నోటి సమస్యలు --------- నివారణ


                            నోటి సమస్యలు --------- నివారణా  మార్గాలు        8-12-08.

                                                     నోటి దుర్వ్వాసన

వ్యాయామము :-- శీతలి ప్రాణాయామము --జాలందర బంధము :--

1. ధ్యానముద్ర వేసుకోవాలి నోరు తెరచి నాలుకను దోన్నెలాగా ,వంచి ,పీల్చి తలవంచి ,ఉంచగలిగినంతసేపు  ఉంచాలి .మెల్లగా తలను పైకి లేపుతూ గాలిని ముక్కు గుండా వదలాలి .

తీవ్రమైన అజీర్ణము వలన కూడా నోటి దుర్వాసన వస్తుంది

2.కపాలభాతి ప్రాణాయామము :-- సుఖాసనంలో కూర్చొని పొట్టను ముందుకు వెనక్కు ఆడించాలి .
కఫము ఎక్కువైతే నోటి దుర్వాసన వస్తుంది

అన్నం తినేప్పుడు కింద కూర్చొని తినాలి .అన్నం నోట్లోనే చాలావరకు జీర్ణం కావాలి .వేళకు భోజనం చెయ్యాలి

       ఇవన్ని ఆచరిస్తే నోటిదు ర్వాసన తగ్గుతుంది .

       ఉత్తరేణి, నేరేడు ఆకులు కాల్చిన బూడిదతో పళ్ళు తోముకుని అరగంట ఉంచి వేడి నీటితో కడుక్కోవాలి .


ఆహార నియమాలు :-- నిద్రించే ముందు ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక స్పూను తేనె కలుపుకొని    పుక్కిలించి ఉమ్మేయ్యాలి .అన్నం తిన్న తరువాత 12 సార్లు నోరు పుక్కిలించాలి . అన్నం తిన్న తరువాత  ఒక లవంగాన్ని నోటిలో వేసుకొని రసం మింగుతూ ఉండాలి .కఫం రాకుండా కాపాడుతుంది .ఎక్కువ తింటే వేడి చేస్తుంది .

                                 ముఖ సుగంధ సౌందర్య చూర్ణము

అల్లం                    ------10 gr (జిలకరంత సన్న ముక్కలు తరగాలి ).
ఎండు ఉసిరిక       -------10 gr (చాల చిన్న ముక్కలుగా నలగ్గోట్టాలి)
సోంపు                    -----10 gr
జిలకర                  ------10 gr
ధనియాలు           -------10 gr

  అన్ని కలిపి మట్టి మూకుడులో వేసి రాత్రి పూట నిమ్మరసం పోసి నానబెట్టాలి .తరువాత వాటిని బాగా ఎండబెట్టాలి. చివరలో చిటికెడు సైంధవలవణం కలపాలి .ఇది నాలుకకు రుచినిస్తుంది .జీర్ణశక్తి పెరుగుతుంది .

      దీనిలో జాజికాయ ,జాపత్రి కూడా కలుపుకోవచ్చు .గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి .

ఒక చిటికెడు పొడి నోట్లో వేసుకొని చప్పరిస్తూవుంటే నోటి దుర్వాసన నివారింపబడుతుంది .

మాటలు స్వచ్చంగా రాకపోవడం ---నివారణ --నాలుక మందాన్ని తగ్గించడం     18-12-08

1. నాలుకను బాగా బయటకు చాచడం, లోపలికి తీసుకోవడం ,అలా 10 సార్లు చెయ్యాలి .
2.నాలుకను పూర్తిగా కుడి, ఎడమ లకు చాచడం
3. నాలుకను పూర్తిగా అన్ని వైపులకు చాచి తిప్పాలి
4. అలాగే నాలుకను లోపలి వైపు కూడా తిప్పాలి

    ఉదయం, సాయంత్రం ఘటోత్కచుని లాగా ,మాయలఫకీరులాగా పెద్దగా నోరంతా తెరిచి గట్టిగా నవ్వాలి .

వేడినీటిలో 10gr పటిక వేసి నీటితో నాలుకకు, గొంతుకకు తగిలేటట్లు పుక్కిలించి, గులగారించి ఉయ్యాలి .

దీనివలన నాలుక పలుచబడుతుంది.

                                                    వాగ్దేవి  చూర్ణం 
వస ---- వాగ్దేవి ప్రతిరూపం

       వ సకొమ్ములను ఒకరోజంతా నీటిలో నానబెట్టాలి తరువాత నీటిని పారబోయ్యాలి . వస మునిగేవరకు


    ఉసిరిక  రసం పోసి ఉదయం ఎండలో పెట్టాలి . మళ్లీ రాత్రికి ఉసిరిక రసం తో తడపాలి. \, మళ్లీ ఎండబెట్టాలి.   విధంగా 3 రోజులు చెయ్యాలి .తరువాత పూర్తిగా ఎండనిచ్చి పొడి చెయ్యాలి

ప్రతిరోజు 1 చిటికే తో మొదలు పెట్టి 3 చిటికెల వరకు వాడాలి . తేనెతో నాకించాలి .పిల్లలకు ఒక్క చిటికెడు ఇవ్వాలి. .

                                      ముఖ సుగంధ గుటికలు                                        25-1-09.

     ఈ గుటికలను ఉపయోగించడం వలన నోటిపూత, దుర్వాసన, దంతాల పగుళ్ళు, దంతాల కదలికనివారింప బడతాయి . ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగ పడతాయి.

జాపత్రిపొడి                    -------10 gr
దాల్చినచెక్కపొడి              -----10 gr
నాగాకేసరాలపొడి              -----10 gr
జాజికాయపొడి                ------10 gr
యాలకులపొడి               ------10 gr
దో.వే . లవంగాలపొడి         -----10 gr
అతిమదురంపొడి              -----60 gr

      ఈ పోడులన్నింటిని బాగా కలిపి కల్వంలో పొయ్యాలి . తగినన్ని నీళ్ళు కలిపి బాగా మెత్తగా నూరాలి .

శనగ గిన్జలంత మాత్రలు కట్టి బాగా గాలి తగిలే చోట ఆరబెట్టాలి . ఎండలో పెట్టకూడదు. ప్రతి రోజు ఉదయం    ఒకటి .సాయంత్రం ఒకటి బుగ్గన పెట్టుకోవాలి.

                           నోటినుండి రక్తం పడడం---నివారణా మార్గాలు            9-2-09.

      నీలం రంగు కాగితాన్ని గుండెల మీద (ఊపిరితిత్తుల మీద) పడేటట్లు కప్పుకోవాలి .దీనితో నోటినుండి  రక్తం పడడం తగ్గుతుంది .నీటి గ్లాసుకు నీలం రంగు కాగితాన్ని చుట్టి 2,3 గంటలు ఎండలో పెట్టి నీరు    తాగితే రక్తం పడడం ఆగుతుంది .

ఆహారం:--

1. దోరగా పండిన మర్రి పండ్లు నాలుగు ముక్కలు చేసి , ఎండబెట్టి, దంచి, జల్లించిన పొడిని సీసాలో
భద్రపరచాలి .

పెద్దలకు.         ---అర టీ స్పూను
పిల్లలకు          ---పావు టీ స్పూను

       పొడిని నాలుకతో అద్దుకొనిచప్పరించాలి .

2. ధనియాలు ----100gr (దోరగా వేయించి దంచి జల్లించాలి )
    కలకండ      ----100gr రెండు కలిపి పెట్టుకోవాలి .


పెద్దలకు          ---ఒక టీ స్పూను  
పిల్లలకు          ---అర  టీ స్పూను .
చిన్నపిల్లలకు. ---పావు టీ స్పూను

    పొడిని నోట్లో వేసుకొని నీళ్ళు తాగాలి .దీనివలన నోటిద్వారా , గుదము ద్వారా రక్తం పడడం ఆగిపోతుంది.

                                        నోటి సమస్యలు ---నివారణ             22-2-10.

భోజనం తరువాత 12 సార్లు పుక్కిలించాలి

పైన చెప్పబడిన వ్యాయామం చెయ్యాలి

నువ్వుల నూనెను గోరు వెచ్చగా చేసి నోట్లో పోసుకొని పుక్కిలించాలి.దీనివలన నోటిలో పుండ్లు, పగుళ్ళు    నివారింప బడతాయి .

                               అన్నిరకాల నోటివ్రణాలు--నివారణ చర్యలు

3 తులసి ఆకులను నోట్లో వేసుకొని నమలాలి .(ప్రతిరోజు) మూడు చిటికెల పొడిని ప్రతిరోజు వాడాలి .

                                                నోటి దుర్వాసన

నోరు బాగా శుభ్రంగా కడుక్కోవాలి.

తులసి ఆకులపొడి          -------50 gr
సన్నజాజుల పూల పొడి   -------50 gr
జాజి పూలపొడి              -------50 gr
బోడతరం పూలపొడి      --------50 gr
మంచి పసుపు              --------50 gr
మాని పసుపు               --------50 gr
నువ్వులనూనె            --------600 gr

      అన్ని పదార్ధాలను నూనెలో వేసి నల్లగా అయ్యేవరకు కాచాలి. వడకట్టి సీసాలో భద్రపరచాలి.

ప్రతిరోజు నోట్లో కొద్దిగా నూనె పోసుకొని పుక్కిలించి ఉమ్మేయ్యాలి. దీని వలన . దీనివలన నోటి దుర్వాసన  నివారింపబడుతుంది.

                                          నోటిపూత ---నివారణ                                 27-5-10.

నోటిపూతకు కారణాలు :-- ఎసిడిటి, పరిశుభ్రత ను పాటించకపోవడం B విటమిన్ మరియు FOLIC ACID  తగ్గడం మొదలైన కారణాల వలన వస్తుంది .

1. అతిమడురం పొడి }
    ఉసిరిక పొడి }

 సమాన భాగాలు

   రెండింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.

ఉదయం , మధ్యాహ్నం , సాయంత్రం ఒక్కొక్క టీ స్పూను చొప్పున తేనెతో కలిపి చప్పరిస్తే నోటిపూత
తగ్గుతుంది.

2. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను ఉసిరిక పొడిని వేసి మరిగించి అర గ్లాసుకు రానిచ్చి , నీటిని నోట్లో పోసుకొని   పుక్కిలిస్తే నోటిలో ఉన్న INFECTION తగ్గుతుంది. విధంగా రెండు, మూడు గంటలకోకసారి చెయ్యాలి.

3. పొంగించిన పటిక (ALUM) ను 5--10gr పొడిని నీటిలో వేసి , నీటితో పుక్కిలిస్తే నోటి పూత తగ్గుతుంది ,   దంతాలు, చిగుళ్ళు గట్టిపడతాయి.

4. మంచి మేలైన తేనెను పుక్కిట పట్టి వుంచడం వలన తగ్గుతుంది.

5. 4,5 జాజి ఆకులను బాగా నమిలి ,నోరంతా తగిలేటట్లు చేస్తే తగ్గుతుంది.

6. 5,6 బచ్చలి ఆకులను. నమిలి మింగుతూ ఉంటె చాలత్వరగా తగ్గుతుంది.

నోట్లో వచ్చే పుండ్ల సమస్య ----నివారణ                               6-7-10.

1,2 gr కాచు చూర్ణానికి కొద్దిగా పొంగించిన పటికపోడిని కలిపి నోట్లో పుండ్లకు పూస్తే త్వరగా నివారింప బడతాయి

                      నోరు మంటగా ఉండడం ----పిత్హ్జజ అరోచకము                     28-9-10.

                          BURNING MOUTH SYNDROME

     ఇది మధ్య వయస్కులైన , మధ్య వయసు దాటిన స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది.నోరంతా పోక్కినట్లుగా ఉంటుంది.

కారణాలు :-- శోకము, క్రోధము, భయము వలన ; స్త్రీలలో మెనోపాజ్ టైం లో కలిగే INBALANCE వలన,  B--Vitamin లోపం వలన,  Acid తగలడం వలన,  రక్త హీనత వలన ఆహారపు అలవాట్ల వలన,  తక్కువగా తినడం వలన: నోరు మంటగా ఉండడం జరుగుతుంది.

దీనివలన రుచిలో తేడాలుండడం , Metalic Taste ఉండడం,నోరంతా ఎండి  పోయినట్లు ఉండడం వంటివి   జరుగుతాయి.

     ఇది శరీరంలో వేడి ఎక్కువై ,పిత్త దోషం వలన ఏర్పడుతుంది.

ధనియాలు
యాలకులు
వట్టివేర్లు
పిప్పళ్ళు
గంధం

  అన్నింటిని సమాన భాగాలు తీసుకొని ,వాటి చూర్నాలను కలుపుకొని , దానికి కలకండ, తేనె, నువ్వుల  నూనె కలిపి పెట్టుకోవాలి.దానిని చప్పరిస్తూ ఉండాలి.


                                నోటి పూత నివారణకు చిట్కా                               13-10-10.

నేలఉసిరి ముక్కలను నీటిలో వేసి మరిగించి నీటితో పుక్కిలిస్తే నోటిపూత నివారింప బడుతుంది ;


                            నోటి దుర్వాసన నివారణకు కు చిట్కా                       18-11-10.

    తాజా పెరుగును కడుపులోకి తీసుకోవాలి. తరువాత మజ్జిగను పుక్కిటబట్టి కొంత సేపు అలాగే ఉంచాలి.

                                         నోటి పూత నివారణ                                     25-11-10.

    నోటిలోపల నొప్పి , మంట ఉంటాయి. దుర్వాసన(నీచువాసన) ఉంటుంది .బుగ్గలను కోరికే అలవాటున్న  వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది.

1.వేడి నీటిని పుక్కిట పడితే సూక్ష్మ జీవులను అదుపులో ఉంచుతుంది .

2. వేపాకులు    -------10 gr
          నీళ్ళు -------160 ml

    రెండు కలిపి స్టవ్ మీద పెట్టి 40ml నీరు మిగిలే వరకు మరిగించాలి. నీటితో పుక్కిలించాలి .

3. జామ ఆకులను నీటిలో కాచి పుక్కిలించాలి ;

4. పసుపు                  ---రెండు టీ స్పూన్లు
  సైంధవ లవణం          ---ఒక ఎఅ స్పూను

      రెండు వేడి నీటిలో కలిపి పుక్కిలించాలి

5. వెలిగారం(Borax) పొడి

గ్లిజరిన్
వేలిగారం పొడిని గ్లిజరిన్ లో కలిపి నోటిలో పూత లాగా పూయాలి .

                                   నోటిలోని పుండ్లు --నివారణ                            7-12-10.

      ఇవి నోట్లిలోపల బుగ్గలపై ,అంగిట్లో తయారవుతాయి. ముందు మంటతో ప్రారంభమవుతుంది.
నొప్పి   వ్రణాలు తయారవుయ్హాయి.

కారణాలు:-- ప్రధాన కారణం వంశ పారంపర్యం . మానసిక ఒత్తిడి --దీన్ని నియంత్రించుకోవాలి .ఆమ్ల పదార్ధాలను ఎక్కువగా వాడడం వలన వస్తుంది.

ఆహారంలో B-Vitamin లోపం వలన ,Folic Acid లోపం వలన వస్తుంది.

1. దీనికి అతి ముఖ్య ఔషధం త్రిఫల చూర్ణం 1 T.S పొడిని ఒక కప్పు పాలలో కలుపుకొని రాత్రి పడుకునే ముందు తాగాలి.

2. త్రిఫల చూర్ణం నీటిలో వేసి కాచి పుక్కిలించాలి.

3. కలబంద గుజ్జుతో పుక్కిలించాలి

4.. పసుపు         ---పావు టీ స్పూను
         తేనె          ---ఒక టీ స్పూను

      రెండింటిని పేస్టు లాగా కలిపి వ్రణాలపై పూస్తే చాలా గొప్పగా పని చేస్తుంది

5.నేరేడు పట్ట కషాయంతో పుక్కిలించాలి .

                                     నోటి ద్వారా రక్తం పడడం (క్షయ కారణంగా )       11-2-11 .

బూడిద గుమ్మడి కాయ కండ భాగాన్ని మిక్సిలో వేసి రసం తియ్యాలి .

బూడిద గుమ్మడి రసం  ------20 gr
లక్క చూర్ణం                ------20 gr. (రక్త శుద్ధికి)

         రెండు కలిపి తాగితే రక్తం పడడం ఆగిపోతుంది.

              నోటి దుర్వాసన నివారణకు ---Mouth Freshner                            24-3-11.


     ఘాటైన పదార్ధాలు, మసాలాలు,ఉల్లి, వెల్లుల్లి, చీజ్, కాఫీ ,మాంసాహారం ,పిండి పదార్ధాలు లేని ఆహారంపొగాకు ఉత్పత్తులు మొదలగు వాటివలన నోటి దుర్వాసన వస్తుంది.

లవంగాలు                  -----2 gr
తరిగిన అల్లం ముక్క    -----2 gr
ఉప్పు                       -----2 gr
దాల్చిన చెక్క            -----2 gr
పుదీనా స్ఫటికాలు     -----1 gr
మల్లె పూలు               ----1 కప్పు (పిడికెడు)
నీళ్ళు                       ----3 కప్పులు

స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి నీటిని పొయ్యాలి. దీనిలో పై పదార్ధాలన్నీ వేసి బాగా మరిగించాలి .వడపోసి చల్లార్చి  నీటిని పుక్కిట పట్టాలి. కొంత సేపు అలాగే ఉంచాలి. విధంగా చేస్తుంటే క్రమేపి నోటి దుర్వాసన తగ్గి పోతుంది.

ఉపయోగాలు :-- నీటిని పుక్కిట పట్టడం వలన బుగ్గలు శక్తి వంత మవుతాయి. నోటి పుండ్లు, వ్రణాలు, శ్లేష్మపు పొర నివారించ బడతాయి.

       రోజుకు రెండుసార్లు నోటిని, నాలుకను బ్రష్ చెయ్యాలి.

                        నోటిలో పుండ్ల నివారణకు --ముఖపాకాంతక కషాయం            15-4-11.

6. లొద్దుగ చెక్క పొడి            -----ఒక టీ స్పూను .
    వాయువిడంగాల పొడి      -----ఒక టీ స్పూను
   (కాచు) కదిర సారం పొడి    -----ఒక టీ స్పూను
     నీళ్ళు                         -----అర లీటరు

స్టవ్ మీద పాత్రను పెట్టి నీళ్ళను మరిగించాలి. మూడు పొడులను వేసి బాగా మరిగించాలి. తరువాత వడకట్టాలి. నీటితో రోజుకు మూడు సార్లు పుక్కిలించాలి .

తీసుకోవలసిన జాగ్రత్తలు:-- ఆహారాన్ని జాగ్రత్తగా నమిలి తినాలి బుగ్గలను నమల కూడదు. మజ్జిగను ఎక్కువగా వాడాలి దంత దావనానికి మెత్తటి బ్రష్ ను వాడాలి. అతిగా తోమ కూడదు. ఘాటైన పేస్టులు వాడకూడదు.

లోపల పుండ్ల వలన నొప్పి వుంటే ఐస్ ముక్కలను వాడితే నొప్పి తగ్గుతుంది.

 7.  20-4-11 చిట్కా :--    

  10 మల్లె ఆకులను నీటిలో వేసి పది నిమిషాలు ఉడికించి నీటిని పుక్కిట పట్టి పుక్కిలిస్తూ  ఉంటె వెంటనే పుండ్లు నివారించ బడతాయి.

8.   8-6-11 చిట్కా:--

బియ్యం కడిగిన నీళ్ళు -----పావు కప్పు  .
             కలకండ      ------తగినంత

      రెండు కలిపి రోజుకు రెండు సార్లు చొప్పున వారం రోజులు తాగితే మంచిది.

9. జాజికాయను సానరాయి మీద పాలు చిలకరిస్తూ చాది నోటి పూత మీద పూస్తే 4,5 రోజుల్లో ఆశ్చర్యకరంగా  తగ్గిపోతుంది.

10. ఒక  గ్రాము పటికను నీటిలో కలిపి పుక్కిలిస్తే తగ్గుతుంది.

                                   నోటి దుర్వాసన ---నివారణ                                 8-7-11.

శొంటి
పిప్పళ్ళు
మిరియాలు
దాల్చినచెక్క
లవంగాలు
యాలకులు
            అన్నింటిని సమాన భాగాలు తీసుకొని దంచిన పొడిని సీసాలో నిల్వ చేసుకోవాలి.

చిటికెడు పొడిని తేనె తో తినాలి.నిద్రించే ముందు గోరు వెచ్చని నీతిలోతేనే కలిపి బాగా పుక్కిలించాలి. ఉత్తరేణి   పుల్లతో పళ్ళు తోముకోవాలి.

                                       నోటి దుర్వాసన -- నివారణ                 18-10-11.

తాజా పెరుగును కడుపులోకి తీసుకోవాలి. క్రమంగా మజ్జిగను పుక్కిట బట్టి కొంత సేపు ఉంచాలి.


                                          నోటి పూత --- నివారణ                    25-11-10.

నోటి లోపల నొప్పి, మంట వుంటాయి. దుర్వాసన (నీచు వాసన ) వుంటాయి.

బుగ్గలు కోరికే అలవాటు వున్నవాళ్ళకు వస్తుంది.

1. వేడి నీటిని పుక్కిట పడితే సూక్ష్మ జీవుల ప్రభావాన్ని తగ్గించవచ్చు.

2. వేపాకులు --- 10 gr
          నీళ్ళు --- 160 ml

   రెండింటిని కలిపి ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి 40 ml కషాయం మిగిలే వరకు కాచాలి.

ఈ  కషాయం తో  పుక్కిలించాలి.

3. ఇదే విధంగా జామ ఆకులతో లూడా చేయాలి. కొంత సేపు పుక్కిట పట్టి తరువాత వుమ్మెయ్యాలి.

4. పసుపు పొడి --- రెండు టీ స్పూన్లు
సైంధవ లవణం ---- ఒక టీ స్పూను

      రెండింటిని వేడి నీటిలో కలిపి పుక్కిలించాలి.

5. పొంగించిన వేలిగారం ( బొరాక్స్) పొడి
    గ్లిజరిన్

పొడిలో గ్లిజరిన్ కలిపి నోటిలోపల పూయాలి.

నోటిలో పుండ్లు---- నివారణ 7-12-10.

      ఇవి నోటిలో, బుగ్గలపై, అంగిట్లో తయారవుతాయి. ముందు మంటతో ప్రారంభం అవుతుంది. తరువాత   నొప్పి, వ్రణాలు ఏర్పడతాయి.

కారణాలు;-- ప్రధాన కారణం వంశ పారంపర్యం, తరువాత మానసిక ఒత్తిడి. --దీనిని నియంత్రించుకోవాలి. ఆమ్ల పదార్ధాలను ఎక్కువగా తినడం వలన వస్తుంది. ఆహారంలో బి --విటమిన్ , ఫోలిక్ యాసిడ్ లోపం వలన వస్తుంది.

దీనిని నివారించడంలో అతి ముఖ్యమైన ఔషధం త్రిఫల చూర్ణం.

1. ఒక టీ స్పూను త్రిఫల చూర్ణాన్ని ఒక కప్పు పాలలో కలుపుకొని రాత్రి పడుకునే ముందు తాగాలి.

2. త్రిఫల కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించాలి.

3. కలబంద గుజ్జుతో పుక్కిలించాలి.

4. పసుపు ---- పావు టీ స్పూను
        తేనె ----- ఒక టీ స్పూను

రెండింటిని కలిపి పేస్ట్ లాగా చేసి వ్రణాల పై నేరుగా పూస్తే చాలా గొప్పగా పని చేసి తగ్గుతుంది.

Burning Mouth Syndrome ( పిత్తజ అరోచకము )                       28-9-10.


      ఈ సమస్య ఎక్కువగా మధ్య వయస్కులైన, మధ్య వయసు దాటిన స్త్రీలలో ఎక్కువగా వుంటుంది.
నోరంతా పోక్కినట్లు వుంటుంది.

కారణాలు :-- శోకము, భయము, క్రోధము ఎక్కువగా వున్నవాళ్లలో వుంటుంది. మెనోపాజ్ దశలో కలిగే   హార్మోన్ల లో తేడాల వలన B -విటమిన్ లోపం వలన, యాసిడ్ తగలడం వలన, రక్త హీనత వలన మొదలైన  కారణాల వలన నోరు పొక్కడం జరుగుతుంది.

దీని వలన రుచిలో తేడాలు వుండడం, మెటాలిక్ టేస్ట్ వుండడం, నోరంతా ఎండిపొయినట్లు వుండడం జరుగుతుంది.

       ఇది ముఖ్యంగా పైత్య దోషాల వలన ఏర్పడుతుంది,

ధనియాలు
యాలకులు
వట్టివేర్లు
పిప్పళ్ళు
గంధం
అన్నింటి యొక్క చూర్ణాలను సమాన భాగాలుగా తీసుకోవాలి. దానికి కలకండ, తేనె, నువ్వుల నూనె
కలిపి పెట్టుకోవాలి.
దానిని కొద్దిగా తీసుకుని నోట్లో వేసుకుని చప్పరిస్తూ వుండాలి .

                       నోటిపూత నివారణకు చిట్కా                                 13-10-10.

నేలవుసిరి ముక్కలను నీటిలో వేసి మరిగించి చల్లారిన తరువాత నోటిలో పోసుకుని పుక్కిలించి
ఉమ్మేయ్యాలి. దీని వలన నోటిపూత నివారింప బడుతుంది.


                       నోటిపూత, గాయాలు, వ్రణాలు, దగ్గు నివారణకు       9-1-11.

                                         టంకణ  చూర్ణము - వ్రణ సంహారిణి 
      టంకణము = బోరాక్స్


  ఇనుపబాణలి ని  స్టవ్ మీద పెట్టి టంకనపు పొడిని వేయాలి. కలియ బెడుతూ వుంటే దానిలోని నీటిశాతం ఆవిరై పేలాల లాగా పొంగుతుంది. స్టవ్ ఆపి చల్లార నివ్వాలి. తరువాత కల్వంలో వేసి మెత్తగా నూరాలి. దీనిని   గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి

     200 మిల్లి గ్రాముల నుండి 500 మిల్లి గ్రాముల వరకు అనగా స్పూను చివరతో బోరాక్స్ పొడిని తీసుకుని  తేనెతో కలిపి ఆహారానికి ముందు తీసుకోవాలి.

     దగ్గు యొక్క నివారణకు దీనిని కడుపులోకి వాడుకోవచ్చు.

    గాయాలు, వ్రణాలు, నోటిపూతకు లేపనం లాగా పూయాలి. పొడిని తేనె, నెయ్యి కలిపి పేస్ట్ లాగా చేసి  నోటిలోపల వ్రణాలకు, పెదవుల మీద, చిగుల్ల మీద పూస్తే మంట నొప్పి అసౌకర్యం తగ్గుతాయి. దీనిని ఎంత  కాలం వాడినా ఎలాంటి నష్టం జరగదు.

                         నోటి దుర్వాసనను పోగొట్టే  మౌత్ ఫ్రేష్ణర్  ( Mouth Freshner)           24-3-11.

   కారణాలు :--   ఘాటైన పదార్ధాలు,  మసాలాలు,  ఉల్లిపాయలు, వెల్లుల్లి,  చీజ్,  కాఫీ, నాన్ వెజ్
   పొగాకు ఉత్పత్తులు  మొదలైనవి సేవించడం వలన   నోరు దుర్వాసన కలిగి వుంటుంది.
                 పిండి పదార్ధాలు లేని ఆహారం  భుజించడం  కూడా ఒక కారణం.

        నీటిని  బాగా పుక్కిట బట్టి బాగా కదిలించి పుక్కిలించాలి,  దీని వలన బుగ్గలు శక్తి వంతం
   అవుతాయి. నోటి పుండ్లు,  వ్రణాలు   శ్లేష్మపు  పోర  సమస్యలు నివారించబడతాయి.

         నోటి దుర్వాసన రాకుండా రోజుకు రెండు సార్లు  బ్రష్ చేయాలి. నాలుక మీద కూడా బ్రష్
   చేయాలి.

              లవంగాలు                --- రెండు గ్రాములు
         తరిగిన అల్లం ముక్కలు   ---   "          "
                   ఉప్పు                  ---   "         "
         పుదీనా స్ఫటికాలు          ---  ఒక గ్రాము
              మల్లె పూలు              ---  పిడికెడు
                  నీళ్ళు                   ---  మూడు కప్పులు

     స్టవ్ మీద గిన్నె పెట్టి  నీళ్ళు పోసి అన్ని పదార్ధాలను వేసి మరిగించాలి. తరువాత వడ పోయాలి.
  చల్లారిన తరువాత  ఆ నీటిని పుక్కిట బట్టి కొంత సేపు ఉంచాలి. 

                               నోరు ఎండి  పోవడం --- నివారణ  .                                       25-3-11.

      దంతాలను సరిగా  శుభ్రం చేసుకోక పోవడం,  అతి దాహం,  నోట్లో సరిగా లాలాజలం  ఉత్పత్తి
 కాకపోవడం,   శరీరంలో ఇతర రోగాలు  ముఖ్యంగా పైత్య రోగాల  కారణంగా నోరు ఎండిపోతుంది.

      రకరకాల  భయాల వలన,  ఆందోళన వలన,  మానసిక సమస్యల వలన  కూడా జరగవచ్చు
     
      నీరు త్రాగడం  వలన అప్పటికప్పుడు పరిష్కారం లభిస్తుంది.

      చింతపండు                                 --- 100 gr ( చెత్తను తొలగించి ఎండబెట్టాలి )
      సైంధవ లవణం                            ---   15 gr
      దోరగా వేయించిన జీలకర్ర             ---    25 gr
          "         "           వాము          ---    15 gr
                 పాత బెల్లం                       ---  తగినంత

       అన్నింటిని కలిపి కల్వంలో వేసి నూరి శనగ గింజలంత  మాత్రలు తయారు చేసి  ఎండబెట్టి
  నిల్వ చేసుకోవాలి.

       పూటకు ఒక మాత్ర చొప్పున  మూడు పూటలా చప్పరించాలి.

                                         నోటిపూత --- నివారణ                                            8-6-11.

కారణాలు :-- వంశ పారంపర్యత ఒక ముఖ్య కారణం.  హార్మోన్లలో తేడాలు,  ఆహారములో మార్పుల
వలన,  అలర్జీ వలన .

1. బియ్యం కడిగిన నీళ్ళు             --- పావు కప్పు
                 కలకండ                    --- తగినంత
           రెండింటిని కలిపి తాగాలి .
           వారం ,  పది రోజులు ఈ విధంగా తాగితే చాలు .

2. జాజి కాయను సాన రాయి మీద పాలు చిలుకుతూ చాది  ఆ గంధాన్ని నోటి పూత మీద పూస్తే
    నాలుగైదు రోజులలో ఆశ్చర్యకరంగా తగ్గుతుంది .

3. ఒక గ్రాము పటిక ను కొద్ది నీటిలో కరిగించి ఆ నీటితో పుక్కిలిస్తూ వుండాలి .

సూచనలు :-- సులభంగా ఆహారపదార్ధాలను తీసుకోవడం చాలా ముఖ్యం . మాంసాహారాన్ని
పూర్తిగా మానెయ్యాలి . కారం , ఉప్పు , పులుపు తగ్గించి వాడాలి . ఐసు గడ్డలను నేరుగా గాని
లేదా టీ బాగ్ లో వేసి గాని ప్రయోగించాలి .

                                           నోటిని శుభ్రపరచడానికి                                                   16-6-11.
                                          Mouthwaash  Liquid                           

కారణాలు :-- సరైన పద్ధతిలో దంత ధావనం చేయకపోవడం , అజీర్ణం,ఊపిరితిత్తుల
వ్యాధుల వలన, నోటిలో, గొంతులో ఏదైనా ఇరుక్కున్నపుడు  సమస్య వచ్చే అవకాశం
వున్నది.

వెనిగర్                  --- పావు గ్లాసు
వైన్                      --- అర గ్లాసు
తేనె                      --- ఒక కప్పు
లవంగాల పొడి      --- ఒక టీ స్పూను

        అన్ని పదార్ధాలను ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద పది
నిమిషాలు వేడి చేయాలి. చల్లారిన తరువాత సీసాలో నిల్వ చేసుకోవాలి.

        దీనిని నోటి నిండా పోసుకొని కొంతసేపు పుక్కిట పట్టి అలాగే వుంచి తరువాత పుక్కిలించి ఉమ్మెయ్యాలి.

                                                        నోటిడుర్వాసన   --- నివారణ                           8-7-11.
శొంటి
పిప్పళ్ళు
మిరియాలు
దాల్చిన చెక్క
లవంగాలు
యాలకులు
                  అన్నింటిని సమాన భాగాలు గా తీసుకొని విడివిడిగా చూర్నాలు చేసి కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .

1. చిటికెడు పొడిని తేనె కలిపి తినాలి .
2. నిద్రించే ముందు గోరువెచ్చని నీటిలో తేనె కలిపి ఆ నీటితో పుక్కిలించి ఉమ్మేయాలి .
3. ఉత్తరేణి పుల్లతో పళ్ళు తోముకోవాలి .

                                                   నోటిపూత  --- నివారణ                                       14-9-11.

కారణం :--- దంత ధావనం  ( పళ్ళు తోమడం ) ఎక్కువ సేపు చేయడం వలన వచ్చే అవకాశం కలదు .

త్రిఫల కషాయం              --- ఒక కప్పు
టంకణ  భస్మం               --- ఒక చిటికెడు
పొంగించి పటిక పొడి         --- 3 చిటికెలు
కొబ్బరి నూనె                 --- తగినంత

       ఒక టీ స్పూను త్రిఫల చూర్ణాన్ని ఒక కప్పు నీటిలో వేసి కాచి వడకట్టి ఆ నీటితో పుక్కిలించాలి
       
       పొంగించి పాతిక పొడిని , వెలిగారం భస్మాన్ని  రెండింటిని  కొబ్బరి నూనెతో కలిపి నోటి పూత మీద పూయాలి .

సూచనలు  :--- తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి . మలబద్ధకం లేకుండా చూసుకోవాలి 









.

















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి