కుష్టు --- నివారణ 20-2-10.
కృష్ణ తులసి దళాల పొడి
దోరగా వేయించిన శొంటి పొడి
సమాన భాగాలుగా తీసుకొని కలిపి నిల్వ చేసుకోవాలి.
ఆహారానికి గంట ముందు మూడు వేళ్ళకు వచ్చినంత పొడిని తీసుకొని వేడి నీటితో సేవించాలి.
తులసి, మారేడు, వేప రసాలను కలిపి పండ్లకు పూస్తుంటే 6 నెలల నుండి ఒక సంవత్సరము వరకు పూస్తుంటే నయమవుతాయి.
ఉప్పు, పులుపు, కారం పూర్తిగా విసర్జించాలి. చింత పండు పనికి రాదు. ఆవకాయ, పచ్చళ్ళు, ఆవాలు, వంకాయ, గోంగూర, మినుములు, చేపలు, గుడ్లు, మేక మొదలైనవి నిషిద్ధం.
కుష్టు వ్యాధి నివారణ 25-12-10.
ఈ వ్యాధి బ్యాక్టీరియ ద్వారా సంక్రమిస్తుంది. ఇది నెమ్మదిగా జ్వరముతోప్రారంభమవుతుంది. కాని దీనిని వెంటనే గుర్తించడం కష్టం. తీవ్రమైన తరువాత దీనిని అంటువ్యాధిగా గుర్తించవచ్చు. దీనిని ప్రారంభ దశలో నివారించ వచ్చు, తీవ్ర స్థాయిలో కష్టం.
రస మాణిక్య
పంచ తిక్త గుగ్గులు
వీటిలో దేనినైనా వాడుకోవచ్చు.
బావంచాల పొడి --- 100 gr
తిప్పతీగా పొడి ---100 gr
గలిజేరు వేరు పొడి --- 100 gr
పిప్పళ్ళ పొడి --- 100 gr
పసుపు పొడి --- 200 gr
సూచనలు :-- బావంచాలను రాత్రి పూట గోమూత్రంలో నానబెట్టాలి. ఉదయం ఎండబెట్టాలి, ఈ విధంగా గోమూత్రం పోస్తూ ఎందబెడుతూ ఇరవై రోజులు చేయాలి. పిప్పళ్ళను నిమ్మ రసంలో నానబెట్టి ఎండబెట్టాలి.
అన్ని పదార్ధాలను విడివిడిగా దంచి చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
ఒక టీ స్పూను పొడిని గోమూత్రంతో గాని లేదా గోఅర్కం తో గాని కలిపి సేవిస్తుంటే ఈ వ్యాధి ప్రాధమిక దశలోనే నివారింప బడుతుంది. తీవ్ర దశలో తీవ్రతను తగ్గించి వ్యాధి పెరగకుండా కాపాడుతుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు :-- రోగ నిరోధక శక్తి లేని వాళ్లకు ఈ వ్యాధి త్వరగా తీవ్రమవుతుంది.
ఈ వ్యాధి వున్నవాళ్ళు వేరే వాళ్ళతో కలవకూడదు. సబ్బు , టవలు వంటివి వేరుగా ఉంచుకోవడం మంచిది,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి