ముఖం మీది మచ్చలు --నివారణ

                           నల్ల మచ్చల నివారణకు                                             19-1-09.
 
                     తేనె మైనం           ----  100 gr
                     బావంచాల పొడి  -----    20 gr
                     నల్ల జిలకర పొడి  -----   20 gr
                     కస్తూరి పసుపు     -----  20 gr
 
          తేనె మైనాన్ని సన్న మంట మీద కరిగించి వడపోసి మరలా స్టవ్ మీద పెట్టి దానిలో పొడులను వేసి బాగా కలపాలి.  చల్లారితే ఆయింట్మెంట్ తయారవుతుంది.
 
         దీనితో మచ్చల పై రాత్రి పూట లోపలి ఇంకే విధంగా మర్దన చెయ్యాలి. కొద్ది రోజులు ఆవిధంగా చేస్తే మచ్చలు మాయమవుతాయి.
                                 ముఖం మీద మచ్చలు -- నివారణ                       18-2-08.
 
         నాటు గేదెల మీగడ లేని పెరుగు ఒక టీ స్పూను తీసుకొని దానిలో రెండు చుక్కల తేనె మాత్రమే వేసి బాగా కలపాలి.
     కళ్ళ చుట్టూ వున్న నల్లని వలయాల మీద, ;మెడ మీది నలుపు మీద, ముఖం మీది నల్లని మచ్చల మీద పూయాలి. ఈ విధంగా 15,20 రోజులు చేస్తే ముఖంలో నల్లని మచ్చలు తొలగింపబడి ముఖానికి,చర్మానికి మంచి   నిగారింపు,కాంతి వస్తాయి.
                             ముఖం మీది మచ్చలను తొలగించాడానికి                         23-2-09.

      టమాటో,కారెట్, బీట్ రూట్ లను మిక్సి లో వేసి రసం పిండిన తరువాత మిగిలిన గుజ్జును మళ్లీ మిక్సి లో వేసి దానికి కొద్దిగా పాల మీది మీగడ కలిపి తిప్పాలి . ఈ పేస్టు ను ముఖానికి దట్టంగా పట్టించాలి.ఇది ముఖానికి అతుక్కు పోతుంది, కారదు .దీని వలన ముఖం మీది మచ్చలు,  ముడతలు,నల్లని వలయాలు, మంగు మచ్చలు తొలగింప బడతాయి.

          పడుకుని వేరే వాళ్ళతో ముఖానికి లేపనం చేయించుకోవచ్చు.     దీనిని పెట్టుకున్న
తరువాత బల్బుకు నీలి రంగు కాగితాన్ని చుట్టి ఆ కాంతి ముఖం మీద పడేట్లుగా చేసుకోవాలి. 15 నిమిషాలు  ఉంచి కడగాలి.

      ప్రతి రోజు ఈవిదంగా నెల రోజులు చేస్తే ముఖంలో ఎంతో మార్పువస్తుంది.

          ముఖం మీద గులాబి వర్ణంలో వున్న మచ్చలు -- Rojeshia --నివారణ             30-11-10.
 
      ఇది మధ్య వయస్కులైన మహిళల్లోఎక్కువగా వచ్చే సమస్య. '
కారణాలు;--

   ఎండకుగురి కావడం వలన, ఉక్క పోత వాతావరణం లో గడపడం వలన, ఎక్కువ వేడిగా వున్న 
నీటితో స్నానం చెయ్యడం వలన, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన, ఎక్కువగా వ్యాయామం చేయడం వలన  ఈ సమస్య ఏర్పడుతుంది.
 
లక్షణాలు:--  
 
     ముఖం మీద ఎర్రని కమిలిన పోక్కుల్లాంటి  మచ్చలు నుదుటి నుండి గడ్డం వరకు వుంటాయి. రక్త నాళాలు ముఖం మీద పరుచుకున్నట్లు గా వుంటాయి. తరచుగా కంటి మీద కూడా వస్తాయి.
 
     ఆల్కహాల్  వాడే వాళ్ళు వెంటనే మానెయ్యాలి.  కాఫీ, టీ వంటి పానీయాలు మానెయ్యాలి.
 
1. కలబంద గుజ్జును చేతితో పిండితే రసం వస్తుంది. దీనిని మచ్చల పై రుద్దాలి.
2. అతిమధురం చూర్ణాన్ని నీటితో కలిపి పూయాలి.
3. గ్రీన్ టీ డికాషన్ ను మచ్చలపై పూయాలి.

                         తిలకాలకము ---చికిత్స                               16-9-10.

     ముఖముపై నల్లగా, నువ్వుల ఆకారంలో ఏర్పడే మచ్చలను తిలకాలకము అంటారు.

     ఎండలో తిరగడం వలన  చంర్మంలోని మెలనిన్ పై ఆ ప్రభావం పడి ఈ వ్యాధి వస్తుంది.  అంతే కాక వంశపారంపర్యంగా కూడా వస్తుంది.   దీని వలన పలుచని, గుండ్రని మచ్చలు ముఖంపై ఏర్పడతాయి.  ఇవి ముఖం  మీద వెదజల్లబడినట్లుగా వుంటాయి.

1. కుంకుమాది తైలంతో ప్రతి రోజు మర్దన చెయ్యాలి.  పావు గంట తరువాత సున్నిపిండితో ముఖాన్ని కడగాలి,

    రెండు, మూడు చుక్కల తైలాన్ని ముక్కులో వేసుకోవాలి.

2. మంజిష్టాది తైలం
3. కిమ్షుక తైలం  ( మోదుగ పూల తైలం)
4.  గంధక రసాయన చూర్ణాన్ని తేనె, నెయ్యి కలిపి కడుపులోకి వాడాలి.

                               ముఖం మీద లేత రంగు మచ్చలు ---నివారణ               11-6-11.      

కారణాలు :---  అతినీలలోహిత కిరణాల ప్రభావం వలన, కాలేయ వ్యాధుల వలన ( లివర్ స్పాట్స్)
గర్భ ధారణ సమయం లో హార్మోన్ల తేడా వలన, ఈస్త్రోజేన్ వలన, టెట్రాసైక్లిన్ ట్యాబ్లెట్ల వలన,
మచ్చలు వచ్చే అవకాశాలు వున్నాయి.

                                                        తులసి లేపనం

బావంచాల గింజల చూర్ణం                   --- ఒక టీ స్పూను
ఎండిన తులసి ఆకుల చూర్ణం              --- ఒక టీ స్పూను
తుంగ ముస్తల చూర్ణం                        ---- ఒక టీ స్పూను
అడవి బాదం నూనె                            ---- రెండు చుక్కలు
కలబంద జెల్                                    ---- తగినంత

       ఒక గిన్నెలో అన్ని చూర్ణాలను వేసి బాగా కలపాలి. దీనికి బాదం నూనె కలపాలి.  తరువాత
తగినంత కలబంద జెల్ ను కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి.  దీనిని నిల్వ చేసుకోవచ్చు.
దీనిని రోజువారీగా వాడాలి.

       దీనిని దూది వుండతో తీసుకొని ముఖం మీది మచ్చల మీద, చర్మం మీద ప్రయోగించాలి.
పది నిమిషాలు వుంచి గోరువెచ్చని నీటితో కడగాలి.

సూచనలు :-- సన్  స్క్రీన్ లోషన్ వాడాలి.  స్నానానికి ముందు మజ్జిగ తో ముఖం కడగాలి.
నిమ్మ రసంతో గాని, వెనిగర్ తో గాని కడగవచ్చు.

                                                        26-7-11.
కలబంద
పచ్చిపసుపు రసం
        రెండింటిని రంగరించి ముఖా పోయాలి 
        వేపాకు చిగుళ్ళు , బెల్లం సమానంగా కలిపి శనగ గింజలంత మాత్రలు చేసుకొని కడుపులోకి వాడాలి . దీనివలన
శరీరంలోని మలినాలు తొలగింపబడతాయి . రక్త శుద్ధి జరుగుతుంది







                                 

                                        





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి