తల్లి పాల దోషం

                                    స్తన్య దృష్టి -- తల్లి పాల దోషం --నివారణ                                15-9-10

       పాల యొక్క రంగు, రుచి, స్పర్శ, వాసన పరీక్ష చెయ్యాలి.

        పాలను నీటిలో వేసినపుడు పూర్తిగానీటిలో కలిసి పోతే మంచిది.  శంఖం లాంటి తెలుపు   వుంటే   మంచిది
       తీగలు పాకుతూ, నీటిలో   పాలల్లో పూర్తిగా కలవకుండా, దుర్వాసన వంటి లక్షణాలువుంటే
మంచిది  కాదు.

        కఫలక్షణాలు వున్నపుడు  పాలల్లో జిడ్డుతనం, పాలు అడుగుకి చేరడం,పాలు తీగలుగా సాగడం,  నూనె         వాసనలు వుంటాయి.  పాలలో అధికమైన తీపి వుంటుంది.
పాలలో కొవ్వు, నూనె, నెయ్యి వాసనలు వుంటాయి. అధికమైన తీపి వుంటుంది.

       పై విధంగా వుంటే పిల్లలు ఎపుడు మత్తుగా, నిద్రపోతూ వుండడం, వాళ్లకి కూడా శ్వాస కోశ,
 మలబద్ధకసమస్యలు రావడం, చర్మం ఎక్కువ నునుపుగా, మెత్తగా వుండడం, వ్యాధి నిరోధక శక్తి
- తక్కువగా  వుండడం జరుగుతుంది.  పాలు పుష్టిగా వుండవు.

దీని నివారణకు తల్లి తీసుకోవలసిన ఔషధం :--
                        
అతిమధురం                  --- అర టీ స్పూను
సైంధవ లవణం              ---  అర టీ స్పూను
ఆవు నెయ్యి                  ---  ఒక టీ స్పూను

     అన్నింటిని కలిపి తీసుకోవాలి. ఈ విధంగా పాలల్లో మార్పు వచ్చే వరకు సేవించాలి.

బిడ్డకు ఇవ్వవలసిన ఔషధం :--

పిప్పళ్ళ పొడి          -- చిటికెడు
సైంధవ లవణం       ---    "
   రెండింటిని కలిపి నాకించాలి.

                      పిత్త, దుష్ట  స్తన్య దోషం -- చికిత్శ                                                      15-9-10.

      పాలిచ్చే తల్లులు ఘాటుగా వున్న ఆహార పదార్ధాలు భుజించరాదు. మసాలాలు, పచ్చళ్ళు వాడకూడదు.

వేడి ఎక్కువ ఉన్నప్రదేశాలలో  తిరగకూడదు. ఎక్కువగా ఎండబెట్టిన ( వడియాలు, అప్పడాలు) తినకూడదు

      తల్లి పాలు స్వచ్చంగా వాసన లేకుండా, తీగలు లేకుండా వుండాలి.

       పిత్త (వేడి) దోషాల వలన పాలు  పసుపు రంగుకు మారతాయి.
 
      ఈపాలను నీటిలో వేస్తే రేకులు రేకులుగా విడిపోవడం  జరుగుతుంది. 
పాలు వేడిగా వుంటాయి. రాగి రంగులో వుంటాయి.

      ఈ  లక్షణాలు కలిగిన పాలు తాగితే  ఆ పిల్లల శరీరం కూడా వేడిగా వుంటుంది. నోటిలో,
 మూత్రమార్గంలోగుదమార్గంలో పుండ్లు ఏర్పడతాయి. మూత్రము వేడిగా వుంటుంది.

త్రిఫలాలు
తుంగ ముస్థలు
కటుక రోహిణి
నేలవేము
నీళ్ళు

     అన్నింటిని దంచి నీటిలో వేసి కషాయం కాచి కలకండ కలుపుకొని తల్లి తాగాలి.

                     తల్లి పాలు శ్రేష్టంగా ఉండాలంటే                                                  25-10-10.

      తల్లి తాను తాగే పాలల్లో చిటికెడు కటుకరోహిణి  పొడిని కలుపుకొని తాగితే తల్లి నుండి వచ్చే బిడ్డ పాలు ఆరోగ్య కరంగా వుంటాయి.

                    బిడ్డకు తల్లి పాలు మాన్పించడానికి                                             28-12-10.
      ముసాంబరాన్ని  చాది   చను మొనల చుట్టూ పూస్తే  దాని చెడుకు మానేస్తారు. 
                                                      





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి