బలానికి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బలానికి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

సంపూర్ణ ఆరోగ్యానికి ఆహారం

                        సంపూర్ణ ఆరోగానికి ఆహార ఔషధం                        17-2-09.
 
                               ఉసిరిక పొడి                           ----------- 100 gr  
                               దోరగా వేయించిన నల్ల నువ్వుల పొడి ---- 100 gr
         పుష్యమి నక్షత్రం నాటి గుంటగలగర సమూల చూర్ణం ---- 100 gr 
                                                               కలకండ          ----- 400 gr
                                                               ఆవునెయ్యి      ----- 100 gr
                                                                    తేనె            ----- 200 gr
 
      అన్నింటిని కలిపి రోట్లో వేసి దంచిఅతే లేహ్యం తయారవుతుంది
 
      ప్రతి రోజు రాత్రి 10 గ్రాముల ముద్దను చప్పరించి తిని పాలు తాగాలి. ఉదయం పరగడుపున కూడా సేవించాలి
 
     దీనిని సేవించడం వలన కళ్ళు మంచి కాంతివంతంగా అవుతాయి, పళ్ళు గట్టిపడతాయి. శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యవంతమవుతాయి.
 
         సంపూర్ణఆరోగ్యానికి    అశ్వగంధ పాకం                                          10-3-09.

                                      అశ్వగంధ దుంపలు       -----  ఒక కిలో

     దుంపలను కడిగి ఎండబెట్టాలి. ముక్కలుగా నలగగొట్టి పాత్రలో వెయ్యాలి. మట్టి పాత్రైతే మంచిది . ఆవు పాలు  తగినన్ని పోసి నిదానంగా కాచాలి  పాలు మొత్తం ముక్కలలో ఇగిరి పోవాలి. మాడ కూడదు. ముక్కలను తీసి  బాగా పెళ పెళ లాడే ఎండలో పెట్టాలి. కుండ కడిగి మళ్లీ ముక్కలలో పాలు పోసి కాచాలి  . ఈ  విధంగా  ఏడు సార్లు  పాలు  పోసి కాచి  ఏడుసార్లు ఎండబెట్టాలి

 . తరువాత పూర్తిగా బాగా ఎండబెట్టి దంచి పొడి చెయ్యాలి.

     ఆ పొడికి సమానంగా కలకండ పొడిని కలపాలి. షుగర్ వున్న వాళ్ళు తాటిబెల్లం కలపాలి.
 దీనిని గాజు పాత్రలో నిల్వ చెయ్యాలి.  విడిగా వాడుకోవడానికి చిన్న సీసాలోకి తీసుకోవాలి.

    భార్యా భార్తలిరువురు ఒక టీ స్పూను పొడిని పాలల్లో కలుపుకొని తాగాలి. పాలు గిట్టకుంటే లేదా
నచ్చకుంటే   నీటిలో కలుపుకొని తాగవచ్చు.  లేదా ఒట్టి చూర్ణాన్ని గాని లేదా చూర్ణం లో తేనె కలిపి
 గాని సేవించవచ్చు.

     పెళ్ళికి ముందు ఒక సంవత్సరం నుండి వాడితే పెళ్ళైన తరువాత మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు.

                            AIDS రోగులు  దీనిని వాడితే ఆరోగ్యవంతులవుతారు.

                      సంపూర్ణ ఆరోగ్యానికి త్రిఫలాది చూర్ణము                                     18-6-10.
 
        ఇది సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగ పడుతుంది.
 
కరక్కాయ బెరడు పొడి                 ---100 gr
తానికాయ బెరడు పొడి                 ---200 gr
ఉసిరికాయ బెరడు పొడి                -- 400 gr
           1 ; 2 ; 4
 
     అన్నింటిని బా గా కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
 
చూర్ణం       ----  5 gr 
నెయ్యి       ----  5 gr 
తేనె           ---- 2 టీ స్పూన్లు
 
      కలిపి ప్రతి రోజు తీసుకోవాలి. ఈ విధంగా 3 సంవత్సరాలు సేవిస్తే జీవించినంత కాలం
 ఆరోగ్యంగా  వుంటారు.
 
శరీరంలో జుట్టు నుండి పాదాల వరకు ఆరోగ్యంగా వుంటాయి.
   
                     సంపూర్ణ ఆరోగ్యానికి -- ఆహార నియమాలు                            7-7-10.
 
        ఉదయం పూట టిఫిన్ చెయ్యడం అనేది పాశ్చ్యాత్య సాంప్రదాయం, మనదేశంలో తత్పూర్వం ఆ అలవాటు లేదు.
 
నియమాలు:-- ఉదయం  8 -- 9  గంటల మధ్య ఆహారాన్ని భుజించాలి. మధ్యాహ్నం టిఫిన్ చెయ్యాలి. రాత్రి     8 గంటల  భోజనం చెయ్యాలి.

.    విద్యార్ధులు, వ్యవసాయదారులు మూడు పూటలా భోజనం చెయ్యాలి. ఇంటిలో 
వున్న స్త్రీలు ఉదయం, రాత్రి భోజనం, మధ్యాహ్నం టిఫిన్ చెయ్యాలి.

                         సంపూర్ణ ఆరోగ్యానికి తులసి తీర్ధం                                        18-7-10.
 
         ప్రతి రోజు సాయంకాలం 5 గంటల లోపల తులసి ఆకులను చూపుడు వ్రేలు, చిటికెన వేలు
 మొక్కకు  తగలకుండా మిగిలిన మూడు వేళ్ళతో మాత్రమే  తుంచాలి. ఒక రాగి చెంబులో ఒక గ్లాసు
 నీళ్ళు పోసి  రాత్రి దానిలో తులసి ఆకులను(5  పెద్ద ఆకులు ) వేయాలి.  మంచం కింద పీట వేసి పీట మీద చెంబును వుంచి మూత పెట్టాలి ,
 
       నిద్రించేటపుడు తలను దక్షిణం వైపు. పాదాలను ఉత్తరంగా ఉంచాలి.
 
       ఉదయం  రాగి చెంబులోని నీటిని  మూడు స్పూన్లు తులసి తీర్ధం లాగా తాగాలి.  ఆ విధంగా కుటుంబ సభ్యులందరూ సేవించాలి.
 
      దీని వలన కాలేయము, ప్లీహము శుద్ధి చేయబడతాయి.
 
      చర్మమునకు నిగారింపు వస్తుంది.

                                                      3-12-10
        l                  
                  ప్రతి రోజు ఒక జామ పండు తింటూ వుంటే ఆరోగ్యంగా వుంటారు.

                                   సంపూర్ణ ఆరోగ్యానికి  ఔషధం                           15-7-10.

అనారోగ్యంగా ఉండడానికి గల కారణాలు:--   విరుద్ధ ఆహారం భుజించడం,  వేళకు భుజించక పోవడం, తలిదండ్రుల  వీర్య, అండ కణాలు  ఆరోగ్యంగా లేకపోవడం, వంశ పారంపర్య కారణాలు  మొదలైన కారణాల వలన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. దీనిని నివారించడానికి ఈ క్రింది ఔషధాన్ని వాడుకోవాలి.

అశ్వగంధ చూర్ణము             --- 100 gr
అతిమధురం                       --- 100 gr
శతావరి                              --- 100 gr
కౌంచ బీజాలు                     --- 100 gr  (దూలగొండి )
జాజికాయ                         ---    50 gr
జాపత్రి                               ---    50 gr
పిప్పళ్ళ వేర్లు                      ---    50 gr

       అన్నింటిని విడివిడిగా దంచి పొడి చేసి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి

       పై మూలికలను నాణ్యమైన, ఆరోగ్యకరమైన వాటిని ఎంచుకోవాలి.

       ఒక టీ స్పూను పొడిని, ఒక టీ స్పూను తేనె చొప్పున ఉదయం, రాత్రి  భోజనం తరువాత తీసుకోవాలి.

దీనిని ఎంతకాలమైనా వాడుకోవచ్చు.  ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్  వుండవు.  వంటల్లో కూడా వాడుకోవచ్చు.


                   శరీరం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే                28-12-10.
 
    పంచ విధ   శౌచాలను సాధించినపుడు పూర్తి ఆరోగ్యాన్ని సాధించినట్లు లెక్క .

                                      సంపూర్ణ యవ్వనానికి  ---- లేహ్యం                             3-6-11.

అతిమధురం                --- 20 gr
నెయ్యి                         --- 40 gr
తేనె                             --- 60 gr
     అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచాలి.  దీనిని జీవిత కాలం వాడుకోవచ్చు. ఎక్కువ కాలం
తీసుకున్నపుడు తేనెకు బదులుగా బెల్లపు పాకం వాడుకోవచ్చు. దీనితోబాటు పాలు తాగవచ్చు.
      










    

ఆరోగ్యవంతుల లక్షణాలు



                                        ఆరోగ్యవంతుల లక్షణాలు                               26-2-11.


     శారీరకంగా, మానసికంగా మాత్రమే కాకుండా సామాజికంగా కూడా ఆరోగ్యంగా వుండడం.
వాత, పిత్త, కఫాలు సమానంగా పనిచేయడం.

13 అగ్నులు, పంచ భూతాలు సమానవస్థ లో వుండడం

7 ధాతువులు సమాన స్థితిలో వుండడం.

         మలక్రియ (స్వేదము, శ్వాస, మలము, మూత్రము) సక్రమంగా పనిచేయడం.ఇంద్రియాలు ప్రసన్నంగా పని చేయడం.

                     చక్కటి జీవన విధానం ---శరీర దోషాల నివారణ                                16-3-11.

          వాత,  పిత్త,  కఫ దోషాలు ఎక్కువైతే సమస్యలు వస్తాయి

          ఒక్క దోషం అయితే  చికిత్స               --- సాధ్యం
        రెండు దోషాలు అయితే చికిత్స             --- కష్ట సాధ్యం
        మూడు దోషాలు అయితే చికిత్స          --- అసాధ్యం
        బీజ దోషం  ( పుట్టుకతో)  చికిత్స          --- అసాధ్యం


  



బరువు పెరగడానికి

          సన్నగా వున్నవాళ్ళు లావు కావడానికి --- ఆహార ఔషధం                           3-6-09.
 
        నువ్వుల నూనెను ఆపాదమస్తకం మర్దన చెయ్యాలి. దీని తరువాత సర్వాంగాసనం వెయ్యాలి.
 
సర్వాంగాసనం:--  మోకాళ్ళు, నడుము, మెడ గుండ్రంగా, పక్కలకు తిపాలి. చేతులను పూర్తిగా చాపి వేళ్ళు ముడుస్తూ మణికట్టు దగ్గర గుండ్రంగా తిప్పాలి. ప్రతిదీ ఐదు ఐదు సార్లు చొప్పున చేస్తే చాలు.  బుగ్గలను పూరించాలి. కళ్ళు పైకి కిందికి తిప్పాలి, చెవులు లాగాలి, గిచ్చినట్లు నొక్కుతూ లాగాలి.
 
      దీని వలన సన్నగా వున్న పిల్లలు బలంగా, దృడంగా తయారవుతారు.
 
      నువ్వుల నూనె మర్దన వలన ఎంత లావు అవసారమో అంతే అవుతారు, ఎంత తగ్గాలో అంతే తగ్గుతారు.
 
                           తెల్ల జొన్నలు
                           బార్లీ గింజలు
 
   రెండింటిని విడివిడిగా కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించాలి.  తిరగలిలో గాని, మిక్సిలో గాని వేసి రవ్వ లాగా తిప్పాలి.  వీటిని వేర్వేరుగా సీసాలలో భద్ర పరచుకోవాలి.  ఉదయం ఒక రవ్వను, సాయంత్రం మరొక రవ్వను వాడాలి.
 
    రవ్వలో పాలు పోసి ఉడికించాలి. దానిలో చక్కెర, ఎండుద్రాక్ష వేసి తాగాలి.
 
    బార్లీ పాయసం ఒక పూట, జొన్న పాయసం మరొక పూట తాగాలి.


                                      3   రోజులలో బరువు పెరగాలంటే --చిట్కా                       8-3-11.

   పోలీసులుగా  సెలెక్ట్  కావడానికి,  పెళ్లి చూపుల  కొరకు అవసరం అవుతుంది.
   రోజుకు ఒక డజను  అరటి పండ్ల చొప్పున మూడు రోజులు తింటే లావేక్కుతారు.

నీరసం --నివారణ చర్యలు

                                   నీరసించి పోయిన పురుషుల నరాల బలానికి
పోషకాహారం :--   
                                            వాము (ఓమ )    -------- 50 gr
                  నాటు ఆవు లేదా గేదె పాలు        -   --------   2 లీటర్లు
 
        వామును కొద్దిగా దంచి, చెరిగితే పప్పు మిగులుతుంది .ఒక గిన్నెలో పాలు, వాము పప్పు లను పోసి సన్న మంట మీద కాచాలి.పాలు యిగిరి పోయి పప్పు మాత్రమే మిగలాలి.ఆ పప్పును పళ్ళెంలో పోసి బాగా ఎండ  బెబ్ట్టాలి,తర్వాత దంచి జల్లించిన పొడిని సీసాలో భద్ర పరచుకోవాలి.
 
ఉపయోగించే  విధానం :-- 
 
       ఉదయం, సాయంత్రం ఆహారానికి గంట ముందు అర స్పూను పొడిని  ఒక గ్లాసు నీటిలో కలిపి సేవించాలి.దీనితో నరాల బలహీనత తగ్గిపోతుంది.అంత వరకు బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది.
 
      చిన్న సైజు నాటు ఆముదపు గింజలను తీసుకొని వాటిని రాతి తో కొట్టి పప్పు తీయాలి.

(100gr) వాటిని  ఒక గిన్నెలో వేసి దానిలో 200 gr నువ్వుల నూనె పోసి సన్న మంట మీద పప్పు మాడే వరకు కాచాలి.దాబిని  వడకట్టి సీసాలో భద్రపరచాలి. బలహీనత కలిగిన పురుషులు తైలం నాలుగైదు  చుక్కలు అంగం మీద వేసి  రుద్దాలి .ఈ విధంగా 40 రోజులు వాడాలి.
 
              వేసవిలోఎండవలన వచ్చే నీరసం--బలహీనత --నివారణ                        16-7-10.
 
      ఆహారంలో పోషకవిలువలు లేకపోవడం వలన, ముఖ్యంగా తెల్ల బియ్యం వలన వస్తుంది.
 
      పాలిష్ తక్కువగా వున్న  పాత బియ్యం వాడాలి.
 
ఉల్లి పాయల రసం   ---  1, 2  టీ స్పూన్లు ( వయసును బట్టి సమస్య యొక్క తీవ్రతను బట్టి)
                  తేనె     ---- ఒకటిన్నర స్పూను నుండి మూడు టీ స్పూన్లు.
 
     రెండింటిని  బాగా రంగరించి నాకాలి. దీని వలన ఎంత నీరసమైనా నివారింప బడుతుంది. ఇది అన్ని వయసుల  వారికి పనికొస్తుంది. మూడు, నాలుగు వారాలు వాడితే చాలు.
 
                        నీరసం, బడలిక యొక్క నివారణకు                                          8-12-10.

    ఉసిరిక కాయలను తేనెలో ఒక నెల వూరబెట్టాలి.  ప్రతి రోజు ఒక ఉసిరిక  కాయను  తేనెతో  కలిపి తీసుకుంటూ  వుంటే బడలిక, నీరసం తగ్గుతాయి.  

                           గృహిణులలో అలసట --- నివారణ                                          21-7-10.

                                            ముస్తా క్షీర పాకం

   నీరసంగా వుంది మాటి మాటికి పడుకోవాలనిపించడం వంటి లక్షణాలు వున్నపుడు;--

   తుంగ ముస్తల పొడి               --- 30 gr
                     పాలు                --- ఒక కప్పు
                     నీళ్ళు               --- నాలుగు కప్పులు

   అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి  పాలు మాత్రం మిగిలేట్లు కాచాలి.  దించి వడకట్టి ఆ పాలలో  చక్కర,  యాలకులు కలుపుకొని తాగాలి. దేనిని రాత్రి పూట తాగాలి..   మరుసటి రోజు చాలా హుషారుగా వుంటుంది.  ఈ క్షీర పాకం ఇన్ఫెక్షన్ ను తగ్గించి ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తుంది.

                   IMMEDIATE   TONICS                              17-12-10.

ఉష్నోదక  స్నానం     అంటే వేడి నీటి స్నానం
సద్యో  మాంసం        అనగా   తాజా మాంసం
నవాన్నం                పొగలు కక్కుతున్న అన్నం
యవ్వన భాగస్వామి  తో సాంగత్యము
క్షీర భోజనం
ఘ్రుతాన్ని  ఉపయోగించడం
 
                        బరువు తక్కువగా వుండడం                     1-1-12011.
 
      బరువు తగ్గడం వ్యాధి కాదు.  ఏవైనా వ్యాధుల వలన తగ్గవచ్చు.
 
కారణాలు   జీర్ణాశయ  వ్యాధుల కారణంగా సరిగా ఆహారం తీసుకోక  పోవడం వలన, థైరాయిడ్,  షుగర్,  క్షయ,కాలేయ,  మూత్ర పిండాల  రోగాలు మొదలైన వ్యాధుల కారణంగా  బరువు తగ్గడం జరుగుతుంది.
 
అశ్వగందాది లేహ్యం
శతావరి లేహ్యం
 
      వీటిలో దేనిని వాడినా  ఆరోగ్యవంతులవుతారు.
 
      జొన్నలతో చేసిన పాయసం,  పదార్ధాలు,  పాలకు సంబంచిన ఆహారం తీసుకుంటే బరువు పెరుగుతారు.
 
ఎండుద్రాక్ష  పొడి                 ---- 100 gr
అతిమధురం పొడి               ----   50 gr
శతావరి వేర్ల పొడి                ----   50 gr
usiri pechhula పొడి          ----   50 gr
పిప్పల్ల పొడి                       ----   25 gr
పటికబెల్లం                        ----  150 gr
నెయ్యి                              ----  100 gr
తేనె                                 ----   200 gr
 
         అన్నింటిని కలిపి భద్రపరచాలి. ప్రతి రోజు ఒక టీ స్పూను పొడిని పాలతో గాని, నీటితో గాని భోజనానికి   ముందు  తీసుకోవాలి.

                                కంప్యూటర్ ఉద్యోగులలో నీరసాన్ని పోగొట్టే ఉత్తేజామృతం                      5-9-11.

        నీరసం , నిస్త్రాణ వున్నపుడు , పనిలో ఉత్సాహం లేనపుడు ఈ ఔషధాన్ని వాడుకోవచ్చు .

అత్తి పండ్లు ( అంజీర )         ---- 6
ఎండు ఖర్జూరం                  ---- 3
బాదం పప్పులు                  ---- 3
యాలకుల గింజలు             ---- 2
నెయ్యి                              ---- ఒక టీ స్పూను
మిగలపండిన అరటిపండు    ---- ఒకటి

      అరటిపండు , నెయ్యి తప్ప మిగిలిన పదార్ధాలను రాత్రి పూట ఒక చిన్న గిన్నెలో లోని నీళ్ళలో నానబెట్టాలి .
ఉదయం అన్నింటిని మిక్సి లో వేసి తిప్పాలి మెత్తగా అయిన తరువాత అరటిపండు , నెయ్యి వేసి తిప్పాలి . దీనిని గిన్నెలోకి  తీసుకోవాలి

     ఈ విధంగా చేసిన పదార్ధాన్ని ప్రతి రోజు ఉదయం పరగడుపున  తినాలి . లేదా పాలు గాని , టీ గాని , కాఫీ గాని
తాగిన తరువాత కూడా పై పదార్ధాన్ని తీసుకోవచ్చు .

 ఉపయోగాలు :--- ఇది ఏకధాటిగా పనిచేసే ఉద్యోగులకు  మంచి శక్తినిస్తుంది . విద్యార్ధులకు మెదడుకు శక్తిని ఇస్తుంది
 
        
 
 
 
                                                  

వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి

                                                  వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి
 
                 తులసి ఆకుల రసం                      -------- 1 కిలో  (కడిగి ,దంచి రసం తీసి వడకట్టాలి )
                 కలకండ                                      -------- 1/4 కిలో
 
     కలకండను నలగగొట్టి  తులసి రసం లో వెయ్యాలి. స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద క్రమంగా మరిగించాలి. పాకం తీగ లాగా రావాలి,ముదరకూడదు.చల్లారిన తరువాత గాజు సీసాలో భద్రపరచాలి.
 
                  పిల్లలకు పావు కప్పు పాకం అర గ్లాసు నీటిలో వేసి కలిపి ఇవ్వాలి/
 
             ఇది పిల్లల యొక్క  వ్యాధి నిరోధక శక్తి ని  పెంచుతుంది

                             వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి --శతావరి లడ్లు                 28-12-08.

                    శతావరి వేర్లను (పిల్లి తేగలు) కడిగి ఆరబెట్టి దంచి పొడి చెయ్యాలి.
 
                                               శతావరి పొడి    ------- 20 gr
                                                 కలకండ పొడి  ------- 20 gr
 
             ఒక పాత్ర లో పాలు పోసి స్టవ్ మీద పెట్టాలి.బాగా మరిగించాలి. నీళ్లన్నీ ఇంకి పోయి కోవాలా తయారవ్వాలి. దీనిలో  శతావరి పొడిని, కలకండ పొడిని వెయ్యాలి.చాలా చిన్న మంట మీద మాడి  పోకుండా కలుపుతూవుండాలి.గట్టిగా తయారైన తరువాత ఒక పళ్ళెం లోకి తీసుకొని 10 గ్రాముల చొప్పున లడ్లు తయారు చేసుకోవాలి.గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరచుకోవాలి.
 
           వివాహం కాబోయే యువతీ యువకులకు ప్రతి రోజు ఉదయం,సాయంత్రం ఒక్కొక్క లడ్డు చొప్పున  6 నెలలు  తినిపించాలి.
వృద్ధులు సేవిస్తే యవ్వన చాయలు కనిపించి అపారమైన శక్తి వస్తుంది.
పిల్లలకు చిన్నప్పటి నుండి తినిపిస్తే ఊపిరితిత్తులలో, గొంతులో, తలలో వ్హేరిన కఫం తొలగించబడుతుంది.పిల్లలకు ధారణ శక్తి  జ్ఞాపకశక్తి పెరుగుతుంది  తేజస్సు, దృఢత్వం పెరుగుతహుంది.
ఈ లడ్లను గర్భవతులైన స్త్రీలు తింటే మంచి, ఆరోగ్యవంతమైన బిడ్డలు పుడతారు.
 
      ఈ లడ్లు తినడం వలన  రక్తం లేని వాళ్లకు రక్త వృద్ధి కలుగుతుంది, కళ్ళసమస్యలు  నివారింప బడతాయి.,
 
ఊబకాయులు సన్నబడతారు 

              వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి --- నారసింహ పానీయం                        9-5-09.

                                    ఉసిరిక పొడి                  ---- పావు టీ స్పూను
                                    తుంగ గడ్డల పొడి          ---- పావు టీ స్పూను
                             దో.వే. ధనియాల పొడి           ---- పావు టీ స్పూను
                                  త్రిఫల చూర్ణం                 ---- పావు టీ స్పూను
                                  నెయ్యి                          ---- ఒకటి లేక రెండు స్పూన్లు
                                 చెరకు రసం                    ---- ఒక గ్లాసు

     పైన చెప్పబడిన చూర్ణాలన్నింటిని చెరకు రసంలో కలుపుకొని తాగాలి.

    ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా తాగితే  వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తం శుద్ధి చేయబడుతుంది.

   చెరకు రసం దొరకక పోతే పాత బెల్లపు నీళ్ళలో కలుపుకొని తాగవచ్చు.

                                                చిట్కా                                                  20-9-10.

         రాత్రి పూట మెంతులను నీటిలో నానబెట్టి ఉదయం వాటిని  నమిలి తిని ఆ నీళ్ళు తాగితే వ్యాధినిరోధక   శక్తి పెరుగుతుంది.

                                                 చిట్కా                                                 15-12-10.

         తులసి గింజల చూర్ణాన్ని తేనెతో గాని,  నేతితోగాని ప్రతి రోజు సేవిస్తూ వుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

                                       వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి  మరియు బలానికి                   27-6-11.

విదారి కంద చూర్ణము                  --- 100 gr
అశ్వగంధ   చూర్ణము                  --- 100 gr
శతావరి      చూర్ణము                ---- 100 gr
మెంతుల చూర్ణము                    ---- 50 gr
కౌంచ  బీజాల చూర్ణము             ----   50 gr
పటికబెల్లం                              ---- 200 gr

       అన్ని చూర్ణాలను  బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి .

       ప్రతి రోజు ఉదయం , సాయంత్రం పూటకు ఒక్కొక్క టీ స్పూను చొప్పున పాలలో కలుపుకొని తాగాలి