జ్ఞాపక శక్తి పెరగడానికి
వస్త్రగాయం పట్టిన సోంపు గింజల పొడి ------- 100 gr
పటిక బెల్లం పొడి ------- 100 gr రెండింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
పెద్దలకు ------- అర స్పూను
పిల్లలకు ------- పావు స్పూను
చిన్న పిల్లలకు ------- అర పావు స్పూను
ఆహారానికి గంట ముందుగాని, గంట తరువాత గాని వాడాలి.దీనివలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది,
మానసిక రుగ్మతలను నివారించవచ్చు. శిరస్సు కు ఆహారాన్ని యిస్తుంది.ఆహారం బాగా జీర్ణమవుతుంది.
మతి మరుపు రాకుండా నివారణ 22-3-09.
బుద్ధి మాంద్యాన్ని అరికట్టడానికి ---సరస్వతి చూర్ణం
సరస్వతి చూర్ణం ---- 50 gr
బోడతరం పొడి ---- 50 gr
శొంటి పొడి ---- 50 gr
వస పొడి ---- 50 gr
పిప్పళ్ళ పొడి ----50 gr
తేనె -----తగినంత
బోడతరం పొడి మానసిక శక్తిని ఇవ్వడంలో చాలా శ్రేష్ఠమైనది .
శొంటి ని విశ్వ భేషజము అంటారు.దీనిని దోరగా వేయించి పొడి చేయాలి.
వస కొమ్ములను 24 గంటలు నీళ్ళలో నానబెట్టాలి. తరువాత నీటినుండి కొమ్ములను తీసి పొడి గుడ్డతోతుడిచి చిన్న ముక్కలుగా నలగగొట్టి బాగా ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి.
పిప్పళ్ళను కూడా దోరగా వేయించి పొడి చేసుకోవాలి.
అన్ని చూర్ణాలను కల్వం లో వేసి తగినంత తేనె కలిపి బాగా మెత్తగా నూరాలి. దీనితో ఒక మంచి లేహ్యం తయారవుతుంది.
దీనిని బుద్ధి మాంద్యం వున్నవాళ్లకు వాడితే ఎంతో ఉపయోగపడుతుంది.
చిన్న పిల్లలకు ---- ఒక గ్రాము
పెద్ద పిల్లలకు ---- బటాణి గింజంత
పెద్దలకు ---- కుంకుడు గింజంత
దీనిని ఉదయం, సాయంత్రం పరగడుపున వాడాలి.
ఇది మెదడుకు శక్తి ని ఇస్తుంది. ఎదుటి వ్యక్తులను గుర్తించ లేని సమస్యను నివారిస్తుంది. కీచుగొంతు ,బొంగురు గొంతు మరియు ఊపిరి తిత్తుల సమస్యలు నివారింప బడతాయి
మతిమరుపు ----నివారణ 4-5-09.
ఏకాగ్రత కొరకు వ్యాయామం:-- పద్మాసనం లో కూర్చొని చిరుముద్ర వేసుకొని ఎదురుగా ప్రమిదలో ఒత్తి గాని ,కొవ్వొత్తి గాని వెలిగించి పెట్టుకొని దానినే దీక్షగా 5 నిమిషాలు చూడాలి. ఈ ఆసనంలో మోచేతులు, మెడ, వెన్నుపూస నిటారుగా వుండాలి. ఇదే విధంగా కూర్చొని ఓంకారాన్ని పలకాలి.
భ్రామరీ ప్రాణాయామం:-- ఓంకారం లోని మకారాన్ని మాత్రమే పలకాలి. దీనిని పద్మాసనం వేసుకొని రెండు చెవులలో రెండు చూపుడు వేళ్ళను పెట్టుకొని పలకాలి.
ఆహారం:-- రాత్రి పడుకునే ముందు బాదం పాలు తాగితే మంచిది. బాదం పప్పులను రాత్రి పూట నానబెట్టి ఉదయం తొక్క తీసి ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా సోంపు గింజలపొడి, సమానంగా కలకండ కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పాలల్లో కలుపుకొని తాగితే చాలా గొప్పగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
బాదం పప్పుల పొడి ---- 50 gr
సోంపు గింజల పొడి ---- 50 gr
కలకండ పొడి ---- 50 gr
చిన్న పిల్లలకు ----ఒక టీ స్పూను
పెద్దలకు, పెద్ద పిల్లలకు -- రెండు టీ స్పూన్లు
సరస్వతి చూర్ణం
సరస్వతి ఆకుల చూర్ణం ---- 100 gr
అశ్వగంధ " ---- 100 gr
అతిమధురం " ---- 100 gr
కలకండ " ---- 100 gr
అన్నింటిని కలిపి జల్లించి సీసాలో భద్రపరచు కోవాలి.
ఉదయం, సాయంత్రం పరగడుపున ఒక టీ స్పూను పొడి పాలల్లో కలుపుకొని తాగాలి. పాలు ఇష్టం లేని వాళ్ళు నీటిలో కలుపుకొని తాగవచ్చు. లేదా నాలుకతో అడ్డుకొని తిన వచ్చు.
బుద్ధి మాంద్యము --- నివారణ 9-7-09.
శిరస్సులో కఫం మితిమీరి చేరడం వలన బుద్ధి మాంద్యం ఏర్పడుతుంది. తలలో వున్న
అధికమైన కొవ్వును తీసి వెయ్యడం ద్వారా దీనిని నివారించ వచ్చును.
నువ్వుల నూనె గాని ఆవాల నూనె గాని వెచ్చ జేసి ముక్కుల్లో, చెవుల్లో రెండేసి చుక్కల చొప్పున వెయ్యాలి ఇది తప్పనిసరి.
తలను బాగా మునివేళ్ళతో గోరువెచ్చని నువ్వుల నూనె రాసి నెమ్మదిగా మర్దన చెయ్యాలి. నరాలన్నీ చురుకుదనం పొందాలంటే శరీరమంతా తైల మర్దనం చెయ్యాలి.
కపాల భాతి:-- పద్మాసనం వేసుకొని పొట్టను బయటకు లోపలి కదిలించాలి. గాలిని కుడి ముక్కు నుండి గాలిని పీల్చి ఎడమ ముక్కుతో వదలాలి. అదే విధంగా రెండవ వైపు చెయ్యాలి. ఓంకారాన్ని పలకాలి.
దోరగా వేయించి దంచిన ధనియాల పొడి --- 50 gr
" కరక్కాయల పొడి ---- 20 gr
కలకండ పొడి ---- 70 gr
అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచాలి.
పిల్లలకు --- అర టీ స్పూను
పెద్దలకు --- ఒక టీ స్పూను
పొడిని మంచినీటితో రెండు పూటలా తీసుకోవాలి.
"మానవుడికి జ్ఞానమే సౌందర్యము"
తేనె ---- ఒక టీ స్పూను
పాలమీది మీగడ --రెండు టీ స్పూన్లు
రెండింటిని కలిపి ఉదయం, సాయంత్రం సేవిస్తే మేదస్సు అద్భుతంగాపెరుగుతుంది.
దీని వలన అధికమైన కఫం తొలగి పోతుంది.
పదునైన ఆలోచనా శక్తికి 11-11-10.
బూడిద గుమ్మడి యొక్క ఒక ముక్కను గాని రసం గాని ప్రతి రోజు తీసుకుంటూ వుంటే ఆలోచనా శక్తిమెరుగవుతుంది.
మతిమరుపు --- నివారణ 26-2-11.
మతి మరుపు ఏర్పడుతుంది.
1. ఉసిరి పెచ్చుల చూర్ణం --- అర టీ స్పూను
తేనె --- ఒక టీ స్పూను
రెండింటిని కలిపి నాకాలి. ఈ విధంగా ప్రతి రోజు రెండు పూటలా తీసుకోవాలి. 40 రోజులు
వాడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
2. అతిమధురం పొడి --- ఒక గ్రాము
తేనె --- ఐదు గ్రాములు
దీనిని కూడా పై విధంగానే రోజుకు రెండు పూటలా చొప్పున 40 రోజులు వాడాలి.
3. ఆవు నెయ్యి --- ఒక టీ స్పూను
పాలు --- అర కప్పు
గోరువెచ్చని పాలలో నెయ్యి కలుపుకుని రోజుకు రెండు సార్లు తాగాలి. దీనిని 40 రోజులు
వాడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనిని ఆయుర్వేదంలో మేధో రసాయనం అంటారు
ప్రతి రోజూ చదువుతూ వుండడం , గురుముఖత నేర్చుకోవడం, ఆరు రుచుల యొక్క సమతులాహారం భుజించడం మొదలైనవి .
ఒత్తిడి తగ్గించుకోవడం, అర్ధ శక్తిగా వ్యాయామం చేయడం, ఒళ్లంతా నువ్వుల నూనె రుద్దుకోవడం
మెడిటేషన్ ( ధ్యానం -- ప్రతి రోజు కొద్ది సేపు ) చేయడం వలన జ్ఞాపక శక్తి నీ పెంచుకోవచ్చు.
జ్ఞాపక శక్తి ని పెంచడానికి , మెదడు యొక్క బలానికి 18-4-11
ప్రతిరోజు రెండు , మూడు సరస్వతి ఆకులను నూరి తేనె కలిపి తినాలి . ఇది మెదడుకు ఎంతో శక్తిని ఇస్తుంది . నరాలు
బలంగా తయారవుతాయి .
ధనియాలు ----50 gr
కరక్కాయ పెచ్చులు --- 20 gr
కలకండ --- 70 gr
అన్నింటిని చూర్ణాలు గా చేసి కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .
పిల్లలకు ---- పావు టీ స్పూను
పెద్దలకు ---- అర టీ స్పూను
మోతాదుగా ప్రతి రోజు వాడితే మెదడుకు ఎంతో శక్తి కలిపి జ్ఞాపక శక్తి పెరుగుతుంది
మతిమరుపు --- నివారణ 28-6-11.
కారణాలు :-- ఆహార, విహార కారణాలు వుంటాయి . ఆందోళన ఎక్కువ వున్నవాళ్ళకు వుంటుంది .
సరస్వతి ఆకుల చూర్ణము ---100 gr
అశ్వగంధ చూర్ణము --- 100 gr
తులసి గింజల చూర్ణము --- 100 gr ( రోగనిరోధక శక్తిని , జ్ఞాపక శక్తిని పెంచుతుంది .)
జటామాంసి చూర్ణము --- 50 gr
దాల్చిన చెక్క చూర్ణము --- 50 gr
యాలకుల గింజల చూర్ణము --- 50 gr
అన్ని చూర్ణాలను బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి .
ఒక టీ స్పూను చూర్ణాన్ని ఆవు నెయ్యి కలిపి వుండ చేసుకొని ఆహారానికి ముందు తీసుకోవాలి
12-9-11
తిప్పతీగ చూర్ణం ----50 gr
ఉత్తరేణి వేర్ల చూర్ణం ---- 50 gr
వసకొమ్ముల చూర్ణం ---- 50 gr
వాయు విడంగాల చూర్ణం ---- 50 gr
సరస్వతి ఆకు చూర్ణం ---- 50 gr
బోడసరం పూల చూర్ణం ---- 50 gr
అన్నింటిని కలిపి వస్త్ర ఘాలితము చేసి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి .
దీనిని ఉదయం పరగడుపున గాని లేదా రాత్రి ఆహారానికి ముందు గాని వాడాలి
చిన్న పిల్లలకు --- 3 చిటికెల చూర్ణము + తేనె
పెద్ద పిల్లలకు --- పావు టీ స్పూను చూర్ణము + తేనె
పెద్దలకు --- అర టీ స్పూను చూర్ణము +తేనె

విద్యార్ధుల యొక్క జ్ఞాపక శక్తి పెరగడానికి 25-11-10.
ప్రతిరోజు రెండు లేక మూడు సరస్వతి ఆకులను మెత్తగా నూరి తేనె కలిపి తింటే మెదడుకు ఎంతో శక్తి కలుగుతుంది .
ధనియాలు --- 50 gr
కరక్కాయ పెచ్చులు --- 20 gr
కలకండ --- 70 gr
అన్నింటి యొక్క చూర్ణాలను బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .
పిల్లలకు --- పావు టీ స్పూను
పెద్దలకు --- అర టీ స్పూను
ప్రతి రోజు వాడితే మెదడు కు ఎంతో శక్తి కలుగుతుంది .

ప్రతి రోజు రాత్రి నాలుగైదు బాదం పప్పులను నీటిలో నానబెట్టి ఉదయం తొక్క తీసి మెత్తగా నూరి తేనెతో గాని, నీటితో గాని సేవిస్తే విద్యార్ధులలో జ్ఞాపక శక్తి పెరుతుంది. నరాలు బలంగా తయారవుతాయి
పదునైన ఆలోచనా శక్తికి 11-11-10.
బూడిద గుమ్మడి యొక్క ఒక ముక్కను గాని రసం గాని ప్రతి రోజు తీసుకుంటూ వుంటే ఆలోచనా శక్తిమెరుగవుతుంది.
మతిమరుపు --- నివారణ 26-2-11.
కారణాలు :-- వయసు పైబడడం, పోషకాహార లోపం, దీర్ఘ కాలపు వ్యాధులు, హైపో థైరాయిడ్
ఫిట్స్, మధుమేహం, గుండెపోటు, మద్యపానం, క్రొవ్వుపదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వలన,మతి మరుపు ఏర్పడుతుంది.

.