Oil Pulling

                                                                      Oil Pulling

                               ఆయిల్  పుల్లింగ్   ( గండూషము )                       24-12-10.

          కుర్చీలో కూర్చుని తలను వెనక్కు వాల్చి గొంతుకు, ముఖానికి  గోరువెచ్చని మంచి నువ్వుల నూనెతో మర్దన చెయ్యాలి.
 కొంత సేపటి తరువాత లావుపాటి గుడ్డను వేడి నీటిలో ముంచి  ఆ వేడిని ముఖానికి, గొంతుకు తగిలేట్లు గుడ్డను కదిలించడం, అద్దడం చెయ్యాలి.
 ఈ విధంగా చేసేటపుడు నోటి నిండుగా నూనె వుండాలి. ఇక నోటిలో వుంచుకోలేని పరిస్థితిలో ఉమ్మేయ్యాలి. తరువాత వేడి నీటితో పూర్తిగా  నూనె తొలగి పొయ్యే వరకు పుక్కిలించాలి.

          ఈ ప్రక్రియను మలమూత్ర విసర్జన చేసి పళ్ళు తోముకున్న తరువాత చెయ్యాలి.

          దీని వలన గొంతు సమస్యలు, అరుచి, పెదవులు పగలడం  మొదలైన సమస్యలు నివారింప బడతాయి.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి