సాధారణ సమస్యలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సాధారణ సమస్యలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

తొడల లో కొవ్వు కరిగించడానికి

                                  తొడల సమస్య ---నివారణ                         28-1-09.
వ్యాయామం :--
 
1. రెండు పాదాలను ఒకదానితో మరొక దానిని ఆనించి తుంటి,మోకాళ్ళు, పొట్ట, నడుము కదిలేటట్లు మోకాళ్లను  సీతాకోక చిలుక రెక్కల్లాగా ఆడించాలి.దీనితో సన్నగా వున్న తొడలు లావుగా, లావుగా వున్న తొడలు సన్నగా అవుతాయి.     మూలాధార చక్రం శక్తివంత మవుతుంది.
 
2. కాళ్ళను చక్కగా చాపుకొని కూర్చొని గాలి పీల్చి వదలాలి.రెండు కాళ్ళను తొడలు పట్టుకు పోయేటట్లు గట్టిగా  బిగించాలి.బిగిస్తూ,వదుల్తూ కదిలించాలి.
 
3. వెనక్కి పడుకొని ఒక కాలు తో సైకిలు తొక్కినట్లు ఆడించాలి.రెండవ వైపు కూడా అదే విధంగా చెయ్యాలి.
 
  రెండు కాళ్ళతో కూడా సైకిలు తొక్కినట్లు చెయ్యాలి.ముందుకు వెనక్కు తొక్కాలి.

             తోడలలో, పిరుదులలో క్రొవ్వు తగ్గించడానికి ---వ్యాయామం                              2-9-09.

1. పవనముక్తాసనం:--     2. నౌకాసనం

    ఒక్కొక్క ఆసనానికి మధ్య కొంత  విశ్రాంతి అవసరం.

ఆహారం:--   సూప్

   ఒక పాత్ర తీసుకొని దోసకాయలు, బీట్ రూట్, పెద్ద చిక్కుళ్ళు, కారెట్, కాలిఫ్లవర్ , టమేటాలు
మొదలైన వాటినివేసి సరిపడినన్ని నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. ఉడికేటపుడు కొత్తిమీర,
 పుదీనా ,కరివేపాకు  సగం వుడికినతరువాత  మిరియాల పొడి, సైంధవ లవణం నలగగొట్టిన చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా ఉడికించాలి. బాగా వుడికిన తరువాత నీళ్ళు వడకట్టి కొంచం కొంచంగా తాగాలి. కావాలంటే  ఆ ముక్కలను కూడా తినవచ్చు.

    దీని వలన ఆకలి తగ్గుతుంది. శక్తినిస్తుంది.  ముఖ్యంగా తోడలలో కొవ్వు ఖచ్చితంగా కరుగుతుంది. కొవ్వు  కరిగించడంలో సైంధవ లవణం కొవ్వును కరిగించడంలో బాగా ఉపయోగ పడుతుంది.

    వర్షపు నీటిని 6 నెలల వరకు సరి పడా ఉండేట్లుగా కుండల్లో నిల్వ చేసుకోవాలి. అర గ్లాసు వర్షపు నీటిలో  చిటికెడు పసుపు కలుపుకొని ప్రతి రోజు తాగుతూ వుంటే శరీరం సన్నగా, నాజూకుగా, అందంగా తయారవుతుంది.

    ఉలవ గుగ్గిళ్ళ ను  ప్రతి రోజు తింటూ వుంటే నెలకు  4,5 కిలోల బరువు తగ్గుతారు. ఉలవలు తినడం వలన వేడి చేస్తే పలుచని మజ్జిగ తాగాలి.

                                         తొడల లో క్రొవ్వు తగ్గించడానికి                               30-5-11.

      ఈ సమస్యలో తుంటి భాగం కూడా పెరుగుతుంది . 

కారణాలు :-- ముఖ్యంగా కొవ్వు పదార్ధాలు , స్వీట్లు , ఉప్పు ఎక్కువగా వున్నపదార్ధాలను ఎక్కువగా వాడడం వలన కొవ్వు పెరుగుతుంది .
      నీరు ఎక్కువగా తాగాలి . 

1.     పుట్ట మన్ను తెచ్చి నీళ్ళు కలిపి పేస్ట్ లాగా చేసి తొడల మీద పట్టించాలి . ఇది లావును, వాపును   తగ్గిస్తుంది
        ఈత మంచిది .

 2    కానుగ కాయల పప్పు         
         ఆవాలు
        గోమూత్రం
                        అన్నింటిని కలిపి నూరి గోరువెచ్చగా చేసి పోయాలి

3.    వావిలి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తొడల మీద ధారగా పోయాలి .  దీనివలన
       కొవ్వు కరుగుతుంది .

4.   రెండు కాళ్ళ మధ్య దిండును పెట్టి గట్టిగా నొక్కాలి .

5.   తొడ కండరాలను పైకెత్తాలి .  పక్కకు తిరిగి పడుకొని కాలును పైకెత్తాలి  .








వాత, పిత్త, కఫ దోషాల నివారణ

                    వాత, పిత్త, కఫ దోషాలను తొలగించే ఆయుర్వేద కారం పొడి             27-6-09.

                                                 కరివేపాకు పొడి               ---10 gr
                                                 జిలకర పొడి                   --- 10 gr
                                                మిరియాల పొడి             ---- 10 gr
                                                ధనియాల పొడి               --- 10 gr           
                                                సైంధవ లవణం పొడి        --- 10 gr
                                                లవంగాల పొడి                 ---  5 gr

       సైంధవ లవణం తప్ప మిగిలిన పదార్ధాలను దోరగా వేయించి విడివిడిగా పొడులు దంచి సైంధవ లవణం కలిపి  సీసాలో నిల్వ చేసుకోవాలి.

       దీనిని అన్నం లో కలుపుకొని తినాలి.

       ఇది శరీరంలో వాత, పిత్త, కఫదోషాలను  తొలగించి  శరీరాన్ని  సమ స్థితిలో   ఉంచుతుంది.   చెడు వాయువులను తొలగిస్తుంది   గడ్డలుగా వున్నకఫాన్ని  కరిగిస్తుంది.

                    వాతజ , పిత్తజ , కఫజ  కారణాల వలన ఏర్పడే సన్నిపాతజ సమస్య     4-6-11.
                                          మరియు చాతీనోప్పి --- నివారణ

చాతీ నొప్పి  రావడానికి గల కారణాలు :--- ఊపిరితిత్తుల సమస్య,  అన్నవాహికలో సమస్య, గ్యాస్
సమస్య ,  అధిక శ్రమ చేయడం, ఎముకలలో, కండరాలలో బలం లేకపోవడం , శరీర వ్యవస్థలో
లోపాలు , శరీరంలో రోగాలు ఉండడం మొదలైనవి .

వాతజ, పిత్తజ , కఫజ  సమస్యల వలన ఏర్పడే సన్నిపాతజ  సమస్య ;--

వాతజ:-- శరీరంలో  కోసినట్లు వుండడం
పిత్తజ :-- శరీరంలో మంటలుగా వుండడం, చెమట పట్టడం, నోరు ఎండిపోవడం
కఫజ :-- శరీరం భారంగా వుండడం, నోటిలో తియ్యదనం ఊరడం, నోటిలో మ్యూకస్ పేరుకున్నట్లు
వుండడం .
        శరీరంలో  ఈ మూడు లక్షణాలు కలిసి వుంటే దానిని సన్నిపాతజ  సమస్య అంటారు .

        కేవలం శ్రమ వలన  లేదా కండరాల నొప్పుల వలన అనగా నీరసం వలన వచ్చే చాతీ నొప్పిని
మాత్రమె నివారించడానికి :--   

ఎండుద్రాక్ష                    ----100 gr
ఏలకుల పొడి                ----  25 gr
శొంటి పొడి                    ----  25 gr
కరక్కాయ పెచ్చుల పొడి ---  25 gr
పిప్పలి కట్టె పొడి            ---- 25 gr
వస పొడి                      ---- 25 gr

      ఎండుద్రాక్ష పేస్ట్ లో అన్ని చూర్ణాలను కలపాలి . దీనికి తేనె , నెయ్యి కలుపుకోవచ్చు. తేనె , నెయ్యి కలిపెటపుడు  నెయ్యి తక్కువగా, తేనె ఎక్కువగా కలపాలి . దీనితో లేహ్యం తయారవుతుంది
దీనిని సీసాలో నిల్వ చేసుకోవాలి .   ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తయారు చేసుకోవాలి . 

      ప్రతి రోజు వాడితే చాతీ నొప్పి తప్పక నివారింపబడుతుంది.
      ప్రతి రోజు ఉదయం , సాయంత్రం ఆహారానికి ముందు వాడాలి .

                             









దోమల బెడద


                                                           దోమల బెడద

                                                           దోమల నివారిణి                                            8-9-11.

ఆవాల చూర్ణం
కొండ తులసి చూర్ణం
వేపాకు చూర్ణం
ఉత్తరేణి ఆకుల చూర్ణం 
కల్లుప్పు పొడి

         అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని బాగా కలిపి , ఉప్పు పొడిని కూడా కలిపి నిల్వ చేసుకోవాలి .
         ఈ పొడిని నిప్పుల మీద వేసి ఇల్లంతా పొగ వ్యాపించేట్లు తిరిగితే దోమలు ఇంట్లోకి రావు 

దోమల విద్వంసిని

                      దోమల విద్వంసిని లేక మశక నాశని                                       3-3-09.
                     వేపాకు పొడి
                    దోరగా వేయించిన  ఆవాల పొడి
                    కల్లు ఉప్పు పొడి
           అన్నింటిని సమానంగా తీసుకొని కలపాలి.
           ఒక మట్టి మూకుడు తీసుకొని దానిలో పిడకను ముక్కలుగా చేసి మధ్యలో కర్పూరం పెట్టి అంటించి నిప్పు చెయ్యాలి. బాగా నిప్పు అయిన తరువాత దాని మీద పొడిని చల్లాలి. దీనిని ఇంట్లో పెట్టినపుడు ముందుగా కిటికీలు, తలుపులు వేసి పొగ పెట్టి 10 నిమిషాలు వుంచి తలుపు తీయాలి.
         దీనిలో ఉత్తరేణి ఆకుల పొడి, కానుగ ఆకులు, సీత ఫలం ఆకుల పొడి, పొగాకు పొడి మొదలైనవి కూడా వేయవచ్చును.

                     దోమలు కుట్టకుండా కాపాడే ఆయుర్వేద తైలం                                       7-4-11.

            కొబ్బరి నూనె                   --- 100 gr
            వేపనూనె                        ---     3 ml
            లెమన్ గ్ర్యాస్ ఆయిల్       ---     5 ml
            దేవదారు తైలం                ---     2 ml

     ఒక గిన్నెలో కొబ్బరి నూనెను తీసుకుని దానిలో మిగిలిన పదార్ధాలను కలపాలి.  దీనిని సీసాలో
 పోసి మూతపెట్టి బాగా గిలక్కొట్టాలి. దీనిని నిల్వ చేసుకోవాలి.

     అర టీ స్పూను తైలం  చేతిలో వేసుకుని రుద్ది శరీరం మీద అనాచ్చాదిత భాగాలలో రాయాలి.
  దీని వలన క్రిములు,  దోమలు కుట్టవు.

  కీటకాలు ఘాటైన స్ప్రే ల వంటి వాసనలకు ఆకర్షింప బడతాయి.


                                           దోమలు కుట్టకుండా క్రీమ్                                              4-8-11.

తేనేమైనం                  --- 10 gr
బాదం నూనె               --- 20 ml
వేపనూనె                   ---   5 ml
యూకలిప్టస్ ఆయిల్   ---   2 ml

       ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు పోసి వేడి చేయాలి . ఆ నీటిలో చిన్న గిన్నెను పెట్టి దానిలోవడకట్టిన  తేనేమైనం వేయాలి
దీనికి బాదం నూనె , వేపనూనె కలపాలి . బాగా కలపాలి . కరిగిన తరువాత దింపి కొద్దిగా చల్లారిన తరువాత  దానిలో
యూకలిప్టస్ ఆయిల్ ను కలపాలి . తరువాత కొంచం వేడిగా , ద్రవరూపం లో ఉండగానే దానిని వెడల్పు మూత వున్న
సీసాలో భద్రపరచుకోవాలి

       ఇది గడ్డకట్టి ఆయింట్మెంట్ లాగా తయారవుతుంది  దీనిని కొద్దిగా చేతిలోకి తీసుకొని  శరీరం మీద దోమలు కుట్టే
ప్రాంతంలో పల్చగా [పూయాలి .
                                                  
                     

లావు తగ్గడానికి

                                       లావు తగ్గడానికి                                                   17-11-08.

                  చింత గింజలను ఒక రోజంతా నీటిలో నానబెట్టాలి.పొద్దున బాగా పిసికి పొట్టు పోయిన తరువాత కొంచం నెయ్యి వేసి వేయించి,పొడి చేసి పెట్టుకోవాలి.
                 అర స్పూను పొడిని పాలలో వేసి, చక్కర కలిపి తాగాలి.
                 40  రోజులనుండి  100 రోజులు వాడాలి .
2.  నేరుగా పట్టిన వాన నీటిని నిల్వ చేసుకోవాలి.ప్రతి రోజు ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను పసుపు కలిపి తాగితే లావు తగ్గుతారు.

                                      స్థూల కాయం-- నివారణ                                          11-6-10.
 
 కారణాలు, లక్షణాలు:-- వంశ పారంపర్యం,---  

శరీరంలోనివ్యాధులుహైపో థైరాయిడ్, విపరీతమైన  ఆహారపు  ఆలవాట్లు, వ్యాయామం
చేయక పోవడం, శరీరంలో కొవ్వు బాగా పెరిగిపోవడం, రక్త నాళాల్లో కొవ్వు పేరుకు  పోవడం, గుండె   సమస్యలు, చెమట  ఎక్కువగా వెలువడడం  దాని వలన దుర్వాసన, సరిగా నడవలేక పోవడం
 సంతాన లేమి   మొదలైనవి.    

పరిష్కార మార్గాలు:--   
                                    Body Moss Index = BMI
         బరువు / ఎత్తు                           18. 5     ఇది  Normal
18.5  తక్కువ వుంటే బలహీనమని, ఎక్కువ వుంటే అధిక బరువు అని అర్ధం
1.  తేనె                            ---25 gr 
     గోరువెచ్చని నీళ్ళు     ---- ఒక గ్లాసు
     ఉదయం, సాయంత్రం పరగడుపున తాగాలి.
2.  వాయువిడంగాల పొడిని  2,3  గ్రాముల చొప్పున ఉదయం, సాయంత్రం వేడి నీటితో తీసుకోవాలి.
3. త్రిఫల చూర్ణము
    త్రికటు చూర్ణము
          రెండింటిని సమాన భాగాలు గా తీసుకోవాలి. పూటకు ఒకటిన్నర స్పూను చొప్పున ఉదయం, సాయంత్రం    తీసుకోవాలి.
4. ప్రతి రోజు  అర స్పూను నుండి ఒక స్పూ ను వరకు కరక్కాయ పొడిని రెండు పూటలా క్రమం
తప్పకుండా    తీసుకుంటే తగ్గి పోతుంది.

                               అధిక బరువు--నివారణ                                                   18-6-10.
కారణాలు;-- హార్మోన్లలో తేడాలు,     PCDO  సమస్య,        జన్యు పరమైన కారణాలు,       అధికంగా ఆహారం తీసుకోవడం    వ్యాయామం చేయక పోవడం,    సరైన శారీరక శ్రమ లేక పోవడం, నూనెలో బాగా వేగిన పదార్ధాలను తినడం    ,మెత్తని పదార్ధాలను తినడం,    కార్బో హైడ్రేట్లు ( పిండి పదార్ధాలు) ఎక్కువగా తీసుకోవడం,     ఆహార విహారాలతో బాటు మధ్యాహ్నం నిద్ర పోవడం  మొదలైనవి.
       అతి స్థూలత కలిగిన వాళ్ళు అతి భయంకరమైన రోగులు

                       నడక చక్కని వ్యాయామం 
BMI      18. 5 నుండి 25  వరకు సాధారణ బరువు
     వ్యాయామం, ఆహార నియమాలు మొదలైన వాటిని ఎల్లప్పుడూ పాటిస్తూ వుండాలి.
     గుగ్గులు బాగా ఉపయోగ బడతాయి.

                                            స్థూల కాయము                                                          3-9-10.

           పిండి పదార్ధాలు, క్రొవ్వు పదార్ధాలు ఎక్కువగా వున్నపదార్ధాలను వాడడం వలన  ఈ సమస్య వస్తుంది

మధ్యాహ్న నిద్ర వలన బరువు పెరుగుతారు.

           వ్యాయామం బాగా చెయ్యాలి.  నడక చాలా మంచిది.

           గర్భిణి స్త్రీలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, జ్వరపీడితులు  నిద్రించవచ్చు.

                                 చిట్కా                                                    8-10-10.

         ప్రతి రోజు ఒక తిప్ప తీగ ఆకును తింటూ వుంటే లావు తగ్గి  శరీరంలోని భాగాలు,  చర్మం లాంటివి  వేలాడుతూ వుంటే ఒక సంవత్సరానికి గట్టి పడతాయి.
           
                                          లావు తగ్గడానికి                                         11-3-11.

      భోజనానికి  అరగంట ముందు వేరుశనగ పప్పులకు  చక్కెర  కలిపి తింటే భోజనం తక్కువగా
 తింటారు.
                                 త్వరగా లావు తగ్గడానికి చిట్కా                             2-4-11.

       ఆహారానికి బదులుగా కేవలం ఆపిల్ పండ్లు మాత్రమే తింటే రోజులలో లావు తగ్గుతారు.
                               





                      

గుట్కాల సమస్య

                                                                           గుట్కాల సమస్య
                               వక్కపొడి, కారాకిళ్లి, గుట్కాలు    అతిగా   వాడే వాళ్లకు విరుగుడు
       అతిమధురం వేళ్ళ యొక్క చిన్న ముక్కలను నోట్లో వేసుకొని నములుతూ లేదా చప్పరిస్తూ, రసం మింగుతూ ఉండాలి.అందువలన దురలవాట్లు పోతాయి. 2,3 పచ్చి ఉల్లిగడ్డలను అన్నం తినేటపుడు వాడాలి.
మూడు పూటలా భోజనం తరువాత తాంబూలం సేవించాలి.

                  గుట్కాలు నమలడం వలన కలిగే సమస్యలు ---నివారణ                               3-9-09.

     వేపచెక్క కషాయాన్ని సాయంత్రం పూట నోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మేయ్యాలి. ఉదయం నువ్వుల నూనెనునోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మేయ్యాలి.

     అన్నం తినేటపుడు పచ్చి ఉల్లి గడ్డలను పక్కన పెట్టుకొని వాటి మీద నిమ్మరసం చల్లుకొని మధ్య మధ్యలో తింటూ వుండాలి.  ఉల్లిగడ్డ శరీరంలోని వేడిని, B.P. ని తగ్గిస్తుంది.

     అతిమధురం వేరు యొక్క ముక్కను నోట్లో వేసుకొని, బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ వుండాలి. ఈ విధంగా 40 రోజులు చేస్తే శరీరంలో గుట్కాలు, తాంబూలాల వలన చేరిన విష అవశేషాలు నిర్మూలించ బడతాయి.

                                           గుట్కాలు మానడానికి                                               17-3-11.

            వక్కపొడి ముక్కల సైజు లో ఉసిరిక ముక్కలు      --- 100 gr
                    దోరగా వేయించిన సోంపు గింజలు             ---   25 gr
                       "           "               జిలకర               ---   25 gr
                       "           "                  వాము             ---   25 gr
                                                అల్లం రసం                 --- తగినంత
                                                నిమ్మ రసం                --- తగినంత
                                           సైంధవ లవణం                 --- కొద్దిగా

           ఒక గిన్నెలో అన్ని ముక్కలను వేసి   అవి పీల్చుకునేట్లు  నిమ్మరసం,  అల్లం రసం కలపాలి.
   చివరగా సైంధవ లవణం చల్లి ఎండబెట్టాలి.  బాగా ఎండిన తరువాత  సీసాలో నిల్వ చేసుకోవాలి.
   ఇది ఎంత కాలమైనా నిల్వ ఉంటుంది.

         ఈ ముక్కలను కొద్దిగా తీసుకుని నోట్లో వేసుకుని నములుతూ,  చప్పరిస్తూరసం మింగుతూ
  వుండాలి. దీని వలన ఈ అలవాటు క్రమేపి నివారింప బడుతుంది.  







ఎక్కిళ్ళు

                 ఎక్కిళ్ల సమస్య --నివారణ                                                      29-1-09.
 
      ఇచ్చాసనం లో ముద్ర వేసుకొని కూర్చోవాలి . మెడ, పొట్ట వంగ కూడదు.
 
       వజ్రాసనం లో కూర్చొని మోకాళ్ళ మీద చేతులను ముద్ర రూపంలో పెట్టాలి. గాలి పీలుస్తూ, వదుల్తూ వుండాలి.
 
మనసును భ్రుకుటి మీద లగ్నం చెయ్యాలి. ఎంత సేపైనా చెయ్యవచ్చు.

దీని వలన చాల త్వరగా ఎక్కిళ్ళు తగ్గి పోతాయి.

2. బోర్లా పడుకొని అర చేతులు రొమ్ము భాగంలో వుంచి శరీరాన్ని నెమ్మదిగా పైకి లేపాలి.చేతులను కిందికి ఆనించి మెడను పైకేత్తాలి. తరువాత బోర్లా పడుకోవాలి.
 
3. ఉష్ట్రాసనం వెయ్యాలి.
 
                      శొంటి           ----50 gr
                      మిరియాలు  --- 50 gr
                      పిప్పళ్ళు      ----50 gr
 
     ఈ మూడింటిని విడివిడిగా దోరగా వేయించి దంచి జల్లించి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
     2 గ్రాముల పొడిని అరచేతిలో వేసుకొని అర టీ స్పూను తేనెను కలిపి రంగరించి నాలుకతో చప్పరించాలి.
ఆహారం తినాలనిపిస్తే  అర గ్లాసు జావ తాగాలి.

        ఎక్కిళ్ళు తీవ్రంగా వున్నపుడు --నివారణ చర్యలు                        17-7-10.
 
       ఎండిపోయిన మామిడి ఆకులను నిప్పుల్లో వేసి  ఆ పొగను పీలిస్తే వెంటనే ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ఎంత కాలం నుండి వున్న ఎక్కిళ్ళు  అయినా నివారింప బడతాయి.  మామిడి ఆకులను ఆవు పిడకల నిప్పు మీద ధూపం వేస్తే  ఎంతో మంచిది.     దీనినే టిక్కా ధూపం అంటారు.

                                                       6-11-10
ఉసిరి
శొంటి
పిప్పళ్ళు 

     అన్ని చూర్ణాలను   సమాన భాగాలు తీసుకుని కలిపి  పెట్టుకోవాలి.   అవసరమైనంత పొడిని తీసుకుని  దానికి తగినంత కలకండ పొడిని కలిపి  ముద్ద చేసుకుని చప్పరిస్తూ వుంటే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.

                                                              చిట్కా                  28-12-10.
 
      గ్లాసులో అంచు వరకు నీళ్ళు తీసుకుని స్థిరం గా  చాతీ వద్ద పట్టుకుని తలను వంచుతూ అంచుతో నీటిని తాగాలి. గ్లాసును ఏమాత్రం  పైకేత్తకూడదు.  అద్భుతంగా వెంటనే ఎక్కిళ్ళు నివారింప బడతాయి.

                                     ఎక్కిళ్ల సమస్య ---నివారణ                           18-1-11.
    
       ఉదరవితానం  ఎక్కువగా సంకోచించినపుడు  ఎక్కిళ్ళు వస్తాయి.  ఎక్కిళ్ల సమయంలో అదనపు గాలి లోపలిపోతుంది.   ఘాటైన మసాలా పదార్ధాలు,  అతి వేడిగా వున్నా పదార్ధాలను తినడం వలన ఎక్కిళ్ళు వస్తాయి.

1.  ఉలవల   కషాయం గాని, ఉలవలు  గాని వాడుతూ వుంటే   ఎక్కిళ్ళు  తగ్గుతాయి.
     ఉలవలను  వేయించి  నలగగొట్టి  నాలుగు కప్పుల నీటిలో వేసి ఉడికించి ఒక కప్పుకు రానిచ్చి ఉదయం అర కప్పు ,   సాయంత్రం అర కప్పు తీసుకోవాలి.

2.  నెమలి ఈకల్ని రేకు పై  మందిస్తే  బూడిద అవుతుంది. దానిని తేనెతో కలిపి తీసుకోవాలి.

3.  పావు టీ స్పూను యాలకుల  గింజల చూర్ణాన్ని తగినంత తేనె తో తీసుకోవాలి.  ఈ విధంగా మూడు పూటలా తీసుకోవాలి.

                  ఆగకుండా వచ్చే ఎక్కిళ్ల నివారణకు --చిట్కా                                         31-3-11.

      పుదీనా ఆకులను నమిలితే ఎక్కిళ్ళు వెంటనే తగ్గుతాయి.  లేదా
      అర కప్పు పుదీనా ఆకుల రసాన్ని తాగినా తగ్గిపోతాయి.

                                                                28-7-11

లక్షణాలు :-- ఘాటైన పదార్ధాలను తినడం వలన  ,  కొన్ని రకాల వ్యాధుల  కారణంగా వచ్చే అవకాశాలు కలవు .

1. నెమలి ఈకల భస్మం                 --- చిటికెడు
             పిప్పళ్ళ చూర్ణం              ---     "
                     తేనె                      --- తగినంత

        అన్నింటిని బాగా రంగరించి నాకేయ్యాలి . వెంటనే చల్లాటి నీళ్ళు గటగట  తాగితే ఎక్కిళ్ళు వెంటనే ఆగిపోతాయి

2. జిలకర పొడి                            ---- అర  టీ స్పూను
    ధనియాల పొడి                       ----   "     "      "

        రెండింటిని కలిపి నోట్లో వేసుకొని రసం మింగితే వెంటనే ఆగిపోతాయి .
3. అర టీ స్పూను చక్కర ను నాలుక కింద పెట్టుకుంటే వెంటనే తగ్గుతాయి /


 










ముళ్ళు గుచ్చుకుంటే




                                                    ముళ్ళు గుచ్చుకుంటే


                             ముళ్ళు గుచ్చుకున్నపుడు జాగ్రత్తగా తీయడానికి         25-1-11.


కావలసిన వస్తువులు :--

సేలోఫిన్ టేప్
ఫోర్సేప్స్
ఫెవికాల్
వేడి నీళ్ళు
శతదౌత ఘ్రుతం


1. అర చేతులలో నిండుగా ముళ్ళు గుచ్చుకున్నపుడు సేలోఫిన్ టేప్ ను ముళ్ళ మీద అంటించి
లాగేయ్యాలి. టేప్ తో కూడా ముళ్ళు లేచి వస్తాయి.

2. పైకి తీయవచ్చు ముళ్ళు ముళ్ళు బాగా సన్నగా తీయవచ్చు.

3. బాగా సన్నగా వున్న ముళ్ళు అరచేతి నిండా, అరికాలి నిండా గుచ్చుకుని వుంటే వాటి మీద
ఫెవికాల్ ను బాగా మందంగా పరిచి బాగా ఆరిన తరువాత ఒక పొరలాగా లేపితే దానితోబాటు
ముళ్ళు కూడా లేచి వస్తాయి.

4. ముళ్ళు బాగా లోతుగా గుచ్చుకుని వుంటే రోజుకు నాలుగైదు సార్లు వేడి నీళ్ళలో పెట్టాలి.
విధంగా రెండు, మూడు రోజులు చేస్తే చెయ్యి ఉబ్బి ముళ్ళు దానంతట అదే వచ్చేస్తుంది.

5. ముళ్ళు గుచ్చుకోవడం వలన ఇన్ఫెక్షన్ చేరి చీము పట్టి వుంటే శతదౌతఘ్రుతము గాని లేదా
తేనె, నెయ్యి కలిపి గాని పూయాలి.

                         కాళ్ళలో ముళ్ళు గుచుకుంటే                                          25-3-11.
  
              కాలిలో ముల్లు  గుచ్చుకున్నపుడు  దానిపై జిల్లేడు పాలు వేస్తె ముళ్ళు త్వరగా
  బయటకు వస్తుంది.



వైద్యుడు లేని చోట


                                                       ఎసిడిటి                              26-12-10.

       వైద్యుడు లేని చోట అవకాశాలు లేని చోట ఎసిడిటి ఎక్కువైతే పక్కకు తిరిగి పడుకోవాలి.

            రక్త పరీక్ష కోసం సూది గుచ్చినపుడు నొప్పి తెలియకుండా ఉండాలంటే :---

చిన్నగా దగ్గితే తాత్కాలికంగా చాతీలోపల ఒత్తిడి పెరుగుతుంది. దీని వలన రిలీఫ్ వచ్చి నొప్పి తెలియదు.

                                             బాండేజ్ తొలగించాలంటే                            5-1-11.

       శరీరం మీద గాయమై బాండేజీ వేసినపుడు అది బిగుసుకు పోయి సమస్య ఏర్పడుతుంది.
దానిని   తొలగించడానికి దూదిని వుండగా చేసి వేడి నీటిలో ముంచి బాండేజీ పై తడిపితే చాలా సులభంగా వూడి వస్తుంది.

                                         వేలికి ఉంగరం బిగుసుకు పోతే                        6-1-11.

       థైరాయిడ్ , చర్మము , కీళ్ళకు సంబంధించిన వ్యాధులు శరీరం లో వున్నపుడు ఈ విధంగా బిగుసుకుపోవడం    జరుగుతుంది.

1. చేతులను ముందు రిలాక్స్ చెయ్యాలి. చేతులను పైకేత్తాలి. ( గుండె కంటే పైకి) చేతులనుండి రక్తం కిందికి ప్రసరిస్తుంది. ఇప్పుడు సులభంగా తీయవచ్చు.

2. వాచిన వేలు మీద ఐస్ క్యూబ్ ని ప్రయోగించాలి.

3. సబ్బుగాని, ఆముడంగాని వెలి మీద ప్రయోగించాలి.

4. ఒక వంచ గలిగిన వైర్ ను తీసుకుని ఉంగరంలోకి దూర్చాలి. ఉంగరం లాగే దాన్ని వేలికి రెండు. మూడు చుట్లు చుట్టి నెమ్మదిగా లాగుతూ వూడదీయాలి

                        హోల్డర్ నుండి పగిలిన బల్బు ను తీయాలంటే                        7-1-11.

     పెద్ద సైజు బంగాళా దుంపను రెండు ముక్కలుగా కోసి వాటితో బుల్బు ను రెండు వైపులా గుచ్చి పట్టుకునితిప్పితే చేతికి గాయం కాకుండా తీయవచ్చు.

                            తెల్లవారుజామున ఏర్పడే రక్త ప్రసరణ సమస్య                  10-1-11.

     తెల్లవారుజామున 4, 5 గంటల ప్రాంతంలో కొంతమందికి రక్తప్రసరణ సమస్యలు ఏర్పడుతూ
వుంటాయి. అరిచేతుల ద్వారా ఉష్ణోగ్రత బయటకు పోతుంది. దీనిని నివారించడానికి అరిచేతులను
చంకల్లో పెట్టుకుని గట్టిగా నొక్కాలి. దీని వలన శరీరంలోని ఉష్ణోగ్రత బయటకు పోదు.

                                ప్రయాణాల లో వాంతులు --- నివారణ                          26-1-11.

     శొంటి పొడిని ఖాళీ గా వున్నా క్యాప్స్యుల్స్ లో నింపి నిల్వ చేసుకోవాలి.
ప్రయాణంలో వాంతి అయిన వెంటనే ఎక్కువ నీళ్ళు తాగాలి. వాంతి నుండి దృష్టి మరల్చాలి.
ప్రయాణానికి ముందు రెండు టీ స్పూన్ల అల్లం రసాన్ని ఒక టీ స్పూను తేనెతో కలిపి తీసుకుని
బయలుదేరితే వాంతులు కావు. లేదా రెండు శొంటి పొడి క్యాప్సుల్స్ ను వేసుకుని బయలుదేరాలి.

       తెల్లవారుజామున 4, 5 గంటల ప్రాంతంలో రక్త ప్రసరణ సమస్యలు ఏర్పడుతుంటాయి. ఈ సమయంలోడాక్టర్ వెంటనే దొరకడం కష్టం అవుతుంది. ఈ సమస్య ఏర్పడినపుడు ఉష్ణోగ్రత అరచేతుల ద్వారా బయటకు పోతుంది. దీనిని నివారించడానికి అరిచేతులను చంకలలో పెట్టుకొని గట్టిగా నొక్కాలి,
    దీని వలన శరీరంలోని  ఉష్ణం బయటకు పోదు.

                     ఐస్ క్రీం తిన్న తరువాత వచ్చే తల నొప్పి --నివారణ                      11-1-11

     ఐస్ క్రీం తిన్న తరువాత కొంతమందికి తలనొప్పి వస్తుంది. అంగిట్లో రక్తనాళాలు సంకోచించడం వలన తలలో కూడా సంకోచిస్తాయి అనే ఫీలింగ్ మైండ్ లో వస్తుంది దానితో తల నొప్పి వస్తుంది.

అంగిట్లో నాలుకతో గట్టిగా అదిమి పెడితే ఆ ఫీలింగ్ తగ్గి తలనొప్పి తగ్గుతుంది.

                                   పాదంలో ముళ్ళు గుచ్చుకుంటే                                     13-1-11.

    ముళ్ళు బయటకు కనిపిస్తుంటే రెండు బొటన వ్రేళ్ళతో దగ్గరగా నొక్కుతూ పైకి తీసుకు రావడానికి ప్రయత్నించాలి.

నోటితో తీయడానికి మాత్రం ప్రయత్నించకూడదు.

ముళ్ళు లోపలికి  వుంటే దూదిని స్పిరిట్ తో తడిపి ఆ ప్రదేశంలో రుద్ది సూదితో గుచ్చి పైకి లేపి శ్రావణం(ఫోరేసేప్స్) తో తీయాలి. సూదితో తీయలేని పక్షంలో నైల్ కట్టర్ తో చర్మం తొలగించి సూదితో తీయాలి.

                                   పిల్లలు ముక్కులోకి బలపాలను దోపుకుంటే                     23-1-11.

        బలపం బయటకు కనిపిస్తూ వుంటే ఫోర్సేప్స్ తో తీయడానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే ప్రయత్నించాలి.
సావకాశంగా కూర్చోబెట్టి నోటితో గాలి పీల్చమని చెప్పి, ఖాళీ గా ఉన్న ముక్కుతో చీదమని చెప్పాలి.

                                     శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతే ( హైపో తెర్మియా )                       24-1-11.

  వెచ్చని ప్రదేశంలోకి వెళ్ళాలి. గులక రాళ్ళను వేడి చేసి అరివేసి చంకలు, గజ్జలు, ఉదరం మొదలైన ప్రదేశాలలో మెల్లగా కాపడం పెట్టాలి.

వేడి పదార్ధాలను, తేనె, స్వీట్లు, తక్షణ శక్తినిచ్చే పదార్ధాలను ఇవ్వాలి.

B -- విటమిన్ కొరత --నివారణ

                        B -- విటమిన్ కొరత --నివారణ                                  27-6-10. 

        ఉడికించిన క్యారట్, బటాణి, బీన్స్, కాలిఫ్లవర్, వేరుశనగ పప్పు పేస్ట్, పెరుగు, ఉప్పు, అన్ని కలుపుకొని   దానిలో కొత్తిమీర కలుపుకొని తింటే  B -- విటమిన్ కొరత నివారింప బడుతుంది.

B -- విటమిన్ కొరత లక్షణాలు:--
       వేళ్ళచివర్లలో తిమ్మిర్లు పట్టడం, సడన్ గా బరువు తగ్గడం, కండలు కరగడం, పక్షవాత లక్షణాలు.

చొంగ కారడం

          పిల్లలకు, పెద్దలకు తెలియకుండానే చొంగ కారడం                                 22-12-08.

       అధికమైన  కఫ  ప్రభావం వలన ఈ సమస్య ఏర్పడుతుంది.
యోగాభ్యాసము:--  ధ్యాన ముద్ర వేసుకొని 10,12  సార్లు ఓంకారం పలకాలి.స్ఫుటముగా,గంభీరంగా గాలి పీలుస్తూ పలకాలి, తరువాత గాలి వదలాలి .గొంతును బిగించడం,వదలడం చెయ్యాలి.ఉజ్జాయి ప్రాణాయామం చెయ్యాలి.గొంతు గోడలను బిగించి ప్రాణాయామం చెయ్యాలి.కఫం నోట్లోకి వస్తే దాన్ని వుమ్మేయ్యాలి.కొద్దిసేపు మాత్రమే చెయ్యాలి,రెండు పూటలా చెయ్యాలి.
      దంతదావనానికి ముందుగాని,తరువాత గాని రాత్రి ఆహారానికి ముందుగాని,తరువాత గాని నువ్వుల నూనెను నోట్లో పోసుకొనిబాగా  పుక్కిలించాలి. నూనె నోట్లో అన్నివైపులకు తిరిగేటట్లు పుక్కిలించాలి.కొంత సేపటికి నూనె నీరుగా మారుతుంది.దీని వలన నోరు పరిశుభ్రమవుతుంది

 .నిద్రించే ముందు కొద్ది నీటిలో ఒక స్పూను తేనె వేసి కలిపి ఆ నీటితో పుక్కిలించడం కూడా మంచిది.
        శిరస్సులో 231 వ్యాధులు వస్తాయి.
        జువ్వి చెట్టు యొక్క బెరడును తెచ్చి ముక్కలుగా చేసి ఎండబెట్టాలి. కొన్ని ముక్కలను తీసుకొని ఒక గ్లాసు  నీటిలో వేసి 24 గంటలు నానబెట్టాలి.తరువాత కషాయం కాచి ఒక కప్పుకు రానివ్వాలి.దానిలో కలకండ కలుపుకొని గోరువెచ్చగా అయిన తరువాత నెమ్మదిగా కాఫీ లాగా తాగాలి.

                                                   10-1-11

          ఇది వ్యాధి కాదు,  లాలాజల గ్రంధుల వలన ఏర్పడే సమస్య . 
          
          ముఖ పక్ష వాతం వున్నవాళ్ళకు,  బుద్దిమాంద్యం  వున్నవాళ్ళకు  ఈ సమస్య ఎక్కువగా వుంటుంది.నోటి ద్వారా గాలి పీల్చడం వలన,  నోరు తెరుచుకుని  నిద్ర పోవడం వలన  కూడా ఈ సమస్య ఏర్పడుతుంది.

వెల్లుల్లి                        ----  100 gr
అజామోదం                 ----- 100 gr
వాయువిదంగాలు          -----100 gr
గజ పిప్పళ్ళు              -----   50 gr ( నిమ్మ రసంలో నానబెట్టి ఎండబెట్టి దంచి పొడి చెయ్యాలి)
దాల్చిన చెక్క పొడి        ----    50 gr
పిప్పలి కట్టే                 -----   50 gr
ఇంగువ                       ----    50 gr  (నేతిలో వేయించాలి) 
త్రిఫల చూర్ణం              -----   50 gr
ఎందుఖర్జూరం            -----   50 gr
పాతబెల్లం                   -----   తగినంత
              
            అన్నింటిని విడివిడిగా దంచి  జల్లించి చూర్నాలు తయారు చేసి  అన్నింటిని కలిపాలి. దానికి తగినంత  బెల్లం కలిపి బటాని గింజలంత మాత్రలు  తయారు చేసి నీడలో ఆరబెట్టి  బాగా ఎండిన తరువాత నిల్వచేసుకోవాలి.

            ప్రతి రోజు ఆహారానికి ముందు పూటకు రెండు మాత్రల చొప్పున ఉదయం సాయంత్రం తేనెతో గాని,   నేతితో గాని,  నీటితో గాని సేవించాలి.







పొర బోవడం

                                                                  పొర బోవడం
                                      
                                       వైద్యుడు  లేని చోట పొరబోవడం జరిగితే                                        3-1-11.

          పోరబోయిన వ్యక్తికి  శ్వాస పీల్చడంలో ఇబ్బంది పడుతూ వుంటే ముందుకు వంగి దగ్గమని చెప్పాలి. బలమంతా ఉపయోగించి దగ్గమని చెప్పాలి.  

    దీని వలన ప్రయోజనం లేకపోతే వెనక నుండి ఒడిసి పై పొట్ట మీద పట్టుకుని బొడ్డు నుండి చాతీ ఎముక వైపుకు చేతుల పిడికిళ్ళు బిగించి పైకి నొక్కాలి.   ఈ విధంగా అయిదు సార్లుచేస్తే పదార్ధం పైకి వచ్చేస్తుంది. 
         ఈ విధంగా పొరబోవడం  వలన చాలా కొద్ది నిమిషాలలోనే ప్రమాదం సంభవించవచ్చు.
         చాలా  వెంటనే నిర్ణయాన్ని  తీసుకోవాలి.





జున్ను తినడం వలన కలిగే ఫలితాలు

                                                  జున్ను తినడం వలన కలిగే ఫలితాలు

                            జున్ను తినడం సమస్య --నివారణ                                           28-12-10.

       జున్ను తిన్నపుడు కొంత మందికి వాంతులు అవుతాయి,  కాళ్ళ నొప్పులు, వస్తాయి. వీటిని నివారించడానికి   మిరియాల పొడి,  బెల్లం కలిపి   ఆహారానికి ముందు  తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు.

Oil Pulling

                                                                      Oil Pulling

                               ఆయిల్  పుల్లింగ్   ( గండూషము )                       24-12-10.

          కుర్చీలో కూర్చుని తలను వెనక్కు వాల్చి గొంతుకు, ముఖానికి  గోరువెచ్చని మంచి నువ్వుల నూనెతో మర్దన చెయ్యాలి.
 కొంత సేపటి తరువాత లావుపాటి గుడ్డను వేడి నీటిలో ముంచి  ఆ వేడిని ముఖానికి, గొంతుకు తగిలేట్లు గుడ్డను కదిలించడం, అద్దడం చెయ్యాలి.
 ఈ విధంగా చేసేటపుడు నోటి నిండుగా నూనె వుండాలి. ఇక నోటిలో వుంచుకోలేని పరిస్థితిలో ఉమ్మేయ్యాలి. తరువాత వేడి నీటితో పూర్తిగా  నూనె తొలగి పొయ్యే వరకు పుక్కిలించాలి.

          ఈ ప్రక్రియను మలమూత్ర విసర్జన చేసి పళ్ళు తోముకున్న తరువాత చెయ్యాలి.

          దీని వలన గొంతు సమస్యలు, అరుచి, పెదవులు పగలడం  మొదలైన సమస్యలు నివారింప బడతాయి.





అతిదాహం

                 అతి దాహం -- నివారణ --భావమిశ్ర గులాబి పానీయం                           15-2-09.
                          ఎండిన గులాబి రేకులు          ----- 60 gr
        గులాబి రేకులను బాగా గాలి తగిలే చోట నీడలో ఆరబెట్టాలి. అవి బాగా ఎండిన తరువాత వాటిలో రెండు లీటర్ల నీళ్ళు పొయ్యాలి.బాగా పిసికి స్టవ్ మీద పెట్టి  ఒక లీటరు కషాయం మిగిలే వరకు కాచాలి. మంటని ఆపి నిదానంగా వడకట్టాలి.ఈ కషాయంలో పావు కేజీ కలకండ కలపాలి

  మరలా  స్టవ్ మీద పెట్టి చిన్న మంటపై మరిగిస్తే పాకం మిగులుతుంది.దానిని చల్లార్చి గాజు సీసాలో భద్రపరచుకోవాలి.

      ఒక స్పూను పాకాన్ని ఒక గ్లాసు నీటికి కలుపుకొని తాగాలి.ఇది తాగి ఎంత ఎండలో తిరిగినా
ఏమి కాదు అతి దాహం నివారింపబడుతుంది.అతి ఉష్ణాన్ని తగ్గిస్తుంది.
                                                 దప్పిక -- నివారణ                          18-11-10.
          ధనియాలను నలగగొట్టి దానికి ఆరు రెట్లు నీటిని చేర్చి రాత్రంతా నానబెట్టాలి (హిమ కషాయం) ఉదయం వడకట్టి ఆ నీటిని తాగాలి. దానిలో పంచదార, తేనె కలిపి తీసుకుంటే ఎంత తీవ్రమైన దాహం కూడా నివారింపబడుతుంది.

                                               అతి దాహం                                                16-3-11.

        లక్షణాలు :-- శరీరమంతా మంటగా వుండడం, అతిదాహం, మూత్రం ఎక్కువసార్లు రావడం,
  నీరసం అనే లక్షణాలు వుంటాయి.

        కారణాలు :--   రక్తహీనత, ఆహారం సరిగా వంటబట్టకపోవడం,  అతి చెమట  మొదలగు
   కారణాల వలన వస్తుంది.
     
       సూచన ;--   నీటిశాతం ఎక్కువగా వున్న ఆహారపదార్ధాలను తినాలి.

       1.      వట్టివేర్ల  పొడి      --- ఒక టీ స్పూను
                       నీళ్ళు         --- ఒక గ్లాసు

        నీటిలో పొడి వేసి కాచి  అర గ్లాసుకు  రానిచ్చి చక్కెర  కలిపి  తాగాలి.

        2.      సుగంధపాల వేర్ల పొడి           
                          చక్కెర

         పొడి ని నీళ్ళలో వేసి  కాచి చక్కెర కలిపి తాగాలి.

         3.      వట్టివేర్ల పొడి
                  సుగంధపాల వేర్ల పొడి
                  శతావరి వేర్ల పొడి

                           అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని నిల్వ చేసుకోవాలి.
           ఒక స్పూను పొడిని ఒక గ్లాసు నీటిలో వేసి  కాచి అర గ్లాసుకు రానిచ్చి చక్కెర కలిపితాగాలి.





              







ఊపిరికుట్టు

                   ఎక్కువగా దగ్గినపుడు వచ్చే ఊపిఫికుట్టు --నివారణ                    12-2-09                                                                                                                                                   
                                 ఎక్కువగా దగ్గినపుడు ఊపిరి పట్టేస్తుంది. దగ్గు సూర్యాస్తమయం తరువాత ఎక్కువగా వుంటుంది. రక్త ప్రసరణ వేగము తగ్గి, వాయు ప్రసార వేగము పెరుగుతుంది.  దీనితో రాత్రి పూట దగ్గు ఎక్కువగా వుంటుంది.
 
          ఒక గాజు గ్లాసులో గాని, సీసాలో గాని ఆవాలనూనే పోసి దానికి ఎర్ర కాగితం చుట్టి 10,15 రోజులు ఎండలో  చెక్క పీట మీద పెట్టాలి. నేల మీద పెట్ట కూడదు.
 
         ఈ తైలాన్ని చాతీ మీద, రొమ్ము పైభాగంలో, పక్కలకు రుద్ది మర్దన చేస్తే ఊపిరికుట్టు తగ్గి పోతుంది.
 
         ఎర్ర కాగితం గడ్డ కట్టిన కఫాన్ని తొలగిస్తుంది. అప్పటికప్పుడే తగ్గుతుంది.

2.  నల్ల, లేక తెల్ల ఉలవలు వేయించి, దంచి పొడి చేసి పెట్టుకోవాలి. రోజుకు మూడు పూటలా ఒక్కొక్క స్పూను   చొప్పున ఒక్కొక్క గ్లాసు నీటిలో కలుపుకొని తాగాలి.
        


అతినిద్ర

                                            అతినిద్ర --నివారణ                             26-12-08.
 
పుట్టుకతో కఫ భార సమస్య గల వాళ్లకు మగత నిద్ర అలవాటు వుంటుంది.
 
వ్యాయామం -- ప్రాణాయామం ను చాలా చాలా వేగంగా చెయ్యాలి.హ్రస్వభస్త్రిక, దీర్ఘ భస్త్రిక, వేగ భస్త్రిక చెయ్యాలి.
 
గాలి పీల్చేటపుడు ముక్కు, శరీరం వేగంగా కదలాలి.ఉదయం, సాయంత్రం గోరు వెచ్చని నూనెతో మర్దన చెయ్యాలి
 
ఆసనాలు:-- వ్యాఘ్రాసనం :-- దండేలు, బస్కీలు తీసే విధంగా మోకాళ్ళు, చేతులు నేల మీద ఆనించి, వీపును పైకిలేపి ముందుకు,వెనుకకు కదలాలి (ఊగాలి).
 
ఆహారం ఎక్కువగా తింటూ పని లేకుండా వుంటే తిన్న ఆహారం కొవ్వుగా మారుతుంది. దీనివలన
అతినిద్ర ఏర్పడుతుంది.
 
గోరువెచ్చని నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చెయ్యాలి.వాకింగ్ చెయ్యాలి..బాగా బరువుగా వున్నవాళ్ళు నెమ్మదిగా నడవాలి.వేగంగా నడిస్తే బరువు మోకాళ్ళ మీద పడుతుంది
.
1. 20 గ్రాముల నల్ల నువ్వులను నానబెట్టి ఉడకబెట్టి గుగ్గిళ్ళు తయారు చేసుకొని సైంధవ లవణం కలుపుకొని  సాయంత్రం పూట తినాలి .దీనివలన కొవ్వు కరుగుతుంది.అదనంగా పెరగదు.20 గ్రాముల నుండి ప్రారంభించి
 
100 గ్రాముల వరకు పెంచుకుంటూ వెళ్ళాలి.
 
2. ఆముదపు చెట్టు పూలు 50 గ్రాములు తీసుకొని పాలు పోసిమెత్తగా నూరాలి. రెండు కణతలకు పట్టు వేస్తే అతి నిద్ర తగ్గుతుంది ముద్దను తలకు కూడా పట్టు లాగా వేసుకోవచ్చు.

                                         అతినిద్ర -- నివారణ 14-7-09.

నాసా జలపానం:--

 ఒక గ్లాసులో నిండుగా నీటిని పోసి ముక్కుతో పీల్చాలి. దీని వలన తలలో చేరిన కఫం నివారింప బడుతుంది. రక్తప్రసరణ బాగా జరిగి చైతన్యం కలుగుతుంది.

  గోధుమ జావ, కొర్ర జావ (ఒంట్లో వున్ననీటిని లాగేస్తుంది),

 సజ్జలు మొదలైనవి ఎక్కువగా వాడాలి. బియ్యం వాడకం తగ్గించాలి.

తీపి పదార్ధాలు బాగా తగ్గించాలి, వీలైతే అసలే తినరాదు.

శరీరాన్ని ఆవనూనె లేదా నువ్వుల నూనెతో మర్దన చెయ్యాలి.

 ఆహారంలో నూనె వాడకూడదు.

గోరువెచ్చని నీరు తాగాలి.

 రాత్రి పూట ఒక టీ స్పూను త్రిఫల చూర్ణాన్ని ఒక గ్లాసు నీటిలో కలుపుకొని తాగాలి.

 ఉదయం త్రికటుక చూర్ణం (దోరగా వేయించిన పొడి) సైంధవ లవణం కలిపి తాగాలి

. ఆముదం చెట్టు పూలు, పాలు కలిపి నూరి మెత్తగా ముద్దలాగా చేసి కణతలకు పూసి తలకు పట్టు లాగా వేయాలి.దీని వలన మంచి చురుకుదనం ఏర్పడుతుంది.

గేదె కొమ్ముల గంధం, బూడిద గుమ్మడి కాయ రసం రెండు సమాన భాగాలుగా తీసుకొని కలిపి వెన్నుపూస మీద, వీపు మీద, పొత్తికడుపు మీద రుద్దుతూ వుంటే అతి నిద్ర నివారింప బడుతుంది.

                                                            4-8-11

పచ్చకర్పూరం                     ---- పెసరగింజంత
నిమ్మ రసం                         ---- రెండు చుక్కలు
తేనె                                   ---- రెండు చుక్కలు  

         ఒక చిన్న శుభ్రమైన ప్లేటులో అన్నింటిని వేసి బాగా రంగరించాలి .
         కంటి యొక్క కింది రెప్పను కిందికి  లాగి దానికి ఈ మిశ్రమాన్ని కాటుక లాగా పెట్టుకోవాలి .దీనిథొ కళ్ళనుండి
నీళ్ళు టపటప రాలి కళ్ళు శుభ్రపడతాయి . నిద్ర తొలగిపోతుంది .

సూచన :---ఒక ప్లాన్ ప్రకారం నిద్రపోవాలి .  అర్ధశక్తి వ్యాయామం చేయాలి .