రక్త శుద్ధి

                                                రక్త శుద్ధి                                                      2-12-08.
 
             యుక్త వయసులో వున్న మగపిల్లలకు వీర్యము, ఆడపిల్లలకు ఆస్తవము తయారవుతాయి.
 
వ్యాయామం :---  నిటారుగా నిలబడి నడుముపై భాగాన్ని మాత్రమే వంచి సూర్యుని చూస్తూ నమస్కారం పెట్టాలి. పైకి లేచి వెనక్కి వంగాలి.తరువాత కిందకు వంగి చేతులునేలకు  ఆన్చి తలయెత్తి సూర్యుని చూడాలి.తలవంచి వీపు పైకెత్తాలి.ఎడమ కాలు వెనక్కిపెట్టి తల పైకెత్తాలి.అదే విధంగా రెండవ వైపు చెయ్యాలి.
 
        రక్తంలో మలినాలు చేరితే చర్మ వ్యాధులు, నల్ల మచ్చలు,తెల్ల మచ్చలు,పొడలు వస్తాయి.
        పంటలకు రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం వలన ఇలాంటి మచ్చలు వస్తాయి,
 
ఆహారం:--     సరస్వతి ఆకులను ఎండబెట్టి పొడి చెయ్యాలి.
 
                    రెండు ఆకుల పొడిని తేనెతో నాకించాలి.లేదా యుక్త వయస్కులకు పావు టీ స్పూను పొడి, ఒకటీ స్పూను తేనె,ఒక టీ స్పూను ఆవు నెయ్యి కలిపి రంగరించి ఉదయం పరగడుపున, రాత్రి భోజనానికి ఒక గంట ముందు నాకించాలి. దీని వలన రక్త శుద్ధి జరుగుతుంది.
 
                           రక్త శుద్ధికి ఆయుర్వేద (భారత్) టీ                                            13-12-08.
 
                               పుదీనా            ------- 200 gr (ఆకులను నీడలో ఆర బెట్టాలి)
                               మంజిష్ఠ పొడి     -------   50 gr
                               దో. వే. మిరియాల పొడి --10 gr
 
       అన్నింటిని   కలిపితే టీ పొడి తయారవుతుంది. దీనిని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
       అర లీటరు పాలను స్టవ్ మీద పెట్టి మరిగించాలి.దీనిలో 20 గ్రాముల పొడిని వెయ్యాలి.దీనిలో పచ్చి పుదీనా ఆకులను కూడా వేసుకోవచ్చు.మరిగిన తరువాతవడ పోసుకొని  చక్కెరగాని,కలకండ పొడిగాని వేసుకొని తాగాలి  షుగర్ పేషంట్లు తాటిబెల్లం కలుపుకొని తాగవచ్చు.
 
        చిన్న పిల్లలనుండి పెద్ద వాళ్ళ వరకు వాడవచ్చు.
        మంజిష్ఠ  రక్త శుద్ధిలో మేటి.
        ఈ టీ తాగితే శరీరంలోని మలినాలు తొలగించబడి రక్త శుద్ధి జరుగుతుంది.

                                                        10-2-09

1. మంచి  నాటు ఆవు నెయ్యి  100 గ్రాములు తీసుకొని స్టవ్ మీద పెట్టి, లెక్కబెట్టి 100 మిరియాలు వేసి కరిగించాలి. మరగబెట్ట కూడదు. తరువాత నేతిని వడపోయ్యాలి. ఈ నేతిని అన్నం లో వాడుతూ వుంటే రక్తం శుద్ధి చేయబడుతుంది. చర్మము కూడా కాంతి వంతమవుతుంది. ప్రతి రోజు రెండు పూటలా వాడాలి.
 
2. ఒక కప్పు మేక పాలు కాచి,దించి, గోరు వెచ్చగా అయిన తరువాత మాత్రమే ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగితే రక్తం శుద్ధి అవుతుంది. వేడి పాలల్లో తేన కలప కూడదు.
 
     ఈ విధంగా ప్రతి రోజు పరగడుపున 40 రోజులు తాగాలి. ఆ పాలు తాగిన తారువాత ఒక గంట వరకు ఏమి తినకూడదు.
 
                                       రక్త శుద్ధికి మార్గాలు                                                      12-10-10.

సుగంధపాల వేర్ల బెరడు పొడి               ---- 200 gr
మంజిష్ఠ                                           ---- 100 gr
వట్టివేర్ల పొడి                                     ----   50 gr
తిప్ప తీగ పొడి                                  ----   50 gr
నేలవేము                                         ----   50 gr
నాగ కేసరాలు                                   ----   50 gr

     అన్నింటిని కచ్చాపచ్చాగా దంచి సీసాలో భద్ర పరచుకోవాలి.

     20 గ్రాముల చూర్ణాన్ని ఒక గ్లాసు నీటిలో వేసి కాచి అర గ్లాసు కషాయానికి దించాలి. దీనిని రెండు పూటలా తీసుకుంటే సర్వ రోగాలు నివారింపబడి రక్తశుద్ది జరుగుతుంది.  మధుమేహం వున్నవాళ్ళు పటికబెల్లం కలుపుకో కూడదు. మిగతా వాళ్ళు కలుపుకొని తాగాలి.

      మజ్జిగ మిరపకాయలు, చింతపండు, పులుపు, కారం ఎక్కువగా వాడకూడదు. మరియు ఘాటైన పదార్ధాలు, వగరు, చేదు పదార్ధాలను వాడకూడదు.

                        రక్త శుద్ధికి  వ్యాయామం                                                           11-1-11.

వరుణ  ముద్ర :--   రాత్రి ఆహారానికి ముందు ఈ ముద్ర వేసుకోవాలి. పద్మాసనం లో కూర్చుని బొటన వ్రేలు,  చిటికెన వ్రేలు కలిపి  మిగిలిన మూడు వ్రేళ్ళను  కిందికి దించి చేతులను  మోకాళ్ళపై  పెట్టుకోవాలి.  ఈ విధంగా చేస్తే రక్త శుద్ధి జరుగుతుంది. 

                            రక్త శుద్ధికి మరియు శరీర కాంతిని పెంచడానికి                          16-4-11.

                                                   భారత్ టీ

    మంజిష్ఠ   పొడి      --- 50 gr
    పుదీనా పొడి         --- 50 gr
    మిరియాల పొడి    --- 50 gr  దోరగా వేయించాలి)

          అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచాలి.

          నీటిలో కొద్దిగా పొడిని వేసి  డికాషన్ కాచాలి. కలకండ కలుపుకొని తాగితే  రక్త శుద్ధి
   జరుగుతుంది.

   సూచనలు:--   త్వరగా జీర్ణం కాని ఆహార పదార్ధాలను వాడకూడదు. అతిగా వేయించిన కూరలు
   వాడకూడదు. పెరుగును కాకుండా పలుచని మజ్జిగ వాడాలి. ఆకు కూరలు ఎక్కువగా తినాలి.

                                              రక్తశుద్ధికి  --- సౌందర్య గుటికలు                            28-7-11.
వేప చిగుళ్ళ పొడి             --- 25 gr  ( వేప చిగుళ్ళను నీడలో ఆరబెట్టి దంచి పొడి చేయాలి )
       పసుపు పొడి             --- 25 gr
       పాత బెల్లం               --- 75 gr

       ఈ మూడింటిని కల్వం లో వేసి మెత్తగా నూరి బటాణి గింజలంత  మాత్రలు తయారు చేయాలి .

       ప్రాతి రోజు ఆహారానికి గంట ముందు ఒక మాత్రను వేసుకొని నీళ్ళు తాగాలి  లేదా చప్పరించి మింగ వచ్చు లేదా
నీటిలో కలుపుకొని తాగవచ్చు .

      దీని వలన రక్తశుద్ధి జరిగి ముఖం కాంతివంతమవుతుంది . రక్తవృద్ధి జరుగుతుంది





 

                                                    
                .

















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి