లావు తగ్గడానికి

                                       లావు తగ్గడానికి                                                   17-11-08.

                  చింత గింజలను ఒక రోజంతా నీటిలో నానబెట్టాలి.పొద్దున బాగా పిసికి పొట్టు పోయిన తరువాత కొంచం నెయ్యి వేసి వేయించి,పొడి చేసి పెట్టుకోవాలి.
                 అర స్పూను పొడిని పాలలో వేసి, చక్కర కలిపి తాగాలి.
                 40  రోజులనుండి  100 రోజులు వాడాలి .
2.  నేరుగా పట్టిన వాన నీటిని నిల్వ చేసుకోవాలి.ప్రతి రోజు ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను పసుపు కలిపి తాగితే లావు తగ్గుతారు.

                                      స్థూల కాయం-- నివారణ                                          11-6-10.
 
 కారణాలు, లక్షణాలు:-- వంశ పారంపర్యం,---  

శరీరంలోనివ్యాధులుహైపో థైరాయిడ్, విపరీతమైన  ఆహారపు  ఆలవాట్లు, వ్యాయామం
చేయక పోవడం, శరీరంలో కొవ్వు బాగా పెరిగిపోవడం, రక్త నాళాల్లో కొవ్వు పేరుకు  పోవడం, గుండె   సమస్యలు, చెమట  ఎక్కువగా వెలువడడం  దాని వలన దుర్వాసన, సరిగా నడవలేక పోవడం
 సంతాన లేమి   మొదలైనవి.    

పరిష్కార మార్గాలు:--   
                                    Body Moss Index = BMI
         బరువు / ఎత్తు                           18. 5     ఇది  Normal
18.5  తక్కువ వుంటే బలహీనమని, ఎక్కువ వుంటే అధిక బరువు అని అర్ధం
1.  తేనె                            ---25 gr 
     గోరువెచ్చని నీళ్ళు     ---- ఒక గ్లాసు
     ఉదయం, సాయంత్రం పరగడుపున తాగాలి.
2.  వాయువిడంగాల పొడిని  2,3  గ్రాముల చొప్పున ఉదయం, సాయంత్రం వేడి నీటితో తీసుకోవాలి.
3. త్రిఫల చూర్ణము
    త్రికటు చూర్ణము
          రెండింటిని సమాన భాగాలు గా తీసుకోవాలి. పూటకు ఒకటిన్నర స్పూను చొప్పున ఉదయం, సాయంత్రం    తీసుకోవాలి.
4. ప్రతి రోజు  అర స్పూను నుండి ఒక స్పూ ను వరకు కరక్కాయ పొడిని రెండు పూటలా క్రమం
తప్పకుండా    తీసుకుంటే తగ్గి పోతుంది.

                               అధిక బరువు--నివారణ                                                   18-6-10.
కారణాలు;-- హార్మోన్లలో తేడాలు,     PCDO  సమస్య,        జన్యు పరమైన కారణాలు,       అధికంగా ఆహారం తీసుకోవడం    వ్యాయామం చేయక పోవడం,    సరైన శారీరక శ్రమ లేక పోవడం, నూనెలో బాగా వేగిన పదార్ధాలను తినడం    ,మెత్తని పదార్ధాలను తినడం,    కార్బో హైడ్రేట్లు ( పిండి పదార్ధాలు) ఎక్కువగా తీసుకోవడం,     ఆహార విహారాలతో బాటు మధ్యాహ్నం నిద్ర పోవడం  మొదలైనవి.
       అతి స్థూలత కలిగిన వాళ్ళు అతి భయంకరమైన రోగులు

                       నడక చక్కని వ్యాయామం 
BMI      18. 5 నుండి 25  వరకు సాధారణ బరువు
     వ్యాయామం, ఆహార నియమాలు మొదలైన వాటిని ఎల్లప్పుడూ పాటిస్తూ వుండాలి.
     గుగ్గులు బాగా ఉపయోగ బడతాయి.

                                            స్థూల కాయము                                                          3-9-10.

           పిండి పదార్ధాలు, క్రొవ్వు పదార్ధాలు ఎక్కువగా వున్నపదార్ధాలను వాడడం వలన  ఈ సమస్య వస్తుంది

మధ్యాహ్న నిద్ర వలన బరువు పెరుగుతారు.

           వ్యాయామం బాగా చెయ్యాలి.  నడక చాలా మంచిది.

           గర్భిణి స్త్రీలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, జ్వరపీడితులు  నిద్రించవచ్చు.

                                 చిట్కా                                                    8-10-10.

         ప్రతి రోజు ఒక తిప్ప తీగ ఆకును తింటూ వుంటే లావు తగ్గి  శరీరంలోని భాగాలు,  చర్మం లాంటివి  వేలాడుతూ వుంటే ఒక సంవత్సరానికి గట్టి పడతాయి.
           
                                          లావు తగ్గడానికి                                         11-3-11.

      భోజనానికి  అరగంట ముందు వేరుశనగ పప్పులకు  చక్కెర  కలిపి తింటే భోజనం తక్కువగా
 తింటారు.
                                 త్వరగా లావు తగ్గడానికి చిట్కా                             2-4-11.

       ఆహారానికి బదులుగా కేవలం ఆపిల్ పండ్లు మాత్రమే తింటే రోజులలో లావు తగ్గుతారు.
                               





                      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి