కాళ్ళు/పాదాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కాళ్ళు/పాదాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

బోదకాలు

                                బోదకాలు --నివారణ                              5-6-10.
 
            మన దేశం లోని కోస్తా ప్రాంతాల్లోని , పర్వత ప్రాంతాల్లోని ప్రజలలో ఎక్కువగా వుంటుంది.  ముఖ్యంగా  మన దేశంలో ఇది ఎక్కువ.
 
            కాళ్ళు, చేతులు రొమ్ము మొదలైన భాగాలలో ఎక్కువగా వస్తుంది.
 
            ఈ వ్యాధికి సంబంధించిన క్రిమి శరీరంలోకి ప్రవేశించిన తరువాత జ్వరం వస్తుంది జ్వరం వచ్చిన తరువాత  ఈ వ్యాధి బయట పడడానికి మూడు నెలలనుండి  కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు.
 
                                            24-11-10

తమలపాకులు                 --- 7  (మెత్తగా నూరాలి)
సైంధవ లవణం                ---- ఒక గ్రాము
 
  రెండు కలిపి వేడి నీటితో తీసుకుంటే తగ్గుతుంది. 40 రోజులు  వాడాలి.

                                              13-12-10.

         బోద  పురుగులు మోకాళ్ళ నుండి పాదాల మధ్య వరకు వ్యాపించి నివాసం ఏర్పరచుకుంటాయి. ఇవి మూత్ర  పిండాలలోని  లింఫు నాళాలలో చేరి లింఫు గ్రంధులు పని చెయ్యకుండా చేస్తాయి.

         కాళ్ళు లావెక్కడం, గజ్జలలో దురదలు మొదలగు లక్షణాలు వుంటాయి. 

         వ్యాధి నిరోధక శక్తి తగ్గినపుడు రావడానికి అవకాశాలెక్కువ.

నిత్యానంద రసం
యోగ రాజ గుగ్గులు
మహా యోగ రాజ గుగ్గులు

       పై ఔషధాలలో దేనినైనా వాడుకోవచ్చును.

సముద్రపాల కాయల గింజలను లేదా కాయలను పెరుగులో నానబెట్టి ఎండబెట్టి దంచి పొడి చెయ్యాలి. --10 gr
కరక్కాయల పెచ్చులను ఆముదం లో వేయించి దంచి పొడి చెయ్యాలి                                           --10 gr
తిప్ప తీగ కాండం  రసం లేదా ఎండబెట్టిన  పొడి                          --- 50 gr
పల్లేరు కాయల పొడి                                                             ----50 gr

      అన్నింటిని కలిపి సీసాలో  భద్ర పరచుకోవాలి,  ఈ పొడిని నీటితో గాని, పెరుగు తేట తో గాని తీసుకుంటే  వ్యాధి తీవ్రత తగ్గుతుంది.

                                                          13-6-11

         ఈ సమస్య వచ్చిన సంవత్సరంలోపు మాత్రమె అయితే వ్యాధి నివారింపబడుతుంది.

కరక్కాయ పొడి                       
బార్లీ నీళ్ళు
పాలు
         అన్నింటిని కలుపుకొని తాగాలి.

         కరక్కాయ పెచ్చులను చిన్న ముక్కలుగా చేసి కొన్ని చుక్కల వంటాముదం వేసి వేయించి
దంచి,  జల్లించి చూర్ణాన్ని సీసాలో నిల్వ చేసుకోవాలి.

        పావు నుండి అర టీ స్పూను చూర్ణాన్ని దేశవాళీ ఆవు మూత్రంలో కలిపి ఉదయం పరగడుపున తాగాలి.

                                        బోదకాలు --- నివారణకు  --- స్లీపద మంజరి                       16-8-11.
స్లీపద  = బోదకాలు
రకాలు :---  బోదకాలు , బోడ చేతులు ,  బోడ వృషణాలు  అని రకాలున్నాయి .

నెల తాడి గడ్డల చూర్ణం                       ---- 50 gr
ఉత్తరేణి వేర్ల చూర్ణం                             ---- 50 gr
దోరగా వేయించిన పిప్పళ్ళ  చూర్ణం        ---- 50 gr
                     బెల్లం                          ----150 gr

        అన్ని పదార్ధాలను కల్వం లో వేసి మెత్తగా నూరి  10 గ్రాముల మోతాదుగా మాత్రలు తయారు చేయాలి
ఇది మాత్ర కట్టుకు రాకపోతే   10 గ్రాముల చూర్ణాన్ని చప్పరించి నీళ్ళు తాగాలి .

వేపాకు
గోంగూర
         కలిపి నూరి వాపు వున్న చోట వేసి కట్టు కట్టాలి .

                                           




 

కాళ్ళు

                               కాళ్ళ, చేతి వేళ్ళమధ్య పాచి పట్టడం                                 28-1-09.
        
    పొలాల్లోని నీళ్ళలోని రసాయనాల వలన, కర్మాగారాల లోని రసాయనాల వలన వేళ్ళమధ్యలోని రక్తం మలినమవుతుంది  కాళ్ళు నడవడానికి కూడా వీలు కాదు.
 
                         పసుపు            -------   50 gr
                         గడ్డ కర్పూరం   --------  50 gr
                         తులసి ఆకుల పొడి  ---  50 gr
 
       అన్నింటిని విడివిడిగా పొడి చేసుకొని కలిపి వుంచుకోవాలి.
 
       కలబంద గుజ్జును శుద్ధి చేసి (7 సార్లు నీటిలో విదిలించాలి )  పొడికి కలిపి నూరి ఆ పుండ్లకు పట్టించాలి.

                   చచ్చుబడిన కాళ్ళు తిరిగి శక్తిని పొందడానికి                                              26-3-09.

                                        కానుగ చెట్ల వేర్ల రసం                 ----- ఒక లీటరు
                                        వంటాముదం                           -----  ఒక లీటరు

       కానుగ చెట్టు వేర్లను (సాధ్యమైతే ఉత్తరం వైపు పాకి వున్న వేర్లు)  తెచ్చి దంచి రసం తీయాలి.

      రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి రసం ఇంకి పోయి తైలం మాత్రమే మిగిలే వరకు సన్న మంట మీద కాచాలి.  చల్లారిన తరువాత సీసాలో నిల్వ చేసుకోవాలి.

       దీనిని కాళ్ళ మీద ఏ భాగమైతే చచ్చుబడి ఉన్నదో ఆ ప్రాంతం లో రుద్దాలి. దీని వలన కాళ్ళకు శక్తి వస్తుందినడక వేగం హెచ్చుతుంది.

                కాళ్ళు, చేతులపై వచ్చే పుండ్లను నివారించే లేపనం                             31-5-09.

                          నల్ల జిలకర పొడి              ---- 20 gr
                          పసుపు                          ---- 20 gr
                         ముద్దకర్పూరం                 ---- 10 gr
                         కొబ్బరి నూనె                   ---- 50 gr

      కొబ్బరి నూనెను వేడి చేసి  దించి దానిలో కర్పూరం వెయ్యాలి కరిగిన  తరువాత రెండు పొడులను వేస్తూ  కలపాలి. పొడి గాని, నూనె గాని తగ్గితే కలుపుకోవచ్చు.  సీసాలో నిల్వ చేసుకోవాలి. ఎంత కాలమైనా నిల్వ వుంటుంది.

     ఈ తైలాన్ని వాడడం వలన దెబ్బలు, గాయాలు, పుండ్లు, రసిక కారే పుండ్లు కూడా నివారింప బడతాయి.

పద్యం:-- వంకాయ, గోంగూర, ఆవకాయ, ఆవాలు,మాంసం, గుడ్లు వంటివి తినకూడదు.

                                               రక్త శుద్ధి త్వరగా జరగాలంటే

    100  గ్రాముల ఆవు నేతిని కరిగించి దానిలో  100 మిరియాలను లెక్కబెట్టి వేసి స్టవ్ ,మీద నుండి దించి వడకట్టాలి. ఆ నేతిని సీసాలో నిల్వ చేసుకోవాలి. దీనిని భోజనం లో అన్నం లోని తొలి ముద్దలో  వేసుకొని ప్రతి రోజు తింటూ వుంటే త్వరగా రక్త శుద్ధి జరుగుతుంది. దేనిని ఏ చర్మ వ్యాధి నివారణ కైనా వాడవచ్చు. దీనితోచర్మం ఎంతో అందంగా తయారవుతుంది.

     మిరియాలను కూరలలో వాడుకోవచ్చును.

                     కాళ్ళ మంటల నివారణకు -- మదయంత్యాది చూర్ణం                        28-3-11.

                                             మదయంతిక = గోరింటాకు

      ఎక్కువ సేపు నిలబడడం ముఖ్య కారణం   దీని వలన కాళ్ళ పై  ఒత్తిడి పెరుగుతుంది.

                    గోరింటాకు పొడి        --- 80 gr
                    చందనం పొడి           --- 10 gr
          ఎండిన గుంటగలగర పొడి   ---  10 gr

                    ఒక గిన్నెలో  అన్ని పొడులను వేసి బాగా కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
    రెండు టీ స్పూన్ల పొడిని తీసుకుని దానికి ఒక గ్రాము మెంతాల్ కలిపితగినంత నీరు  కలిపి పేస్ట్ లాగా తయారు  చేయాలి. 

      ఈ పేస్ట్ ను పాదం పైన కింద అంతా పూయాలి

సూచనలు :--

    కాళ్ళకు సరిపడిన చెప్పులను మాత్రమే వాడాలి.  అప్పుడప్పుడు కొబ్బరినూనె,  చందన తైలం
 వంటివి రాస్తూ వుండాలి.  

    మసాలాలు తినకూడదు.  మద్యం,  సిగరెట్ల వంటి అలవాట్లను మానెయ్యాలి.

    బరువును ఒక కాలి మీది నుండి ఇంకొక కాలి మీదికి మార్చుకుంటూ వుండాలి.

    కుషన్ షూ వాడాలి.

                 వర్షాకాలంలో  కాళ్ళ మీద , చేతుల మీద ఏర్పడే దురదలు , కొంకర్లు పోవడం      25-7-11.

                                                     హస్త , పాద లేపనం

తేనె                      ---- ఒక టేబుల్ స్పూను
గ్లిజరిన్                  ---- ఒక టీ స్పూను
గుడ్డు తెల్ల సోన       ---- ఒకటి
శనగ పిండి             ---- తగినంత

      అన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా  పేస్ట్ లాగా కలపాలి . దీనిని కాళ్ళ మీద , చేతుల మీద  పూయాలి . దీనిని
6 --- 8 గంటల వరాళి  ( రాత్రంతా )  వుంచి  ఉదయం కడగాలి .
      దీని వలన చారలు ముడతలు కొంకర్లు  నివారింపబడతాయి .

సూచనలు ;--- మాటిమాటికి నీటిలో  మరియు వర్షంలో తడవకూడదు .నీల్లు ఎక్కువగా తాగాలి . సబ్బుకు ,  నీటికి
సంబంధించిన పనులు చేయకూడదు .

                                                    కాళ్ళ నొప్పులు  --- బెణుకులు                           19-8-11.

ఉత్తరేణి ఆకులు                  --- 100 gr
నువ్వుల నూనె                   --- 100 gr

     గిన్నెలో నూనెను పోసి స్టవ్ మీద పెట్టి ఉత్తరేణి ఆకులను చిన్న చిన్న ముక్కలుగా తుంచి నెమ్మదిగా నూనెలో వేయాలి .
ఆకులు నల్లగా మాడిన తరువాత వడకట్టి ముద్ద కర్పూరం ఒక స్పూను కలపాలి . లేదా రసంతీసి నూనెకు కలిపి స్టవ్ మీద పెట్టి రసం ఇంకిపోయే వరకు కాచాలి   దించి , వడకట్టి నూనెలో ముద్దకర్పూరం కలపాలి .

     ఈ నూనెతో కాళ్ళకు మర్దన చేస్తే నొప్పులు తగ్గుతాయి .

                                          కాళ్ళ పగుళ్ళు --- నివారణ                                        25-8-11.

కారణాలు :--- వంశ పారంపర్యం ,చర్మం పొడిబారడం , చర్మం సాగే గుణాన్ని కోల్పోవడం , పోషకాహార లోపం  మొదలైనవి

టంకణ  చూర్ణము  (Borax )                       --- 5 gr
ఆముదము                                              --- 5 gr
పసుపు                                                    --- 5 gr
White Petrolium Jelly  or Vinegar      --- 10 gr

        ఒక చిన్న గిన్నెలో అన్ని పదార్ధాలను వేసి బాగా కలపాలి . ఆయింట్మెంట్ తయారవుతుంది .
 1      రాత్రి నిద్రించే ముందు పాదాలను బకెట్ లోని వేడి నీళ్ళలో ఉంచాలి . స్క్రబ్బర్  తో పగుళ్ళు వున్నచోట బాగా రుద్దాలి . తరువాత తడి లేకుండా తుడిచి  ఔషధాన్ని పూయాలి . సాక్స్ వేసుకోవాలి . ఉదయం మరలా స్క్రక్కబర్ తో
రుద్ది కడగాలి .
2.      రాత్రి పడుకునే ముందు పాదాలను గోరువెచ్చని ఉప్పు నీటిలో వుంచి బాగా రుద్ది కడగాలి . తరువాత తడి లేకుండా
తుడిచి లేత మర్రి వూడల పాలను  పూయాలి . ఉదయం శనగ పిండి తో  కడగాలి .

సూచనలు :--- ఎక్కువసేపు నిలబడకూడదు . బరువు తగ్గాలి నీళ్ళు ఎక్కువగా తాగాలి . సాత్వికాహారం  ( బీర , సొర )
తినాలి
                                                        కాళ్ళ పగుళ్ళు  --- నివారణ                           27-8-11.

గుగ్గిలం పొడి
వెన్నపూస
               రెండింటిని కలిపి పూస్తే వెంటనే తగ్గుతాయి .

                                                   కింద పడి కాళ్ళకు దెబ్బ తగిలితే                          6-9-11.
                                                  మోకాళ్ళు సన్నగా చిట్లితే కూడా

తుమ్మ బంక పొడి
తుమ్మ కాయల పొడి
పటికబెల్లం పొడి  ( లేదా)  పాత బెల్లం పొడి

        అన్నింటిని  బాగా కలిపి నిల్వ చేసుకోవాలి .

        ప్రతి రోజు అర టీ స్పూను పొడిని నోట్లో వేసుకొని నీళ్ళు తాగాలి . దీనితో ఎముకలు చిట్లడం అనే సమస్య నివారింప
బడుతుంది .

        పంచ పత్ర తైలాన్ని తయారు చేసి తైల మర్దన చేయాలి . రోజుకు రెండు , మూడు సార్లు తైలాన్ని గోరువెచ్చగా
చేసి పూస్తే వాపు తగ్గుతుంది .


            







నడుము

                                నడుము నొప్పి --నివారణ                                            23-1-09
 
యోగాసనం :-  రెండు కాళ్ళు ఒక అడుగు ఎడంగా వుంచి రెండు చేతులను పైకెత్తి, రెండు చేతులలో దూర్చి అరి చేతులను పైకి పెట్టాలి.తరువాత అదే పొజిషన్ లో ఎడమ వైపుకు, కుడివైపుకు వంగాలి. 10 తో ప్రారంభించి
 
       20,30,40 పెంచాలి. దీని వలన నడుము భాగం లోని కొవ్వు కరుగుతుంది.నడుము నొప్పి తగ్గుతుంది.
 
2.  నిలబడి నెమ్మదిగా పాదాన్ని పైకెత్తాలి.  రెండవ పాదాన్ని కూడా అదేవిధంగా పైకెత్తాలి.మోకాలు వంగకూడదు
 
దీనిని గాలి పీలుస్తూ వదుల్తూ చెయ్యాలి.

                                    నడుము నొప్పి --నివారణ                                             19-2-09.
 
       కారం, చేదు, వగరు ఎక్కువగా వాడే వాళ్లకు నడుమునొప్పి ఎక్కువగా వస్తుంది, ఎక్కువవుతుంది.
 
పుట్టుకతో నల్లగా వున్నవాళ్ళు వాత శరీరంతో వుంటారు.  నడుము నొప్పి వున్న వాళ్ళు తీపి ఎక్కువగా తినాలి.
 
ఆహారాన్ని అతిఎక్కువగా, అతితక్కువగా తినకూడదు.  ఆరుబయట గాలిలో ఎక్కువగా తిరగకూడదు. ఎక్కువ సేపు ఫ్యాన్  కింద కూర్చుంటే వాతం చేరుతుంది.
 
ఆహారం    ----- వెల్లుల్లి గారెలు
 
      మినప పప్పులో వెల్లుల్లి పాయల ముద్ద, అల్లం ముద్ద, పొంగించిన ఇంగువ పొడి, కొద్దిగా సైంధవ లవణం    కలిపి నూనెలో వేసి గారెల లాగా కాల్చుకొని ఒకటి, రెండు మాత్రమే తినాలి. దీని వలన వాతనోప్పులు తగ్గుతాయి
 
నడుమునొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ళ నోప్పి శరీరం బిగిసినట్లు గా వుండడం తగ్గుతాయి.
 
నడుము దగ్గర కొవ్వు కరగడానికి (భార్యా భార్తలిరువురికి )
 
                                           బాదం పప్పు           ------ పావుకిలో
                                           గసగసాలు              ------ పావుకిలో
                                           పటికబెల్లం              ------ పావుకిలో
 
        బాదం పప్పులను రాత్రి నీళ్ళలో నానబెట్టి ఉదయం తొక్కులు తీసి బాగా ఎండబెట్టి దంచి పొడి చెయ్యాలి.
 
       గసగసాలను నేతిలో దోరగా వేయించి దంచి జల్లించి పొడి చేసుకోవాలి.
 
     పటికబెల్లాన్ని కూడా దంచి పొడి చేసుకోవాలి.
 
     అన్నింటిని బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
 
     అర గ్లాసు పాలలో గాని లేదా నీళ్ళలో గాని అర టీ స్పూను పొడిని కలుపుకొని తాగితే  నడుమునొప్పి,మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
 
                          నడుము నొప్పి --నివారణ                                                      20-2-09.
 
       సాఫ్ట్  వేర్ ఉద్యోగస్తులు కూర్చునేటపుడు వాళ్ళ పొజిషన్ ను అప్పుడప్పుడు మారుస్తూ వుండాలి.
 
కటిచక్రాసనం:--  రెండు కాళ్ళ మధ్య ఒక అడుగు స్థలం ఉండేట్లుగా నిలబడాలి. రెండుచేతులను పక్కలకు చాపి నిలబడాలి. అలాగే నిలబడి కదలకుండా గాలి పీలుస్తూ కుడివైపుకు తిరగాలి, గాలిని వదులుతూ మధ్యలోకి  రావాలి.  అదే విధంగా రెండవ వైపు కూడా చెయ్యాలి.
 
అర్ధ చక్రాసనం :-- నిటారుగా నిలబడి కుడి చేతిని పైకెత్తి ఎడమ వైపుకు వంగాలి.శరీరాన్ని మాత్రం వంచకూడదు నడుమును కొద్దిగా మాత్రమే వంచాలి.అలాగే రెండవ వైపు కూడా చెయ్యాలి.
నడుమును గుండ్రంగా తిప్పాలి.
 
నటరాజాసనం :--  కుడిచేతిని పైకెత్తి, ఎడమ కాలును వెనక్కి పెట్టి ఎడమ చేతితో కాలును పట్టుకోవాలి.అలాగే   రెండవ వైపుకూడా చేయాలి.
 
ఆహారం:--
                           జల్లించిన తెల్ల తవుడు      ------- పావు కిలో
                           పాత బెల్లం                      -------  పావు కిలో
                           నాటు నెయ్యి                   -------  పావు కిలో
 
      అన్నింటిని రోటిలో వేసి బాగా దంచాలి. ముద్దగా అయిన తరువాత 10 -15 గ్రాముల ఉండలు చేసి సీసాలో  భద్రపరచాలి. ఉదయం పరగడుపున   సాయంత్రం పొట్ట ఖాళీగా వున్నపుడు  ఒక్కొక్క ఉండ చొప్పున తిని,  గ్లాసు నీళ్ళలో ఒక స్పూను కలకండ కలుపుకొని తాగాలి.
 
                                                       31-7-09
 
     ఎక్కువసేపు కదలకుండా కూర్చున్న వాళ్ళు, సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, నడుము దగ్గర  కొవ్వు పెరిగిన వాళ్ళు ఈ సమస్యతో బాధ పడుతుంటారు.
 
వ్యాయామం:-- నడుము మీద నూనె రాసి రెండు బొటన వేళ్ళతో సరదియ్యాలి. చేతిని కత్తి లాగా నిల బెట్టి కొట్టాలి.  నొప్పులను నివారించే ఆకులను వేసి   మరిగించి  ఆవిరి పట్టాలి  దానిలో  గుడ్డనుముంచి  ఓర్చుకో గలిగినంత వేడిగా కాపడం పెట్టాలి.
 
భుజంగాసనం:-- బోర్లా పడుకొని చేతులను నేలకు ఆనించి మెడను, పొట్టను పైకి లేపాలి,
 
శలభాసనం:-బోర్లాపడుకొని చేతులనుపొట్ట కింద పెట్టుకొని ఒక కాలును పైకి లేపాలి, అదే విధంగా రెండవ 
వైపు కూడా లేపాలి. తరువాత రెండు కాళ్ళు లేపాలి.
 
      బోర్లా పడుకొని వ్యతిరేక దిశలో అంటే ఎడమకాలు, కుడిచెయ్యి ఒకే సారి లేపాలి. అదే విధంగా కుడికాలు, ఎడమ చెయ్యి ఒకే సారి లేపాలి.
 
      స్త్రీలకు సిజేరియన్ ల వలన, మగవాళ్ళు శరీరాన్ని కదిలించక పోవడం వలన ఈ సమస్య వస్తుంది.
 
      ఇసుకను వేడి చేసి గుడ్డలో వేసి కాపడం పెడితే అప్పటికప్పుడు నడుము కదులుతుంది.
 
       ఏరుడు పిడకలను కాల్చి నులక మంచం కింద పెట్టి పొగ బెడితే నొప్పి తగ్గుతుంది.

 ఉమ్మెత్త ఆకులు         ---- 4, 5
నానబెట్టిన బియ్యం      ---- పిడికెడు
 
      రెండింటిని కలిపి నూరితే జిగటగా వస్తుంది . దానిని గుడ్డకు పూసి పట్టి వేస్తే నొప్పి తగ్గుతుంది.
 
గింజలు తీసిన ఎండు ఖర్జూరం
మహిషాక్షి గుగ్గిలం
తడిపిన గోధుమ పిండి
 
     గింజలు తీసిన ఖర్జూరంలో మహిషాక్షి గుగ్గిలాన్ని పెట్టి గోధుమ పిండిని కవచం లాగా పూసి నిప్పుల మీద  దొర్లించాలి. కాలిన తరువాత
గోధుమ పిండిని తొలగించి కాయలను నూరి మాత్రలు చేసి ఎండబెట్టి నిల్వ చెయ్యాలి. ( బటాణి  గింజంత మాత్రలు )
 
     ఉదయం, సాయంత్రం  ఆహారానికి గంట ముందు వాడితే మూడు వారాలలో నడుము నొప్పి తగ్గుతుంది.   

                                నడుము నొప్పి --- నివారణ                                          7-9-09.

    వ్యాయం చెయ్యాలి. ఆసనాలు వెయ్యాలి

    కారం, చేదు , వగరు తక్కువగా తినాలి.
 నడుమునొప్పి వున్నవాళ్ళు తీపి పండ్లు, ఇంట్లో చేసిన పదార్ధాలుతినాలి.

                                       వెల్లుల్లి గారెలు 

 మినప పిండి
అల్లం                                      --- 3 gr
పొంగించిన ఇంగువ                     --- 2 చిటికెలు
వెల్లుల్లి                                    --- తగినన్ని
 సైంధవ లవణం                         --- తగినంత
నూనె

    మినప పిండిలో పైదార్ధాలను అన్నింటిని కలిపి గారెల్లా గా చేసి నూనెలో వేయించాలి.
   1,2  గారెలను మాత్రమే తినాలి.

                            నడుము నొప్పి, ఇతర నొప్పులు --నివారణ                              22-5-10.
 
        వావిలాకు మొక్క యొక్క వేళ్ళ పై బెరడును నూరి నువ్వుల నూనె కలిపి చప్పరిస్తూ వుంటే నడుము   నొప్పి, ఇతర నొప్పులు నివారింప బడతాయి.
                                  
                    కారణం తెలియని నడుము నొప్పి నివారణకు                                   26-5-10.
 
        10.  15  గ్రాముల అల్లాన్ని సన్న ముక్కలుగా తరిగి నేతిలో వేయించి 5 రోజులు తింటే 6 నెలలుగా వున్న  నడుము నొప్పి తగ్గుతుంది,
 
                      నడుమునొప్పి --నివారణ                                                    1-12-10.
 
మెంతి పిండి             --- 5 టీ స్పూన్లు
శొంటి పొడి               --- 1 టీ స్పూను
 
      రెండింటిని కలిపి  రెండు భాగాలు చెయ్యాలి. ఉదయం, సాయంత్రం రెండు పూటలా నీటితో తీసుకోవాలి.
 
దీనితో సాధారణమైన నడుమునొప్పి అద్భుతంగా తగ్గుతుంది.
 
      వాతం వలన బిగుసుకుపోయిన  నడుము నొప్పి, వెన్ను నొప్పి--'నివారణ            10-12-10.

                                                                 కటివస్తి

            ఇది  పంచ కర్మ చికిత్సల లో ముఖ్యమైనది
 
     మినప పప్పును గట్టిగా రుబ్బి నడుము మీద గుండ్రంగా ఏర్పాటు చెయ్యాలి, అంటే ఒక గిన్నెలాగా అంటే మధ్యలో ఖాళి వుండాలి. పిండిని గుండ్రంగా ఏర్పాటు చేసి దాని లో నువ్వుల నూనె పోయాలి. ఓమ తైలం,  ఉత్తరేణి తైలం వాడవచ్చు.

మినప పప్పు                   --- అర కిలో
ఔషధ తైలం                    --- అర కిలో

       మినప పప్పును  అర లీటరు వేడి నీళ్ళలో కలిపి బాగా పిసికి మెత్తగా చెయ్యాలి.        కాలకృత్యాల తరువాత ప్రశాంతమైన మనసుతో ప్రారంభించాలి.

       రోగిని బోర్లా పడుకోబెట్టి ఎక్కడ నొప్పి ఉన్నదో అక్కడ ఒక చట్రం లాగా ఒకటిన్నర అంగుళం ఎత్తుగా  ఏర్పాటు చెయ్యాలి. మినప పిండికి కూడా నొప్పి ని తగ్గించే లక్షణం వున్నది.  ఔషధ తైలాన్ని పరోక్షంగా వేడి చేసి ఆ పిండి మధ్యలో పొయ్యాలి. బొటన వ్రేలుతో నడుము మీద మసాజ్ చెయ్యాలి. తైలం చల్లారితే  దానిని  స్పూన్ సహాయంతో గాని, గుడ్డను ముంచి గాని తీసి మరలా వేడి చేసి మరలా పిండి మధ్యలో పోయాలి.

    ఆ విధంగా ఒక గంట సేపు చేయాలి. బోర్లా పడుకున్నపుడు గడ్డం కింద చేతులు పెట్టుకోవాలి. పూర్తిగా బిగదీసుకొని ఉండవలసిన అవసరం లేదు. కొంత శరీరాన్ని, కాళ్ళను, చేతులను కదిలించవచ్చు.

      పిండిని, తైలాన్ని తొలగించిన తరువాత వెన్నుపూస మీద రెండు బొటన వ్రేళ్ళతో మర్దన చెయ్యాలి. రోగికి
రిలీఫ్  అనిపించినా తరువాత తీసేయ్యాలి.     తీసినతరువాత మసాజ్చెయ్యాలి. నొప్పి వున్నచోట అనగా నూనెపోసిన చోట వర్తులాకారంలో  మర్దన చెయ్యాలి.  ఆ ప్రదేశంలో వేడి నీళ్ళలో ముంచిన టవల్ తో కాపడం పెట్టాలి.

      పైన చెప్పబడిన ప్రక్రియ  పూర్తి అయిన తరువాత కూడా 15 నిమిషాలు అలాగే పడుకొని వుండాలి. తరువాత
వేడి సున్ని పిండి గాని, లేక పెసర పిండి గాని రుద్దుకొని వేడి నీటితో స్నానం చెయ్యాలి.

                        నడుమునొప్పి --నివారణా మార్గాలు                                          6-10-10.

       ఈ నొప్పి స్త్రీలలో గర్భాశయ సంబంధంగా, పురుషులలో వాత సంబంధంగా ఉండవచ్చు. వెన్నుపూసల మధ్యవుండే కార్టిలేజ్ పక్కకు జరగడం వలన వెన్ను నొప్పి  వస్తుంది.

       తైలంతో కాపడం పెడితే వాత సంబంధమైన నొప్పి తగ్గుతుంది.

1. నువ్వుల నూనె                  --- 100 gr
    వెల్లుల్లి ముద్ద                     --- 100 gr

     రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి తేమ ఇగిరిపోయే వరకు కాచాలి.  తరువాత చల్లార్చి వడకట్టి సీసాలో భద్ర పరచుకోవాలి.

     అవసరమైనంత నూనెను తీసుకుని వేడి చేసి దానిలో పలుచని గుడ్డను ముంచి నడుము మీద  నొప్పి వున్నచోట పరచాలి.  నొప్పి తగ్గుతుంది. లేదా నూనెను రుద్ది కాపడం పెట్టవచ్చు.   రెండు టీ స్పూన్ల తైలాన్నితాగాలి.

2 వావిలాకు కషాయం 

వావిలాకులు             --- 20 gr
నీళ్ళు                       --- రెండు గ్లాసులు

     రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి ఒక గ్లాసు కషాయం వచ్చే వరకు కాచాలి.  వడకట్టి రోజు రెండు పూటలా  తాగుతూ వుంటే నొప్పి తగ్గుతుంది.

3. మిరియాలు                ---50 gr
    పిప్పళ్ళు                   --- 50 gr
    శొంటి                        --- 50 gr
    కరక్కాయలు              --- 50 gr
    తానికాయ లు             --- 50 gr
    ఉసిరికాయలు             ----50 gr
    వాము                     ----100 gr
   తిప్ప తీగ                ---- 100 gr

      అన్నింటిని విడివిడిగా చూర్ణాలు  చేసి కలిపి సీసాలో భద్రపరచు కోవాలి.

      ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక టీ స్పూను పొడిని ఒక గ్లాసు మజ్జిగలో గాని లేదా ఒక గ్లాసు నీటిలో గానివేసి  కలిపి తాగాలి.  దీని వలన అన్నిరకాల ముఖ్యంగా వాత నడుము నొప్పి నివారించ బడుతుంది.

                                    నడుము సన్నబడడానికి చిట్కా                                   14-3-11.
      
         పొడిగా వున్న త్రిఫల చూర్ణం తో  నడుము చుట్టూ మర్దన చేస్తూ వుంటే కొంత కాలానికి
  లావు తగ్గుతుంది.

                                    నడుము నొప్పి-- నివారణ                                            8-4-11.

          ఈ సమస్య ముఖ్యంగా మహిళలలో ఎక్కువగా వుంటుంది. రోజంతా పని వలన, హార్మోన్లలో
  తేడాల వలన,  అనారోగ్యం, మూత్ర సంబంధ  ఇన్ఫెక్షన్ వలన,  కిడ్నీలలో  రాళ్ళ వలన, తెల్లబట్ట
  సమస్య వలన, ఒత్తిడి వలన, తక్కువ  సమయంలో ఎక్కువ  పనులు చేయడంవంటికారణాల        వలన ఈ సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది.

                                          పొగాకు తైలం

      పొగాకు ముద్ద             ---  10 gr
                  నీళ్ళు            --- 160 ml
      నువ్వుల నూనె          ---   40 ml
      ఆముదపు ఆకులు    

              పొగాకును నీళ్ళు చల్లుతూ ముద్దగా నూరాలి. ఒక పాత్రను తీసుకుని దానిలో నీళ్ళు పోసి
  పొగాకు ముద్దను వేయాలి. స్టవ్ మీద పెట్టి మరగడం ప్రారంభమైన తరువాత నువ్వుల నూనెను
  కలపాలి.  నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. దించి, వడపోసి, చల్లారిన తరువాత సీసాలో
  నిల్వ చేసుకోవాలి.

             అవసరమైనపుడు అర చేతిలో వేసుకుని వేడి పుట్టే వరకు రుద్ది నడుముపై మర్దన             చేయాలి.  తరువాత వీలైతే ఆముదపు ఆకులను నడుముపై కప్పి కట్టు కట్టాలి.

             మూత్ర సంబంధ సమస్యల వలన గాని నడుము నొప్పి వుంటే  సగ్గుబియ్యపు జావ, బార్లీ
 ఆకుపచ్చని ధనియాల కషాయం, కొబ్బరి నీళ్ళు తాగాలి.

             గర్భిణీ సమయంలో నొప్పి వుంటే నడుము మీద ఒత్తిడి లేకుండా దిండు పెట్టుకుని పడుకోవాలి.

             తెల్లబట్ట సమస్య వలన నడుము నొప్పి వుంటే అది బలహీనత వలన కాబట్టి మంచి ఆహారం తీసుకోవాలి.


              నడుము నొప్పి నివారణకు --- కృష్ణ మోహిని లేపనం             18-4-11
                             కృష్ణ మోహిని     =   నల్ల ఉమ్మెత్త  ( విష పదార్ధం ) 

 ఉమ్మెత్త గింజలను తగినంత కొబ్బరి నూనె వేసి నూరాలి.  ( గింజలను దంచి,  జల్లించి  కొబ్బరి నూనె కలిపి నూరవచ్చు.   ఇది లేపనం లాగా తయారవుతుంది. )

       నడుము నొప్పి ఉన్నవాళ్ళను  బోర్లా పడుకోబెట్టి నడుము మీద ఈ చివర నుండి ఆ చివర వరకు పట్టు వేయాలి.

దాని మీద గుడ్డ పరచవచ్చు లేదా కట్టు కట్టవచ్చు.

        దీనిని వాడడం వలన ఎంతో కాలంగా వున్న దీర్ఘ కాలపు నడుమునొప్పి  చాలా త్వరగా నివారింపబడుతుంది.

                                      నడుము నొప్పి ---నివారణ                                          6-6-11.

బోడతరం పూల పొడి                 --- 30 gr
తిప్ప తీగ            "                 --- 30 gr
శొంటి                 "                 --- 20 gr
మెంతి                "                 --- 20 gr
దుంప రాష్ట్రం       "                 --- 40 gr
అశ్వగంద         "                   --- 60 gr
ఆముదం                              --- తగినంత

     పై  చూర్ణాలను  అన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలిపి తగినంత ఆముదం కలిపి లేహ్యం
లాగా కలపాలి .  దీనిని వెడల్పు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి .
    ప్రతి రోజు గచ్చ కాయంత లేహ్యాన్ని ఆహారానికి ముందు తిని నీళ్ళు తాగాలి . దీనితో ఎటువంటి
నడుము నొప్పి అయినా నివారింపబడుతుంది .

                                          నడుము నొప్పి   --- నివారణ                                       15-7-11.
వాము  పొడి                 --- చిటికెడు
మిరియాల పొడి            ---      "
సన్నరాష్ట్రము              ---      "
కటుకరోహిణి                 ---      "
పొంగించిన ఇంగువ         ---      "
వెల్లుల్లి  ముద్ద              ----     ఒక టీ స్పూను

    అన్నింటిని ముద్దగా కలిపి శనగ గింజలంత  మాత్రలు కట్టి నీడలో ఆరబెట్టాలి .
    ప్రతిరోజు ఒక మాత్ర చొప్పున వాడాలి .
    దీని వలన శరీరం లోని వాతము  తగ్గి  అన్ని రకాల నొప్పులు నివారింపబడతాయి

                                                     నడుము నొప్పి   --- నివారణ                    20-7-11.
ఆముదపు గింజల పప్పులు              --- మూడు లేక నాలుగు
                         బియ్యం               --- చారెడు
                          పాలు                  --- ఒక కప్పు          
                         చక్కెర                 ---  రెండు టీ స్పూన్లు

         బియ్యాన్ని రవ్వ లాగా చేసి పాలు పోసి , పప్పు పొడి వేసి కాచి చక్కర కలపాలి .దీనిని రోజుకు రెండు సార్ల చొప్పున
ప్రతి రోజు తాగుతూ వుంటే నడుము నొప్పి తప్పక నివారింపబడుతుంది ,

         దీంతో పాటు నడుము మీద తైలం తో మర్దన చేయాలి .

                                                             నడుము నొప్పి   ---నివారణ                          21-8-11.

కారణాలు :--- శరీరం లోని మలినాలు  చేరడం , కూర్చొనే విధానం , బండి నడిపే విధానం , గాయాల కారణం గా , ప్రసవ
సమయం లో శస్త్రచికిత్స  మొదలైన కారణాల వలన నడుము నొప్పి వచ్చే అవకాశం కలదు . 

చికిత్సా విధానం :--- రోగిని  బోర్లా పడుకోబెట్టాలి .నదుము దగ్గర నుండి  రెండు బొటన వ్రేళ్ళతో వెన్నుపూస వెంబడి పైకి
సున్నితంగా తైలంతో మర్దన చేయాలి .  మూడు వేళ్ళతో నడుము నుండి పైకి వెన్ను పూస మీద  పైకి పాకిన్చినట్లు  మర్దన
చేయాలి .
        మర్దన  చేసిన తరువాత కాపడం  పెట్టాలి . నీటిలో వాతాన్ని తగ్గించే ఆకులను వేటినైనా  (కసివిండ , వావిలి  మొదలైన ) వేసి , పసుపు కలిపి బాగా  కాచాలి . ఆ నీటిలో మందమైన బట్టను ముంచి ఒర్చుకో  గలిగినంత వేడిగా
కాపడం  పెట్టాలి .

నడుమును నొక్కే విధానము :--- రోగిని బోర్లా పడుకోబెట్టాలి .ఎదమ చేతిని నడుము మీద పెట్టి  దాని మీద కుడిచేతిని
వుంచి గట్టిగా నొక్కాలి . ఆ విధంగా నడుము నుండి ప్రారంభించి మెడ వరకు నొక్కాలి . అలాగే వెన్ను పూసకు ఎడమ వైపు
కింది నుండి పైకి నొక్కాలి , అదే విధంగా  రెండవ వైపు కూడా అలాగే నొక్క్కాలి

        రోగి వెల్లకిలా పడుకొని గాలిని పీలుస్తూ  కాళ్ళను నేల  మీద ఆనించి నడుమును మాత్రం పైకి లేపాలి  గాలి వదులుతూ
నడుమును కిందికి దించాలి . ఈ విధంగా 5 నుండు 10 సార్లు చేయాలి .థరువాథ కొంత విరామం పొందవచ్చు ..

       బోర్లా పడుకొని రెండు అరచేతులను కింద ఆనించి తలను పైకి లేపాలి . అలాగే చేతులను ఆనించి భుజాలను పైకి
లేపాలి , తలను పూర్తిగా పైకి లేపాలి .

       పద్మాసనం వేసుకొని కూర్చొని  మహా వాయుముద్రను వేయాలి . అనులోమ , విలోమ ప్రాణాయామము లను చేయాలి .  పూటకు 15 సార్లు చొప్పున రోజుకు మూడు సార్లు చేయాలి .

తీసుకోవలసిన జాగ్రత్తలు ;--- పెరుగు వాడకూడదు ంఅజ్జిగలొ మెంతి పొడి , ఉల్లిపాయలు వేసుకొని వాడాలి .కొత్తబియ్యం ,
కొత్త గోధుమలు ,  కొత్త పదార్ధాలను వాడకూడదు .

అశ్వగంధ చూర్ణం 
పటికబెల్లం

         రెండింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి . ప్రతి రోజు అర  టీ స్పూను పొడిని పాలలో కలుపుకొని తాగాలి



            

 

  


       





                                                                                                                                                                                     







 

     
      

        

ఆనెలు

                                         పాదాలలో ఆనెలు                              1-11-08.
 
            కలబంద గుజ్జు మీద పసుపు చల్లి ఆనెల మీద రుద్ది ఆ బిళ్ళను ఆనెల మీద పెట్టి దూది కప్పి ప్లాస్టర్  అంటించాలి.ఈ విధంగా రాత్రి పడుకునే ముందు 10,15 రోజులు చేస్తే ఆనెలు పూర్తిగా నివారింప బడతాయి.
 
2          దాక్చిన చెక్కను ఇనుప బాణలి లో వేసి బాగా మాడ్చి బూడిద లాగా చెయ్యాలి.చిటికెడు  బూడిదలో గురి గింజంత నీరు సున్నం కలిపి ఆనేలకు పట్టించాలి.
 
                              ఆనెల సమస్య --నివారణ                               17-3-09.

1.                        కలబంద గుజ్జు         -----కొద్దిగా
                           పసుపు పొడి          ----- 3 చిటికెలు

     కలబంద గుజ్జు మీద పసుపు పొడి చల్లి బిళ్ళగా ఆనెల మీద పెట్టి దూది కప్పి కట్టు కట్టాలి.  ఈ విధంగా   20 నుండి 40 రోజులు చేస్తే పూర్తిగా నివారింప బడతాయి.

2.                       దాల్చిన చెక్క పొడి               ----- కొద్దిగా
                          నీరు సున్నం                       ----- తగినంత

     దాల్చిన చెక్కను బాణలిలో వేసి నల్లగా బూడిద లాగా మారేంత వరకు వేయించాలి. దీనిలో నీరు సున్నం   కలిపి ఆనెలకు పట్టించాలి.

     సూచన:-- పై రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే చెయ్యాలి.

                       ఆనెలు, పులిపిర్లు,కురిడీలు -- నివారణ                                     2-4-09.

     చేతుల వేళ్ళ మీద వచ్చే చిన్న గద్దల్లాంటి లేదా గుల్లల్లాంటి లేదా గట్టి రాళ్ళ వంటి వాటిని కురిడి కాయలు  అంటారు.

     అరటి పండు తిన్న తరువాత తొక్కను తీసి దాని అడుగు భాగాన వున్న తెల్లని పదార్ధాన్ని గుజ్జుగా చేసి  ఆనేల మీద, పులిపిర్ల మీద, కురిడి కాయల మీద పట్టించాలి.  ఆనేల పై పట్టించే ముందు వాటిని బ్లేడు తో కొద్దిగా గీకాలి తరువాత ఈ గుజ్జును దట్టంగా పట్టించి దూది కప్పి ప్లాస్టర్ వెయ్యాలి.

                                ఆనెలు--చర్మ కీలలు-- నివారణ                                   14-12-10.

అతి మధురం పొడి                 --- ఒక టీ స్పూను
పెట్రోలియం  జెల్లి                   ----ఒక టీ స్పూను  ( వాజలీన్)

    రెండింటిని కలిపి ఆనేల మీద గీరి పూయాలి.

                                             ఆనెలు -- నివారణ                                      15-12-10-

  లక్షణాలు:--

    ఆనెలున్నపుడు నడకలో మార్పు వస్తుంది.  దీని వలన శరీర ఆకృతిలో మార్పు వచ్చి సమస్యలు
ఏర్పడతాయి.

కారణాలు:--    పాదం మీద ఒత్తిడి పడడం, బిగుతుగా వున్న లేక వదులుగా వున్న చెప్పులు ధరించడం వలన ఒరిపిడి  కలగడం  , సాక్స్ లేకుండా  షూస్ వేసుకోవడం  , పనిముట్లు ఎక్కువగా వాడేటపుడు అంటే చెప్పులులేకుండా మిషన్ తొక్కడం, కారు ఆక్సిలరేటర్ తొక్కడం వంటి వాటి వలన వస్తాయి.

     బూట్లు ధరించినపుడు లోపల వేళ్ళు కదిలించ గలిగే విధంగా వుండాలి
.
చేయవలసిన పనులు :--   ఆనేలున్నపుడు సముద్రపు ఒడ్డున వున్న ఇసుకలో నడిస్తే ఆ రాపిడికి నివారింప  బడతాయి
.
     స్నానం చేసేటపుడు పాదం మీద వేసి రుద్దుకోవాలి.

     ఒక టీ స్పూను కలబంద గుజ్జులో అర టీ స్పూను పసుపు పొడిని కలిపి ఆనెల మీద పెట్టి పాలిథిన్ పేపర్ ను తొడిగి పడుకోవాలి. ఉదయం వేడి నీళ్ళతో కడగాలి.  పది నిమిషాలు ఆగి ఆనెల మీద ఆముదం పూయాలి.

    కాళ్ళను త్రిఫల కషాయం లో నానబెట్టి ఫ్యూమిక్ రాయి తో రుద్దాలి.

    మెగ్నీషియం  సల్ఫేట్  నీళ్ళలో పాదాలుంచి  పేపర్ తో రుద్దాలి.

                                                                 17-11-10


          అతి మధురం పొడిని పెట్రోలియం  జెల్లి తో కలిపి ఆనెల మీద రుద్దితే తగ్గుతాయి.

                          అరి కాళ్ళలో ఆనెలు -- పరిష్కార మార్గాలు              27-12- 10

          ఒత్తిడితో పాదాలు జీవం కోల్పోవడం వలన  గట్టిపడి  ఆనెలు ఏర్పడతాయి. వాటిలోపల ఇన్ఫెక్షన్ చేరినపుడు నొప్పి తెలుస్తుంది. ఇతరుల చెప్పులను వాడడం వలన కూడా ఆనెలు వచ్చే అవకాశం వున్నది.

 కెమికల్స్ కలిసివున్న  చెప్పులను వాడడం వలన కూడా వచ్చే  అవకాశం వున్నది.
 రాళ్ళలో నడిచినపుడు రాళ్ళ లోని  ఇన్ఫెక్షన్ వలన కూడా రావచ్చు,

 కాళ్ళను సరిగా శుభ్రం చేసుకోక పోవడం వలన కూడా రావచ్చు.
 
లక్షణాలు :-- నడవలేక పోవడం, నొప్పి, మంట వుంటాయి.
 
                                                పెద్ద పెద్ద ఆనేలకు అగ్నికర్మ చికిత్స
 
           పంచలోహాలతో తయారైన పరికరాన్ని వేడి చేసి దానితో కాపడం పెట్టాలి.
 
            ఉత్తరేణి మొక్కను సమూలముగా తెచ్చి కాల్చి బూడిదను సేకరించుకోవాలి.
 
ఉత్తరేణి బూడిద                       --- 50 gr
దాల్చిన చెక్క బూడిద              ----50 gr
నీరుసున్నం                           ---- 25 gr                          
ఆముదం                               ---- తగినంత
 
      అన్నింటిని పేస్ట్ లాగా కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
 
       దీనిని రాత్రి పూట ఆనేలకు పట్టించి ఉదయం కడుగుతూ వుంటే సమస్య నివారింప బడుతుంది.

                                                  ఆనెలు ---చర్మ కీల హర చికిత్స                                    22-6-11

కారణాలు:-- చెప్పులు,  బూట్లు సరిగా సెట్ కాకపోవడం,  సాక్స్ వేసుకొని బూట్లు వేసుకోకపోవడం వలన వచ్చే
అవకాశం కలదు .

వంటసోడా                      ---- 30 gr
ప్రొద్దుతిరుగుడు నూనె       ---- 45 gr  ( లేదా వంట నూనె )
వెనిగర్                          ---- 10 ml

       ఒక పెద్ద పాత్రలో నీళ్ళు  పోసి కాచాలి .  ఆ నీటిలో స్క్రబ్బర్  ను ముంచి దానితో పాదాలను రుద్దాలి .
ఆ వేడి నీటిలో వంటసోడా ను కలిపి దానిలో పాదాలను  నీళ్ళు చల్లారేవరకు ఉంచాలి . ఈ లోగా ఒక చిన్న గిన్నెలో
నూనె ,  వెనిగర్  వేసి బాగా కలిపి పెట్టుకోవాలి .  బాగా రుద్దాలి .

      పాదాలను బయటకు తీసిన తరువాత స్క్రబ్బర్ తోరుద్ది తడి లేకుండా తుడవాలి . తరువాత నూనె,  వెనిగర్ ల
మిశ్రమాన్ని పోయాలి.

      ఈ విధంగా 30 రోజులు చేస్తే మంచి ఫలితం వుంటుంది

      వంటసోడా శరీరాన్ని మృదువుగా మారుస్తుంది .

                                                ఆనేల  నివారణకు  అర్క లేపనం                             2-7-11.

జిల్లేడు పాలు                --- 50 gr
ఆముదం                     --- 50 gr
తేనేమైనం                    ---100 gr 

          తేనేమైనాన్ని కరిగించి వదపోసుకోవాలి .  దానిలో జిల్లెడుపాల ,  ఆముదం యొక్క మిశ్రమాన్ని కొద్ది , కొద్దిగా వేస్తూ
బాగా కలపాలి .కొద్ది సేపటికి ఆ మిశ్రమం చల్లబడుతుంది . దీనిని వెడల్పు మూత వున్న  సీసాలో నిల్వ చేసుకోవాలి .
         దీనిని ఆనేల మీద పోయాలి
         ఇది ఎన్ని సంవత్సరాలున్నా చెడిపోదు
                 
                                                     ఆనెలు    ---  నివారణ                                     6-7-11.

   1.     పచ్చి జీడిపప్పు గంధాన్ని ఆనేల మీద నెల రోజులు పూస్తే తగ్గుతాయి
   2.     మామిడి ఆకులను ఎండబెట్టి కాల్చి భస్మం చేసి జల్లించి నిల్వ చేసుకోవాలి .
           తగినంత భస్మాన్ని తీసుకొని నీరు కలిపి మెత్తగా చేసి ఆనేల పై రుద్దాలి .
సూచన :   మెత్తని చెప్పులను వాడాలి .