అపస్మారకం --స్పృహ తప్పడం





                                        అపస్మారకం --స్పృహ తప్పడం                      17-12-08.


యోగాసనం:-- పద్మాసనం వేసుకొని, నిటారుగా కూర్చొని, చిన్ముద్ర వేసి దీర్ఘంగా శ్వాస పీల్చి వదలాలి.తరువాత వేగంగా గాలి పీలుస్తూ వదలాలి. విధంగా కొంచం సేపు అయిన తరువాత నాభితో గాలి పీల్చుకొని నోటితో గాలి వదలాలి.

స్పృహ తప్పే వ్యాధి వున్న వాళ్ళను బోర్లా పడుకోబెట్టి ఒక నూలు బట్టను నిలువుగా నాలుగు మడతలు వేసి, గోరువెచ్చని నీటిలో తడిపి, పిండి వెన్నెముక పైనుండి కింద వరకు పొడవుగా వేసి అద్దాలి.

ఆవునెయ్యి                  ------- 50 gr
ఆవు మూత్రం             ------- 200 gr (7 సార్లు వడకట్టాలి)
ఇంగువ పొడి                ------- 15 gr (పొంగించినది)
సైంధవ లవణం              ------ 15 gr

      అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలే వారు కాచాలి.

ఉదయం, సాయంత్రం ఒక్కొక్క స్పూన్ చొప్పున కడుపులోకి తీసుకుంటూ వుంటే అపస్మారక సమస్య  నివారింప బడుతుంది.


                                    స్పృహ తప్పడం -- నివారణ                           26-1-11.

        కొన్ని వ్యాధుల కారణంగా కూడా స్పృహ తప్పడం జరుగుతుంటుంది.

కారణాలు :-- అధిక రక్తపోటు, అల్పరక్తపోటు, నిద్రలేమి, రక్తహీనత, ఆకలి ఎక్కువగా వున్నా కూడా ఆహారం తీసుకోకపోవడం, దాహం ఎక్కువగా వున్నా నీళ్ళు తాగాక పోవడం ఆనందం, దుఖం ఎక్కువగా వున్నపుడు, స్పృహ తప్పడం జరుగుతూ వుంటుంది.

దాహం కారణంగా స్పృహ తప్పితే  స్పృహలో కి  వచ్చిన   తరువాత మాత్రమే నీళ్ళు తాగించాలి.

సాధారణ సమస్య అయితే :--

1. వెల్లుల్లి పాయలను బాగా నలిపి వాసన చూపించాలి.

2. వసకొమ్ము పొడిని వాసన చూపించాలి.

3. అర కప్పు శతావరి వేర్ల రసాన్ని ఒక గ్లాసు పాలలో కలుపుకుని , చక్కర కలుపుకుని
తాగాలి లేదా అర టీ స్పూను శతావరి వేర్ల పొడిని అరకప్పు పాలలో కలిపి చక్కర కలిపి తాగాలి.

4. వెల్లుల్లి తైలాన్ని పూయాలి, వెల్లుల్లిని నూరి ముద్దను మింగించాలి.

5. అర టీ స్పూను సరస్వతి ఆకు చూర్నానికి తగినంత తేనె కలిపి నాకించాలి.

  ఈ సమస్య వున్నవాళ్ళు ఒంటరిగా వుండకూడదు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
































































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి