అన్ని రకాల నొప్పుల నివారణకు

                   అన్ని రకాల నొప్పుల నివారణకు  ---చరకాంజనము                        14-12-08.
 
        ఇది ఆపాదమస్తకము ఎక్కడ నొప్పి వున్నా తగ్గిస్తుంది .
 
                                           తేనె మైనము          -------- 50 gr
                                           ఆవు నెయ్యి            -------- 50 gr
                                           కొబ్బరి నూనె          -------- 50 gr
                                           ముద్ద కర్పూరం       -------- 25 gr
                               (థైమాల్) వాము పువ్వు       -------- 10 gr
                               (మెంతాల్) పుదీనా పువ్వు    -------- 10 gr 
                                             నువ్వుల నూనె    -------- 100 gr
                                             టీ పొడి              --------  1 టీ స్పూను
 
       నువ్వుల నూనెలో టీ పొడి వేసి మరిగించాలి.వేరే పాత్రలోకి వడపోసుకోవాలి. దీనిని కల్వంలో పోయాలి. తేనేమైనాన్ని కరిగించి,వడకట్టి దానిని కూడా కల్వం లోపోయాలి.తరువాత మిగిలిన పదార్ధాలను ఒక్కొక్కటిగా  వేసి బాగా మెత్తగా వెన్నపూసలాగా నూరాలి.మంచి ఆయింట్మెంట్ తయారవుతుంది , తీసి సీసాలో భద్ర పరచుకోవాలి.
 
       మనం తినే ఆహార పదార్ధాలలో మిగిలిన విష పదార్ధాలు కీళ్లలో చేరి , అక్కడ నొప్పులు, వాపులు ప్రారంభమవుతాయి.
 
      ఇటువంటి కీళ్ళ లేక అన్ని రకాల నొప్పులను నివారించ దానికి ఈ లేపనం ఎంతో బాగా ఉపయోగ పడుతుంది.
 
                       ఒళ్లునొప్పులు తగ్గడానికి ప్రజా రక్షణ తైలం                                       2-3-09.

               నువ్వుల నూనె                 ------ అర కిలో
               జిల్లేడు ఆకులు                 ------ 100 gr
               చింత ఆకులు                   ------ 100 gr
               ఉమ్మెత్త ఆకులు               ------ 100 gr
               కసివింద ఆకులు               ------ 100 gr
               వావిలాకు                        ------ 100 gr
               మిరియాల పొడి                -------  20 gr
               పిప్పళ్ళ పొడి                   -------  20 gr
              ముద్ద కర్పూరం                 -------  20 gr

     ఆకులన్నింటిని విడివిడిగా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. నూనెను ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద   పెట్టి నూనె కాగిన తరువాత ఒక్కొక్క రకం ఆకుల ముక్కలను నెమ్మదిగా వెయ్యాలి. జిల్లేడు ఆకుల ముక్కలను  చివరలో వెయ్యాలి. ఆకులు  పూర్తిగా మాడి పొగ తగ్గే వరకు నూనెను కాచాలి.  జాగ్రత్తగా వడపోసుకోవాలి. వేడిగా  ఉన్నపుడే మిరియాల పొడి, పిప్పళ్ళ పొడి కలపాలి. గోరువెచ్చగా అయిన తరువాత ముద్ద కర్పూరంకలపాలి.
 
దీనిని పొడిగా వున్న   సీసాలో భద్ర పరచాలి.

       దీనిని తలకు తప్ప శరీరములోని అన్నిభాగాలకు నొప్పులున్న చోట మర్దన చేయవచ్చు .దీని వలన వాత  నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అన్ని రకాల నొప్పులు నివారింప బడతాయి.

                                                   ఒళ్ళు నొప్పుల నివారణకు  చిట్కా                 23-6-11

        రెండు టీ స్పూన్ల సుగంధ పాల వేర్ల పొడిని నీళ్ళలో వేసి కాచి కలకండ కలుపుకొని తాగితే ఒళ్ళు నొప్పులు
నివారింపబడతాయి .
  
                  అన్ని రకాల నొప్పులు మరియు ఇరుకు నొప్పులు --- నివారణ             13-7-11.

 1   10 గ్రాముల బెల్లాన్ని మెత్తగా దంచాలి. తరువాత దానికి 10 గ్రాముల  సున్నం కలిపి మెత్తగా పేస్ట్ లాగా దంచి
పలుచని గుడ్డపై పూసి  దానిని నొప్పి వున్న చోట పరచాలి .

2.   సున్నం           --- 5 gr
      కాచు              --- 5 gr
      వెల్లుల్లి            --- 5 gr

           అన్నింటిని కలిపి మెత్తగా నూరి కండరాలు పట్టేసిన చోట పూయాలి

3.  కండరాలు పట్టేసిన చోట మొదట కొబ్బరి నూనె పోసి దాని పై మేడి పాలు పూయాలి

4.  మోడీ  ( పిప్పలి వేర్లు )            --- 5 gr
                      పిప్పళ్ళు             --- 5 gr
                         శొంటి               --- 5 gr
                      ఉసిరిక                --- 5 gr
                        బెల్లం                --- 5 gr

          ఆన్నింటిని విడివిడిగా చూర్నాలు చేసి బాగా కలపాలి .  2 గ్రాముల పొడిని నీటితో  తాగాలి .
          దీనివలన రకరకాల నొప్పులు నివారింప బడతాయి

                                              ఒంటి నొప్పులు  --- నివారణ                                 10-8-11.

కారణాలు :---- రక్తహీనత , థైరాయిడ్ , మధుమేహం , ఒత్తిడి  మొదలిన  వ్యాధుల వలన

పైపూతకు  :---

ఆవనూనె                             --- ఒక టీ స్పూను
ఆముదపు ఆకు                    --- ఒకటి

          ఆవ నూనెను కొద్దిగా వేడి చేసి ఆముదపు ఆకుకు పూసి నొప్పి వున్నచోట  అతికించాలి .  వెంటనే నొప్త తగ్గుతుంది .

కడుపులోకి :---

తాజా పసుపుకొమ్ము              --- ఒకటి
       పంచదార                      --- తగినంత

       ఒక చిన్న గిన్నెలో పసుపు కొమ్మును నీళ్ళు పోసి నానబెట్టాలి . ఒక గంట తరువాత దానిని తీసి దానికి  తడిగుడ్డ
చుట్టి నిప్పుల మీద కాల్చాలి . బాగా కాల్చి , దంచి , పొడి చేయాలి .
      
       అర టీ స్పూను పసుపు పొడికి తగినంత పంచాదారి కలిపి కడుపులోకి సేవించాలి

                                                     కండరాల నొప్పులను నివారించే పానీయము                          18-8-11.

 ఉపయోగాలు :--- ఒళ్లంతా నొప్పులు , ఇరుకు నొప్పులు , బెణుకు నొప్పులు , పిక్కలు పట్టేయ్యడం , కంటి సమస్యలు
నివారింపబడతాయి,

సూచన :--- దీనిని ఏరోజుకారోజు , అవసరమైతే ఏ పూలుటకాపూట తయారు చేసుకొని వాడాలి .

పాలు                         --- పావు కప్పు
నీళ్ళు                        --- పావు కప్పు
అల్లం                         --- అర అంగుళం
దాల్చిన చెక్క              --- ఒక  అంగుళం
మిరియాలు                --- రెండు
యాలకులు                --- రెండు
లవంగ మొగ్గ               --- ఒకటి
జాజికాయ పొడి            --- చిటికెడు
పంచదార                   --- ఒక టీ స్పూను
నెయ్యి                       --- ఒక టీ స్పూను

       పాలు , నీళ్ళు , పంచదార , నెయ్యి  కాకుండా మిగిలిన పదార్ధాలను ఒకదానితరువాత ఒకటిగాకల్వంలో  వేస్తూ
దంచాలి . అన్నింటిని ఒకే సారి వేసి దంచితే మెదగవు . కచ్చాపచ్చాగా దంచితే చాలు . తరువాత ఒక గిన్నెలో పాలు నీళ్ళు
పోసి స్టవ్ మీద పెట్టాలి . నీళ్ళు మరిగేటపుడు దంచిన మిశ్రమాన్ని వేయాలి  మిశ్రమం లోని ఎస్సెన్స్పాలలోకి దిగుతుంది .
రెండు, మూడు నిమిషాలు వుంచి వడపోసి దానిలో పంచదార , నెయ్యి కలుపుకొని వేడిగా ఉండగానే తాగాలి .

       రోజుకొకసారి  లేదా అవసరాన్నిబట్టి  అప్పటికప్పుడు తయారు చేసుకొని తాగాలి .

జాగ్రత్తలు ;--- విశ్రాంతి గా గడపాలి  , ( విశ్రాంతి అంటే నిద్రపోవడం మాత్రమె కాదు ) , అర్ధశక్తి గా వ్యాయామం చేయాలి .


















    















 . 
                                                       




            

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి