మొటిమల సమస్య
ధనియాలు -----------100 gr
వసకోమ్ములు ----------- 100 gr
సుగంధ పాల వేళ్ళు --------- 100 gr
అన్నింటిని విడివిడిగా పొడిచేసి సీసాలో నిల్వ చేసుకోవాలి.ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు కొద్దిగా పొడిని పాలతో గాని లేదా నీటితో గాని కలిపి ముఖానికి పట్టించాలి ఉదయం ముఖము కడుక్కోవాలి. మొటిమలు తగ్గిన తర్తువాత కూడా కొద్ది కాలం ఈ పొడిని వాడితే మచ్చలు కూడా తగ్గి పోతాయి.
మొటిమల నివారణ
1. వేప పుల్ల రసం 2,3 చుక్కలు మొటిమలపై రోజు రాస్తూ వుంటే 15 రోజులలో తగ్గి పోతాయి.
2. నిమ్మ రసం 10 చుక్కలు తీసుకొని,దానిలో 10 చుక్కలు రోజ్ వాటర్ ను కలిపి నిద్ర పొయ్యే ముందు లోపలి యింకి పోయేట్లు మొటిమలపై రుద్దాలి.నెమ్మదిగా మర్దన చెయ్యాలి.ఉదయం గోరు వెచ్చని నీటితో కడగాలి.
3. వేప చెట్టు బెరడు చారెడు ముక్కను తీసుకొని ఎండబెట్టాలి.ఎండిన తరువాత తెల్లగా వున్నా వైపు గంధం తియ్యాలి.దానిని పూస్తే ఎంత లావు మొటిమలైనా పోతాయి.
బుగ్గలను గాలితో బాగా పూరించడం,వదలడం వలన ముఖ వర్చస్సు పెరుగుతుంది.
కొవ్వు పదార్ధాలు,నెయ్యి,మీగడ,నూనె,తీపి పదార్ధాలు తింటే మొటిమలు వస్తాయని అనుకోవడం అర్ధ రహితం.
కొవ్వు కరిగేట్లు శారీరక శ్రమ, వ్యాయామం చెయ్యాలి.
4. 2-12-08.
చలికాలంలో తెల్లవారు ఝామున లేచి ఒక తెల్లని శుభ్రమైన నూలు గుడ్డను తీసుకొని
ఆకులపై పడిన మంచు బిందువులను ఆగుడ్డతో అద్ది తెచ్చుకోవాలి.ఆ గుడ్డ తో ముఖం మీద నెమ్మదిగా అద్దాలి
దీనితో ముఖం ఎంతో సౌందర్య వంతమవుతుంది. అర గంట ఆగి స్నానం చెయ్యాలి. మొటిమలు కూడా నివారింప బడతాయి.

5. 30-1-09.
జాజికాయ
చందనం
జాజికాయ
చందనం
రెండింటిని రాయి మీద చాది కలిపి ఆగందాన్ని రాత్రి పూట మొటిమలపై పూసి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడగాలి.
6. మంజిష్ఠ పొడి ----- ఒక టీ స్పూను
తేనె ----- ఒక టీ స్పూను
రెండింటిని కలిపి మొటిమల మీద పెడితే కొద్ది రోజులకు మొటిమలు మాయమవుతాయి.
జాగ్రత్తలు :_- మొటిమల నివారణకు మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. బహిష్టు సక్రమంగా వచ్చేట్లు చూసుకోవాలి.
ఒంటి మీద మచ్చలు , కంటికింద నలుపు వస్తే రక్తం చెడిపోయినట్లు లెక్క.
మొటిమల సమస్య --నివారణ 21-4-09.
తులసి ఆకులు ---- 10
కర్పూరం ---- ఒక బిళ్ళ
రెండింటిని కల్వం లోవేసి కొద్ది చుక్కల నీటిని కలిపి మెత్తగా నూరి రాత్రి పూట మొటిమల మీద దట్టంగా పట్టించాలి. ఉదయం నిద్ర లేచిన తరువాత గోరువెచ్చని నీటి తో కడగాలి.
మలబద్ధకం వలన ఏర్పడే మొటిమలు --- నివారణ 7-7-09.
దోరగా వేయించిన ధనియాల పొడి
సుగంధ పాల వేర్ల పై బెరడు పొడి
వస కొమ్ముల పొడి
వస కొమ్ములను 24 గంటలు నానబెట్టి కడిగి ఎండబెట్టి దంచి పొడి చెయ్యాలి.
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి. కలిపి సీసాలో భద్ర పరచాలి.
ఒక టీ స్పూను పొడిలో తగినన్ని పాలు గాని, నీళ్ళు గాని వేసి మెత్తగా నూరి మొటిమలపై పూస్తే రాయిలాగా అయిన మొటిమలు కూడా నివారింప బడతాయి. రాత్రి పట్టించి ఉదయం కడగాలి.
మొటిమలు --- నివారణ 27-7-09.
ముఖం మీద నెమ్మదిగా మర్దన చెయ్యాలి. బుగ్గలను పూరించడం, వదలడం చెయ్యాలి.
పుట్టమట్టి పట్టి:-- పుట్టమట్టి తెచ్చి ఎండబెట్టి, దంచి, జల్లించి సీసాలో భద్రపరచుకోవాలి.
తగినంత మట్టిని తీసుకొని నీళ్ళు కలిపి ముఖానికి పట్టించాలి. (Mud Pad) . 15 లేక 20 నిమిషాల తరువాత కడిగెయ్యాలి.
విపరీత కరణి :-- ఈ ఆసనాన్ని తప్పక వెయ్యాలి. తలను వీపు వరకు ఆనించి నడుము వద్ద చేతులతో శరీరాన్నినడుము నుండి పైకెత్తాలి.
మలబద్ధకం లేకుండా జాగ్రత్త వహించాలి. భోంచేసిన రెండు గంటల తరువాత పండ్లు తినాలి. లేక పోతే ఉదయం లేవగానే ఒక వేపాకు తింటే సుఖ విరేచనమవుతుంది.
మొటిమల నివారణ 13-2-10.
తులసి ఆకులు --- పది
కర్పూరం బిళ్ళ --- ఒకటి
కస్తూరి పసుపు --- పావు టీ స్పూను
అన్నింటిని కలిపి గుజ్జుగా నూరి మొటిమల మీద పూస్తే మొటిమలు, వాటి వలన వచ్చే ఎరుపు, తెలుపు, నలుపు మచ్చలు కూడా నివారింప బడతాయి.
పసుపు
తులసి
నిమ్మ రసం
పసుపు పొడిని, తులసి ఆకులను తగినంత నిమ్మ రసం కలిపి నూరి లేపనం గా చేసి మొతిమలపై, మచ్చలపై పెడితే తగ్గిపోతాయి.
దీనిని కడుపులోకి కూడా వాడాలి.
21-12-10
హార్మోనలలో మార్పుల వలన, మానసిక ఒత్తిడి వలన, రక్త ప్రసరణ పెరిగి రక్తం లోని తైలము బయటకు వచ్చి గట్టి పడి సిస్ట్ లాగా ఏర్పడుతుంది వీటినే మొటిమలు అంటారు.
తలుపులన్నీ మూసేసి నిద్రించడం వలన, ఏదైనా గాలి లేని ప్రదేశంలో ఎక్కువసేపు, లేదా ఎక్కువ కాలం వుండడం వలన ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ.
బియ్యం --- పావుకిలో
జిలకర --- 100 gr
వేలిగారం --- 10 gr
ఉలవలు --- 100 gr
వేలిగారం తప్ప మిగిలిన పదార్ధాలను విడివిడిగా దోరగా వేయించి దంచి పొడి చేసి కలుపుకోవాలి. వేలిగారాన్నిపొంగించి పొడి చేసి కలపాలి.
అవసరమైనంత పొడిని తీసుకుని నీరు కలిపి ముఖానికి పూయాలి. రాత్రి పూట పూసి ఉదయం గోరువెచ్చని నీటితో కడగాలి.
మొటిమలు, మచ్చలు, గాట్లు --నివారణకు -- చందనాది తైలం 5-4-11.
విపరీతమైన మానసిక ఒత్తిడి తో చెమట ఎక్కువగా స్రవిస్తుంది.గర్భధారణ, బహిష్టు, మెనోపాజ్
సమయాలలో మొటిమలు ఎక్కువై,పగిలి,మాని పోతాయి.అవి మానేటపుడు ఎగుడుదిగుడుగా
మానుతుంటాయి. దీనివలన మచ్చలు, గాట్లు ఏర్పడుతుంటాయి.
రక్తచందన చూర్ణం ---- 20 gr
లొద్దుగ చెక్క " ---- 20 gr
మంజిష్ఠ వేరు " ---- 20 gr '
చంగల్వ కోష్టు ---- 20 gr
గ్రందితగరం ---- 20 gr
వస ---- 20 gr
కుంకుమ పువ్వు ---- 4
రోజ్ వాటర్ ----
నిమ్మరసం
ఒక గిన్నె తీసుకుని దానిలో అన్ని చూర్ణాలను వేసి బాగా కలపాలి. దానిలో కుంకుమ పువ్వును నల్లిపి వేయాలి. తరువాత డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
అవసరమైనపుడు రెండు టీ స్పూన్ల పొడి తీసుకుని దానికి తగిననంత రోజ్ వాటర్ కలిపి
పేస్ట్ లాగా తయారు చేయాలి. దానికి రెండు, మూడు చుక్కల నిమ్మ రసాన్ని కలపాలి.
దీనిని ముఖానికి పట్టించాలి. ఇది జిడ్డును తొలగిస్తుంది. ఒక గంట తరువాత గోరువెచ్చని
నీటితో కడగాలి.
ప్రతి రోజు గాని, వారానికి రెండు, మూడుసార్లు చొప్పున గాని ఒక నెల రోజులు చేస్తే
అద్భుతమైన ఫలితం వుంటుంది.
మొటిమలను గిల్ల కూడదు . పిండకూడదు. ఘాటైన పదార్ధాలను వాడకూడదు.
మొటిమల నివారణకు --నిశా ధాన్యక చూర్ణం 11-4-11.
నిశ = పసుపు
ధాన్యక = ధనియాలు
కారణాలు ;-- చర్మం మీద తైలం ఎక్కువగా తయారైతే మొటిమలు వస్తాయి.
మృత చర్మపు కణాలు ఎక్కువగా ఎగుడుదిగుడుగా రాలడం వలన అది స్వేద రంధ్రాలను అడ్డగించడం
కేశాల కుదుళ్ళు రేగి వాటిలో బ్యాక్టీరియా చేరడం
యుక్త వయసు
గర్భధారణ
స్టేరాయిడ్స్ వాడడం
జిడ్డుగా మేకప్ వేసుకోవడం
మొదలైన కారణాల వలన మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా కలదు.
ఒక గిన్నెలో ఒక వంతు ధనియాలను వేసి దానిలో ఆరు వంతుల నీళ్ళు పోసి శీత
కషాయం తయారు చేయాలి.
నిద్రించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి
ఒక పెద్ద స్పూను కషాయం తీసుకుని దానిలో ఒక గ్రాము పసుపు కలిపి దూదితో తీసుకుని
మొటిమల మీద పట్టించాలి. ఉదయం గోరువెచ్చని నీటితో కడగాలి.
వారం, పది రోజులలో మంచి ఫలితం వుంటుంది.
సూచనలు :-- రాత్రి పూట మేకప్ వేసుకొని పడుకోకూడదు.పౌడర్ రాసుకో కూడదు. బట్టలను
వదులుగా ధరించాలి. హెల్మెట్ ను ఎక్కువసార్లు తీస్తూ ఉండకూడదు. సెల్ ఫోన్ ను బుగ్గకు
ఆనిన్చాకూడదు. వ్యాయామం చేసిన తరువాత తప్పని సరిగా స్నానం చేయాలి. థైరాయిడ్
ను తగ్గించుకోవాలి.
మొటిమల నివారణకు పర్పాటకాది కషాయం 13-4-11.
పర్పాటకం --- 4 gr
నేలవేము --- 4 gr
వెంపలి వేరు చూర్ణం --- 4 gr
బోడతరం పూల పొడి -- 4 gr
రేగు పళ్ళు --- 5
నీళ్ళు --- 180 ml ( ఒకటిన్నర కప్పులు)
చక్కెర --- 10 gr (లేదా తేనె)
ఒక నీళ్ళు మీద పెట్టాలి. నీళ్ళు మరిగేటపుడు అన్ని పదార్ధాలను ఒక్కొక్కటిగా వేయాలి.
బాగా మరిగి అర గ్లాసుకు వచ్చే వరకు కాచాలి. రేగు పళ్ళను అలానే వేయవచ్చు. వడకట్టి
చివరగా చక్కెర కలుపుకుని తాగాలి.
దీని వలన ఎంతో కాలంగా వేధిస్తున్న మొటిమలు చాలా సులభంగా నివారింపబడతాయి.
రోజుకు రెండు పూటల చొప్పున 40 రోజులు వాడితే మంచి ఫలితం వుంటుంది.
సూచనలు ;-- ముఖాన్ని ఎక్కువసార్లు సబ్బుతో కడగ కూడదు. పూర్తిగా అసలే కడగకుండా
వదిలేయ్యకూడదు. అపరిశుభ్రత వలన కూడా ఇన్ఫెక్షన్ చేరుతుంది.
ముఖ్యంగా రాత్రి పూట వదులుగా వున్న నూలు దుస్తులను ధరించాలి.
మొటిమల నివారణకు --రక్త శొధన్ క్యాప్స్యూల్స్ 5-6-11.
వసకోమ్ముల చూర్ణం --- 50 gr
వేపాకుల " --- 50 gr
కటుక రోహిణి " --- 20 gr
కంట కారిణి " --- 10 gr ( నేలవాకుడు సమూలం )
తిప్ప తీగ " --- 10 gr
పసుపు " --- 50 gr
కాలమేఘ " --- 10 gr
సుగంధపాల " --- 10 gr
అన్ని చూర్ణాలను ఒకే చూర్ణం గా బాగా కలపాలి . 250 మిల్లి గ్రాముల చూర్ణాన్ని ఒక్కొక్క
క్యాప్స్యూల్ లో వేసి కూరాలి.
పూటకు ఒక క్యాప్స్యూల్ చొప్పున మూడు పూటలా నీటితో వాడాలి. దీనితోబాటు అర లీటరు
నీటిలో అర టీ స్పూను పసుపు పొడి , అర టీ స్పూను త్రిఫల చూర్ణం కలిపి ఆ నీటితో ముఖాన్ని ,
చర్మాన్ని కడుగుతూ వుండాలి .
సూచనలు :-- మొటిమలను గిల్ల కూడదు. గిల్లితే లోపల గడ్డ తయారవుతుంది. గీర కూడదు
మొదట్లోనే అరికట్టాలి . వ్యక్తిగత శుభ్రత పాటించాలి . సాత్వికాహారం భుజించాలి. మసాలాలు ,
గిట్టని పదార్ధాలు వాడకూడదు.
దీనిని 40 రోజులు గాని లేదా రెండు మూడు నెలలు గాని వాడితే అన్ని రకాల చర్మ వ్యాధులు
కూడా నివారింపబడతాయి .
మొటిమల నివారణకు --- రక్తశుద్ధి చూర్ణం 13-6-11.
కారణాలు :-- రక్తం పరిశుభ్రంగా లేకపోవడం, బహిష్టు కు ముందు కలిగే మానసిక ఒత్తిడి వలన,
శరీరం మీద చాలా బిగుతుగా వున్న దుస్తులను ధరించడం, స్థూల కాయం, అధిక చెమట మొ ---
మంజిష్ఠ వేర్ల చూర్ణం ----100 gr
సుగంధపాల వేర్ల చూర్ణం ----200 gr
మహిషాక్షి గుగ్గుల చూర్ణం ---- 50 gr
వేపాకుల చూర్ణం ---- 20 gr
తిప్ప తీగ చూర్ణం ---- 20 gr
రేవల చిన్ని ---- 20 gr
అన్నింటిని విడివిడిగా దంచి చూర్ణాలు గా చేసి కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
పూటకు 500 మిల్లి గ్రాముల చొప్పున మూడు పూటలా నీటితో గాని నీటిలో కలుపుకొని గాని
తాగవచ్చు. ఈ విధంగా రెండు నెలలు వాడితే రక్తశుద్ధి జరుగుతుంది, మొటిమలు, మచ్చలు
మాయమవుతాయి. ముఖం మీది గాట్లు నివారింప బడతాయి.
అర లీటరు నీటికి త్రిఫల చూర్ణం, పసుపు కలిపి ఆ నీటితో ముఖం కడుగుతూ వుండాలి.
జాజికాయ
చందనం
మిరియాలు
కలిపి నూరి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత కడగాలి. ఈ విధంగా చేస్తూ వుంటే
మొటిమలు మాయమవుతాయి.
మొటిమలు --- నివారణ 23-8-11.
శొంటి కొమ్మును , పసుపుకోమ్మును నీటి తో సాన రాయి మీద చాది గంధం తీయాలి ఈ గంధాన్ని మొటిమల
మీద పోయాలి . ఈ విధంగా కొద్ది రోజులు చేస్తే మొదట మొటిమలు పెద్దవై , మెత్తబడి , తరువాత వాటి లోపలి కుసాలు
బయటకు వచ్చి పూర్తిగా మాయమవుతాయి . మచ్చలు కూడా మిగలవు .
13-9=11
ఒక కిలో మంచి శనగలను తెచ్చి బాణలిలో వేసి స్టవ్ మీద పెట్టాలి . నాలుగైదు చుక్కల నేతిని బాణలి అంచుల నుండి
వదలాలి . స్టవ్ వెలిగించి శనగలను దోరగా వేయించాలి . దీనికి 100 గ్రాముల కస్తూరి పసుపు కొమ్ములను కలిపి మిషన్
పట్టించాలి . దీనిని డబ్బాలో నిల్వ చేసుకోవాలి .
ఈ పిండిని తగినంత చిన్న ప్లేటు లో వేసి దానికి తగినన్ని పాలు కలిపి పేస్టు లాగా తయారు చేసి ముఖానికి పట్టించాలి .
మొటిమల మీద , మచ్చల మీద బాగా దట్టించాలి . అరగంట సేపు ఉంచి కడగాలి . చలికాలంలో వేడి నీటితో , వేసవి కాలంలో చల్లని నీటితో కడగాలి .
మొటిమల నివారణకు 6-2-09.
మానసిక రుగ్మతలు, అవలక్షణాల వలన సౌందర్యం చెడి పోతుంది.
రేగు కాయలలోని గింజలను సేకరించి డబ్బాలో నిల్వ చేసుకోవాలి.అవసరమైనపుడు వాటిని పగులగొట్టి పప్పును తీసి మెత్తగా చేసి దానికి కొద్దిగా వెన్న, కొద్దిగా తేనె కలిపి మొటిమల మీద, మచ్చల మీద పెట్టాలి.
అర గంట తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ విధంగా చెయ్యడం వలన మొటిమల వలన ఏర్పడిన మచ్చలు, నల్ల మచ్చలు చాల త్వరగా, సులభంగా నివారింప బడతాయి.
మొటిమల సమస్య --నివారణ 21-4-09.
తులసి ఆకులు ---- 10
కర్పూరం ---- ఒక బిళ్ళ
రెండింటిని కల్వం లోవేసి కొద్ది చుక్కల నీటిని కలిపి మెత్తగా నూరి రాత్రి పూట మొటిమల మీద దట్టంగా పట్టించాలి. ఉదయం నిద్ర లేచిన తరువాత గోరువెచ్చని నీటి తో కడగాలి.
మలబద్ధకం వలన ఏర్పడే మొటిమలు --- నివారణ 7-7-09.
దోరగా వేయించిన ధనియాల పొడి
సుగంధ పాల వేర్ల పై బెరడు పొడి
వస కొమ్ముల పొడి
వస కొమ్ములను 24 గంటలు నానబెట్టి కడిగి ఎండబెట్టి దంచి పొడి చెయ్యాలి.
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి. కలిపి సీసాలో భద్ర పరచాలి.
ఒక టీ స్పూను పొడిలో తగినన్ని పాలు గాని, నీళ్ళు గాని వేసి మెత్తగా నూరి మొటిమలపై పూస్తే రాయిలాగా అయిన మొటిమలు కూడా నివారింప బడతాయి. రాత్రి పట్టించి ఉదయం కడగాలి.
మొటిమలు --- నివారణ 27-7-09.
ముఖం మీద నెమ్మదిగా మర్దన చెయ్యాలి. బుగ్గలను పూరించడం, వదలడం చెయ్యాలి.
పుట్టమట్టి పట్టి:-- పుట్టమట్టి తెచ్చి ఎండబెట్టి, దంచి, జల్లించి సీసాలో భద్రపరచుకోవాలి.
తగినంత మట్టిని తీసుకొని నీళ్ళు కలిపి ముఖానికి పట్టించాలి. (Mud Pad) . 15 లేక 20 నిమిషాల తరువాత కడిగెయ్యాలి.
విపరీత కరణి :-- ఈ ఆసనాన్ని తప్పక వెయ్యాలి. తలను వీపు వరకు ఆనించి నడుము వద్ద చేతులతో శరీరాన్నినడుము నుండి పైకెత్తాలి.
మలబద్ధకం లేకుండా జాగ్రత్త వహించాలి. భోంచేసిన రెండు గంటల తరువాత పండ్లు తినాలి. లేక పోతే ఉదయం లేవగానే ఒక వేపాకు తింటే సుఖ విరేచనమవుతుంది.
మొటిమల నివారణ 13-2-10.
తులసి ఆకులు --- పది
కర్పూరం బిళ్ళ --- ఒకటి
కస్తూరి పసుపు --- పావు టీ స్పూను
అన్నింటిని కలిపి గుజ్జుగా నూరి మొటిమల మీద పూస్తే మొటిమలు, వాటి వలన వచ్చే ఎరుపు, తెలుపు, నలుపు మచ్చలు కూడా నివారింప బడతాయి.
మొటిమలు-- నివారణ 10-6-10.
హార్మోన్లలో తేడాల వలన, ఆహారంలో క్రొవ్వు పదార్ధాలు ఎక్కువగా చేరడం వలన మొటిమలు వస్తాయి.
తరచుగా ముఖం కడుగుతూ వుండాలి.
చందనం
వస
మిరియాలు
లొద్దుగ చెక్క
అన్నింటిని యొక్క చూర్నాలను సమానంగా తీసుకొని కలిపి నిల్వ చేసుకోవాలి.
అవసరమైనంత పొడిని తీసుకొని పాలల్లో గాని, రోజ్ వాటర్ లో గాని కలిపి దూదితో తీసుకొని మొతిమలపై పూయాలి. అరగంట వుండనిచి తరువాత ముఖం కడుక్కోవాలి.
2. జాజికాయ పొడి
మిరియాల పొడి
రెండింటిని కలిపి మొటిమల మీద పూయాలి. కొంత సేపు వుంచి కడిగితే మచ్చలు కూడా పోతాయి.
3. పుదీనా ఆకులు --- 5
తులసి ఆకులు ----5
నిమ్మ రసం ---- 2, 3 చుక్కలు
అన్నింటిని కలిపి నూరి మొటిమల మీద పెడితే మచ్చలు కూడా కనిపించకుండా పోతాయి. ఇది పులిపిర్లకు కూడా బాగా పని చేస్తుంది.
2-10-10
దాల్చిన చెక్క పొడిలో తగినంత నిమ్మ రసం కలిపి పేస్ట్ లాగా చేసి మొటిమలకు పట్టిస్తే జిడ్డు తగ్గి మొటిమలు నివారింప బడతాయి.
14-10-10 దాల్చిన చెక్క పొడిలో తగినంత నిమ్మ రసం కలిపి పేస్ట్ లాగా చేసి మొటిమలకు పట్టిస్తే జిడ్డు తగ్గి మొటిమలు నివారింప బడతాయి.
పసుపు
తులసి
నిమ్మ రసం
పసుపు పొడిని, తులసి ఆకులను తగినంత నిమ్మ రసం కలిపి నూరి లేపనం గా చేసి మొతిమలపై, మచ్చలపై పెడితే తగ్గిపోతాయి.
దీనిని కడుపులోకి కూడా వాడాలి.
21-12-10
హార్మోనలలో మార్పుల వలన, మానసిక ఒత్తిడి వలన, రక్త ప్రసరణ పెరిగి రక్తం లోని తైలము బయటకు వచ్చి గట్టి పడి సిస్ట్ లాగా ఏర్పడుతుంది వీటినే మొటిమలు అంటారు.
తలుపులన్నీ మూసేసి నిద్రించడం వలన, ఏదైనా గాలి లేని ప్రదేశంలో ఎక్కువసేపు, లేదా ఎక్కువ కాలం వుండడం వలన ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ.
బియ్యం --- పావుకిలో
జిలకర --- 100 gr
వేలిగారం --- 10 gr
ఉలవలు --- 100 gr
వేలిగారం తప్ప మిగిలిన పదార్ధాలను విడివిడిగా దోరగా వేయించి దంచి పొడి చేసి కలుపుకోవాలి. వేలిగారాన్నిపొంగించి పొడి చేసి కలపాలి.
అవసరమైనంత పొడిని తీసుకుని నీరు కలిపి ముఖానికి పూయాలి. రాత్రి పూట పూసి ఉదయం గోరువెచ్చని నీటితో కడగాలి.
మొటిమలు, మచ్చలు, గాట్లు --నివారణకు -- చందనాది తైలం 5-4-11.
విపరీతమైన మానసిక ఒత్తిడి తో చెమట ఎక్కువగా స్రవిస్తుంది.గర్భధారణ, బహిష్టు, మెనోపాజ్
సమయాలలో మొటిమలు ఎక్కువై,పగిలి,మాని పోతాయి.అవి మానేటపుడు ఎగుడుదిగుడుగా
మానుతుంటాయి. దీనివలన మచ్చలు, గాట్లు ఏర్పడుతుంటాయి.
రక్తచందన చూర్ణం ---- 20 gr
లొద్దుగ చెక్క " ---- 20 gr
మంజిష్ఠ వేరు " ---- 20 gr '
చంగల్వ కోష్టు ---- 20 gr
గ్రందితగరం ---- 20 gr
వస ---- 20 gr
కుంకుమ పువ్వు ---- 4
రోజ్ వాటర్ ----
నిమ్మరసం
ఒక గిన్నె తీసుకుని దానిలో అన్ని చూర్ణాలను వేసి బాగా కలపాలి. దానిలో కుంకుమ పువ్వును నల్లిపి వేయాలి. తరువాత డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
అవసరమైనపుడు రెండు టీ స్పూన్ల పొడి తీసుకుని దానికి తగిననంత రోజ్ వాటర్ కలిపి
పేస్ట్ లాగా తయారు చేయాలి. దానికి రెండు, మూడు చుక్కల నిమ్మ రసాన్ని కలపాలి.
దీనిని ముఖానికి పట్టించాలి. ఇది జిడ్డును తొలగిస్తుంది. ఒక గంట తరువాత గోరువెచ్చని
నీటితో కడగాలి.
ప్రతి రోజు గాని, వారానికి రెండు, మూడుసార్లు చొప్పున గాని ఒక నెల రోజులు చేస్తే
అద్భుతమైన ఫలితం వుంటుంది.
మొటిమలను గిల్ల కూడదు . పిండకూడదు. ఘాటైన పదార్ధాలను వాడకూడదు.
మొటిమల నివారణకు --నిశా ధాన్యక చూర్ణం 11-4-11.
నిశ = పసుపు
ధాన్యక = ధనియాలు
కారణాలు ;-- చర్మం మీద తైలం ఎక్కువగా తయారైతే మొటిమలు వస్తాయి.
మృత చర్మపు కణాలు ఎక్కువగా ఎగుడుదిగుడుగా రాలడం వలన అది స్వేద రంధ్రాలను అడ్డగించడం
కేశాల కుదుళ్ళు రేగి వాటిలో బ్యాక్టీరియా చేరడం
యుక్త వయసు
గర్భధారణ
స్టేరాయిడ్స్ వాడడం
జిడ్డుగా మేకప్ వేసుకోవడం
మొదలైన కారణాల వలన మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా కలదు.
ఒక గిన్నెలో ఒక వంతు ధనియాలను వేసి దానిలో ఆరు వంతుల నీళ్ళు పోసి శీత
కషాయం తయారు చేయాలి.
నిద్రించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి
ఒక పెద్ద స్పూను కషాయం తీసుకుని దానిలో ఒక గ్రాము పసుపు కలిపి దూదితో తీసుకుని
మొటిమల మీద పట్టించాలి. ఉదయం గోరువెచ్చని నీటితో కడగాలి.
వారం, పది రోజులలో మంచి ఫలితం వుంటుంది.
సూచనలు :-- రాత్రి పూట మేకప్ వేసుకొని పడుకోకూడదు.పౌడర్ రాసుకో కూడదు. బట్టలను
వదులుగా ధరించాలి. హెల్మెట్ ను ఎక్కువసార్లు తీస్తూ ఉండకూడదు. సెల్ ఫోన్ ను బుగ్గకు
ఆనిన్చాకూడదు. వ్యాయామం చేసిన తరువాత తప్పని సరిగా స్నానం చేయాలి. థైరాయిడ్
ను తగ్గించుకోవాలి.
మొటిమల నివారణకు పర్పాటకాది కషాయం 13-4-11.
పర్పాటకం --- 4 gr
నేలవేము --- 4 gr
వెంపలి వేరు చూర్ణం --- 4 gr
బోడతరం పూల పొడి -- 4 gr
రేగు పళ్ళు --- 5
నీళ్ళు --- 180 ml ( ఒకటిన్నర కప్పులు)
చక్కెర --- 10 gr (లేదా తేనె)
ఒక నీళ్ళు మీద పెట్టాలి. నీళ్ళు మరిగేటపుడు అన్ని పదార్ధాలను ఒక్కొక్కటిగా వేయాలి.
బాగా మరిగి అర గ్లాసుకు వచ్చే వరకు కాచాలి. రేగు పళ్ళను అలానే వేయవచ్చు. వడకట్టి
చివరగా చక్కెర కలుపుకుని తాగాలి.
దీని వలన ఎంతో కాలంగా వేధిస్తున్న మొటిమలు చాలా సులభంగా నివారింపబడతాయి.
రోజుకు రెండు పూటల చొప్పున 40 రోజులు వాడితే మంచి ఫలితం వుంటుంది.
సూచనలు ;-- ముఖాన్ని ఎక్కువసార్లు సబ్బుతో కడగ కూడదు. పూర్తిగా అసలే కడగకుండా
వదిలేయ్యకూడదు. అపరిశుభ్రత వలన కూడా ఇన్ఫెక్షన్ చేరుతుంది.
ముఖ్యంగా రాత్రి పూట వదులుగా వున్న నూలు దుస్తులను ధరించాలి.
మొటిమల నివారణకు --రక్త శొధన్ క్యాప్స్యూల్స్ 5-6-11.
వసకోమ్ముల చూర్ణం --- 50 gr
వేపాకుల " --- 50 gr
కటుక రోహిణి " --- 20 gr
కంట కారిణి " --- 10 gr ( నేలవాకుడు సమూలం )
తిప్ప తీగ " --- 10 gr
పసుపు " --- 50 gr
కాలమేఘ " --- 10 gr
సుగంధపాల " --- 10 gr
అన్ని చూర్ణాలను ఒకే చూర్ణం గా బాగా కలపాలి . 250 మిల్లి గ్రాముల చూర్ణాన్ని ఒక్కొక్క
క్యాప్స్యూల్ లో వేసి కూరాలి.
పూటకు ఒక క్యాప్స్యూల్ చొప్పున మూడు పూటలా నీటితో వాడాలి. దీనితోబాటు అర లీటరు
నీటిలో అర టీ స్పూను పసుపు పొడి , అర టీ స్పూను త్రిఫల చూర్ణం కలిపి ఆ నీటితో ముఖాన్ని ,
చర్మాన్ని కడుగుతూ వుండాలి .
సూచనలు :-- మొటిమలను గిల్ల కూడదు. గిల్లితే లోపల గడ్డ తయారవుతుంది. గీర కూడదు
మొదట్లోనే అరికట్టాలి . వ్యక్తిగత శుభ్రత పాటించాలి . సాత్వికాహారం భుజించాలి. మసాలాలు ,
గిట్టని పదార్ధాలు వాడకూడదు.
దీనిని 40 రోజులు గాని లేదా రెండు మూడు నెలలు గాని వాడితే అన్ని రకాల చర్మ వ్యాధులు
కూడా నివారింపబడతాయి .
మొటిమల నివారణకు --- రక్తశుద్ధి చూర్ణం 13-6-11.
కారణాలు :-- రక్తం పరిశుభ్రంగా లేకపోవడం, బహిష్టు కు ముందు కలిగే మానసిక ఒత్తిడి వలన,
శరీరం మీద చాలా బిగుతుగా వున్న దుస్తులను ధరించడం, స్థూల కాయం, అధిక చెమట మొ ---
మంజిష్ఠ వేర్ల చూర్ణం ----100 gr
సుగంధపాల వేర్ల చూర్ణం ----200 gr
మహిషాక్షి గుగ్గుల చూర్ణం ---- 50 gr
వేపాకుల చూర్ణం ---- 20 gr
తిప్ప తీగ చూర్ణం ---- 20 gr
రేవల చిన్ని ---- 20 gr
అన్నింటిని విడివిడిగా దంచి చూర్ణాలు గా చేసి కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
పూటకు 500 మిల్లి గ్రాముల చొప్పున మూడు పూటలా నీటితో గాని నీటిలో కలుపుకొని గాని
తాగవచ్చు. ఈ విధంగా రెండు నెలలు వాడితే రక్తశుద్ధి జరుగుతుంది, మొటిమలు, మచ్చలు
మాయమవుతాయి. ముఖం మీది గాట్లు నివారింప బడతాయి.
అర లీటరు నీటికి త్రిఫల చూర్ణం, పసుపు కలిపి ఆ నీటితో ముఖం కడుగుతూ వుండాలి.
జాజికాయ
చందనం
మిరియాలు
కలిపి నూరి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత కడగాలి. ఈ విధంగా చేస్తూ వుంటే
మొటిమలు మాయమవుతాయి.
మొటిమలు --- నివారణ 23-8-11.
శొంటి కొమ్మును , పసుపుకోమ్మును నీటి తో సాన రాయి మీద చాది గంధం తీయాలి ఈ గంధాన్ని మొటిమల
మీద పోయాలి . ఈ విధంగా కొద్ది రోజులు చేస్తే మొదట మొటిమలు పెద్దవై , మెత్తబడి , తరువాత వాటి లోపలి కుసాలు
బయటకు వచ్చి పూర్తిగా మాయమవుతాయి . మచ్చలు కూడా మిగలవు .
13-9=11
ఒక కిలో మంచి శనగలను తెచ్చి బాణలిలో వేసి స్టవ్ మీద పెట్టాలి . నాలుగైదు చుక్కల నేతిని బాణలి అంచుల నుండి
వదలాలి . స్టవ్ వెలిగించి శనగలను దోరగా వేయించాలి . దీనికి 100 గ్రాముల కస్తూరి పసుపు కొమ్ములను కలిపి మిషన్
పట్టించాలి . దీనిని డబ్బాలో నిల్వ చేసుకోవాలి .
ఈ పిండిని తగినంత చిన్న ప్లేటు లో వేసి దానికి తగినన్ని పాలు కలిపి పేస్టు లాగా తయారు చేసి ముఖానికి పట్టించాలి .
మొటిమల మీద , మచ్చల మీద బాగా దట్టించాలి . అరగంట సేపు ఉంచి కడగాలి . చలికాలంలో వేడి నీటితో , వేసవి కాలంలో చల్లని నీటితో కడగాలి .
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి