అధిక పైత్య రసం



                           అధిక పైత్య రసం --- నివారణ                                    29-12-08.

ఎండిన ఉసిరిక ముక్కలు ---- 6 gr
   నలగగొట్టిన ధనియాలు ---- 1 టీ స్పూను
                            నీళ్ళు ---- 1 గ్లాసు
                         కలకండ ---- 1 టీ స్పూను 
  
    రాత్రి పడుకునే ముందు ఒక మట్టి పాత్రలో ఉసిరిక ముక్కలను,ధనియాలను వేసి నీళ్ళు పోసి ఉంచాలి.ఉదయం లేవగానే దీనిని వడకట్టగా వచ్చిన నీటిలో కలకండ కలుపుకొని త్రాగాలి.ఇలా వారం రోజులు చేస్తే పైత్యం తగ్గి పోతుంది.

                                           శిరో పైత్య నివారణకు


1. నిమ్మరసం తో మాడు మీద వేసి బాగా మసాజ్ చేయాలి.
 
2. ఆముదంతో        "        "      "     "       "           "

3. బకెట్లో చల్లటి నీళ్ళు పోసి అందులో 10 నిమిషాలు కాళ్ళు పెట్టాలి.

4. రోగిని బోర్లా పడుకోబెట్టి నూలుగుడ్డను నాలుగు మడతలు వేసి నీటిలో తడిపి, పిండి వెన్నెముక పైనుండి నడుము వరకు పరచాలి.

5. కుడిముక్కు మూసి, ఎడమ ముక్క్నుంది గాలిపీల్చాలి,ఎడమ ముక్కు మూసి కుడిముక్కునుండి వదలాలి.

6. ఉసిరిక పొడి         -------- 50 gr
 నానబెట్టిన మెంతులు ------ 50 gr
              పచ్చ పెసలు ------ 50 gr

అన్నింటిని కలిపి మెత్తగా రుబ్బాలి. ముద్దను తల మీద వేసి బట్ట కప్పాలి. గంట తరువాత స్నానం    చేస్తే శిరో పైత్యం ,తలలోని వేడి తగ్గి పోతాయి.

                                       పైత్యాన్ని తగ్గించే పైత్యహర లస్సి                                  8-2-11

            ప్రతి చిన్న విషయానికి కోపం రావడం, పొట్టలో గ్యాస్ తయారై పైకి పొంగి త్రేన్పులు  రావడం
గొంతులో మంట, చర్మ వ్యాధులు, చర్మం పై మంటలు మొదలైన లక్షణాలు వుంటాయి ఇవన్ని
పానీయంతో నివారింపబడతాయి.

పన్నీరు                     ---- ఒక కప్పు
పెరుగు                      ---- అర కప్పు
నీళ్ళు                       ---- తగినన్ని ( ఒక కప్పులో మూడవ వంతు)
ధనియాల పొడి         ---- రెండు టీ స్పూన్లు
ఆపిల్ సిరప్               --- ఒక టేబుల్ స్పూను
ఖర్జూరాలు               ---- రెండు

     పన్నీరు, పెరుగు, నీళ్ళు మిక్సిలో వేసి కొద్దిగా గ్రైండ్ చేయాలి. తరువాత ధనియాల పొడి, ఖర్జూరాల ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి. లస్సీ తయారవుతుంది. దీనిని ఫ్రిజ్ లో ఉంచకూడదు . సాధారణ ఉష్ణోగ్రత లో తాగాలి.

ఉపయోగాలు:--

దప్పిక చల్లారుతుంది.
నిర్జలీయతలోని నీటిని భర్తీ చేస్తుంది.
ఎండలో వెళ్ళే ముందు తాగితే వడదెబ్బ తగలదు.

          ముఖ్యంగా శరీరంలోని వేడిని, పైత్యాన్ని తగ్గిస్తుంది.

                                     పైత్య శరీరం కలిగిన వాళ్ళు తీసుకోవలసిన ఆహారం            10-3-11.

          ఉప్పు, పులుపు తక్కువగా తీసుకోవాలి. తియ్యని, చేదు, వగరు పదార్ధాలు ఆరోగ్యానికి
  మంచిది.
                               
                                         పైత్యపు వాంతులు --- నివారణ                                  13-6-11.

కారణాలు :-- పసుపు పచ్చటి ద్రవం వాంతి రూపంలో రావడం దీని యొక్క ముఖ్య లక్షణం .
ఆహార పదార్ధాలు అన్న నాళంలో ఇరుక్కుపోయినపుడు, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వున్నపుడు ,
అల్సర్ వ్యాధుల వలన  బైల్స్ పైకి పొంగినపుడు ఇటువంటి వాంతులు వస్తాయి.

1. అల్లం ముక్కలు            --- 3 గ్రాములు
           బెల్లం                                   "

        మొదట అల్లాన్ని మెత్తగా నూరి తరువాత బెల్లం కలిపి నూరి తినాలి. ఈ విధంగా రోజుకు
మూడు సార్లు చేయాలి.

2. చింత పండు                 ----5 గ్రాములు
    జిలకర                        ----5 గ్రాములు

    రెండింటిని కలిపి పూటకు ఐదు గ్రాముల చొప్పున రెండు పూటలా తీసుకోవాలి.

3. దానిమ్మ గింజల రసం   --- రెండు టీ స్పూన్లు
                 తేనె                --- ఒక టీ స్పూను

         రెండు కలిపి నాకాలి.

4. నీరుల్లి పాయలను నూరి ముద్దను గుడ్డలో వేసి వాసన చూస్తూ వుంటే వంతుల సెన్సేషన్
    తగ్గుతుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు :-- మసాలాలను తగ్గించాలి. ప్రశాంతంగా వుండాలి. బరువు తగ్గాలి.
ఆల్కహాల్ అసలే వాడకూడదు. సిగరెట్లు మానెయ్యాలి.  కాఫీలు,  టీలు తాగకూడదు. అన్నం
తిన్న వెంటనే బరువులు ఎత్తకూడదు.

      










కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి