త్రేన్పులు

                             పులి త్రేన్పులు                                                         9-11-10.

కరక్కాయ పెచ్చుల పొడి                ---- 50 gr
గుంటగలగరాకు పొడి                     ---- 50 gr


       బెల్లంతో కలిపి నూరి నిల్వ చేసుకోవాలి. పది గ్రాముల ముద్దను చప్పరించాలి.

                     త్రేన్పుల నివారణకు -- చిట్కా                                             11-12-10.

        మిరియాలను నేతిలో వేయించి కొద్దిగా జిలకర కలిపి నూరి నీటితో సేవిస్తే త్రేన్పుల సమస్య నివారింప బడుతుంది.

                   పులి  త్రేన్పులు  -- నివారణ --చిట్కా                                      17-1-11.

       గోధుమలను  నానబెట్టి,  ఎండబెట్టి,  వేయించి  పొడి చేసి చక్కెర  కలిపి ఉండలు చేసి రోజ ఒక ముద్ద తింటూ వుంటే  త్రేన్పులు నివారింప బడతాయి.

                                          పుల్లటి త్రేన్పులు  --- నివారణ                       10-6-11.

కారణాలు :-- స్థూల కాయం,  ఆందోళన, రాత్రి పూట ఎక్కువగా మేలుకోవడం, ఆమాశాయంలోని
కొంత భాగం అన్న వాహికలోకి చొచ్చుకొని రావడం మొదలైనవి.

1. నిమ్మ పండ్ల రసం            --- ఒక టీ స్పూను
             తేనె                      --- రెండు టీ స్పూన్లు
    కలిపి తీసుకోవాలి.
    దీనిని రోజుకు మూడు పూటలా రెండు,  మూడు రోజులు వాడాలి.

2. పది గ్రాముల గోధుమ పిండిని దోరగా వేయించి దీనికి ఐదు గ్రాముల బెల్లం కలిపి తినాలి.

సూచనలు:-- స్కిన్ టైట్ దుస్తులు ధరించరాదు. కాళ్ళ వైపు మంచం కోళ్ల కింద రాళ్ళు పెట్టి
మంచాన్ని ఎత్తుగా వుంచుకోవాలి.

                                                           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి