జీర్ణ సంబంధ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జీర్ణ సంబంధ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

కలుషిత ఆహారం

                                కలుషిత ఆహారం తిన్నపుడు                                                  6-11-10.

              వెంటనే కాకర ఆకుతో వంట చేసుకుని తినాలి లేదా కాకరాకు రసం తాగాలి.

ప్రేవులు

                                    పేగు జారడం (హెర్నియా )                                       23-1-09.
                   ప్రేవులలో మల పదార్ధాలు ఎక్కువకాలం నిల్వ వుంటే వేడి ఉత్పత్తి అయి పేగులు పల్చబడి జారి బొడ్డు పెద్దదవుతుంది .గజ్జలలో గడ్డ లాగా జారుతుంది.
యోగాసనం :--   గోముఖాసనం లో కూర్చోవాలి.మోకాళ్ళు ఒకదాని మీద మరొకటి వేసుకొని పాదాలను వెనక్కి పెట్టాలి.కుడిచేతిని తల వెనక పెట్టుకొని, ఎడమ చేతిని వీపు వెనక్కి రానిచ్చి  రెండు చేతులు కలుపుకోవాలి
2. వెల్లకిలా పడుకొని మోకాలుకు గడ్డాన్ని ఆనించాలి. ఈ విధంగా రెండు వైపులా చెయ్యాలి.మరలా రెండు మోకాళ్ళ మధ్యలోకి గడ్డాన్ని ఆనించి చెయ్యాలి. దీనిని పవన ముక్తాసనం అంటారు.
                       వేయించిన మిరియాల పొడి      ------30 gr
                                         తేనె                  ------40 gr
        రెండింటిని బాగా గుజ్జు లాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. మూడు పూటలా ఆహారానికి గంట ముందు కుంకుడు గింజంత తీసుకొని చప్పరించాలి.దీని వలన పేగు జారడం నివారింప బడుతుంది. పేగు యదా స్థానానికి వస్తుంది.
2. కసివింద  కాండము మీది తోలు 50 గ్రాములు తెచ్చి నలగ గొట్టి అర లీటరు నీటిలో వేసి 10-15 నిమిషాలు మరిగించాలి.దించి వడపోసి ఎనిమా డబ్బాలో పోసి ఆసనం లోకి పంపితే కషాయం లోపలికి  చేరుతుంది 4,5  అడుగులు వేసిన తరువాత విరేచనం అవుతుంది . పేగులలోని పురుగులు మాడి పోతాయి పేగు యధాస్థానానికి వస్తుంది.
                         ప్రేవులలో క్యాన్సర్  లేదా ఆంత్రాశయపు  క్యాన్సర్                               2-10-10.

     ఒక గ్లాసు నీటిలో ఒక అంగుళం దాల్చిన చెక్కను వేసి కాచి సగానికి రానిచ్చి తాగితే ప్రేవులలోని  సమస్యలునివారింప బడతాయి.

             ఆహారం తోబాటు  ప్రేవులలోనికి మట్టి, వెంట్రుకలు చేరితే --నివారణ                  16-4-11.
    
      అరటి దూట ను 15 రోజులకొకసారి కూర వండుకొని తింటే కడుపులో పేరుకున్న రాళ్ళు,  వెంట్రుకలు  తొలగించబడతాయి.

                      



ఎసిడిటి ( ఆమ్ల పిత్తము)







                                      ఆమ్ల పిత్తము (Acidity)                                     19-1-09.


       సకాలంలో ఆహారం తీసుకోక పోవడం వలన చెడు వాయువులు ఉత్పన్నమవడాన్ని ఆమ్ల పిత్తము అంటారు. వ్యాధిలో త్రేన్పులు ఎక్కువగా వుంటాయి.

గజతరణి :-- పావు గ్లాసు నీటిలో పావు గ్లాసు ఉప్పు వేసుకొని తాగడాన్ని గజ తరణి అంటారు. దీని వలన వాంతి అవుతుంది.

      మెత్తని రేగడి మన్ను పట్టీని పొట్టపై వేసి లావు గుడ్డను కప్పాలి. విధంగా ఉదయం,రాత్రి ఆహారానికి    ముందు వేసుకోవాలి. పట్టీ వలన పొట్ట లోపలి చెడు వాయువులు బయటకు పోతాయి.
             శీతలీ ప్రాణాయామం 12 నుండి 16 సార్లు చేయాలి.


  " సూర్యోదయం తో జటరాగ్ని ఉదయిస్తుంది.మన పనుల వలన కాలాన్ని వ్యతిరేకించి మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాము.ఇది ఒక్క మానవ జాతి మాత్రమే చేస్తున్నది.మిగతా ప్రాణి కోటి కాలానుగుణంగా ప్రవర్తిస్తున్నాయి. కాలానుగుణంగా ఆహారం తీసుకోవడం ముఖ్యం."

     రావి చెట్ల పండ్లు,వాటిలోని గింజలు చాలా విలువైనవి.

   10 గ్రాముల రావి పండ్లలోని గింజలను నీళ్ళు పోసి ఒక గంట నానబెట్టాలి.తరువాత గింజలను వడకట్టి దానిలో అర టీ స్పూను కలకండ కలిపి ఉదయం, సాయంకాలం పరగడుపున తింటే ఆమ్ల పిత్తము అదృశ్యమై పోతుంది.

చిన్న పిల్లలకు          ----- పావు టీ స్పూను

పెద్ద పిల్లలకు           ------ అర టీ స్పూను

పెద్ద వాళ్లకు             ------ ఒక టీ స్పూను.

                        ఎసిడిటి-- (పులి త్రేన్పులు)                               30-5-09.

           లక్షణాలు;-- శరీరం వేడిగా వుంటుంది. గొంతులో నీళ్ళు ఊరుతూ వుంటాయి. త్రేన్పులు వస్తుంటాయి.

ఏలకుల గింజల పొడి          --- 10 gr
వెదురు ఉప్పు                   --- 10 gr
దాల్చిన చెక్క పొడి             --- 10 gr
ఉసిరిముక్కల పొడి             --- 10 gr
దో. వే. కరక్కాయల పొడి      --- 10 gr
ఆకు పత్రి పొడి                   --- 10 gr
చందనం పొడి                    --- 10 gr
దో. వే. ధనియాల పొడి        --- 10 gr
పటికబెల్లం పొడి                 --- 80 gr

          అన్నింటిని ఒక పాత్రలో వేసి బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.

పిల్లలకు ---- అర పావు టీ స్పూను పొడి నుండి పావు టీ స్పూను వరకు
పెద్దలకు ---- పావు టీ స్పూను పొడి నుండి అర టీ స్పూను వరకు

      దీనితో పాటు గోధుమ రవ్వను వేయించి పొడి చేసి దానికి సమానంగా చక్కెర కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. ప్రతి రోజు రోజుకు రెండు, మూడు సార్లు ఒక టీ స్పూను పొడి తిని నీళ్ళు తాగాలి.

                        ఎసిడిటి --సమస్య--- నివారణ                            2-8-09.

కిస్మిస్ పండ్లు                          --- 100 gr
అల్లం                                       --- 20 gr
పెద్ద సోంపు గింజలు                     --- 20 gr
దో. వే. మిరియాల పొడి               ---- 20 gr (వేడి శరీరం వాళ్లకు 10 గ్రాములు )
సైంధవ లవణం                          ---- 10 gr ( రుచి తగ్గితే కలుపుకోవచ్చు)

             వీటన్నింటిని చట్ని లాగా దంచి ముద్దలాగా చెయ్యాలి. ఒక ప్లేటులో పెట్టుకోవాలి.

1.కఫాన్ని తీసి వేస్తుంది.
2. సుఖ విరేచనం అయ్యేట్లు చేస్తుంది.
3.అజీర్ణాన్ని పోగొడుతుంది.
4. జతరాగ్నిని పెంపొందిస్తుంది.
5. పొట్టలో గ్యాసును నివారిస్తుంది.

దీనిని చట్నితోపాటు అన్నంలో కలుపుకొని తినవచ్చు. ఎక్కువ తింటే విరేచనం అవుతుంది.
 రుచిగా  వున్నదని ఎక్కువగా తిన కూడదు.

      ఉదరాన్ని శుభ్రం చేసుకుంటే వ్యాధే లేదు.


                                గ్యాస్ సమస్య -- నివారణ                              22-5-10.


సైంధవ లవణం    --- 20 gr ( అవసరమైతే కలుపుకోవచ్చు లేదా మానెయ్యొచ్చు)

            వాము --- 100 gr

     నిమ్మ రసం --- 100 ml


       ఒక మట్టి మూకుడులో వామును వేసి, నిమ్మ రసం పోసి రాత్రంతా నాననివ్వాలి. ఉదయం ఎండలోపెట్టాలి.

మరలా రాత్రి పూట నిమ్మ రసం పోయాలి, ఉదయం ఎండబెట్టాలి. విధంగా 3 నుండి 7 సార్లు చేయాలి.   తరువాత పూర్తిగా బాగా ఎండనిచ్చి దంచి జల్లించి సీసాలో భద్ర పరాచుకోవాలి.

  ప్రతి రోజు ఒక టీ స్పూను పొడిని నోట్లో వేసుకొని నీళ్ళు తాగాలి. దీనితో గ్యాస్ సమస్య నివారింప బడుతుంది.


                           కడుపులో గాస్ సమస్య --- నివారణ                                23-11-10.

లక్షణాలు, కారణాలు ;-- ఉదర కండరాలను పట్టేస్తుంది. కడుపులో నొప్పి ఒక చోటునుండి మరొక చోటుకు  కదుల్తుంది. మంటగా అనిపిస్తుంది. గుండె నొప్పి అనిపిస్తుంది.

 గాలిని అసంకల్పితంగా మింగడం వలన, ఆహారం నమలకుండా మింగడం వలన, చూయింగ్ గమ్
నమలడం వలన, స్ట్రా తో కూల్ డ్రింక్స్ తాగడం వలన ఎక్కువగా పిండి పదార్ధాలను తినడం వలన అది పులియడం వలన, పీచు పదార్ధాలను మోతాదుకు మించి తినడం, జిగురు పదార్ధాలు జీర్ణం కాక పోవడం వలన వస్తుంది.

 ఇంగువ
 నల్ల ఉప్పు
యాలకులు
శొంటి
       అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని విడివిడిగా చూర్నాలు చేసి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.

   అవసరమైనపుడు అర టీ స్పూను పొడిని వేడి నీటితో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తీసుకోవాలి.

2. వాము      ---- 20 gr
    సోంపు      ---- 10 gr
  కలకండ     ---- తగినంత

    అన్నింటిని కలిపి తీసుకుంటే తగ్గుతుంది.

3. జీలకర్ర          ----- రెండు భాగాలు
      శొంటి          ----- నాలుగు భాగాలు
     ఉప్పు          ----- ఒక భాగము
శంఖు భస్మం      ----- రెండు భాగాలు

     అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.

        పూటకు అర టీ స్పూను పొడి చొప్పున మూడు పూటలా వేడి నీటితో తీసుకోవాలి.


                            కడుపులో గ్యాస్ నివారణ --వాము                            1-12-10.

వాము                ------ ఒక టీ స్పూను
నీళ్ళు                 -------రెండు కప్పులు

రెండింటిని కలిపి మరిగించి సగానికి రానివ్వాలి. వెంటనే తీసుకుంటే గ్యాస్ సమస్య వెంటనే నివారింప బడుతుంది.

                                          గ్యాస్ సమస్య --నివారణ                               9-12-10.
      ఇంగువను నేతిలో వేయించడం వలన దాని యొక్క ఉగ్రత్వం తగ్గుతుంది. దీనిని రోజుకు
ఒక గ్రాము  చొప్పున రోజుకు మూడు సార్లు తీసుకుంటూ వుంటే గ్యాస్ సమస్య నివారింప బడుతుంది.

                  ఎసిడిటి, కడుపులో మంట ( ఆమ్ల పిత్తము) -- నివారణ              20-9-10.

      కారణాలు :-- విరుద్హమైన ఆహారం తీసుకోవడం, సరిగా నమలకపోవడం, చాలా త్వరత్వరగా తినడం, తినవలసిన కొన్ని పదార్ధాలను తినక పోవడం, Un Seasonal Fruits తినడం మొదలైనవి

లక్షణాలు:-- ఎక్కువగా తెపులు రావడం, నోట్లో నీళ్ళు ఊరడం, సరిగా జీర్ణం కాకపోవడం, విరేచనం సరిగా కాకపోవడం మొదలైన లక్షణాలు వ్యాధిలో వుంటాయి.

1. విరేచనం సరిగా అయ్యేట్లు చూసుకోవాలి :--

త్రిఫల చూర్ణాన్ని రాత్రి పూట గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగుతూ వుంటే ఉదయానికి విరేచనం
అవుతుంది.

2. వాంతులు వస్తున్నట్లుగా వుంటే ( వికారంగా వుంటే )

వాంతులు కానివ్వాలి, ఆపకూడదు, ఉదయాన్నే వేడి నీళ్ళు తాగి రెండు వేళ్ళు గొంతులోకి పోనిచ్చి వాంతిచేసుకోవాలి. లేదా వైద్యుని దగ్గరకు వెళ్లి వమన కర్మ చేయించుకోవాలి. వమనం అయిన తరువాత కొంతసేపు ఆగి ఆహారం తీసుకోవాలి. తరువాత క్రింది ఔషధాన్ని తీసుకోవాలి.

శొంటి పొడి           ---  ఒక గ్రాము
వాము పొడి        ---   అర గ్రాము
జిలకర పొడి         --- అర గ్రాము
ధనియాల పొడి    ----చిటికెడు
సైంధవ లవణం      ---చిటికెడు
తేనె                    ---ఒక టీ స్పూను

     అన్ని పొడులను తేనెతో కలిపి ముద్దగా చేసి చప్పరించాలి. చూర్ణాన్ని అన్నం యొక్క తొలి ముద్దలోకలుపుకొని తినవచ్చు.

ఆహారనియమాలు .:-- పీచు పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు పదార్ధాలు, విరేచనాలు కానివ్వనిపదార్ధాలను ముఖ్యంగా మైదా తినకూడదు.

          వెన్న తీసిన పలుచని, తియ్యని మజ్జిగ, మరియు జావ వంటివి తీసుకోవాలి.

                              ఎసిడిటి--చిట్కా                                                     28-9-10.

కలబంద గుజ్జును మిక్సిలో వేసి నీళ్ళలో కలుపుకొని తాగితే కడుపులో మంట తగ్గుతుంది.

                           ఎసిడిటి --నివారణ                                             17-11-10.

వెల్లుల్లి, ఉల్లి, మొలక ధాన్యాలు, డికాషన్ ఎక్కువగా వున్న కాఫీ, మద్యం, నొప్పి నివారణ మాత్రలు
,ముఖ్యంగా ఆస్ప్రిన్ మొదలైనవి ఎక్కువగా వాడడం వలన ఎసిడిటి వచ్చే అవకాశాలు ఎక్కువ.

1. చందనం పొడిని ఒక కప్పు నీటిలో వేసి మరిగించి అరకప్పుకు రానిచ్చి తాగితే ఎంతో మేలు,
2. లేత కొబ్బరి గుజ్జు లేదా కొబ్బరి నీళ్ళు మాటి మాటికి తీసుకుంటూ విమ్త్మే ఎంతో మంచిది.
3. ప్రతి పావు గంటకు ఒకసారి చల్లటి పాలు తాగుతూ వుండాలి.
4. చల్లటి నీళ్ళలో పంచదార కలుపుకుని తాగుతూ వుండాలి.

               అజీర్ణము వలన కడుపులో మంట నివారణకు చిట్కా                    14-12-10.

     దోరగా వేయించిన  జిలకర పొడికి సమానంగా చక్కర కలిపి తీసుకుంటే మంట తగ్గుతుంది.

                                     ఆహారం తిన్న తరువాత వచ్చే కడుపులో మంట, వాంతులు                    9-1-11.

ఎండుద్రాక్ష                  ---20 పండ్లు
అతిమధురం పొడి       --- అర టీ స్పూను
ఉసిరిక పొడి               --- ఒక టీ స్పూను
జీలకర్ర పొడి               --- అర టీ స్పూను
శొంటి పొడి                 --- పావు టీ స్పూను

         వంట సోడా --- చిటికెడు

  యాలకుల పొడి --- పావు టీ స్పూను ( జీర్ణ శక్తిని పెంచుతుంది )

అన్నింటిని విడివిడిగా దంచి జల్లించి పోడులన్నింటిని బాగా కలిపాలి తరువాత కల్వంలో వేసి ద్రాక్ష

    కలిపి మెత్తగా నూరి తీసి నిల్వ చేసుకోవాలి. లేదా అర టీ స్పూను త్రిఫల చూర్ణాన్ని ఒక కప్పు నీటిలో కలిపి ద్రవంలో పైన చెప్పబడిన చూర్ణాన్ని ఒక టీ స్పూను కలిపి భోజనానికి అర గంట ముందు తీసుకోవాలి. దీనిని రోజుకు రెండు సార్లు చొప్పున 40 రోజులు వాడాలి.

ఉపయోగాలు "--

      పుల్లటి త్రేన్పులు, వాంతులు, కడుపులో మంట, ఉబ్బరింపు, అజీర్ణం, చిరాకు మొదలైనవి నివారింప బడతాయి.

                  ఎసిడిటి ---- దాన్యకాది ఖ్వాద చూర్ణము                               26-1-11.

పచ్చటి ధనియాలు         --- 50 gr
   గ్రంధి తగరం                --- 50 gr
మారేడు పండు గుజ్జు        --- 50 gr
          తుంగ ముస్థలు     --- 50 gr
                        శొంటి    --- 50 gr

     అన్నింటిని విడివిడిగా చూర్నాలు చేసి కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.

      ఒక గిన్నెలో నాలుగు కప్పుల నీటిని పోసి దానిలో రెండు టీ స్పూన్ల పొడిని వేసి ఒక కప్పు

  కషాయం మిగిలే వరకు మరిగించాలి

   ఈ కప్పు కషాయాన్ని రెండు భాగాలు చేసి ఉదయం అర కప్పు, సాయంత్రం అర కప్పు

 చొప్పున తాగాలి.

                                            ఆమ్ల పిత్తాదిక చూర్ణం

అతి మధురం చూర్ణం --- 20 gr
        కరక్కాయ పొడి --- 20 gr
           పిప్పళ్ళ పొడి --- 20 gr
            శంఖ భస్మం --- 20 gr

      అన్ని చూర్నాలను బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.

      అర టీ స్పూను పొడిని ఒక కప్పు నీటిలో వేసి మరిగించి ఎసిదితి కప్పుకు రానిచ్చి తాగాలి.

                                                             29-3-11

          10   గ్రాముల సైంధవ లవణాన్ని  ఒక లీటరు నీటిలో కలిపి తాగి రెండు వెళ్ళు నోట్లో పెట్టి
   వాంతి చేసుకోవాలి.  దీనిని ఆయుర్వేద  శాస్త్రం లో  గజకర్ణి    అంటారు.

          ఈ విధంగా వారానికి ఒక సారి చొప్పున  5,   6 సార్లు చేస్తే తప్పక నివారింపబడుతుంది.

       పండుగ దినాలలో ఎక్కువగా తినడం వలన ఎసిడిటి, కడుపుబ్బరం ఏర్పడితే     2-4-11.

                 ఆహారం భుజించే సమయంలో ఉసిరిక పొడిని నీటిలో కలుపుకుని  నీటికి బదులుగా
   తాగితే ఎసిడిటి  రాదు.

                                                             గ్యాస్ --- నివారణ                           30-7-11.
హృదయ ముద్ర :---  చేతులను చాపి చూపుడు వేలును వంచాలి . దాని మీద బొటన వ్రేలును ఉంచాలి .దాని పైన
మధ్య వేలును , దాని మీద ఉంగరపు వేలును పెట్టాలి .చిటికెన వేలును నేరుగా చాపాలి . ఈ విధంగా  ఐదు నిమిషాలు  చేయడం వలన పొట్టలో నుండి గ్యాస్ తప్పకుండా బయటకు పోతుంది

చూపుడు వేలు      = అగ్ని
బొటన వేలు         = వాయువు

                                                         గ్యాస్ సమస్య --- నివారణ                     22-8-11.

కారణాలు :---  అజీర్ణం ముఖ్య కారణం .క్యాబెజి , క్యాలిఫ్లవర్ , కోడిగుడ్లు శనగపిండి కి సంబంధించిన పదార్ధాలు ,
సమయానికి ఆహారం తీసుకోక పోవడం , మసాలాలు ఎక్కువగా వాడడం , దుంప కూరలు ,  గాలిని మింగడం ,  పులిసిన
పదార్ధాలను తినడం , మానసిక ఒత్తిడి మొదలైనవి .

1. మునగాకు రసం                --- 2 టేబుల్ స్పూన్లు
    పొంగించిన ఇంగువ పొడి      --- చిటికెడు

          రెండింటిని  కలిపి కొద్దిగా వేడి చేసి భోజనం తరువాత తాగాలి . ఈ విధంగా 3, 4 రోజులు  వాడాలి .

2. పొంగించిన ఇంగువ చూర్ణం     --- రెండు  చిటికెలు
    తోలు తీసి మధ్యకు కోసిన అరటిపండు    --- సగం

         సగం అరటి పండును తీసుకొని సగానికి కోయాలి . ఒక భాగం మీద ఇంగువ పొడిని చల్లి రెండవ భాగం తో పండును
కప్పాలి .థరువాథ దానిని తినాలి .ఈ విధంగా రెండు , మూడు రోజులు చేస్తే గ్యాస్ సమస్య నివారింపబడుతుంది .

సూచన :-- తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి .