కలకండ పొడి కలిపి భద్ర పరచాలి.
    దీనిని ప్రతి రోజు 10 గ్రాములు తినాలి. ఇది వాడే ముందు విరోచానానికి మందు వాడాలి.
అల్లం రసం + ఆముదం + తేనె
దీని వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది,శరీరములోని ప్రతి అంగము శక్తిని పుంజుకుంటుంది.
 
                       అకాల పలితము ( లేదా) చిన్న వయసులో జుట్టు నెరవడం
 
   15 గ్రాముల ఎండు ఉసిరిక ముక్కలను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వడకట్టి గుక్కెడు నోటిలో పోసుకొని పుక్కిలించాలి.మిగిలిన నీటిని జుట్టు యొక్క కుదుళ్ళ లోకి దిగేట్లు మర్దన చెయ్యాలి
   ప్రతి రోజు చెయ్యాలి. కనీసం వారానికి రెండు సార్లు చెయ్యాలి. తరువాత తల స్నానం చెయ్యాలి.
జలబు చేసే వాళ్ళు వారానికి ఒకసారి మధ్యాహ్నము పట్టించాలి.
 Go to your blog list
నిద్రించే ముందు అర స్పూను ఉసిరిక పొడి,అర స్పూను కలకండ పొడి, తేనె కలిపి నాకించాలి.
 
                                   తెల్ల జుట్టు నల్లబడడానికి (పిల్లలకు)                              9-12-08.
యోగాసనం :-- సర్వాంగాసనం :--- దీనివలన తలకు బాగా రక్త ప్రసరణ జరుగుతుంది .
పడుకొని కాళ్ళను పూర్తిగా నడుము వరకు పైకేత్తాలి. చేతులను నడుము మీద పెట్టాలి.కాళ్ళను మెల్లగా కిందకు దించాలి. శీర్షాసనం వేస్తే కూడా మంచిది.
 
మత్స్యాసనం :-- తలను మాడువరకు వెనక్కి వంచి పడుకోవాలి.దీనిని నెమ్మదిగా చెయ్యాలి. వేగంగా చెయ్య కూడదు.
తలకు వారానికి రెండు సార్లు తప్పనిసరిగ నూనె పెట్టాలి.నల్లనువ్వులనూనెను కుదుళ్ళకు పట్టించాలి.
వంటలలో ఎంత ఎక్కువగా నువ్వుల నూనె వాడితే అంత మంచిది.వారానికి ఒక సారి నూనెతో శరీరాన్నిమర్దన చెయ్యాలి.ముక్కుల్లో చెవుల్లో రెండేసి చుక్కలు వేసుకోవాలి.
 
ఉసిరిక పొడి    ------ 100 gr
కలకండ         ------ 100 gr
 
రెండింటిని కలిపి సీసాలో భద్రపరచాలి.ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క టీ స్పూను చొప్పున తినాలి       కావాలంటే తేనె కలుపుకొని కూడా వాడుకోవచ్చు.
                                                           ఉసిరి తైలం
పచ్చి ఉసిరి రసం     --- ఒక లీటరు
నువ్వుల నూనె       --- అర లీటరు
 
     రెండింటిని కలిపి నూనె మాత్రమే మిగిలేట్లు కాచి చల్లార్చి సీసాలో నిల్వ చేసుకోవాలి.దీనిని
వారానికి రెండు సార్లు తలకు అన్తుకోవాలి.రాత్రి అంటుకొని ఉదయం తలస్నానం చెయ్యాలి. దీనితో జుట్టు తప్పకుండా నల్ల బడుతుంది.
                          జుట్టు కుచ్చులు కుచ్చులుగా రాలిపోతుంటే --నివారణ          22-12-08.
 
సన్నజాజి పూలు, ఆకులు సమృద్ధిగా తెచ్చి కల్వలోవేసి, ఆవు మూత్రం పోసి మెత్తగా నూరాలి. దీనిని జుట్టు కుదుళ్ళకు పట్టేటట్లు పూయాలి. విధంగా వారానికి ఒకటి, రెండు సార్లు చెయ్యాలి.
కఫ శరీరం గల వాళ్ళు వారానికి ఒకసారి అది మధ్యాహ్నము పట్టించి అరగంటమాత్రమేఉంచాలి..తరువాత కుంకుళ్ళతోతల స్నానం చెయ్యాలి.తలను ఎక్కువగా రుద్ద కూడదు,   మృదువుగా రుద్దాలి.
  
                                          తలలో జిడ్డు సమస్య --నివారణ                              24-12-08.
 
  పుట్టుకతో కఫ శరీరం వున్న వాళ్లకు సమస్య ఎక్కువగా వుంటుంది,కఫ ప్రకోపం వలన తలలో జిడ్డు చేరుతుంది.జిడ్డు వలన చుండ్రు తయారవుతుంది, జుట్టు రాలుతుంది.
కందిపప్పు 50 గ్రాములు తీసుకొని (లేదా 100 gr ) గిన్నెలో వేసి పప్పు మునిగే వరకు నిమ్మరసం పొయ్యాలి.రాత్రంతా నానబెట్టి ఉదయం కల్వంలో వేసి మెత్తగా నూరాలి.దానిని జుట్టు కుదుళ్ళకు పట్టించాలి.అర గంట తరువాత కుంకుడు రసంతో తల స్నానం చేస్తే తలలోని మురికి మొత్తం జారి పోతుంది.
 
                                    తలవెంట్రుకలు దట్టముగా పెరుగుటకు                          31-12-08
 
1. యోగాసనం :-- పద్మాసనం, మత్స్యాసనం వెయ్యాలి. పద్మాసనం వేసుకొని వెనక్కి పడుకోవాలి. కాళ్ళు చాపకూడదు,చేతులు చాపాలి. దీని వలన తలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. లేచేటపుడు నెమ్మదిగా మోకాళ్ళు పట్టుకొని లేవాలి.
2. శశాంకాసనం :-- కాళ్ళు వెనక్కి మదిచ్ కూర్చొని, మోకాళ్ళ పైనుండి చేతులను చాపి,తలను భూమికి ఆనించాలి.చేతులు పూర్తిగా చాపాలి.నెమ్మదిగా పైకి లేవాలి మళ్లీ కిందికి వంగాలి. బస్కీల లాగా.
3. నిద్రించే ముందు కళ్ళు మూసుకొని మనోఫలకం పై నీ తలను భావన పెట్టి తలలో వెంట్రుకలు నిండుగా పెరిగినట్లు భావన చెయ్యాలి.--5,10 నిమిషాలు అదే ఆలోచన కొనసాగించాలి.వేరే విషయాలపైకి ఆలోచన వెళ్ళకూడదు.ఇది సమభావం అనుకోవాలి.ఇదే మానసిక కృషి.
                                                              కేశామృతం
ఉసిరిక కాయల పొడి      - ------ 100 gr
అతిమధురం పొడి          ------- 100 gr
గుంటగలగర పొడి          ------- 100 gr
దో. వే.నల్ల నువ్వుల పొడి ------- 100 gr
కలకండ పొడి                 ------- 100 gr
 
     అన్నింటిని నిదానంగా ఒక దాని తరువాత ఒకటి బాగా కలిపి వస్త్రగాయం పట్టాలి. సీసాలో భద్ర పరచాలి.
ఉదయం, రాత్రి ఆహారానికి అర గంటముందు అర టీ స్పూను పొడి లో అర  స్పూను ఆవు నెయ్యి, ఒక టీ స్పూను తేనె కలిపి చప్పరించాలి.
  
                                                        కేశ సౌందర్యానికి ---తైలం                         21-1-09.
 
మంచి కొబ్బరి నూనె                  ------- 1 లీ
పచ్చి ఉసిరి రసం                      ------- 1 లీ
గుంటగలగర సమూల రసం        ------- 1 లీ
ఆకు పత్రి పొడి                        ------- 50 గ్రా
తుంగ గడ్డల పొడి                    ------- 50 గ్రా
వట్టివేళ్ళ పొడి                        ------- 50 గ్రా
గంధ కచ్చూరాలు                   ------- 50 గ్రా
మరువం లేక దవనం                ------- 50 గ్రా 
 
            అన్ని పొడులను ముద్దగా నూరి రసాలను, నువ్వుల నూనె అన్ని కలిపి 24 గంటలు నానబెట్టాలి.తరువాత స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి.
దీనిని ప్రతి రోజు జుట్టుకు రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది .

                                తెల్ల జుట్టు నల్లబడడానికి --బోడతర తైలం                             31-1-09
 
బోడతరం పూలు                    ----- 300 gr
నీళ్ళు                                   ----- అర లీటరు
నువ్వుల నూనె                       ----- పావు లీటరు
 
      పూలను బాగా పిసికి లేదా మిక్సి లో వేసి, నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి పావు లీటరు కషాయం వచ్చే వరకు కాచాలి.దించి వదపోసుకొని దానికి నువ్వుల నూనెను కలిపి స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి. దీనినే గోరఖ్ నాథ్ తైలం లేదా బోడతర తైలం అంటారు.స్టవ్ ఆపి వడపోసి చల్లార్చి సీసాలో భద్ర పరచాలి.

     కొంత తైలాన్ని డ్రాప్స్ సీసాలో పోసుకోవాలి.ఉదయం, సాయంత్రం రెండు, మూడు చుక్కలు తైలాన్నిముక్కులో వేసుకోవాలి.ఒక టీ స్పూను నూనెను తాగాలి. నూనె తాగడానికి ఒక గంటముందు , గంట తరువాత ఏమి తినకూడదు.పావు టీ స్పూను తో ప్రారంభించి రెండు, మూడు స్పూన్ల వరకు పెంచుకోవచ్చు.దీనివలన క్రమ క్రమంగా మరియు శాశ్వతంగా జుట్టు నల్లబడుతుంది.
        జలుబు చేసే పదార్ధాలు వాడకూడదు. ఈతైలాన్ని వాడేటపుడు ఖచ్చితంగా చింతపండు వాడకూడదు.
       ఆమ్చూర్, టమేటా,ఉసిరికాయ వాడుకోవచ్చు. ఉసిరికను ఏడు సార్లు భావన చెయ్యాలి.
 
                                          ఎర్ర జుట్టును నల్లబరచడానికి                                    2-2-09.
 
శరీరం లోని అతి వేడి తలకు చేరితే జుట్టు ఎర్ర బడుతుంది.
 
జిలకర  ------ 100 gr
కలకండ ------ 100 gr
 
   జిలకరను బాణలి లో వేసి, కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించి దంచి వస్త్రగాయం పట్టాలి.దీనికి కలకండ పొడిని కలిపి సీసాలో భద్ర పరచాలి. ఇది సకల పైత్య దోషాలను హరిస్తుంది.
 
పిల్లలకు                    ---పావు టీ స్పూను
పెద్దలకు                   --- అర టీ స్పూను
20 సం.దాటిన వారికి  --- ఒక టీ స్పూను.
 
దీనిని మంచి నీటితో తీసుకోవాలి.
ఈవిధంగా ప్రతి రోజు చేస్తూ
మెంతిపొడి
మారేడు పండు గుజ్జు పొడి
 
        ఈ రెండింటిని సమాన భాగాలుగా తీసుకొనికలిపి సీసాలో భద్రపరచుకోవాలి. ఒక టీ స్పూను పొడిని నీటితో కలిపి జుట్టు కుదుళ్ళకు పట్టించాలి
                               రాలిన జుట్టు తిరిగి పొందడానికి                                           4-2-09
 
ముల్లంగి దుంపలు దంచి తీసిన రసం     ----100 gr
గుంటగలగర రసం                           ---- 100 gr
ఉల్లిపాయల రసం                            ---- 100 gr
పుదీనా ఆకు రసం                           ---- 100 gr
పల్లేరు ఆకుల రసం                          ---- 100 gr
నువ్వుల నూనె                                ---- 500 gr
 
  అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి రసాలు ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలేటట్లు కాచాలి. చల్లారిన
తరువాత వడకట్టి సీసాలో భద్రపరచుకోవాలి.
    ఈ నూనెను రాత్రి పూట కొద్దిగా వేడి చేసి తలకు పట్టించాలి.క్రమేపి రాలిన జుట్టు తిరిగి వస్తుంది.
దీనిని రాసుకుంటూ సర్వాంగాసనం వెయ్యాలి.
 
                                         జుట్టు నెరవడం --నివారణ                                       13-2-09.
 
బోడతరం పూలు              ---300 gr
నీళ్ళు                           --- 1 లీటరు
నువ్వుల నూనె             --- అర లీటరు
 
    పూలను కచ్చా పచ్చాగా దంచి నీళ్ళలో వేసి కాచి పావు లీటరు కషాయానికి రానివ్వాలి. దీనిని వడపోసి ,దానికి నువ్వుల నూనెను కలిపి స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలేట్లు కాచాలి.

   పిల్లలకు ఉదయం పళ్ళు తోముకునే ముందు, రాత్రి ఆహారానికి ఒక గంట ముందు ముక్కుల్లో రెండేసి చుక్కల చొప్పున వేసి పీల్చమని చెప్పాలి. అర టీ స్పూను తైలాన్ని తాగాలి.తరువాత ఏదో ఒక తైలాన్ని తలకు రాసుకోవాలి.ఇది వాడేటపుడు చింతపండు పులుపు పనికి రాదు.

ఆమ్చూర్, ఉసిరి,నిమ్మ,టొమాట వాడుకోవచ్చు.

                                          కేశ సౌందర్యం                                                 24-2-09.

  అధికంగా నీళ్ళు తాగడం వలన శరీరం లో కఫం పెరిగి ప్రకోపించి శిరసుకు చేరి జుట్టు ఊడిపోతుంది. రాత్రి ఎక్కువసేపు మేలుకొని పగలు నిద్ర పోవడం వలన కూడా జుట్టు ఊడిపోతుంది.

  మెంతులు         ---- 100 gr
నల్ల మినుములు  ---- 100 gr
 ఉసిరి ముక్కలు  ---- 100 gr

  అన్నింటిని విడివిడిగా పొడి చేసి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి. వారానికి ఒక సారి లేదా రెండు సార్లు రెండు స్పూన్ల పొడిని తీసుకొని తగినన్ని నీళ్ళు కలిపి జుట్టు కుదుళ్ళకు పట్టించాలి.

   కలిపెటపుడు కొద్దిగా పల్చగా వుండాలి. ఒక గంట తరువాత తల స్నానం చెయ్యాలి. విధంగా కొంత కాలం చేస్తే వెంట్రుకలు ద్రుడంగా, అందంగా తయారవుతాయి.

                                                  జుట్టు నెరవడం ---నివారణ                        26-2-09.

   కార్తీక మాసపు ఉసిరికాయలు శ్రేష్టమైనవి. ఎండిన ఉసిరి ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం నేతిలో వేయించి అన్నంతో తినాలి లేదా నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉండాలి. విధంగా ప్రతిరోజు చేస్తూ వుంటే జుట్టు నెరవడం ఆగిపోయి ,జుట్టు నల్లబడడం ప్రారంభమవుతుంది.

                                                    జుట్టు నల్లబడడానికి                                  27-2-09.

   త్రిఫలాలను సమాన నిష్పత్తిలో ఎండబెట్టి దంచి, జల్లించి కలిపి పెట్టుకోవాలి. సాయంత్రం ఒక టీ స్పూను పొడిని పాలతో గాని నీళ్ళతో గాని కలిపి జుట్టు కుదుళ్ళకు పట్టించాలి. ఒక గంట తరువాత స్నానం చెయ్యాలి. కఫశరీరం కలిగిన వాళ్ళు చూర్ణం లో వేడి నీటిని కలిపి గోరు వెచ్చగా వున్నపుడు మధ్యాహ్నం పూట పెట్టుకొని 15 నిమిషాలు వుంచి స్నానం చేసి సాంబ్రాణి పొగ వేసుకుంటే మంచిది .

  త్రిఫలాలను కడిగిన నీటితో కళ్ళను కడిగితే మంచిది, జుట్టుకు కూడా పూసుకుంటూ వుంటే జుట్టు రాలదు. .

                                         ఊడిన జుట్టు పెరగడానికి                                         9-3-09.

ఉల్లిపాయల నిజ రసం ----- 3 టీ స్పూన్లు
మంచి తేనె                ----- 3 టీ సూన్లు

        రెండింటిని బాగా కలపాలి. వేలికి నూలు గుడ్డ చుట్టుకొని వెంట్రుకలు లేని చోట బాగా రుద్దాలి.తరువ్వాత దాని మీద పై లేపనాన్నిరుద్దాలి అది ఆవిరిన తరువాత మరలా రుద్దాలి. విధంగా చేసి రుద్ది వదిలెయ్యాలి. ఉదయం కుంకుళ్ళతో తల స్నానం చెయ్యాలి. కొంత కాలం తరువాత వెంట్రుకలు నూగు లాగా పెరుగుతాయి. వాటిని తొల గించి మరలా మొలిచిన వెంట్రుకలను ఉంచాలి. విధంగా 4,5 నెలలు చేస్తే ఖచ్చితంగా వెంట్రుకలు పెరుగుతాయి.

                                  జుట్టు రాలకుండా --జాగ్రత్తలు                                         13-3-09.

 కరక్కాయ పొడి             ---100 gr
 తానికాయ పొడి             ---200 gr
 ఉసిరి కాయ పొడి           ---400 gr
 అతి మధురం               ---700 gr

  అన్ని చూర్ణాలను కలిపి నిల్వ చేసుకోవాలి. దీనిని

పిల్లలకు -- అర టీ స్పూను
పెద్దలకు -- ఒక టీ స్పూను

తో మొదలు పెట్టాలి. త్రిఫల చూర్ణం ఒక స్పూను రాత్రి ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయం అర గ్లాసుకు వచ్చే వరకు మరిగించి వదపోయ్యాలి. దీనిని జుట్టు కుదుళ్ళకు పట్టించాలి.

 త్రిఫల చూర్ణం + అతిమధురం --- కడుపులోకి
త్రిఫల కషాయం                     --- తలకు

                                         తెల్ల జుట్టు నల్ల బడడానికి                                      16-3-09.

మర్రి చెట్టు వూడల కొనల రసం     ------ 200 gr
 గుంటగలగర ఆకు రసం             ------ 200 gr
నల్ల నువ్వుల నూనె                    ------ 200 gr

      పై రెండు రసాలను నువ్వుల ;నూనెలో కలిపి స్టవ్ మీద పెట్టి సన్న సెగ మీద మరిగించాలి. 5 నిమిషాల్లో దించే ముందు ఆరువం ఆకు గాని దవనం గాని దానిలో వేసి తరువాత దించాలి. క్రమం తప్పకుండా తైలం వాడడం వలన తెల్ల జుట్టు నల్ల బడుతుంది.

                                              జుట్టు నల్లబడడానికి                                            27-4-09.

 నల్ల నువ్వులు, పాతబెల్లం, ఎండుకొబ్బెర కలిపి చేసిన ఉండలను ప్రతి రోజు తినాలి.
మంచి వేప నూనె ప్రతి రోజు రెండు చుక్కలు ముక్కులో వేసుకొని పీల్చాలి.
తలను వెనక్కు పెట్టుకొని వేసుకొని పీల్చాలి. కొంచం చేదుగా వుంటుంది. ఉదయం పరగడుపున, రాత్రి పడుకునే ముందు వేసుకోవాలి.
ఎండిన ఉసిరిముక్కలను రాత్రి నీటిలో వేసి ఉదయాన్ని వడపోసి నీటిని కొద్దిగా తాగాలి కొంచం నీటిని జుట్టుకు పోసుకొని కుదుళ్ళ లోకి ఇంకే విధంగా కదిలించాలి.
ప్రతి రోజు తల స్నానం చేయాల్సిన అవసరం లేదు.
ఆవు పాలు ప్రతిరోజు తాగితే మంచిది.
మూడు నెలల్లో తప్పకుండా జుట్టు పెరిగి నల్లబడుతుంది.

                  తలలో అక్కడక్కడ రాలిన వెంట్రుకలు తిరిగి రావడానికి                      29-5-09.

 గుంటగలగర ఆకు               ---- 100 gr
ఉసిరి ముక్కలు                    ---- 100 gr
నల్ల నువ్వులు                      ---- 100 gr
అతిమధురం                        ---- 100 gr
నీళ్ళు                               ---- 1600 gr
నువ్వుల నూనె                     ---- 400 gr

   ఒక పాత్రలో అన్నింటిని వేసి నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి 400 గ్రాముల కషాయం మిగిలే వరకు కాచాలి. దించి వడపోసి కషాయం ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలే వరకు మరలా కాచాలి. తైలాన్ని స్నానానికి ముందు గాని, నిద్రించే ముందు గాని తలలో రాలి వున్నాయో అక్కడ మాత్రమే పూయాలి.

                             తెల్ల వెంట్రుకల సమస్య--- నివారణ                                   13-7-09.

తలలో అధికంగా కఫం చేరడం వలన జుట్టు తెల్లబడుతుంది.

సర్వాంగాసనం :-- వెల్లకిలా పడుకొని నిదానంగా కాళ్ళు పైకెత్తాలి, నడుమును కూడా పైకి లేపాలి. నడుము నేల మీద ఆనకూడదు. దీని వలన తలకు బాగా రక్తప్రసరణ జరుగుతుంది.

మత్స్యాసనం:-- మాడు నెలకు ఆనేటట్లు వెల్లకిలా పడుకోవాలి.
ఉష్ట్రాసనం:-- మోకాళ్లను, కాలి ముని వేళ్ళను నేలకు ఆనించి తలను పూర్తిగా వెనుకకు వంచాలి.
శుక్రవజ్రాసనం :-- మోకాళ్ళ మీద కూర్చొని తలను పూర్తిగా నేల మీదికి ఆనించాలి.

ఆహార నియమాలు:-- ఉసిరి కాయలను గింజలు తీసి మెత్తగా నూరి దానికి సమానంగా కలకండ గాని, చక్కెర గాని, తేనె గాని, తాటిబెల్లం గాని కలిపి తింటే వెంట్రుకలు నల్లబడతాయి.

మందార తైలం   మందార రసం నల్ల ఆవు మూత్రం నువ్వుల నూనె అన్నింటిని ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి సన్న మంటమీద తేమ ఇగిరిపోయి తైలం మాత్రం మిగిలే వరకు కాచాలి. వడకట్టి సీసాలో భద్ర పరచుకోవాలి. దీనిని తలకు పెట్టుకుంటూ వుంటే వెంట్రుకలు నల్లబడతాయి.

                           
బిరుసెక్కిన వెంట్రుకలు మృదువుగా కావడానికి

1. సీకాయ పొడి 100 గ్రాములు ఉసిరిక పొడి పావు కిలో రెండింటిని కలిపి పెట్టుకోవాలి.
    మెంతి కూర ఆకులను మెత్తగా ముద్దగా నూరి కొద్ది కొద్దిగా తీసుకొని వెంట్రుకల కుదుళ్ళకు పట్టించాలి. బాగా ఆరిన తరువాత పైన కలిపిన పొడితో తల స్నానం చెయ్యాలి.

2. రేగు కాయల చెట్టు ఆకులను తెచ్చి మెత్తగా నూరి వెంట్రుకల కుదుళ్ళకు పట్టించాలి. అర గంట తరువాత పైన చెప్పిన పొడితో తల స్నానం చెయ్యాలి.

                                    జుట్టు రాలడం నివారణ                                             20-7-09.

    తలకు నూనె దట్టంగా పెట్టాలి. అర చేతులతో రుద్దకూడదు. ముని వేళ్ళతో రుద్దాలి. వారానికి
ఒక సారి కుంకుళ్ళు, లేదా సీకాయతో స్నానం చేయాలి.

విపరీత కరణి:-- ఇది వెంట్రుకల కుదుళ్ళు గట్టి పడడానికి, రక్త ప్రసరణ బాగా జరగడానికి ఉపయోగపడుతుంది. వెల్లికిలా పడుకొని తలను ఆనించి కాళ్ళు పైకెత్తి చేతులతో నడుమును పట్టుకొని కాళ్ళను నిలబెట్టాలి.

మత్స్యాసనం :-- వెల్లికిలా పడుకొని చేతులు కలిపి పొట్ట మీద పెట్టుకొని మాడును నెలకు ఆనించాలి. నిమ్మకాయ రసం లో గుప్పెడు ఉసిరిక రసం కలిపి కుదుళ్ళకు మెల్లగా పట్టించాలి. దీని వలన చుండ్రు, పొట్టు, పుండ్లు నివారింప బడతాయి. జుట్టు పుష్టిగా పెరిగుతుంది. విధంగా ఐదు రోజులకొకసారి గాని వారానికి ఒకసారిగాని చేస్తే కొంత కాలానికి జుట్టు రాలడం ఆగిపోతుంది.

జుట్టు పెరగడానికి మర్రి వూడల చివరలను నిమ్మరసంలో రాత్రంతా నానబెట్టి ఉదయం నూరి జుట్టుకు పెట్టాలి. వూడల కొసలను ఎండబెట్టి, దంచి పొడి చేసికూడా వాడుకోవచ్చు.

                              జుట్టు నల్లబడడానికి తులసి నశ్య తైలం                         19-2-10.

 కృష్ణ తులసి ఆకుల రసం     ---- 100 gr
గుంటగలగర ఆకుల రసం     ---- 100 gr
గోరింటాకు రసం                  ---- 100 gr
నల్ల నువ్వుల నూనె             ---- 100 gr
అతిమధురం పొడి                  ---- 20 gr

  అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి రసం ఇగిరి పోయి తైలం మాత్రం మిగిలేట్లు కాచాలి. దించే ముందు అతిమధురం పొడిని చల్లాలి. మరువంగాని, దవనంగాని తుంచి వెయ్యాలి. తరువాత కొంచం కాగనిచ్చి దించి వడ పోసుకోవాలి. సీసాలో భద్ర పరచుకోవాలి. ఆహారానికి గంట ముందు ఉదయం, రాత్రి రెండేసి చుక్కల చొప్పున ముక్కులో వేసుకోవాలి.
 
                                          జుట్టు రాలకుండా నివారణ             9-4-10

          గుప్పెడు కరివేపాకును కొబ్బరినూనెలో వేసి ఆకులు నల్లబడే వరకు కాచాలి. చల్లారిన తరువాతవడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. దీనిని తలకు రాసుకుంటూ వుంటే జుట్టు కుదుళ్ళు గట్టి పడి  జుట్టు రాలడాన్ని నివారించుతుంది 

                    కేశ సౌందర్యాన్ని పెంచడానికి కేశ సుగంధిని              21-5-10.

 యాలకుల పొడి                 ---- 50 gr
తుంగ గడ్డల పొడి                ---- 50 gr
జటామాంసి పొడి                ---- 50 gr
గంధ కచ్చూరాల పొడి         ---- 50 gr
బావంచాల పొడి                 ---- 50 gr
ఆకు పత్రి పొడి                   ---- 50 gr

   అన్నింటిని చూర్ణాలు బాగా మెత్తగా వుండాలి. అన్నింటిని బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.

ఉపయోగాలు:-- వారానికి ఒకటి, రెండు సార్లు లేదా ఐదు రోజులకొకసారి ఉపయోగించాలి. జుట్టుకు తగినంత పొడిని ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్ళు పోసి పిసికి గుజ్జుగా చేసి జుట్టు యొక్క కుదుళ్ళకు బాగా పట్టించాలి. తరువాత తలకు గుడ్డ కట్టాలి. లేదా కట్టకపోయినా పరవాలేదు. ఒక గంట అలాగే వుంచి గోరు వెచ్చని నీటితో స్నానం చెయ్యాలి. తలను షాంపూతో, కుంకుళ్ళతో రుద్ద కూడదు నీళ్ళతో మాత్రమే స్నానం చెయ్యాలి.
  
                              వెంట్రుకల కొసలు చిట్లడం --నివారణ             28-5-10.
 
కారణాలు;-- అధికగాఢత కలిగిన షాంపూ లను వాడడం, ద్రయ్యర్ ను వాడడం, పదునైన దువ్వెనలను ఉపయోగించడం వలన వెంట్రుకలు చిట్లడడం జరుగుతుంది.
A.C లలో ఎక్కువ సమయం గడపడం వలన, జరుగుతుంది.
ఋతువులను బట్టి ముఖ్యంగా చలికాలంలో జరుగుతుంది.
అజీర్ణ క్రియ వలన శరీరంలో సరియైన పోషక పదార్ధాలు లేక పోవడం వలన జరుగుతుంది.
కరక్కాయ బెరడు చూర్ణము
మామిడిటెంక లోని  జీడి చూర్ణము
 
               రెండింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి. విడివిడిగా దంచి చూర్నాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
రెండు టీ స్పూన్ల పొడిని తగినంత నీరు కలిపి తలకు, వెంట్రుకలకు పట్టించి స్నానము చెయ్యాలి.
2. మంచి పసుపు పొడి
     మాని పసుపు పొడి
 
రెండింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి నిల్వ చేసుకోవాలి.
రెండు టీ స్పూన్ల పొదిలో ఆవు వెన్న కలిపి తలకు పట్టించి తల స్నానం చెయ్యాలి.
 
3. బాదం నూనె --- రెండు టీ స్పూన్లు
నువ్వుల నూనె --- రెండు టీ స్పూన్లు
రెండింటిని కలిపి వేడి చేసి తలకు పట్టించాలి.
 
4. తొక్క తీసిన బాదం పప్పుల పొడిని ప్రతి రోజు పాలల్లో కలుపుకొని తాగాలి.
 
5. బాదం తైలాన్ని 2, 3 చుక్కలు ముక్కులో వేసుకోవాలి.
  
                                                    బాల నేరుపు                     7-1-11.
          10 -- 25 సంవత్సరాల మధ్య జుట్టు తెల్ల బడదాన్ని బాల నేరుపు అంటారు.
తలకు సరిపడినన్ని పోషకాలు అందాకా పోవడం వలన సమస్య వస్తుంది. మాడు భాగంలో
సరిపడినంత మెలనిన్ అందాకా పోవడం వలన సమస్య ఏర్పడుతుంది.
1 ఆరు నెలల వయసునుండి సంవత్సరం వరకు తప్పని సరిగా క్రింది విధంగా చెయ్యాలి.
పంచామృతం:-- తేనె, నెయ్యి, పాలు, పెరుగు , గోమూత్రం లేదా గోఅర్కం వీటిని ఒకేసారిగా గాని లేదా ఒక్కొక్కటిగా గాని వాడవచ్చు.
2. నువ్వులు
   బెల్లం
              ప్రతి రోజుకు ఒక సారి ఆహారానికి ముందు ఒక ఉండ తీసుకోవాలి.
3. తైలమర్దనం :--
నువ్వుల నూనెను ప్రతి రోజు తలనుండి పాదాల వరకు మర్దన చెయ్యాలి. కనీసం మెడ నుండి మాడు వరకువేళ్ళతో మర్దన చెయ్యాలి. తరువాత అర గంట సేపు ఎండలో కూర్చొని తరువాత స్నానం చెయ్యాలి.
                                                          Hair Wash
పెసలు                      ---- 100 gr
మెంతులు                 ---- 100 gr
మందార ఆకుల పొడి   ---- 200 gr
 
   అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి. పొడిని తగినంత తీసుకొని నీళ్ళు కలిపి తలకు పట్టించాలికొంత సేపు వుంచి తల స్నానం చెయ్యాలి.
సూచన :-- శరీరం లో పోషక పదార్ధాలు తగ్గకుండా ఉండడానికి :--
 
రెండు టీ స్పూన్ల బాదం పాక లేహ్యాన్ని పాలల్లో కలుపుకొని తాగాలి.
 
                     బాలనెరుపు--- వెంట్రుకలు నల్లబడడానికి ---కేశమిత్ర                               16-7-10.
 
ఉసిరిక కాయలను కార్తీక మాసంలో, మార్గశిర మాసంలో సేకరించి పెట్టుకోవాలి.
 
ఎండిన ఉసిరిక ముక్కలు    ----- 20 -- 30
వేడి నీళ్ళు                       ----- అర గ్లాసు
 
       రాత్రి వేడి నీటిలో ఉసిరిక ముక్కలను నానబెడితే ఉదయానికి నీళ్ళు నల్ల్లగా అవుతాయి.
వాటిని వడ పోయాలి. నీటిని కొద్ది కొద్దిగా మునివేళ్ళతో తలంతా మర్దన చేయాలి. ఆరిన తరువాత వదిలేసి బాగా ఆరిన తరువాత నూనె పూయాలి
=
 ( గుంటగలగర తైలం గాని, మర్రి వూడల తైలంగాని, కలబంద తైలంగాని ) . అదే విధంగా ప్రతి రోజు చేయాలి. కఫం ఎక్కువగా వున్నవాళ్ళు వాడకూడదు. వారానికి ఒకటి రెండు సార్లు తల
స్నానం చేయాలి.
  
                పైత్యము ( అత్యుష్ణము) వలన కలిగే కేశ సమస్యలు---నివారణ           2-11-10.
 
అతిమధురం పొడి               --- 20 gr
రసాంజనం                         --- 20 gr
ఉసిరిక పొడి                       --- 20 gr
ఆవు పాలు                      --- 400 ml
కలబంద గుజ్జు                    --- 20 gr
నువ్వుల నూనె                 --- 200 gr
 
  అన్ని పదార్ధాలను ఒక పాత్రలో పోసి బాగా కలియ బెట్టి స్టవ్ మీద పెట్టాలి. సన్న మంట మీద నువ్వుల నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి. చల్లారిన తరువాత శుభ్రమైన, తడిలేని గాజు సీసాలో భద్రపరచాలి.
  దీనిని రెండు పూటలా తలకు రాసుకుంటే జుట్టు బాగా పెరగడమే కాక తలలోని వేడి కళ్ళమంటలు, నోటిపూత, కంటి సమస్యలు కూడా నివారింపబడతాయి.
  
                                               కేశ లేపన చూర్ణము                                        25-11-10.
 
ఉసిరి పెచ్చుల పొడి                  --- 100 gr
లోహ ( మండూర ) భస్మం        --- 100 gr
గోరింటాకు పొడి                      --- 500 gr
మందార పూల పొడి               ---- 100 gr
నీలి ఆకుల పొడి                   ---- 100 gr
టీ పొడి                               ---- ఒక టీ స్పూను
కాఫీ పొడి                             ---- ఒక టీ స్పూను
గుంటగలగర పొడి                ---- 100 gr
యూకలిప్టస్ తైలం               ---- ఒక టీ స్పూను
 
    లోహ భస్మం, ఉసిరి పొడి లను టీ, కాఫీ డికాషన్ లో 12 గంటలు ( రాత్రంతా) నానబెట్టి ఉంచాలి. ఉదయందానిలో పైన తేరుకున్న నీటిని మాత్రమే తీసుకోవాలి. దానిలో గోరింట, నీలి, మందార పొడులను కలపాలి. రెండు గంటల సేపు నానబెట్టాలి. తలకు పట్టించే ముందు అర టీ స్పూను గాని ఒక టీ స్పూను గాని యూకలిప్టస్ తైలాన్ని కలపాలి. దీని వలన జలుబు చెయ్యదు. జుట్టును పాయలుగా విడ దీసి కుదుళ్ళ నుండి కొసలవరకు పట్టించాలి. ముఖానికి, చెవులకు అంటుకోకుండా కొబ్బరి నూనె పూసుకోవాలి. రెండు, మూడు గంటలసేపు తలకు ఉండనిచ్చి, మంచి నీళ్ళతో కడగాలి.

మర్నాడు కుంకుడు కాయలతో గాని, శీకాయతో గాని స్నానం చెయ్యవచ్చు.
దీనిని తలకు పట్టించే ముందు తల స్నానం చేసి పట్టించుకుంటే మంచిది.
వారానికి ఒక సారి తరువాత పదిహేను రోజులకొకసారి చెయ్యవచ్చు.
విధంగా చెయ్యడం వలన వెంట్రుకలు జెట్ బ్లాక్ కలర్ లోకి మారతాయి.
 
                                     జుట్టు రాలే సమస్య-- నివారణ                               9-12-10.

 కారణాలు:--
 రక్త హీనత వలన జుట్టు రాలితే తైలాల వలన ప్రయోజనం వుండదు.
 హార్మోన్లలో మార్పుల వలన, థైరాయిడ్ సమస్య వలన, టైఫాయిడ్ జ్వరం వలన, అండాశయం లో గడ్డలు పెరగడం వలన మందులు వాడడం వలన, ఘాటైన షాంపూలు వాడడం వలన హేర్ 
డ్రయ్యర్  ను వాడడం వలన, జుట్టును బిగించి కట్టడం మొదలైన కారణాల వలన జుట్టు రాలుతుంది.

 ఇవే కాక మానసిక కారణాలు, ఒత్తిడి వలన, రక్త సరఫరా తగ్గడం వలన, కొన్ని రకాల వ్యాధుల వలన కూడా జుట్టు రాలే అవకాశాలు వున్నాయి.

దీని నివారణకు ఔషధ సంబంధమైన తైలాలను పూయడం వలన జుట్టు పెరుగుతుంది.

 చెమట పట్టించడం:-- తలకు నూనె పట్టించి వేడి నీటిలో తడిపిన టవల్ ను చుట్టాలి.

లేపనం:-- గుంటగలగర, త్రిఫలాలు శీకాయ, కుంకుళ్ళు, కచ్చూరాలు, అతిమధురం అన్నింటిని సమాన భాగాలు గా తీసుకుని కలిపి భద్ర పరచుకోవాలి. అవసరమైనంత పొడిని తీసుకుని పేస్ట్ లాగా కలిపి తలకు పట్టిస్తే తలలోని ఇన్ఫెక్షన్ తగ్గి జుట్టు పెరుగుతుంది.
                      జుట్టు రాలడానికి  గల కారణాలు-- నివారణ                           13-12-10.

 ప్రధాన కారణం రక్త హీనత.

ముదురు రంగు ఆకు కూరలు, ఆపిల్, డ్రై ఫ్రూట్స్ మొదలైనవి వాడాలి.

ప్రతి రోజు ఒక ఆపిల్ తింటూ వుంటే హీమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

 ఆకు కూరలను సి విటమిన్ తో కలిపి తీసుకుంటే దానిలోని ఇనుము శరీరానికి అందుతుంది.

బెల్లంలో ఇనుము చాలా ఎక్కువ. మానసిక ఒత్తిడి లేకుండా చేసుకోవాలి.

ధ్యానం, కళారాధన, మంచి పచ్చని ప్రాంతాలలో ఉన్నట్లుగా, శ్ర్యావ్యమైన సంతీతం వింటున్నట్లు గా ఊహించుకుంటే మంచిది.

పైన చెప్పబడినవి ఆచరిస్తే జుట్టు బాగా పెరుగుతుంది.

అంతే కాక థైరాయిడ్ సమస్యలను నివారించుకోవాలి.శరీరంలో వేడి లేకుండా చూసుకోవాలి. దీనిని నీళ్ళు ఎక్కువగా తాగి తగ్గించుకోవాలి.

ఏనుగు దంతాన్ని కాల్చి మసి చేసి పాలతో కలిపి పూస్తే తప్పక జుట్టు పెరుతుంది. శీర్షాసనం వలన జుట్టు పెరుగుతుంది.

శిరోధార :-- శిరస్సు మీద ధారగా తైలాన్ని పోయడం వలన జుట్టు పెరుగుతుంది.

గురిగింజ గింజలను లేక వేర్లను నూరి పూయడం వలన జుట్టు పెరుగుతుంది.

మిరియాలను నూరి ఘర్షణ, వేడి పుట్టేట్లు రాయాలి.
మామిడి జీడిని, కరక్కాయ పెచ్చులను కలిపి నూరి పూస్తే జుట్టు ఊడిన చోట జుట్టు మొలుస్తుంది.

                                                     చిట్కా                                                      6-10-10.

  మందార ఆకులను, పూలను ఆరబెట్టి నువ్వులనూనేలో వేసి కాచి తలకు పెట్టుకుంటే వెంట్రుకలు నిగనిగలాడుతూ వుంటాయి.
                             జుట్టు పెరిగేందుకు మూర్ధా తైల మర్దన                                    17-12-10
 
మానసిక సమస్యల వలన, ఒత్తిడి వలన, కూడా జుట్టు రాలుతుంది. దీనికి సాధారణమైన నువ్వుల నూనెతో గాని, ఏదైనా ఔషధ తైలంతో గాని తలపై మర్దన చేయాలి. శరీరంలో వివిధ రకాల ప్రక్రుతులు వున్నపుడు వాడ వలసిన తైలాలు.

 1. వాత ప్రకృతి :-- హిమ సాగర తైలం దీనిని తల బిరుసుగా , శరీరం బిరుసుగా వున్నపుడు వాడితే మంచి ఫలితం వుంటుంది

. 2. పిత్త ప్రకృతి :-- సమస్య వున్నపుడు శరీరం వేడిగా కాలుతున్నట్లుగా వుంటుంది. దీని నివారణకు చందనాది తైలం, చందన బలాది తైలం వాడాలి.

 3. కఫ ప్రకృతి  :-- సమస్య వున్నపుడు శరీరంలో కఫప్రభావం ఎక్కువగా వుంటుంది. దీని నివారణకు త్రిఫలాది తైలం వాడాలి.

4. మధ్యస్థ ప్రకృతి :-- ఆసన బిల్వాడి తైలం

5. చుండ్రు :- దురదుర పత్రాది తైలం

6. వెంట్రుకలు తెల్లబడుతుంటే :-- నీలి భ్రున్గాడి తైలం లేదా భ్రున్గ రాజ తైలం లేదా భ్రున్గామలక తైలం చికిత్సను స్నానానికి ముందు, సూర్యోదయ సమయంలో చేస్తే మంచిది. దీనికంటే ముందు అర్ధ శక్తిగా వ్యాయామం చేస్తే మంచిది అంటే శరీరంలో కొంత వేడి పుట్టించి మర్దన చెయ్యాలి. తైలాన్ని పరోక్ష పద్ధతిలో ( డబల్ బాయిలింగ్ పద్ధతి ) 40 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేసి చేతిలో పోసుకుని బాధితుల తల మీద సరిగ్గా నడినెత్తి మీద పోసి తలంతా పరుచుకునేటట్లు పూయాలి. మెడ వరకు, చెవుల వరకు రుద్దాలి.

                                          మసాజ్ చేసే విధానం :--

 1. ఘర్షణ హస్తం :-- తలపై ముందు నుండి మొదలుపెట్టి వెనక్కి రుద్దడం

2. మృదు అంగుళి తాడనం  :-- రెండు చేతుల వేళ్ళతో జుట్టును పీకుతున్నట్లు గా చెయ్యాలి. దీనివలన జుట్టు ఉత్తేజితమవుతుంది.

3. ద్విహస్త తాడనం :-- తల మీద ముందు ఒక చేతితో తరువాత మరొక చేతితో తరువాత రెండు
చేతులతో కొట్టడం. (అర చేతులతో )

 4. తరంగ హస్తం :-- రెండు చేతులతో తల మీద, చెవుల పై భాగంలో అలలలాగా పైకి కిందికి కదిలించాలి. దీని వలన మగత వస్తుంది.

5. అంగుళీ క్రీడన హస్తం :-- చేతి వ్రేళ్ళను దూర దూరంగా పెట్టి డ్రమ్స్ వాయించినట్లుగా చేయడం.

 6. మృదు ముష్టి తాడనం :-- పిడికిలి బిగించి తల మీద నెమ్మదిగా కొట్టడం. తలంతా వలయాకారంలో కొట్టాలి. దీని వలన తల దిమ్ము నొప్పి తగ్గుతాయి.

7. జడత్వాన్ని వదిలించడం ( పీడనం) :-- జుట్టును గట్టిగా పీకినట్లు చేయడం

8. ఘటిత హస్తం :-- చేతి వేళ్ళతో తలను గట్టిగా ఒడిసి పట్టి ఒత్తాలి.

9. కర్ణ పాళీ పీడనం :-- చెవులను మసాజ్ చేయడం. ఇది చాలా ముఖ్యమైనది. చెవులను లాగుతున్నట్లుగా చెయ్యాలి. మెడ పట్టుకున్నట్లు వున్నపుడు దీని వలన ఎంతో రిలాక్స్ గా వుంటుంది. దీని వలన బాగా నిద్రించినట్లు అనిపిస్తుంది. తరువాత పెసర పిండితో గాని, శనగ పిండితో గాని రుద్దుకుని వేడి నీటితో స్నానం చెయ్యాలి.

                     జుట్టు పొడవుగా పెరగడానికి మూలికా తైలం                              18-12-10.

  మందార పూల పొడి                   ---- 50 gr
సరస్వతి వేర్ల పొడి                       ---- 50 gr
 గుంటగలగర పొడి                      ---- 50 gr
బావంచాల పొడి                         ---- 50 gr
గంధ కచ్చూరాల పొడి                 ---- 50 gr
వేపాకుల పొడి                            ---- 50 gr
జటామాంసి పొడి                        ---- 50 gr  
కొబ్బరి నూనె                           ---- అర కిలో  
నీళ్ళు                                     ---- అర లీటరు

   ఒక పాత్రలో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టాలి. ఒక్కొక్క చూర్ణాన్ని మూడు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకుని ;మరిగే నీటిలో కలపాలి. మూడవ వంతు నీళ్ళు మిగిలే వరకు కాచాలి. అవసరమైతే కొద్దిగా నీరు కలుపుకోవచ్చు. కషాయాన్ని వడ పోసుకొని దానికి కొబ్బరి నూనె కలిపి స్టవ్ మీద పెట్టాలి. కషాయం ఇగిరిపోయి తైలం మాత్రమే మిగిలే వరకు కాచాలి.

 చల్లారిన తరువాత వడ పోసుకుని సీసాలో భద్ర పరచుకోవాలి. తైలాన్ని కొద్దిగా తీసుకుని దానికి విడి కొబ్బరి నూనెను కొద్దిగా కలిపి వాడితే జుట్టు బాగా పెరుగుతుంది. నిద్ర బాగా వస్తుంది. అవసరమైతే తైలంలో సుగంధ ద్రవ్యాలను కలుపుకోవచ్చు.
  
                                  జుట్టు రాలే సమస్య ---శిరోపిచు                                    31-12-10.
తలలో సెగలు, పొగలు గా వున్నట్లు అనిపిస్తే --- చందన బల తైలం
తలలో పేలు ---- క్షీర బల తైలం
చుండ్రు ---- దత్తూర ( దుర్దర పాత్రా ) తైలం
జుట్టు రాలడం ---- భ్రుంగాది  తైలం
 
    జుట్టును కురచగా కత్తిరించి కాటన్ ప్యాడ్ ను తలపై వుంచి రెండు టీ స్పూన్ల ఔషధ తైలాన్ని పరోక్షంగా వేడి చేసి గుడ్డ మీద పోయాలి. దాని మీద 40 అంగుళాల పొడవున్న గుడ్డను తలకు కట్టాలి. ఒక గంట తరువాత తలారా స్నానం చేయాలి.
చర్మ సంబంధ సమస్యలున్న వాళ్ళు ఒక రోజంతా తలపై నూనెను ఉంచుకుని రెండవ రోజు తల స్నానం చేయాలి.
  
                                   జుట్టు రాలకుండా --నివారణ                                         16-1-11.
జుట్టు రాలుతుండానే ఆందోళనతో ఇంకా ఎక్కువగా రాలుతుంది.
మందార పువ్వుల చూర్ణం                       --- 50 gr
గంధ కచ్చూరాల పొడి                            --- 50 gr
బ్రాహ్మి చూర్ణం                                     --- 50 gr
కులం జాన్ వేర్ల చూర్ణం (దుంప రాష్ట్రం )    --- 50 gr
జటామాంసి చూర్ణం                               --- 50 gr
ముల్తాని మట్టి                                      --- 50 gr
             అన్నింటిని విడివిడిగా ఎండబెట్టి, దంచి, జల్లించి, కలిపి నిల్వ చేసుకోవాలి.
రెండు టీ స్పూన్ల పొడిని తీసుకుని దానికి తగినంత కలబంద గుజ్జును జుట్టుకు కలపడానికి తగిన విధంగా కలపాలి. కలబంద వలన జుట్టు మెత్తగా తయారవుతుంది.
పేస్ట్ ను జుట్టును పాయలుగా విడ దీసి కుడుల్లకు పట్టించాలి. అర గంట ఆగి స్నానం చేయాలి. విధంగా వారానికి రెండు, మూడు సార్లు చొప్పున మూడు నెలలు చేస్తే జుట్టు రాలే సమస్య నివారింప బడుతుంది.
కొత్త జుట్టు వస్తుంది. జుట్టు మెత్తగా నిగనిగలాడుతూ వుంటుంది.

                                  జుట్టులోని జిడ్డును తొలగించడానికి                                    11-3-11.
                                                   
                                               HAIR LOTION

         వెనిగర్               --- ఒక టేబుల్ స్పూను    
         నీళ్ళు                ---  ఒక పెద్ద గ్లాసు
         ఉప్పు               ---   మూడు వేళ్ళకు వచ్చినంత

               అన్నింటిని బాగా కలిపి లోషన్ లాగా తయారు చేయాలి.
    పరిశుభ్రమైన  దూదిని ఒక ఉండలాగా చేసి లోషన్ లో ముంచి కొద్దిగా పిండి తల మీద అద్దుతూ
 ప్రయోగించాలి. తరువాత తలలో వేడి పుట్టేట్లుగా  వేళ్ళతో పది నిమిషాలు బాగా మసాజ్ చేయాలి.
  ఒక గంట సేపు వదిలెయ్యాలి.   తరువాత చల్లటి నీళ్ళతో కడగాలి.

  తల స్నానానికి   షాంపూలు వాడకూడదు.

  ప్రతి రోజు తలకు నూనె పెట్టకూడదు.

       వెంట్రుకలు  అట్ట  కట్టినట్లు వున్నవాళ్ళు కూడా దీనిని వాడవచ్చు.
       చుండ్రుతో అట్టకట్టినట్లు వున్నా,  తలలో చీము పొక్కులు, దురదలు వున్నా దీనిని వాడవచ్చు.
  అన్ని సమస్యలు నివారింపబడతాయి.

                                  జుట్టులోని జిడ్డును తొలగించడానికి                                    14-3-11.
            
                                              ఆయుర్వేద షాంపూ

                      సీకాయ పొడి             ---- రెండు టీ స్పూన్లు 
                      పెసర పిండి               ---- ఒక టీ స్పూను
                      మెంతి పొడి               ---- అర టీ స్పూను
                      కోడిగుడ్డు తెల్ల సొన    ---- ఒకటి

        అన్నింటిని  పేస్ట్ లాగా కలిపి  జుట్టును పాయలుగా విడదీసి పట్టించి వేళ్ళతో బాగా మసాజ్
  చేయాలి,
        అర గంట తరువాత తలను కడగాలి.  దీనితో నురగ రాదు కాని జుట్టు బాగా శుభ్రపడుతుంది.

   ఉపయోగాలు:--  జుట్టు  అట్ట కట్టినట్లు గా ఉండడాన్ని తగ్గించి జిడ్డును తొలగిస్తుంది.
       దీనివలన  సేలోరియం అనే చర్మ వ్యాధి కూడా నివారింపబడుతుంది.

                                            తలస్నానం   చేసే విధానం                                      17-3-11.

       ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిని తాగి సుఖవిరేచనం అయిన తరువాత  ప్రతి రోజు
  తల స్నానం చేయాలి

       రాత్రే కుంకుళ్ళు గాని,  సీకాయ గాని మెంతిపొడి తో తడిపి ఉదయం వడకట్టి స్నానం చెయ్యాలి.
  గోరువెచ్చని లేదా చల్లని నీటితో స్నానం చేయాలి.  వేడినీటితో స్నానం చేస్తే దాని వలన వచ్చే
 సమస్యలు  నెల వరకు బాధిస్తాయి.

       స్నానానికి ముందు తైలంతో మృదువుగా మర్దన చేసుకుని  స్నానం చెయ్యాలి.

                        ఎండవేడి  వలన వెంట్రుకలు చిట్లడం -- నివారణ                           18-3-11.

                                               ఉష్ణ తైల చికిత్స
                      
                    కొబ్బరి నూనె       ----  10 mg
                    నిమ్మరసం          ----  ఒక టీ స్పూను
     పుచ్చకాయ లోని తెల్ల గుజ్జు   ----  10 gr

         కొబ్బరి నూనెలో  నిమ్మరసం,  పుచ్చకాయ గుజ్జు  వేసి బాగా కలపాలి.  దీనిని జుట్టుకుదుళ్ళ
     కు పట్టించి వేళ్ళతో బాగా వేడి పుట్టేట్లు మర్దన చేయాలి.   అరగంటసేపు ఎండలో నిలబడి
     తరువాత కుంకుళ్ళ  తో  లేదా సీకాయతో  స్నానం చేయాలి.  షాంపూ వాడకూడదు.

         మంచి పోషకాహారం తీసుకోవాలి.  థైరాయిడ్ సమస్యలుంటే నివారించుకోవాలి.
         తడి జుట్టును దువ్వకూడదు.  

                              జుట్టు రాలడం   ( ఎనోపేషియా )                                       28-3-11.

      ప్రధాన కారణాలు :--   వంశ పారంపర్యత,  జుట్టును బిగించడం,  మాటిమాటికి దువ్వడం, 
  క్రానికల్  డిసీజస్ ,  ఉదా :--- ఎగ్జిమా, మధుమేహం, థైరాయిడ్,  టైఫాయిడ్,   రక్తహీనత

                                         కేశమిత్ర లేపనం
   
                అతిమధురం చూర్ణం               ---ఒక టీ స్పూను  
                       పాల మీగడ                    --- ఒక టీ స్పూను
                కుంకుమ పూలు                    --- 4,  5
                ఉమ్మెత్త గింజల చూర్ణం           --- ఒక టీ స్పూను

     ఒక గిన్నెలో అతిమధురం పొడిని  తీసుకుని దానికి  మిగిలిన పదార్ధాలను కలపాలి.  దీనిని
 కేశాలు ఎక్కువగా రాలిన భాగంలో పై పూతగా వాడాలి. ఐదు నిమిషాలు బాగా వేడి పుట్టే విధంగా
 రుద్దాలి.  మరుసటి రోజు ఉదయం  వేడి నీటితో స్నానం చేయాలి. 

     పత్యం పాటించాలి. :-- రోగకారణాలు  తెలుసుకుని  చికిత్స తీసుకోవాలి.   మెత్తటి దువ్వెనతో
 దువ్వుకోవాలి.  వెంట్రుకల కొనలు  బల్బుల్లాగా ఉండాలి. వారానికి ఒక సారి దువ్వేనాను శుభ్ర
 పరుస్తూ వుండాలి. 
     ప్రతి రోజు  క్యారట్ రసానికి నిమ్మరసం కలిపి తాగాలి   ఆహారంలో మాంసకృత్తులు  వుండాలి.

                                                 HAIR  CONDITIONER                            31-3-11.
   
                                                        హెయిర్ కండిషనర్

              ఇది అన్ని రకాలుగా, అన్ని సందర్భాలలోనూ పనికొచ్చే ఔషధం .

                            ఆముదం              --- ఒక టీ స్పూను    
                            బాదం నూనె          ---  "    "     "
                            వెనిగర్                  ---  "    "     "
                            గ్లిజరిన్                  ---  "    "     "
                            షాంపూ                 ---  తగినంత
            
             ఒక గిన్నె తీసుకుని దానిలో అన్ని ద్రవ పదార్ధాలను వేసి చివరలో షాంపూ ను కలపాలి.
     అన్ని పదార్ధాలు బాగా కలిసేట్లు బాగా గిలకొట్టాలి.

        దీనిని  జుట్టు యొక్క కుదుళ్ళ కు వేళ్ళతో కొద్దికొద్దిగాతీసుకుంటూపట్టించాలి.జుట్టును మృదువుగా మర్దన చేయాలి.  అరగంట సేపు అలాగే వదిలెయ్యాలి.  తరువాత మామూలు  నీళ్ళతో స్నానం చేయాలి.  దీనితో కేశాలు  శుభ్రపడతాయి.  ఎండిపోవు.

      సూచనలు :--
      తల మీద తేమ ఆరిపోకుండా చూసుకోవాలి.
      తలను గోడకు ఆనించి పెట్టకూడదు.
      రెండు చేతులు తల వెనక పెట్టుకో కూడదు.
      జుట్టులో క్షార తత్వం పెరగకుండా చూసుకోవాలి.
      ఎక్కువ జుట్టు వున్నవాళ్ళు మెత్తటి ( శాటిన్)  దిండు కవర్లను వాడాలి.
      సాధ్యమైనంత వరకు ఎండలో తిరగకూడదు.

                        జుట్టు సమస్యల నివారణకు -- నీలకేశిని                                       31-3-11.

              నల్ల నువ్వుల పొడి                    --- 50 gr
              ఉసిరిక పెచ్చుల పొడి                --- 50 gr
              గుంటగలగర ఆకు పొడి            --- 50 gr
                        అతిమధురం పొడి         --- 50 gr
                            పాతబెల్లం              ---100 gr

       అన్ని   కలిపి  వేసి  కలిపి మెత్తగా నూరాలి.

       ప్రతి రోజు  పది గ్రాముల ముద్దను నోటిలో పెట్టుకుని చప్పరిస్తూ వుంటే జుట్టు రాలదు.
  నల్లబడుతుంది.                           
                                            జుట్టు రాలకుండా ఉండాలంటే                                    9-4-11.

        1.             తెల్లగలిజేరు  ( పునర్నవ) వేర్ల చూర్ణం            --- అర టీ స్పూను
                                         సుగంధపాల వేర్ల చూర్ణం             --- అర టీ స్పూను
                                                           నీళ్ళు                    --- ఒక గ్లాసు

        ఒక గ్లాసు నీటిలో రెండు చూర్నాలను వేసి స్టవ్ మీద పెట్టి మరిగించి అర గ్లాసుకు రానివ్వాలి.
 దించి వడకట్టి గోరువెచ్చగా వున్నపుడు తేనె కలుపుకొని తాగితే శరీరంలోని వేడి తగ్గి జుట్టు
 రాలకుండా వుంటుంది.

        2.             కరక్కాయ బెరడు ముక్కలు       ---10
                        తానికాయ బెరడు ముక్కలు      --- 10
                       ఉసిరికాయ బెరడు  ముక్కలు     --- 10

        రాత్రి పూట అన్ని ముక్కలను ఒక గిన్నెలోవేసి  సరిపడినన్ని  నీళ్ళు పోసి నానబెట్టాలి.
  ఉదయం ఆ ముక్కలను తీసి మెత్తగా నూరి జుట్టును పాయలుగా విడదీసి కుదుళ్ళ కు పట్టించాలి.
  ఒక గంట తరువాత సీకాయతో గాని కుంకుళ్ళ తో గాని తల స్నానం చేయాలి.

       3.  రోజుకు రెండు,  మూడు సార్లు రెండు చేతుల  గోళ్ళను (బొటనవేళ్ళ ను తప్ప ) చకచకా రుద్దుకుంటూ వుండాలి.

                                       కేశ వర్ధన లేపనం                                                          17-4-11.

                    కొబ్బరి పాలు                      --- అరకప్పు
                    నిమ్మరసం                         --- ఒక టీ స్పూను
                    మందార ఆకుల ముద్ద         --- టేబుల్ స్పూను
                    మెంతి పొడి ముద్ద               ---     "        "

          ఒక గిన్నెలో కొబ్బరి పాలు తీసుకొని దానికి నిమ్మ రసం కలపాలి,దీనిని బాగా కలిపి  జుట్టు
 కుదుళ్ళకు  పట్టించాలి.  5, 6  గంటల సేపు అలాగే  ఉంచాలి. తరువాత మందార ఆకుల ముద్దకు
 మెంతి పిండిని కలిపి పిసికి ( అవసరమైతే నీళ్ళు కలిపి ) పేస్ట్ లాగా చేసి తలకు  పట్టించాలి.
 కొంతసేపు ఆగి తల స్నానం చేయాలి.

 సూచనలు :--   హార్మోన్ల,  థైరాయిడ్ సమస్యలు వుంటే వాటికి చికిత్స తీసుకోవాలి.
                        సంతాన నిరోధక మాత్రలు వాడకూడదు. 
                        తలను మాటిమాటికి దువ్వకూడదు.
                        మంట,  సెగలకు దూరంగా వుండాలి.

                                                కేశమిత్ర                                                       30-5-11.

ఎండు  ఉసిరిక ముక్కలు -----
ఎండు  గుంటగలగర ఆకు పొడి  తో కాచిన కషాయం ----

      ఉసిరిక ముక్కలు మునిగే విధం గా  గుంటగలగర కషాయం పోసి రాత్రంతా నానబెట్టాలి
ఉదయం ఉసిరిక ముక్కలను ఎండబెట్టాలి . ఈ విధంగా ఏడు సార్లు భావన చేయాలి . తరువాత
ఉసిరిక ముక్కలను బాగా ఎండబెట్టాలి . తరువాత వీటిని దంచి పొడి చేసి సీసాలో నిల్వ చేసుకోవాలి
      
     ప్రతిరోజు అర టీ స్పూను పొడిని  ఒక టీ స్పూను తేనె కలిపి సేవించాలి

    దీని వలన జుట్టు నల్లబడుతుంది  మరియు పెరుగుతుంది . 
    తల స్నానానికి  కుంకుళ్ళను  మాత్రమె వాడాలి .  షాంపూ లను వాడకూడదు .

                   జిడ్డు కలిగిన రాలే జుట్టును అరికట్టడానికి షాంపూ చూర్ణం                  4-6-11.

కారణాలు , లక్షణాలు :--  వంశపారంపర్యత ,  వ్యాధినిరోధక శక్తి లేకపోవడం , నర్వస్ నెస్, జుట్టు
పీక్కోవడం, ఒత్తిడి ,టైఫాయిడ్ జ్వరం మొదలైన లక్షణాలు వుంటాయి .

పెసర పిండి                    --- 10 gr
ఉసిరిక పొడి                 --- 750 gr
శీకాకాయ పొడి               ---  15 gr
మెంతి పిండి                  --- 7.5 gr
  
       అన్ని చూర్ణాలను  ఒక గిన్నెలో వేసి ఒకే చూర్ణం లాగా బాగా కలిపి సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి

      అవసరమైనంత పొడిని తీసుకొని తగినంత నీరు కలిపి పలుచుగా తయారు చేసి పదిహేను
నిమిషాలు నానబెట్టాలి .  దీనిని ఉపయోగించి తలస్నానం చేయాలి

సూచనాలు :-- దుమ్ము ,  ధూళి  ల నుండి దూరంగా వుండాలి .  మరీ ఎక్కువగా వున్నఎండకు
గురికాకూడదు .  సరిఅయిన సమయానికి నిద్రించడం ,  నిద్రలేవడం చేయాలి .

                        పొడి జుట్టు నివారణకు  --- కండిషనింగ్ షాంపూ                     6-6-11.

 కండిషనర్  = జుట్టు యొక్క అమరిక, రూపం కూర్పు, స్పర్శ, అందం మొదలైన వాటిని   ఒక
పద్ధతిలో  ఉండేవిధంగా చేస్తుంది . వేడి నుండి కాపాడడం, జుట్టును అందంగా వుంచడం , తైల
యుక్తంగా చేయడాన్ని కండిషనింగ్ అంటారు .

కలబంద గుజ్జు             --- ఒక టీ స్పూను
షాంపూ                      --- రెండు టేబుల్ స్పూన్లు
మంచి నీళ్ళు              --- ఒక కప్పు

   ఒక గిన్నెలో అన్నింటిని వేసి బాగా కలపాలి స్నానానికి ఒక గంట ముందు దీనిని జుట్టుకు పట్టించాలి . మొదట తలను నీటితో తడపాలి ..

  కలబంద జుట్టును మార్దవంగా ఉంచుతుంది . ఎండ నుండి కాపాడుతుంది .  జుట్టును చిట్లనివ్వదు
రాలనివ్వదు .

సూచనలు :---  మసాలాతో కూడిన మరియు  స్పైసీ  గా వున్న ఆహారం తిన కూడదు . తలకు
చెమట పట్టనివ్వ కూడదు . ఒత్తిడిని నివారించుకోవాలి . ప్రోటీన్స్ ఎక్కువగా వున్నఆహారం
తీసుకోవాలి .  వ్యక్తిగత శుభ్రత ను పాటించాలి .

                               జుట్టు ఒత్తుగా పెరగడానికి  మందార తైలం                                       24-6-11 .

జుట్టు రాలదానికి గల కారణాలు :--
  సరైన పోషకాహారం తీసుకోక పోవడం .
డిప్రెషన్  తగ్గించుకోవడానికి , హార్మోన్ల సమతుల్యానికి ,  గర్భానిరోధకానికి మందులు వాడడం .

తాజా మందార పూలు          ---- ఒక కిలో
నువ్వుల నూనె                    ---- ఒక కిలో

        మందార పూలను దంచి ముద్దగా చేసి నువ్వుల నూనెలో వేసి గిన్నెలో  పోసి మూతపెప్రతి రోజు ట్టి ఒక  రోజంతా ఎండలో పెట్టాలి .           దీనిని ఆదిత్య పక్వం అంటారు .

        ప్రతిరోజు రాత్రి బాగా తలకు పట్టించాలి . ఇది రాత్రంతా బాగా పనిచేస్తుంది . దీనివలన అదనపు ఫలితం వుంటుంది
ఈ  విధానము వలన జుట్టు చిత్లిపోకుండా వుంటుంది .

తీసుకోవలసిన జాగ్రత్తలు :--- మంచి పోషకాహారం  తీసుకోవాలి .  హెయిర్ డ్రయ్యర్  వాడకూడదు .

                                        వెంట్రుకలు రంగు వేసినంతగా  నల్లబడడానికి                               27-6-11.

తుమ్మ చెక్కను ఉడకబెట్టగా   వచ్చిన అర్కము            
                                         ఉసిరిక పొడి
                                         ముసామ్బరం పొడి   

        అన్నింటిని కలిపి కాచి గాని లేదా దీనిని నువ్వుల నూనె తో కలిపి కాచిగాని వారానికి  రెండు,  మూడు సార్లు
తలకు పెట్టుకుంటూ వుంటే  జుట్టు రంగు వేసినంత నల్లగా మారుతుంది .

2.  మేక కొమ్ముల పొడిని ఇనుప బాణలిలో వేసి మాడ్చాలి  
     మేకకోమ్ముల బూడిద                 --- 50 gr
             నువ్వుల నూనె                 ---100 gr

         రెండింటిని కలిపి వారం రోజులు  ఎండలో పెట్టాలి .  తరువాత కాచి   చల్లార్చి సీసాలో భద్రపరచుకోవాలి . దీనిలో వేలు
ముంచితే భయంకరమైన నలుపు రంగు అంటుకుంటుంది . వారానికి రెండు , మూడు సార్లు దీనిని తలకు పెట్టుకొని
తలస్నానం చేస్తూ వుంటే వెంట్రుకలు రంగువేసినంత  నల్లగా మారతాయి .

                                          భ్రుంగామలక   తైలం

భ్రుంగ  = గుంటగలగర
ఆమలక  = ఉసిరి

కావలసిన పదార్ధాలు :---
కొబ్బరి నూనె             --- అర  కిలో
గుంటగలగర ఆకు యొక్క నిజ రసం    --- అర లీటరు
ఉసిరి కాయల రసం     ---  పావు లేదా అరా లీటరు
ఆవు పాలు                ---  ఒక లీటరు
అతిమధురం              --- 50 gr
మెంతులు                  --- 20 gr
రెక్క మందార పూలు   ---  10 gr

     అతిమధురం  వేర్లను నలగ గొట్టి పెత్తుకొవాలి.
     పైన చెప్పబడిన  అన్ని పదార్ధాలను ( మెంతులు  తప్ప  )  బాగా  మందంగా వున్న అల్యూమినియం  గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి సన్న మంట  మీద కాచాలి. అడుగంటకుండా జాగ్రత్త పడాలి. గరిట తో కలియ బెడుతూ
వుండాలి . చివరలో మెంతులను వేయాలి  తేమ పూర్తిగా ఇంకిపోయి నూనె మాత్రమె మిగిలే విధంగా కాచాలి .  కొద్దిగా
చల్లారిన తరువాత  వేరే గిన్నెలోకి వడకట్టాలి .
     పూర్తిగా చల్లారిన తరువాత సీసాలో పోసి భద్రపరచుకోవాలి .

    అన్ని పదార్ధాలు ఒకే సారి దొరకనప్పుడు  కొబ్బరినూనెలో  గుంటగలగర రసం మాత్రమె  గాని, ఉసిరిక రసం మాత్రమె
గాని వేసి కాచుకోవచ్చ
                                                        లంబ కేశిని                                             8-7-11.
ముల్లంగి                      ---- 200 gr 
మిరియాల పొడి            ----  3 చిటికెలు
సైంధవ లవణం              ----  3 చిటికెలు

        అన్నింటిని కలిపి తినాలి  .  లేదా ముల్లంగి లో తేనె కలుపుకొని తినవచ్చు లేదా అన్నం లో కలుపుకొని తినవచ్చు

                వర్షాకాలంలో జుట్టు నుండి జిడ్డు కారడం , జుట్టు అట్టకట్టడం   --- నివారణ     17-7-11.

ఆలివ్  నూనె               ---- 3 టీ స్పూన్లు
ఆముదం                    ---- అర  టీ స్పూను
కొబ్బరి నూనె              ---- అర  టీ స్పూను
మెంతి పొడి                 ----  తగినంత

     ఒక గిన్నెలో అన్ని నూనెలను వేసి తగినంత మెంతి పిండి లేపనం లాగా బాగా కలపాలి  తలస్నానానికి పావు గంట ముందుజుట్టును పాయలు పాయలు గా విడదీసి  లేపనాన్ని పట్టించాలి . పావు గంట వుంచి గోరువెచ్చని నీటితో తల
స్నానం చేయాలి .

పుల్లటి పెరుగు            ---- 2 టేబుల్ స్పూన్లు
నిమ్మ రసం                ---- 3 టేబుల్ స్పూన్లు

     పై లేపనం పట్టించి తల స్నానం చేసిన తరువాత పెరుగు , నిమ్మరసం బాగా కలిపి జుట్టును పాయలుగా విడదీసి
కుదుళ్ళ కు పట్టించాలి . కొంచం సేపైన తరువాత  మామూలు నీటితో కడగాలి  .  కొద్ది సేపైనా తరువాత తల స్నానం
చేయాలి .
సూచనలు :-- మంచి పోషకాహారం తీసుకోవాలి .  మసాలాలు , ఘాటు పదార్ధాలు వాడకూడదు .

                                                      జుట్టు నల్లబడడానికి                                27-7-11
జుట్టుకు పెట్టడానికి :--

గాయపాకు రసం                  ---- అర లీటరు
గుంటగలగర రసం               ---- అర లీటరు
నువ్వుల నూనె                    ---- అర కిలో

       అన్నింటిని కలిపి గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద నూనె మాత్రమె మిగిలేవరకు కాచాలి .
       వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి .

       దీనిని జుట్టుకు రాసుకుంటూ వుంటే జుట్టు పెరుగుతుంది , రాలదు .

కడుపులోకి :---- 

నల్ల నువ్వుల పొడి
గుంటగలగర ఆకు పొడి
ఉసిరిక పొడి
పటికబెల్లం పొడి
        అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని బాగా కలిపి నిల్వ చేసుకోవాలి .

పిల్లలకు                     ---  పూటకు అర టీ స్పూను చొప్పున
పెద్దలకు                     ---  పూటకు ఒక టీ స్పూను చొప్పున

        కడుపులో కి సేవించి నీళ్ళు తాగాలి  దీనితో పాటు పోషక విలువులు కలిగిన ఎండుకొబ్బరి , మినప సున్నుండలు
వంటి పదార్ధాలను కూడా తినాలి


        



    














       





   
                                       

                                       
  
                                             
            





                                           

 

              











                                                  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి