కాలేయాన్ని శుభ్రపరచడానికి --- భ్రుంగరాజ రసాయనం 1-1-2009.
గుంటగలగర ఆకును కాటుక ఆకు అని కూడా అంటారు.
పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున (ఆదివారమైతే మరీ మంచిది) మొక్కలను తెచ్చుకోవాలి.
ఆ రోజు మొక్కలలో ఔషధ శక్తి చాలా రెట్లు పెరుగుతుంది. గుంటగలగర, తెల్లగలిజేరు మొక్కలను తెచ్చి కడిగి వేర్వేరుగా ఎండబెట్టాలి. వారం, పది రోజులు ఎండ బెట్టాలి.
ఆ రోజు మొక్కలలో ఔషధ శక్తి చాలా రెట్లు పెరుగుతుంది. గుంటగలగర, తెల్లగలిజేరు మొక్కలను తెచ్చి కడిగి వేర్వేరుగా ఎండబెట్టాలి. వారం, పది రోజులు ఎండ బెట్టాలి.
గుంటగలగర పొడి ------100 gr
తెల్ల గలిజేరు పొడి ----- 100 gr
వేయించిన నువ్వుల పొడి ------ 100 gr
కలకండ పొడి ------ 100 gr
మధుమేహ వ్యాధి గ్రస్తులు తాటి బెల్లం వాడవచ్చు. అన్ని పొడులను కలిపి వస్త్రగాయం పట్టి
గాజు సీసాలో భద్రపరచుకోవాలి.
గాజు సీసాలో భద్రపరచుకోవాలి.
రాత్రి ఆహారానికిఒక గంట ముందు మూడు చిటికెల పొడిని తీసుకోవాలి .తేనెతో కూడా
తీసుకోవచ్చుఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. మరియు వెంట్రుకలు శాశ్వతంగా నల్లబడతాయి.
తీసుకోవచ్చుఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. మరియు వెంట్రుకలు శాశ్వతంగా నల్లబడతాయి.
కాలేయ సమస్యలకు ఆహార ఔషధం 27-2-09.
తెల్ల గలిజేరు --100 gr
నేల ఉసిరి --100 gr
గుంటగలగర --100 gr
అన్నింటిని సమూలముగా తెచ్చి కడగి ఎండబెట్టి విడివిడిగా దంచి పొడి చెయ్యాలి. కలిపి
సీసాలో భద్ర పరచుకోవాలి.
ఈ పొడిని భోజనానికి ఒక గంట ముందు పావు టీ స్పూను నుండి అర టీ స్పూనుకు పెంచుతూ ఒక కప్పుమంచి నీళ్ళలో కలిపి సేవించాలి. గంట ముందు గంట వెనుక ఏమి తినకూడదు.
ఉదయం, సాయంత్రం రెండుపూటలా వాడాలి.
కాలేయ సమస్యలు రాకుండా ఈ పొడిని ఆకుకూరలు, పప్పు, సామ్బారులలో మూడు చిటికెల పొడిని వేసుకొని తినాలి.
లివర్ లేదా కాలేయ సమస్యల నివారణ 4-3-09.
1. చంద్రభేదన ప్రాణాయామం
2. శీతలి ప్రాణాయామం:-- మోకాళ్ళ మీద కూర్చొని నాలుకను దొన్నె లాగా మడిచి గాలి పీల్చి
నోరు మూసి ముక్కుతో గాలి వదలాలి.
3. మోకాళ్ళ మీద గాని, లేదా పద్మాసనం లో గాని కూర్చొని పై దవడ పళ్ళను, కింది దవడ పళ్ళను కలిపి నొక్కిఆరోగంగా కాలేయం పెదవులను తెరిచి పళ్ళ మధ్యనుండి గాలిని పీల్చి నోరు మూసి ముక్కు నుండి గాలి వదలాలి.
50 గ్రాముల శనగలను గుగ్గిళ్ళ లాగా ఉడికించి వాటి మీద కొద్దిగా సైంధవ లవణం చల్లాలి. మరో 50గ్రాముల శనగలను కొద్దిగా నెయ్యి వేసి వేయించి సైంధవ లవణం చల్లాలి.
ఉడికించిన శనగలను ఉదయం పరగడుపున తినాలి. 15 నిమిషాల తరువాత వేయించిన
శనగలను తినాలి.
పులుపు, ఎక్కువ కారం, మద్యం, సిగరెట్, మాంసం, చేపలు, గుడ్లు వంటివి మానెయ్యాలి.
కాలేయ సమస్యలు --- నివారణ 14-6-09.
పచ్చి శనగలను నానబెట్టి ఉడికించాలి (గుగ్గిళ్ళు)
శనగ గుగ్గిళ్ళు ----- 50 gr
శనగలను మెత్తగా ఉడికించి వాటి పై సైంధవ లవణాన్ని చల్లాలి. వీటిని ఉదయం పరగడుపున తినాలి.ఈ విధంగా ఉదయం పరగడుపున రోజుకు 50 గ్రాముల గుగ్గిళ్ళ చొప్పున 15 రోజులు తినాలి. ఒక గంట వరకుఏమి తినకూడదు.
15 రోజుల తరువాత ఇంకొక 50 గ్రాముల శనగలను వేయించుకొని తినాలి. అనగా గుగ్గిళ్ళు మరియు వేయించిన శనగలను 16 వ రోజు నుండి 30 వ రోజు వరకు తినాలి.
ఈ 30 రోజులు పూర్తిగా కారాన్ని నిషేధించాలి.
బహిష్టు సమయంలో వచ్చే కాలేయ సమస్యలు--- నివారణ 16-6-09.
మురికి రక్తం నిల్వ వుంటే ఆకలి మందగించి కాలేయ సమస్యలు వస్తాయి.
మట్టి పట్టి వెయ్యాలి.
పొట్ట మీద కుడి వైపు ప్రక్కటెముకల కింద పట్టి వేసి గాలి తగలకుండా దుప్పటి కప్పి ఉంచాలి.
1. వెల్లకిలా పడుకొని మోకాలును గడ్డానికి ఆనించాలి. కాలును చాపాలి మరలా ఆనించాలి. రెండవ కాలుతోనుఅలాగే చేయాలి. ఈ వ్యాయామాన్ని వేగంగా చెయ్యాలి.
2. నిటారుగా నిలబడి చేతులనుముందుకు చాపి కాళ్ళు కదిలించకుండా పక్కలకు తిరగాలి.
3. నిటారుగా నిలబడి చేతులను ముందుకు చాపి వంగి, ఎడమ చేతితో కుడికాలి బొటన వ్రేలును, కుడిచేతితోఎడమ కాలి బొటన వేలును తాకాలి. దీనిని వేగంగాచేయ్యాలి.
జటామాంసి ---- 50 gr
తుంగ గడ్డలు ---- 50 gr
రెండింటిని విడివిడిగా దంచి వస్త్రగాయం పట్టి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
అర టీ స్పూను పొడిని అర కప్పు నీటిలో కలుపుకొని తాగాలి.
10 నుండి 20 రోజులు వాడితే చాలు. దీని వలన కాలేయము, పిత్తాశయము శుభ్రపడతాయి. వంటలలో
నల్లగా మాడిన ప్రతి పదార్ధము కాలేయానికి హాని కలిగిస్తుంది.
తాజాగా వున్న ఆకు కూరలు, కాయగూరలు వాడాలి.
కాలేయముపై కొవ్వు చేరడం (Fatty Liver) 9-9-10.
ఇది రెండు రకాలు :--
1 Alcoholic Fatty Liver :-- మద్య పానము వలన కాలేయముపై కొవ్వు చేరడం వచ్చే వ్యాధి.
2. Non Alcoholic Fatty Liver :-- శరీరములోని ఇతర భాగాలనుండి కొవ్వు కాలేయానికి చేరడం వలన వచ్చే వ్యాధి
కటుకరోహిణి --- 50 gr
శొంటి --- 50 gr
పిప్పళ్ళు --- 50 gr
మిరియాలు --- 50 gr
ఉసిరిక పెచ్చులు ----50 gr
" కాలేయ వ్యాధులకు కటుకరోహిణి దివ్య ఔషధం " పరిశోధన చేయబడినది.
అన్నింటిని విడివిడిగా దంచి, జల్లించి, చూర్ణాలు చేయాలి . అన్ని చూర్ణాలు సమానముగా
తీసుకుని కలిపి నిల్వ చేసుకోవాలి.
అర టీ స్పూను నుండి ఒక టీ స్పూను వరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేడి నీటితో ఆహారానికి అరగంట ముందు తీసుకోవాలి.
ఈ ఔషధము వ్యాధిని నియంత్రిస్తుంది( preventive) , నివారిస్తుంది ( curative)
కాలేయ సమస్యలు-- నివారణ 15-12-10.
కాలేయం మన శరీరంలో కాలేయము 500 రకాల పనులను నిర్వహిస్తుంది,
జలోదర సమస్య, కామెర్లు మొదలైనవి తీవ్రమైతే చనిపోయే ప్రమాదం వున్నది.
ఈ సమస్య దురలవాట్ల వలన వచ్చే అవకాశం ఎక్కువ.
గుంటగలగర పొడి --- 100 gr
నేల ఉసిరి పొడి --- 100 gr
కటుక రోహిణి పొడి --- 100 gr
గలిజేరు వేర్ల పొడి --- 100 gr
త్రికటు చూర్ణం --- 100 gr
పిప్పళ్ళ చూర్ణం --- 100 gr
అన్ని చూర్ణాలను కల్వంలో వేసి తగినంత నీరు కలిపి నూరి శనగ గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టాలి. బాగా ఎండిన తరువాత నిల్వ చేసుకోవాలి.
పూటకు ఒక మాత్ర చొప్పున ఉదయం, సాయంత్రం తగినంత తేనెతో సేవించాలి.
మధుమేహం వున్నవాళ్ళు నీటితో చూర్ణాన్ని ముద్దగా చేసుకుని మింగాలి.
ఈ విధంగా సంవత్సరంలో రెండు నెలలు వాడితే ఎలాంటి కాలేయ సమస్యలు రావు.
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే 29-12-10.
దవనాన్ని ఎండబెట్టి దంచి పొడి చేసి నిల్వ చేసుకొవాలి.
ప్రతి రోజు అర టీ స్పూను పొడి ని నీటిలో కలిపి తాగుతూ వుంటే కాలేయం ఎంతో ఆరోగ్యంగా
వుంటుంది .
దవనాన్ని ఎండబెట్టి చూర్ణం చేసి నిల్వ చేసుకోవాలి.
ప్రతి రోజు అర టీ స్పూను పొడి ని నీటిలో కలిపి తాగుతూ వుంటే కాలేయం ఎంతో ఆరోగ్యంగా
వుంటుంది .
దవనాన్ని ఎండబెట్టి చూర్ణం చేసి నిల్వ చేసుకోవాలి.
ప్రతి రోజు అర టీ స్పూను పొడిని నీటితో కలిపి తాగుతూ వుంటే కాలేయం ఎంతో ఆరోగ్యంగా వుంటుంది.
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే 26-1-11.
కృష్ణ తులసి ఆకులను గోలీ అంత ముద్ద చేసి తగినంత తేనె కలిపి ప్రతి రోజు తీసుకుంటూ
వుంటే కాలేయం ఆరోగ్యంగా వుంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి