నొప్పులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నొప్పులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

వెన్ను పూస

                                 వెన్ను నొప్పి ----నివారణ                                        30-11-10.
 
వక్క చెట్టు ఆకులు            --- పావు కిలో
నువ్వుల నూనె                 ---  ఒక కప్పు
 
   ఆకులనుదంచి  నూనెలో వేసి నూనె మాత్రమే మిగిలేట్లు కాచాలి. ఆ నూనెలోఒక చిన్న గుడ్డను
 ముంచి వెన్ను మీద పరచాలి.  దీని వలన వెన్ను నొప్పి తగ్గుతుంది.
 
                               వెన్ను నొప్పి -- నివారణ                                        25-10-10.

          ఆరోగ్యవంతమైన  మానవుడు  తొమ్మిది టన్నుల బరువును మాత్రమే మోయగలడు.

         ఈ   వ్యాధి   1.  ఎసిడిటి వలన రావచ్చు.  2. వాతము వలన రావచ్చు.

దుంప రాష్ట్రం                ----   100 gr
పుష్కర మూలం          ----   100 gr
              శొంటి            ----     50 gr
       మిరియాలు          ----     50 gr
            వెల్లుల్లి             ----    50 gr
త్రిఫల చూర్ణం               ----   100 gr
సైంధవ లవణం            ----     25 gr
తిప్ప తీగ                    ----     50 gr

     అన్ని పదార్ధాలను విడివిడిగా చూర్నాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.  శొంటి ని ఆముదంలో వేయించాలి.

తగినంత నీరు కలిపి బాగా నూరి బటాణి గింజంత మాత్రలు చేసి నీడలో ఆరబెట్టాలి.

    పూటకు రెండు మాత్రల చొప్పున ఉదయం సాయంత్రం ఆహారం తరువాత తీసుకోవాలి.

    తరువాత బల్ల పరుపుగా వున్నచోట లేక చాప లేక బల్ల మీద పడుకోవాలి.


వీపు నొప్పి


                                                              వీపు నొప్పి

                                                   వీపు నొప్పి సమస్య --- నివారణ                                   6-9-11.

బోడసరం
చెంగల్వ కోష్టు
వస
దబ్బసొంపు

      అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని చూర్ణాలుచేసి కలిపి నిల్వ చేసుకోవాలి .

      తగినంత చూర్ణాన్ని తీసుకొని దానికి పులిసిన గంజిగాని  లేదా  మజ్జిగ గాని లేదా నిమ్మరసం కలిపి నూరి వీపు మీద
వీపు మీద పట్టు వేయాలి . ఈ విధంగా  ఆరు , ఏడు సార్లు చేస్తే నొప్పి తగ్గుతుంది . 

నడుము

                                        నడుము
         
             మహారాస్నాది తైలాన్ని తెచ్చి నడుముకు పూయాలి.
   
             సన్న రాష్ట్రం
             పల్లేరు కాయలు
             ఆముదం చెట్టు వేర్లు        
             దేవదారు చెక్క
             తెల్ల గలిజేరు వేర్లు 
             రేల కాయల చెట్టు బెరడు

             అన్నింటిని సమాన భాగాలుగా  తీసుకొని చూర్ణాలు  చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
            ఈ చూర్ణంతో కషాయం కాచి దానిలో ఒక టీ స్పూను శొంటి పొడిని  కలిపి తాగితే ఎటువంటి
      నడుము నొప్పి వున్నా తప్పక నివారింపబడుతుంది.

            (నడుము మీద పట్టు వేయడానికి :---   గురిగింజలను  నానబెట్టి మెత్తగా నూరి గుడ్డ మీదపూసి
      నడుము మీద నొప్పి వున్నచోట పరచాలి.

                                              నడుము నొప్పి నివారణకు  --- ఉమ్మెత్త                               29-8-11.

          ఉమ్మెత్త లో  3 రకాలు  వుంటాయి  :--- తెల్ల ఉమ్మెత్త ,  నల్ల ఉమ్మెత్త ,  పసుపు ఉమ్మెత్త

         రెండు పిడికెళ్ళ బియ్యాన్ని నీటిలో నానబెట్టాలి . తరువాత  బాగా నాననిన తరువాత ఆ బియ్యంలోని నీటిని
వంచేసి వాటిలో 4, 5 నల్ల ఉమ్మెత్త ఆకులను వేసి మెత్తగా నూరితే జిగటగా తయారవుతుంది . దానిని ఒక బట్టపై పూసి
నడుము పై పరచాలి . ఈ విధంగా 4, 5 సార్లు చేసేటప్పటికి  నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది .

ఉమ్మెత్త రసం
నువ్వుల నూనె

      రెండింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి నూన పూర్తిగా తేమ ఇంకి పోయి నూనె
మాత్రమె మిగిలే విధంగా కాచాలి.

      ఈ తైలం తో నడుము మీద నొప్పి వున్నచోట మర్దన చేస్తూ వుంటే నొప్పి తగ్గుతుంది .




ప్రక్కటెముకలు

                                                                   ప్రక్కటెముకలు  

                                                ప్రక్కటెముకలలో వాపులు , నొప్పులు  --- నివారణ                      29-8-11.

జిల్లేడు ఆకుల రసం
గోధుమ పిండి

       గోధుమ పిండిలో జిల్లేడు ఆకుల రసం కలిపి పిసికి నొప్పి వున్నచోట పట్టు వేస్తె నొప్పి తగ్గుతుంది

మెడ











                            మెడ సంబంధిత  సమస్యలు -- నివారణ                        7-1-09.


                          మన్య స్థంభ వాతము లేదా మెడనొప్పి --నివారణ

వెన్ను పూసలో 33 పూసలుంటాయి,మెడ మీద 7 పూసలుంటాయి.

    గంటల తరబడి తలను కదిలించకుండ వుండడం వలన ,అకస్మాత్తుగా ,వేగంగా తలను తిప్పడం వలన  మెడ పూసల్లో వాపు ,మెడ నరాలు బిగుసుకు పోవడం జరుగుతుంది. దీనినే మన్య స్థంభ వాతము అంటారు.

ఓమ తైలం గాని, గణేశ తైలం గాని తీసుకొని మెడ మీద పూసిమధ్య వేళ్ళతో సున్నితంగా మర్దన చెయ్యాలిఅప్పటికప్పుడే మార్పు తెలుస్తుంది.

     చింతాకు,వావిలాకు,గుంటగలగరాకు ,తెల్ల గలిజేరు మొదలైనవి వాతాన్ని పోగొడతాయి. ఆకులను  పసుపును కలిపి నీటిలో వేసి వేడి చేసి , నీటిలో గుడ్డను ముంచి కాపడం పెట్టాలి.

  వ్యాయామం :-- మోచేతుల మీద కూర్చొని, కాళ్ళను వెనక్కు పెట్టుకొని,చేతులను తల వెనక్కు పెట్టుకొని , చేతులలో వేళ్ళుదూర్చుకొని (ఒక చేతి వేళ్ళను మరొక చేతి వేళ్ళలో  దూర్చడం ) తలను బిగించి పట్టుకోవాలితలను కదల్చకూడదు. అదే విధంగా వేళ్ళు దూర్చుకొని నొసటి మీద పెట్టి అదమాలి. తల కదలకూడదుత్రోసినా తల కదల కూడదు. అదే విధంగా అర చేతులతో కణతలను అదమాలి. అలాగే గడ్డం మీద అదమాలి.      ప్రక్రియ లో తల మాత్రం కదల కూడదు.

     ఆఫీసుల్లో కూర్చున్నపుడు తలను ఒకే పొజిషన్ లోకాకుండా ఒకటి రెండు నిమిషాలకోకసారి తలను  కదిలిస్తూ వుండాలి. ,లేక పోతే మెడ బిగుసుకు పోతుంది.

ఆహారం :-- కందికట్టు దీనికి బాగా బలం కలిగిస్తుంది. గోరువెచ్చని పాత బియ్యపు అన్నము, ద్రాక్ష ,కమలా,   బత్తాయి, పొన్నగంటి,మెంతికూర మొదలైనవి రక్తప్రసరణ బాగా జరగడానికి ఉపయోగపడతాయి.

నెయ్యిగాని ,నువ్వులనూనేగాని, గోరువెచ్చగా చేసి మెడ మీద సున్నితంగా మర్దన చెయ్యాలి. ఆముదపు  ఆకునకు నెయ్యిరాసి వెచ్చజేసి మెడ మీద వేసి కట్టు కట్టాలి. రాత్రంతా ఉంచి ఉదయం తీసేయ్యాలి.

                                            మెడ మీద మచ్చలు

కరక్కాయల పొడి
ఉసిరిక పొడి
నాగకేసరాల పొడి
వట్టి వేర్ల పొడి
తుంగ గడ్డల పొడి
చందనం పొడి

     అన్నింటిని సమాన భాగాలు తీసుకొని కలిపి నిల్వ చెయ్యాలి. కావలసినంత పొడిని తీసుకొని, తగినంతనీరు కలిపి పలుచగా చేసి నల్లని భాగాలపై పూయాలి.

     పూర్తిగా ఆరి పోయిన తరువాత గోరు వెచ్చని నీటితోకాదగాలి.దీనితో గొంతులో చేరిన కొవ్వు నివారించ బడుతుంది.మచ్చలు తొలగించ బడతాయి.

ఉదయం,సాయంత్రం పూయాలి.మెడ మీద మచ్చలు,గుల్లలు,చారలు, మెడ మీద ముడుతలు పాడడం వలన కాచ్చే మచ్చలు, నగలుపడక పోవడం వలన వచ్చే మచ్చలు నివారించ బడతాయి.

                                        మన్యస్థంభ వాతము ---                               2 8-1-09.

 ఇది వచ్చినపుడు రెండు భుజాలు బిగుసుకు పోతాయి. ఎటు వైపు తిరిగి పడుకుంటే అటు వైపు నొప్పి ఎక్కువగా ఉంటుంది.

   మంచం మీద పడుకొని మెడవరకు శరీరాన్ని మెడ వరకు మంచం మీద ఉంచాలి,తలను వెనక్కి కిందికి  వాల్చాలి భుజాల వరకు గోరువెచ్చని తైలంతో మర్దన చెయ్యాలి.

   మోకాళ్ళ మీద కూర్చొని చేతులను మడిచి వదలడం,మడవడం వదలడం చెయ్యాలి.

శుక్ర వజ్రాసనం :-- మోకాళ్ళ మీద కూర్చొని పాదాలను వెనక్కి మడిచి వెనక్కి పడుకోవాలి .చేతులను పూర్తిగా చాపాలి .కాలి వేళ్ళ మీద కూర్చొని వెనక్కి వంగాలి .

ఆహార నియమాలు :-- తవుడు లేని తెల్లని బియ్యం తిన రాదు. అకాల భోజనం పనికి రాదు.పెసరపప్పు (ఇది చలువ ,వాతము చేయును.) కావున ఇది పనికి రాదు.పాలు,పెరుగు, గేదేపాల మజ్జిగ లను  విసర్జించాలి .

     దొరికితే నాటు ఆవుల వి వాడితే మంచిది. చల్లని నీరు త్రాగరాదు.A/C లు పనికి రావు..

ఆహారం :--

సైంధవ లవణం            -----20 gr
మంచి ఆవు నెయ్యి      -----20 gr
నాటు కోడిగుడ్డు తెల్లసొన  --1

సైంధవ లవణం బాగా మెత్తగా నూరి వస్త్రగాయం పట్టాలి.అన్నింటిని కలిపి కల్వంలో వేసి మెత్తగా ఆయింట్మెంట్ లాగా నూరాలి.దీనిని రాత్రి నిద్రించే ముందు వెన్నుపూస మీద,మెడ మీద పట్టు వేయాలి. ఎత్తు దిండు పెట్టుకోకూడదు.ఉదయం గోరువెచ్చని నీటితో కడగాలి.

                                                మెడ మీద పులిపిర్లు

 అల్లం ముక్కను  తీసుకొని పెన్సిల్ ముక్కలాగా కూచుగా చెక్కాలి. ఘాటైన కొత్త సున్నం తీసుకొని ప్లేటులో పెట్టుకొని అల్లం ముక్క తో సున్నాన్ని అద్దుకొని పులిపిర్ల మీద పెట్టాలి.అప్పటికప్పుడే రాలి పోతాయి.

                                 మెడ మీద చర్మం మందంగా తయారైతే

  వేప నూనెలో పసుపు కొమ్ము వేసి నూరితే ఆయింట్మెంట్ లాగా తయారవుతుంది. దీనిని చర్మం మీద లేపనం చెయ్యాలి. 2,3 గంటల తరువాత కడగాలి.కొద్దిగా మంట పుట్ట వచ్చు.ఒక కప్పు మేక పాలలో ఒక టీ స్పూను తేనె కలుపు కొని తాగితే రక్త శుద్ధి జరుగుతుంది.

                                  మెడనొప్పి --- నివారణా మార్గాలు                              29-11-10.

 వేపాకులు, వేపచిగుళ్ళను సమ పాళ్ళలో తీసుకొని బాగా నూరి ఒక గ్లాసు వేడి నీటిలో కలుపుకొని

ఉదయం, సాయంత్రం తాగాలిఒక చిన్న గిన్నెలో నువ్వులనూనేను తీసుకొని పరోక్ష పద్ధతి ద్వారా వేడి చేసి గోరువెచ్చగా వున్నపుడు మెడమీద మసాజ్ చెయ్యాలి.

                                                      25-9-10

బార్లీ పిండి
యూసఫ్ గోల్
వెనిగర్ 

             అన్నింటిని కలిపి మెడ మీద నొప్పి వున్నచోట పట్టు వేస్తే నొప్పి తగ్గుతుంది.

                                    మెడ  పట్టేయ్యడం --నివారణ                            13-1-11.

    ఆవు నేతిని గోరువెచ్చగా చేసి మెడ  మీద పూయాలి. జిల్లేడు ఆకు మీద నెయ్యి పూసి వేడిచేసి
మెడ మీద కప్పి ఉంచాలి

                                         మెడనొప్పి----నివారణ                                  18-1-11.

 శరీరంలో ఇతర వ్యాధులు వున్నపుడు , శరీరంలో తగినంత పోషకాహారము, రక్తము లేనపుడు, వెన్ను పూసల  మధ్య మృదులాస్థి అరిగిపోయినపుడు, కండరాల నొప్పి వున్నపుడు మెడనొప్పి వచ్చే అవకాశం వున్నది ప్రయాణాలలో మెడను ఒక ప్రక్కకు వంచి పడుకోవడం, తలకింద దిండును చాలా ఎత్తుగా పెట్టుకోవడం , నిద్రలేమి  వలనకూడా మెడనొప్పి రావచ్చు.

 మెడ నొప్పి ని  నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం వలన నరం మీద ఒత్తిడి ఎక్కువగా వుంటే అటు వైపు సమస్య రావచ్చు.   సమన్వయ సంబంధం లోపించడం జరుగుతుంది. ఇది వాత ప్రకోప సమస్య.

మహా నారాయణ తైలం
మహా యోగరాజ తైలం
కర్పూర తైలం

     పై వానిలో ఏదో ఒక దానిని పై పూతకు వాడాలి.

వెల్లుల్లి ముద్ద              ---100 gr
వావిలి మొక్కను సమూలంగా ఎండబెట్టి దంచిన రక పొడి ---100 gr
నువ్వుల నూనె          ---200 gr లేదా తగినంత

    అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి తడి లేకుండా కాచాలి. చల్లారిన తరువాత వడపోసి భద్ర పరచుకోవాలి.

1. రాత్రి పడుకునే ముందు మెడ మీద తైలం తో మృదువుగా రాయాలి.

2. ఉదయం ఆహారం తరువాత పాలు తాగాలి

3. త్రికటుకాలను అన్నింటిని శుద్ధి చేసి దోరగా వేయించి దంచి జల్లించి  నిల్వ చేసుకోవాలి. అర టీ స్పూను చూర్ణాన్ని   ప్రతి రోజు తేనెతో గాని నీటితో గాని తీసుకోవాలి.

4. కౌంచ బీజాలను  నానబెట్టి తొక్క తీసి ఎండబెట్టి పొడి పట్టించి సమానంగా పంచదార కలిపి నిల్వ చేసుకోవాలి.

         దీనిని పాలలో కలుపుకుని తాగాలి.

                                              మెడ నొప్పి --- నివారణ                                     6-6-11.

తుమ్మి పూలు       
           ఆకులు
           బెరడు
           కాయలు
           బంక

     వీటిలో మూడు పదార్దాలున్నా సరిపోతాయి .
     అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని విడివిడిగా చూర్ణాలు  చేసి కలపాలి . దీనికి సమానంగా పటికబెల్లం కలిపి నిల్వ చేసుకోవాలి  

     ప్రతి రోజు ఒక టీ స్పూను పొడిని సేవిస్తూ వుంటే మెడనొప్పి ,  బట్టంటు రోగాలు నివారింప బడతాయి . ఇది దేహ దారుధ్యాన్ని పెంచుతుంది .

     మన్యస్తంభ  ముద్రను వెయ్యాలి .
     
                                                  ప్రమాదం జరిగే మెడ నొప్పిగా వుంటే                       26-8-11.

వావిలాకు దంచిన ముద్ద
ఆముదం
             రెండింటిని కలిపి వేడి చేసి   నొప్పి వున్న చోట   ఈ ముద్దను గోరువెచ్చగా వేసి కట్టు కట్టాలి . నొప్పి తగ్గుతుంది .