డెంగ్యు

                     డెంగ్యు వ్యాధి -- పరిష్కార మార్గాలు                                            30-10-10.

       నీరు,  గాలి,  వాతావరణం లో మార్పుల వలన కొన్ని వ్యాధులు వస్తుంటాయి.

డెంగ్యు జ్వర లక్షణాలు:--   విపరీతమైన తలనొప్పి, జలుబు, గొంతునొప్పి, గొంతు పట్టినట్లుగా వుండడం, దగ్గితే  రక్తం పడడం, చెవుల్లో రక్తం రావడం,  ఆకలి లేకపోవడం, నీరసం మొదలైన లక్షణాలు వుంటాయి.

       మనుషుల శారీరక పరిస్థితులను బట్టి మార్పులు జరగవచ్చు.

       కాలేయము, గుండె మొదలగు చోట్ల అంతర్గత రక్త స్రావం జరగడం వంటి లక్షణాలు  వున్నపుడు చాలా  ప్రమాదకరం.

మహాలక్ష్మి విలాసిని
ఆరోగ్య వారధిని
అమృతారిష్ట 

     ఈ వ్యాధి నివారణకు పై ఔషధాలను వాడ వచ్చును.

     గంధ కచ్చూరాలు వైరస్ ను నాశనం చెయ్యడంలో అద్భుతమైనది.  అడ్డసరం శ్వాస సంబంధమైన  వ్యాధులను నివారించడం లో చాలా గొప్పది.

gandha కచ్చూరాల చూర్ణం                 --- 50 gr
అతి మధుం చూర్ణం                           --- 100 gr
తిప్ప తీగ కాండపు చూర్ణం                 ----   25 gr
తెల్ల మద్ది చెక్క బెరడు చూర్ణం            ----   25 gr ( పచ్చిది కూడా వాడుకోవచ్చు)
అడ్డసరం ఆకుల చూర్ణం                     ----   25 gr

        అన్నింటి యొక్క చూర్ణాలను కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.

        రెండు లెటర్ల నీటిలో రెండు టీ స్పూన్ల పొడిని వేసి కాచి ఒక లీటరుకు రానిచ్చి రోజంతా ఆ నీటినే తాగుతూ  వుండాలి.   దీనిలో తేనె కలిపి కూడా వాడుకోవచ్చు.

       చిన్న పిల్లలకైతే చూర్ణంలో తేనె కలిపి మాత్రలు కట్టి మింగించవచ్చు.

ఆహార నియమాలు:--     ఆకలి వేసి తినాలనిపిస్తేనే ఆహారం ఇవ్వాలి.

        శొంటి, జిలకర,  మిరియాలు వంటివి వేసి  రసం పెట్టి వాడవచ్చు.

    






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి