సర్వ రోగ నివారిణి
తిప్ప తీగను అమృత లత అంటారు.తీగ యొక్క ఆకులను తొలగించి తీగను మాత్రం ముక్కలు చేసి ఎండ బెట్టి,దంచి, పొడి చెయ్యాలి.
తిప్ప తీగ పొడి ------------- 150 gr
పాత బెల్లం ------------- 50 gr
తేనె ------------- 100 gr.
నెయ్యి ------------- 50 gr
పొడిని కల్వం లో వేసి బెల్లం వేసి బాగా నూరాలి. తరువాత తేనె, నెయ్యి కలిపి నూరాలి.లేహ్యం తయారవుతుంది,దీనిని సీసాలో భద్రపరచుకోవాలి.ఉదయం, రాత్రి భోజనానికి గంట ముందు లేహ్యం చప్పరించి నీళ్ళు తాగాలి .5 గ్రాముల నుండి ప్రారంభించి 10 గ్రాముల వరకు పెంచాలి.
ఉపయోగాలు :-- నేత్ర వ్యాధులు,గుండె సంబంధ వ్యాధులు,కాలేయ,మూత్ర పిండాల,మూత్ర సంబంధ వ్యాధులు నివారింప బడతాయి. రక్తం చెడిపోయి ,చర్మవ్యాధులు వచ్చిన వాళ్ళు వాడితే నివారింప బడుతుంది.విష జ్వరాలను తగ్గిస్తుంది.వ్యాధినిరోధక శక్తిని యిస్తుంది. మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.శారీరక దృఢత్వాన్ని శారీరక బలాన్నిస్తుంది.
తులసితో కాయ కల్పం 19-2-10.
మన ఇంటి పెరట్లో ఈశాన్య మూల పంచగవ్య పదార్ధాలను చల్లి తులసిని పెంచాలి. గోళ్ళు గాని, చిటికెన వేలు గాని, చూపుడు వేలు గాని, తులసికి తగలకుండా మిగిలిన మూడు వేళ్ళతో మాత్రమే 5 ఆకులను గిల్లుకొని సూర్యుని కెదురుగా నిల్చుని తినాలి. ఈ విధంగా ఒక సంవత్సరం రోజులు తింటే ఎప్పటికి ఎలాంటి వ్యాధులు రావు.

సర్వ రోగనివారిణి--ద్రాక్ష రసాయనం
ఎండుద్రాక్ష ----100 gr
అతిమధురం(యష్టిమధుకం ) పొడి ---- 100 gr
రెండింటిని రోట్లో వేసి బాగా దంచి, నూరాలి దీనిని సీసాలో భద్ర పరచుకోవాలి.
20 గ్రాముల ముద్దను బుగ్గలో పెట్టుకొని చప్పరించి పాలు తాగాలి. ఈ విధంగా 40 రోజులనుండి 60 గాని 100 రోజులు గాని వాడాలి బ్రహ్మచర్యం పాటించాలి.
దీనిని వాడడం వలన చర్మ దోషాలు, మూత్ర దోషాలు, వీర్య దోషాలు తొలగించ బడతాయి. శరీరానికి తేజస్సు నిస్తుంది.
అతి మధురంలోని చిరుచేదు ఎన్నో సుగుణాలను కలిగి వున్నది.
సంతానం లేని పురుషులకు వీర్యవ్రుద్ధి జరిగి సంతానం కలుగు తుంది. స్త్రీలు కూడా వాడాలి.
విద్యార్ధులు దీనిని వాడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
హిస్టీరియా తగ్గుతుంది.
దాహం, బలహీనత తగ్గుతాయి.
32 ఎండుద్రాక్ష పళ్ళను రాత్రి నానబెట్టి ఉదయం నిద్ర లేవగానే పళ్ళు తోముకొని వాటిని ఒక్కొక్కటిగా తిని ఆ నీటిని తాగాలి. దీని వలన అల్ప రక్తపోటు (Low B.P. ), అలజడి, భయం లాంటివి తొలగిపోతాయి.
ద్రాక్స రసాయనం ఋతు క్రమం లో అతిగా నెలకు రెండు సార్లు పీరియడ్స్ వచ్చే వాళ్లకు సక్రమంగా వచ్చేట్లు చేస్తుంది.
13-7-0
పండిన మర్రి పండ్లు, లేక మేడి, లేక జువ్వి, లేక రావి లేక అన్నిగాని లేదా ఒకటైనా గాని ముక్కలు చేసి ఎండబెట్టాలి. వాటిని కుండలో పోసి అవి మునిగే వరకు తేనె పోయాలి. బాగా కలియబెట్టి దానికి గుడ్డను కట్టి 40 రోజులు కదిలించకుండా తాకకుండా ఒక మూల ఉంచాలి.
తరువాత ఉదయం సాయంత్రం 10 గ్రాముల చొప్పున తీసుకోవాలి.
ఇది సర్వ రోగ నివారిణి .
సర్వరోగ నివారిణి ---దధి అమృతం
రెండు రోజుల పాటు నిల్వ ఉంచిన పెరుగు ---- 4 శేర్లు 1 శేరు = 800 గ్రాములు
కలకండ పొడి ---- 480 gr
నెయ్యి ----- 30 gr
మిరియాల పొడి ---- 50 gr
ఏలకుల పొడి ---- 30 gr
నాగ కేసరాల పొడి ---- 5 gr
పై పదార్ధాలను పెరుగులో వేసి బాగా పరిశుభ్రమైన చేతితో కలపాలి. తరువాత పలుచని నూలు గుడ్డలో వడకట్టాలి. దానిలో రెండున్నర గ్రాముల పచ్చ కర్పూరం కలపాలి. దీనిని జాడీలో నిల్వ చెయ్యాలి.
దీనిని ప్రతి రోజు ఒక గ్లాసు తాగుతూ వుంటే ఆకలి బాగా అవుతుంది. బలం కలుగుతుంది. సర్వరోగ నివారిణి, సంపూర్ణ ఆయుష్షు నిస్తుంది.
శరీర స్థౌల్యము కలుగుతుంది. అధిక బరువు, కొవ్వు తగ్గి శరీరము నాజూగ్గా తయారవుతుంది.
శరీర స్థౌల్యము కలుగుతుంది. అధిక బరువు, కొవ్వు తగ్గి శరీరము నాజూగ్గా తయారవుతుంది.
దీనిని ఏ కాలం లోనైనా ఏ వయసు వారైనా వాడుకోవచ్చు.
సర్వరోగ నివారిణి 2-4-11.
దీనిని 365 రోజులకు సరిపడా తయారు చేసుకోవాలి.
వేపపువ్వు --- 180 gr (రోగాలను తొలగించి, రాకుండా చేస్తుంది)
సైంధవ లవణం --- 30 gr
ఇంగువ --- 30 gr ( ఆవు నేతిలో వేయించాలి)
మిరియాల పొడి --- 40 gr
జిలకర పొడి --- 40 gr
వాము పొడి --- 40 gr
మిరియాలను, జిలకరను, వామును శుద్ధి చేసి ఎండబెట్టి దంచి జల్లించి పొడి చేయాలి.
అన్నింటిని కల్వంలో వేసి నూరి 365 మాత్రలు తయారు చేసుకోవాలి. బాగా ఆరబెట్టి నిల్వ
చేసుకోవాలి.
ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక మాత్ర చొప్పున వాడాలి.
ఈ విధంగా వాడడం వలన సంవత్సరమంతా ఎటువంటి వ్యాధులు దరి చేరవు.
సర్వ రోగ నివారిణి --- అమృత మిత్ర 20-8-11
కుంకుడు కాయల బెరడు పొడి ---- 50 gr
కరక్కాయల బెరడు పొడి ---- 50 gr
తేనె ---- తగినంత
రెండింటిని కల్వం లో వేసి తగినంత తేనె కలిపి మెత్తగా నూరాలి . బటాణి గింజంత (3 గ్రాములు ) మాత్రలు
తయారు చేసుకోవాలి .. లేకుండా ఆరిన తరువాత నిల్వచేసుకోవాలి .
ఆహారానికి గంట ,ముందు ఒక మాత్ర వేసుకోవాలి .
ఉపయోగాలు :--- పాండు రోగాన్ని పోగొట్టి రక్శాన్ని శుద్ధి చేస్తుంది . పొట్ట నిండా నీరు నిండి వున్నా ( ప్లీహ వృద్ధి)తగ్గిస్తుంది .. చెడు నీరు తొలగించబడుతుంది చర్మరోగాలు నివారింపబడతాయి . మొలలు కూడా నివారింపబడతాయి
చిట్కా
ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక తిప్ప తీగ ఆకును తింటూ వుంటే శరీరంలోని అన్ని వ్యాధులునివారింపబడతాయి .

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి