రక్త హీనత

                                              రక్త క్షీణత --పాండురోగం                                          20-12-08.
 
                                        పాండు రోగాలు 7 రకాలు.
 
                          అశ్వగంధ దుంపల పొడి             ------------ 210 gr
                          దో. వే. మిరియాలపొడి             ------------    60 gr
                                        శొంటి పొడి               ------------    50 gr
                                         పిప్పళ్ళ పొడి          ------------    40 gr
                                       చిన్న ఏలకుల పొడి   ------------    30 gr
                                        నాగ కేసరాల పొడి     ------------    20 gr
                                 వేయించిన లవంగాల పొడి------------     10 gr
                                              కలకండ పొడి    ------------   420 gr
 
              ఒక పాత్రలో అన్ని పదార్ధాలను ఒక్కొక్కటిగా వేస్తూ బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
ఉపయోగించే విధానం :--  ప్రతి రోజు ఉదయం,సాయంత్రం పావు టీ స్పూను పొడిని నీళ్ళలో గాని పాలల్లో గానికలుపుకొని తాగాలి లేదా పొడి నోట్లో వేసుకొని నీళ్ళు తాగవచ్చు.
 
      ఇది కాలేయానికి, ప్లీహానికి శక్తి నిస్తుంది. రక్త శుద్ధి జరిగి రక్త వృద్ధి కలుగుతుంది.

         బహిష్టు సమస్యల వలన వచ్చే ఉబ్బు రోగము లేదా రక్త హీనత --నివారణ           22-6-09.

      శరీరంలో మలినమైన నీరు చేరడం వలన శరీరం వాచిపోయి కదులుతూ వుంటుంది, మరియు రక్త హీనత  వుంటుంది.

      శరీరమంతా నువ్వుల నూనెతో మర్దన చెయ్యాలి. కాళ్ళను తన్నిపెట్టి, చేతులను లాగిపెట్టి మర్దన చెయ్యాలి.

నీరు కిందికి దిగేవిధంగా మర్దన చెయ్యాలి.

       వజ్రాసనం లో కూర్చొని పొట్టను కదిలించి మూల చక్రాన్ని బంధించాలి.

ఆహారం:--

     నాటు ఆవు మూత్రాన్ని తెచ్చి (మొదటి, చివరి మూత్రాన్ని వదిలేసి పట్టాలి) ఏడు సార్లు వదపోయాలి.
    అర కప్పు ఆవు మూత్రంలో అర కప్పు తేనె, కొద్దిగా గోరువెచ్చని నీరు కలిపి తాగాలి.
    అవి  మజ్జిగలో కలుపుకొని తాగితే చాలా త్వరగా ఉబ్బురోగం నివారింప బడుతుంది. ఏరోజుకారోజు దొరికితే వడ పోయాల్సిన అవసరం లేదు.

                                                          నీరు తగ్గడానికి

     ఆవాల నూనె          --- ఒక కిలో
     ముద్దకర్పూరం        --- 50 gr

         ఆవ నూనెను గోరువెచ్చగా వేడి చేసి దానిలో ముద్దకర్పూరం వేసి కరిగిన తరువాత సీసాలో భద్రపరచు కోవాలి.
         పైన చెప్పబడిన వ్యాయామం ప్రకారం ఈ నూనెతో మర్దన చేసి శరీరాన్ని సాగదీయాలి.
        కపాలబంధం, ఉడ్యానబంధము,  ఉదరచాలనము, మూలబంధం  చేయాలి.

                            రక్తాల్పత-- నివారణ                                                            4-9-10.

                 శరీరంలో రక్తం  తగ్గితే చాలా సమస్యలు వస్తాయి.

లక్షణాలు :--  నిస్సత్తువ;  వెంట్రుకలు బిరుసుగా వుండడం, ఎర్రగా మారడం, రాలడం ;  గోళ్ళు పగలడం;   బ్లీడింగ్  సమస్యలు  వుంటాయి.

కారణాలు :--  ఆపరేషన్ వలన, బహిష్టు సమయాల్లో ఎక్కువగా రక్తం పోవడం  వలన, కొన్ని ఎనీమియా  జబ్బుల వలన,  క్యాన్సర్ వలన, ఆక్సిడెంట్ల  వలన రక్త హీనత ఏర్పడే అవకాశాలు ఎక్కువ.

నివారణ చర్యలు :--  ఆకు కూరలు ముఖ్యంగా తోటకూర వారానికి మూడు సార్లు లేక ప్రతి రోజు వంద గ్రాములు  తినాలి. పొన్నగంటి కూర, మునగాకు, మెంతి కూర, మునగాకు కషాయం, కొత్తిమీర, పుదీనా లలో కూడా వుంటుంది.

      వ్యాయామం చెయ్యకూడదు.

      ప్రతి రోజు అర టీ స్పూను వేయించిన జిలకర పొడిలో తగినంత  కలకండ కలుపుకొని తీసుకుంటే జీర్ణ శక్తిపెరుగుతుంది, దీనిలో కూడా ఐరన్ వుంటుంది

     వీటితోబాటు  మండూరం  లేదా పునర్నవ మండూరం లేదా లోహ భస్మం వాడాలి.

                                                             2-10-10

దాల్చిన చెక్క పొడి               ---- అర టీ స్పూను
దానిమ్మ రసం                     ---- అర కప్పు
తేనె                                   ---- అర టీ స్పూను

      కలిపి ప్రతి రోజు తాగుతూ వుంటే రక్త హీనత నివారింపబడుతుంది.

                             రక్త హీనత  ---ఎనీమియా --నివారణ                                     29-12-10.

లక్షణాలు :-- నిస్త్రాణ,  నీరసం,   కళ్ళు తిరగడం, ఆయాసం,  ఊపిరాడక పోవడం,  మాటిమాటికి జలుబు చేయడం,ఇన్ఫెక్షన్ చేరడం మొదలైన లక్షణాలు వుంటాయి.    ఇది రక్తంలో ఇనుము లోపం వలన వస్తుంది.
 
         పుల్లని పదార్ధాలను తీసుకుంటే  ఐరన్ పెరుగుతుంది.  ఆహారంతోబాటు కమలా పండ్ల రసం, ద్రాక్ష , ఉసిరిరసం తీసుకోవాలి. ఒక నెల రోజులలోనే హీమోగ్లోబిన్  శాతం పెరుగుతుంది.
 
         శాకాహారులు  గోంగూర, తవుడున్న బియ్యం ఆహారంగా తీసుకోవాలి.
 
          అర టీ స్పూను   కరక్కాయ  చూర్ణం గాని, శొంటి చూర్ణం గాని  కొద్దిగా బెల్లంతో కలిపి తీసుకుంటే బాగా రక్తంలో ఇనుము శాతం పెరుగుతుంది.   చెరకు రసం  రక్తాన్ని బాగా పెంచుతుంది.  ఆకుకూరలు,  కాయగూరల  వలన కూడా రక్త వృద్ధి జరుగుతుంది.

            రక్త హీనత -- కాళ్ళు చేతులలో మంటలు --దానిమ్మ పానకం                         1-1-2011.
 
         రక్త హీనత వలన ఇతర వ్యాధులు కూడా ఏర్పడతాయి.  ఆకలి తగ్గుతుంది. వాంతులు,  వికారం వుంటాయి.
 
కాళ్ళు, చేతులలో మంటలు   కారం పూసినట్లు గా వుండడం  వుంటుంది. శరీరంలో సెగలు వుంటాయి. ఈ లక్షణాలు   మెనోపాజ్ దశలో ఎక్కువగా వుంటాయి.   గర్భధారణకు ముందు, వెనుక   ఆపరేషన్ కు ముందు వెనుక  రక్త  హీనత లక్షణాలు కనిపిస్తాయి.

దానిమ్మ రసం                 ---100 gr
గులాబి జలం                  ---100 gr   
పటికబెల్లం                      ---100 gr
తేనె                                ---తగినంత
 
         గులాబి జలానికి  దానిమ్మ రసం కలిపి స్టవ్ మీద పెట్టి . పటికబెల్లాన్ని  కొద్దికొద్దిగా వేస్తూ పూర్తిగా కలపాలి.
 
పాకం తయారైన తరువాత దించి చల్లార్చి తేనె కలపాలి.
 
         ముఖ్యంగా గర్భ ధారణ  సమయంలో ఐరన్ మాత్రలు మింగలేని పరిస్థితులలో ఇది చాలా బాగా  ఉపయోగ పడుతుంది.
 
         సీసాలో నిల్వ చేసేటపుడు  సీసాలో కొంత ఖాళీ ఉండేట్లుగా చూసుకోవాలి.
 
         రెండు, మూడు  టీ స్పూన్ల సిరప్ ను గ్లాసులో వేసుకుని దానికి నీళ్ళు కలిపి తాగాలి.
 
         దీనిని సేవించడం వలన రక్త హీనత వలన ఏర్పడే సమస్యలన్నీ తొలగి పోతాయి.  రక్త వృద్ధి జరుగుతుంది.
 
                    హీమోగ్లోబిన్ శాతం అమోఘంగా పెరుగుతుంది.

                      ఆకు కూరల ద్వారా రక్తహీనతను  నివారించడం                               13-3-11.

    1.  గర్భాదారణలో  రక్తహీనత,  బలహీనత,  పిల్లలలో రక్త హీనత,  బలహీనత ను నివారించుటకు

                                   తోటకూర రసం       --- ఒక కప్పు        
                                             తేనె            --- ఒక  టీ స్పూను 
                              యాలకుల పొడి         ---  చిటికెడు

        అన్నింటిని కలిపి ప్రతి రోజు తాగుతూ వుంటే ఎంతో మంచి ఫలితం వుంటుంది. రక్తవృద్ధి
    జరుగుతుంది.  శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మాటిమాటికి  రోగాలు రావు.

     2.   ముక్కు నుండి రక్తం కారడం --నివారణ "---

                       తోటకూర  రసం                 --- ఒక కప్పు
                             నిమ్మ రసం                --- ఒక టీ స్పూను 

            . ఈ విధంగా ప్రతి రోజు రాత్రి తాగాలి. దీని వలన  ముక్కు నుండి రక్తం కారడాన్ని
      నివారించడమే కాక అన్ని రకాల రక్త స్రావాలను  నిరోధించబడుతుంది.

                                                రక్త హీనత ---నివారణ                                         5-4-11.

               చెడిపోయిన రక్తాన్ని బాగు పరచి  రక్తాన్ని వృద్ధి పరచడంలో ఉత్తరేణి వేర్లు చాలా
    శ్రేష్టమైనవి.

      1. ఉత్తరేణి వేర్లను కొద్దిగా నీటి చుక్కలు వేసి మెత్తగా నూరాలి, దీనిని  5 గ్రాముల మోతాదుగా
 తీసుకుని నీటిలో కలుపుకుని తాగాలి.

      2.  ఉత్తరేణి వేర్లను ఎండబెట్టి దంచి,  జల్లించి పొడిని సీసాలో నిల్వ చేసుకోవాలి.

           5 గ్రాముల పొడిని అర గ్లాసు మజ్జిగలో కలుపుకుని తాగాలి. దీని వలన బాగా రక్త వృద్ధి
  జరుగుతుంది.

           ఇది విషపు గాట్ల నుండి కాపాడుతుంది. సమస్త అవయవాలకు శక్తిని ఇస్తుంది.  ఈ
   విషయం శాస్త్రీయంగా  నిరూపించ బడినది.

                          రక్తహీనత నివారణకు చిట్కా                                             11-4-11.

           ఉదయం,  సాయంత్రం  ఎండుద్రాక్షను   తింటూ క్యారట్,  బీట్ రూట్, టమాటా జ్యూస్ లలో
  ఎదో ఒకటి తాగుతూ వుంటే రక్త హీనత తగ్గి,  రక్తం బాగా వృద్ధి చెందుతుంది.

                                                  రక్త హీనత ---నివారణ                              13-6-11.

లక్షణాలు :-- కళ్ళ కింద గుంటలు  ఏర్పడడం, జుట్టు ఊడిపోవడం మొదలైనవి.

అల్లనేరేడు బెరడు చూర్ణం   ( ఏ నేరేడు అయినా పరవాలేదు.

       3 గ్రాముల చూర్ణాన్ని ఒక కప్పు మజ్జిగలో కలుపుకొని తాగాలి.  ఈ విధంగా 100 రోజులు
వాడితే బాగా రక్తవృద్ధి జరుగుతుంది.

     రక్తం చెడిపోయి శరీరమంతా రక్తనాళాలు ఉబ్బి వున్నపుడు  ---నివారణకు

తాంబూలంలో వేసుకునే కాచు            --- 3 gr  రెండింటిని సమాన
                నీళ్ళు                           --- రెండు కప్పులు

     నీటిలో చూర్ణాన్ని వేసి కాచి ఒక కప్పుకు రానివ్వాలి. దించి దానిలో పంచదార గాని లేదా గోరు
వెచ్చగా చేసి తేనె గాని కలిపి తాగవచ్చు.

    ఈ విధంగా కొంతకాలం చేస్తే బాగా రక్తవృద్ధి జరిగి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

                                        రక్తహీనత    ---   నివారణ                               19-7-11.

            రక్తహీనత వలన శరీరం ఎండిపోతుంది ,  జుట్టు రాలి పోతుంది ,  రక్తం  ఎండి పోతుంది .

ఎండుద్రాక్ష
అతిమధురం

             రెండింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి . బాగా మెత్తగా ,  ముద్దగా నూరి నిల్వ చేసుకోవాలి . ప్రతి రోజు
10 గ్రాముల ముద్దను తింటూ వుంటే రక్తం చాలా బాగా వృద్ధి చెందుతుంది . జుట్టు రాలడం ఆగిపోతుంది . కళ్ళు కాంతివంతంగా తయారవుతాయి . బలం సమకూరుతుంది .

                                                         రక్తహీనత  --- నివారణ                            18-8-11.

సుగంధపాల వేర్ల చూర్ణం          --- 10 gr
నేలవేము చూర్ణం                   --- 10 gr
నెల ఉసిరి చూర్ణం                  --- 10 gr  

       రాత్రి ఒక  కప్పు నీటిలో అన్ని చూర్ణాలను  వేసి నానబెట్టాలి . ఉదయం దానిని  గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి సన్న
మంట మీద కాచి అరకప్పు కు రానివ్వాలి . గోరువెచ్చగా అయిన తరువాత వడకట్టి ఒక టీ స్పూను తేనె గాని లేదా
ఒక టీ స్పూను కలకండ గాని కలుపుకొని తాగాలి .

                                                         ధనియాల కషాయం

      రక్తహీనత వలన శరీరంలో అధిక ఉష్ణోగ్రత ఏర్పడుతుంది . దీనిని తగ్గించుకుంటే రక్తం పడుతుంది .  రాత్రి రెండు
టీ స్పూన్ల ధనియాలను నలగ గొట్టి  రెండు కప్పుల నీటిలో నానబెట్టాలి . ఉదయం  దానిని కాచి, ఒక కప్పుకు రానిచ్చి  వడకట్టి ఆ కషాయాన్ని తాగాలి .
                                                      రక్తహీనత  ---నివారణ                               8-9-11.

గుంటగలగర సమూల చూర్ణం           
నల్ల నువ్వుల చూర్ణం

       రెండింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి . దీనికి తగినంత పాతబెల్లం గాని , కలకండ ( పటికబెల్లం ) గాని కలిపి
నిల్వ చేసుకోవాలి .

      దీనిని ప్రతిరోజు అర టీ స్పూను పొడిని తింటూ వుంటే రక్త హీనత నివారింపబడుతుంది .


                                                                      











                               

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి