స్థూల కాయము (అధిక బరువు)

                               అధిక బరువు తగ్గడానికి అగస్త్య లేహ్యం                   4-2-09.
 
                              వాము               ------ 100 gr
                              కలకండ             ------ 100 gr
                              ఆవునెయ్యి         ------ 100 gr
 
       వామును శుభ్రపరచి దోరగా వేయించి, దంచి, జల్లించి, వస్త్రగాయం పట్టి మెత్తటి పొడి తయారు చెయ్యాలి.
కలకండను కూడా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి.నేతిని  చిన్న మంట మీద కరిగించి వేడిగా వున్న్నపుడే రెండు పొడులను కలపాలి.
 
      దీనిని వాడితే ఆడపిల్లల యొక్క నడుము నొప్పి 40 రోజులలో తప్పక తగ్గుతుంది.
 
                                చిన్న పిల్లలకు         ---- 2 gr
 
                                        పెద్దలకు          ---- అర టీ స్పూను నుండి ఒక టీ స్పూను.
 
     ఆహారానికి ముందు గాని తరువాత గాని తీసుకోవచ్చు.

                    అధిక బరువు తగ్గడానికి                                                  4-3-09

                                గోరు వెచ్చని నీరు            ------ ఒక గ్లాసు
                                త్రిఫల చూర్ణం                  ------ ఒక టీ స్పూను
                                తేనె                               ------ ఒక టీ స్పూను

      ప్రతి రోజు సాయంత్రం  ఈ విధంగా అన్నింటిని కలుపుకొని తాగాలి.  రెండవ పూట పావు స్పూను తో  ప్రారంభించాలి.

               స్థూల కాయమున్న వాళ్ళు రాత్రి వేళ తీసుకోవాల్సిన ఆహారం             23-7-10.
 
బియ్యం
జొన్నలు
గోధుమలు
పెసలు
ఉలవలు
బార్లీ   
 
          అన్ని పాత దాన్యాలనే తీసుకోవాలి. ఒక్కొక్కటి పావు కిలో చొప్పున తీసుకోవాలి.
 
          అన్నింటిని రాత్రి నానబెట్టి ఉదయం ఎండబోసి బాగా ఎండిన తరువాత దోరగా వేయించి పిండి పట్టించి  నిల్వ చేసుకోవాలి.  ఈ పిండితో ప్రత్రి రోజు రాత్రివేళ రొట్టెలు చేసుకొని తింటే స్థూల కాయం తగ్గుతుంది.

                          అధిక బరువు  నివారణకు చికిత్స                                          4-10-10.

          వంశ పారంపర్యం,  ఆహార జీవన లోపాలు మొదలైన కారణాల వలన వస్తుంది.

          ఆహారం పూర్తిగా జీర్ణమై  శేష పదార్ధం  కూడా మిగలకుండా వున్నపుడు స్థూలకాయం రాదు. ( శేష పదార్ధం అంటే అవసరానికి మించి మిగిలినది అని అర్ధము)

ఉసిరిక పొడి                       --- 100 gr
కరక్కాయ పొడి                  --- 100 gr
తాని కాయ పొడి                 --- 100 gr
శొంటి పొడి                        --- 100 gr
పిప్పళ్ళ పొడి                    --- 100 gr
మిరియాల పొడి                 --- 100 gr
వాయు విడంగాల పొడి        --- 100 gr
తుంగముస్తల పొడి            ---  100 gr
తెల్ల చిత్ర మూలం పొడి      ---  100 gr

       అన్నింటిని విడివిడిగా చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.

      ఒక టీ స్పూను పొడిని తీసుకుని తగినంత నువ్వుల నూనె కలిపి ముద్దలాగా చేసి తినాలి. ఈ విధంగా   ప్రతిరోజు తింటూ వుంటే బరువు తగ్గుతారు.

      అధిక బరువు వలన రక్తము, మాంసము, మజ్జ, మేధో, కొవ్వు మొదలైనవి వాటియొక్క పనులు సక్రమముగా జరగవు.  అవి సరిగా పెరగవు.  రక్త నాళాలలో కొవ్వు పేరుకు పోతుంది.

                                                         చిట్కా .

ముల్లంగి రసం                   --- పావు గ్లాసు

    ప్రతి రోజు తాగుతూ వుంటే అధిక బరువు తగ్గుతుంది.


                                 స్థూల కాయం --- రక్త హీనత                                25-12-10.

         దీని వలన శరీరంలో  నీరు  చేరుతుంది.
.
         రక్త హీనత ,  నెలసరి సమస్యలు , నీరు చేరడం,  బహిష్టు  అల్పం గా కనిపించడం ,    గడ్డలుగా పడడం   మొదలైన లక్షణాలు వుంటాయి.

                                          నవాయస  చూర్ణము

శొంటి పొడి
మిరియాల పొడి
పిప్పళ్ళ   పొడి
చిత్ర మూలం
వాయు విదంగాలు
కరక్కాయ పెచ్చులు
తానికాయ పెచ్చులు
ఉసిరి పెచ్చులు
తుంగ ముస్థలు
లోహ భస్మం

       అన్నింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి.  విడివిడిగా చూర్నాలు చేసి  సీసాలో నిల్వ చేసుకోవాలి.

       ఒకటి  నుండి  రెండు టీ స్పూన్ల చూర్ణాన్ని మాత్రమే తీసుకోవాలి.  ఉదయం, సాయంత్రం  తేనెతో తీసుకోవాలి.

       దీనిని సేవించడం వలన ఆకలి లేకపోవడం,  అధిక చెమట, నీరసం, రక్త   హీనత,  శరీరంలో నీరు చేరడం  చర్మం పాలిపోయినట్లుగా వుండడం  మొదలైనవి నివారించ బడతాయి.  మహిళల యొక్క బహిష్టు సమస్యలకు  కూడా మంచి నివారణా మార్గముగా ఉపయోగ పడుతుంది.

                                                          బరువు తగ్గడానికి                                        16-8-11

           రాత్రి పూట ఒక గ్లాసు నీటిని రాగి చెంబులో గాని , మట్టి ముంతలో గాని పోయాలి . దానిలో  ఒక
తిప్ప తీగ ఆకును వేసి  పెట్టాలి . ఉదయం ఆ నీటిని వడ పోసుకొని పరగడుపున  తాగాలి .  ఒక గంట వరకు ఏమి తినకూడదు , తాగకూడదు .
      ఈ విధంగా 40 రోజులు చేస్తే తప్పకుండా బరువు తగ్గుతారు .

                                                    అధిక బరువు తగ్గడానికి                                           10-9-11
కలబంద గుజ్జు               --- 30 gr
పసుపు                        --- 3 చిటికెలు
జిలకర                        --- 3     "
తిప్ప తీగ పొడి              --- 3     "
కలకండ                       --- ఒక టీ స్పూను

       అన్నింటిని నీళ్లలో కలుపుకొని తాగాలి .

       పద్మాసనం లో కూర్చొని ( సుఖాసనం ) రెండు చేతులను చాపి  మోకాళ్ళ  మీద పెట్టుకోవాలి . చూపుడు వేలును ,
మధ్య వేలును చాపాలి .మిగిలిన వేళ్ళను కలిపి కూర్చోవాలి . ఈ ఆసనం లో కూర్చొని " రం "  అనే అక్షరాన్ని  60 సార్లు
పలకాలి .
                                                               13-9-11

కారణాలు :--- చేసే పని తక్కువగా ఉండడం , తినే ఆహారం ఎక్కువగా ఉండడం , చల్లి కాలం , జన్యుపరమైన సమస్యలు
వంశపారంపర్య కారణాలు , థైరాయిడ్ , స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడడం , ఎమోషన్స్ కారణముగా ఎక్కువగా తినడం
వయసు మీద పడడం , గర్భధారణ సమయము లో హార్మోన్ల సమస్య , నిద్ర చాలక పోవడం ,  పాలీసిస్టిక్ ఓవరీస్ , పరోక్ష
ధూమ పానం మొదలైనవి .

సూచన :--- అశ్రద్ధ పనికి రాదు .

1. నువ్వుల నూనె                --- ఒక టేబుల్  స్పూను
    వెన్న లేని పెరుగు            --- ఒక కప్పు

     రెండింటిని కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి . దీని వలన కండరాలు గట్టిపడతాయి . దీనిని 20 రోజులు చేయాలి .

2. దేవ కాంచన చెట్టు బెరడు చూర్ణం          --- ఒక టాల్ స్పూను
                   తేనె                                 --- ఒక టీ స్పూను
              నిమ్మ రసం                            --- ఒక టీ స్పూను

   చూర్ణం తో కాషాయం కాచాలి .దించి వడకట్టి గోరువెచ్చగా  అయిన తరువాత దానిలో నిమ్మ రసం , తేనె కలుపుకొని
తాగాలి . దీనిని 40 రోజుల నుండి 2, 3 నెలల వరకు వాడాలి . దీనితో బరువు తగ్గుతారు .

                                 
    









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి