మలబద్దకము

1.                                   మలబద్ధకం                                                                 30-11-08.
 
లక్షణాలు :--  మలబద్ధకం వలన నోటిడుర్వాసన, అర్శమొలలు, శరీరం మీద దురదలు, ఆసనం పక్కన లూటీలు వస్తాయి .
        గోధుమలను తెచ్చి రాత్రిపూట నానబోసి ఉదయం ఎండలో పొయ్యాలి. బాగా గలగలా లాడే విధంగా ఎండనిచ్చి పిండి పట్టించాలి.
                          గోధుమ పిండి    ------- పావు కిలో
                          ఆముదం         -------  10 లేదా 20 గ్రాములు.(సమస్యను బట్టి వాడుకోవాలి .)
 
      పిండిలో ఆముదం, కొద్దిగా  నీరు కలిపి బాగా పిసికి రొట్టె కాల్చాలి.రొట్టె మీద చక్కర చల్లుకొని తినాలి.         పిల్లలకు కూడా వాడవచ్చు .
      రాత్రి తింటే ఉదయానికి సుఖ విరేచనమవుతుంది.

 2.                                గులాబి లేహ్యం                                                               22-11-08 ,
 
                       ఎండిన గులాబి రేకులపొడి       ---------- 100 gr  (నీడలో ఎండబెట్టాలి).
                       శొంటి పొడి                           ----------- 100 gr
                       సునాముఖి ఆకు పొడి            ----------  100 gr
                       ఎండు ద్రాక్ష                        ----------   100 gr
                       సైంధవ లవణం పొడి               ----------  100 gr
                       తేనె                                   ----------- తగినంత
 
        అన్ని పొడులను కల్వంలో వేసి బాగాకలిపి ద్రాక్ష వేసి నూరాలి. తరువాత తేనె వేస్తూ మెత్తగా నూరాలి.బాగా ముద్దగా అయ్యేంత వరకు నూరాలి. దీనిని తీసి సీసాలో  భద్ర పరచుకోవాలి.
 
                      పిల్లలకు                  10 gr
                      పెద్దలకు                  10 gr నుండి 20 gr
 
                      సమస్య ఎక్కువ ఉన్నవాళ్ళు 20 గ్రాములు వాడాలి.నిద్రించే ముందు ఇది తిని నీళ్ళు తాగాలి భోంచేసిన రెండు గంటల తరువాత తినాలి. మరీ చిన్న పిల్లలకు 5 గ్రాములు చాలు.

3.                                   మలబద్ధక నివారణకు                                                      1-12-08.
ఉడ్యాన బంధం :--
   
       కాళ్ళను వెనక్కి మడిచి, మోకాళ్ళపై కూర్చొని మోకాళ్ళ మీద చేతులుంచి పొట్టను లోపలికి పీల్చుకొని రెండు చేతులు లోపలికి పెట్టాలి. ఈ విధంగా 10, 12  సార్లు చెయ్యాలి.(దీనివలన మలము శీఘ్రముగా కిందికి నెట్టబడి సుఖ విరేచనమవుతుంది.) ఆ తరువాత బాగా గాలి పీల్చాలి. పై విధంగా కూర్చొని శరీరాన్ని కిందికి,పైకి కదిలించాలి. ఈ విధంగా కదిలించడాన్ని ఉదరచాలనం అంటారు.

                                                 10-2-09.

1.వ్యాయామం:-- బోర్లా పడుకొని రెండు పాదాలను పైకెత్తి రెండు చేతులతో పట్టుకోవాలి.తలను పైకెత్తాలి. కాళ్ళు పిరుదులకు ఆనాలి.  ఈ ఆసనం వేసేటపుడు పొట్టను నెలకు ఆనించి శరీరాన్ని ముందుకు, వెనక్కు ఊపాలి.
పొట్టలో, నడుములో,ప్రక్కలకు వున్న కొవ్వు పెరిగిన వాళ్ళు ఈ విధంగా చేస్తే కొవ్వు కరుగుతుంది .
  .
2. పవనముక్తాసనం వెయ్యాలి.
 
  కొత్త బియ్యం, కొత్త చింతపండు, కొత్త బెల్లం, బంగాళా దుంపలు, ఉదికిఉదకని ఆహార పదార్ధాలు, మాంసాహారం సులభంగా జీర్ణం కావు.
 
      శరీర ప్రకృతిని బట్టి కొంతమందికి కొన్ని వస్తువులు గిట్టవు అలాంటివాళ్ళు వాటిని భుజించ రాదు.
తినవలసినవి :--పొట్టు తీసిన ముడి బియ్యపు అన్నం తినాలి.  పలుచని, తియ్యని మజ్జిగ రెండు పూటలా వాడాలి.
దీనివలన పేగులలోని మలినాలు త్రోసివేయ బడతాయి.నెయ్యి వలన ఆహారం త్వరగా పచనమై జీర్ణ శక్తి కలిగించి సుఖ విరేచనం అవుతుంది. కొంతమందికి పప్పు గిట్టదు, అటువంటి వాళ్ళు పప్పు కట్టు మాత్రమే వాడాలి.

                                                    11-2-09
 
        శొంటి   పొడి                     ------50 gr 
        కరక్కాయల బెరడు పొడి    ------50 gr
 
   రెండింటిని విడివిడిగా కొద్దిగా నెయ్యి వేసి వేయించి, పొడి చేసి, జల్లించి, కలపాలి. దీనికి 100 గ్రాముల పాత బెల్లం కలిపి , దంచి నిల్వచేసుకోవాలి. రాత్రి ఆహారం తినిన తరువాత పది గ్రాముల ముద్దను నోట్లో వేసుకొని చప్పరించాలి 
దీనితో ఉదయం సుఖ విరేచనమవుతుంది.

                 వర్షాకాలంలో వచ్చే మలబద్ధక సమస్య --- నివారణ                                  7-7-09.

      నువ్వుల నూనెను గోరువెచ్చగా వేడి చేసి పొట్ట మీద సున్నితంగా మర్దన చెయ్యాలి. దీని వలన పొట్ట మెత్త బడుతుంది.

      గాజు గ్లాసుకు ఎర్రటి గుడ్డను చుట్టి దానిలో నీళ్ళో పోసి మూతపెట్టి రెండు గంటల సేపు ఎండలో పెట్టాలి.      తరువాత ఆ నీటిని తాగాలి.

     ఒక గిన్నెలో నీళ్ళు పోసి దానిలో వేపాకు, పసుపు వేసి మరిగించాలి. దానిలో నూలు గుడ్డను ముంచి భరించ గలిగిననత వేడిగా పొట్ట మీద కాపడం పెట్టాలి.  దీని వలన సుఖ విరేచనం
అవుతుంది. .

    ఆ విధంగా విరేచనం కాకపోతే ఎనిమా డబ్బాలో కొబ్బరి నూనె పోసి రాత్రి పూట  మల ద్వారంలోకి ఎక్కించాలి. దీనితో మలం మెత్తబడుతుంది. ఉదయం ఎనిమా డబ్బాలో గోరువెచ్చని నీటిని పోసి ఎక్కించాలి. తరువాత కొంతసేపు అటు ఇటు తిరగాలి. నిలబడి మోకాలు పట్టుకొని పొట్టకు ఆనించాలి. రెండవ కాలితో కూడా అదే విధంగా చెయ్యాలి. దీనితో సుఖవిరేచనం అవుతుంది.

తేనె                                ---- 20 gr
పాత బెల్లం                       ---- 20 gr
సునాముఖి ఆకు పొడి        ---   40 gr
ఎండు ద్రాక్ష                     ----  80 gr

       అన్ని కలిపి దంచితే ముద్దగా అవుతుంది.
       పెద్దలు పది గ్రాముల ముద్దను నోట్లో చప్పరించి తింటే ఉదయాన్నే సుఖ విరేచనం అవుతుంది.   

                                                       5-4-10


                 " సర్వ రోగా  మలావశః "
సోంపు గింజలు                                ---పావు కిలో
కలబంద రసం                                 --- తగినంత

       సోంపు గింజలను కొద్దిగా వేయించి చేరిగితే పొట్టు ఎగిరిపోయి పప్పు ( బియ్యం) మిగులుతుంది. దానిని కల్వంలో వేసి కలబంద రసం పోసి వీలైనప్పుడంతా కనీసం పన్నెండు గంటలు నూరాలి. మధ్యలో ఎండిపోతూ వుంటుంది, మరలా రసం పోసి నూరాలి.  తరువాత శనగ గింజంత మాత్రలు చేసి నీడలో ఆరబెట్టి బాగా ఎండిన       తరువాత సీసాలో భద్ర పరచుకోవాలి. 

     ఒకటి లేక రెండు మాత్రలు వేసుకుంటే చాలా సులభంగా విరేచనమవుతుంది. మూడు మాత్రలు వేసుకుంటే చాలా స్పీడ్ గా వెళ్ళవలసి వస్తుంది.

     చిన్న పిల్లలకు ఒక మాత్ర చాలు.

                                                                   5-5-10
మలబద్ధకం రావడానికి కారణాలు:--

నీటిని సరిగా తీసుకోక పోవడం, సరిగా నిద్రించక పోవడం, వృద్ధులలో పెద్ద ప్రేవులలో కదలిక సరిగా లేకపోవడం, నీటి శాతం తక్కువగా వున్న పదార్ధాలు తినడం.
 
     దీనిని నివారించడానికి పీచు పదార్ధాలు ఎక్కువగా వున్న ఆహార పదార్ధాలను తీసుకోవాలి. కొంత వ్యాయామమం చెయ్యాలి.
 
చికిత్స :-- 
 
1. రాత్రి పూట వేడి నీళ్ళలో ఆముదం కలుపుకొని తాగాలి.
2. రాత్రి పూట గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూను త్రిఫల చూర్ణం కలుపుకొని తాగాలి.
                                                  17-5-10

నల్ల నువ్వులను దోరగా వేయించి దంచి పొడి చెయ్యాలి         ---  100 gr
                                                                బెల్లం           ---  100 గ్ర

      రెండింటిని కలిపి రోట్లో వేసి బాగా ముద్దగా దంచాలి.  దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

చిన్న పిల్లలకు                  --- 5---10 gr
పెద్దలకు                          --- 20--40 gr

        ఎక్కువైతే తగ్గించాలి. తక్కువైతే హేచ్చించాలి.

ఉపయోగాలు:--

 దీనివలనమలబద్ధకం, ఆడపిల్లల బహిష్టు సమస్యలు నివారింపబడతాయి.  వెంట్రుకలు తెల్లబడవు.   బలవర్ధకము. శరీర దారుధ్యము పెరుగుతుంది.

                                                 23-11-10 

          మిగల పండిన అరటి పండును పాలతో కలిపి తినాలి.

                                                   3-7-10
         ఆహారానికి ముందు ఎక్కువ నీరు త్రాగాలి. ఆహారం తరువాత కొంచం నీరు తాగాలి.

         అర టీ స్పూను కరక్కాయ ( అభయ రసాయనం )  పొడిని ప్రతి రోజు గోరువెచ్చని నీటితో తీసుకుంటూవుంటే మలబద్ధకం నివారింప బడుతుంది.  లేదా అభయాది మూలకం అనే ఔషధాన్ని వాడవచ్చు.

                                                  24-8-10.

లవంగాలు             --- 50 gr
జిల్లేడు పాలు         --- తగినన్ని

     లవంగాలను గిన్నెలో వేసి జిల్లేడు పాలు పోసి నానబెట్టి  నీడలో ఆరబెట్టాలి.  బాగా ఎండిన తరువాత సీసాలో
నిల్వ చేసుకోవాలి

     రాత్రి పడుకునే ముందు ఒకటి గాని, రెండు గాని లవంగాలను మింగితే ఉదయానికి సుఖ విరేచనం
అవుతుంది

    ఒక వేళ జిల్లేడు పాల వలన వెగటుగా అనిపిస్తే చక్కెర కలిపిన పాలు తాగితే మంచిది.

                          మలబద్ధకం ---నివారణ                                                           13-10-10.

    ఆహారం తిన్నతరువాత కొంత జీర్ణమవుతుంది,  కొంత మిగిలిపోతుంది. అది ప్రేవుల గోడలకు అతుక్కుని వుంటుంది.  ఆకలి అయినా కాకపోయినా వేళ ప్రకారం తింటూ వుంటాం

    ఆహారం జీర్ణమై  శుభ్రంగా వుండి మిగిలిన పదార్ధాలు పూర్తిగా బహిష్కరింప బడాలి.  ఆ విధంగా జరగనపుడుజీర్ణ సమస్యలు ఏర్పడతాయి.

సునాముఖి ఆకు  పొడి                     --- 100 gr
కరక్కాయల పెచ్చుల పొడి                ---   50 gr
శొంటి పొడి                                     ---   50 gr
సోంపు గింజల పొడి                          ---   50 gr
సైంధవ లవణం పొడి                         ---   25 gr

     అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.

     ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు రెండు టీ స్పూన్ల పొడిని నీటిలో కలిపి తాగితే ఉదయాన్నే సులభంగా విరేచనం అవుతుంది. దీనిని నెలలో 10  15 రోజులు వాడి అపేయవచ్చు, మరలా సమస్య వచ్చినపుడు వాడుకోవచ్చు.
                                        మలబద్ధక నివారణకు చిట్కా                                          12-11-10.

       బార్లీ పొడిని జావ లాగా కాచి తేనె కలుపుకుని తీసుకుంటే మలబద్ధకం నివారింప బడుతుంది.

                          మలబద్ధక నివారణకు   ---  పంచ సకార  చూర్ణం                            19-12-10.

       మలబద్ధకాన్ని తగ్గించుకుంటే అన్ని సమస్యలు నివారింప బడతాయి.  శరీరంలో గాలి పైకి పోదు,  కిందికి రాదుఎంతో అసౌకర్యంగా వుంటుంది.  అజీరం ఏర్పడుతుంది. మలద్వారం చీరుకుపోవడం వంటి సమస్య  ఏర్పడుతుంది.

శొంటి  పొడి                           --- 10 gr
జీలకర్ర                                --- 10 gr
సునాముఖి ఆకు                  ---  10 gr
సైంధవ లవణం                     ---  10 gr
కరక్కాయ                         ----  10 gr

      అన్నింటిని విడివిడిగా దంచి  చూర్ణాలు  చేసి కలిపి నిల్వ చేసుకోవాలి. 

      దీనిని ఏ వారానికి  ఆ  వారం  గాని లేదా  పదిహేను రోజులకొకసారి  గాని,  నెలకొక సారి గాని మాత్రమే  తయారు చేసుకోవాలి

      అర టీ స్పూను పొడి నుండి  ముప్పావు టీ స్పూను చూర్ణాన్ని రోజుకు రెండు సార్లు వాడాలి.   సమస్య తీవ్రంగా వుంటే  రోజుకు మూడు సార్లు వాడాలి.   ఇది ఎంతో ప్రభావ వంతంగా పనిచేస్తుంది.

ఉపయోగాలు :-- పొట్ట ఉబ్బరింపు, మలబద్ధకం, అజీర్ణం, కడుపునొప్పి  మొదలైన సమస్యలు నివారింప బడతాయి.

                             మలబద్ధక నివారణకు --సుఖవిరేచన చూర్ణము                    8-1-11.


లక్షణాలు :--
                    ముక్కడం,   మల విసర్జన అసంపూర్తిగా జరగడం 

 కరక్కాయల బెరడు                                  --- 10  కాయలు
ఆముదం                                                ----  రెండు టీ స్పూన్లు
వాము                                                    ---- నాలుగు టీ స్పూన్లు
నల్ల ఉప్పు                                               ---- రెండు టీ స్పూన్లు
      
          స్టవ్ మీద గిన్నె పెట్టి ఆముదాన్ని వేడి చేయాలి.  మంచి వాసన రావడం మొదలవుతుంది.  వేగినతరువాత వాటిని పక్కన తీసి పెట్టుకోవాలి.  ఇది చల్లారిన తరువాత మెత్తగా చూర్ణం చేయాలి.  దీనికి వాము పొడిని నల్ల ఉప్పును కలపాలి.

వాడే విధానం :--  ప్రతి రోజు  రాత్రి పూట ఒకటి లేదా రెండు స్పూన్ల పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగాలి.
       దీనిని వాడడం వలన మలబద్ధక నివారణ మాత్రమే కాక  గ్యాస్ సమస్య, గ్యాస్ వలన గుండె పట్టేసినట్లు వుండడం వంటివి కూడా తగ్గుతాయి.

                             మలబద్ధక నివారణకు  ఆనందిని                                          21-2-11.

       బాణలి లో  నెయ్యి వేసి దానికి కొద్దిగా ఆముదం కలిపి  దానిలో తోటకూరను వేసి కలిపి
  ఉడికించి తినాలి.  లేదా తోటకూరను వండి ఆముదం తో పోపు పెట్టి  అన్నంలో కలుపుకుని
  తినాలి.  ఈ విధంగా రాత్రి పూట తింటూ ఉంటె ఉదయానికి సుఖ విరేచనం అవుతుంది.  దీనిలో
  ఉప్పుకు  బదు లుగా సైంధవ లవణం వాడాలి.

                                మలబద్ధకం -- నివారణ                                                     29-3-11.

1.       కరక్కాయపెచ్చుల పొడి                   --- 100 gr
          తానికాయల పెచ్చుల పొడి               --- 200 gr
          ఉసిరిక కాయల పెచ్చుల పొడి           --- 400 gr

                   అన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.

                   ప్రతి రోజు రాత్రి  ఒక టీ స్పూను పొడిని వేడి నీటితో సేవించాలి.

 2.     శుభోదయ చూర్ణం :-- 

              పెద్ద కరక్కాయల పెచ్చుల పొడి        -- 50 gr
              చిన్న కరక్కాయల పెచ్చుల పొడి      -- 50 gr

         రెండింటిని కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించాలి. దంచి,  మెత్తగా జల్లించాలి.

                                  పటికబెల్లం పొడి          --100 gr

            అన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.

            నిద్రించే ముందు ఒక టీ స్పూను పొడి ని గోరువెచ్చని నీటితో సేవించాలి.

                                వేసవి కాలంలో వచ్చే మలబద్ధకం                                          9-4-11.

        1.  ఒక టీ స్పూను ఎండిన గులాబి రేకుల పొడిని ఒక గ్లాసు నీటిలో కలుపుకుని రాత్రి
  నిద్రించే ముందు తాగితే ఉదయానికి సుఖ విరేచనం అవుతుంది.

        2.          ఎండిన గులాబి రేకుల పొడి          --- 50 gr
                           సునాముఖి ఆకు పొడి            ---50 gr
                                    సైంధవ లవణం            --- 10 gr

             అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.

             సమస్య తీవ్రంగా వున్నపుడు మాత్రమే వాడాలి.  20,  25 రోజులు మాత్రమే వాడాలి.
  తరువాత ఆపెయ్యాలి.  అవసరమైతే మరలా ప్రారంభించవచ్చు.

                                            మలబద్ధకం ---నివారణ                                     2-6-11.

పెద్ద   కరక్కాయల చూర్ణం              --- 100 gr
చిన్న కరక్కాయల చూర్ణం              --- 100 gr

        గింజలను   తొలగించి  పెచ్చులను విడివిడిగా  నేతిలో దోరగా  వేయించాలి. దంచి, వస్త్ర ఘాళితం చేయాలి. దీనికి సమానంగా మెత్తటి కలకండ పొడిని కలపాలి.

పెద్దలకు                  --- అర టీ స్పూను
పెద్ద పిల్లలకు            --- పావు టీ స్పూను
చిన్న పిల్లలకు          --- చిటికెడు

వాయుముద్రను వేసుకోవాలి.

               మలబద్ధకం రావడానికి గల కారణాలు ---నివారణా మార్గాలు                     13-6-11.

కారణాలు :--- పేగులలో కదలిక తగ్గడం, దీర్ఘకాల వ్యాధులు, మత్తు మందులు మరియు బి . పి
మందులు వాడడం, థైరాయిడి సమస్యలు, పార్కిన్సన్ వ్యాధి, మధుమేహం, వెన్ను పూసకు
దెబ్బ తగలడం, విరేచనం యొక్క వేగాన్ని ఆపడం, నిర్జలీయత, ఎండలో తిరగడం, మూత్ర విసర్జకాలను వాడడడం  మొదలైన కారణాల వలన వచ్చే అవకాశాలు ఎక్కువ .

1. బార్లీ గింజలు                  --- ఒక టీ స్పూను
         నీళ్ళు                       --- రెండు గ్లాసులు
   
    రెండింటిని కలిపి కాచి ఒక గ్లాసుకు రానిచ్చి ,  వడకట్టి గోరువెచ్చగా అయిన తరువాత  తేనె
కలుపుకొని తాగాలి.

2.  ప్రతి రోజు నువ్వులు, బెల్లం కలిపి మూడు, నాలుగు గ్రాములు తీసుకోవాలి. ఈ విధంగా మూడు,
నాలుగు వారాలు తింటే  విరేచనం కావడం క్రమబద్ధం అవుతుంది.

3. అక్రోటు పండును తింటూ వుండాలి

4. ఒక గ్లాసు వేడి పాలల్లో గాని లేదా వేడి నీటిలో గాని ఒక టీ స్పూను నెయ్యి కలుపుకొని రాత్రి
నిద్రించే ముందు తాగితే ఉదయానికి విరేచనం అవుతుంది.

                                  మలబద్ధక  నివారణకు  రోజా పూల లేహ్యం                         22-6-11

       రోజా పూల రేకులను  ఒలిచి నీటి తేమ మాత్రమె లేకుండా ఆరబెట్టాలి .
 
       బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టిన   ఒక వెడల్పాటి సీసాను తీసుకోవాలి . దానిలో రోజా రేకులను ఒక పొరగా
పరచాలి .  దాని మీద పంచదారను ఒక పొరగా పరచాలి . ఈ విధంగా ఒక దాని తరువాత ఒకటిగా పొరలు , పొరలుగా
అమర్చాలి . అది లేహ్యం లాగా తయారయ్యే వరకు సీసాను మూతపెట్టి  ప్రతి రోజు ఎండలో పెట్టాలి

      గులాబి రేకులు మెత్తబడి పంచదారలో కలిసిపోయి లేహ్యం లాగా తయారవుతుంది .

      దీనిని రెండు స్పూన్లు తింటే సుఖవిరేచనం అవుతుంది

                                                           మలబద్ధకం ---నివారణ                              21-7-11.
శొంటి పొడి                       --- 50 gr
సునాముఖి ఆకు పొడి        --- 50 gr
నల్ల జిలకర పొడి               --- 50 gr
పాత బెల్లం                       --- 75 gr

            అన్నింటిని కలిపి ముద్దగా దంచి నిల్వ చేసుకోవాలి .
            ప్రతి రోజు రాత్రి ఐదు గ్రాముల ముద్దను తిని గోరువెచ్చని పాలు తాగాలి

                                                              25-7-11

1. రాత్రిపూట అన్నంలో పాలు పోసుకొని తినాలి .

2. సునాముఖి ఆకు ను  బెల్లాన్ని కలిపి ముద్ద చేసుకొని  రాత్రిపూట  తినాలి .

3. నేతిలో వేయించిన  కరక్కాయ పెచ్చుల పొడి        ---- 50 gr             
                                          శొంటి పొడి              ---- 50 gr
                                             బెల్లం                  ---- 50 gr

       అన్నింటిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి . ప్రతి రోజు రాత్రి ఐదు  తిని వేడి నీళ్ళు తాగాలి .

సూచన :---  ఏ పదార్ధం తింటే జీర్ణం కాదో దానిని తినడం మానెయ్యాలి . 

                                                                    18-8-11.

కారణాలు :--- చిన్న పిల్లలు ఎక్కువగా బయటి పానీయాలను తాగడం ,   నీళ్ళు ఎక్కువగా తాగాకపోవడం ఆహారపు
వేళలను సరిగా పాటించక పోవడం మొదలనవి .

లక్షణాలు :--- పొట్టలో గ్యాస్ తయారవడం , నోటి దుర్వాసన , విపరీతమైన బద్ధకం ,  మొలల  వలన మలబద్ధకం ,
మలబద్ధకం వలన మొలలు వచ్చే అవకాశాలు ఎక్కువ .

కరక్కాయ పెచ్చుల చూర్ణం                --- ఒక టీ స్పూను
బెల్లం                                            --- ఒక టీ స్పూను
నీళ్ళు                                           --- రెండు కప్పులు

        ఒక చిన్న గిన్నె తీసుకొని దానిలో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి  ఆ నీటిలో కరక్కాయ పొడిని వేయాలి . సన్న మంట మీద  కాచి ఒక కప్పు కషాయానికి రానివ్వాలి . వడకట్టి ఆ నీటిలో బెల్లాన్ని కలిపి రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చగా తాగాలి .  ఉదయానికి సుఖవిరేచనం అవుతుంది

ఆముదం                                    ---1, 2 టీ స్పూన్లు
పాలు                                        --- ఒక కప్పు

        పాలను వేడి చేసి ఆముదం కలిపి నిద్రించే ముందు తాగాలి . ఉదయానికి  సుఖవిరేచనం అవుతుంది

తీసుకోవలసిన జాగ్రత్తలు :--- పీచు పదార్ధం ఎక్కువగా వున్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి .  టమాటా ను తొక్క
తో సహా తినాలి . ఆకుకూరలు , కూరగాయలు ఎక్కువగా వాడాలి .

       అర్ధశక్తివన్థముగా వ్యాయామము చేయాలి .

                                                             24-8-11.

శొంటి పొడి                                 ---  50 gr
కరక్కాయ పెచ్చుల చూర్ణము        ---  50 gr
బెల్లం                                        ---100 gr

       అన్నింటిని   కల్వం లో వేసి బాగా  నూరి ముద్దగా అయిన తరువాత సీసాలో భద్రపరచుకోవాలి .

       రాత్రి పడుకునే ముందు  10 గ్రాముల ముద్దను తినాలి . ఉదయానికి  సుఖవిరేచం అవుతుంది .

ఉపయోగాలు :--- దీనిని ఉపయోగించడం వలన తలతిరగడం , జలుబు , గ్యాస్ సమస్య నివారింపబడతాయి





                                  













కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి