విషములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
విషములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

కీటకాలు కుడితే

                                                 కీటకాలు--సమస్యలు 
 
                                    కందిరీగ కుడితే                                                18-1-11.
 
       ఉత్తరేణిp ఆకు రసాన్ని  పూయాలి లేదా ఆకులను నూరి ముద్దగా పెట్టాలి . దొరకని  పక్షంలో ఉల్లిపాయను ుద్దగా నూరి గాయం మీద పెడితే తగ్గుతుంది.


                             కందిరీగ, తేనెటీగ కుడితే                                             20-1-11.
 
        వాటి ముల్లు శరీరంలో ఇరుక్కున్నపుడు    విపరీతమైన నొప్పి, వాపు, ఎరుపుదనం, ఉష్ణం
వుంటుంది. షాక్ కొట్టినట్లుగా అవుతుంది.

  నాడి, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
 
ఉప్పును పెనం మీద వేడి చేసి గుడ్డలో వేసి కాపడం పెట్టాలి.
 
తేనెటీగ కుడితే నిమ్మ రసం పూయాలి
 
కందిరీర కుడితే వెనిగర్ పూయాలి.

                                     తేనెటీగ కుట్టి ముఖం వాచితే నివారణకు                     11-6-11.

         తేనెటీగ కుట్టిన చోట ఉత్తరేణి ఆకును నూరి పెడితే మంట,  వాపు తగ్గుతాయి.
         ఉత్తరేణి ఆకుతో కుక్కకాటు,  తేలుకాటు, పాముకాటు కూడా నివారింపబడతాయి.

మర్రి వూడల కొనలు           ---- 100 gr
వేప చిగుల్ల కొనలు             ---- 100 gr
జమ్మి బెరడు చూర్ణం          ---- 100 gr

       అన్నింటిని కలిపి మెత్తగా,  గుజ్జుగా నూరి బలపాల లాగా చేసి ఎండబెట్టాలి.  బాగా ఎండిన
తరువాత భద్రపరచుకోవాలి.  గంధపు సాన మీద ఒక నీటిబొట్టు ను వేసి దీనితో చాది గంధం
తీసి  గాటు మీద పూయాలి.


కుక్కకాటు

                                              
                                                   కుక్కకాటు
                                               
                                  పిచ్చి కుక్క కాటుకు ప్రధమ చికిత్స                                      11-6-11.

            గాయాన్ని మొదట సబ్బుతో కడగాలి. తరువాత ఉత్తరేణి ఆకును బియ్యపు కడుగు నీటితో నూరి గాయం మీద వేసి కట్టు కట్టాలి.

కలుషిత ఆహారం

                                కలుషిత ఆహారం తిన్నపుడు                                                  6-11-10.

              వెంటనే కాకర ఆకుతో వంట చేసుకుని తినాలి లేదా కాకరాకు రసం తాగాలి.

పాముల బెడద

                                 పాముల బెడద ---నివారణ                         28-5-10.
ఆవాలు
వస
నవాసాగరం
       అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
       దీనిని ఇసుకలో కలిపి చల్లితే ఆ ప్రాంతాల్లోకి  పాములు రావు
.
       ఇంట్లో పాము దూరితే  ఒక మూకుడులో నిప్పులు తీసుకొని దానిలో ఈ పొడిని వేసి పాము వున్నా గదిలో ఉంచితే ఊపిరాడక పాము బయటకు రావడం గాని లేదా సొమ్మసిల్లి పడిపోవడం గాని జరుగుతుంది.

పాము కాటు



                                                   పాము కాటు                                       28-1-11.

త్రాచుపాము, నాగుపాము, కట్లపాము, రక్తపింజరి విషపూరితమైనవి.

                                                  ప్రధమ చికిత్స

  గాటు కు ఒక అడుగు పై భాగంలో తాడుతోగాని, గుడ్డ తోగాని గట్టిగా కట్టాలి. గాటు మీద X
ఆకారంలో గాటుపెట్టి రక్తాన్ని పిండాలి. ఆరోగ్యవంతమైన వాళ్ళ నోటితో రక్తాన్ని పీల్చాలి. గాలి
బాగా తగిలే విధంగా ఏర్పాట్లు చేయాలి. నడిపించ కూడదు. పైకి లేపి పట్టాలి. నురుగు కక్కడం
స్పృహ తప్పడం వంటివి జరుగు తుంటాయి. దీనికి రోగికి గాలి తగిలేట్లు చేయడం, నోట్లో నోరు పెట్టి
ఊదడం, నీటిని ముఖం మీద చిలకరించడం చేయాలి. ఫాన్ గాలి బాగా తగిలేట్లు ఏర్పాటు చేయాలి.

                                                     స్పృహ కోల్పోతే :--

1. ఉత్తరేణి ఆకులను దంచి నాలుగైదు చుక్కల రసాన్ని ఒక్కొక్క ముక్కు రంధ్రంలో వేయాలి.
నూరిన ఆకుల ముద్దను తినిపించాలి. గాటు మీద రసాన్ని పిండాలి. లేపనం లాగా పూయాలి.
వేప, నేల వేము, కారం తినిపించాలి. దీని వలన రోగికి చేదు, కారం తెలియక పోతే సమస్య
తీవ్రంగా వున్నదని అనుకోవాలి. దీనిని బట్టి ఎంత విషం ఎక్కినదో నిర్ణయించుకోవచ్చు.

2. అర స్పూను నీటిలో మూడు గ్రాముల వస పొడిని కలిపి మింగించాలి.

3. దూదిపాల (లేక) బండి గురివింద :- ఇది పాము శరీరం లాగా మచ్చలుకలిగి శరీరమంతా
     మెలికలు తిరిగి వుంటుంది.

దూదిపాల ఆకులు --- 5
మిరియాలు          ---10

               రెండింటిని కలిపి రోగి చేత నమిలించాలి.

దూది పాల చెట్లు వున్నచోట పాములు ఉండవని అంటారు.

పాములు కొన్ని ఘాటైన ప్రాంతాలకు రావు. వస పొడిని ఉంచితే పాములు రావు.

తేలు కాటు

           తేలుకాటుకు  తేలు విషహరిణి --కాశ్యప గుటికలు                              31-1-09.
 
                                   పటిక                        ------- 50 gr
                                   ఇంగువ                     ------- 50 gr
                                   ఉత్తరేణి ఆకుల రసం    ------- 50 gr
 
       పటిక, ఇంగువను కల్వంలో వేసి రసం పోస్తూ బాగా మెత్తగా, ముద్దగా నూరాలి. స్పూనుతో బాగా గీకి తియ్యాలి.  కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని రెండు చేతుల మధ్యలో పెట్టి కడ్డీల లాగా చుట్టాలి. వాటిని బాగా ఆరబెట్టి  సీసాలో భద్రపరచుకోవాలి.
 
     అవసరమైనపుడు దీనిని రాయి మీద ఆరగ దీసి తేలు కుట్టిన చోట గంధం లాగా పట్టు వెయ్యాలి.

                          తేలు, మండ్రగబ్బ కుడితే ---నివారణ                                    4-3-10.

1. కృష్ణతులసి వేరును నీటితో చాది గంధం తీసి దానిలో వెన్న కలిపి పట్టు వెయ్యాలి. 5, 10 నిమిషాలలో వెన్న నల్లగా మారిపోతుంది. గుడ్డతో తుడిచి మరలా గంధం, వెన్న కలిపి పూయాలి. ఈ విధంగా విషము యొక్క ప్రభావాన్ని బట్టి పట్టు వేస్తూ వుండాలి.  ఈ గంధాన్ని నాలుక మీద కూడా రాయాలి.

2. తుమ్మి, తులసి ఆకులు కలిపి దంచి రసం తీసి మూడు, నాలుగు స్పూన్లు తాగించాలి. బట్టలో కొంత రసం  తీసి గాయం పై పూయాలి.

                       తేలుకాటు  నొప్పి నివారణకు చిట్కా                                      24-12-10.
జిలకర
సైంధవ లవణం

     రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని నూరి నీటిలో కలుపుకొని తాగితే వెంటనే నొప్పి తగ్గుతుంది.

                                                     తేలుకాటు   ---  నివారణ                       22-6-11 .

లక్షణాలు :--- ఈ సమస్యలో మంట , నొప్పి ఎక్కువగా వుండి  పైకి పాకినట్లుగా వుంటుంది .

1. ఇంగువ ముక్కను నిమ్మరసం లో అరగదీసి పూయాలి  .
2. ఉల్లిపాయ రసాన్ని తెలు కుట్టిన చోట పోసి బెల్లం ముక్కను నోట్లో వేయాలి .
3. ఒక గ్రాము సైంధవ లవణాన్ని ఒక టీ స్పూను నేతిలో కలిపి తీసుకుంటే విషం హరించబడుతుంది .

ప్రధమ చికిత్స :---  నొప్పి పై ఐస్ గడ్డను ఉంచాలి . గాయాన్ని సబ్బు నీళ్ళతో కడగాలి . రుద్దకూడదు .
గుండె ఆగితే గుండె మీద నొక్కాలి . స్పృహ లో లేకుంటే నోట్లో నోరు పెట్టి నురుగును ఊదాలి

                                                             చిట్కా                                   2-7-11.
నిమ్మ గింజల చూర్ణం
సైంధవ లవణం

       రెండింటిని సమాన భాగాలుగా తీసుకొని కలపాలి . కొద్దిగా కడుపులోకి ,  కొద్దిగా నీటిని కలిపి లేపనం లాగా చేసి
గాయం మీద పోయాలి .




 

అన్ని రకాల విష సమస్యలు --- నివారణ

                          అన్ని రకాల విష సమస్యలు  --- నివారణ                          12-2-10.

      ఇది కుక్క కాటు, తేలుకాటు, కోతి, మనిషి, మొదలైన వాటి యొక్క విషపు గాట్లను నివారిస్తుంది.

మారేడు వేర్లు
పచ్చి తులసి గింజలు
కానుగ కాయలలోని పప్పు
దేవ దారు చెక్క
శొంటి
పిప్పళ్ళు
మిరియాలు
కరక్కాయల బెరడు
తానియాల బెరడు
 ఉసిరిక కాయల బెరడు
మంచి పసుపు
 మాని పసుపు

     అన్నింటిని సమాన భాగములు తీసుకొని ఏడు సార్లు వడపోసిన ఆవు మూత్రంలో 72  గంటల పాటు నానబెట్టి కల్వంలో వేసి నూరాలి. బాగా మెత్తగా నూరిన తరువాత కుంకుడు గింజలంత మాత్రలు కట్టి నీడలో ఆరబెట్టాలి.

      విషపు కాటుకు గురి అయినపుడు  ఒక మాత్రను గోరువెచ్చని నీటితో సేవించాలి. అవసరాన్నిబట్టి మూడు  పూటలా వాడవచ్చు.

      ఒక మాత్రను నూరి గాటుపై పూయాలి.

                                                              4-3-10

1.ప్రధమ చికిత్స:-కాటుకు పై భాగంలో గుడ్డతో గట్టిగా కట్టు కట్టాలి. కొత్త బ్లేడు తీసుకొని చాలా జాగ్రత్తగా గాయం మీద చివ్వాలి. నేల మీద గుంట తవ్వి కాలును  గాటు  వరకు పూడ్చి మట్టి బాగా పూడ్చాలి.  గుంట తవ్వి దానిలో మేక పెంటికలను దంచి మట్టి కలిపి గుంటలో పోసి కాలు పెట్టి పూడ్చాలి.

జల చికిత్శ;--  గాయం మీద పైపు తో నీటిని ధారగా పట్టాలి. దీని వలన విషం పైకి ఎక్కకుండా కిందకు దిగుతుంది.

    ఆవు మూత్రంలో పసుపు పొడి కలిపి తాగిస్తే ప్రాణాలు నిలువరించ వచ్చు. లేదా స్వమూత్రం లేదా 12,  13   సంవత్సరాల పిల్లల మూత్రం వాడవచ్చు.

    కృష్ణ తులసి వేరు చాడి గంధం తీసి నాలుకపై రాస్తే క్షణ మాత్రంలో విషం హరిస్తుంది.

     విష ప్రభావం వలన ముఖం నల్లగా మారడం, మచ్చలు ఏర్పడడం జరుగుతుంటాయి.
 కృష్ణతులసి వేరు యొక్కగంధాన్ని గాట్లపై, మచ్చలపై పెడితే  మాని పోతాయి.

     సాన రాయి మీద తులసి రసం వేసి దానిలో మేలైన ఇంగువ ముక్కను చాడి గంధం తీసి గాయం మీద పెడితే   వెంటనే విషం హరింప బడుతుంది.

                                 విషపూరితమైన  ఆహారాన్ని తీసుకున్నపుడు వాంతి చేయించే విధానము     27-6-11.

             ఆవాల పొడిని నీటిలో కలిపి తాగిస్తే వెంటనే వాంతులు అవుతాయి

                                                               7-8-11.

           పాము , తెలు , బల్లి , ఎలుక మరియు ఏదైనా విషపు పురుగు కుట్టి వాపుగా వున్నపుడు తగ్గడానికి  ఇది
ఉపయోగపడుతుంది .

మారేడు ఆకు
లేత వేపాకు
 జమ్మి చెట్టు బెరడు

          అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కల్వంలో వేసి తగినంత నీరు కలిపి  మెత్తగా నూరాలి . దీనిని వాపు మీద
పట్టు వెయ్యాలి .   దీని వలన వాపు , నొప్పి , మంట నివారింపబడతాయి












ఎలుకల బెడద

                                                    ఎలుకల మందు
మినుములు
నువ్వులు
 
     రెండింటిని జిల్లేడు పాలతో మెత్తగా నూరి ఆగంధాన్ని  జిల్లేడు  ఆకులకు   దట్టించి  ఎలుకలు వున్నచోట    ఉంచితే ఎలుకలు పారిపోతాయి.