గొంతు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గొంతు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

థైరాయిడ్


                                   థైరాయిడ్ సమస్య --నివారణ                 2-1-09

          శరీరంలో థైరాయిడ్ గ్రంధి  గొంతు భాగంలో వుంటుంది .దీనిని విశుద్ధ చక్రము లేక విష్ణు గ్రంధి అని కూడా అంటారు. దీనిలో చుల్లక గ్రంధి (థైరాయిడ్ ),ఉపచుల్లక గ్రంధి (పారా థైరాయిడ్ ) అని రెండు రకాలు.

తైల మర్దనం :--  ఇది చాలా ముఖ్యమైనది. ఓమ లేక గరిక తైలాల్లో ఏదో ఒక దానితోగోరువెచ్చగా   గొంతు మీద మధ్య వేళ్ళతో  రుద్దాలి.సున్నితంగా, నిదానంగా మర్దన చెయ్యాలి.ప్రతి రోజు స్నానికి ముందు 5 నిమిషాలు చెయ్యాలి

 యోగాసనం :-- సర్వాంగాసనం :-- ఇది థైరాయిడ్ గ్రంధిని తిరిగి పునరుజ్జీవింప చెయ్యడంలో అద్భుతమైనది.

      వెల్లకిలా పడుకొని నడుమును పైకెత్తి తలవైపునకు కాళ్ళను రానివ్వాలి. చేతులతో నడుమును పైకేత్తాలి    మత్స్యాసనం వెయ్యాలి.

     గొంతు  వాచినపుడు  గండమాల రోగాలు వస్తాయి.

                        ఉలవలు             ------  40 gr

                        మిరియాలు        ------   20 gr

                       పొంగించిన ఇంగువ  ----    2 gr

       అన్ని కలిపి ఒక గ్లాసు నీళ్ళు పోసి కాచి అర పావు నీళ్ళు మిగిలేవరకు కాచాలి. వడపోసి గోరువెచ్చగా వున్నపుడు ఉదయం పరగడుపున ఆహారానికి గంట ముందు సేవించాలి.గంట వరకు ఏమి తినకూడదు.

                                    థైరాయిడ్ గ్రంది లేక చుల్లక గ్రంధి                             5-1-09.

        ఇది తక్కువ వున్నా, ఎక్కువ వున్నా నష్టమే

         జీవ ద్రవము తక్కువైనపుడు రికెట్స్ వ్యాధి (కాళ్ళు వంకర్లు పోవడం), జీవ ద్రవము ఎక్కువైతే శరీరంలో    కొవ్వు ఎక్కువై ఊబకాయం వస్తాయి.

యోగాభ్యాసము :--ఒక పాత్ర లో ఒక లీటరు నీటిని తీసుకొని దానిలో కొన్ని జిల్లేడు ఆకులు, గరిక వావిలాకు, ఉమ్మెత్త ఆకులు,చింతాకు, వేపాకు లను వేసి మరిగించాలి,నూలు గుడ్డను వేడి కషాయంలో ముంచి ఓర్చుకోగలిగినంత వేడిగా గొంతు వాపు మీద కాపడం పెట్టాలి.

         వజ్రాసనం లో కూర్చొని గాలిని నెమ్మదిగా పీలుస్తూ తల పైకేత్తాలి.తలను దించుతూ నెమ్మదిగా గాలి  వదలాలి.  అలాగే ప్రక్కలకు కూడా చెయ్యాలి.మెడను గుండ్రంగా తిప్పాలి.ఇవన్ని గాలి పీలుస్తూ వదుల్తూ చెయ్యాలి

.     థైరాయిడ్ గ్రంధి లోని సున్నం ఎప్పటికప్పుడు ఆహారాన్ని జీర్ణమయ్యేట్లు చేస్తుంది.రక్తాన్ని పరి శుభ్ర  పరుస్తుంది ఎముకలను శక్తి వంతంగా పని చేస్తుంది.భాస్వరాన్ని (Phospharous) ను నియంత్రిస్తుంది .విష పదార్ధాలను నిర్మూలింప  జేసే జీవ పదార్ధాలను ఉత్పత్తి చేస్తుంది .

ఆహారం :-- సొరకాయ(అనపకాయ)  లోసగం ముక్కను తీసుకొని మధ్యలో వున్నా గుజ్జునంతా

తీసి ఎండబెడితే ఒక  గ్లాసు లాగా తయారవుతుంది. అది బాగా  ఎండిన తరువాత దానిలో రాత్రి పూట నీళ్ళు పోసి  పెట్టి ఉదయాన్నే తాగాలి.  దీని వలన థైరాయిడ్ గ్రంధి నియంత్రించబడుతుంది.


                                   త్రిఫల చూర్ణం                  ---------- 100 gr

                                    దేవదారు చెక్క పొడి        ---------- 100 gr

                                    పిప్పళ్ళ పొడి                  ---------- 100 gr

       అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. ఉదయంరాత్రి  ఆహారానికి రెండు గంటల ముందు రెండు గ్రాముల పొడిని ఒక టీ స్పూను తేనె తోసేవించాలి. దీని వలన గండమాల, గలగండ పై వాపు తగ్గుతాయి.

జాలందర బంధము చెయ్యాలి.

           
బహిష్టు సమస్యల కారణంగా వచ్చే థైరాయిడ్ సమస్య --నివారణ                       26-6-09.

          
నూనెతో గొంతు మీద సున్నితంగా మర్దన చెయ్యాలి. అలానే చెవుల వరకు మర్దన చెయ్యాలి. వేడి నీటిలో   ఉప్పు, పసుపు వేసి ఆ నీటి యొక్క ఆవిరిని గొంతుకు పట్టించాలి.  ఆ ఆవిరిని ముక్కుతో లోపలి పీల్చాలి. ఆ నీటిలో నూలు బట్టను ముంచి గొంతుకు కాపడం పెట్టాలి.

        
పద్మాసనం వేసుకొని కూర్చొని చాలా నెమ్మదిగా తలను వెనుకకు వంచడం, దించడం  మెడను ప్రక్కలకు తిప్పడం చెయ్యాలి. దీని వలన థైరాయిడ్ గ్రంధికి ఘర్షణ కలుగుతుంది,

      
పద్మాసనంలో కూర్చొని ఓంకారాన్ని 12 సార్లు గాని, లేదా 24 సార్లు గాని పలకాలి.  ఈ వ్యాయామం  వలన థైరాయిడ్ గ్రంధి ఎక్కువ తక్కువలు లేకుండా సమముగా పని చేస్తుంది.

     
ప్రశస్తమైన పలుచని వేపనూనెను పరగడుపున మంచం మీద పడుకొని తలను వెనుకకు వాల్చి ముక్కు  రంధ్రాలలో వేసుకోవాలి. ఇది గొంతులోకి చేరి థైరాయిడ్ గ్రంధిలోని మలినాలను తొలగిస్తుంది.

   
ఈ విధముగా 40 రోజులు చేస్తే చాలా మార్పు తెలుస్తుంది.

లక్షణాలు:--  ఈ వ్యాధి వలన గొంతు వాచిపోతుంది, కళ్ళు ముందుకు పొడుచుకొని వస్తాయి. శరీరం అతి లావుగా గాని, లేదా అతి సన్నగా గాని తయారవుతుంది.

   
ఒక టీ స్పూను త్రిఫల చూర్ణాన్ని ఒక పెద్ద గ్లాసు నీటిలో వేసి మరిగించి అర గ్లాసుకు రానిచ్చి ఆ నీటిని  గొంతులో పోసుకొని గులగరించాలి

    
ముద్ర వేసుకొని  కూర్చొని థైరాయిడ్  వున్నచోట మనసును కేంద్రీకరించి ఓంకారం పలకాలి. ఈ విధంగా రోజుకు రెండు, మూడు సార్లు చెయ్యాలి.

                                   థైరాయిడ్   గ్రంధి వాపు  -- నివారణ                                   6-1-11.

లక్షణాలు :--  గొంతులో ఏదో పట్టేసినట్లు వుంటుంది.  కొన్ని సందర్భాలలో దగ్గుగొంతు బొంగురు పోవడం వంటివి  కూడా వుంటాయి.  మినగాలంటే  శ్వాస తీసుకోవాలంటే   కష్టంగా వుంటుంది.

1.  వావిలాకు రసాన్ని పూటకు రెండు స్పూన్ల చొప్పున ప్రతి రోజు రెండు పూటలా తీసుకుంటే తగ్గిపోతుంది.

2.  దేవ కాంచనం బెరడు కషాయం పూటకు అర కప్పు చొప్పున రోజుకు మూడు సార్లు తీసుకోవాలి.

3.  వావిలి వేరు రసాన్ని ముక్కులో రెండు చుక్కలు వేసుకుంటే తగ్గుతుంది.

4.  గంటు బారంగి వేర్లను బియ్యపు కడుగు నీటితో కడిగి రసం తీసి పూయాలి.





పారా థైరాయిడ్

                            పారా థైరాయిడ్ గ్రంధి  లేదా ఉప చుల్లక గ్రంధి                       6-1-09.
            ఇది సరిగ్గా పని చేస్తే కామోద్దీపన పనులు సరిగా జరుగుతాయి,  లేకపోతే గర్భధారణ సమస్యలు, వీర్యోత్పత్తి సమస్యలు ఏర్పడతాయి.
యోగాసనం:--

 వీరభద్రాసనం :-  నిలబడి ఒక కాలు వెనక్కి, ఒక కాలు ముందుకు పెట్టి కుడిమోకాలు కిందికి   వంచాలి.రెండు చేతులు పూర్తిగా పైకెత్తి నమస్కారం చెయ్యాలి.
2. త్రికోణాసనం:--

  కూర్చొని రెండు కాళ్ళు చాచి అలాగే వుండి కుడి  వైపుకు వంగి ఎడమ చేతితో కుడి కాలు బొటన వేలును తాకాలి,  అదే విధంగా రెండవ వైపు కూడా, ఈ విధంగా 10,15 సార్లు చెయ్యాలి.
       అనులోమ, విలోమ ప్రాణాయామములు చేయ గలిగితే చాలా మంచిది.
       శరీరములో బయటకు కనిపించే దానికంటే లోపలి మనసు ప్రధానమైనది.
మనసు ఆకాశ భూతము వలన పుడుతుంది."ఓంకారము' (శబ్దము) నుండి పుడుతుంది

 థైరాయిడ్ బాగా పని చేస్తుంటే మంచి మనసు తో  రాణిస్తారు. అమానవీయ, అస్వాభావికమైన ఆలోచనలు రావు. థైరాయిడ్ గ్రంధి పని చెయ్యడంలో భేదాలుంటే మనసును నియంత్రించే జీవ రసాయనాలు సరిగా పని చెయ్యవు.
ఆహారం:--  ఉదయం దంత దావనానికి ముందు,రాత్రి నిద్రించేముందు పరిశుభ్రమైన వేప నూనెను ముక్కులో   రెండు చుక్కలు వేసుకోవాలి. ఈ విధంగా 40 రోజులు చేస్తే మార్పు వస్తుంది.







.    
          

గొంతు



                                     గొంతు సమస్యలు--- నివారణ చర్యలు

                                 బొంగురు గొంతు ------స్వర సౌందర్య కానుక                1-4-09.

తేనె                                            -----150 gr
పటికబెల్లం                                   -----100 gr
బోడతరం పూల పొడి                     ------100 gr
సరస్వతి ఆకుల పొడి                    ------100 gr
దోరగా వేయించిన పిప్పళ్ల పొడి        ------200 gr
" " శొంటి పొడి                              ------ 10 gr
" " జిలకర పొడి                            ------ 10 gr
" " లవంగాల పొడి                         ------ 10 gr
యాలకుల పొడి                               ----- 5 gr
జాజికాయ పొడి                             ------ 10 gr

విడివిడిగా అన్ని చూర్ణాలను తయారు చేసుకొని ,పటికబెల్లం కలిపి , వస్త్రఘాలితం పట్టాలి .దానిలో
తేనె పోస్తూ స్పూను తో కలుపుతూ ఉండాలి. తేనె చాలకపోతే కలుపుకోవచ్చు. తడి తగలకూడదు.


  5 gr చొప్పున మాత్రలు కట్టాలి . బాగా ఆరిన తరువాత సీసాలో భద్రపరచుకోవాలి. ప్రతిరోజు ఒక మాత్ర బుగ్గన పెట్టుకోనిచాప్పరిస్తూ ఉంటె నత్తి బొంగురు గొంతు నివారింప బడతాయి. .

                                గొంతు సమస్యలు ---నివారణ                             27-11-08.

      కఫం అడ్డు పడినపుడు, శరీరంలో వేడి ఎక్కువైనపుడు గొంతు సమస్యలు వస్తాయి.

 ఆసనాలు :-- గొంతు సమస్యలకు ప్రాణాయామం :--

ఉజ్జాయి ప్రాణాయామం :-- గొంతును బిగించి , గాలిని లోనికి పీల్చి, కుడి ముక్కు మూసి, ఎడమ ముక్కు నుండి గాలిని వదలాలి. దీనివలన లోపల గడ్డలుగా అతుక్కుని ఉన్న కఫం అప్పటికప్పుడు కరుగుతుంది.

  6,7 సార్లు విధంగా చేస్తే తగ్గిపోతుంది. దీనికి ముందు గొంతును శుద్ధి చెయ్యడానికి నువ్వుల నూనేనుగాని  ఆవ నూనెను గాని చేతికి పూసుకొని గొంతు పై మర్దన చెయ్యాలి. వెంటనే వేడి కాపడం పెట్టాలి.

కాపడం:-- పసుపు , ఉప్పు ,వేపాకు వేసి మరిగించిన నీటిలో గుడ్డను ముంచి కాపడం పెట్టాలి. 4 నిమిషాలు  వేడి కాపడం ,1 నిమిషం చల్లని కాపడం పెట్టాలి. సింహం లాగా కూర్చొని, సింహం లాగా దగ్గాలి.

ఆహారం మింగలేని సమస్య వచ్చినపుడు :--

1. వేడి నీటిలో ఉప్పు వేసి గొంతులో పోసుకొని గులగరించిఉమ్మేయ్యాలి. దీని వలన చాలా ప్రయోజనం ఉంటుంది.

2. అర లీటరు నీటిలో ఒక స్పూను మెంతులు వేసి ,మరిగించి గోరు గోరువెచ్చని నీటిని గొంతులో పోసుకొని గులగరించాలి. (మూడు పూటలా)

3. నిద్రించే ముందు 1 గ్లాసు పాలల్లో 2 గ్రాముల పసుపు వేసి చిన్న మంటపై 3 పొంగులు రానిచ్చి ఒక స్పూను   కలకండ కలిపి తాగాలి. గడగడా కాకుండా నెమ్మదిగా తాగాలి.

4. వాము           -----10 gr
    నీళ్ళు         ----- 400 gr

   వామ్మును నలగగొట్టి నీటిలో వేసి కాచి , వడకట్టి గొంతులో పోసుకొని గులగరించాలి.

గొంతులో పుండు నివారణకు ఆయుర్వేద తాంబూలం

2,3 తమలపాకులకు తొడిమలు, తోకలు, ఈనెలు తీసి బాగా తుడవాలి. దానిలో అతిమధురం పొడి

  ఒక స్పూను వేసి, మడిచి బుగ్గన పెట్టుకొని నెమ్మదిగా నమలాలి. + + సా

ఇది గొంతులో పుండును మాన్పుతుంది .అతిమధురం వలన రక్త శుద్ధి జరుగుతుంది.

                         గొంతు  శ్ర్యావ్యత కొరకు                                              24-12-08.

కఫ , వాత, పిత్త ప్రభావముల వలన గొంతు వ్యాధులు వస్తాయి. కఫం చేరినపుడు వేడి గాలి పీల్చాలి,
పిత్తం చేరినపుడు చల్లని గాలి పీల్చాలి.

యోగాసనం:-- ముద్ర వేసుకొని నోరు బాగా పూర్తిగా తెరిచి గాలిని పీల్చుకోవాలి. వేడి గాలి వస్తున్నట్లు (ఎండను తలుచుకుంటూ) భావన చెందాలి (feel అవ్వాలి ) పీల్చిన గాలిని కాసేపు బంధించి వదలాలి.

పిత్తం వలన గొంతు మూసుకు పోతే చల్లని వెన్నెలను ,చల్లదనాన్ని feel అవుతూ నాలుకను మడిచి  గాలిని పీల్చాలి.

కఫ భారము వలన గొంతు మూసుకు పోతే ఆవాల నూనెను గొంతు నరాల మీద రుద్దాలి. గొంతును
విశుద్ధ చక్రము అంటారు. ముద్ర వేసుకొని ఓం కారాన్ని గొంతులో నిలిపి పలకాలి.

శొంటి           -------50 gr
కలకండ         ------50 gr
నెయ్యి           ------25 gr

  శొంటిని వేయించి పొడి చేసి ,జల్లించాలి. కలకండను ,శొంటి పొడిని కలిపి కల్వం లో వేసి నెయ్యి పోస్త్జూ నూరాలి. బటాణి గింజలంత మాత్రలు కట్టాలి. గాలి తగిలేట్లు ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. ఉదయం , సాయంత్రం

                ఒక్కొక్క మాత్ర చొప్పున చప్పరించాలి.

                                         స్వర సౌందర్యం కొరకు                                       22-1-09.

ఫ్రిజ్ లోని పదార్ధాలు, బజారులోవండిన పదార్ధాలు, ఐస్ క్రీం లు, కూల్ డ్రింక్స్ వాడకూడదు.
రెండు పూటలా గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగాలి. దీనివలన బొంగురు గొంతు నివారింప బడుతుంది.

వసకోమ్ములు
పసుపు
శొంటి
మిరియాలు
పిప్పళ్ళు
వామ్ము
సైంధవ లవణం

      వస కొమ్ములను ఒక రోజంతా నీటిలో నానబెట్టి నలగగొట్టి ఎండబెట్టి పొడి చెయ్యాలి.
 అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని విడివిడిగా పొడులు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
ఒక చిటికెడు పొడిలో తేనె కలిపి నాకాలి.

       గొంతు సమస్యల నివారణ --- వాల్మీకి గుళికలు                                14-4-09.

నల్ల తుమ్మ బంక         ------- 50gr (4 చుక్కలు నెయ్యి వేసి వేయించి పొడి చెయ్యాలి) .
కాచు పొడి                  ------- 50gr
కలకండ                     ------- 50gr

      అన్నింటిని బాగా కలిపి కల్వంలో వేసి తగినంత నీరు కలిపి నూరాలి. ఇది పేస్టు లాగఉంటుంది .దీనినిసీసాలో భద్రపరచుకోవాలి. రోజు ఉదయం, సాయంత్రం శనగ గింజంత మోతాదులో తీసుకొని పిల్లలకు తినిపిస్తే గొంతునొప్పి, టాన్సిల్స్ నివారింప బడతాయి.

                             గొంతు సమస్యలు --- నివారణ              28-7-09.

మెంతులు     ----- ఒక టీ స్పూను
నీళ్ళు          ----- అర లీటరు

మెంతులను నీళ్ళలో వేసి కాచి చల్లార్చి గోరువెచ్చగా వున్నపుడు నీటిని గొంతులో పోసుకొని గులగరించాలి .

అల్లం రసం               ------ ఒక టీ స్పూను
బెల్లం                      ------ చిన్న ముక్క

     రెండు కలిపి దంచి నోట్లో వేసుకొని రసం మింగితే గొంతు సమస్యలు నివారింప బడతాయి.

మిరియాలు                  ------ పావు టీ స్పూను
పాలు                           ------ ఒక కప్పు
కలకండ                       ------ ఒక టీ స్పూను

పాలల్లో మిరియాలను వేసి పొంగించి కలకండ కలిపి తాగితే గొంతు బాగుంటుంది.

నల్ల ఉలవలు           ------ 40 gr
మిరియాలు             ------ 20 gr
ఇంగువ                    ------ 2 gr
నీళ్ళు                     ------ ఒక గ్లాసు
తేనె                        ------ ఒక టీ స్పూను

     నీళ్ళలో అన్ని పదార్ధాలను వేసి స్టవ్ మీద పెట్టి మరిగించి ఎనిమిదవ వంతుకురానివ్వాలి.
గోరువెచ్చగ  అయిన తరువాత తేనె కలిపి ఉదయం, సాయంత్రం తాగాలి.

దీని వలన గొంతుకు సంబంధించిన అన్ని సమస్యలు నివారింప బడతాయి. .

                       బొంగురుగొంతు సమస్య ---నివారణ                            22-5-10.

ఎండు ఖర్జూరాలు ------2,3       పిల్లలకైతే ---ఒకటి

     ముక్కలను నీటిలో నానబెట్టి, పాలల్లో వేసి మూడు సార్లు పొంగించి మరిగించాలి. దించి, గోరు వెచ్చగా  అయిన తరువాత నెమ్మదిగా కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటె బొంగురు గొంతు సమస్య నివారింప బడుతుంది.

                          గొంతులో కఫ సమస్య ---నివారణ                               15-7-10.

సైంధవ లవణం
జిలకర
పసుపు
దో,వే.దం. పిప్పళ్ళు
వాము
వస
       అన్నింటిని విడివిడిగా దంచి జల్లించి ,అన్ని పొడులను కలిపి నిల్వ చేసుకోవాలి.

పెద్దలకు------పావు టీ స్పూను నుండి అర టీ స్పూను పొడి  +  ఒక టీ స్పూను తేనె
పిల్లలకు -----పావు టీ స్పూను పొడి  + అర టీ స్పూను తేనె

    రెండు కలిపి నాలుకతో కొద్ది కొద్దిగా చప్పరించాలి. ఒకేసారి నాకేయ్యకూడదు.

                                  గొంతు నొప్పి ---నివారణ                              5-12-10.

Pressure Coocker లో నీళ్ళు పోసి దానిలో ఖాళీ గిన్నె పెట్టి ,గిన్నెలో దూదిని ఉంచాలి. దీని వలన
దూది sterilize అవుతుంది. దూదిని పుల్లకు పువ్వులా చుట్టి ద్రావణం లోముంచి పుండ్ల మీద , టాన్సిల్స్ మీద పూయాలి మరలా .ఆపుల్లని ద్రావణం లో ముంచ కూడదు, తాజాగా వాడాలి.

ద్రావణం తయారు చేసే విధానం :---

                                                వేలిగారం    ------ 10gr
Distlled Water లేక కాచి చల్లార్చిన నీళ్ళు      ------ ఒకటిన్నర లీటర్లు

    గిన్నెను స్టవ్ మీద పెట్టి వేలిగారం చిన్న ముక్కలుగా చేసి వేసి వేదిచేస్తే అది పేలాల లాగా  పొంగుతుంది.స్టవ్ ఆపి నీటిలో వేలిగారాన్ని కరిగించాలి.చాలా పరిశుభ్రమైన గుడ్డతో నీటి ని వడకట్టాలి.

                                         గొంతు నొప్పి ---నివారణ                       08-12-10.

లక్షణాలు:--- గొంతులో దురద, నస,నొప్పి, మింగేటప్పుడు కష్టంగా,నొప్పిగా ఉండడం ,గొంతు తడారి పోవడం , టాన్సిల్స్, --వీటివలన జ్వరం, ముక్కు కారడం, తలనొప్పి, ముక్కు దిబ్బడ మొదలైనవి.

  ప్రధాన కారణం Bacterial Infection,

గొంతునొప్పి చికెన్ పాక్స్ మీజిల్స్ ,పొగ ,దుమ్ము, ధూళి, సిగరెట్ పొగ  వంటి వాటి వలన వస్తుంది.

1.త్రిఫలాలు ,అల్లం, మిరియాలు, పిప్పళ్ళు, యవాక్షారం,దారుహరిద్ర(మాని పసుపు) , వేప అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని,పొడిచేసి నిల్వ చేసుకోవాలి.

          ఒక స్పూను పొడిని నీళ్ళలో వేసి కషాయం లాగా కాచి, నీటితో పుక్కిలించాలి.

2. మానిపసుపు, దాల్చిన చెక్క, త్రిఫలాలు, తుంగముస్థలు సమాన భాగాలుగా తీసుకొని పోడులుగా చేసి కలిపి నిల్వ చేసుకోవాలి. 3gr పొడిని తేనెతో కలిపి తీసుకోవాలి.

3. ఉలవలు, ముల్లంగి,దశమూలాలు సమాన భాగాలుగా తీసుకొని పొడి చేసి నిల్వ ఉంచుకోవాలి. అర టీ స్పూను పొడిని నీళ్ళలో వేసి కాచి 50ml కషాయాన్ని తాగాలి.

4. కరక్కాయను బుగ్గన పెట్టుకోవాలి.

5. గొంతు తడి ఆరకుండా చూసుకోవాలి.

                             స్వర సౌందర్యము కొరకు                        16-2-09.

దోరగా వేయించిన శొంటి పొడి                 ------రెండున్నర గ్రాము
                      కలకండ పొడి                ------ ఐదు గ్రాములు
                                   తేనె               ------ పది గ్రాములు

అన్నింటిని చేతిలో వేసుకొని బాగా రంగరించి మెల్లగా చప్పరిస్తూ రసం మింగుతూ వుంటే గొంతులోని కీచుదనం,బొంగురు గొంతులో పుండు నివారించ బడతాయి. విధంగా రెండు పూటలా చెయ్యాలి.

2. వావిలి చెట్టు వేరు యొక్క బెరడును పొడి చేసి సీసాలో నిల్వ చేసుకోవాలి.

ఒక చిటికెడు పొడి ని మంచి నువ్వుల నూనెతో రంగరించి తింటూ వుంటే ఎంత బండ గొంతైనా మృదువుగా మారుతుంది.


                                గొంతు సమస్యల నివారణ                               4-1-11.

లక్షణాలు:- ధైరాయిడ్ సమస్య , టాన్సిల్స్, స్వర పేటికకు infection చేరడం,గొంతులో గరగర

కారణాలు:-- వాతావరణ,ఆహార ,విహార సమస్యలు ,వంశపారంపర్యం మొ-

వస                                                ------50 gr
బోడసరంపూలపొడి                            ------50 gr
అతిమధురం                                -------100 gr
తులసి ఆకుల పొడి                         ------100 gr
శొంటి పొడి                                       ------50 gr

అన్నింటిని విడివిడిగా పొడిచేసి ,కలిపి నిల్వ చేసుకోవాలి. దీనికి తగిననత తేనె కలిపి నిల్వ చేసుకోవచ్చు.

    ప్రతిరోజు ఆహారానికి ముందు + సా అర టీ స్పూను ముద్దను చప్పరించి తినాలి.

                                       స్వర సౌందర్యానికి                            12-1-11.

          వృత్తిని బట్టి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు వారి స్వరాన్ని కాపాడుకోవాలి.
ఊపిరితిత్తుల సమస్య ఉన్నపుడు, ఆమ్ల సమస్యలున్నపుడు గొంతు సమస్యలు ఏర్పడతాయి.

1. నల్ల తుమ్మ బెరడు కషాయంతో పుక్కిలించాలి

   నల్లతుమ్మ పట్ట     ------- 10 gr
                నీళ్ళు      ------   4 కప్పులు

రెండింటిని మరిగించి ఒక కప్పుకు రానివ్వాలి. కషాయాన్ని నోట్లో పోసుకొని గొంతుకు తగిలేటట్లు
గులగరించాలి .

2. పాలు                            ------ 1 గ్లాసు
    పసుపు                          -----  చిటికెడు
   కలకండ                         ------  .ఒక టీ స్పూను

                 కలిపి తాగాలి. ఎంతో మార్పు కనిపిస్తుంది.

                             బొంగురుగొంతు సమస్య ---నివారణ                 31-3-11.

  నేరేడు బెరడు ఎండబెట్టి ,పొడి చేసి తేనెతో గాని, నెయ్యితో గాని మాత్రలు కట్టి రోజుకు మూడు పూటలా పూటకు రెండు మాత్రల చొప్పున చప్పరిస్తూఉంటె ఎంతటి సమస్య అయినా నివారింపబడుతుంది.

                           స్వర సౌందర్యానికి --ఆమ్ర గుటికలు                 15-4-11.

లేత మామిడి చిగుళ్ళు నీడలో ఆరబెట్టి
దంచిన పొడి                         ------ 50 gr
అతిమధురం పొడి                 ------ 50 gr
ఉసిరిక పొడి                       -------- 50 gr
మంచి శనగల పొడి            --------- 50 gr
చిన్నయాలకుల పొడి           ------- 50 gr
పటికబెల్లం                         ------- 50 gr
ద్రాక్ష రసం                          ------- తగినంత

   పై పోడులన్నింటిని కల్వం లో వేసి ద్రాక్షరసం పోస్తూ మాత్ర కట్టుకు వచ్చే వరకు నూరాలి. బటాణి గింజ లంత మాత్రలు కట్టాలి. నీడలో ఆర బెట్టి బాగా గట్టి పడిన తరువాత సీసాలో భద్ర పరచాలి.

ఉదయం+ సాయంత్రం ఒక్కొక్కటి చొప్పున చప్పరించాలి. దీని వలన గొంతు శుద్ధి అవుతుంది. స్వర
నాడులు stimulate అవుతాయి.

                   టాన్సిల్స్ (గళ గ్రంధులు ) సమస్య ---నివారణ .                  (29-11-08)

            ఉత్తరేణి ఆకులు        -------- 50gr
           వెల్లుల్లి పాయలు         ------- 50gr
           మిరియాల పొడి          ------- 50gr

 మూడు కలిపి కల్వం లో వేసి కొద్దిగా నీళ్ళు చల్లి మెత్తగా నూరాలి. శనగ గింజలంత మాత్రలు కట్టి
ప్లేటులో వేసి బాగా గాలి తగిలే చోట ఆరబెట్టాలి. తడి లేకుండా ఆరిన తరువాత భద్ర పరచుకోవాలి.
ప్రతి రోజు మూడు పూటలా ,పూటకు ఒక మాత్ర చొప్పున గోరు వెచ్చని నీటితో వాడాలి.

గళ గ్రందులే కాక కఫ భారంతో వచ్చే దగ్గు, జలుబు, ఆయాసం, గొంతులో గడ్డలు కూడా నివారింప బడతాయి. ఇది అనుభవ పూర్వకము.

2. (26-5-09) ఒక గిన్నెలో నీళ్ళు పోసి బాగా వేడి చేసి, పసుపు వేసి ,దించి,ముక్కుకు, నోటికి,
చెంపలకు, గొంతుకు ఆవిరి పట్టించాలి. \గుడ్డనుఆ నీటిలో ముంచి,పిండి, గొంతుమీద ,ముక్కు చుట్టూ, దవడల మీద కాపడం పెట్టాలి.

సుఖాసనం (ఉజ్జాయి ప్రాణాయామం ) లో కూర్చొని,గొంతు బిగించి,గాలిని శబ్దం వచ్చేట్లు పీల్చాలి. టాన్సిల్స్ ను తొలగించ రాదు. అవి శరీర ఉపయోగం కొరకు ఏర్పడినవి.

అర గ్లాసు పాలల్లో 10 లేక 15 ఎండు ద్రాక్ష పండ్లను వేసి మూడు పొంగులు రానిచ్చి, ఒక టీ స్పూను కలకండ కలిపి , పండ్లు తిని, పాలు తాగితే మంచి శక్తి కలిగి ,టాన్సిల్స్ సమస్య నివారింప బడుతుంది.    రక్త వృద్ధి జరుగుతుంది.

     చిటికెన వేలుకు, అరచేతికి మధ్య అరచేతి వైపు ,వెనక వైపు 50,60 సార్లు నొక్కుతూ ఉంటె తగ్గిపోతాయి.

3, (21-2-10.)  

100 గ్రాముల వామును మట్టి మూకుడులో వేసి, తగినంత తులసి ఆకుల రసం పోసి మూత పెట్టి రాత్రంతా ఉంచాలి ఉదయం ఎండా బెట్టాలి. (భావన చెయ్యడం) విధంగా మూడు రోజులు చెయ్యాలితరువాత పూర్తిగా ఎండా బెట్టి, దంచి ఎండ బెట్టి ,దంచి ,పొడిచేసి నిల్వ చేసుకోవాలి.

 ఈ పొడిని రెండు పూటలా మూడు, నాలుగు చిటికెల పొడిని ఒక గ్లాసు వేడి నీటితో గాని, లేదా ఒక 
టీ స్పూను తేనె తో గాని సేవిస్తే టాన్సిల్స్ మాత్రమే కాక ,కఫ ,గొంతు సమస్యలు నివారింప బడతాయి.
4.. (22-2-10.)

తులసి ఆకులు                 ----- 50 gr
దో.వే. మిరియాల పొడి        ----  50 gr
అతి మధురం పొడి            -----  50 gr

 అన్నింటిని కల్వంలో వేసి కొద్దిగా నీరు కలిపి ,మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు కట్టి నీడలో
ఆరబెట్టాలిఉదయం, సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున వాడాలి.

5.. (15-12-10.)

వెల్లుల్లి ని ముద్దగా నూరి , వేడి చేసి తేనె తో కలిపి గొంతు మీద అంటించాలి.

పెరుగు, మజ్జిగ, అరటిపండు,ఐస్ క్రీం , చాక్లెట్లు మొదలైన వాటికి దూరంగా ఉండాలి.

చిటికెడు మిరియాల పొడి, చిటికెడు పసుపు లను వేడి పాలలో కలుపుకొని తాగితే నివారింప బడుతుంది.

6.(23-12-10.)

చింత గింజలను బాగా వేయించి , రెండు రోజులు నాన బెట్టి పిసికితే పై తొక్కులు వూడివస్తాయి. తరువాత పప్పును బాగా ఎండ బెట్టి. , దంచి , పొడి చెయ్యాలి. పొడిలో కొద్దిగా నీరు కలిపి ముద్దగా  చేసి శనగ గింజలంతమాత్రలు చేసి ఎండ బెట్టాలి.

    ఈమాత్రలను రోజుకొకటి చొప్పున బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉండాలి.


7.. (29-12-10)

లాలా జల గ్రంధుల చుట్టూ Infection చేరితే టాన్సిల్స్ వాస్తాయి. లేదా తగినంత లాలాజలం
ఏర్పడక పోతే గ్రంధులు వాయడం జరుగుతుంది.

లక్షణాలు:---గొంతు భాగాలలో వాపు రావడం ,ముందు ఒక వైపు వాపు వచ్చి తరువాత రెండవ వైపు కూడా వస్తుంది. తలనొప్పి, తల తిరగడం ,కళ్ళు తిరగడం,వంటి లక్షణాలుంటాయి.

   ఈ Infection క్లోమానికి పాకితే మధుమేహం రావడానికి కూడా అవకాశం ఉంది.

15 సంవత్సరాల లోపు పిల్లల్లో ఎక్కువగా వస్తుంది.

ఖదీరాది వటి

    ముందుగా బిళ్లలపై లేపనం చెయ్యాలి.

రావి చెట్టు పట్టను దంచి ముద్ద చెయ్యాలి. దానికి శొంటిపొడి కలిపి పేస్టు లాగా చేసి గొంతు భాగంలో పట్టు  లాగా వెయ్యాలి.

ఉప్పు కలిపిన వేడి నీటితో పుక్కిలించాలి.
వాపు ఉన్నట్లయితే మట్టిని వేడి చేసి కాపడం పెట్టాలి.
వేడి నీళ్ళలో గుడ్డను ముంచి కాపడం పెట్టాలి.

రావి పట్ట                         ---------   50 gr
రావి పండ్లు                       ---------  50 gr
త్రికటు చూర్ణం                       ------100 gr (పిప్పళ్ళ ను శుద్ధి చెయ్యకుండా వాడ కూడదు) (33+33+33gr)
తులసి ఆకుల చూర్ణం                 -- 100 gr

  అన్నింటిని కలిపి నీటితో నూరి శనగ గింజలంత మాత్రలు తయారు చేసి ఎండిన తరువాత నిల్వ చేసుకోవాలి.

  ప్రతి రోజు పూటకు రెండు మాత్రల చొప్పున మూడు పూటలా వేసుకోవాలి. + + సా =2+2+2

8..                         టాన్సిల్స్ వలన ఊపిరాడక పోతే :-----12-3-11

    నల్ల జిలకరను దోరగా వేయించి దంచి గుడ్డలో చుట్టి వాసన చూస్తుంటే తగ్గుతుంది.

9.                                                     (13-4-11)

శొంటి , బెల్లం కలిపి పిసికి లేదా నూరి గొంతు పై టాన్సిల్స్ మీద పట్టు వేస్తే కరిగిపోతాయి.

10.                                                  (26-5-09 )

    ఒక గిన్నెలో వేడి నీటిని పోసి దానిలో పసుపు పొడి వేసి ముక్కు, నోరు,చెంపలు, గొంతు లకు
ఆవిరి పట్టించాలి. ఒక నూలు గుడ్డను నీటిలో ముంచి పిండి గొంతు మీద, ముక్కు మీద, దవడల మీద  కాపడం పెట్టాలి.

సుఖాసనం లో కూర్చొని గాలిని శబ్దం వచ్చేట్లు పీల్చాలి.

టాన్సిల్స్ ను ఆపరేషన్ చేసి తొలగించ రాదు. అవి శరీరానికి ఉపయోగపడే గ్రంధులు.

ఆహారము ;-- అర గ్లాసు పాలల్లో 10 లేక 12 ఎండు ద్రాక్ష పండ్లను వేసి స్టవ్ మీద పెట్టి మూడుపొంగులురానిచ్చిఒక స్పూను కలకండ కలిపి పండ్లు తిని పాలు తాగితే మంచి శక్తి కలిగి టాన్సిల్స్ సమస్య నివారింప బడుతుంది. రక్త వృద్ధి జరుగుతుంది.

                                 గొంతులో సమస్యలు ---నివారణ                      21-2-10.

 తులసి ఆకులు , తులసి వేళ్ళు, తుమ్మి ఆకులు, తుమ్మి వేళ్ళు, ఉప్పు --- అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని దంచి పొడి చేసి నిల్వ చేసుకోవాలి.

ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూను పొడిని కలుపుకొని తాగాలి.ఇది గొంతులో వచ్చే అనేక సమస్యలను నివారిస్తుంది.

                                టాన్సిల్స్ --- నివారణ                                      28-5-10

         ఆహారం మింగలేక పోవడం, గొంతు వాపు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు వుంటాయి.
అతి చల్లని పదార్ధాలు, బయటి పదార్ధాలను తినడం, పులిసిన పదార్ధాలు తినడం , స్విమ్మింగ్ పూల్స్ కు  దగ్గరలో తిరగడం మొదలైన కారణాల వలన వచ్చే అవకాశాలు ఎక్కువ.

     ఈ వ్యాధి శరీరంలో ప్రవేశించినపుడు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.

కాచి చల్లార్చిన నీటిని తాగాలి.

వేడి నీళ్ళలో ఉప్పు గాని, అతిమధురం గాని పుక్కిలించడం చాలా ఉపయోగ పడుతుంది . లేదా తులసి   కషాయం పుక్కిలించాలి, కొంత తాగాలి.

వాము                     ---- చిటికెడు
తులసి రసం             ---- రెండు టీ స్పూన్లు
మిరియాల పొడి        ---- చిటికెడు

      అన్నింటిని కలిపి తీసుకోవాలి.

వాపు తగ్గడానికి :-- అగస్త్య రసాయనం మొదలైనవి.

                         గొంతులో దురద, నస -- నివారణ                19-11-10.

   చెవి తమ్మేను పట్టుకొని లాగడం లేదా తమ్మేను ఊపడం వలన గొంతులో దురద తగ్గుతుంది.

                         గొంతు నొప్పి నివారణకు                               3-12-10.

తాజా జామ ఆకుల్ని తెచ్చి కడిగి కచ్చా పచ్చాగా దంచి కషాయం తయారు చెయ్యాలి. దానిని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. దీనితో గొంతు నొప్పి, బొంగురు గొంతు తగ్గుతాయి.

                       టాన్సిల్స్ వాపు-- నివారణ                                15-12-10.

1. అర టీ స్పూను పటికను నీటిలో కలిపి పుక్కిలిస్తే తగ్గుతుంది.

2. ఒక టీ స్పూను త్రిఫల చూర్ణాన్ని నాలుగు కప్పుల నీటిలో వేసి మరిగించి ఒక కప్పు కషాయానికి రానివ్వాలి   దీనితో మూడు పూటలా నోట్లో పోసుకొని టాన్సిల్స్ కు తగిలేట్లు గా గొంతు వరకు పోనిచ్చి పుక్కిలించి ఉమ్మేయ్యాలి.

3. వెల్లుల్లిని ముద్దగా నూరి వేడి చేసి తేనె కలిపి అంటించాలి.
. గొంతు మీద టాన్సిల్స్ వున్నచోట అనగా నోటిలోపల కాదు

4; పసుపు                   --- చిటికెడు
మిరియాల పొడి             --    "

రెండింటిని కలిపి వేడి పాలలో కలుపుకొని తాగితే నివారింప బడుతుంది.
పెరుగు, మజ్జిగ, అరటి పండు, ఐస్ క్రీము, చాక్లెట్లు వంటి వాటికి దూరంగా వుండాలి.

                                   స్వర సౌందర్య గుటికలు                       23-12-10.

 చింత గింజలను బాగా వేయించి రెండు రోజులు నానబెడితే వాటి పై తొక్కలు వూడి వస్తాయి. పప్పును బాగా ఎండబెట్టి దంచి పొడి చేయాలి. దీనిలో కొద్దిగా నీటిని కలిపి ముద్దగా చేసి శనగ  గింజలంత మాత్రలు చేసి ఎండబెట్టాలి.

టాన్సిల్స్ వాచినపుడు చాలా అవస్థగా వుంటుంది. మాత్రను రోజుకొకటి చొప్పున బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ వుండాలి.

                            గొంతునొప్పి నివారణకు చిట్కా                   29-9-10.

5, 6 తులసి ఆకులను, ఒక చిన్న అల్లం ముక్కను కలిపి నీళ్ళలో వేసి కషాయం కాచి ప్రతి రోజు తాగితే  గొంతు నొప్పి నివారింపబడుతుంది.

                              బొంగురు గొంతు --స్వర భేదము                1-11-10.

ఆహార పానీయాలలో తేడాల వలన వస్తుంది. థైరాయిడ్ సమస్య వున్నవాళ్ళకు సమస్య జీవిత కాలం వుంటుంది.

     నాసికా సమస్యల వలన, తలకు సంబంధించిన సమస్యలుండి నరాల వ్యవస్థ వలన, మర్మావయవాల సమస్యల వలన, స్వర పేటిక వాపు వలన కూడా సమస్య ఏర్పడుతుంది.
ఎక్కువగా సమస్య ఇతర రోగాల సమస్యల వలన మాత్రమే ఏర్పడుతుంది.

1. మిరియాల పొడిని పాలలో కలుపుకొని తాగాలి.

2. లవంగాది వటి
ఖదీరాది వటి
ఏలాది వటి

పై ఔషధాలలో ఏదో ఒకటి వాడుకోవచ్చు.

3. వస చూర్ణం                 --- 100 gr ( దీనిని 500 mg కంటే ఎక్కువ వాడకూడదు.)
పిప్పళ్ళ చూర్ణం              --- 100 gr
శొంటి చూర్ణం                  --- 100 gr
బోడసరం చూర్ణం                --100 gr ( ముండి)
సరస్వతి ఆకుచూర్ణం            -100 gr

వసకోమ్ములను వేడి నీటిలో నానబెట్టి తొక్క తీసి బాగా ఎండబెట్టి దంచి చూర్ణం చేసి వాడుకోవాలి
పిప్పళ్ళను మజ్జిగలో గాని నిమ్మ రసం లో గాని నానబెట్టి ఎండబెట్టి చూర్ణం చేసి వాడుకోవాలి.
అన్ని చూర్ణాలను కలిపి నిల్వ చేసుకోవాలి.

విధంగా తయారు చేసుకున్న ఔషధం అంతా పూర్తి అయ్యే వరకు వాడాలి.
రెండు టీ స్పూన్ల పొడిని తేనెతో కలిపి వాడాలి. నాలుక మీదికి తీసుకుని అరగంట పాటు చప్పరిస్తూ
మింగాలి.

                              గొంతులో గరగర నివారణకు                    18-11-10.

ధనియాలు  ---- 10 gr
మిరియాలు ---- 10 gr

రెండింటిని దోరగా వేయించి దంచి ఉప్పు, నెయ్యి కలిపి అన్నంలో మొదటి ముద్దలో తినాలి దీనినుండి ఇన్ఫెక్షన్ క్లోమానికి చేరితే మధుమేహం వచ్చే అవకాశం కలదు.

రోగనిరోధక శక్తి లేని వాళ్ళలో బాక్టీరియా శరీరమంతా పాకే అవకాశం కలదు.

ఇది ఎక్కువగా 15 సంవత్సరాల లోపు పిల్లలలో ఎక్కువగా వస్తుంది

ఖదీరాది వటి

దీనిని గొంతుపైన గవద బిళ్ళలు వున్నచోట నీటితో కలిపి లేపనం చేయాలి.

రావి చెట్టు పట్టచూర్ణం
శొంటి పొడి

రావి చెట్టు పట్టాను దంచి ముద్దగా చేసి దానికి శొంటి పొడి కలిపి పేస్ట్ లాగా చేసి గొంతు భాగంలో పట్టు లాగా  వెయ్యాలి.

ఉప్పు కలిపిన వేడి నీటితో పుక్కిలించాలి.

వాపు వుంటే వేడి మట్టితో కాపడం పెట్టాలి.

వేడి నీటిలో గుడ్డను ముంచి కాపడం పెట్టాలి.

                                బొంగురు గొంతు సమస్య --నివారణ              24-2-11.

థైరాయిడ్  వ్యాధి వున్నవాళ్ళకు సమస్య సర్వ సాధారణం . తరచుగా జలుబు చేయడం, ప్రేవులలోని మంట పైకి తన్నడం, ఎక్కువగా గొంతును ఉపయోగించడం మొదలైన కారణాల వలన కూడా సమస్య ఏర్పడుతుంది.

పసుపు పొడి                    --- 50 gr
వస పొడి                         --- 50 gr
పిప్పళ్ళ పొడి                   --- 50 gr
వాము పొడి                      --- 50 gr
మిరియాల పొడి                --- 50 gr
శొంటి పొడి                       --- 50 gr
సైంధవ లవణం                   ---50 gr

      అన్నింటిని విడివిడిగా చూర్ణాలు గా చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
పూటకు రెండు గ్రాముల పొడి చొప్పున తేనెతో కలిపి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి
తీసుకుంటూ వుంటే గొంతు బొంగురు పోవడం అనే సమస్య తగ్గుతుంది, మరియు కఫసమస్య
కూడా నివారింప బడుతుంది.

తేనె మాత్రమే కూడా బాగా పని చేస్తుంది.

అర గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూను తేనె కలిపి పుక్కిలించాలి.

లవంగాన్ని సూదికి గుచ్చి, కాల్చి తీసి బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ వుండాలి.

                                        టాన్సిల్స్ వలన  ఊపిరాడక పోతే                               12-3-11.
    
              నల్ల జిలకరను దోరగా వేయించి దంచి గుడ్డలో వేసి వాసన చూస్తుంటే తగ్గుతుంది.

                                   బొంగురు గొంతు  నివారణకు చిట్కా                                31-3-11.

              నేరేడు చెట్టు బెరడును ఎండబెట్టి,  పొడి చేసి  తేనె తో గాని,  నెయ్యితో గాని మాత్రలు కట్టి
   రోజుకు మూడు పూటలా పూటకు రెండు మాత్రల చొప్పున  చప్పరించాలి.
              దీనితో ఎంతటి సమస్య అయినా నివారింప బడుతుంది.


                                             బొంగురు గొంతు ---నివారణ                      18-4-11.
బోడతరం పూల పొడి                     ---50 gr
దోరగా వేయించిన మిరియాల పొడి     --- 25 gr
              అల్లం ముక్కలు              ---  25 gr
                      బెల్లం                     --- తగినంత

       అన్ని పదార్ధాలను కల్వంలో  వేసి మెత్తగా నూరాలి.  తరువాత తగినంత బెల్లం కలిపి నూరాలి.
        రోజుకొక మాత్ర చొప్పున నోట్లో వేసుకుని చప్పరిస్తూ వుంటే సమస్య నివారింప బడుతుంది.

                            బొంగురు గొంతు నివారణకు స్వర మాధురీ చూర్ణం          1-6-11.

అతిమధురం చూర్ణం             ---10 gr ( గొంతులోని మంటను తగ్గిస్తుంది ) '
 వసకోమ్ముల చూర్ణం            ---  5 gr
          తేనె                       --- 50 gr

     ఒక గిన్నెలో రెండు చూర్ణాలను  వేసి  తేనె కలుపుతూ లేహ్యం  లాగా తయారు చేయాలి .

     దీనిని మూడు , నాలుగు మోతాడులుగా విడగొట్టి ఒక  రోజులో వాడుకోవాలి .  ప్రతిసారీ ఒక్కొక్క
అర టీ స్పూను  చొప్పున చప్పరిస్తూ వుండాలి .

     దీని వలన గొంతులోని కండరాల నొప్పి , వాపు , మంట తగ్గుతాయి .  స్వరం బాగా వస్తుంది .

      గుసగుసగా మాట్లాడడానికి ప్రయత్నిస్తే  కండరాలలో నొప్పి ఎక్కువవతుంది.  మాటిమాటికి
గొంతును సవరించుకోకూడదు .

                                    టాన్సిల్స్ యొక్క వాపు నివారణకు  చిట్కా                   6-6-11.

పసుపు              --- ఒక టీ స్పూను
ఉప్పు               --- అర టీ స్పూను
నీళ్ళు               --- ఒక గ్లాసు

       అన్నింటిని కలిపి మరిగించి  అర గ్లాసుకు రానిచ్చి కొంచం వేడిగా  వున్నపుడు నోట్లో పోసుకొని
  టాన్సిల్స్ కు ఆ నీళ్ళు తగిలేట్లు గా చేసి గరగర లాడించి ఉమ్మేయ్యాలి .

                                            గొంతు సమస్యలు ---నివారణ                                    15-6-11.

చల్లటి అన్నం          +     వేడి కూర
వేడి అన్నం             +     చల్లటి కూర
చల్లని నీళ్ళు           +      వేడి కాఫీ
      
     పై విధంగా సేవించడం విరుద్ధ ఆహారం అవుతుంది. .  కావున ఆ విధంగా
చేయకూడదు.
     కఫాన్ని పెంచే పదార్ధాలను తినకూడదు. చల్లని ప్రదేశాలలో తిరగకూడదు.

1. ఉసిరిక పొడి
    కలకండ
    రెండింటిని సమానంగా తీసుకొని కలిపి నిల్వ చేసుకోవాలి.

    ప్రతిరోజూ ఒక టీ స్పూను పొడిని సేవిస్తూ వుంటే గొంతు సమస్యలు పూర్తిగా
నివారింపబడతాయి.

2. రెండు కప్పుల నీటిలో అర టీ స్పూను కరక్కాయ పొడిని వేసి మరిగించి ఒక కప్పుకు
రానిచ్చి వడపోసి గోరువెచ్చగా అయిన తరువాత ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగాలి.

                                         గొంతు సమస్య   --- నివారణ                                       5-7-11.

   వేప పుల్లతో పళ్ళు  తోముకోవడం ,  నాలుక పై పుల్ల తో గీరడం  చేస్తే ఆ చేదు కొంత గొంతులోనికి దిగి గొంతులోని
కఫం కరుగుతుంది .
   నేరేడు ఆకులను కచ్చాపచ్చా గా దంచి ఒక గ్లాసు నీటిలో వేసి కాచి ఆ నీటిని వడకట్టి తాగడం గాని లేదా నోట్లో పోసుకొని
గొంతు లో గరగర లాడించి ఉమ్మెయ్య వచ్చు

                                                       గొంతు నొప్పి   --- టాన్సిల్స్                          8-7-11.
లక్షణాలు :-- మింగలేకపోవడం
టాన్సిల్స్ వాయడానికి కారణాలు  , లక్షణాలు :-- ఇన్ఫెక్షన్ చేరడం . నోటిడుర్వాసన , నొప్పి , జ్వరము , తలనొప్పి
చెవి నొప్పి వుంటాయి

                                                       ఖదీరాది గుళికలు

చండ్ర చెక్క (కాచు ) పొడి            ---  25 gr
కర్పూరం                                ---    5 gr
చలవ మిరియాల పొడి              ---    5 gr
జాజికాయ పొడి                        ---    5 gr
యాలకుల గింజల పొడి             ---    5 gr

      అన్నింటిని కల్వం లో వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుతూ మాత్రాపాకం వచ్చే వరకు నూరాలి . శనగ గిన్జలంత మాత్రలు
కట్టి నీడలో ఆరబెట్టాలి .
      పూటకు ఒక మాత్ర చొప్పున మూడు పూటలా నోట్లో వేసుకొని చప్పరించాలి .

      దీనిని వాడడం వలన టాన్సిల్స్ వాపు , దురద ,  గొంతు నొప్పి , చెవి నొప్పి , తల నొప్పి తగ్గుతాయి

సూచనలు :-- ఒక గ్లాసు వేడి నీటిలో ఒక స్పూను ఉప్పు వేసి  ఆ నీటిని కొద్ది కొద్దిగా గొంతులో పోసుకొని గరగర లాడించి
ఉమ్మేస్తూ వుండాలి .   వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం
ముఖ్య గమనిక :--- టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ను గొంతులోనికి పోనీకుండా కాపాడతాయి . కావున వాటిని ఆపరేషన్ చేసి
తొలగించరాదు .

                                  కంట మాల  ( గొంతు చుట్టూ గడ్డలు )  ---నివారణ                       17-8-11.

పసుపు                        --- 50 gr
వేపాకులు                     --- 50 gr

        రెండింటిని కలిపి కల్వంలో వేసి తగినంత నీరు చేరిచి మెత్తగా నూరాలి . రేగు గింజలంత  మాత్రలు తయారు చేసి
నీడలో ఆరబెట్టాలి .

        ఉదయం పరగడుపున , రాత్రి ఆహారానికి గంట ముందు ఒక్కొక్క మాత్ర చొప్పున సేవించాలి . దీనిని పై పూతకు
కూడా వాడవచ్చును .

                                              బొంగురు గొంతు నివారణకు --- స్వరమంజరి                 23-8-11

వాము పొడి                      --- 20 gr
పసుపు పొడి                     --- 20 gr
చిత్రమూలము                  --- 20 gr
యవాక్షారము                   --- 10 gr
ఉసిరిక పొడి                      --- 20 gr
నెయ్యి                            --- అర టీ స్పూను
తేనె                               --- ఒక టీ స్పూను

        అన్ని చూర్ణాలను  కల్వం లో వేసి తగినంత నెయ్యి , తేనె కలిపి నూరాలి . బాగా నూరి కుంకుడు గింజలంత మాత్రలు
తయారు చేసి ఆరబెట్టాలి .
         ఉదయం , సాయంత్రము ఒక్కొక్క మాత్ర చొప్పున గోరువెచ్చని నీటితో సేవించాలి .

సూచనలు :--- ప్రతి రోజు ఓంకారం సాధన చేయాలి .     
                      చలిగాలిలో తిరగ కూడదు , చల్లటి పదార్ధాలను తినకూడదు .

       దీనిని వాడడం వలన ఆడగొంతు మగగొంతులాగా వుండడం ,  మగగొంతు ఆడ గొంతు లాగా వుండడం వంటి సమస్యలు నివారింపబడతాయి .

      శంఖ ముద్రను వేసి  హం  అనే అక్షరాన్ని పద్మాసనం లో కూర్చొని చేతులు చాపి చాలా సేపు పలకాలి






        

    

 
   


    












.