ఛాతీ బాగా పుష్టిగా ఉండాలంటే
గోరువెచ్చని పాలు -------- ఒక కప్పు
ఆవు నెయ్యి ------ ఒక స్పూను
గేదె నెయ్యి ------ ఒక స్పూను
నువ్వుల నూనె ------- ఒక స్పూను
అన్నింటిని బాగా కలిపి తాగితే ఛాతీ మరియు శరీరం పుష్టిగా ఉంటాయి. స్థనాలు చిన్నవిగా ఉన్నవాళ్ళు కూడా వాడ వచ్చు.
మగ పిల్లలకు చాతీ పెరుగుతుంటే
ఆవాల నూనె ----- 100 gr
కర్పూరం ----- 10 gr
ఆవాల నూనెను గోరువెచ్చగా వేడిచేసి దానిలో కర్పూరం కలపాలి. స్నానానికి రెండు గంటల ముందు నూనెను చేతిలోకి తీసుకొని రొమ్ముపై clock wise మాత్రమే రుద్దాలి.(తప్పనిసరి)Anti clock wise లో చేస్తే ఆడపిల్లలకు వలె లావుగా పెరుగుతాయి .దీనిలో మిరియాల పొడి,పిప్పళ్ల పొడి కూడా కలుపుకోవచ్చు.
చాతి నొప్పి ---నివారణ 20-12-10.
చాతి నొప్పి గుండె నొప్పి ఒకటి కాదు. అపోహ మాత్రమే. గుండె నొప్పి వున్నపుడు కూడా చాతీనోప్పి రావచ్చు.
కరక్కాయ పెచ్చుల పొడి --- 50 gr
వస పొడి ---- 50 gr
దుంప రాష్ట్రం పొడి ----100 gr
అతి మధురం పొడి ----100 gr
పుష్కరమూలం పొడి -----100 gr
కటుక రోహిణి పొడి ---- 50 gr
పిప్పళ్ళ పొడి ---- 50 gr
శొంటి పొడి ---- 50 gr
కరక్కాయ పెచ్చులను ఆముదంలో వేయించి దంచాలి. వసను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఉదయం ఎండ బోసి బాగా ఎండనిచ్చి దంచాలి. పిప్పళ్ళను నిమ్మ రసం లో నానబెట్టి ఎండబెట్టి దంచాలి. శొంటి ని నేతిలో వేయించి
దంచాలి.
అన్ని పొడులను కలిపి కల్వంలో వేసి తగినంత బెల్లం కలిపి నూరి శనగ గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టాలి.
బాగా ఆరిన తరువాత సీసాలో నిల్వ చేసుకోవాలి. మధుమేహం వున్నవాళ్ళు నీటిని కలిపి నూరాలి.
పూటకు రెండు మాత్రల చొప్పున ఉదయం సాయంత్రం వాడాలి దీని వలన చాతీ నొప్పి సత్వరమే నివారింపబడుతుంది.
ఛాతీలో మంట ---నివారణ 15-6-11.
లక్షణాలు :-- ఈ మంట ఛాతీలో నుండి గొంతులోకి వ్యాపిస్తుంది. పుల్లటి త్రేన్పులు వస్తాయి. గొంతులో ఎదో అడ్డు పడినట్లుగా వుంటుంది.
కారణాలు :-- ముఖ్య కారణం స్థూల కాయం. హెర్నియా, గర్భాదారణ సమయం లో హార్మోన్ల లో
తేడాలు, స్మోకింగ్, నోరు పొడిగా వున్న సమయంలో, ఉబ్బసం, మధుమేహం, ఆమాశాయంలో
ఆహారం ఎక్కువ సేపు నిల్వ వుండడం. రాత్రి ఎక్కువసేపు మేల్కోవడం మొదలైనవి.
1. వేడి నీళ్ళు --- ఒక గ్లాసు
నెయ్యి --- ఒక టీ స్పూను
వేడి నీటిలో నెయ్యి వేసి బాగా కలపాలి. తరువాత ఈ నీటిని అరగంటకు ఒక సారి తాగుతూ వుండాలి.
2. శొంటి --- 30 gr
మిరియాలు --- 30 gr
వేప చెక్క --- 30 gr
అన్నింటిని విడివిడిగా చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
అర గ్రాము పొడిని నీటితో సేవించాలి.
3. ఉసిరి పెచ్చుల చూర్ణం --- అర టీ స్పూను
పాలు --- అర కప్పు
రెండింటిని కలిపి తాగాలి.
సూచనలు :-- ఎత్తుకు తగిన బరువు వుండాలి. బిగుతుగా వున్న దుస్తులను ధరించరాదు.
భోంచేసిన తరువాత వెంటనే నిద్రించాకూడదు. తలగడ భాగం ఎత్తుగా వుండాలి. ధూమపానం
మద్యపానం ఎంత మాత్రం మంచిది కాదు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి