గుండె లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గుండె లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

అల్ప రక్త పోటు

                                   అల్ప రక్త పోటు --నివారణ                                        9-2-09 .

    అల్ప రక్త పోటు లక్షణాలు :--

ముఖం మీద తిత్తులు ఏర్పడతాయి. శరీరానికి అవసరమైనంత ఆహారం తీసుకోక పోవడం వలన రక్తం, మాంసం, క్రొవ్వు తగ్గి పోతాయి. జుట్టు వూడి పోతుంది. కళ్ళు గుంటలుగా అవుతాయి , రాత్రి నిద్ర వుండదు . పనికి మాలిన ఆలోచనలు ఆత్మన్యూనతా భావం ఏర్పడడం వుంటాయి.

 యోగాసనం :-- చిన్ముద్ర(పద్మాసనం)   లో కూర్చొని (సులభ భస్త్రిక )  పొట్ట కదలకుండా ఊపిరి నిదానంగా,  నిండుగా తీసుకొని వెంట వెంటనే వదలాలి.
సూర్య భేదన ప్రాణాయామం :--   కుడి చేతి మధ్య, ఉంగరపు వేళ్ళతో ఎడమ ముక్కు మూసి కుడి ముక్కుతో గాలిని పీల్చి, బొటన వేలుతో కుడి ముక్కు మూసి, ఎడమ ముక్కుతో గాలి వదలాలి.  గాలి పీల్చిన 4,5 సెకండ్ల  తరువాత గాలిని వదలాలి.
ఆహారం :-- అల్ప రక్త పోటు వున్న వాళ్ళు దిగాలుగా, నీరసంగా వుంటారు. జతరాగ్ని తక్కువగా వుంటుంది.
                                   అల్లం రసం             ---- ఒక టీ స్పూను
                                   నిమ్మ రసం            ---- ఒక టీ స్పూను
                                      తేనె                    -----ఒక టీ స్పూను
     మూడు కలిపి ఆహారానికి గంట ముందు ఉదయం, రాత్రి నాలుకతో అడ్డుకొని చప్పరించి తినాలి. దీనితో బాగా తీవ్రంగా ఆకలి అవుతుంది.  దీనిని బలహీనంగా వున్న పిల్లలకు కూడా యివ్వ వచ్చు (30 రోజులు)
     పైన చెప్పిన విధంగా చేస్తూ 20  ఎండు ద్రాక్ష పండ్లు, ఒక ఎండు ఖర్జూరం, రెండు అంజూర పండ్లు కడిగి ప్రతి రోజు రాత్రి పూట నీటిలో వేసి ఉదయం ఒక్కొక్క పండును బాగా నమిలి తిని మిగిలిన నీళ్ళు తాగాలి.
ఇది చేసిన తరువాత ఒక గంట వరకు ఏమి తినకూడదు . సాయంత్రం 5 చిన్న టొమాటోలు, ఒక కారెట్,  పది గ్రాముల బీట్రూట్ ముక్కను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి తేనె గాని, కలకండ గానిచల్లి తింటూ వుంటే బాగా రక్త వృద్ధి జరుగుతుంది. సులభంగా అరిగే పదార్ధాలను తినాలి.
            అల్ప రక్తపోటు -- మానసిక వ్యాధుల వలన వచ్చే గుండె జబ్బులు -- నివారణ   18-2-09.
    సహకార దృక్పధం తో మనలేక పోవడం; కామ, క్రోధ, లోభ, మోహ, మద,, మాత్సర్యాలతో నలిగి
పోవడం వలన నిద్ర పట్టదు,ఆహారం జీర్ణం కాదు, శరీరంలో రక్తం తగ్గి పోతూ అల్పరక్తపోటు ఏర్పడుతుంది.
యోగాసనం :-- కాంతి లేని(గాలి లేని) గదిలో ప్రమిద గాని, కొవ్వొత్తి గాని వెలిగించాలి. ఒత్తి నిశ్చలంగా ఉండేట్లు చూసుకోవాలి. పద్మాసనం వేసుకొని చిరుముద్రలో కూర్చొని తదేకంగా ఆ కాంతిని చూడ గలిగినంత సేపు చూడాలి.ఈ విధంగా ప్రతి రోజు సాధన చేస్తే మానసిక రుగ్మతలు తొలగిపోయి మానసిక ఆనందం కలుగుతుంది.
                         "దీపం జ్యోతి పరబ్రహ్మ"     "సాధనమున పనులు సమకూరు ధరలోన"
శాంతి శయనాసనం:--  ఉదయం, సాయంత్రం ఓంకారాన్ని మాత్రమే జపించాలి. పడుకొని కూడా చెయ్యవచ్చు.
పద్మాసనం లో కూర్చొని, ప్రశాంతంగా కూర్చొని ఓంకారాన్ని పలకాలి.(ఆనందో బ్రహ్మ అన్ని ఆలోచనలను వదిలేసి ఓంకారం పలకాలి. ఆ తరువాత పడుకొని చేతులు, కాళ్ళు పూర్తిగా చాపి గాలిని పీలుస్తూ వదులుతూ  వుండాలి. శ్వాస మీద ఏకాగ్రత ఉంచాలి. పూరకం, కుంభకం, రేచకం చెయ్యాలి కళ్ళు మూసుకొని చెయ్యాలి.)
 దీని వలన అల్పరక్తపోటు నియంత్రణ లో వుంటుంది.
ఆహారం:--  
     నాటు ఆవు పాలు లేదా నాటు గేదె పాలు లేదా మేక పాలు ఒక అర గ్లాసు తీసుకొని దానిలో 10 నుండి 15   నల్లని ఎండు కిస్మిస్ పండ్లను నలగగొట్టి వెయ్యాలి, మరియు ఒక టీ స్పూను కలకండ ను వేసి స్టవ్ మీద పెట్టి  రెండు, మూడు పొంగులు రానివ్వాలి.  దించి ఆ పండ్లు తిని పాలు కొంచం కొంచంగా తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు రాత్రి పూట 40 రోజులు చేస్త్జే గుండె జబ్బులు అద్భుతంగా నివారింప బడతాయి.  మరియు గుండె దృడంగా  తయారవుతుంది. పెద్ద పెద్ద శబ్దాలను వినడం వలన, తగాదాల శబ్డాలు వినడం వలన గుండె వేగగా కొట్టుకుంటూ control  కాకుండా వుంటే  పైన చెప్పిన విధంగా పాలు తాగుతూ వుంటే గుండె బలహీనత తగ్గి దృఢ పడుతుంది.
                                అల్ప రక్తపోటు -- నివారణ                                                   6-12-10.

జటామాంసి వేరు చూర్ణం                       --- ఒక టీ స్పూను
పచ్చ కర్పూరం                                  ---- చిటికెడు
దాల్చిన చెక్క పొడి                            ----  చిటికెడు
తేనె                                                 ----- తగినంత

         అన్నింటిని కలిపి తీసుకుంటే రక్తపోటు మామూలు స్థితికి వస్తుంది.

                                                                                                                                                         












రక్తపోటు

                            రక్తపోటు నివారణకు --పానీయం                       3-1-09.
 
                         అల్లం రసం           ------- 2 టీ స్పూన్లు
                         ధనియాల రసం    ------- "       ""
                         నిమ్మ రసం          -------  "       "
                            నీళ్ళు             -------   ఒక గ్లాసు
 
              అన్నింటిని కలిపి ఒక పానీయం తయారు చెయ్యాలి.
 
             ప్రతి రోజు ఆహారానికి ఒక గంట ముందు దీనిని తాగితే  ఆకలి పుడుతుంది,సుఖ విరేచనమవుతుంది,
చర్మం పై మంటలు, చేతుల్లో చెమట,తల తిరగడం,అతి వాగుడు, అవతలి వాళ్ళను చిన్న చూపు చూడడం తగ్గి పోతాయి.

                                               చిట్కా                                     31-12-10.

                   B . P. రోగులు తల స్నానం చేసేటపుడు తలకు నువ్వుల నూనెను మర్దన చేసుకుని తల స్నానం చెయ్యాలి. దీనితో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.

                                                  రక్తపోటు ---నివారణ                                                16-6-11.

                  చెడు పదార్ధాలు రక్తనాళాలలో చేరడం వలన అవి గట్టిపడి రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వలన
ఈ సమస్య  ఏర్పడుతుంది . 

తియ్యని పెరుగు                 --- అరకప్పు
వెల్లుల్లి పాయలు                --- రెండు లేక మూడు

       వెల్లుల్లి పాయలను పెరుగులో నానబెట్టి తినాలి . దీని వలన B . P కంట్రోల్ లో వుంటుంది

       కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, తులసి, జిలకర లను సమాన భాగాలుగా తీసుకొని ఎండబెట్టి పొడి చేసి
కలిపి నిల్వ చెసుకొవాలి. 

       ప్రతిరోజు ఒక టీ స్పూను పొడి తిని నీళ్ళు తాగాలి .

                                                          రక్తపోటు   --- నివారణ                                    14-7-11.

 1    రాత్రి వేళ   ఒక స్పూను మెంతులను  ఒక గ్లాసు  నీటిలో నానబెట్టి , ఉదయం వడకట్టి  పరగడుపున ఆ నీటిని తాగాలి
ఈ విధంగా వారం రోజులు తాగితే బి . పీ  కంట్రోల్ అవుతుంది

2. సొరకాయ రసం తాగితే ఎంతో ఎక్కువగా వున్న B .P  కూడా బాగా తగ్గుతుంది .
 విధానం  సొరకాయ ముక్కను చెక్కు తియ్యకుండా ముక్కలు గా తరిగి అరలీటరు నీళ్ళు పోసి కుక్కర్ లో వేసి ఒక విజిల్ 
రానిచి దించాలి వ్హల్లారిన తరువాత వడకట్టి తాగాలి .ఈ విధంగా రోజుకొకసారి చొప్పున  ఆహారానికి గంట ముందు  3 , 4 రోజులు తాగితే ఎంతో పై స్థాయి లో వున్న B . P .  కూడా నియంత్రించబడుతుంది .

     దీనితోబాటు త్రిఫల చూర్ణం కూడా వాడాలి .

                                                                
                                                                రక్తపోటు                                            4-9-11

    మానసిక ఆందోళన , శరీరం లో కొవ్వు చేరడం  వలన రక్తపోటు సమస్య వస్తుంది . ఇది పక్షవాతం , గుండె జబ్బులకు
దారి తీస్తుంది .  దీని వలన అధిక చెమట , తలతిరగడం , అధిక ఆవేశం ,  జుట్టు  ఊడి పోవడం వంటి సమస్యలే కాక
చిరాకు , జుట్టు పీక్కోవడం , నీరసం వంటి చిన్న సమస్యలు కూడా ఏర్పడతాయి .

                                                             అల్ప రక్తపోటు

    గోరువెచ్చని నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేయాలి . రెండు చెవుల్లో రెండేసి చుక్కల చొప్పున వేసుకోవాలి .
మర్దన వలన రక్త ప్రసరణ మెరుగు పడుతుంది . ఒక గంట ఆగి తల స్నానం చేయాలి .  సమస్య వున్నా వ్యక్తిని బోర్లా
పడుకోబెట్టి నూలు గుడ్డ ను మడత బెట్టి  గోరువెచ్చని నీటిలో ముంచి వెన్ను పూస పొడవునా పరచాలి  మెడ  దగ్గర
నుండి నడుము వరకు పరచాలి . పది , పదిహేను నిమిషాలు ఉంచితే చాలు .వెంటనే అల్ప రక్తపోటు  అదుపులోకి
వస్తుంది .



                                                      
     
         




:--

గుండె

                                                 గుండె జబ్బులకు
                                 
      సూర్య స్థానం (కుడిచెయ్యి ),చంద్ర స్థానం (ఎడమ చెయ్యి),చిటికెన వ్రేలి కణుపు దగ్గర  (అర చేతి వైపు ) ఒత్తిడి కలిగించాలి.దానికి కొంచం కిందగా కూడా ఒత్తిడి కలిగించాలి
 
ఆహారం :--   వెల్లుల్లిని సన్నని ముక్కలుగా చేసి ఆవు నేతిలో వేయించి అన్నంలో కలిపి తినాలి.
 
దానిమ్మ పండు ను ప్రతి రోజు రాత్రి  పడుకునే ముందు ఒకటి చొప్పున 40 తినాలి.పండు ద్రాక్ష
గాని ,ఎండుద్రాక్ష గాని రసం త్రాగవచ్చు.ఉసిరి పొడిలోకలకండ కలుపుకొని తాగాలి.
 
                     గుండెకు సంబంధించిన సమస్యలు --- నివారణ                                16-2-09.
 
      గుండె    అనాహత చక్రంలో బంధింపబడి వున్నది. గుండె, ఊపిరితిత్తులు వాయువుకు సంబంధించినవి.
అతి చల్లని పదార్ధాలను, అతి వేడి పదార్ధాలను  పులుపు,వగరు,చేదు ఎక్కువగా వున్నపదార్ధాలను వాడడం  వలన గుండెకు హాని కలుగుతుంది.
 
      ముందు తిన్న ఆహారం జీర్ణం కాకపోయినా తినడం,  సుఖ విరేచనం కాకపోయినా పొట్ట నింపడం వలన గుండెకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి.  ముఖ్యంగా ఆహారం జీర్ణం కానపుడు వాయువులు పైకొచ్చి గుండె పట్టినట్లు అవుతుంది.
 
1. ఒక గ్లాసు నీటిలో రెండు, మూడు స్పూన్ల ఉప్పు కలిపి తాగి వాంతి చేసుకోవాలి.
 
2. పొట్ట పైన మట్టి పట్టి వేసుకొని దుప్పటి కప్పుకోవాలి.
 
3. శీత్కారి ప్రాణాయామం చెయ్యాలి.
 
ఆహార నియమాలు:-- గుండె జబ్బులు రాకుండా ఉండాలన్న, వచ్చి వున్న కొన్ని ఆహార నియమాలు పాటించాలి
 
1. కింద కూర్చొని భోజనం చెయ్యాలి.
 
2. బాగా వేడిగా వున్న పదార్ధాలను, బాగా చల్లారిన పదార్ధాలను ఆహారంగా భుజించ రాదు.నిల్వ ఆహారం తిన కూడదు.
 
3. కొత్త బియ్యం కొంప ముంచుతాయి.కొత్త చింత పండు పనికి రాదు. చింతపండు ఎక్కువగా వాడకూడదు. మామిడి ఎక్కువగా వాడుకోవచ్చు.
 
4. ఎండిన ఉసిరిక ముక్కలు మంచివి.
 
5. ఉప్పుకు బదులుగా సైంధవ లవణం వాడితే మంచిది.
 
6. చేదు,వగరు ఎక్కువగా వున్న పచ్చి కాయలు వాడకూడదు.కాకరలో పాతబెల్లం వాడుకోవచ్చు.
 
ఆహారం:--  1. దోరగా వేయించిన మంచి శనగలను 20 ను నది 40 గ్రాములు పొట్ట ఖాళీగా వున్నప్పుడు ఒక్కొక్కటిగా నోట్లో వేసుకొని నమలాలి.ఈ విధంగా తింటూ వుంటే గుండె జబ్బులు రావు.
 
2 శనగలు వేయించి పిండి చేసి పెరుగులో కలిపి ఉల్లిపాయలు కలిపి తింటే మంచిది (శనగ పులుసు కూర).

                              గుండె సంబంధ సమస్యలు -- నివారణ                             19-2-09.
 
        అతి కామ ప్రకోపం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశాలున్నాయి.దీనిని కంట్రోల్ చెయ్యాలి.
బుద్ధాసనం:--  పద్మాసనం లో కూర్చోవాలి. మడమలు మర్మాంగానికి దగ్గరగా వుండాలి. గాలిని పీల్చి ఆపి వదలాలి. దీని వలన అతి కామాతురత తగ్గి పోతుంది. ఈ ఆసనం లో రెండు అర చేతులను ఒక దానిమీద  మరొకటి వేసుకొని  చేతులను మడమల మీద పెట్టుకొని కూర్చోవాలి.
 
ఆహారం:--   ప్రతి రోజు రాత్రి పూట ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని దానిలో 20 లేక 30 శనగలను మరియు 5 లేక 6   కిస్మిస్ పండ్లను వేసి మూత పెట్టాలి.

ఉదయం నిద్ర లేచిన తరువాత తూర్పుకు తిరిగి కూర్చొని శనగలను , కిస్మిస్ పండ్లను ఒక్కొక్కటిగా నెమ్మదిగా నమిలి తినాలి, నీళ్ళు తాగాలి. ఇది తిన్న తరువాత గంట వరకు ఏమి తినకూడదు. దీని వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తంలో ఉధృతి తగ్గి రక్తపోటు అదుపులో వుంటుంది.

                               అజీర్ణము వలన వచ్చే గుండె జబ్బులు --నివారణ                  20-2-09.
 
       మలము సరైన సమయంలో బయటకు వెళ్లకపోతే అపాన వాయువులు ఊర్ధ్వ ముఖముగా వెళ్లి సమస్యలు  ఏర్పడతాయి.
 
1. ఉత్దాన పాదాసనం:-- వెల్లికిలా పడుకొని కాళ్ళు పూర్తిగా కాళ్ళు చాపాలి. ఒక కాలును కొంతవరకు(60 డిగ్రీలు)
లేపాలి. ఉంచగాలిగినంత సేపు అలాగే వుంచి మెల్లగా కాలును దించాలి.దీనిని గాలి పీలుస్తూ కాలును పైకేత్తాలి
గాలిని వదులుతూ దించాలి. అలాగే రెండవ వైపు కూడా చెయ్యాలి. లేదా రెండు కాళ్ళు ఒకేసారికూడా ఎత్తవచ్చు
 
దీని వలన వాయువులు కిందికి దిగుతాయి.
 
2.  పవనముక్తాసనం:--
3.  ఉడ్యానబంధము:--
 
                              మలబద్దకము లేకుండా తీసుకోవలసిన ఆహారము
 
       శరీర స్థితిని బట్టి వాళ్లకు జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
 
       రాత్రి నిద్రించే ముందు 200 గ్రాముల నల్ల ద్రాక్ష ను కడిగి గిన్నెలో వేసి నీళ్ళు పోసి, పొద్దున్న వాటిని పిసికి  గింజలు,తొక్కలు తీసి పరగడుపున తాగాలి. దీని వలన సుఖవిరేచనము అవుతుంది.

                                గుండె సంబంధిత సమస్యలు --నివారణ                              24-2-09.

      వాత, పిత్త, కఫములు ఎక్కువైనపుడు ఇవి సంభవిస్తాయి.

1. పాదహస్తాసనం  2. కటిచాక్రాసనం  3. అర్ధచంద్రాసనం  వెయ్యాలి.

ఆహారనియమాలు:--
     త్రిదోషాలకు త్రిఫలాలను తీసుకుంటే శరీరంలో ధాతువులన్ని నియంత్రణ లో వుంటాయి. (balanced గా )

                                  కరక్కాయల పొడి              -----    100 gr
                                 తానికాయల  పొడి              -----    200 gr
                                  ఉసిరికాయల పొడి             -----    400 gr

     వీటిని 1:2:4 నిష్పత్తిలో గాని  సమాన నిష్పత్తిలో గాని వాడుకోవచ్చు

    ఈ మూడింటిని విడివిడిగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసి వేయించి, దంచి పొడి చెయ్యాలి. అన్నింటిని అన్నింటిని   కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.

వాదేవిధానం:-- 

1. వాత శరీరం వున్నా వాళ్ళు పావు టీ స్పూను తో ప్రారంభించి పావు గ్లాసు నీళ్ళలో కలుపుకొని తాగాలి.
కొంచం లావుగా వున్న వాళ్ళు ముప్పావు స్పూను పొడిని ముప్పావు గ్లాసు నీటిలో కలుపుకొని తాగాలి.ఇంకా లావుగా వున్న వాళ్ళు ఒక టీ స్పూను పొడిని ఒక గ్లాసు నీటిలో కలుపుకొని తాగాలి.

2. పైత్య శరీరం వున్న వాళ్ళు పైన చెప్పబడిన మోతాదులో మజ్జిగతో వాడాలి.

3. కఫ శరీరం వున్నవాళ్ళు అదే మోతాదులో తేనెతో వాడాలి.

        పావు టీ స్పూను పొడి             ముప్పావు టీ స్పూను పొడి             ఒక టీ స్పూను పొడి
        పావు గ్లాసు నీళ్ళు                  ముప్పావు గ్లాసు నీళ్ళు                   ఒక గ్లాసు నీళ్ళు

              వాతం వలన కలిగే గుండె జబ్బులు --నివారణ                                          25-2-09.

లక్షణాలు:--  గుండెల్లో సూదులు గుచ్చినట్లు గా వుంటుంది. 

వ్యాయామం:-- ముందు చాతీ మీద గోరు వెచ్చని తైలం(ఓమ లేక ఏరండతైలం) పూసి ఉప్పు తో నెమ్మదిగా కాపడం పెట్టాలి.

వ్యాయామం :-- హృదయ ముద్ర :--

       చిటికెన వేలును కిందకు దించి, చూపుడు వేలును మడవాలి.బొటన వేలు
మధ్యవేలు,ఉంగరపు వేలు కలిపి పట్టుకోవాలి.  ఈ విధంగా ముద్ర వేసుకోవాలి
2 అనులోమ, విలోమ ప్రాణాయామం లు చెయ్యాలి. 3. వేగ భస్త్రిక  వ్యాయామాలను చెయ్యాలి.
ఆహారం:--
                                     వాము                     -------  100 gr 
                                     శొంటి                      -------  100 gr
                                     పిప్పళ్ళు                 -------  100 gr
                                     వస కొమ్ములు          -------  100 gr
                                     ఇంగువ                   -------  100 gr
                                     సైంధవ లవణం         -------- 100 gr
                                     సౌవర్చ లవణం         -------- 100 gr
                                     యవాక్షారం              -------- 100 gr

     వాము, శొంటి, పిప్పళ్ళను విడివిడిగా దోరగా వేయించి విడివిడిగా పొడులను చేయాలి.  వస కొమ్ములను ఒక  రోజంతా నానబెట్టి తీసి తుడిచి నలగగొట్టి బాగా  ఎండబెట్టి దంచి పొడి చెయ్యాలి.  ఇంగువను గరిటలో పెట్టి పొంగించాలి.  సైంధవ, సౌవర్చ, యవాక్షారాలను విడివిడిగా పొడి చెయ్యాలి.

     అన్ని పదార్ధాల చూర్ణాలను కలిపి సీసాలో భద్ర పరచాలి.
  
     ఉదయం, సాయంత్రం పావు టీ స్పూను పొడిని ఒక కప్పు ఉలవకట్టు లో గాని, లేదా నీటిలో గాని కలుపుకొని తాగాలి.

                 గుండె జబ్బుల నివారణకు  అర్జున టీ                                            9-3-09.

      పద్మాసనం లో చిన్ముద్ర వేసుకొని నిటారుగా పది నిమిషాలు కూర్చోవాలి.

      తెల్ల మద్ది చెట్టు బెరడు తెచ్చి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి గాలి తగిలే చోట ఆరబెట్టి దంచి  జల్లించి  పొడి చేసుకోవాలి. బెరడును కడిగిన తరువాత ఒక రోజు ఎండలో పెట్టవచ్చు.

    ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను పొడి వేసి ఒక కప్పు కషాయం వచ్చే వరకు మరిగించి దానిలో ఆవుపాలు,కలకండ కలుపుకొని టీ లాగా తాగాలి.

                        గుండె జబ్బుల నివారణ                                                10-3-09.

          కరక్కాయలను, శొంటి, పిప్పళ్లను, సన్న రాష్ట్రాన్ని కొద్దిగా నేతి చుక్కలు వేసి దోరగా వేయించాలి.
వసను 24 గంటలు నానబెట్టి, తీసి చిన్న ముక్కలుగా నలగ గొట్టి బాగా ఎండబెట్టి దంచి పోదిచేయ్యాలి.  
 
                                                   కరక్కాయల బెరడు            ----100 gr
                                                   శొంటి                              ---- 100 gr
                                                   పిప్పళ్ళు                         ---- 100 gr
                                                   గంధ కచ్చూరాలు              ---- 100 gr
                                                   సన్న రాష్ట్రము                 ---- 100 gr
                                                   వస                                 ---- 100 gr
                                                   పుష్కర మూలం లేదా చెంగల్వ కోష్టు     ---- 100 gr

          అన్నింటి పొడులను కలిపి గాజు సీసాలో భద్ర పరచాలి.

          ఇది అన్ని రకాల వాత, పిత్త, కఫ సంబంధ గుండె జబ్బులు నివారింప బడతాయి.

          ఈ చూర్ణం ఉదయం, రాత్రి ఆహారానికి అర గంట ముందు పావు లేక అర టీ స్పూను నీటిలో కలిపి సేవించాలి.

        గుండె జబ్బుల నివారణకు    భావ మిశ్ర పానీయం                  13-3-09. 

   తీసుకోవలసిన జాగ్రత్తలు :--  గుండె జబ్బులున్న వాళ్ళు అతి పుల్లని పదార్ధాలను, వగరు పదార్ధాలను వాడరాదు. పుల్లని పెరుగు వాడ కూడదు. తాజా పెరుగుతో చేసిన మజ్జిగను లేదా మజ్జిగ చారు వాడవచ్చు. ఆవకాయ తినకూడదు.

                                                అమృత ఫల రసం (ఆపిల్ జూస్)

    ఆపిల్స్ ను బాగా కడిగి కొంత చెక్కు తీసి లోపల ఉన్న గింజల చుట్టూ వున్న భాగం తొలగించి మిక్సి లో వేసి రసం తయారు చెయ్యాలి. గాజర్ గడ్డలు(కారెట్) కూడా అదే విధంగా రసం తీయాలి.

                                       ఆపిల్ జూస్            --- ఒక కిలో
                                       కారెట్ జూస్            --- అర కిలో
                                       పటికబెల్లం             --- 300 gr

   అన్నింటిని ఒక పాత్రలో పోసి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద మరిగించాలి. నీటి శాతం తగ్గి లేత పాకం రాగానే దించాలి. దీనిని నిల్వ చేసుకోవాలి.

    దీనిని ఉదయం, సాయంత్రం వాడాలి.

                                     చిన్న పిల్లలకు               ---- అర స్పూను
                                     పెద్ద పిల్లలకు                 ---- ఒక స్పూను
                                     పెద్దలకు                        ---- రెండు స్పూన్లు

    ఒక గ్లాసు నీటిలో కలుపుకొని తాగాలి.

    దీని వలన గుండె దడ, గుండె కు సంబంధించిన ఇతర వ్యాధులు నివారింపబడతాయి.
    ఆహారానికి గంట ముందు ఒక గ్లాసు జూస్ తాగితే గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.

                   గుండె జబ్బుల నివారణ                                                                16-3-09.

    ఎడమ చిటికెన వ్రేలి బుడిపెను కుడి బొటన వ్రేలు చూపుడు వ్రేలుతో రెండు నిమిషాలు నొక్కి పెట్టాలి. ఇదే విధంగా కుడి చేతికి కూడా చేయాలి.

    పెద్ద వాళ్ళు ప్రతి రోజు కొబ్బరి పచ్చడి వాడాలి. రోజు కాకున్నా రోజు మార్చి రోజైనా తినాలి. చిన్న పిల్లలకు కొబ్బరి బర్ఫీలు చేసి తినిపించాలి. ఒక వెల్లుల్లి పాయను సన్న ముక్కలుగా కట్ చేసి ఆవు నేతిలో కొద్దిగా వేయించి అన్నం లో కలిపి పిల్లలకు తినిపించాలి.

     అంజీర, అక్రోటు, ఎండు ద్రాక్ష, నల్లద్రాక్ష లు వాడాలి.

       బహిష్టు సమస్యల వలన వచ్చే గుండె జబ్బుల నివారణ                                  25-6-09.

          దీనికి ప్రాణాయామం చాలా ముఖ్యమైనది. అందులో భస్త్రిక ప్రాణాయామం మరీ చాలా ముఖ్యమైనది.

1.ముద్ర వేసుకొని కూర్చొని, దీర్ఘంగా గాలి పీల్చి దీర్ఘంగా వదలాలి. 2. వేగంగా గాలిని పీల్చి వేగంగా, దీర్ఘంగా వదలాలి.  ఒక్కొక్కటి 6 సార్లు గాని, 12 సార్లు గాని, 18 లేదా 24 సార్లు చెయ్యాలి.

కపాల భాతి ప్రాణాయామం :-- నాభి దగ్గర నుండి గాలిని లాగి వేగంగా బయటకు కొట్టాలి.

        బహిష్టు లో జరిగే అవకతవకల వలన కాలేయము, ప్లీహము బలహీనపడి దాని వలన రక్తపోటు వస్తుంది.      గుండె బలహీన పడుతుంది.

తినదగిన ఆహార పదార్ధాలు:-- పెసరకట్టు, ఉలవకట్టు, యవలకట్టు(అన్ని వ్యాధులకు పనిచేస్తుంది), కాకర, పొట్ల,గుమ్మడి, లేత ముల్లంగి తీపి దానిమ్మ, తియ్యని మామిడి, నల్లని ఎండు కిస్మిస్, నల్లని పండు ద్రాక్ష  మొదలైనవి

తినకూడనివి:-- నూనె పనికి రాదు, చాలా తక్కువగా వాడాలి. వంటాముదం, ఆవు నెయ్యి కలిపి వంటలలో  వాడితే చాలా శ్రేష్ఠము.

     వగరు, చేదు, పుల్లని పదార్ధాలు పనికి రావు.

     మానసిక ఆవేదనను వదలాలి.  బహిష్టు సమస్య వున్నవాళ్ళు తల బాదుకోవడం, ఏడవడం, కొట్టుకోవడం   చేస్తుంటారు .వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలి.

     తెల్ల మద్ది చెక్క (అర్జున) ను (బెరడు) తెచ్చి కడిగి ముక్కలుగా కొట్టి ఎండబెట్టి దంచి పొడి చేసి నిల్వ చేసుకోవాలి .

     మూడు వేళ్ళకు వచ్చినంత పొడిని ఒక టీ స్పూను ఆవునేతి తో గాని, ఆవు పాలతో గాని లేదా కరిగించిన  పాతబెల్లంతో గాని సేవించ వలెను.

     ఓంకార శబ్దం చెయ్యాలి.తూర్పుకు ఎదురుగా కూర్చొని (పెద్ద వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు) మనసును అంతర్భాగం లో వున్న హృదయం మీద లగ్నం చేసి "యం" అని ఉచ్చరించాలి.

     కుడి చేతిని కుడి మోకాలి మీద పెట్టి చిటికెన వేలి కింది భాగంలో అర  చేతి వైపు నొక్కాలి.  అదే విధంగా  రెండవ చేతికి కూడా చెయ్యాలి.

            గుండె దడ నివారణకు పానీయం                                                    1-8-09.

నీళ్ళు                ---- ఒక కప్పు
పుదీనా             ---- 5 gr
మిరియాలు       ---- అర పావు టీ స్పూను
కలకండ            ---- అర టీ స్పూను లేదా తాటిబెల్లం

   నీళ్ళు స్టవ్ మీద పెట్టి పుదీనాను నీళ్ళలో వెయ్యాలి. తరువాత  మిరియాల పొడి వేసి సగానికి రానివ్వాలి.

వడపోసి గోరువెచ్చగా అయిన తరువాత అర టీ స్పూను కలకండ కలుపుకొని తాగాలి.

   ఈ సమస్య వున్నవాళ్ళు ఏదో ఒక నిమ్మపండు రసం, ఉసిరి ఆహారంలో ఏదో ఒక రూపంలో వుండాలి.

ఒక పచ్చి ఉల్లిగడ్డ, వెల్లుల్లి కూడా తినాలి.

   ఆహారంలో త్వరగా జీర్ణమయ్యే పదార్ధాలను తినాలి. అతి చల్లని, అతి వేడి పదార్ధాలు పనికి రావు.
ప్రాణాయామం:-- కుడి ముక్కు మూసి ఎడమ ముక్కుతో దీర్ఘంగా గాలిని పీల్చాలి. కుడి ముక్కుతో గాలిని వదలాలి.  మల్లి కుడి ముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో వదలాలి.  ఇది ఒక ఆవృతం . ఈ విధంగా పన్నెండు   ఆవృతాలు చెయ్యాలి. ఉదయం, సాయంత్రం ఈ విధంగా చెయ్యడం ఎంతో ఆరోగ్యకరం.

గుండెను శక్తివంతంగా చెయ్యడానికి 

పాలు                      ---- అర గ్లాసు
నల్లని ఎండు ద్రాక్ష      --- పది (చిన్న పిల్లలకు ఐదు)

      ద్రాక్షను ముక్కలుగా చేసి పాలల్లో వేసి స్టవ్ మీద పెట్టి మూడు పొంగులు పొంగించాలి. షుగర్ లేని వాళ్ళు కలకండ కలుపుకోవచ్చు. పాలు త్రాగే ముందు ఉడికిన పండ్లను తినాలి. కేవలం ఇరవై నుండి నలభై  రోజులలో గుండెకు ఎంతో శక్తి వస్తుంది. సాఫీగా విరేచనమవుతుంది. గుండెకు, కాలేయానికి, ప్లీహానికి శక్తి వస్తుంది.

    ఉదయం పరగడుపున గాని, రాత్రి నిద్రించే ముందు గాని సాయంకాలం గాని వాడుకోవచ్చు.

    ఎక్కువ సేపు శ్రమిస్తే ఆయాస పడే వాళ్లకు ఇది ఎంతో బలాన్నిస్తుంది.

         గుండెల్లో మంట --- పైత్య హృదయ రోగాలు                                      3-9-09.

     మోకాళ్ళఫై కూర్చొని ఎడమ ముక్కునుండి మాత్రమే గాలిని పీల్చి కుడి ముక్కుద్వారా గాలిని వదలాలి.

శీతలి  ప్రాణాయామం:-- అలాగే కూర్చొని నాలుకను దొన్నె లాగా మడిచి గాలిని బాగా పీల్చి పొట్టలో కొంతసేపు నిలిపి వదలాలి.

శీత్కారి ప్రాణాయామం:-- నోరు తెరిచి పళ్ళు బిగించి నాలుకను మడిచి గాలిని దీర్ఘంగా పీల్చి లోపల నిలిపి ఎడమ ముక్కును మూసి కుడి ముక్కు ద్వారా గాలిని వదలాలి.

క్షణాలు;--    గొంతు ఎండి  పోవడం, అతి దాహం వుంటాయి.

కరక్కాయ పొడి                ---- 5 gr
నల్ల ద్రాక్ష రసం                ---- ఒక గ్లాసు
కలకండ                         ---- ఒక టీ స్పూను

     అన్నింటిని కలిపి తాగాలి. రెండు పూటలా వాడాలి.

     ఇది గుండె మంటను, పైత్యాన్ని, వేడిని తగ్గిస్తుంది. గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

     ద్రాక్ష రసం, బార్లీ, నానబెట్టిన ఎండుద్రాక్ష, చలువ చేసే ఆకు కూరలు వంటివి వాడుకోవాలి.

     గుడ్డ పట్టి తప్పని సరి.

               గుండె పట్టుకున్నట్లు వుంటే --- నివారణకు                               14-2-10.

తులసి ఆకుల పొడి                       ---- పావు టీ స్పూను
దోరగా వేయించిన మిరియాల పొడి     -- పావు టీ స్పూను
పాత బెల్లం                                  ---- పది గ్రాములు

       అన్నింటిని కలిపి దంచి ముద్దగా చేసి ఆహారానికి గంట ముందు నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ వుంటే పై  సమస్య త్వరగా నివారింప బడుతుంది.

     తులసి ఆకులను మట్టి మూకుడులో వేసి ఐదారు చుక్కల నీటిని చల్లి వేడి చెయ్యాలి. లేదా గిన్నెలో నీళ్ళు  పోసి దానికి గుడ్డ కట్టి ఆ గుడ్డ మీద తులసి ఆకులను వుంచి స్టవ్ వెలిగించాలి. ఆవిరికి ఆకులు ఉడుకుతాయి.

తులసి ఆకులను దంచి రసం తీసి తగినంత తేనె కలుపుకొని తాగాలి.

     తులసి పూసలను రాగి తీగతో చుట్టి మెడలో ధరించాలి.

   హృదయ ముద్ర లేదా పానవాయు ముద్ర:--  పద్మాసనంలో కూర్చొని మోకాళ్ళ పై చేతులుంచి చూపుడు వేలును కిందికి దించి , చిటికెన వేలును పైకి లేపి, మిగిలిన వెళ్ళాను కలిపి కూర్చోవాలి. వెన్నుపూసను నిటారుగా ఉంచాలి. ఈ విధంగా 40  రోజులు చేస్తే అద్భుతంగా  గుండె జబ్బులు నివారింప బడతాయి.

    పై ముద్ర వేసుకొని "యం" అనే బీజాక్షరాన్ని నెమ్మదిగా అవకాశం ఉన్నంత సేపు పలకాలి . అక్షరానికి ఎంతో ప్రాముఖ్యమున్నది.

           గుండెపోటు నివారణకు --హృదయ గుటికలు                                    2-5-10.

                      గుండెల్లో నొప్పిగా అనిపించినపుడు ;-----

     100 గ్రాముల మంచి శనగలను తీసుకొని నల్లగా బూడిద లాగా అయ్యేంత వరకు వేయించాలి. నలగగొట్టి   వేయిస్తే త్వరగా బూడిద లాగా వుతాయి.

శనగల బూడిద            ----  4 చిటికెలు
బెల్లం                           ---- 10 గ్రాములు

        రెండింటిని బాగా పిసికి ముద్దగా చెయ్యాలి.  కుంకుడు కాయంత ముద్దను ఆహారానికి గంట ముందు   చప్పరించి తినాలి.  అప్పటికప్పుడు కలుపుకొని తినవచ్చు.

హృదయ ముద్ర వేసుకోవాలి;--

  తూర్పు కెదురుగా కూర్చొని మందును బుగ్గలో పెట్టుకొని  "యం" అనే అక్షరాన్ని పలకాలి.

     ఆహారంలో కారం, ఉప్పు, పులుపు తగ్గించి తినాలి.

                               గుండె జబ్బులు-- లక్షణాలు                                                   4-6-10.
 
     మద్యపానం, ధూమపానం కారణంగా  వచ్చే అవకాశాలు ఎక్కువ.
 
లక్షణాలు;--   నడవలేక పోవడం, నడిస్తే ఆయాసంగా వుండడం, ఎడమ చెయ్యి,  శరీరంలోని ఎడమ భాగం, ,మెడ  మీద నొప్పిగా ఉండడం జరుగుతుంది. పడుకున్నపుడు ఆయాసంగా వుండడం, కూర్చుంటే బాగుండడం, కింది   భాగాలలో నీరు చేరడం,నొక్కితే గుంట పడడం  జరుగుతుంది.
 
                         గుండెపోటు  -- నివారణ                                                          13-9-10.

తమలపాకులు            -- రెండు
తేనె                          -- రెండు టీ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు         --  రెండు
అల్లం                      --- చిన్న ముక్క
నీళ్ళు                      --- ఒక గ్లాసు

    తమలపాకులను, వెల్లుల్లిని  కలిపి నూరి గ్లాసు నీటిలో కలిపి దానిలో తేనె కలిపి పరగడుపున తాగాలి.దీని వలన గుండెపోటు రాకుండా నివారింపబడుతుంది.  ఈ విధంగా రోజుకొక్క సారి చేయాలి.

    పుల్లని పదార్ధాలను మితంగా వాడితే గుండెకు మంచిది.

    సీజన్ ప్రకారం కూరగాయలను, పండ్లను తప్పనిసరిగా వాడాలి.

    నూనె పదార్ధాలు, వేపుళ్ళు కారాలు, ఆలస్యంగా జీర్ణమయ్యే పదార్ధాలు వాడకూడదు.
    మొలకలు మంచిది.

                   గుండె పదిలంగా ఉండాలంటే                                               20-12-10

           కటుక రోహిణి చూర్ణానికి  నీరు కలిపి మెత్తగా చేసి  గుండె వున్నచోట పైన లేపనం చేయాలి. దీనితో నొప్పి   నివారింప బడుతుంది.

    గుండె చుట్టూ ఉన్న కండరాలు బలంగా ఉండాలంటే (హృద్దౌర్బల్యము )                     17-1-11.

          రక్త నాళాలు కుంచించుకు పోయి  గుండెకు తగినంత రక్తం సరఫరా కాకపోవడం వలన  గుండె బలహీనంగా  మారుతుంది.

లక్షణాలు :--  ఊపిరాడనట్లుగా వుండడం, ఆయాసంగా వుండడం,  కాళ్ళు చేతులు వాపు వుండడం వంటి లక్షణాలు వుంటే గుండె బలహీనంగా వున్నదని చెప్పవచ్చు.

1.  తెల్ల మద్ది  బెరడు చూర్ణం   తయారు చేసి సీసాలో నిల్వ చేసుకోవాలి.
 
     ఆవు పాలు            -- ఒక గ్లాసు
             నీళ్ళు          -- ఒక గ్లాసు
    తెల్ల మద్ది చూర్ణం    -- ఒక టీ స్పూను
 
           నీళ్ళు,  పాలు కలిపి దానిలో చూర్ణాన్ని వేసి స్టవ్ మీద పెట్టి ఒక గ్లాసు మిగిలే వరకు కాచాలి. వడ పోసి పంచదార కలుపుకుని తాగాలి.  ఈ విధంగా ప్రతి రోజు చేయాలి. దీని వలన మంచి ఫలితం వుంటుంది.

2.  చెంగల్వ కోష్టు                                   --- 100 gr
     పిప్పళ్ళు                                         ---   50 gr ( నిమ్మ రసంతో శుద్ధి చేయాలి)
     శొంటి                                              ---   50 gr (  దోరగా వేయించాలి)
     గలిజేరు వేర్లు                                   ---   50 gr
     వస                                                ---   25 gr
     కరక్కాయల పెచ్చులు                       ---   25 gr
     నేతిలో వేయించిన  ఇంగువ                 ---   25 gr
     సౌవర్చ  లవణం                                ---   50 gr ( బియ్యపు గంజిలో నానబెట్టి ఎండబెట్టాలి). 
     యవాక్షారం                                     ---   50 gr
 
            అన్నింటిని విడివిడిగా దంచి చూర్నాలు చేసి కలిపి సీసాలో హ్హద్రపరచుకోవాలి.
     ఒక గ్లాసు బార్లీ నీటిలో ఒక స్పూను పొడిని కలుపుకుని తాగితే  గుండె బలహీనత నివారింప బడుతుంది.

                       గుండె చప్పుడులో వ్యత్యాసం లేదా క్రమం తప్పడం                        30-3-11.

      ఆహారంలో తేడాలు వుండడం వలన,  ఒత్తిడి వలన, సమస్యల వలన జరుగుతుంది.
       చెమట పట్టడం,  నీరసం,  పని చెయ్యలేకపోవడం, ఉద్రేకం వంటి లక్షణాలు వుంటాయి.

               తెల్ల మద్ది చెక్క పొడి                --- 100 gr
               మోదుగ విత్తనాల పొడి             ---   50 gr
               మోదుగ పువ్వుల పొడి             ---   50 gr
               వాయు విడంగాల చూర్ణం          ---   50 gr ( గోమూత్రంలో నానబెట్టి ఎండబెట్టి దంచాలి )
               బోడసరం పూల చూర్ణం            ---   50 gr
               పుష్కరమూలం చూర్ణం            ---   50 gr
               సైంధవ లవణం                       ---   50 gr
               పాత బెల్లం                             ---- తగినంత

        అన్ని చూర్ణాలకు  తగినంతః బెల్లం కలిపి నూరి శనగ గింజలంత  మాత్రలు కట్టాలి.
        ప్రతి రోజు మూడు పూటలా పూటకు ఒక మాత్ర చొప్పున వేసుకోవాలి. 
               ఎంత కాలమైనా వాడవచ్చు.

                                       గుండె జబ్బుల  నివారణకు                                         5-4-11.

       తెల్ల మద్ది చెక్క చూర్ణాన్ని నిల్వ చేసుకోవాలి.

       అర గ్లాసు ఆవు పాలలో గాని లేదా దేశవాళీ గేదె పాలలో గాని అర టీ స్పూను పొడిని వేసి
  కలకండ కలుపుకుని తాగాలి.

       ఈ విధంగా ప్రతి రోజు ఉదయం,  సాయంత్రం తాగాలి.

                             గుండె జబ్బుల నివారణకు --- శోధగ్న చూర్ణం                        3-6-11.

కారణాలు,  లక్షణాలు :-- కాళ్ళు ,  ముఖము ,  శరీరం లో నీరు చేరడం
ఆయాసం ,  పాదాలలో,  శరీరం లో వాపు, మెట్లెక్కితే ఆయాసం,  నడిస్తే ఆయాసం , బలహీనత ,
నిస్త్రాణ, నీరసం, కూర్చొని లేస్తే కళ్ళు తిరగడం  రక్తపోటు పడిపోవడం  వంటి లక్షణాలు వుంటాయి .

       అధిక రక్తపోటు వలన హార్ట్ ఫెయిల్ అవుతుంది.  ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం కుటుంబ
వారసత్వం, మధుమేహం,  డెలివరీస్, ఉప్పును అధికంగా వాడడం  మొదలైన కారణాల వలన
వచ్చే అవకాశాలు ఎక్కువ . 

కటుకరోహిణి  చూర్ణం                  ----20 gr
నేలవేము      చూర్ణం                  ----20 gr
శొంటి            చూర్ణం                 ----20 gr

     అన్ని చూర్ణాలను  బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి .

     ఒక గ్రాము ( చిటికెడు )  చూర్ణాన్ని అర కప్పు పాలలో గాని, నీటిలో  గాని,  లేదా దానికి రెట్టింపు
పంచదారతో గాని , లేదా తేనెతో గాని తీసుకోవాలి .  ఇది చాలా చేదుగా వుంటుంది . 

సూచనలు :-- ఒత్తిడి , ఆందోళన తగ్గించుకోవాలి .  సిగరెట్లు , మద్యం మానెయ్యాలి . మద్యం లివర్
ను దెబ్బ తీస్తుంది .  రోజుకు రెండు గ్రాముల ఉప్పును మాత్రమే  వాడాలి . యోగా చేయాలి .
    పాదాల్లో వాపును తగ్గించడానికి  యాంటి బయాటిక్స్ వాడకూడదు .  దీనితో పాటు పొటాషియం
కూడా పోతుంది . దీని వలన పిక్కలు పట్టేయ్యడం, ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలు ఏర్పడతాయి

    అరటిపండు,  సోయాబీన్స్,  గోధుమలు  వాడాలి .

                                               గుండె సమస్యలు  --- నివారణ                                3-8-11.

    ముదురు  ,  లేత కానటువంటి రావి ఆకును తీసుకొని రాత్రి వేళ ఒక గ్లాసు నీటిలో వేయాలి . ఉదయం లేచిన తరువాత
ఆ నీటిని మూడు భాగాలుగా చేసి మూడు పూటలా ఆహారం తరువాత మాత్రమె సేవించాలి .  పరగడుపున  ఎంతమాత్రం
సేవించకూడదు .  ఈ విధంగా  రోజు వాడుతూ వుంటే  గుండె సమస్యలు నివారించబడతాయి .

                                               గుండెపోటు  --- నివారణ                                         3-8-11.

కారణాలు :-- అధిక రక్తపోటు , ఒత్తిడి ,  మధుమేహం , పొగతాగడం , రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా వుండడం , మెనోపాజ్
టైం మొదలైనవి .

లక్షణాలు :-- ఛాతీలో నొప్పి , అసౌకర్యం , నడకలో మార్పు , దవదలోకి నొప్పి వ్యాపించడం , కళ్ళు తిరగడం మొదలైనవి .

వెల్లుల్లి గర్భాలు                  --- 3
పచ్చి పాలు                        --- ఒక కప్పు

      పచ్చి పాలల్లో వెల్లుల్లిని ఒక గంట సేపు నానబెట్టాలి . తరువాత వాటిని తీసి తిని , ఆ పాలు తాగాలి .

      ఈ విధంగా చేస్తూ వుంటే గుండెపోటు రాకుండా కాపాడ బడుతుంది  గుండెపోటు వచ్చిన వాళ్ళు కూడా దీనిని వాడవచ్చు .               
                                    గ్యాస్ వలన ఎసిడిటి వలన వచ్చే గుండెపోటు                           

ఇంగువ పొడి                     --- 20 gr
జీలకర్ర పొడి                     --- 20 gr
వాము పొడి                      --- 20 gr
సైంధవ లవణం                  ---  5 gr

      అన్ని పదార్ధాలను ఒక గిన్నెలో వేసి బాగా కలిపి సీసాలో వేసి భద్రపరచుకోవాలి .

      అర టీ స్పూను పొడిని నీళ్ళలో కలుపుకొని తాగితే కడుపులో గ్యాస్ తగ్గి , ఉదరవితానం ఫ్రీ అవుతుంది . దీనివలన
గ్యాస్ ఒత్తిడి తగ్గి నొప్పి నివారించబడుతుంది .

సూచన :-- ఆహారాన్ని ఎక్కువగా భుజించకూడదు . అర్ధశాక్తిగా వ్యాయామం చేయాలి
       

               
    
    
         
          






  





    









        
                                 









క్రొవ్వు కరగడానికి

                                  అతిగా వున్న కొవ్వు నివారణకు                                     14-1-09
 
    శరీరంలో కొవ్వు అతిగా పేరుకున్న వాళ్ళు నెలకొక సారి విరేచానానికి మందు వేసుకోవాలి.పగటిపూట నిద్రించ రాదు.రాత్రి పూట 4,5 గంటలు మాత్రమే నిద్ర పోవాలి.
 
        కొర్రల గంజి మంచిది, యవలు మంచి ధాన్యము. బియ్యము, గోధుమలు వాడకూడదు. పాల ఉత్పత్తులు ,చెరకు ఉత్పత్తులు తినరాదు.
 
                                               విరేచానానికి మందు
 
                   అల్లం రసం     ------ 2  టీ స్పూన్లు
                            తేనె      ------ 2  టీ స్పూన్లు
                   వంటాముదం  -----  4  టీ స్పూన్లు
 
         అన్నింటిని కలిపి ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి మూడు పొంగులు రానిచ్చి దించి గోరువెచ్చగ వేకువ జామున తాగాలి. ఆ రోజంతా చారన్నం తినాలి.

                                   శరీర భాగాలలో కొవ్వు కరిగించడానికి                                    30-1-09
.
   వెల్లకిలా పడుకొని నిదానంగా కుడి కాలును పైకి లేపాలి.అదే విధంగా రెండవ వైపు కూడా గాలి పీలుస్తూ వదులుతూ చెయ్యాలి .   మరల  రెండు కాళ్ళను ఒకే సారి పైకేత్తాలి, నెమ్మదిగా దించాలి.ఈ వ్యాయామాన్ని రెండు, మూడు సార్లతో ప్రారంభించి హెచ్చించాలి.
 
     ఈ విధంగా చెయ్యడం వలన నడుము నొప్పి  తగ్గుతుంది, పొట్టలో వున్న కొవ్వు కరుగుతుంది.
ఉదయం, సాయంత్రం ఖాళి కడుపుతో మాత్రమే చెయ్యాలి.
 
ఆహార నియమాలు:-
 
     అతి చల్లని పదార్ధాలు.నిల్వ ఉంచిన పదార్ధాలు,వేపుడు కూరలు, ఉడికి వుడకని పదార్ధాలు తినకూడదు.
 
జెర్సీ ఆవుల, గేదెల పాలలో కొవ్వు ఎక్కువగా వుంటుంది. కాబట్టి అవి వాడకూడదు,  మాంసాహారం జీర్ణం కావడానికి 48 నుండి 72 గంటలు పడుతుంది
 
    ఉదయం టిఫిను మానేసి ఉదయపు భోజనం 6 గంటల లోపు, రెండవ భోజనం 8 గంటల లోపు భోంచేయ్యాలిసాయంత్రం పండ్ల రసాలు తీసుకోవచ్చు.
 
ఉదయపు భోజనం :- 
 
        పాత గోధుమలు గాని, పాత రాగులు గాని, పాత బియ్యం గాని ఒక గ్లాసు తీసుకోవాలి.దానికి 14 గ్లాసుల నీటిని కలిపి మెత్తగా జావ లాగా ఉడికించాలి.దానికి చిటికెడు జిలకర, చిటికెడు ధనియాల పొడి,చిటికెడు వాము,చిటికెడు మిరియాల పొడి అర టీ స్పూను సన్నగా తురిమిన అల్లం ముక్కలు,కారెట్ ,బీట్రూట్, ఇతర కూరగాయల ముక్కలు అందులో  వేసి కిచిడి లాగా చేసి కొత్తిమీర, కరివేపాకు వేసి తినాలి. సైంధవ లవణం కలపాలి.
 
      దీని వలన ఒక్క గ్రాము కూడా అదనంగా కొవ్వు పెరగదు, పైగా కొవ్వు కరుగుతుంది.

                                      శరీరంలో కొవ్వు కరిగించడానికి.                                         4-2-09.

  ప్రాణాయామం ద్వారా :--  సుఖాసనంలో కూర్చొని బాగా దీర్ఘంగా గాలిని పీల్చి నెమ్మదిగావదలాలి.ఈ విధంగా చేసేటపుడు పొట్ట బాగా లోపలి పోవాలి.
 
1. ఒక కప్పు మెంతి ఆకుల రసం లో ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగాలి.ఈ విధంగా ఉదయం, సాయంత్రం   రెండు పూటలా చెయ్యాలి.లేదా కనీసం రోజుకొకసారైనా చెయ్యాలి.
 
2. మామిడి, సపోటా, అరటి కొవ్వును పెంచుతాయి.
    బొప్పాయి కొవ్వును కరిగించడంలో ప్రధానమైనది.  
    ఉదయం   --పచ్చి ఆకుల రసం
    సాయంత్రం  --పండ్ల రసం
 
    దీనితోబాటు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగాలి.దీని వలన నీరసం రాదు.తేనె, నీరు చాలా బలాన్నిస్తుంది.
 
                                        కొవ్వును కరిగించడానికి తైలం                                       4-2-09.
 
     100 గ్రాముల ఆవాల నూనెను స్టవ్ ,\మీద పెట్టి వేడి చేసి దించి దానిలో 20 గ్రాముల మిరియాల పొడి, 10 గ్రాముల ముద్ద కర్పూరం కలిపి నిల్వ చేసుకోవాలి. ఇది అద్భుతంగా కొవ్వును కరిగిస్తుంది.
 
    స్నానానికి గంట ముందు కొంత తైలం తీసుకొని కొవ్వు వున్న భాగంలో మర్దన చెయ్యాలి. ఒక అర గంట సేపు గాని, గంట సేపు గాని మర్దన చెయ్యాలి. దీనితో శరీరం మీద వున్న మచ్చలు కూడా నివారింప బడతాయి.అద్భుతమైన అందం, నిగారింపు వస్తాయి.
 
             శరీరంలో అతిగా కొవ్వు చేరడం వలన వచ్చే దుర్గంధాన్ని నివారించడం       6-3-09.

                నల్ల తుమ్మ ఆకులను రుబ్బిన పేస్ట్
               కరక పెచ్చులను రుబ్బిన పేస్ట్

     నల్ల తుమ్మ ఆకుల పేస్ట్ ను ముందు ఒళ్లంతా పట్టించాలి. తరువాత కరక్కాయ పేస్ట్ రుద్దాలి. దీని వలన శరీర దుర్గంధము నివారింప బడుతుంది.  కొవ్వు కర్గుతుంది.

                                  అధిక క్రొవ్వును తగ్గించడం.                                                19-3-09.

                    ఉల్లి గడ్డల రసం          ----- పావు కిలో
                    ఆవాల నూనె             ----- పావు కిలో

     రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద రసం ఇంకి పోయి నూనె మాత్రమే మిగిలేట్లు కాచాలి. చల్లారిన తరువాత బట్టలో పోసి వడకట్టాలి.

     శరీరంలో ఎక్కడ చెడు వాయువు, కొవ్వు చేరి ఉంటాయో అక్కడ ఈ తైలం తో బాగా మర్దన చెయ్యాలి.

                        Cellulite  --- చర్మం కింద కొవ్వు చేరడం -- నివారణ                      25-11-10.
 
      ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా వుంటుంది.
      వయసు మీద పడినట్లుండడం, చర్మం కమలా పండు లాగా మందంగా తయారవడం జరుగుతుంది.
 
     పిరుదులలో, ముంజేతుల పై భాగంలో, పొట్ట మీద ఎక్కువగా పేరుకుంటుంది.
 
     ఈ సమస్య స్థూల కాయం , హార్మోన్ల లో తేడా, అతినీల లోహిత కిరణాల ప్రభావం మొదలైన కారణాల వలన వస్తుంది.
 
 చర్మం లో బిగువు తగ్గి వేలాడుతున్నట్లు ఉండడం వీడియొ గేమ్స్ ఆడేటపుడు ప్రాణ వాయువు తగ్గడం ధూమ పానం , కెఫీన్ ఎక్కువగా వాడడం వలన శరీరంలోఆక్సిజెన్ తగ్గడం వంటివి జరుగుతాయి.
 వయ్యారి భామ  లేదా కాంగ్రెస్ గడ్డి ప్రభావానికి గురి అయినపుడు గర్భధారణకు, పాల ఉత్పత్తికి సమస్య 
ఏర్పడుతుంది.
 
     వయసు మీరడం కూడా ఒక ప్రధాన కారణం
 
     ఉదయం 11  గంటల నుండి మధ్యాహ్నం  3 గంటల వరకు అతి నీల లోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా వుంటుంది. కావున ఆ సమయం లో జాగ్రత్తలు పాటించాలి.
 
పాటించ వలసిన నియమాలు:---    క్రమంగా బరువు తగ్గాలి. రోజుకు ఆరు నుండి పది లీటర్ల నీటిని తాగాలి.
 
క్రొవ్వు పదార్ధాలు, నిల్వపదార్ధాలు, కాఫీ, టీలు, ఉప్పు తగ్గించి వాడుకోవాలి. వ్యాయామం చెయ్యాలి.
 
     ఆరోగ్యదారి ( రేల పండు ) యొక్క గుజ్జుతో మర్దన చెయ్యాలి. తైల మర్దన తప్పని సరి.
 
                                                             10-12-10

     నూనె, నెయ్యి ఎక్కువగా వాడినపుడు దానికి తగిన శారీరక శ్రమ లేకపోవడం  వలన శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కాని  నూనె, నెయ్యి తగినంత వాడుకోవాలి. పూర్తిగా వాడడం మానేస్తే శరీరం ఎండి పోయినట్లు అవుతుంది., ఆహారం జీర్ణం కాదు.

దోరగా వేయించిన వాయు విడంగాలు
    "            "         శొంటి
                        ఉసిరిక పొడి

    అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని విడివిడిగా చూర్ణాలు  చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
ప్రతి రోజు రెండు పూటలా అర టీ స్పూను పొడిని ఒక గ్లాసు బార్లీ జావాలో కలుపుకొని తాగాలి లేక తేనెతోకలుపుకొని తాగాలి. దీని వలన మూత్రము ఎక్కువగా వస్తున్నా భయపడవలసిన పని లేదు.

                                                    కొవ్వు కరగడానికి
తిప్ప తీగ పొడి
తుంగ గడ్డల పొడి

    రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని మెత్తగా దంచి జల్లించి కలిపి భద్ర పరచుకోవాలి.

    అర టీ స్పూను పొడిని  ఒక టీ స్పూను తేనెతో ప్రతి రోజు తీసుకుంటే కొవ్వు అద్భుతంగా కరుగుతుంది.
                                                            11-12-10
1. త్రిఫలాలు
    త్రికటుకాలు
    సైంధవ లవణం

           అన్ని చూర్ణాలను కలిపి ముద్దగా చేసుకోవాలి. ప్రతి రోజు కుంకుడు కాయంత ముద్దను తినాలి. లేదా ఉదయం బార్లీ నీళ్ళలో కలుపుకొని తాగ వచ్చు.

2. మధ్యాహ్న భోజనానికి రొట్టె
     బార్లీ పిండి       --- 125 gr
     గోధుమ పిండి ---- పావు కిలో
     మిరియాల పొడి --చిటికెడు
     శొంటి పొడి         --      "
     పిప్పళ్ళ  పొడి      ---     '
     సైంధవ లవణం --- తగినంత

            అన్నింటిని నీటితో కలిపి రొట్టె చేసుకుని తినాలి. దీనిలోకి పొన్నగంటి కూర  గాని, మెంతి కూర గాని కలుపుకొని తినాలి.

3.  సాయంత్రం ఉలవకట్టులో సైంధవ లవణం కలుపుకొని తాగాలి.
4.   రాత్రి పుల్లటి పండ్లను తినాలి.

                                                                  13-12-10
త్రిఫలాలు
తుంగ గడ్డలు
మాని పసుపు

       అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని విడివిడిగా దంచి జల్లించి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.

ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను పొడిని కలిపి అర గ్లాసు కషాయం రానిచ్చి గోరువెచ్చగా అయిన తరువాత ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగాలి.

      దీని వలన శరీరంలో అధికంగా వున్నకొవ్వు తగ్గుతుంది. రక్త నాళాలలో పెరిగిన కొవ్వు కూడా తొలగించబడుతుంది.

                           అధికంగా వున్న కొవ్వును, ఆకలిని తగ్గించడానికి  సంజీవనీ రసాయనం

ఉత్తరేణి గింజల పొడి                 ----  అర టీ స్పూను

       ఒక గ్లాసు నీటిలో ఈ పొడిని వేసి ఉడికించాలి. దానిలో పాలు, చక్కర కలుపుకోవాలి. దీనిని తాగితే 2  3 రోజులు ఆకలి కాదు. తరువాత ఆకలైతేనే తినాలి.

       దీనిని విపరీతమైన లావు శరీరం వున్నవాళ్ళు, విపరీతమైన ఆకలి వున్నవాళ్ళు మాత్రమే వాడాలి. దీనితో విపరీతమైన ఆకలి తగ్గుతుంది,  శరీరంలోని కొవ్వు కరుగుతుంది.

                        కొలెస్ట్రాల్  సమస్య --నివారణ                                               16-12-10.

        రెండు వెల్లుల్లి పాయలను సన్నని ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో వేసి ఒక కప్పు పాలు, ఒక కప్పు నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టి ఒక కప్పు మిగిలేట్లు కాచాలి.  చల్లారిన తరువాత ఒక టీ స్పూను తేనె కలుపుకొని నిద్రించే ముందు తాగాలి. 40 రోజులు వాడాలి. దీని వలన కొలెస్ట్రాల్ అనబడే చెడు క్రొవ్వు నివారింప బడుతుంది.

         కఫ శరీరము కలిగి లావుగా వున్నవాళ్ళు  రెండు పాయలను, పైత్య (వేడి ) శరీరము కలిగిన వాళ్ళు ఒక వెల్లుల్లి పాయను వాడాలి.

                     కొలెస్ట్రాల్  కరగడానికి చిట్కా                                                   14-12-10.

తులసి గింజలు
జాజికాయ

      రెండింటి  చూర్ణాలను   సమాన భాగాలుగా తీసుకుని  కలిపి నిల్వ చేసుకోవాలి.  ప్రతి రోజు ఒక టీ స్పూనుపొడిని  నీటితో తీసుకుంటే కొలెస్ట్రాల్ నివారింప బడుతుంది.

                           శరీర భాగాలలోని కొవ్వును కరిగించడానికి లేపనం                       7-4-11.

        తొడలలో కొవ్వు ఎక్కువైతే రాసుకుంటాయి. చర్మం లో కొవ్వు పెరుకున్నపుడు కమలాపండు
 తొక్క మీద లాగా గుంటలు ఏర్పడతాయి.

       ఈస్ట్రోజన్,  హార్మోన్లు,  ఒత్తిడి మొదలైన కారణాల వలన కొవ్వు ఏర్పడుతుంది.

       కళ్ళ కింద వలయాలు,  గడ్డం కింద కొవ్వు ( Double Chin),  స్థూలకాయం మొదలైన
 కారణాల వలన శరీర భాగాలలో కొవ్వు పేరుకుంటుంది.
    
   

                        కాఫీ పొడి పేస్ట్                       ---ఒక కప్పు
                        కలకండ పొడి                        ---అర కప్పు
                        సముద్రపు ఉప్పు పొడి           ---అర కప్పు
                        ప్రొద్దుతిరుగుడు గింజల నూనె --- అర కప్పు

         కాఫీ పొడి లో వేడి నీళ్ళు కలిపి చిక్కటి పేస్ట్ లాగా తయారు చేయాలి. దీనికి కలకండ, ఉప్పు,
 నూనె కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి.

         కొవ్వు అధికంగా పెరుకున్న  ( సెల్యులైట్ ) భాగాల మీద దీనిని రుద్దాలి .

         కొవ్వు సహజంగా తొడల లో, మెడ మీద, గడ్డం కింద, పొట్ట మీద, ఎక్కువ ఏర్పడుతుంది.

         మొదట ఆ భాగాలను వేడి నీటితో శుభ్రపరచాలి. ఈ లేపనాన్ని పూసి అదుముతూ పైకి
( గుండె వైపుకు ) రుద్దాలి.

ఉపయోగాలు :--  ఇది చర్మం కింద కొవ్వు ఏర్పడకుండా కాపాడుతుంది.

సూచనలు :--   గర్భధారణ సమయంలో, బహిష్టు కు ముందు రోజులలో కొవ్వు ఎక్కువగా తయారవుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.

       తీపి పదార్ధాలను, నూనె పదార్ధాలను తగ్గించాలి. నడవాలి. ఉలవ కషాయం తాగాలి. నాలుగైదు మిరియాలను తమలపాకులలో పెట్టుకొని నమిలి తిని నీళ్ళు తాగాలి.  భోజనానికి ముందు నీళ్ళు ఎక్కువగా తాగాలి.        
         









   

                                    

                                     
       
                           















చాతీ సౌందర్యానికి

                                        చాతీ సౌందర్యము                                         1-6-09.

             నిటారుగా నిలబడి చేతులను ముందుకు చాచి తరువాత ప్రక్కలకు చాపాలి. తరువాత చేతులను ముందుకు చాచి పైకి లేపాలి.  ముందుకు చాచి వెనక్కు పోనివ్వాలి.
            చాతీని గుండ్రంగా మర్దన చెయ్యాలి.
            దీనివలన చాతీ భాగంలో కండరాలు గట్టి పడతాయి.
            వేడి శరీరం వాళ్లకు చాతీ సరిగా పెరగదు. వేడి తగ్గి రక్తవృద్ధి జరిగినపుడు చాతీ బాగా పెరుగుతుంది.
                                 తామర గింజలు
                                 కలకండ
                                 ఆవు నెయ్యి
                                 గేదె నెయ్యి
                                 నువ్వుల నూనె

             అన్నింటిని ఒక్కొక్క టీ స్పూను చొప్పున తీసుకొని అర కప్పు పాలల్లో గాని నీళ్ళలో గాని కలుపుకొని  తాగితే శరీరం ఎంతో పుష్టి వంతంగా తయారవుతుంది.

                                 అశ్వగంధ  చూర్ణం             ---- 100 gr
                                 శతావరి         "                 ---- 100 gr
                                 జటామాంసి                     ---- 100 gr
                                 పుష్కర మూలం              ---- 100 gr
                                 వాకుడు పండ్లు                ----  100 gr

             అన్నింటిని విడివిడిగా దంచి జల్లించి చూర్నాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
               
             ఒక టీ స్పూను పొడిని నీటితో కలిపి రాత్రి నిద్రించే ముందు రొమ్ము పై గుండ్రంగా పట్టు వెయ్యాలి.  మధ్యలో ఉన్న నిప్పల్ కి తగలకూడదు. బ్రా వేసుకొని పడుకోవాలి. ఉదయం కడిగి స్నానం చెయ్యాలి.







      

చాతి నొప్పి నివారణకు

                                                        ఛాతీ బాగా పుష్టిగా ఉండాలంటే
 
                          గోరువెచ్చని పాలు       -------- ఒక కప్పు
                          ఆవు నెయ్యి                  ------ ఒక  స్పూను
                          గేదె నెయ్యి                   ------  ఒక స్పూను
                          నువ్వుల నూనె           ------- ఒక స్పూను
 
            అన్నింటిని బాగా కలిపి తాగితే ఛాతీ మరియు శరీరం పుష్టిగా ఉంటాయి. స్థనాలు చిన్నవిగా ఉన్నవాళ్ళు కూడా వాడ వచ్చు.
 
                                                 మగ  పిల్లలకు చాతీ పెరుగుతుంటే
 
                        ఆవాల నూనె         ----- 100 gr
                        కర్పూరం               -----   10 gr
 
          ఆవాల నూనెను గోరువెచ్చగా వేడిచేసి దానిలో కర్పూరం కలపాలి. స్నానానికి రెండు గంటల ముందు నూనెను చేతిలోకి తీసుకొని రొమ్ముపై clock wise మాత్రమే రుద్దాలి.(తప్పనిసరి)Anti clock wise లో చేస్తే  ఆడపిల్లలకు వలె లావుగా పెరుగుతాయి .దీనిలో మిరియాల పొడి,పిప్పళ్ల పొడి కూడా కలుపుకోవచ్చు.

                                          చాతి నొప్పి ---నివారణ                            20-12-10.

         చాతి నొప్పి   గుండె నొప్పి ఒకటి కాదు.  అపోహ మాత్రమే. గుండె నొప్పి వున్నపుడు కూడా చాతీనోప్పి రావచ్చు.

కరక్కాయ  పెచ్చుల పొడి              --- 50 gr
వస పొడి                                    ---- 50 gr
దుంప రాష్ట్రం పొడి                       ----100 gr
అతి మధురం పొడి                      ----100 gr
పుష్కరమూలం  పొడి                 -----100 gr
కటుక రోహిణి పొడి                      ----   50 gr
పిప్పళ్ళ పొడి                              ----   50 gr
శొంటి పొడి                                 ----    50 gr

     కరక్కాయ పెచ్చులను ఆముదంలో వేయించి దంచాలి. వసను  రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఉదయం ఎండ బోసి బాగా ఎండనిచ్చి దంచాలి. పిప్పళ్ళను నిమ్మ రసం లో నానబెట్టి ఎండబెట్టి దంచాలి. శొంటి ని నేతిలో వేయించి
దంచాలి.

      అన్ని పొడులను కలిపి కల్వంలో వేసి తగినంత బెల్లం కలిపి నూరి శనగ గింజలంత  మాత్రలు చేసి ఆరబెట్టాలి.

బాగా ఆరిన తరువాత సీసాలో నిల్వ చేసుకోవాలి. మధుమేహం వున్నవాళ్ళు  నీటిని కలిపి నూరాలి.

      పూటకు రెండు మాత్రల చొప్పున ఉదయం సాయంత్రం వాడాలి దీని వలన చాతీ నొప్పి సత్వరమే నివారింపబడుతుంది.

                                             ఛాతీలో మంట ---నివారణ                                15-6-11.

 లక్షణాలు :--      ఈ మంట ఛాతీలో నుండి  గొంతులోకి వ్యాపిస్తుంది. పుల్లటి త్రేన్పులు వస్తాయి. గొంతులో ఎదో అడ్డు పడినట్లుగా వుంటుంది.

కారణాలు :--      ముఖ్య కారణం స్థూల కాయం. హెర్నియా,  గర్భాదారణ సమయం లో హార్మోన్ల లో
తేడాలు, స్మోకింగ్, నోరు పొడిగా వున్న సమయంలో, ఉబ్బసం, మధుమేహం, ఆమాశాయంలో
ఆహారం ఎక్కువ సేపు నిల్వ వుండడం. రాత్రి ఎక్కువసేపు మేల్కోవడం మొదలైనవి.

1. వేడి నీళ్ళు                        --- ఒక గ్లాసు
    నెయ్యి                              --- ఒక టీ స్పూను
    
       వేడి నీటిలో నెయ్యి వేసి బాగా కలపాలి.  తరువాత ఈ నీటిని అరగంటకు ఒక సారి తాగుతూ వుండాలి.

2. శొంటి                              --- 30 gr
    మిరియాలు                     --- 30 gr
    వేప చెక్క                         --- 30 gr

          అన్నింటిని విడివిడిగా చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.

          అర గ్రాము పొడిని నీటితో సేవించాలి.

3. ఉసిరి పెచ్చుల చూర్ణం        --- అర టీ స్పూను
                పాలు                   --- అర కప్పు

          రెండింటిని కలిపి తాగాలి.

సూచనలు :-- ఎత్తుకు తగిన బరువు వుండాలి. బిగుతుగా వున్న దుస్తులను ధరించరాదు.
భోంచేసిన తరువాత వెంటనే నిద్రించాకూడదు. తలగడ భాగం ఎత్తుగా వుండాలి. ధూమపానం
మద్యపానం ఎంత మాత్రం మంచిది కాదు.