ముఖం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ముఖం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

బుగ్గలు

                        బుగ్గలు లోతుగా పోయిన వాళ్లకు  -- సమస్య --నివారణ          26-12-08.
           వేళకు సరిగా ఆహారం తినక పోవడం వలన ఈ సమస్య వస్తుంది.
 వ్యాయామం :-- బుగ్గలనునిండుగా పూరించి గాలి వదలడం అతి ప్రధానమైనది. ఉదయం, సాయంత్రం స్నానానికి ముందు 10,15 సార్లు  ఈ విధంగా చెయ్యాలి.
                                                             అశ్వగంధ తైలం
                  ఇది శరీర భాగాలను బలోపేతం చేస్తుంది.
                              అశ్వగంధ దుంపలు ------250 gr
                              ఆవు పాలు             ----- 250 ml
                              నువ్వుల నూనె       ----- 250  ml
     అశ్వగంధ దుంపలను తెచ్చి ముక్కలుగా చేసి నానబెట్టి,మెత్తగా,గుజ్జుగా నూరి, ఆవుపాలు,  నువ్వుల నూనె పోసి కలిపితే చిక్కటి ద్రవం అవుతుంది.దీనిని స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద వేడి చేస్తే పాలు యిగిరి పోయి నువ్వుల నూనె పైకి తేలుతుంది. చాలా నెమ్మదిగా అడుగంటకుండా కాచాలి.బుడగలు వచ్చి ఆగి పోవాలి.
   వేరే పాత్రలోకి గుడ్డతో వడకట్టి సీసాలో భద్రపరచుకోవాలి.రాత్రి నిద్రించే ముందు రెండు చుక్కల నూనెను బుగ్గల మీద మర్దన చెయ్యాల్లి.ఉదయం ముఖం కడుక్కోవాలి.

                                                 దవడల లోపల  పుండ్లు                                    13-9-11.
    కాచు ముక్కను ( చండ్ర చెట్టు ) తెచ్చి అర చేతిలో పెట్టుకోవాలి . దానికి కొన్ని చుక్కల  రంగరించాలి . ఈ గంధాన్ని
బుగ్గ లోపలి పుండ్లకు పూయాలి . కొంతసేపటికి వాటి నుండి నీరు కారుతుంది . దానిని వుమ్మేయ్యాలి . ఇది వగరుగా
ఉంటుంది . చేదుగా ఉండదు .

సూచన :--- వేడి చేసే పదార్ధాలను వాడకూడదు .



ప్రమేహ పిటికలు

                          ప్రమేహ పిటికలు  లేదా మెహ వ్రణాలు                                         14-12-10.

                                                 భగందరం

                     -        ఈ వ్యాధి  శరీరం అధిక బరువుతో, లావుగా వుండడం వలన వస్తుంది.

        మేడి చెట్టు పాలను గాని, బావంచాల పొడి గాని నీళ్ళు కలిపి మెత్తగా వ్రణాల పై లేపనం చెయ్యాలి. పాలు పూస్తే కూడా తగ్గుతుంది.  చెక్క కషాయం తాగితే కూడా తగ్గుతుంది.

పెదవులు

                                    పెదవుల సమస్యలు --నివారణ                            19-12-08.
 
            పాలు,వెన్న, నెయ్యి ఎక్కువగా తీసుకుంటూ వుంటే పెదవులు మృదువుగా వుంటాయి.
 
యోగాసనం :--  రెండు పెదవులను  "మ"  పలికినట్లు శబ్దం రాకుండా ఆనించాలి.

(2). నాలుకతో రెండు పెదవులను తడపాలి

.(3). రెండు పెదవులను కలిపి చిన్న పిల్లలు చేసినట్లు "బుర్"  మని శబ్దం వచ్చేట్లు పలకాలి
 
(4). ఉదయం, సాయంత్రం నువ్వుల నూనెతో గాని,వెన్నతో గాని ,నెయ్యితో గాని పెదవుల మీద మర్దన చెయ్యాలి
 
         దంత ధావన చూర్ణాలను వాడాలి.
 
                        పెదవులపై చర్మం వూడకుండా , పుండ్లు పడకుండా ఉండాలంటే
 
        జీర్ణ శక్తి సరిగా లేకపోయినపుడు, పైత్య రసం ఎక్కువైనపుడు వ్యాధులు వస్తాయి.
 
                                             జాజికాయల పొడి        ----- 50 gr
                                 కొమ్ములు దంచిన పసుపు        ----- 50 gr
                                                          పాలు          ----- తగినన్ని
 
        గిన్నెలో పాలు పోసి గుడ్డ కట్టి గుడ్డ మీద జాజి కాయ ముక్కలను పెట్టాలి. పాలను వేడి చెయ్యడం వలన పాల ఆవిరి జాజి కాయ ముక్కలకు తగులుతుంది. ఆ ముక్కలను ఆరబెట్టి పొడి చెయ్యాలి.మంచి బలమైన పసుపు కొమ్ములను దంచి పొడి చెయ్యాలి.రెండు విడివిడిగా వస్త్రగాయం పట్టి రెండు కలపాలి. ఈ పొడిని రెండు  చిటికెలు తీసుకొని తగినంత నెయ్యి కలిపి రంగరించి పెదవులపై లేపనం చెయ్యాలి.మృదువుగా మర్దన చెయ్యాలి
 
ఇది నోట్లోకి వెళ్ళినా ఏమి కాదు.రాత్రి పూట ఒక్క సారి మాత్రమే పూయాలి.నల్లగా వున్నపెదవుల నలుపు  పోతుంది .పెదవులు ఎంతో మృదువుగా తయారవుతాయి.
 
                              అధర సౌందర్య లేపనం                                                  24-1-09.
 
                       మెత్తని జాజికాయల పొడి          ---------10 gr
                       పసుపు పొడి                           ---------10 gr
                       మంచి నెయ్యి                         ---------10 gr
                       తేనె మైనం                             -------- 20 gr
 
       ఒక గిన్నెలో తేనేమైనం,నెయ్యి వేసి చిన్న మంట మీద మాడకుండా కాచి వదపోయ్యాలి. దానిలో జాజికాయ   పొడి,పసుపు పొడి కలపాలి.  వెడల్పు మూత వున్న సీసాలో పోయాలి  .కొంతసేపటికి అది గడ్డ కడుతుంది.
ఎక్కువ గడ్డ కడితే కొద్దిగా నెయ్యి కలుపుకోవచ్చు.
 
      దీనిని పెదవులపై లేపనం చేస్తే పెదవులు అందంగా తయారవుతాయి.పెదవుల చివర వచ్చే పగుళ్ళు కూడా నివారింప బడతాయి.
 
                                     పెదవుల పగుళ్ళు --  నివారణ                         30-11-10.
 
   వాక్క చెట్టు వెళ్ళాను మరిగించి చిక్కని కషాయాన్ని పెదవులపై ప్రయోగిస్తే పగుళ్ళు తగ్గుతాయి
.
                                                             3-12-10
 
              వాతావరణం లోని మార్పుల వలన ఈ సమస్య వస్తుంది.
 
              పెదవులను నాలుకతో తడప కూడదు.
 
              మన శరీరంలో తయారైన నూనె చర్మం మీద నుండి తీసి దానిని పెదవుల మీద రాయాలి.
 
              ఎక్కువగా నీటిని తాగుతూ వుండాలి.
 
చండ్ర చెట్టు పట్ట                 --- 10 gr
గోరింట ఆకు                      --- 10 gr
 
     రెండింటిని కలిపి నూరి పెదవులపై పట్టించాలి.
 
     తేనె, ఆవు నెయ్యి  లను సమాన భాగాలుగా తీసుకొని కలిపి పూయాలి.
 
మేడి చెట్టి పాలు                    --- పావు టీ స్పూను
తేనె                                    --- పావు టీ స్పూను
 
     కలిపి ప్రతి రోజు రాత్రి పూట పడుకునే ముందు పూస్తుంటే తగ్గుతాయి.

                           పెదవులపై  పుండ్లు ---ఫీవర్ సోర్                                    22-9-10.

     పెదవులపై సన్న గుల్లలు, పుండ్లు ఏర్పడడాన్ని ఫీవర్ సోర్ అంటారు. ఇది అంటువ్యాధి.  వారి లాలాజలంఇతరులకు తగిలితే  చాలా సులభంగా  వ్యాపిస్తుంది.  కొంత కాలానికి తగ్గి  పోక్కుకట్టి
రాలుతుంది. కాని శరీరంపై వైరస్ మిగిలే వుంటుంది. పై పెదవి మీద, పెదవుల ;మూలలలో
 ఎక్కువగా వుంటుంది.  మంటగా వుంటుంది.

     సన్నని ఆవాల పరిమాణంలో  సన్నని గుల్లలు ఏర్పడి వాటిలో చిక్కని ద్రవం వుంటుంది.

కానుగ నూనె
వేప నూనె

     రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి. ఈ తైలాన్ని
 మూడు పూటలా పెదవి పై పూయాలి. తేలికగా, ఒత్తిడి లేకుండా పూయాలి.

మూడు, నాలుగు రోజులలో తగ్గి పోతుంది.

                                            పెదవుల సౌందర్యానికి                                     2-6-11.

      నిర్జలీయత వలన పెదవులు ఎండిపోయినట్లు వుంటాయి. పెదవులకు చెమట పట్టదు
పెదవులు నల్లగా ఉండడానికి అతి ముఖ్య కారణం వంశపారంపర్యం . 

తేనేమైనం              --- ఒక టేబుల్ స్పూను
బాదం నూనె           --- ఒక టేబుల్ స్పూను
తేనె                       --- ఒక టీ స్పూను
గులాబి జలం         --- కొన్ని చుక్కలు

       తేనేమైనాన్ని చిన్న గిన్నెలో వేసి మరిగే నీరున్న పెద్ద గిన్నెలో ఉంచాలి.  కరిగిన మైనాన్ని
వడకట్టాలి .  అది ద్రవ రూపంలో ఉండగానే మిగిలిన పదార్ధాలను కలపాలి. బాగా కలిపి ద్రవ రూపం లో వుండగాని ఒక చిన్న డబ్బాలో పోసి నిల్వ చేసుకోవాలి .

      దీనిని చూపుడు వేలుతో తీసుకొని పెదవులపై పూయాలి. ఎండలోకి వెళ్ళే ముందు పూసుకొని
వెళ్ళాలి. ఇది సూర్యరశ్మి లోని అతినీలలోహిత కిరణాల నుండి రక్షిస్తుంది.

     పెదవులు పగలకుండా నీళ్ళు ఎక్కువగా తాగుతూ వుండాలి.

     ముక్కు మీద వున్న తైలాన్ని వేలితో తుడిచి పెదవులపై పూస్తూ వుంటే పెదవులు ఆరిపోవు.

                                పెదవులపై నల్లదనాన్ని పోగొట్టడానికి  కాంతి వర్ధన తైలం                     29-6-11.

కారణాలు :--- రక్తహీనత , మందులు ఎక్కువగా వాడడం , సిగేరెట్లు ఎక్కువగా తాగే వారిలో తగినంత ఆక్సిజన్ అందక
పోవడం , ఒత్తిడి , కాలేయ సమస్యలు , ప్రత్యక్ష  మరియు పరోక్ష ధూమపాణం ,  సూర్య కిరణాల తాకిడి , సౌందర్య సాధనాలు
గిట్టకపోవడం , మొదలైనవి .

తాజా నిమ్మ పండ్ల రసం                --- ఒక టీ స్పూను
                         తేనె                 --- ఒక టీ స్పూను

     రెండింటిని కలిపి పరోక్షంగా వేడి చేయాలి . పెద్ద గిన్నెలో నీళ్ళు వేడి చేసి దానిలో మిశ్రమం వున్న చిన్న గిన్నెను పెట్టి
వేడి చేయాలి .  దీనిని చల్లార్చి ఫ్రిజ్ లో పెట్టుకొని కూడా వాడుకోవచ్చు .
వాడవలసిన విధానం :--  కళ్ళ చుట్టు వున్న , పెదవుల చుట్టూ వున్న , ముఖం మీద వున్న,  పెదవుల మీద వున్న మూతి చుట్టూ వున్న నల్లని మచ్చల పై ఈ మిశ్రమాన్ని  ఉపయోగించాలి .  దూది ఉండను ఈ మిశ్రమం లో ముంచిమచ్చల   మీద పూయాలి .  దీనిని రాత్రి పడుకునే ముందు మచ్చల పై పూసి ఉదయం కడిగేయాలి .  5, 6 రోజులలోనే ఫలితం కనబడుతుంది .   వంశపారంపర్యంగా వచ్చే మచ్చలు కూడా నివారింపబడతాయి . బుగ్గల మీద దీనిని మర్దన చేస్తూ వుంటే
మంచి మెరుపు వస్తుంది .
                                             పెదవుల సమస్య నివారణకు లేపనం                            3-7-11.

     దీని వలన పెదవుల లావు ,తడారిపోవడం , పుండ్లు , గాయాలు , పగుళ్ళు  నివారింపబడతాయి .
     చలిగాలుల వలన పెదవులు పగులుతాయి ,  ఈదురు గాలుల వలన చిట్లుతాయి .

తేనె                                     ----10 gr
గ్లిజరీన్                                ---- 10 gr
యశద భస్మం                       ---- 10 gr
వేలిగారం                              ---- 10 gr
కర్పూరం                              ----   1 gr

    అన్ని పదార్ధాలను ఒక్కొక్కటిగా వేసి  బాగా కలిపితే లేపనం తయారవుతుంది . దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి  .
    రాత్రి పడుకునే ముందు వేలితే  తీసుకొని పెదవుల మీద సున్నితంగా పూయాలి .  ఉదయం కడగాలి   ఈ విధంగా
నెల రోజులు చేస్తే పెదవులు ఎంతో ఆరోగ్యవంతంగా , మృదువు గా తయారవుతాయి .

సూచనలు ;-- నీళ్ళు  బాగా తాగాలి . B - complex  వున్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి  టీ లు , కాఫీ లు
తగ్గించాలి  పాలు తాగాలి . చలిగాలి ,  ఈదురు గాలులకు గురి కాకూడదు

                                                          పెదవుల పగుళ్ళు --- నివారణ                    30-8-11.
1. పరోక్ష ధూమపానం వలన ఏర్పడితే :---
    చండ్ర చెక్క బెరడు చూర్ణం              ---- చిటికెడు
                   తేనె                            ---- అర టీ స్పూను

     రెండింటిని కలిపి రాత్రి పడుకునే ముందు పెదవులకు పోసి ఉదయం కడగాలి .

2. గోరింటాకు పొడి                           ---- పావు టీ స్పూను పొడి
            వెన్న                                 ---- తగినంత
    
     రెండింటిని కలిపి రాత్రి పడుకునే ముందు పెదవులకు పోసి ఉదయం కడగాలి .

3. గింజలు పట్టని లేత తుమ్మ కాయలు ___ 100 gr
                       తేనె మైనం                ----- తగినంత

     తుమ్మ కాయలను ముక్కలుగా తుంచి దానికి 16 రెట్లు నీళ్ళు కలిపి మెత్తగా పేస్ట్ లాగా ఉడికించాలి . తరువాత
దానిని వడకట్టాలి . దీనికి కరిగించిన తేనేమైనం కలపాలి . ఆయింట్మెంట్ తయారవుతుంది .

      దీనిని పెదవులకు పూయడం వలన త్వరగా పగుళ్ళు తగ్గుతుంది . చల్లగా వుంటుంది .

సూచనలు :--- సాత్వికాహారం భుజించాలి . నీళ్ళు బాగా తాగాలి . బాగా నిద్రించాలి .
                                                      

  



 
         


.
  

ముఖం మీది మచ్చలు --నివారణ

                           నల్ల మచ్చల నివారణకు                                             19-1-09.
 
                     తేనె మైనం           ----  100 gr
                     బావంచాల పొడి  -----    20 gr
                     నల్ల జిలకర పొడి  -----   20 gr
                     కస్తూరి పసుపు     -----  20 gr
 
          తేనె మైనాన్ని సన్న మంట మీద కరిగించి వడపోసి మరలా స్టవ్ మీద పెట్టి దానిలో పొడులను వేసి బాగా కలపాలి.  చల్లారితే ఆయింట్మెంట్ తయారవుతుంది.
 
         దీనితో మచ్చల పై రాత్రి పూట లోపలి ఇంకే విధంగా మర్దన చెయ్యాలి. కొద్ది రోజులు ఆవిధంగా చేస్తే మచ్చలు మాయమవుతాయి.
                                 ముఖం మీద మచ్చలు -- నివారణ                       18-2-08.
 
         నాటు గేదెల మీగడ లేని పెరుగు ఒక టీ స్పూను తీసుకొని దానిలో రెండు చుక్కల తేనె మాత్రమే వేసి బాగా కలపాలి.
     కళ్ళ చుట్టూ వున్న నల్లని వలయాల మీద, ;మెడ మీది నలుపు మీద, ముఖం మీది నల్లని మచ్చల మీద పూయాలి. ఈ విధంగా 15,20 రోజులు చేస్తే ముఖంలో నల్లని మచ్చలు తొలగింపబడి ముఖానికి,చర్మానికి మంచి   నిగారింపు,కాంతి వస్తాయి.
                             ముఖం మీది మచ్చలను తొలగించాడానికి                         23-2-09.

      టమాటో,కారెట్, బీట్ రూట్ లను మిక్సి లో వేసి రసం పిండిన తరువాత మిగిలిన గుజ్జును మళ్లీ మిక్సి లో వేసి దానికి కొద్దిగా పాల మీది మీగడ కలిపి తిప్పాలి . ఈ పేస్టు ను ముఖానికి దట్టంగా పట్టించాలి.ఇది ముఖానికి అతుక్కు పోతుంది, కారదు .దీని వలన ముఖం మీది మచ్చలు,  ముడతలు,నల్లని వలయాలు, మంగు మచ్చలు తొలగింప బడతాయి.

          పడుకుని వేరే వాళ్ళతో ముఖానికి లేపనం చేయించుకోవచ్చు.     దీనిని పెట్టుకున్న
తరువాత బల్బుకు నీలి రంగు కాగితాన్ని చుట్టి ఆ కాంతి ముఖం మీద పడేట్లుగా చేసుకోవాలి. 15 నిమిషాలు  ఉంచి కడగాలి.

      ప్రతి రోజు ఈవిదంగా నెల రోజులు చేస్తే ముఖంలో ఎంతో మార్పువస్తుంది.

          ముఖం మీద గులాబి వర్ణంలో వున్న మచ్చలు -- Rojeshia --నివారణ             30-11-10.
 
      ఇది మధ్య వయస్కులైన మహిళల్లోఎక్కువగా వచ్చే సమస్య. '
కారణాలు;--

   ఎండకుగురి కావడం వలన, ఉక్క పోత వాతావరణం లో గడపడం వలన, ఎక్కువ వేడిగా వున్న 
నీటితో స్నానం చెయ్యడం వలన, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన, ఎక్కువగా వ్యాయామం చేయడం వలన  ఈ సమస్య ఏర్పడుతుంది.
 
లక్షణాలు:--  
 
     ముఖం మీద ఎర్రని కమిలిన పోక్కుల్లాంటి  మచ్చలు నుదుటి నుండి గడ్డం వరకు వుంటాయి. రక్త నాళాలు ముఖం మీద పరుచుకున్నట్లు గా వుంటాయి. తరచుగా కంటి మీద కూడా వస్తాయి.
 
     ఆల్కహాల్  వాడే వాళ్ళు వెంటనే మానెయ్యాలి.  కాఫీ, టీ వంటి పానీయాలు మానెయ్యాలి.
 
1. కలబంద గుజ్జును చేతితో పిండితే రసం వస్తుంది. దీనిని మచ్చల పై రుద్దాలి.
2. అతిమధురం చూర్ణాన్ని నీటితో కలిపి పూయాలి.
3. గ్రీన్ టీ డికాషన్ ను మచ్చలపై పూయాలి.

                         తిలకాలకము ---చికిత్స                               16-9-10.

     ముఖముపై నల్లగా, నువ్వుల ఆకారంలో ఏర్పడే మచ్చలను తిలకాలకము అంటారు.

     ఎండలో తిరగడం వలన  చంర్మంలోని మెలనిన్ పై ఆ ప్రభావం పడి ఈ వ్యాధి వస్తుంది.  అంతే కాక వంశపారంపర్యంగా కూడా వస్తుంది.   దీని వలన పలుచని, గుండ్రని మచ్చలు ముఖంపై ఏర్పడతాయి.  ఇవి ముఖం  మీద వెదజల్లబడినట్లుగా వుంటాయి.

1. కుంకుమాది తైలంతో ప్రతి రోజు మర్దన చెయ్యాలి.  పావు గంట తరువాత సున్నిపిండితో ముఖాన్ని కడగాలి,

    రెండు, మూడు చుక్కల తైలాన్ని ముక్కులో వేసుకోవాలి.

2. మంజిష్టాది తైలం
3. కిమ్షుక తైలం  ( మోదుగ పూల తైలం)
4.  గంధక రసాయన చూర్ణాన్ని తేనె, నెయ్యి కలిపి కడుపులోకి వాడాలి.

                               ముఖం మీద లేత రంగు మచ్చలు ---నివారణ               11-6-11.      

కారణాలు :---  అతినీలలోహిత కిరణాల ప్రభావం వలన, కాలేయ వ్యాధుల వలన ( లివర్ స్పాట్స్)
గర్భ ధారణ సమయం లో హార్మోన్ల తేడా వలన, ఈస్త్రోజేన్ వలన, టెట్రాసైక్లిన్ ట్యాబ్లెట్ల వలన,
మచ్చలు వచ్చే అవకాశాలు వున్నాయి.

                                                        తులసి లేపనం

బావంచాల గింజల చూర్ణం                   --- ఒక టీ స్పూను
ఎండిన తులసి ఆకుల చూర్ణం              --- ఒక టీ స్పూను
తుంగ ముస్తల చూర్ణం                        ---- ఒక టీ స్పూను
అడవి బాదం నూనె                            ---- రెండు చుక్కలు
కలబంద జెల్                                    ---- తగినంత

       ఒక గిన్నెలో అన్ని చూర్ణాలను వేసి బాగా కలపాలి. దీనికి బాదం నూనె కలపాలి.  తరువాత
తగినంత కలబంద జెల్ ను కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి.  దీనిని నిల్వ చేసుకోవచ్చు.
దీనిని రోజువారీగా వాడాలి.

       దీనిని దూది వుండతో తీసుకొని ముఖం మీది మచ్చల మీద, చర్మం మీద ప్రయోగించాలి.
పది నిమిషాలు వుంచి గోరువెచ్చని నీటితో కడగాలి.

సూచనలు :-- సన్  స్క్రీన్ లోషన్ వాడాలి.  స్నానానికి ముందు మజ్జిగ తో ముఖం కడగాలి.
నిమ్మ రసంతో గాని, వెనిగర్ తో గాని కడగవచ్చు.

                                                        26-7-11.
కలబంద
పచ్చిపసుపు రసం
        రెండింటిని రంగరించి ముఖా పోయాలి 
        వేపాకు చిగుళ్ళు , బెల్లం సమానంగా కలిపి శనగ గింజలంత మాత్రలు చేసుకొని కడుపులోకి వాడాలి . దీనివలన
శరీరంలోని మలినాలు తొలగింపబడతాయి . రక్త శుద్ధి జరుగుతుంది







                                 

                                        





మొటిమలు --నివారణ

                                              మొటిమల సమస్య
 
                           ధనియాలు            -----------100 gr
                           వసకోమ్ములు        ----------- 100 gr
                           సుగంధ పాల వేళ్ళు  ---------  100 gr
 
            అన్నింటిని విడివిడిగా పొడిచేసి సీసాలో నిల్వ చేసుకోవాలి.ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు కొద్దిగా  పొడిని  పాలతో గాని లేదా నీటితో గాని కలిపి ముఖానికి పట్టించాలి   ఉదయం ముఖము కడుక్కోవాలి. మొటిమలు తగ్గిన తర్తువాత కూడా కొద్ది కాలం ఈ పొడిని వాడితే మచ్చలు కూడా తగ్గి పోతాయి.
 
                                                     మొటిమల నివారణ
 
1. వేప పుల్ల రసం  2,3 చుక్కలు మొటిమలపై రోజు రాస్తూ వుంటే  15 రోజులలో తగ్గి పోతాయి.
 
2. నిమ్మ రసం 10 చుక్కలు తీసుకొని,దానిలో 10 చుక్కలు రోజ్ వాటర్ ను కలిపి నిద్ర పొయ్యే ముందు లోపలి యింకి పోయేట్లు మొటిమలపై రుద్దాలి.నెమ్మదిగా మర్దన చెయ్యాలి.ఉదయం గోరు వెచ్చని నీటితో కడగాలి.
 
3. వేప చెట్టు బెరడు చారెడు ముక్కను తీసుకొని ఎండబెట్టాలి.ఎండిన తరువాత తెల్లగా వున్నా వైపు గంధం  తియ్యాలి.దానిని పూస్తే ఎంత లావు మొటిమలైనా పోతాయి.
 
             బుగ్గలను గాలితో బాగా పూరించడం,వదలడం వలన ముఖ వర్చస్సు పెరుగుతుంది.
 
             కొవ్వు పదార్ధాలు,నెయ్యి,మీగడ,నూనె,తీపి పదార్ధాలు తింటే మొటిమలు వస్తాయని అనుకోవడం అర్ధ రహితం.
 
            కొవ్వు కరిగేట్లు శారీరక శ్రమ, వ్యాయామం చెయ్యాలి.


4.                                                    2-12-08.

    చలికాలంలో తెల్లవారు ఝామున లేచి ఒక తెల్లని శుభ్రమైన నూలు గుడ్డను తీసుకొని
ఆకులపై పడిన మంచు బిందువులను ఆగుడ్డతో అద్ది తెచ్చుకోవాలి.ఆ గుడ్డ తో ముఖం మీద నెమ్మదిగా అద్దాలి

 దీనితో ముఖం ఎంతో సౌందర్య వంతమవుతుంది. అర గంట ఆగి స్నానం చెయ్యాలి. మొటిమలు కూడా నివారింప బడతాయి.

5.                                                   30-1-09.

                             జాజికాయ
                             చందనం
 
        రెండింటిని రాయి మీద చాది కలిపి ఆగందాన్ని రాత్రి పూట మొటిమలపై పూసి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడగాలి.
 
6.                       మంజిష్ఠ  పొడి        ----- ఒక టీ స్పూను
                               తేనె               ----- ఒక టీ స్పూను
 
  రెండింటిని కలిపి మొటిమల మీద పెడితే కొద్ది రోజులకు మొటిమలు మాయమవుతాయి.
 
జాగ్రత్తలు  :_-  మొటిమల నివారణకు మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. బహిష్టు సక్రమంగా వచ్చేట్లు చూసుకోవాలి.
 
    ఒంటి మీద మచ్చలు , కంటికింద నలుపు వస్తే రక్తం చెడిపోయినట్లు లెక్క.

                                     మొటిమల నివారణకు                                         6-2-09.
 
       మానసిక రుగ్మతలు, అవలక్షణాల వలన సౌందర్యం చెడి పోతుంది.
 
       రేగు కాయలలోని గింజలను సేకరించి డబ్బాలో నిల్వ చేసుకోవాలి.అవసరమైనపుడు వాటిని పగులగొట్టి  పప్పును తీసి మెత్తగా చేసి దానికి కొద్దిగా వెన్న, కొద్దిగా తేనె కలిపి మొటిమల మీద, మచ్చల మీద పెట్టాలి.
 
అర గంట తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ విధంగా చెయ్యడం వలన మొటిమల వలన ఏర్పడిన మచ్చలు, నల్ల మచ్చలు చాల త్వరగా, సులభంగా నివారింప బడతాయి.

                           మొటిమల సమస్య --నివారణ                                             21-4-09.

                             తులసి ఆకులు        ---- 10
                              కర్పూరం               ---- ఒక బిళ్ళ

     రెండింటిని కల్వం లోవేసి కొద్ది చుక్కల నీటిని కలిపి మెత్తగా నూరి రాత్రి పూట మొటిమల మీద దట్టంగా  పట్టించాలి. ఉదయం నిద్ర లేచిన తరువాత గోరువెచ్చని నీటి తో కడగాలి.

              మలబద్ధకం వలన ఏర్పడే మొటిమలు --- నివారణ                                        7-7-09.

దోరగా వేయించిన ధనియాల పొడి    
సుగంధ పాల వేర్ల పై బెరడు పొడి
వస కొమ్ముల పొడి

       వస కొమ్ములను 24 గంటలు నానబెట్టి కడిగి ఎండబెట్టి దంచి పొడి చెయ్యాలి.

      అన్నింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి.  కలిపి సీసాలో భద్ర పరచాలి.

      ఒక టీ స్పూను పొడిలో తగినన్ని పాలు గాని, నీళ్ళు గాని వేసి మెత్తగా నూరి మొటిమలపై పూస్తే రాయిలాగా  అయిన మొటిమలు కూడా నివారింప బడతాయి.  రాత్రి పట్టించి ఉదయం కడగాలి.

                             మొటిమలు --- నివారణ                                                             27-7-09.

     ముఖం మీద నెమ్మదిగా మర్దన చెయ్యాలి. బుగ్గలను పూరించడం, వదలడం చెయ్యాలి.

పుట్టమట్టి పట్టి:-- పుట్టమట్టి తెచ్చి ఎండబెట్టి, దంచి, జల్లించి సీసాలో భద్రపరచుకోవాలి.

     తగినంత మట్టిని తీసుకొని నీళ్ళు కలిపి ముఖానికి పట్టించాలి. (Mud Pad) . 15 లేక 20 నిమిషాల తరువాత కడిగెయ్యాలి.

విపరీత కరణి :-- ఈ ఆసనాన్ని తప్పక వెయ్యాలి. తలను వీపు వరకు ఆనించి నడుము వద్ద చేతులతో శరీరాన్నినడుము నుండి  పైకెత్తాలి.

      మలబద్ధకం లేకుండా జాగ్రత్త వహించాలి. భోంచేసిన రెండు గంటల తరువాత పండ్లు తినాలి.  లేక పోతే  ఉదయం లేవగానే ఒక వేపాకు తింటే సుఖ విరేచనమవుతుంది.

                     మొటిమల నివారణ                                                                  13-2-10.

తులసి ఆకులు               --- పది
కర్పూరం బిళ్ళ               --- ఒకటి
కస్తూరి పసుపు                --- పావు టీ స్పూను

     అన్నింటిని కలిపి గుజ్జుగా నూరి మొటిమల మీద పూస్తే మొటిమలు, వాటి వలన వచ్చే ఎరుపు, తెలుపు, నలుపు మచ్చలు కూడా నివారింప బడతాయి.

                                   మొటిమలు-- నివారణ                                                 10-6-10.

       హార్మోన్లలో తేడాల వలన, ఆహారంలో క్రొవ్వు పదార్ధాలు ఎక్కువగా చేరడం వలన మొటిమలు వస్తాయి.
       తరచుగా ముఖం కడుగుతూ వుండాలి.
 
చందనం
వస
మిరియాలు
లొద్దుగ  చెక్క
 
      అన్నింటిని యొక్క చూర్నాలను సమానంగా తీసుకొని కలిపి నిల్వ చేసుకోవాలి.
 
      అవసరమైనంత పొడిని తీసుకొని పాలల్లో గాని, రోజ్ వాటర్ లో గాని కలిపి దూదితో తీసుకొని మొతిమలపై పూయాలి.  అరగంట వుండనిచి తరువాత ముఖం కడుక్కోవాలి.
 
2. జాజికాయ  పొడి
    మిరియాల పొడి
 
    రెండింటిని కలిపి మొటిమల మీద పూయాలి. కొంత సేపు వుంచి కడిగితే మచ్చలు కూడా పోతాయి.
 
3. పుదీనా ఆకులు             --- 5
    తులసి ఆకులు             ----5
    నిమ్మ రసం                 ---- 2, 3  చుక్కలు
 
    అన్నింటిని కలిపి నూరి మొటిమల మీద పెడితే మచ్చలు కూడా కనిపించకుండా పోతాయి.  ఇది పులిపిర్లకు   కూడా బాగా పని చేస్తుంది.
 
                                                    2-10-10

     దాల్చిన చెక్క పొడిలో తగినంత నిమ్మ రసం కలిపి పేస్ట్ లాగా చేసి మొటిమలకు పట్టిస్తే  జిడ్డు తగ్గి  మొటిమలు నివారింప బడతాయి.
 
                                                     14-10-10

పసుపు
తులసి
నిమ్మ రసం

      పసుపు పొడిని, తులసి ఆకులను తగినంత నిమ్మ రసం కలిపి నూరి  లేపనం గా చేసి మొతిమలపై, మచ్చలపై పెడితే  తగ్గిపోతాయి.

     దీనిని కడుపులోకి కూడా వాడాలి.

                                                      21-12-10

     హార్మోనలలో మార్పుల వలన, మానసిక  ఒత్తిడి వలన, రక్త ప్రసరణ పెరిగి రక్తం లోని తైలము బయటకు వచ్చి గట్టి పడి  సిస్ట్ లాగా ఏర్పడుతుంది వీటినే మొటిమలు అంటారు.

    తలుపులన్నీ మూసేసి నిద్రించడం వలన, ఏదైనా గాలి లేని ప్రదేశంలో ఎక్కువసేపు,  లేదా ఎక్కువ కాలం వుండడం వలన ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ.

బియ్యం                            --- పావుకిలో
జిలకర                             --- 100 gr
వేలిగారం                          ---   10 gr
ఉలవలు                          ---  100 gr

    వేలిగారం తప్ప మిగిలిన పదార్ధాలను విడివిడిగా దోరగా వేయించి దంచి పొడి చేసి కలుపుకోవాలి.  వేలిగారాన్నిపొంగించి పొడి చేసి కలపాలి.

    అవసరమైనంత పొడిని తీసుకుని నీరు కలిపి ముఖానికి పూయాలి.  రాత్రి పూట పూసి ఉదయం గోరువెచ్చని   నీటితో కడగాలి.

              మొటిమలు, మచ్చలు, గాట్లు --నివారణకు -- చందనాది తైలం                  5-4-11.
     
     విపరీతమైన మానసిక ఒత్తిడి తో చెమట ఎక్కువగా స్రవిస్తుంది.గర్భధారణ,  బహిష్టు, మెనోపాజ్
 సమయాలలో మొటిమలు ఎక్కువై,పగిలి,మాని పోతాయి.అవి మానేటపుడు ఎగుడుదిగుడుగా
 మానుతుంటాయి. దీనివలన మచ్చలు,  గాట్లు ఏర్పడుతుంటాయి.

                        రక్తచందన చూర్ణం       ---- 20 gr
                        లొద్దుగ చెక్క  "          ---- 20 gr
                        మంజిష్ఠ వేరు   "         ---- 20 gr '
                        చంగల్వ కోష్టు            ---- 20 gr
                        గ్రందితగరం                ---- 20 gr
                        వస                           ---- 20 gr
                        కుంకుమ పువ్వు           ---- 4
                        రోజ్ వాటర్               ----
                        నిమ్మరసం          

        ఒక గిన్నె తీసుకుని దానిలో అన్ని చూర్ణాలను  వేసి బాగా కలపాలి. దానిలో కుంకుమ పువ్వును  నల్లిపి వేయాలి.  తరువాత డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

        అవసరమైనపుడు రెండు టీ స్పూన్ల పొడి తీసుకుని దానికి తగిననంత రోజ్ వాటర్ కలిపి
పేస్ట్ లాగా తయారు చేయాలి.  దానికి రెండు,  మూడు చుక్కల నిమ్మ రసాన్ని కలపాలి.

        దీనిని ముఖానికి పట్టించాలి. ఇది జిడ్డును తొలగిస్తుంది. ఒక గంట తరువాత గోరువెచ్చని
నీటితో కడగాలి.

       ప్రతి రోజు గాని,  వారానికి రెండు,  మూడుసార్లు చొప్పున గాని ఒక నెల రోజులు చేస్తే
అద్భుతమైన ఫలితం వుంటుంది.

       మొటిమలను గిల్ల కూడదు .  పిండకూడదు. ఘాటైన పదార్ధాలను వాడకూడదు.

                                           మొటిమల నివారణకు --నిశా ధాన్యక చూర్ణం                11-4-11.
      నిశ        = పసుపు
      ధాన్యక  = ధనియాలు

      కారణాలు ;--  చర్మం మీద తైలం ఎక్కువగా తయారైతే మొటిమలు వస్తాయి.

     మృత చర్మపు కణాలు ఎక్కువగా ఎగుడుదిగుడుగా రాలడం వలన  అది స్వేద   రంధ్రాలను అడ్డగించడం

    కేశాల కుదుళ్ళు రేగి వాటిలో బ్యాక్టీరియా చేరడం

    యుక్త వయసు 

    గర్భధారణ

    స్టేరాయిడ్స్ వాడడం

    జిడ్డుగా మేకప్ వేసుకోవడం

      మొదలైన కారణాల  వలన మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా  కలదు.

                ఒక గిన్నెలో ఒక వంతు ధనియాలను వేసి దానిలో ఆరు వంతుల నీళ్ళు పోసి శీత
      కషాయం తయారు చేయాలి.

                నిద్రించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి

      ఒక పెద్ద స్పూను కషాయం తీసుకుని దానిలో ఒక గ్రాము  పసుపు కలిపి దూదితో తీసుకుని
 మొటిమల మీద పట్టించాలి.  ఉదయం గోరువెచ్చని నీటితో కడగాలి.

      వారం, పది రోజులలో మంచి ఫలితం వుంటుంది.

      సూచనలు :--   రాత్రి పూట మేకప్ వేసుకొని పడుకోకూడదు.పౌడర్ రాసుకో కూడదు. బట్టలను 
  వదులుగా ధరించాలి. హెల్మెట్ ను ఎక్కువసార్లు తీస్తూ ఉండకూడదు. సెల్ ఫోన్ ను బుగ్గకు
  ఆనిన్చాకూడదు.  వ్యాయామం చేసిన తరువాత తప్పని సరిగా స్నానం చేయాలి. థైరాయిడ్
  ను తగ్గించుకోవాలి.          

                                  మొటిమల నివారణకు పర్పాటకాది  కషాయం                         13-4-11.

       పర్పాటకం                     --- 4 gr
       నేలవేము                       --- 4 gr
       వెంపలి  వేరు చూర్ణం        --- 4 gr
       బోడతరం పూల పొడి         -- 4 gr
                      రేగు పళ్ళు     --- 5
                             నీళ్ళు     --- 180 ml ( ఒకటిన్నర కప్పులు)
                             చక్కెర      --- 10 gr  (లేదా తేనె)

      ఒక  నీళ్ళు   మీద పెట్టాలి. నీళ్ళు మరిగేటపుడు  అన్ని పదార్ధాలను ఒక్కొక్కటిగా వేయాలి.
 బాగా మరిగి అర గ్లాసుకు వచ్చే వరకు కాచాలి. రేగు పళ్ళను అలానే వేయవచ్చు.  వడకట్టి
 చివరగా చక్కెర  కలుపుకుని తాగాలి.

     దీని వలన ఎంతో కాలంగా వేధిస్తున్న మొటిమలు చాలా సులభంగా నివారింపబడతాయి.

     రోజుకు రెండు పూటల చొప్పున  40  రోజులు వాడితే మంచి ఫలితం వుంటుంది.

  సూచనలు ;-- ముఖాన్ని ఎక్కువసార్లు సబ్బుతో కడగ కూడదు. పూర్తిగా అసలే కడగకుండా
  వదిలేయ్యకూడదు. అపరిశుభ్రత వలన కూడా ఇన్ఫెక్షన్ చేరుతుంది.

     ముఖ్యంగా రాత్రి పూట వదులుగా వున్న నూలు దుస్తులను ధరించాలి.

                              మొటిమల నివారణకు --రక్త శొధన్ క్యాప్స్యూల్స్                      5-6-11.

వసకోమ్ముల చూర్ణం                --- 50 gr
వేపాకుల          "                    --- 50 gr
కటుక రోహిణి    "                    --- 20 gr
కంట కారిణి       "                    --- 10 gr ( నేలవాకుడు సమూలం )
తిప్ప తీగ          "                  --- 10 gr
పసుపు            "                    --- 50 gr
కాలమేఘ        "                     --- 10 gr
సుగంధపాల     "                     --- 10 gr

    అన్ని చూర్ణాలను ఒకే చూర్ణం గా బాగా కలపాలి .  250 మిల్లి గ్రాముల చూర్ణాన్ని ఒక్కొక్క
క్యాప్స్యూల్ లో వేసి కూరాలి.

    పూటకు ఒక క్యాప్స్యూల్ చొప్పున మూడు పూటలా  నీటితో వాడాలి.      దీనితోబాటు అర లీటరు 
నీటిలో అర టీ స్పూను పసుపు పొడి ,  అర టీ స్పూను త్రిఫల చూర్ణం కలిపి ఆ నీటితో ముఖాన్ని ,
చర్మాన్ని కడుగుతూ వుండాలి .

సూచనలు :--  మొటిమలను గిల్ల కూడదు.  గిల్లితే లోపల గడ్డ తయారవుతుంది. గీర కూడదు 
మొదట్లోనే అరికట్టాలి .  వ్యక్తిగత శుభ్రత పాటించాలి .  సాత్వికాహారం భుజించాలి. మసాలాలు ,
గిట్టని పదార్ధాలు వాడకూడదు.

       దీనిని 40 రోజులు గాని లేదా రెండు మూడు నెలలు గాని వాడితే అన్ని రకాల చర్మ వ్యాధులు
కూడా నివారింపబడతాయి . 

                               మొటిమల నివారణకు  --- రక్తశుద్ధి చూర్ణం                          13-6-11.

కారణాలు :--  రక్తం పరిశుభ్రంగా లేకపోవడం, బహిష్టు కు ముందు కలిగే మానసిక ఒత్తిడి వలన,
శరీరం మీద చాలా బిగుతుగా వున్న దుస్తులను ధరించడం, స్థూల కాయం, అధిక  చెమట మొ ---

మంజిష్ఠ  వేర్ల చూర్ణం                  ----100 gr
సుగంధపాల వేర్ల చూర్ణం             ----200 gr
మహిషాక్షి గుగ్గుల చూర్ణం           ----  50 gr
వేపాకుల చూర్ణం                      ----  20 gr
తిప్ప తీగ చూర్ణం                     ----  20 gr
రేవల చిన్ని                            ----  20 gr

      అన్నింటిని విడివిడిగా దంచి చూర్ణాలు గా చేసి కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.

      పూటకు 500 మిల్లి గ్రాముల చొప్పున మూడు పూటలా నీటితో గాని నీటిలో కలుపుకొని గాని
తాగవచ్చు.  ఈ విధంగా రెండు నెలలు వాడితే రక్తశుద్ధి జరుగుతుంది, మొటిమలు, మచ్చలు
మాయమవుతాయి.  ముఖం మీది గాట్లు నివారింప బడతాయి.

     అర లీటరు నీటికి త్రిఫల చూర్ణం, పసుపు కలిపి ఆ నీటితో ముఖం కడుగుతూ వుండాలి.

జాజికాయ
చందనం
మిరియాలు
      కలిపి నూరి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత కడగాలి.  ఈ విధంగా చేస్తూ వుంటే
మొటిమలు మాయమవుతాయి.

                                              మొటిమలు   ---   నివారణ                                         23-8-11.

        శొంటి కొమ్మును , పసుపుకోమ్మును నీటి తో   సాన రాయి మీద చాది గంధం తీయాలి   ఈ గంధాన్ని మొటిమల
మీద పోయాలి . ఈ విధంగా కొద్ది రోజులు చేస్తే మొదట మొటిమలు పెద్దవై , మెత్తబడి , తరువాత వాటి లోపలి కుసాలు
బయటకు వచ్చి పూర్తిగా మాయమవుతాయి .  మచ్చలు కూడా మిగలవు .

                                                      13-9=11

       ఒక కిలో మంచి శనగలను తెచ్చి బాణలిలో వేసి స్టవ్ మీద పెట్టాలి . నాలుగైదు చుక్కల నేతిని బాణలి అంచుల నుండి
వదలాలి . స్టవ్ వెలిగించి శనగలను దోరగా వేయించాలి . దీనికి 100 గ్రాముల కస్తూరి పసుపు కొమ్ములను కలిపి మిషన్
పట్టించాలి .   దీనిని డబ్బాలో నిల్వ చేసుకోవాలి .

      ఈ పిండిని తగినంత చిన్న ప్లేటు లో వేసి దానికి తగినన్ని పాలు కలిపి పేస్టు లాగా తయారు చేసి ముఖానికి పట్టించాలి .
మొటిమల మీద , మచ్చల మీద బాగా దట్టించాలి . అరగంట సేపు ఉంచి కడగాలి . చలికాలంలో వేడి నీటితో , వేసవి కాలంలో చల్లని నీటితో కడగాలి .
     


       


     
      


                                     








మంగు

                               మంగు మచ్చల నివారణ                                19-12-10
 
ఎర్రని మంగు, నల్లని మంగు అని ఇది రెండు రకాలు.
 
1. పచ్చి పాలు ----- అర టీ స్పూను
    నిమ్మ రసం ----   అర టీ స్పూను
 
ఇవి రెండు బాగా కలపాలి.నిద్రించే ముందు దీనిని మచ్చల మీద లేపనం చెయ్యాలి. తరువాత బాగా ఇంకి పోయేట్లు మర్దన చెయ్యాలి.
 
2 తాజా ఆవు పేడ రసం కొద్దిగా తీసుకొని మచ్చలపై పూసి గోరువెచ్చని నీటితో కడగాలి. విధంగా చేస్తూ వుంటే  మచ్చలు పోతాయి.
 
                                               3. 9-2-09

నాటు గేదెల పాలు కాచి, తోడుబెట్టిన స్వచ్చమైన వెన్నను మంగు మచ్చలపై రాత్రి నిద్రించే ముందు సున్నితంగా మర్దన చేసి వదిలెయ్యాలి. ఉదయం నీటితో కడగాలి.
 
                                      మంగు మచ్చల నివారణ                                       2-3-09.

  దొరికినన్ని మర్రి చిగుళ్ళను తెచ్చి ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవాలి. అర టీ స్పూను పొడిలో తగినన్నిపాలు కలిపి రాత్రి పూట ముఖం మీద మంగు మచ్చల మీద మర్దన చెయ్యాలి. ఉదయం ముఖాన్ని కుంకుడురసం తో కడుక్కోవాలి. తరువాత మంచి నీటితో కడుక్కోవాలి.
                                                  
                                                   16-9-10

      తలలో కఫం ఎక్కువైతే వచ్చే ముఖ్యమైన సమస్యలలో మంగు ఒకటి .

1. వేడి నీటి ఆవిరిని ముఖానికి పట్టాలి. ( పసుపు కూడా వేసుకోవచ్చు)

2. బాదం నూనె ( Almond Oil ) 10 చుక్కలు మంగు మచ్చల పైన, కంటికింద మచ్చల పైన మృదువుగా,గుండ్రంగా మర్దన చెయ్యాలి.

3. బుగ్గలను పూరించడం, వదలడం చెయ్యాలి. బుగ్గలను రెండు వైపులా సాగ దీయాలి. ముఖ కండరాలుకదిలేటట్లు ముఖాన్ని ముడుచుకోవాలి.

ఉష్ట్రాసనం , సర్వాంగాసనం వెయ్యాలి. మనసును ప్రశాంతంగా వుంచుకోవాలి.

చిరి శనగలు
మర్రి లేత చిగుళ్ళు

    రెండింటిని పాలతో గాని, నీళ్ళతో గాని నూరి పగటి పూట మంగు మచ్చలపై దట్టంగా పట్టించాలి. ఒకటి,రెండు గంటల తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. క్రమేపి మాయమవుతాయి.

                                                    21-2-10

తులసి ఆకులు
వసకోమ్ములు
కుంకుమ పువ్వు
కస్తూరి పువ్వు
తెల్ల చందనం
ఎర్ర చందనం
చెంగల్వకోష్టు
బావంచాలు
గంధకచ్చూరాలు
మంజిష్ఠ
తుంగ గడ్డలు

       అన్నింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి. దీనికి నాలుగు రెట్లు ఆవు పాలు కలిపి మెత్తగా గుజ్జుగానూరాలి. పై పదార్ధాలకు రెండు రెట్లు నువ్వులనూనె కలిపి స్టవ్ మీద పెట్టి తేమ ఇగిరిపోయి నూనె మాత్రమేమిగిలేట్లు కాచాలి. వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి.

   ప్రతిరోజు రాత్రి నిద్రించేముందు రెండు చుక్కలను మంగు మచ్చలపై వేసి సున్నితంగా మర్దన చెయ్యాలి.దీని వలన మంగు మచ్చలు, కళ్ళకింద నలుపు నివారింప బడతాయి.

                                                  2-6-10
 
మంచి పోషకాహారం తీసుకోవాలి. ఎక్కువ ఎండలో, ఎక్కువ చలిలో తిరగ కూడదు. ముఖానికి
బ్లీచింగ్ వంటివి చెయ్యకూడదు.
 
మహా మంజిష్ఠ వాడాలి
 
సోయా సంబంధిత పదార్ధాలు వాడాలి.
 
మర్రి వూడలకు పాల మీగడ, కుంకుమ కలిపి పూసుకోవాలి.

                                                         23-11-10.
 
1. మంజిష్ఠ పొడిలో తేనె కలిపి ముఖానికి పూసుకుంటే మంగు మచ్చలు నివారింప బడతాయి.
 
2. తులసి ఆకులు ----గుప్పెడు
ముద్దకర్పూరం ---- రెండు గ్రాములు
 
రెండు కలిపి నూరి రాత్రి పూట పూసి ఉదయాన్నే కడిగితే మంగు మచ్చలు నివారింప బడతాయి.
 
3. జటామాంసి చూర్ణము  --- ఒక టీ స్పూను
పచ్చి పసుపు పొడి         ---- ఒక టీ స్పూను
 
    రెండింటిని కొద్దిగా నీరు కలిపి ముఖానికి పట్టించాలి. దీనిని మంగు మచ్చల పై దట్టంగా లేపనం
చెయ్యాలి. ప్రతి రోజు రాత్రి వేల నిద్రించే ముందు పూసుకొని ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి.
 
                                                       6-12-10

        ముఖం పై మంగు మచ్చలున్నపుడు నేరుగా ఎండలో తిరగ కూడదు. సూర్య కాంతికి గురి కాకూడదు.అలా వీలు కాదు కాబట్టి సూర్య కాంతిలో మొదట పది నిమిషాలు వుండి నీడలోకి వచ్చెయ్యాలి. తరువాత పదహైదు నిమిషాలు వుండాలి. అలా టైం ని పెంచుకుంటూ తిరగాలి అంతే కాని ఒకే సారి ఎక్కువ సేపు ఎండలోతిరగ కూడదు.

1. దూదిని ఆముదంలో ముంచి మచ్చలపై రుద్దుతూ వుండాలి. విధంగా మూడు నుండి ఆరు నెలలు చేయాలి.

2. కలబంద గుజ్జును నేరుగా మచ్చల పై రుద్దాలి.

3. బావంచాలను నీటిలో నానబెట్టి మెత్తగా నూరి తేనె కలిపి మచ్చలపై పూయాలి, మసాజ్ చేయాలి. కొంత సేపు అలాగే వుంచి తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి.

    ఈ విధంగా చేయడం వలన బ్లీచ్ చేసినట్లు గా పోతాయి.

4. మజ్జిగను మచ్చలపై రుద్దాలి.

5. నిమ్మ రసం పూయాలి.

6. ఉల్లి రసం పూస్తే తీవ్రత తగ్గుతుంది.

                                                     చిట్కా                                     23-11-10

      వరుణ చెక్కను మేక పాలతో నూరి పూస్తే తగ్గుతుంది.
 
                                                   3-3-11
 
భావ ప్రకాశికలో చెప్పబడినది,
 
జాపత్రి చూర్ణం --- 5 gr
              తేనె --- ఒక టీ స్పూను
 
రెండింటిని బాగా కలిపి మంగు మచ్చల మీద పట్టించి గంట తరువాత స్నానం చేయాలి,
విధంగా కొంత కాలం చేస్తే మచ్చలు నివారింప బడతాయి.
                                
                                                 మంగు --నివారణ                                        13-3-11.

    1.  తెల్ల మద్ది చెక్క                --- అర చేయంత
         మేక పాలు     లేదా ఏ పాలైనా పనికొస్తాయి.

               పాలను గంధపు రాయి మీద వేసి  చెక్కతో  చాది  గంధం తీయాలి.   ప్రతి రోజు రాత్రి
         ఈ విధంగా గంధం తీసి మచ్చల పై [పూయాలి. వెంటనే తగ్గుతుంది  కాని మరలా వస్తుంది.
         కాబట్టి  3. 4 నెలలు వాడాలి.

     2.  చిట్టా ముట్టి ( బలామూలం)  వేరు చూర్ణం    --- 10 gr
          తుత్తురు బెండ ( అతిబల)    వేరు చూర్ణం    --- 10 gr
                        అతిమధురం               "            --- 10 gr
                        పసుపు గుండ                           --- 10 gr

          అన్నింటిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.

          ఒక టీ స్పూను పొడిని నీటితో కలిపి మచ్చలపై పూసి గంట తరువాత కడుక్కోవాలి.

      3.  మర్రి చెట్టు పట్ట            --- 250 gr ( నీడలో ఆరబెట్టాలి)
              ఇది బాగా ఎండిన తరువాత పొడి చేసి నిల్వ చేసుకోవాలి.

           ఈ పొడిని నీటితో కలిపి ప్రతి రోజు పూస్తే ఖంచితంగా మంగు మచ్చలు తగ్గుతాయి.

            ఇది తిరుగు లేని ఔషధం .