అలర్జీ

                                           అలర్జీ --- నివారణ
 
                    చర్మ అలర్జీ, కఫ అలర్జీ వంటి అలర్జీలు నివారించ బడడానికి అల్లనికి సమానంగా బెల్లం కలిపి    ఉదయం, సాయంత్రం తీసుకుంటూ వుంటే దద్దుర్లు తగ్గుతాయి
 
అల్లం రసం   
తులసి రసం
తేనె

          అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని మూడు రోజులు తీసుకుంటే జలుబు, దగ్గు  తగ్గుతాయి. .

                                       అలర్జీ  ---చికిత్స                                            16-6-10.
 
    గాలి, దుమ్ము ధూళి గిట్టక పోవడం, చర్మ రోగాలు మొదలైనవి.
 
             వేప చెట్టును శుభప్రద అంటారు.
 
             చెట్టు యొక్క పంచాంగాలు:-- బెరడు, ఆకులు, కాయలు, గింజలు, వేరు.  లేదా, వేర్ల  బెరడు యొక్క కషాయాన్ని తేనెతో కలిపి తీసుకోవాలి.
 
దీని వలన కాలేయ వ్యాధులు, అన్ని రకాల అలర్జీలు, జుట్టు రాలడం వంటి సమస్యలు నివారింప బడతాయి.
 
           వేప పూతను ఆవు పాలతో నూరి రోజు వాడుతూ వుంటే పై సమస్యలన్నీ నివారింప బడతాయి.

                              అలర్జీ --- ముక్కునుండి నీరు కారడం                                 6-8-11.

ఎండుద్రాక్ష                 --- 30 gr
మిరియాల పొడి          --- 30 gr
అతిమధురం పొడి        --- 30 gr
పటికబెల్లం                 --- 30 gr

       అన్ని పదార్ధాలను కల్వంలో వేసి బాగా మెత్తగా నూరాలి . రేగు పండ్లంత సైజు లో మాత్రలు తయారు చేసుకోవాలి .

       ఆహారానికి అర గంట ముందు ఉదయం , రాత్రి ఒక్కొక్క మాత్ర చొప్పున మంచి నీటితో వేసుకోవాలి .
       దీనితో ముక్కు నుండి నీరు కారడం , తల యొక్క భారం నివారింపబడతాయి

                                  అలర్జీ వలన దద్దుర్లు  ,  కఫం తో కూడిన దగ్గు                                   19-8-11.

కారణాలు :--- పుప్పొడిని పీల్చడం వలన , కొన్ని రకాల సెంట్లు వాడడం వలన , కొన్ని ఘాటైన వాసనల వలన ,
వచ్చే అవకాశం కలదు . మరియు SECONDHAND SMOKING వలన INFEKSHANS వలన  టాన్సిల్స్ కారణంగా  రావచ్చు   అందువలన  గిట్టని పదార్ధాలను మానేయడం మంచిది .చల్లతి పదార్ధాలను సేవించకూడదు .

తాజా కలబంద గుజ్జు                  --- రెండు టీ స్పూన్లు
           నెయ్యి                         --- అర టీ స్పూను
         పంచదార                       --- అర టీ స్పూను

         ఒక చిన్న గిన్నెను స్టవ్ మీద పెట్టి నెయ్యి వెయ్యాలి . కాగిన తరువాత కలబంద గుజ్జు ను వేసి వేయించాలి .
దానిలో చక్కర కలిపి వేడివేడిగా తినాలి . ఈ విధంగా ఏ పూటకాపూట ఫ్రెష్ గా తయారు చేసుకొని రోజుకు మూడు పూటలా
సేవించాలి .

అల్లం రసం                              ---- ఒక టీ స్పూను
తులసి రసం                            ---- ఒక టీ స్పూను
తేనె                                       ---- రెండు టీ స్పూన్లు

      ఒక చిన్న  ప్లేటులో అన్నింటిని కలిపి చేతిలో వేసుకొని నాలుకతో చప్పరిస్తూ మింగాలి . ఈ విధంగా ఎప్పటికప్పుడు
తయారు చేసుకొని రోజుకు రెండు పూటలా వాడాలి . ఈ విధంగా రెండు , మూడు రోజులు సేవించాలి .

సూచన :--- పాల పదార్ధాలను ,  పుల్లటి పదార్ధాలను తినకూడదు . గొంతుకు రెస్త్ ఇవ్వాలి .




 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి