వర్షా కాలంలో వచ్చే కామెర్లు ---- నివారణ 26-5-10
కామెర్లు ( కామిల) ----శరీరంలో పైత్యం ప్రకోపించడం వలన వస్తుంది. అన్నం సహించదు. మలబద్ధకం ఏర్పడుతుంది. మలము నల్లగా గాని పసుపు రంగులో గాని వుంటుంది. మూత్రము పసుపుగా వుంటుంది.
చిన్న వేప చెక్క రసం --- ఒక టీ స్పూను
తేనె ----ఒక టీ స్పూను
రెండింటిని కలిపి ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఒక గంట వరకు ఏమి తీసుకోకూడదు. సమస్య ఎక్కువగా వుంటే రెండవ పూటకూడా తీసుకోవాలి.
బార్లీ, సగ్గుబియ్యం, తియ్యని మజ్జిగ, ఉప్పులేని మజ్జిగన్నం ఆహారంగా ఇవ్వాలి.
శరీరానికి శ్రమ లేకుండా విశ్రాంతిని ఇవ్వాలి.
. 6-12-10
రెండు టీ స్పూన్ల దానిమ్మ గింజల రసం చొప్పున రోజుకు రెండు సార్లు తీసుకోవాలి . ఈ విధంగా ఐదు రోజులు సేవిస్తే కామెర్ల వలన వచ్చే నీరసం, రక్త హీనత తగ్గుతాయి. వాంతులు కూడా నివారింప బడతాయి.
పచ్చ కామెర్లు --- చికిత్స 18-9-10.
శరీరంలో, కాలేయంలో పైత్య రసం చేరడం వలన ఈ వ్యాధి వస్తుంది.
కళ్ళు, గోళ్ళు, మూత్రం, చర్మం ( ఎక్కువైతే) పచ్చగా మారడం ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం.
గుంటగలగర పొడి --- 50 gr
ఆముదం ఆకుల పొడి --- 50 gr
నేల ఉసిరిక పొడి --- 50 gr
తిప్ప తీగ పొడి --- 50 gr
త్రికటు చూర్ణం --- 50 gr ( శొంటి, పిప్పళ్ళు, మిరియాలు కలిపి 50 gr )
పసుపు --- 25 gr
అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచాలి.
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఒక టీ స్పూను పొడికి ఒక టీ స్పూను తేనె కలిపి సేవించాలి.
పచ్చివైతే నూరి ముద్దా చేసుకొని మజ్జిగతో గాని, పెరుగుతో గాని సేవించాలి ( చేదుగా వుంటుంది.) లేదా ముద్దగా చేసి మింగి మజ్జిగ తాగవచ్చు.
ఆహారం:-- తేలికగా జీర్ణమయ్యే ఆహారం ముఖ్యంగా మజ్జిగన్నం, బియ్యపు జావ, రాగి జావ, పెసల మొలకలు తినాలి.
వేడి చేసే వస్తువులు, మాంస పదార్ధాలు వాడకూడదు.
ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి.
కామెర్లు -- నివారణ 5-4-11.
రెండు టీ స్పూన్ల నేల ఉసిరిక రసం తాగాలి లేదా ఆకును ముద్దగా నూరి మజ్జిగలో కలుపుకుని
తాగి చప్పిడి పత్యం వుంటే తగ్గుతుంది.
ఉడకబెట్టిన శనగలు 15 రోజులు, వేయించిన శనగలు ( ఉప్పు, కారం చల్లి) 15 రోజులు తింటే
కాలేయ సమస్యలు నివారింపబడతాయి.
కామెర్లు --- నివారణ 16-6-11.
కారణాలు :-- కాలేయము నుండి స్రవించ వలసిన పైత్యరసం రక్తంలో కలిసిపోయినపుడు
ఈ వ్యాధి వస్తుంది. గాల్ బ్లాడర్ ( పిత్తాశయం) లో రాళ్ళు ఏర్పడడం వలన వస్తుంది. ఎర్ర
రక్తకణాలు అతిగా విచ్చిన్నం చెందడం వలన వస్తుంది.
లక్షణాలు:-- కళ్ళు, చర్మం పసుపు రంగులో వుంటాయి. మూత్రం ఇటుక రాయి రంగులో,
మలం నువ్వుల రంగులో వుంటాయి. వాంతులయ్యే లక్షణాలు వుంటాయి.
1. తియ్యటి పెరుగు --- 4 టీ స్పూన్లు
పసుపు --- ఒక గ్రాము
కామెర్లు నివారింప బడే వరకు ప్రతి రోజు ఉదయం తాగాలి.
2. పచ్చి ముల్లంగి ఆకుల రసం --- రెండు టీ స్పూన్లు
కలకండ --- ఒక టీ స్పూను
కామెర్లు తగ్గే వరకు ఉదయం, సాయంత్రం తాగాలి.
3. వెన్న తీసిన ఆవు పాలు --- ఒక కప్పు
శొంటి పొడి --- ఒక గ్రాము
శొంటి పొడిని పాలల్లో వేసి మరిగించి ఒక వారం తాగాలి.
సూచనలు :-- తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. శారీరక శ్రమ చేయకూడదు.
మాంసాహారం పూర్తిగా మానెయ్యాలి.
ఉబ్బు కామెర్లు --- నివారణ 29-7-11.
లక్షణాలు :--- శరీరం ఉబ్బుగా వుంటుంది . అజీర్ణం ,రక్తహీనత , ఆకలి లేకపోవడం మొదలైన లక్షణాలు వుంటాయి
తెల్ల గలిజేరు వేర్ల చూర్ణం ---- 50 gr
మిరియాల పొడి ---- 50 gr
జిలకర పొడి ---- 50 gr
నీరు ---- తగినంత
అన్ని పదార్ధాలను కల్వం లో వేసి నీరు కలిపి బాగా మెత్తగా నూరి కుంకుడు గింజలంత మాత్రలు తయారు చేసి
ఆరబెట్టాలి
పూటకు ఒక మాత్ర చొప్పున రోజుకు మూడు సార్లు ( ఉదయం + మధ్యాహ్నం + సాయంత్రం ) వాడాలి . ఈ
విధంగా వాడితే నాలుగు నుండి ఏడు రోజులలో తగ్గి పోతుంది .
పద్యం :--- వారం రోజులు చప్పిడి పద్యం తీసుకోవాలి
3-8-11
సొరకాయ ( అనపకాయ ) రసం --- 50 gr
కలకండ --- 20 gr
రెండింటిని కలిపి తాగాలి . ఈ విధంగా వారం రోజులు తాగితే నివారించబడతాయి .
సూచన :-- అతివేడి ని కలిగించే పదార్ధాలను సేవించకూడదు . సాత్వికాహారమే భుజించాలి .
కామెర్ల నివారణ 26-8-11.
నేల ఉసిరిక రసం లేదా పొడి ---- 4 టీ స్పూన్లు
మజ్జిగ ---- ఒక గ్లాసు
మజ్జిగలో రసాన్ని కలుపుకొని తాగాలి
ఈ విధంగా చేయడం వలన 3 నుండి 7 రోజులలో తగ్గుతుంది . చప్పిడి పత్యం వుండాలి .