అల్ప రక్త పోటు

                                   అల్ప రక్త పోటు --నివారణ                                        9-2-09 .

    అల్ప రక్త పోటు లక్షణాలు :--

ముఖం మీద తిత్తులు ఏర్పడతాయి. శరీరానికి అవసరమైనంత ఆహారం తీసుకోక పోవడం వలన రక్తం, మాంసం, క్రొవ్వు తగ్గి పోతాయి. జుట్టు వూడి పోతుంది. కళ్ళు గుంటలుగా అవుతాయి , రాత్రి నిద్ర వుండదు . పనికి మాలిన ఆలోచనలు ఆత్మన్యూనతా భావం ఏర్పడడం వుంటాయి.

 యోగాసనం :-- చిన్ముద్ర(పద్మాసనం)   లో కూర్చొని (సులభ భస్త్రిక )  పొట్ట కదలకుండా ఊపిరి నిదానంగా,  నిండుగా తీసుకొని వెంట వెంటనే వదలాలి.
సూర్య భేదన ప్రాణాయామం :--   కుడి చేతి మధ్య, ఉంగరపు వేళ్ళతో ఎడమ ముక్కు మూసి కుడి ముక్కుతో గాలిని పీల్చి, బొటన వేలుతో కుడి ముక్కు మూసి, ఎడమ ముక్కుతో గాలి వదలాలి.  గాలి పీల్చిన 4,5 సెకండ్ల  తరువాత గాలిని వదలాలి.
ఆహారం :-- అల్ప రక్త పోటు వున్న వాళ్ళు దిగాలుగా, నీరసంగా వుంటారు. జతరాగ్ని తక్కువగా వుంటుంది.
                                   అల్లం రసం             ---- ఒక టీ స్పూను
                                   నిమ్మ రసం            ---- ఒక టీ స్పూను
                                      తేనె                    -----ఒక టీ స్పూను
     మూడు కలిపి ఆహారానికి గంట ముందు ఉదయం, రాత్రి నాలుకతో అడ్డుకొని చప్పరించి తినాలి. దీనితో బాగా తీవ్రంగా ఆకలి అవుతుంది.  దీనిని బలహీనంగా వున్న పిల్లలకు కూడా యివ్వ వచ్చు (30 రోజులు)
     పైన చెప్పిన విధంగా చేస్తూ 20  ఎండు ద్రాక్ష పండ్లు, ఒక ఎండు ఖర్జూరం, రెండు అంజూర పండ్లు కడిగి ప్రతి రోజు రాత్రి పూట నీటిలో వేసి ఉదయం ఒక్కొక్క పండును బాగా నమిలి తిని మిగిలిన నీళ్ళు తాగాలి.
ఇది చేసిన తరువాత ఒక గంట వరకు ఏమి తినకూడదు . సాయంత్రం 5 చిన్న టొమాటోలు, ఒక కారెట్,  పది గ్రాముల బీట్రూట్ ముక్కను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి తేనె గాని, కలకండ గానిచల్లి తింటూ వుంటే బాగా రక్త వృద్ధి జరుగుతుంది. సులభంగా అరిగే పదార్ధాలను తినాలి.
            అల్ప రక్తపోటు -- మానసిక వ్యాధుల వలన వచ్చే గుండె జబ్బులు -- నివారణ   18-2-09.
    సహకార దృక్పధం తో మనలేక పోవడం; కామ, క్రోధ, లోభ, మోహ, మద,, మాత్సర్యాలతో నలిగి
పోవడం వలన నిద్ర పట్టదు,ఆహారం జీర్ణం కాదు, శరీరంలో రక్తం తగ్గి పోతూ అల్పరక్తపోటు ఏర్పడుతుంది.
యోగాసనం :-- కాంతి లేని(గాలి లేని) గదిలో ప్రమిద గాని, కొవ్వొత్తి గాని వెలిగించాలి. ఒత్తి నిశ్చలంగా ఉండేట్లు చూసుకోవాలి. పద్మాసనం వేసుకొని చిరుముద్రలో కూర్చొని తదేకంగా ఆ కాంతిని చూడ గలిగినంత సేపు చూడాలి.ఈ విధంగా ప్రతి రోజు సాధన చేస్తే మానసిక రుగ్మతలు తొలగిపోయి మానసిక ఆనందం కలుగుతుంది.
                         "దీపం జ్యోతి పరబ్రహ్మ"     "సాధనమున పనులు సమకూరు ధరలోన"
శాంతి శయనాసనం:--  ఉదయం, సాయంత్రం ఓంకారాన్ని మాత్రమే జపించాలి. పడుకొని కూడా చెయ్యవచ్చు.
పద్మాసనం లో కూర్చొని, ప్రశాంతంగా కూర్చొని ఓంకారాన్ని పలకాలి.(ఆనందో బ్రహ్మ అన్ని ఆలోచనలను వదిలేసి ఓంకారం పలకాలి. ఆ తరువాత పడుకొని చేతులు, కాళ్ళు పూర్తిగా చాపి గాలిని పీలుస్తూ వదులుతూ  వుండాలి. శ్వాస మీద ఏకాగ్రత ఉంచాలి. పూరకం, కుంభకం, రేచకం చెయ్యాలి కళ్ళు మూసుకొని చెయ్యాలి.)
 దీని వలన అల్పరక్తపోటు నియంత్రణ లో వుంటుంది.
ఆహారం:--  
     నాటు ఆవు పాలు లేదా నాటు గేదె పాలు లేదా మేక పాలు ఒక అర గ్లాసు తీసుకొని దానిలో 10 నుండి 15   నల్లని ఎండు కిస్మిస్ పండ్లను నలగగొట్టి వెయ్యాలి, మరియు ఒక టీ స్పూను కలకండ ను వేసి స్టవ్ మీద పెట్టి  రెండు, మూడు పొంగులు రానివ్వాలి.  దించి ఆ పండ్లు తిని పాలు కొంచం కొంచంగా తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు రాత్రి పూట 40 రోజులు చేస్త్జే గుండె జబ్బులు అద్భుతంగా నివారింప బడతాయి.  మరియు గుండె దృడంగా  తయారవుతుంది. పెద్ద పెద్ద శబ్దాలను వినడం వలన, తగాదాల శబ్డాలు వినడం వలన గుండె వేగగా కొట్టుకుంటూ control  కాకుండా వుంటే  పైన చెప్పిన విధంగా పాలు తాగుతూ వుంటే గుండె బలహీనత తగ్గి దృఢ పడుతుంది.
                                అల్ప రక్తపోటు -- నివారణ                                                   6-12-10.

జటామాంసి వేరు చూర్ణం                       --- ఒక టీ స్పూను
పచ్చ కర్పూరం                                  ---- చిటికెడు
దాల్చిన చెక్క పొడి                            ----  చిటికెడు
తేనె                                                 ----- తగినంత

         అన్నింటిని కలిపి తీసుకుంటే రక్తపోటు మామూలు స్థితికి వస్తుంది.

                                                                                                                                                         












కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి