నరాల బలహీనత

                                  నరాల బలహీనత                                             25-11-08.

వెన్నుపూసకు మర్దన, వ్యాయామం :--
          నువ్వుల నూనెతో వెన్నుపూసకు ముచ్చెన గుంట నుండి నడుము వరకు రుద్దాలి. రెండు బొటన వేళ్ళతో అంటే రెండు బొటన వేళ్ళు వెన్ను పూస మీద కలిసే విధంగా పేషంట్ ను పడుకోబెట్టి ఎదురుగా నిలబడి వెనక పైనుండి కిందకు రుద్దాలి.ముందు వెన్నుపై, తరువాత వెన్నుపాము కు రెండు వైపులా అంటే వెన్నుపాముకు అటు ఇటు నూనెతో రుద్దాలి.
          వెన్నెముక స్నానానికి తొట్టె ఉంటుంది, లేక పోతే ఒక నూలు గుడ్డను తీసుకొని చన్నీటితో తడిపి కొద్దిగా నీటిని పిండి పూర్తిగా వెన్నుపూస మీద పరచి 10 నుండి 20 నిమిషాలు ఉంచాలి.తరువాత వెన్నుపూసకు సంబంధించిన వ్యాయామం చెయ్యాలి .ఎడమ కాలును పైకెత్తి (వెనక్కి మడిచి ) కుడి చెయ్యి పైకేత్తాలి.రెండవ  వైపు కూడా అదే విధంగా చెయ్యాలి.
ఆహారం :-- వారానికి ఒకటి లేదా రెండు సార్లు లేదా (ప్రతి రోజు అయితే మరీ మంచిది) నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దన చేస్తూ నానబెట్టాలి.
       నువ్వుల నూనెను కూరల్లో తాలింపుకు,తలకు నూనెగా వాడాలి. నువ్వుల పచ్చడి,చిమ్మిరి తింటూ ఉండాలి

 కాళ్ళు పగలడం, నరాల బలహీనత తగ్గుతాయి.
                                                        
                 నరాల బలహీనత, వాత నొప్పుల నివారణకు ---బసవరాజ గుళికలు             14-4-09
వాము పొడి                  ---- 50 gr ( దోరగా వేయించి దంచి జల్లించిన పొడి)
మాల్ కంగని గింజల పొడి    --50 gr  (ఎండబెట్టి దంచినది)
గుగ్గిలం                        ----50 gr ( శుద్ధి చేసిన పొడి)
త్రిఫలాలు                  ---- 250 gr
నీళ్ళు                       ---- ఒక లీటరు
       ఒక లీటరు నీటిలో త్రిఫలాలను వేసి పావు లీటరు కషాయం మిగిలే వరకు మరిగించాలి.  ఈ కషాయాన్ని  ఒక గిన్నెలో పోసి దాని మూతికి ఒక నూలు బట్టను కట్టి ఆ బట్ట మీద గుగ్గిలం ముక్కలను వేసి స్టవ్ మీద  పెట్టాలి. ఆవిరికి గుగ్గిలం కరిగి డస్ట్ బట్ట పైన మిగులుతుంది.  మిగతాది కరిగి కషాయంలో పడుతుంది. దీనిని బాగా ఎండబెట్టి పొడి చేసి  50  గ్రాములు  తీసుకోవాలి.  దీనిలో వాము పొడి, మాల్ కంగని పొడి, గుగ్గిలం పొడి  కలిపి పేస్ట్ లాగా చేసి శనగ గింజంత మాత్రలు చేసి నీడలో ఆరబెట్టాలి.
    ప్రతి రోజు ఉదయం ఒక మాత్ర వేసుకోవాలి.

                          నరాల బలహీనత  --నివారణ                                                      11-4-11.
   
     అశ్వగంధ చూర్ణం               --- 10 gr
     శతావరి వేర్ల చూర్ణం            --- 10 gr
                  పాలు                  ---  పావు లీటరు
              మంచి నీళ్ళు            --- పావు లీటరు

     అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి నీళ్ళు ఇంకి పోయి పావు లీటరు పాలు మాత్రమే
మిగిలే వరకు కాచాలి.      దానికి తగినంత కలకండ కలపాలి.  వడపోసుకుని   తాగాలి. 

     ఇది నరాలకు ఎంతో శక్తిని ఇస్తుంది.  దేనిని ప్రతి రోజు తాగితే ఎంతో మంచిది.

      ఇది నరాల బలహీనతను నివారించడమే కాక అపస్మారకం, మూర్చ, మతిమరుపు వంటి
 రోగాలను కూడా పోగొడుతుంది.   






          


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి