బుగ్గలు

                        బుగ్గలు లోతుగా పోయిన వాళ్లకు  -- సమస్య --నివారణ          26-12-08.
           వేళకు సరిగా ఆహారం తినక పోవడం వలన ఈ సమస్య వస్తుంది.
 వ్యాయామం :-- బుగ్గలనునిండుగా పూరించి గాలి వదలడం అతి ప్రధానమైనది. ఉదయం, సాయంత్రం స్నానానికి ముందు 10,15 సార్లు  ఈ విధంగా చెయ్యాలి.
                                                             అశ్వగంధ తైలం
                  ఇది శరీర భాగాలను బలోపేతం చేస్తుంది.
                              అశ్వగంధ దుంపలు ------250 gr
                              ఆవు పాలు             ----- 250 ml
                              నువ్వుల నూనె       ----- 250  ml
     అశ్వగంధ దుంపలను తెచ్చి ముక్కలుగా చేసి నానబెట్టి,మెత్తగా,గుజ్జుగా నూరి, ఆవుపాలు,  నువ్వుల నూనె పోసి కలిపితే చిక్కటి ద్రవం అవుతుంది.దీనిని స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద వేడి చేస్తే పాలు యిగిరి పోయి నువ్వుల నూనె పైకి తేలుతుంది. చాలా నెమ్మదిగా అడుగంటకుండా కాచాలి.బుడగలు వచ్చి ఆగి పోవాలి.
   వేరే పాత్రలోకి గుడ్డతో వడకట్టి సీసాలో భద్రపరచుకోవాలి.రాత్రి నిద్రించే ముందు రెండు చుక్కల నూనెను బుగ్గల మీద మర్దన చెయ్యాల్లి.ఉదయం ముఖం కడుక్కోవాలి.

                                                 దవడల లోపల  పుండ్లు                                    13-9-11.
    కాచు ముక్కను ( చండ్ర చెట్టు ) తెచ్చి అర చేతిలో పెట్టుకోవాలి . దానికి కొన్ని చుక్కల  రంగరించాలి . ఈ గంధాన్ని
బుగ్గ లోపలి పుండ్లకు పూయాలి . కొంతసేపటికి వాటి నుండి నీరు కారుతుంది . దానిని వుమ్మేయ్యాలి . ఇది వగరుగా
ఉంటుంది . చేదుగా ఉండదు .

సూచన :--- వేడి చేసే పదార్ధాలను వాడకూడదు .



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి